చమ్కీ పూల కథ

 

-పి. విక్టర్ విజయ్ కుమార్

~

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక  సమావేశానికి హాజరై, ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ జరిగిన  delibartions    గురించి ఆలోచిస్తూ వస్తున్నా. ఎంతో మంది రచయిత్రులు అక్కడ వేదిక మీద ప్రసంగించారు. ఆలోచిస్తున్నా – ప్రతి ఒక్కరిలోను ఏదో తెలీని ఆవేశం ! ఆవేదన ! ‘ ఎన్నో సంవత్సరాల నుండి వీళ్ళందరూ ఇన్ని  రచనలు చేస్తున్నారు. వీళ్ళ కథల్లో ఎన్ని ముస్లిం పాత్రలు, ఎన్ని క్రిస్టియన్ పాత్రలున్నాయి ?  వీళ్ళందరూ సృష్టించిన పాత్రల సంఖ్య లో, మత సహనం అనే ప్రత్యేక ఇతివృత్తం తో రాయకపోయినా, కనీసం పదహైదు  శాతం అన్నా మైనారిటీ లకు సంబంధించిన పాత్రలుంటే , అది  secular world of progressive writers    అయినట్టే కదా ? ముస్లిములు ఘాతుకంగా చంపబడిన 2002 సంవత్సరం తర్వాతైనా లేదా 2013 ముజఫర్ నగర్ ఊచకోత జరిగిన తర్వాతైనా సరే – మన తెలుగు రచనల్లో – ఎన్ని ముస్లిం పాత్రలొచ్చాయి ? ఎన్ని సన్నివేశాల్లో ముస్లిములు కనిపిస్తారు ? 2000 మొదట్నుండీ సామాజిక చిత్ర పటం లో ఇన్ని మార్పులు జరుగుతుంటే, గమనించని రచయితలు, రచయిత్రులు – చేస్తున్న ఈ ఆక్రందనల్లో శూన్యత లేదా ? ‘ ఆలోచనల స్రవంతి తెగదు ఇలా ఆలోచిస్తూ పోతే. నాకు ఎవరినీ నిందించాలనో, ఎవరి మీదో ఒక అసహనం ప్రదర్శించాలనో లేదు  గాని – కథ రాసి ఇంటికొచ్చి పిల్లలకు హోం వర్క్ చేయిస్తూ , మన పిల్లోడు కూడా మిగతా పిల్లల మాదిరిగానో, అంత కంటే ఎక్కువ గానో చదవాలి అనే ప్రెషర్ ను మనం తీసుకోవడమో, పిల్లల మీదకు రుద్దడమో ఎలా చేస్తామో – సింపుల్  గా చెప్పాలంటే అదే రకమైన ప్రెషర్ ఇది !!

మొహరం నెల. సూఫీ తత్వ వాదులు పవిత్రంగా పరిగణించే  రోజులు ఇవి.   మన దేశం లో సంస్కృతి ‘ భారత దేశ సంస్కృతి ‘ అని మత ఛాందస వాదులు, ఒక   hypothetical culture   ను జాతీయ వాదం లో భాగంగా ముందుకు తీసుకువచ్చి, ఇక ఏ ఇతర సంస్కృతి అయినా    subservient   అని గర్భితంగా ప్రజల సంస్కృతిని ప్రభావితం చేయదల్చుకుంటున్నప్పుడు –   composite culture  మానవ సంబంధాల్లో ఎలాంటి ఆర్ధ్రత నింపుతుందో తెలియ జేయడానికి , నాకు తెలిసి ఈ మధ్య కాలం లో జరగని ఒక ప్రయత్నం ఒక ముస్లిం చేసాడు. తన అస్తిత్వాన్ని, తను కోరుకునే సామాజిక సఖ్యతకు చమ్కీలద్ది మనకు ‘ చమ్కీ పూల గుర్రం’ ను అందించాడు.       అఫ్సర్ రాసిన ‘ చమ్కీ పూల గుర్రం ‘ మత తత్వానికి వ్యతిరేకంగా నినదించే సమయం లో – వచ్చిన   most well timed story .

కథ ఇతివృత్తం చూస్తే – ఇద్దరు చిన్న పిల్లల స్నేహానికి మత విశ్వాసాలు, పర మత విశ్వాస అసహనం ఎలా దీనావస్థను కలుగ జేస్తుందో తెలియ జేసే కథనం ఇది. మున్నీ పీర్ల ఆరాధన సంస్కృతికి   symbolic  గా ఉన్న చమ్కీ పూల గుఱ్ఱాన్ని బహుమతిగా ఆపూ కు ఇవ్వడం, ఆపూ –  మున్నీ స్నేహం లో ఉన్న అందాన్ని చమ్కీల  అందం లో చూసి ఆనందపడ్డం, హిందూ మత విశ్వాస విషం లో మునిగిన తండ్రి ఆపూ ను కొట్టి కలవకుండా ఇంట్లోనే ఉండమని హుకుం వేయడం, ఆపూకు విన్న పీర్ల కథలు నెమరేసుకోవడం,  ఆపూ తల్లి ఆపూ లొ ఉన్న విషాద అనుభూతిని చూసి నిస్సహాయంగా బాధ పడ్డం, ఆపూ మున్నీ స్నేహాన్ని కలవరిస్తూ చమ్కీ పూల గుఱ్ఱాన్ని  కలలో కలవరింపుల్లో దగ్గరగా హత్తుకుంటూ నిద్రలో ఒద్దిగలడంతో ఆర్ధ్రంగా ముగుస్తుంది కథ.

మొదటగా  కథా ఇతివృత్తం చూస్తే ప్రధానంగా గోచరించేది  “ culture of love and culture of acceptance “ .  మనమిప్పుడు చూస్తున్నది   “ Politics of hate “ ఇదే “ culture of hatred  “ ను పోషిస్తుంది . దీనికి కౌంటర్ గా  మనం ప్రజలకు రుచి చూపించాల్సింది  “ culture of love and affection “ . ప్రేమించే సంస్కృతి – పర విశ్వాస సహనం తొ ఒక స్థాయి వరకు కలిసి ఎదిగినా అల్టిమేట్ గా  ‘ సమ్మతి ‘ అన్నది ‘ సహనం ‘ కన్నా గొప్ప భావన. ఆ సమ్మతితోనే – ప్రేమలో ఒక ఆర్ధ్రత వస్తుంది. ప్రేమ ప్రజాస్వామికంగా ఉండడం వేరు. ప్రేమ ఆర్ధ్రంగా ఉండదం వేరు. మన దేశం లో సెక్యులరిజం ‘ పరమత సహనం ‘ దగ్గరే ఆగిపోయింది. ఈ కథ ఒకడుగు ముందుకేసి ‘ సహనం ‘ ను ‘ సమ్మతి ‘ అనే ఉన్నత స్థాయి దగ్గరకు తీసుకెళ్ళి , మనుష్యుల మధ్య ఉన్న అనుబంధాల్లో  essence  ను మనకు రుచి చూపిస్తుంది.

కథ చెప్పడం లో ఎన్నుకున్న పద్ధతి

పర విశ్వాస సమ్మతికి ప్రధాన అడ్డు గోడ   judgemental analysis of beliefs   .  రాన్ వైల్డ్ అనే ఒక ప్రఖ్యాత ప్రఖ్యాత కళాకారుడి  మాటలు గుర్తొస్తాయి  ”  Seek the wisdom of the ages, but , look at the world through the eyes of a child ”   . ప్రతి మతం గురించి , ప్రతి విశ్వాసం గురించి   dispassionate   గా తెలుసుకోవడం మేధావులుగా ఒక ఎత్తైతే , చిన్న పిల్లల దృష్టిలో చూస్తే మన ప్రపంచాన్ని మనమే ఎంత జఠిలం చేసుకున్నామో అర్థమౌతుంది.  ఇదే మాట ఆపూ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది ” అది చిన్న పిల్ల. దానికి ఈ వయసులో ఏం తెలుస్తుంది ? ఆ దేవుడి బొమ్మ కూడా ఆట బొమ్మ తప్ప ఇంకేమీ కాదు దానికి. కాసేపు ఆడుకుంటుంది. అంతే ! పిల్లల ఆటలో దేవుళ్ళ గొడవ తెచ్చి పెడితే ఎట్ల ? అక్కడ దానికి భక్తి గురించి , దానికి ఇంకా అర్థం కాని ధర్మం గురించి చెప్తే ఎట్ల ? ” నిజమే కదా ?! మనిషికి మత విశ్వాసాలెందుకు ? తన మీద తనకు భరోసా కలిపించడానికి. దాన్ని ధర్మం పేరుతో ఎంత  complicate  చేసుకున్నాం మనమందరం ? దీనికో తత్వాన్ని అద్ది ఛాందస వాదులు ప్రజా జీవితాన్ని ఎంత దుర్భరం చేసారు ? ఆపూ తన కలలో పీర్ల సాయిబు , పీరు బరువు ఎత్తడానికి ఇబ్బంది పడ్డప్పుడు ‘ జై ఆంజనేయ ‘ అంటుంది. దీన్ని ‘ మన ధర్మం గంగ నీరు, పర ధర్మం ఎండ మావి ‘ లాంటి అసంబద్ధ మైన సిద్ధాంతాలు చెప్పి కల్మషం చేయాలని చూస్తుంది ఒక కేరక్టర్ ఇందులో.

కథ మొత్తం చాలా నిర్దుష్టంగా,  situation specific   గా నడుస్తుంది. మన సెక్యులర్ సాహిత్యం  బ్రాహ్మినిజం తో కాంప్రమైజ్ అయ్యి వచ్చిన అర కొరా సాహిత్యం కూడా   abstractise   అయ్యింది.   Abstractisation is actually the biggest threat to secular writing, which actually needs a specific exemplification, reasoned out writing and usage of empathised forms    అబ్స్ట్రాక్టైజ్ చేయడం వలన, సెక్యులరిజం   గురించి     general sense   లో మాట్లాడి బ్రాహ్మినిజం ను వెనక్కు తోసేస్తుంది. దీనితో పాటు, సమస్యల తీవ్రత తగ్గించి కొంత గందరగోళానికి గురి చేసే ప్రమాదానికి కూడా ఇది తోడ్పడుతుంది. మానవులందరూ సమానులే అని కథ రాస్తే, సెక్యులర్ రచన అయిపోదు. విశ్వాసాల మధ్య ఘర్షణ, మెజారిటి వాదం యొక్క నిరంకుశత్వం గురించి నిర్దుష్టంగా మాట్లాడాకపోతే కథ, కవిత, ఇంకేదైనా సెక్యులర్ రచన కానేరదు. కవితాత్మకంగా చెప్పాలని , ఏవో   abstract expressions  ను మధ్యలో దూర్చడం సెక్యులర్ దృక్పథాన్ని తీవ్రంగా  dilute  చేస్తుంది.  ఈ విషయం మన కథకుడికి బాగా అవగాహన కావడం వలననే ఈ కథ అందంగా రాగలిగింది.

చిన్న పిల్ల ద్వారా మత విశ్వాసాలను వివరించడం ఈ కథ లో ఉన్న గొప్ప ఎత్తుగడ.  మనలో ఈ  complexity   కి దూరంగా బతకాలనుకునే ఒక నిర్మల తత్వం చిన్న పిల్లల హృదయం నుండి వివరించడం వలన మనం కోల్పోయిన దేమిటొ తెలియడానికి – ‘ ఆర్ధ్రత ‘ ఒక ఫాం గా నిలబడగలిగింది ఈ కథలో.   ఆపూ బాధ ఈ కథలో ఉన్న ప్రతి స్త్రీ కేరక్టర్  empathise  చేస్తుంది.  పురుష పాత్రలన్నీ వ్యతిరేకమే ! ఎందుకంటే ఇది ఉత్తి పురుష్స్వామ్యం కాదు – బ్రాహ్మణీక పురుష స్వామ్యం కూడా !

ఇంకా చిన్న చిన్న వివరణలు ( నేను వీటిని కథలో ఎత్తుగడలే అనే అనుకుంటున్నా ) –  మున్నీ , ఆపూ తో మాట్లాడక ఐదు రోజులయ్యింది అని ఉంటుంది . మూడు రోజులు ఎందుకు కారాదు ? ఏడు రోజులు ఎందుకు కారాదు ? మనలో కొన్ని  schemas  ఉంటాయి. ఏది దూరం, ఏది దగ్గిర అనడానికి కొన్ని  schematic feelings   ఉంటాయి. ఇది చాలా చిన్న విషయమే కాని, పాఠకుడికి తెలీకుండా పాఠకుడి మనస్సు మీద కొని   schemas  ను తట్టి లేపుతుంది.  ఫాతమ్మ చేసిన పాల కోవా అంటే ఆపూ కు ఇష్టం. అది మున్నీ ఒక్కతే తింటుందా ? తాను కలిసినప్పుడు ఇస్తుందా – అని ఆపూ ఆలోచిస్తుంది. ఇదొక  affectionate jealousy  కి సంబంధించిన   schema . ఇలా ఇంకా ఎన్నో   schemas   ను , తను చెప్పదల్చుకున్న మెసేజ్ కు అనుకూలంగా వాడుకుంటూ వస్తాడు. పాఠకులకు   cognitive complexities  ఉంటాయి. అందుకు   narrative   గా చెప్పడం ఒక పద్ధతి, సిచ్యుయేషన్ మీదా వ్యాఖ్యానిస్తూ   చెప్పడం ఒక పద్ధతి, వాదన చేస్తూ వివరించడం ఒక పద్ధతి. ఆర్ధ్రత,    empathy  ని వివరించాలంటే కథకుడు   schemas   ను తీసుకుని వాటి ద్వారానే, పాఠకున్ని కన్విన్స్ చేయాలనే పద్ధతి ఎన్నుకున్నాడు. అది సరి అయినదే అని కథ చదివాక ప్రతి ఒక్కరు అర్థం చేసుకోక తప్పదు.  అసలు ‘ చమ్కీ ‘ అన్నదే గొప్ప  schema . అది ఆనందాన్ని, అమాయకత్వాని   symbolise   చేస్తుంది.

మన దేశం లో దర్గాలు , పీర్ల సాయిబులు – అతి శూద్ర హిందువులలో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ఇది హైందవత్వం , వీళ్ళ జీవితాల్లోకి తగినంత  చొచ్చుకుపోక పోవడం వలన కలిగిన ఒక    modification of belief  . దర్గాలలో దేవుళ్ళు ఉండరు. ఆరాధ్యనీయమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల ( ఆ వ్యక్తిత్వం మత తత్వమైనా సరే – అది వేరే విషయం )  సమాధులుంటాయి. పీర్ల చావిడిలో ఆర్భాటాలు ఉండవు. సింప్లిసిటీ ఉంటుంది. అక్కడ  Priests  కు తెచ్చిపెట్టుకున్న గొప్ప తనం ఉండదు. ఏ గొప్ప దర్గా సందర్శించినా   composite culture   మాత్రమే కనిపిస్తుంది. ఎవరన్నా సమానులే అక్కడ. ఎవరికీ స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండదు.

ఈ కథను  నాస్తికులు, గానీ    conservative marxists   గానీ దేవుడికి సంబంధించిన విశ్వాసాన్ని ఇంకోలా  glorify   చేసారు అనొచ్చు. మన దేశం లో హిందూ మెజారిటీ వాదాన్ని ఎదుర్కోవాలంటే – మనం అర్థం చేసుకోవాల్సింది , బ్రాహ్మినిజం సృష్టించిన ప్రతి  sentiment  కు మనం   counter-sentiment   ను సృష్టించాలి.  అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించాడంటే – అసలు మతం లేకపోతే మనిషి మనుగడే లేదు అనే నమ్మకం తో కాదు. దేవుడు – సమూలంగా మన జీవితాల్లో నుండి వెళ్ళిపోవాలంటే ఇంకో 500 సంవత్స్రాల పైనే పట్టొచ్చు. అంత వరకు ప్రజలకు  alternate  ఏం చూపించాలి ?  alternate belief system  డెవలప్ చేయకుండా , మనుష్యులను మనం కూడా గట్టుకోలేము. అలా కాక, ‘ అసలు ఏ దేవుడి గురించీ రాయొద్దు, దేవుడే లేదు అందుకోసం ఎవరూ కొట్టుకోవద్దు ‘  అని రాయండి అనడం  dogmatic argument  తప్ప ఏమీ కాదు.

ప్రతి ప్రజాస్వామిక రచయిత, రచయిత్రి – ఇలాంటి కథ ఏదో ఒకటి, ఇలాంటి పాత్రలతో ఏదో ఒకటి రాయండి చాలు. ఆంధ్ర జ్యోతి వేసుకోకపోవచ్చు, ఆంధ్ర భూమి వేసుకోకపోవచ్చు. నష్టం లేదు. ప్రగతి వాదం ఎప్పుడూ మైనారిటీ వాదమే. అదో దీర్ఘ కాలిక తిరుగుబాటులో భాగంగానే ఉంటుంది. అందుకు రచయిత/త్రి గా ఓపిక కావాలి.  అసలు ఇలాంటి కథ ఒకటి రాసి ఎవరూ  వేసుకోకపోతే, మీ దగ్గరే పెట్టుకోండి. మీ ఫేస్ బుక్ వాల్ మీద పెట్టుకోండి. ఎందుకంటే – మీరు రాస్తున్న దృక్పథం మహోన్నతమైంది కాబట్టి. అది ఏదోలా ఎక్కడో చోట వినబడాలి కాబట్టి.

నాకు మాత్రం ఈ కథ చదివినప్పుడు – కలిగిన ఫస్ట్ హేండ్ ఫీలింగ్ – ఈ కథ ఒక ముస్లిం మాత్రమే రాయగలడు. అది అఫ్సర్ కావడం  incidental  !!  ఆయనకు ఈ సాహితీ కళ ఉండడం సామాజికంగా యాదృచ్చికం.  ఇది ఆయన అస్తిత్వ ఫలం!

*

 

 

 

మీ మాటలు

  1. johnson choragudi says:

    1. కధ పేరు ‘చెమ్కి పూల గుర్రం’
    2. కధ కు కేంద్రం అదే
    3. ఒక ఫిజికల్ సింబల్ ను, ఒక భావన చెప్పడానికి వాడుకోవడం సాంకేతికంగా రచయితకు అదనపు వెసులుబాటు.
    4.ఎటూ ‘ఎరినా’ లోకి దిగాలనుకున్నపుడు, నేరుగా పోరాటమే (అడ్రెస్ చేయడమే ) సరిఅయిన పద్దతి.
    5.కాని మసీదు కాకుండా, దర్గా ను రెండవ పక్కన పెట్టి – మరో వెసులుబాటు రచియిత తీసుకున్నారు.
    6. అలా ఒక ‘కంఫర్ట్ జోన్’ ను ముందుగానే ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగారు.
    7. పిల్లలు ప్రధాన పాత్రలు కావడం మరో – ‘సేఫ్టీ నెట్’
    8. ఇలా శిరసు నుంచి పాదాలు వరకు మొత్తం ‘షీల్డ్’ చేసుకుని, చేసిన పొరాటమిది
    9. అలాగని అవతల వున్నది సమాన ప్రత్యర్దా అంటే, కాదు. రెండు చోట్లా ఆరాధన విధానం లో పెద్దగా కాంట్రాస్ట్ లేదు.
    10. రచయిత కధకు ఎంచుకున్న కధావరణం ఆద్యంతం ఒక పువ్వుల తోట లా వుంచి, హీట్ ను రికార్డ్ చేయాల్సిన రిస్క్ ను తగ్గించుకున్నారు.
    11. అది ఏకధ అయినా – చెప్పిన కధ – చెప్పని కధ రెండూ వుంటాయి. రాసేవాళ్ళకు తెలిసినట్టే – చదివేవాళ్ళకు అది తెలుస్తుంది.
    12. ఆ రెండు చోట్ల ఇంత లివరేజ్ తీసుకుని కూడా, మళ్ళీ ఒక సాహసం చేసిన (రాసిన కాలాన్ని బట్టి) క్రెడిట్ రచయితకు రావడం అంటే; అది ఆయన అదృష్టం. మనల్ని మనం చాల అల్ప సంతోషులం అనుకోవలసి వుంటుంది.
    13. కదన సైలి లో ఆద్యంతం లాలిత్యం వుండటం ఈ కధ ప్రత్యేకత.

    • p v vijay kumar says:

      Honestly, jhonson garu…i cudnt understand the complete essence of ur comment.ఏది ఏమైనా ఒకటి చెప్పగలను. ఈ కథలో ముస్లిం పరిమళం గుప్పు మంది. ఈ కాలానికది కావాలి. అది అఫ్సర్ రాస్తాడా ఇంకో అహమ్మద్ రాస్తాడా అన్నది incidental. కాని అది ముస్లిం మాత్రమె రాయగలడు.

      • Aranya Krishna says:

        పరిమళాల్లో ముస్లీమ్ పరిమళాలు, క్రైస్తవ పరిమళాలు, హైందవ పరిమళాలు వుంటాయా విజయ్ కుమార్ గారూ? ఏ కాలానికి ఏ పరిమళాలు కావాలో ఎలా తెలుస్తుంది సర్? ఆ పరిమళాలు వున్నాయనుకుంటే వాటి మధ్య పోటీ మొదలౌతుంది. మా పరిమళం గొప్పదంటే మా పరిమళం గొప్పదని! అఫ్సర్ ఆ కథలో ఎక్కడా ఏ మతం గొప్పదో, ఏ మతం పరిమళభరితమైన్దో చెప్పలేదు. జానపద వాసనలు హిందువుల పండగల్లో కూడా వుంటాయి. అంతమాత్రాన అది హిందూ పరిమళం అయిపోదు కదా!

      • p v vijay kumar says:

        What kind of intolerance we are talking about, in Sanghis ? : :) :) ….A clear mark of intolerance is here in machanical marxism ముస్లిం పరిమళం అన్న మాట దిగమింగుకోలేని ఒక అసహనం. దీనికి ఎకసెక్కెంగా – హిందూ పరిమళం, క్రైస్తవ పరిమళం అంటూ పరాచికాలాడ్డం.

        ఎంత గొప్ప సామాజిక దృక్పథం తో కథలు రాసినా – ultimately రాజేష్, రాజు, రామారావు, చిరంజీవి జీవితాల్లో ఎటువంటి ట్విస్ట్స్ వచ్చాయి అనే కథలే చదవాలా ? ఆపూ, ఫాథిమా, డేవిడ్, జేంస్ పేర్లతో ఉన్న పాత్రలుండవా ? వాటికి జీవితముండదా ? ” అంటరాని వసనతం ” లో మీకే పరిమళం తాకిందో నాకు తెలీదు కాని ..అది గుబాళించే దళిత క్రిస్టియన్ పరిమళం. ఆ పరిమళం రావాలంటే ఆ కేరక్టర్లుండాలి. ఆ కేరక్టర్లుండాలంటే ఆ సంస్కృతి తెలియాలి. దానికో అధ్యయనం కావాలి. దానికో మమేకమైన స్వీయానుభూతి కావాలి. వచ్చిన చిక్కంతా అదే ! మన మార్క్సిస్టులు ప్రజలతో మమేకం కావాలి అంటారు కాని, ముస్లిములతో మమేకం కావడం ఆంటే ఎలా ఉంటుంది అని అడిగితే – ఇలా ఎక సెక్కంగా ప్రవర్తించి వాళ్ళకో వైవిధ్యమైన పరిమళం ఉంటుందని గుర్తించి మనసును నొప్పించుకోరు. వైవిధ్య మతాలు, కులాలు, సంస్కృతులున్న దేశం లో – ప్రజలతో మమేకం అవ్వడం ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటే – ముస్లిం పరిమళం, క్రిస్టియన్ పరిమళం అర్థమౌతుంది. అది నిజానికి explain చేసి పరిమళాన్ని ముక్కులోకి ఎక్కించలేము. అస్వాదించగలిగే హృదయముండాలి.

        ‘ అస్సలాం వా లేకుం ‘ అని గ్రీట్ చేయకుండా ముస్లిం మైనారిటీలను కూడ గట్టాలని చూస్తే , ముస్లిములు మార్క్సిస్టులకు ‘ సారీ మియా ‘ అని చెప్పి MIM వేపే వెల్తారు. అసలు religious minorities ఈ దేశం లో ఇంత దారుణమైన పరిస్థితిని చూస్తున్నారు. వాళ్ళ గురించి వచ్చే కథలు religion అని వదిలేసి minorities అని మాత్రమే ఎవరన్నా రాయగలిగితే , లేదా రాస్తే మా మైసూర్ పాక్ లో మైసూర్ ఉంది అని చెప్పుకున్నట్టు ఉంటుంది.

        ” చంకీ పూల కథ ” abstractised story కాదిది. మానవులందరూ సమానులే అని చెప్పేసి చేతులు దులుపుకునే స్టొరీ కాదిది. మెజారిటీ మతం , తనకుండే మెజారిటీ అనే గర్వం తో ఒక మైనారిటీ విశ్వాసాన్ని ఎలా కించపరుస్తుందో తెలియజేసే కథ ఇది. ” చంకీ పూల గుర్రం ” సూఫీయిజాన్న్ని తెలియ జేసే schema . Alternate faith culture గా ఉండే పీర్ల సంస్కృతిని ప్రతిబింబించె కథ ఇది. పీర్లను elevate చేయడం అంటే మత తత్వమే కదా అని అడగడం అమాయకత్వం. బతుకమ్మ పండగను జరుపుకునే మార్క్సిస్టులు, దాని గొప్ప దనాన్ని నెత్తికెక్కించుకునే సానుభూతి పరులు – ప్రత్యమ్నాయ విశ్వాస సంస్కృతి ని మీకు బాగా వివరించవచ్చు.

        మీకో అంబేద్కర్ కొటేషన్ చెప్తా ఇక్కడ –

        ” Whatever opinion anybody may have about Hindu social reformers, I personally feel nausea when I think about them. I have much experience of them, and I feel disgusted when I see these half – witted people ”

        ఇదే భయం దళితులకు ముస్లిం లకు కూడా. అగ్రవర్ణాలు వీళ్ళ గురించి పుంఖానుపుంఖాలు రాసేసి, తమ magnanimity గురించి advertise చేసుకున్నాక , వెనకాలే వచ్చిన దళిత, ముస్లిం రచయితలు వీళ్ళ conscience కు appeal చేసుకుని వాళ్ళ సాహిత్యాన్ని establish చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని.

        ఇలాంటి ఎకసెక్కెం తో ప్రతిస్పందించే వాళ్ళను చూస్తే Marxism, in the context of India, seems to be inherently intolerant towards muslims for its obvious nature of Brahminism అన్నది బల పడుతుంది.

        ++++++++++++++++++

        OK ! ఇక సీరియస్ అప్పీల్ అయిపోయింది….ఎకసెక్కెంగా…హిందూ పరిమళం, క్రిస్టియన్ పరిమళం అంటు రాసాక , మనం కూడా అంతో ఇంతో ఎకసెక్కం వాడాలిక.అసలే అందులో మాస్టర్ డిగ్రీ ఉండబట్టే మనకి ! కాన్సెప్ట్ అర్థమవ్వకపోతే చర్చించే పద్దతి ఒకటుంటుంది. contend చేసే పద్దతి ఒకటుంటుంది. లేపోతే ‘ సవర్ణ మార్క్సిస్టు హిందువులు నా తోడు ఉంటారులే ఏది మాట్లాడినా ‘ అనే కాన్ ఫిడెన్స్ తలకెక్కాక మరి దించడం కూడా కష్టమే.

        ఇది వినండి. ఎంతో గొప్పగా, ఉదారంగా సమాజం గురించి కవితలు, కథలు రాస్తున్నామని చెప్పుకునే – వీళ్ల గొప్పతనానికి రిన్ పౌడర్ తెల్లదనం ఎలా ఉండాలో చూపడానికి కావాల్సిన మాసిపోయిన చొక్కా లాగా దళితులు, ముస్లిములు కావాలి అన్న మాట.

        ముస్లిం పరిమళం ఉందంటే ‘ ఆహా ! అలాగండీ ! మరి హిందూ పరిమళం ఎలా ఉంటుందండి ‘ అని ముక్కు మూసుకుని అడుగుతారు. అప్పుడు మనం చెప్పాల్సిందేమంటే ‘ ఆ పరిమళం పీల్చడానికి , స్ట్రెయిట్ గా , చెక్కిన ముక్కు మాత్రం ఉంటే సరిపోదు. ఇదుగో దబ్బ ముక్కులు ఉంటేనే సాధ్య పడుతుంది ” అని. ఈ దబ్బ ముక్కులు మా దళితులకు మాత్రమే ఉంటాయి. ఆ పరిమళాలు ఆ ముక్కులకే అందుతాయి. మీ ముక్కులు – కస్తూరి, కర్పూరం పరిమళాలు మాత్రమే చూసాయి. మా ముక్కులు కష్టం పరిమళాలు మాత్రమే కాదు అవమాన పరిమళాలు, అపనమ్మకపు పరిమళాలు ఇదుగో అసహన పరిమళాలు కూడా చూస్తాయి.

        ఈ ముక్కుల్లో కూడా వివిధ రకాలుగా ఉంటాయి. ముక్కు పుటలు నిక్క పొడుచుకుని ఉండే ముక్కులుంటాయి. ఆ ముక్కులు మా పరిమళాలు పీలుస్తున్నట్టు కనిపిస్తాయి కాని, నిజానికి ఆవేశం తో ముక్కు పుటాలెగరేస్తుంటాయి. ఇంకొన్ని ముక్కులకు నాసిక పొడవుగా అందంగా ఉంటుంది. ఆ ముక్కులు మా పరిమళాలు పీలుస్తుంటాయి గాని, ఆ పరిమళం ఆస్వాదిస్తున్నప్పుడు , అవి ఎంత ముద్దుగా ఉంటాయో చూపించుకోడానికి సరిపోతుంది. కొన్ని ముక్కులు నిటారుగా నిమ్మళంగా ఉంటాయి. చూడ్డానికి మన పరిమళాలను ఎంతో ఆస్వాదిస్తున్నట్టు ఉంటాయి. కాని అవి శ్వాస తీసుకోవడమే ఎప్పుడో ఆపేసి ఉంటాయి.

        ఇలా మనం వివిధ రకాల ముక్కుల గురించి , వివిధ పరిమళ అస్వాదన స్టైల్స్ గురించి చెప్పుకోవచ్చన్న మాట.

        అసలు ఈ పరిమళాలు ఎందుకు వేరుగా ఉంటాయి ? నిజానికి ఈ పరిమళాలు వేరుగా ఏమీ ఉండవు. అన్నిటిలోనూ తీయనైన మానవ పరిమళమే ఉంటుంది. ఐతే ఈ ముక్కులు చేసే ఎకసెక్కాలకు ఈ పరిమళం ఒక్కో ముక్కుకు ఒక్కో పరిమళం లా ఉంటుంది తప్ప ఆ పరిమళం లో తీయదనం అర్థమవ్వదు. ఆ ముక్కులకు మనం ప్రతి పరిమళాన్ని వివరించాలంటే, ఆ ముక్కులను కట్ చేసి , దబ్బ ముక్కులను అతికించాలి.

        అంత వరకు ఈ అందమైన, చెక్కిన ముక్కులు అన్నీ intolerant ముక్కులు !!

        cheers !

  2. మణి వడ్లమాని says:

    విజయకుమార్ గారు ఇదే సారంగలో మా అమ్మాయి రాసిన ఓ కధ రఫీ వెర్సస్ రఫీ అని.
    అందులోని కధ ,కధనం,శిల్పం వగైరా ల గురుంచి నేను చెప్పలేను కానీ.
    మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలూ చదివిన ప్పుడు నాకు తోచిన విషయం.
    ఒక చిన్న ప్రయత్నం మటుకు చేసింది.అని మాత్రం చెప్పగలను.

    • p v vijay kumar says:

      మేడం , మీరు రెఫెర్ చేసిన కథ నే చూడలేదండి. Thanq for the addition. జనాభా లో 20 శాతం ఉన్న ముస్లిం లు, క్రిస్టియన్ లు , మన కథల్లో 5 శాతం కూడా కనిపించరు. అది బాధాకరం. Probably we need such stories more , in the given context.

    • Aranya Krishna says:

      అసహనం ఎవరిదో తెలుస్తూనే వున్నది విజయ్ కుమార్ గారూ! ముస్లీమ్ పరిమళం అన్నాక హైందవ పరిమళాలు, క్రైస్తవ పరిమళాల్ని ఆస్వాదించేవారు నాకు గుర్తొచ్చారు. అందులో మీకేం ఎకసేక్కం గుర్తుకొచ్చిన్దో నాకర్ధం కావటం లేదు. నాకు అన్ని మతాల నుండి పరిమళం కాదు కంపే కనబడుతుంది. అది బతుకమ్మ అయినా పీర్ల పండగ, స్వస్థత మహాసభలైనా. .ఆ కథలో అఫ్సర్ ఫోకస్ చేసింది ముస్లీమ్ పరిమళం మీద అని నేననుకోవటం లేదు. ఒక పిల్లకి ఒక మతానికి సంబంధించిన జాతరలో ఉండే ఫాంటసీ, జానపద పారవశ్యం గురించి మాత్రమే చెప్పారనుకుంటున్నాను. ఒక మతం తీసి మరో మతాన్ని కాపు కాయలనుకోవటమ్ సరైంది కాదు. ముస్లీమ్ మతం మీద, ముస్లీమ్ సంస్కృతీ మీద, అందులో స్త్రీలకూ జరుగుతున్నా అన్యాయాల మీద, అలాగే క్రైస్తవ మహిళల మీద (క్రైస్తవ స్త్రీలు హిందు స్త్రీల వంటి అన్యాయాల్నే ఎదుర్కొంటున్నారు. వారిదీ అదే కుటుంబ వ్యవస్థ),మత ప్రచారాల్లోని మోసాల మీద కథలు రావాలనే కోరుకుంటాను. ఒక హేతువాద దృక్పధమ్ కలవాడిగా సాహిత్యం అన్ని మతాల్ని ప్రశ్నించాలనే అనుకుంటాను. అన్ని మతాలలోని మోసాల్ని ఎత్తి చూపించాలనే కోరుకుంటాను. ఒక కవిగా నేను పుట్టి పెరిగిన మతాన్ని అలాగే ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఆ దమ్ము, ధైర్యం, నిజాయితీ నాకున్నది. మీకుంటే మీరూ చేయండి. ఒక భిన్నాభిప్రాయం సహించలేక ఒకటికి పది మాటలు అంటే ఎలా సర్? మైనారిటీ కమ్యూనిటీ నుండి ఏ కొత్త రచయత లేక కవి వచ్చినా నెత్తిన పెట్టుకునేది ముందుగా మార్క్సిస్టులే అన్నది మీకూ తెలియనిది కాదు. చివరిగా ఒక్క మాట అసహనం ముక్కుల్లోనో మూతుల్లోనో ఉండదు. మనసుల్లోనూ, మాట్లాడే పద్దథుల్లోనూ వుంటుంది. మీరు రంగులు, కను ముక్కు తీరులు గురించి మాట్లాడటం అరిగిపోయిన బిలో ద బెల్ట్ వ్యవహారం. అదో పాత చింతకాయ పచ్చడి ఎమోషనల్ బ్లాక్మెయిల్ వ్యవహారం. దేశ వ్యాప్తంగా అసహనం గురించి చర్చ జరుగుతున్న నేపధ్యంలో నేను చేసిన ఒక చిన్న సూచన తట్టుకోలేక మీరు నాకు అసహనాన్ని అంటగడుతున్నారు. మీ దృష్టిలో అసలు భిన్నాభిప్రాయాలు అనేవే ఉండవా? అన్నీ శత్రుత్వాలేనా?

      • p v vijay kumar says:

        సార్ ! I can understand and empathise a gentle mock, which actually gives a pace to a discussion . But I have absolutely no tolerance, if someone goes overboard in jibing at the given argument including the person who puts forth , with an underlying false confidence that ‘ I hold majority opinion ‘ . This internet has no proper Dalit force and small number of Dalit advocates remain within their own life. You criticising is definitely goes against spirit of concern for people, empathising downtrodden’s conditions and uniting with suppressed sections. I am giving the explanation not that you havent realised what I am stating here, but to let everyone understand how dogmatic intolerance levels are in Marxists

        మీరు స్వచ్చమైన హృదయం తో అడిగి ఉంటే I would have said ” this is a valid ‘progressive dilemma ‘ అని. Once you take a fixed stand and stick to it and get overboard in scoffing at the concept and the author, noway one can view with countenance

        ఈ వ్యాసం లో రెండు ప్రధాన ప్రతిపాదనలు జరిగాయి. ( 1) కథలు, కేరక్టర్ లు implicit గానో explicit గానో నిష్పత్తులననుసరిచాలి ; ( 2) Alternate faith system పట్ల considerate view ఉండాలి అని. రాసిన ప్రతి వ్యాసం పొగడ్తలందుకోవాలనే దురాశ రచయితకుండ కూడాదు అది నేను కూడా నమ్ముతాను. ఈ ప్రతిపాదనలు వ్యతిరేకించిన ఎవ్వరినీ నేను దూషించలేదు , నేనెదుకో differ అవుతున్నానో బ్రీఫ్ గా explain చేసే ప్రయత్నం కూడా చేసాను. But your comment is undoubtedly went overboard and yes….I have no tolerance or patience for it. And you still want to defend your stand

        దళిత ఎస్సై నో, లేడీ ఇంఫార్మర్ నో విప్లవకారులు చంపాల్సి వస్తే ఏం చేయాలి ? Migrants సిరియా లాంటి దేశం నుంది జీవనం సాగించలేక అక్రమంగా వేరే దేశం లోకి చొరబడుతున్నప్పుడు జాలి చూపాలా ? ఏ దేశం లోకి చొరబడుతున్నారో ఆ దేశ ప్రజలు ఎదుర్కోవాలా ?…ఇలాంటివన్ని progressive dilemmas ఇవి కొని vague exaples of progressive dilemma .

        మైనారిటీ వాదాన్ని సమర్థిస్తే మత వాదాన్ని సమర్థించింట్టు అవుతుంది కదా ? నాస్తిక వాదం మైనారిటీ వాదానికి కీడూ చేస్తుందా మేలు చేస్తుందా ? ఇలాంటి ప్రశ్నలు కూడా valid questions for a learner or someone who has gone half way into progressive politics మత సంస్కృతి తో ముడి పడిన racism ను ఎలా tackle చేయాలి , ఎందుకంటే ఇక్కడ racism కు ప్రాముఖ్యత ఇస్తే ఆస్తిక వాదాన్ని ఎంకరేజ్ చేసినట్టవుతుంది , మైనారిటీ గా ఉన్న మత సంస్కృతిని విస్మరిస్తే racism కు దోహదం చేసినట్తవుతుంది . ఇలా broad perspective మీద చర్చ తీసుకెల్లాల్సింది పోయి , స్వంత పిడి వాదం, అందరూ ఇంత వరకు నమ్మిన ( అంటే brahminical point of view ) దాన్ని నే ముందు పెడుతున్నా కాబట్టి, నా మాటలకు , ఎక్స్ప్రెషన్ కు ఢోకా లేదు అన్నట్టు ప్రశ్నించడం సరి అయినది కాదు సర్ !. ( ఈ progressive dilemma పేరుతో ‘ రిజర్వేషన్ ల వల్ల ఎలాగన్న ప్రతిభ దెబ్బ తింటుంది సార్ ‘ అని సాగ దీసే బ్రాహ్మణ మార్క్సిస్టులు లేకపోలేదు )

        ఐతే నేను పైన వేసిన progressive dilemmas కు మీ దగ్గర సమాధానాలున్నాయా ?
        నా దగ్గరున్నాయి ( అందుకే ఈ వ్యాసం లో ఖచ్చితంగా ప్రతిపాదించగలిగాను )
        కాని నేను చెప్పను. బదులివ్వను.

  3. విలాసాగరం రవీందర్ says:

    విజయ కుమార్ గారు మంచి విశ్లేషణ చేశారు.

    • Aranya Krishna says:

      విజయ్ కుమార్ గారూ! ఆనెస్ట్ గా అడుగుతున్నాను. “progressive Dilemmas” కు మీ దగ్గరున్న సమాధానాలు ఇవ్వండి. పక్కకు వెళ్ళిపోయినా చర్చని గాడిలో పెడదాం.

      • p v vijay kumar says:

        మీరు honest గా చర్చకు ఆహ్వానిస్తున్నారని ‘ ఆ ముక్క లెక్కెట్టిన వెంటనే ‘ చెప్పాలి సార్ !
        నేను రెండు కొత్త ప్రాతిపదికలు చేసాను. చర్చించాలంటే – నిజాయితీగా ప్రశ్నలు వేయాలి. తప్పుడు సిద్ధాంతాన్ని, తార్కికంగా ఎలా బహిర్గతం చేయాలో మీకు మార్క్సిజం కాని, మార్క్సిస్టు పార్టీలు గాని నేర్పలేదా ? ఆ ‘ సహనం ‘ వదిలేసి ‘ హట్, వీడెవడు…అన్ని వింత వింత సిద్ధాంతాలు ..మాకు నచ్చని ప్రతిపాదనలు చేస్తున్నాడేంటి ‘ అన్నట్టు అసహనం తో ఎకసెక్కెం చేస్తే ఎలా ? పోనీ…అదీ వదిలేద్దాం. ప్రతిపాదనల్లో తప్పు ఉండొచ్చు కాని, ఉద్దేశ్యం లో లేదు గా ? ఆ మాత్రం concession కూడా నా బోటి వాళ్ళకు అర్హత ఇవ్వలేక పోయిందా మీ మార్క్సిస్టు అసహనం ?

        ప్రతి ప్రశ్నకు, ప్రతి సందేహానికి…మీ మెజారిటీ తత్వాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తారంటే…నూటికి నూరు పాల్లు….మరింకే దిక్కు చూడకుండా…నా దగ్గర సమాధానాలున్నాయి. మీ మార్క్సిస్టు పార్టీలకు లేని పోని progressive dilemmas ఉంటాయేమో కాని . నా బోటోల్లకు కాదు. ఇది నాకు అంబేద్కర్ నేర్పిన వాదం. మచ్చుకు ‘ మైనారిటీ వాదం మత వాదమా ? ‘ అని ఒకటి రాసాను . చూడండి.

        ధన్య వాదాలు.

  4. Aranya Krishna says:

    గుజరాత్ మారణకాండ అనంతరం గీతాంజలి ముస్లిం స్త్రీల జీవితాల మీద ప్రత్యేకంగా “పెహచాన్” అనే కథా సంపుటి వెలువరించారు. గొప్ప కథలు. అటువంటిదే మరొక సంకలనం తెచ్చినట్లున్నారు. ఐ యాం నాట్ ష్యూర్. విజయకుమార్ గారు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వారు నిర్వహించిన సమావేశం నిర్వహించిన సందర్భాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసారు. వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసిందే మాట తత్వానికి వ్యతిరేకంగా, మెజారిటీ మత అసహనానికి వ్యతిరేకంగా. మైనారిటీ వర్గ వెతల మీద సాహిత్యం సృశ్ఠించమని మీరు వాళ్ళకి సలహా ఇస్తే బాగుంటుంది కానీ వాళ్ళేదో మైనారిటీలకు అన్యాయం చేసినట్లు మాట్లాడటం సబబుగా లేదు. ఆ వేదికలో చురుగ్గా వున్నవాళ్ళు మెజారిటీ మాట అసహనానికి వ్యతిరేకంగా రాసారు. కొండేపూడి నిర్మల ఘర్ వాపసీ మీద బలంగా రాసారు. నా దగ్గర పూర్తి సమాచారం లేదు. మనం చూడలేదు కాబట్టి వారసలు ఏమీ చేయలేదని కంక్లూడ్ చేసి ఆవేదన పడితే ఎలా? వాకబు చేయాలి కదా!

    • p v vijay kumar says:

      U said abt wat u r happy with…i said abt wat am not happy with…:)

      • Aranya Krishna says:

        ఇది సంతోష విచారాలాకు సంబంధించిన విషయం కాదు. మీరు ప్రగతిశీలక హిన్దూ రచయతలు రాసిన కథల్లో ముస్లీమ్ పాత్రలేన్ని, క్రైస్తవ పాత్రలేన్ని? అని అడిగారు. నాకు తెలిసిన ఒకట్రెండు చెప్పాను. ఇంకా ఏమైనా వుండొచ్చని కూడా చెప్పాను. పైన మీరే ఒక చోట అన్నారు “ఇది ఒక ముస్లిం మాత్రమే రాయగలిగిన కథ” అని. తెలిసిన జీవితం రాయటమే నిజాయితీ. ప్రగతిశీల ఆలోచనలతో మరింతమంది మైనారిటీ రచయతలు రావాలని కోరుకుందాం సర్. అంతేకానీ ఏదో ఆత్రంలో లోతు తెలియని జీవితం గురించి బలహీనమైన రచనలు దేనికి? ఎవర్ని ఎవరమూ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

    • p v vijay kumar says:

      సార్..నాకు ఈ పాత చింత కాయ పచ్చ్చడి వా దన లోకి వెళ్ళడం ఇష్టముండదు.thiస్ is an age old debate – empathetic observation vs experience in literature అన్నది.

      ” ఎవర్ని ఎవరం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.” …అని ఈ వ్యాసానికి సంబంధం లేకుండా అనడం లో మీ ఆవేశం డో స్ ఎక్కువయ్యింది….అది ఉద్దేశ్య పూర్వకం కాదని, చర్చ పక్క దారి పట్ట రాదని తడమడం లేదు.

    • Aranya Krishna says:

      విజయ్ కుమార్ గారూ! ఏమిటి అసలు ఈ చర్చించే పద్ధతి? చర్చ పక్కకి పోయిందని ఆనెస్ట్ గా చర్చిద్దాం రమ్మని, మీ వెర్షన్ చెప్పండి, తెలుసుకుంటానంటే అక్కడికి నేనేదో మీ ముందు మోకరిల్లినట్లు కటింగ్ ఎందుకు సర్? విషయాలు మాట్లాడుకోవాలి కానీ ఈ సుద్దులు చెప్పే కార్యక్రమం దేనికి? దీన్ని చర్చ అంటారా? అసలు ఏ విషయమైనా నిజాయితీగా చర్చించటం మీకు చేతకాదని స్పష్ఠమౌతున్నది. మీ ఈ వ్యాసంలో మీరు మైనారిటీ మతాల పట్ల ఎందుకు లీనియంట్ గా వుండాలో మీరు స్పష్టంగా రాయలేదు. అందుకే నేను దాన్ని పట్టించుకోలేదు. మీరన్న ముస్లీం పరిమళం అన్న పదం మతాన్ని శ్లాఘించటం లోకి వస్తుందనే నా అభిప్రాయం. ముస్లీం పరిమళం అంటూ ఒప్పుకుంటే హైందవ పరిమళాలు, క్రైస్తవ పరిమళాలు ఒప్పుకోవాలనే డిమాండ్ వస్తుంది. నేనదే పాయింటవుట్ చేస్తే మీకు ఎకసెక్కెంగా అనిపించీంది. మీకు వ్యంగ్యంలో పి.జి. వుందని కూడా చెప్పుకొచ్చారు. మీకు పి.జి. కాకపోతే, డాక్టరేట్ వుండొచ్చు, లేకపోతే వ్యంగ్య విశ్వవిద్యాలయానికి మీరో వైస్ చాన్సెలర్ కావొచ్చు లేదా మీరే ఒక పేద్ద విశ్వవిద్యాలయమే కావొచ్చు. మీ గురించి మరికొంత డబ్బా కొట్టుకోండి. నాకేరకమైన అభ్యంతరం లేదు. ప్రోగ్రెసీవ్ డైలెమా, మార్క్సిస్టు అసహనం, మెజారిటీ తత్వం అంటూ ఏదో అర్ధం పర్ధం లేని దూషణలు, ఉద్దేశ్యాల ఆపాదన మీరు చెప్పాలనుకుంటున్న పాయింటుని పక్కకు నెట్టేస్తాయి. మీ చదువరుల పట్ల మీకు గౌరవం లేకపోతే మిమ్మల్ని చదివేవారే వుండకపోవచ్చునేమో. తిట్ల ద్వారా మీ అహాన్ని మీరు తృప్తి పర్చుకోగలరేమో కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూని కన్వే చేయలేరు.

      • manjari lakshmi says:

        “తిట్ల ద్వారా మీ అహాన్ని మీరు తృప్తి పర్చుకోగలరేమో కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూని కన్వే చేయలేరు” బాగా చెప్పారు

      • p v vijay kumar says:

        చర్చించే పద్దతి…ఖచ్చితంగా మీరు ” లెక్కెట్టాక వెంటనే ” ఎకసెక్కం చేయక ముందు లేవనెత్తాల్సిన అంశం. Anyway అరణ్య క్రిష్ణ గారు ! మీకు లాల్ సలాం ! ” మైనారిటీ వాదం మత వాదమా ? ” అని విపులంగా లెనిన్ , అంబేద్కర్ మాటల్లో చెప్పినా కూడా మీకర్థమవ్వదు. Questions raise చేస్తూ పద్ధతిలో ‘చంకీ పూల కథ ‘ లో చెప్పినా అర్థమవ్వదు. మీ ఎకసెక్కానికి విరుగుడు ఎకసెక్కం వాడినా అర్థమవ్వదు. ఎదిరించినా అర్థమవ్వదు, నచ్చజెప్పినా అర్థమవ్వదు. మీ conscience కు నేను plead చేయాలి కాబోలు ఇక !! మీ ఆత్మ పరిఙానానికి appeal చేసుకోవాలేమో ?!

        మీరు belt కట్టుకుని వాదన చేస్తారు. Belt ఉన్న అందరూ వెంటనే Attract అవుతారు. తప్ప ఏ దళితుడూ, ముస్లిం attract అవ్వరు. ఎందుకు ? You have that confidence and implicit assurance .మా వాళ్ళకు Belt లేదు పేంట్లు సరి చేసుకోడమే సరిపోతుంది.

        అందుకే సర్, Belt ఉన్న వాళ్ళకు, Below the Belt దెబ్బలు తగుల్తాయి. Belt లేని నా బోటోళ్లకు, Belt అంటేనే logical contempt పెంచుకున్న దళితులకు Below the belt దెబ్బలు ఉండవు. అక్కడ పడితే అక్కడుంటాయి. ఐనా సరే ఎట్లన్నా , ఆ Belt ఊడగొడ్తాం సార్ !

      • Aranya Krishna says:

        విజయ్ కుమార్ గారూ! మీ వాదన పూర్తిగా అర్ధమౌతుంది సార్! మైనారిటీ వాదం మతవాదమా? అన్న మీ మరో వ్యాసం పూర్తిగా చదివాను. అందులో అర్ధం కానిదేమీ లేదు. సింపుల్ గానే వుంది. గతి తార్కిక భౌతికవాదం, చారిత్రిక భౌతిక వాదం కంటే క్లిష్టమైన అంశాలు అందులో ఏమీ లేవు. నాకే బెల్టులు లేవు సార్! నేను బెల్టు బాచ్ కాదని మీకూ తెలుసు. లెనిన్ మతాన్ని ముట్టుకోవద్దన్నాడు కానీ వెనకేసుకు రమ్మని చెప్పలేదు. మతభావనల మీద దాడి చేయొద్దంటే అర్ధం ఆ భావనల పట్ల గౌరవం ప్రదర్శించమని కాదు కదా! మతం వీధిలోకొస్తే ప్రమాదకరమే. మతం మత్తుమందన్న మార్క్స్ చెప్పినదాన్ని లెనిన్ కూడా ఉటంకించాడు. ఇందులో మార్క్స్ నుండి మార్క్సిజం సహానుభూతిపరుడి వరకు ఎవరికీ ఎటువంటి డైలెమా లేదు. ఆ డైలెమా ఏదో మీరే సృష్ఠించబూనుకున్నారు. మీరు చెప్పదలుచుకున్న కొత్త పాయింటు నాకు తెలిసి ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. ప్రతి మార్క్సిస్టు హేతువాదే. కానీ నాస్తికత్వ ప్రచారం వాళ్ళ లక్ష్యం కాదు. మతం సామాజిక సంక్షోభాలు సృష్ఠించినప్పుడు వారు మతాన్ని వ్యతిరేకిస్తారు. అప్పుడు మతం మీద దాడి ఉంటుంది. భారతదేశంలో హిందూత్వం అగ్రెసీవ్ గా వున్నది కాబట్టి దాన్ని వ్యతిరేక్స్తారు. అంతే కానీ ప్రత్యేకంగా ఏ మతానికీ వ్యతిరేకంగా పనిచేసే అజెండా మార్క్సిస్తులకు ఉండదనుకుంటా. ఇంక మరో మారు బెల్టు దగ్గరకొస్తే భారతదేశంలో హైందవమే కాదు అన్ని మతాలూ బెల్టులు కట్టుకుంటాయి. అందరిదీ ఒకే రకమైన కుటుంబ వ్యవస్థే. అన్ని మతాల స్త్రీలు మంగళసూత్రాలు, మెట్టెలు వాడతారు. అందరికీ ముహూర్తాలు, వాస్తు మీద నమ్మకాలుంటాయి. దేవుళ్ళు మారతారు కానీ భావజాలం మెటీరియల్ అదే. అందుకే మీరు మైనారిటీ మతభావనల్ని పెంపొందింపచేసినా బలపడేది హైందవ బెల్టే! అన్ని రకాల బెల్టులు తెగ్గొడదాం సర్!

  5. మీరు ఈ వ్యాసం లో ఏం చెప్పాలనుకున్నారో స్పష్టం గా అర్ధం కాలేదు. కథ గురించి విశ్లేషించారా ? లేక రచయిత/రచయిత్రుల కి ఎలాంటి కథలు వ్రాయాలో చెప్తున్నారా ? ఏ రచయితకయినా ఏ సంస్కృతి తో ఎక్కువ సంబంధం ఉందో అదే కథ లో చెప్పడం జరుగుతుంది సాధారణం గా. మైనారిటీలు కథా పాత్రలు గా కథలు రావాలంటే అలాంటి నిజమైన అనుభవం ఎదురైనపుడు కథ వస్తుంది. మీరు విశ్లేషిస్తున్న ఈ కథ రచయిత ఆంధ్రా లోఇలాంటి వాతావరణం లో పెరిగి ఉండవచ్చు. అందుకే ఈ కథ ఒక వర్గం మీద biased గానే ఉన్నా మనసు కి హత్తుకునేలాగా ఉంది. నచ్చని అంశాన్ని highlight చేయడం కోసం సురేష్ పాత్రను ఒక విలన్ గా మార్చనక్కర్లేదేమో. మైనారిటీలు తక్కువ శాతం లో ఉండటం వలన కథ వారికే అనువు గా ఉండాలి అని మెజారిటీ వారిని చెడ్డవారిగా చూపించనక్కరలేదు !! మన పిల్లలు తరగతి లో పిల్లల కంటే ఎక్కువ చదవాలి అనుకుంటే దాని వలన వారికి ఇంకొక పిల్లల పై ద్వేషం, కసి తప్ప సాధించేది లేదు. ఆ విధం గా అనుకోకుండా, విషయాన్ని ఎంత అర్ధం చేసుకున్నారు, దాన్లో ఎంత జ్ఞానం సంపాదించుకున్నారు అని ఆలోచించాలి. దేశం లో మతసామరస్యం కలగాలన్నా అంతే !! హిందూ ధర్మం పాటించేవారు ఒక్క భారత దేశం లో మెజారిటీ లో ఉన్నారేమో కానీ ప్రపంచం లో కాదు. ప్రపంచం లో ఇస్లాము, క్రైస్తవ మతాలే మెజారిటీ. భారత దేశం ఎన్ని దండ యాత్రలకి గురయినా, ఎన్ని మత మార్పిడులు జరిగినా చెక్కు చెదరకుండా ఇన్ని వేల సంవత్సరాల నుండి ఇన్ని వేల మంది హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి ఆ హిందూ ధర్మం నశించిపోవాలి అనుకోకుండా కాపాడుకోవాలి కదా !! రచనలు చేసినపుడు ఇది కూడా గుర్తుంచుకోవలసిన విషయం. హిందూ ధర్మంలోని కొన్ని ఆచారాలు ఇతర మతాలలో ఆచరించడం చూస్తుంటాము. ఇది భారత దేశం లోనే చూస్తుంటాము. దానికి మంచి ఉదాహరణ తాళి . క్రిస్టియన్ వివాహాల్లో కూడా తాళి కట్టడం, ఇస్లాము మతస్తులు ల లో పెళ్లి అయిన స్త్రీలు నల్ల పూసలు వేసుకోడం.సందేశాత్మక కథల తో నిజం గా ‘culture of love and affection’ కలుగజేయాలి అనుకుంటే కథ ని రెండు వర్గాల వైపుల నుంచి చూపించాలి. అప్పుడే నిజమైన మత సామరస్యం కలం ద్వారా సాధించవచ్చు.

    • p v vijay kumar says:

      Madam, u hav to read more on the characteristics of majoritarianism, brahminism apart from what is secularism. I only suggest dont get obsessed with “neutrality “.

  6. సాహిత్యంలోకి కాన్షీరాంను తీసుకురావడం సరైంది కాదనుకుంటాను విజయ్‌కుమార్‌ గారూ! ఈ పర్సెంటేజీల స్కేళ్లతో ఈ రకంగా సాహిత్యాన్ని కొలవడం సరికాదనుకుంటాను. మీ సాహిత్యంలో ఎన్ని ముస్లిం పాత్రలున్నాయి, ఎన్ని క్రిస్టియన్‌ పాత్రలున్నాయి అనే ప్రశ్న కూడా సరైంది కాదనుకుంటాను. మనకు తెలిసిన జీవితాన్ని అక్షరబద్ధం చేయడమే సరైనది. తెలీని జీవితం గురించి రాయడం కృతకంగా ఉంటుంది. తెలుగు సినిమాల్లో ఆ రకమైన చెత్త చూస్తూనే ఉన్నాం కదండీ! అయినప్పటికీ సహానుభూతితో రాసినవారూ ఉన్నారు. ఆ జీవితాన్ని దగ్గరనుంచి చూడడం వల్ల అక్షరబద్ధం చేసినవారూ ఉన్నారు. దృక్పథమే ముఖ్యం. ఈ స్కేళ్లు కాదు. ఎక్కువ మంది ముస్లిం రచయితలు తెలుగులో రావాలని కోరుకోవడం సరైంది అవుతుంది కానీ మీరెందుకు వారిని పాత్రధారులుగా పెట్టి రాయరు అని ఇతరులను నిలదీయడం కరెక్టు కాదు. వారి దైనందిన జీవితంతో లోతైన పరిచయం లేని వారు ఆ జీవితాన్ని చిత్రించడం ఎలా సాధ్యమవుతుందసలు?

    • p v vijay kumar says:

      I completely differ with the observation రామ్మోహన్ గారు . We have to have clear percentages clear proportions ,which is imperative. We have ignored this all along and ended up talking avout whats happening in Hindu lives. Just to give an example, Amir Khan is a muslim but that does not enthuse me for watching a muslim movie as all characters are Rahul, Raj, Rakesh….why do we come across these characters so often ? If we have atleast 20 % population around as minorities, I think it is ideologically incorrect and literally manipulated , if we dont have them as key characters atleast to that extent. . థేంక్యూ సార్ !! : )

  7. Aranya Krishna says:

    బాగా చెప్పారు రామ్మోహన్ గారు!

  8. K SRINIVAS PRASAD says:

    ప్రతి రచయత ఇకనుండి కొన్నిపెర్సెంతేజేస్ ప్రకారం దళిత్,మైనారిటీ,ఫెమినిస్టు కధలు రాయాలని ,అలా రాస్తేనే ప్రగతి శీల రచయత ల కింద ట్రీట్ చేస్తారు అని అర్ధం అయ్యింది

    • p v vijay kumar says:

      Exactly ! బట్ మరీ దుర్మార్గం కదా ?!

    • ari sitaramayya says:

      అంతటితో సరిపోతుందా? భలే వారండీ మీరు. మరీ అమాయకుల్లాగా ఉన్నారు. కథల్లో కొందరు హిందువులుండాలి, కొందరు ముస్లింలు ఉండాలి, కొందరు క్రిస్టియన్లు ఉండాలి. కులాలవారు సమాజంలో వారివారి శాతానికి తగ్గట్టుగా ఉండాలి. మేధావులు వామ పక్షం వాళ్ళయి ఉండాలి. పల్లెల్లో ఉండేవాళ్ళు నిజాయితీ పరులై ఉండాలి. పట్టణ వాసులు మోసగాగాళ్ళయి ఉండాలి. తల్లిదండ్రులు కశ్టజీవులుగా ఉండాలి. పిల్లలు డబ్బు వెంటబడి ఉండాలి. మరి ప్రజాస్వామ్య రచయితలు అనిపించుకోవటం సులభం అనుకున్నారా?

  9. suvarchala chintalacheruvu says:

    చంకీ పూల గుర్రం కథ చాలా బాగుంది. అస్వాదించిన కథ ఇది. ఇలాంటివి మరిన్ని రావాలనే ఆకాంక్ష. అఫ్సర్ గారిల, ఖదీర్ బాబుగారిలా, వేంపల్లె షరీఫ్ గారిలా చాలామంది రచయితలు రావాలి.
    విజయ్ కుమార్ గారి మాటతీరే మార్చుకోవాలి..ద్వేషమేకానీ సామరస్యత ఎక్కడా కనబడదు. ఎదుటివారు సామరస్యంగా మాట్లాడుతుంటే విపరీతమైన వ్యతిరేకత కనబడుతుంది. మరి ఈ ధోరణి ఎలా ప్రగతిశీల భావజాలం కిందకి వస్తుందో అర్ధంకావట్లేదు.

  10. p v vijay kumar says:

    మేడం, మీ concern అర్థమవుతుంది. సామరస్య భావన అన్నది ‘ బాధించే వాడికి ‘ ఉండాలి. అది సామరస్యమో కాదో తేల్చుకునే ఆలోచన మాత్రం ‘ బాధింపబడ్డ ‘ వాడికుండాలి. ఈ దృక్పథం తో ఒక సారి చర్చ చూసి, సామరస్యమెలా చూపించారో , కష్టమనుకోకపోతే, తెలియ జేయండి. ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను.

  11. Delhi (Devarakonda) Subrahmanyam says:

    ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చ సందర్భం లో నా కూతురు సుప్రియ దేవరకొండ రాసిన అభిప్రాయం బావుందని ఈ కింద ఉదహరిస్తున్నాను.
    “Intolerance is not presently restricted to what is being discussed here . It has larger connotations
    For instance , Intolerance within the family and organizations is because of lack of democracy and presence of feudal hierarchy prevalent in families. Also the hierarchy prevalent in organizations.
    But the other fact remains that I do not feel safe in this government for the simple reason that I do not get that free environment where I can express my opinions. Where if I oppose Modi and the counterparts I will not be shoved down. I will be called hundreds of names which I have to tolerate. And I have been called the same on twitter. True Aamir Khan should not have broadcast the bedroom talk and that was irresponsible. But what is being expressed by him and others is felt by many of us. And why not if we are told if you want to eat beef, please leave the country. If you raise a debate that Aryans are invaders which has substantial historical proof, people are calling us racists. The science, reasoning and facts are going out of the window. So that is why this increasing fear of intolerance is going. Having said all that I am little irritated at the way Media, political parties are taking it out of proportions in the wake of so many issues plaguing India. Chennai floods and people struggling, lack of health infrastructure and so many other things. I am irritated that people are not opposing the way human . development projects are taking a backseat in the name of so called growth. As Amartya Sen put it India is aiming to be an economic power where more than half of its population are uneducated , unhealthy and hungry.”

    • Aranya Krishna says:

      నిజమే! అసహనానికి మాతృభూమి అప్రజాస్వామికతే! సుప్రియ గారు సరిగా చెప్పారు.

    • ‘If you raise a debate that Aryans are invaders which has substantial historical proof, people are calling us racists.’ ఈ వాక్యం చదివితే నవ్వొస్తోంది. మనకి కావాల్సి వచ్చినపుడు చరిత్ర అనటం. మనకి అవసరం లేనపుడు రామాయణ భారతాలు లాంటివి చరిత్ర లోనే లేవు , అవి కట్టుకథలు అని చెప్పడం. ఈ మధ్య ‘అసహనం’ అనటం ఒక fashion statement లాగా తయారయింది. అసలు ‘సహనం’ అంటే ఏంటి ? హిందూ ధర్మ మనోభావాలని, వారి మత గ్రంథాలని ఎంత తూలనాడినా ఎంత నీచంగా మాట్లాడినా ఏమి మాట్లాడకుండా ఉంటే అది ‘సహనం’ అవుతుందా ? ఆ విధం గా మాట్లాడి కించపరచద్దు హిందూ ధర్మ పాటించే వారు చెప్తే, వారు మత చంధసులు మరియు ‘అసహనం’ చూపించే వారు అయిపోతున్నారా? అది హిందూ ధర్మానికే ఎందుకు వర్తిస్తుందో భారత దేశం లో అర్ధం కాదు. హిందూ ధర్మ మనోభావాలని, మత గ్రంథాలని ఎంత తూలనాడినా ఎంత నీచంగా మాట్లాడినా దానిని ‘freedom of speech’ అంటారు మేధావుల భాష లో. ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ రోడ్డు మీద నుంచుని మతం మారిపోమ్మంటూ ఆహ్వాన లేఖలు, మత గ్రంథాలు పంచడం. అవన్నీ చూసి చూడనట్లు ‘సహనం’ తో వదిలేయలేమో మరి!! మరాఠీ దిన పత్రిక లో వేసిన ఉగ్రవాద సంస్థ గురించి కార్టూన్ రూపం లో వేస్తే పత్రిక కార్యాలయాల మీద దాడికి వచ్చిన వారి గురించి ఒక్క మేధావి మాట్లాడడు. ఆ ఘటన మరి వారి భాష లో ‘freedom of speech’ యే కదా !!తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పలేని పరిస్థితి వారిది. ఆ విషయం లో వారికి బాగా తెల్సు ‘అభద్రత’ అంటే ఏంటో. ఇలాంటి ఘటనలు చూసి వారు చూపించే ‘సహనం’ చాలా మెచ్చుకోదగినది!!

      • ari sitaramayya says:

        చంద్రిక గారూ, పత్రికా స్వాతంత్ర్యాన్ని గౌరవించే వారందరూ మరాఠీ దినపత్రిక మీద జరిగిన దాడిని ఖండించాలి. పత్రిక కార్టూన్ లో మహమ్మద్ పేరుంటే అంతగా మనోభావాలు దెబ్బతిన్న వారికి ఐసిస్ జెండా మీద మహమ్మద్ పేరు ఉంటే ఎందుకు ఇబ్బంది కలగలేదో మరి.
        ప్రస్థుతం ప్రపంచ వ్యాప్తంగా పరమ దుర్మార్గపు పనులు చేస్తున్న ఐసిస్ కు భారతదేశంలో ఎలాంటి చోటు దొరక్కుండా చూడాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది. సిరియాలో ఇరాక్లో ఐసిస్ చంపుతుంది ఎక్కువగా ఇస్లాం మతస్తులనే. ఐసిస్ అంటే భయంతో, పరివార్ మూర్ఖుల భయంతో, మధ్యలో నలిగిపోతున్న సాధారణ ఇస్లాం మతస్తులకు అండగా నిలబడటం కూడా అందరూ చెయ్యవలసిన పనే.
        మత సహనం విషయంలో హిందూ మతాన్ని, పరివార్ మూర్ఖుల్ని కాదు, హిందూ మతాన్ని, హర్షించాలి. హిందూ మతం గురించి నేను భయం లేకుండా ఎంతైనా విమర్శించ గలను. దేశ వ్యాప్తంగా హిందూ మతంలోని మూఢ నమ్మకాల గురించి ఎంత చర్చ జరగలేదు? ఇస్లాం మీద అలాంటి చర్చ జరుగుతుందా? జరగటం సాధ్యమా? ఈ విషయాన్ని వామ పక్షం వారు ఎప్పుడైనా గుర్తించారా?

      • అదేంటండి మనో భావాలు అనేవి ఒక్క హిందువులకే ఉంటాయా? మిగతా వారికి ఉండవా ? ఒకరి మనోభావాలు ఒకరు గౌరవించుకొనే టట్లు ఉంటే అసలు మాట్లాడాల్సిన పనే ఉండదే ? ఇక్కడ మనో భావాలు ఒక్కరి సొంతం అనుకోవడం వల్లనే గదా సమస్య? నేను ఈ మాట హిందువుగానే అంటున్నాను.

    • Srinivas Vuruputuri says:

      “If you raise a debate that Aryans are invaders which has substantial historical proof, people are calling us racists.”

      Not sure, why anyone would call these debate raisers racists but on the “historical proof” part, this is what Wendy Doniger had to say:

      “the Orientalist version of the Aryan hypothesis boasted not only of the purity of Aryan blood but of the quantity of non-Aryan blood that the Aryans spilled, and this myth was certainly racist. The “invasion of the blonds” story took root and prevailed for many reasons, among them that the British found a history of invasions of India a convenient way to justify their own military conquest of India…

      “The smug theory that a cavalcade of Aryans rode roughshod into India, bringing civilization with them, has …been seriously challenged. The certainty has gone, and new answers have thrown their hats into the ring.”

  12. Srinivas Vuruputuri says:

    ” హిందూ మత విశ్వాస విషం లో మునిగిన తండ్రి…”

    నాకు గుర్తున్నంతలో – అఫ్సర్ గారి కథలో అది “మత విశ్వాస విషం” కాదు. హిందుత్వ రాజకీయ విశ్వాసాల విషం. తేడా ఉంది కదా.

    ఇంకొక్క మాట – మొహర్రం షియా పండగ కదా. “సూఫీ” కాదేమో. దర్గాలు సూఫీ వ్యవహారం అనుకుంటా.

  13. Chandrika says:

    సీతారామయ్య గారు !! మీ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తాను. ఆ ఉగ్రవాదసంస్థ పేరు వ్రాయటానికి భయం వేసే పేరు కూడా నేను ప్రస్తావించలేదు. అదే RSS, సంఘ్ పరివార్ వారి మూర్ఖపు భావజాలాన్ని విమర్శించడం లో ఆ భయం నాకు లేదు. ‘మధ్యలో నలిగిపోతున్న సాధారణ ఇస్లాం మతస్తులకు అండగా నిలబడటం కూడా అందరూ చెయ్యవలసిన పనే’ . మీరు చెప్పినది అక్షరాలా నిజం. అమీర్ ఖాన్ గారు ఎంత అభద్రత కి గురయ్యారో తెలీదు గానీ సామాన్య మానవుడి లో నిజంగా భయభ్రాంతి ని కలుగ చేసారు. RSS, సంఘ్ పరివార్ వారి కంటే ఈయన మాట్లాడిన మాటలే వారి లో నిజంగా అభద్రత గురి చేసి ఉండచ్చు. ఈ అవార్డు వాపసి లు సామాన్య మైనారిటీల కి ఎంత భద్రత కల్పించారో తెలీదు గానీ మీడియా కి మంచి దాణా మాత్రం ఖచ్చితంగా ఇచ్చారు !! ‘ఇస్లాం మీద అలాంటి చర్చ జరుగుతుందా’ – జరగదు. ఇస్లాము మతం లోని స్త్రీలు ఈ polygamy అనే దాని వలన ఎంత బాధ అనుభావిస్తారో ఎంత మంది మాట్లాడగలరు దాని గురించి? ఎంత అన్యాయం ఒక స్త్రీ కి ? అదే శ్రీ కృష్ణుడి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అది open argument.

  14. Chandrika says:

    తిరుపాలు గారు !! గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం లోనే ఉంది తేడా. ఆ గౌరవం అంటూ ఉంటే ఇన్ని గొడవలు ఎందుకు ? మన ‘చిలుక పలుకుల’ మేధావుల ద్వంద్య వైఖరి ఏమిటీ అనే!! దేశం లో ఏదో అల్లకల్లోలం జరిగినట్లు ఒకరి తరువాత ఒకరు అవార్డులు తిరిగి ఇచ్చివేశారు . ఈ అంతర్జాతీయం గా భారతదేశ ప్రతిష్ట ని మంట కలిపి నేను పైన చెప్పిన ఘటన విషయం లో కానీ, చెన్నై వరదల విషయం లో కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఈ ఘటన పై ‘freedom of speech’ దెబ్బ తిన్నది అంటూ ఏ జర్నలిస్టులు,మీడియా వారు గొడవలు చేయలేదు. ఇంక మన మేధావులు అవార్డు లు తిరిగి ఇవ్వలేదు. మేధావుల ఆలోచనా పధ్ధతి ఒకేలా ఉండాలి కదా ? ఈ ఘటన గురించి మొదటిసారి wall street journal లో చదివాను. ముంబై లోని ఉన్న కార్యలయాలు అన్నటి మీద దాడి చేసారు. అదృష్టం కొద్దీ ఎక్కడా ప్రాణ హానీ జరుగ లేదు. ఇరువైపులా తప్పు ఉంది అంటాను. ఉగ్రవాద సంస్థ ని వ్యతిరేకిస్తూ కార్టూన్ వేశారేమో కానీ సామాన్య ఇస్లాము మతస్తుల మనోభావాలు ఆ విధం గా కించపరచడం పత్రిక వారి తప్పు . మనోభావాలు దెబ్బ తీస్తే చట్ట పరంగా శిక్ష పడేలా చూడాలి కానీ పత్రిక కార్యాలయాలు దాడి చేయటం లాంటి పన్లు చేయటం తప్పు. నాకు చాలా నచ్చిన విషయం పత్రికా సంపాదకులు క్షమాపణలు చెప్పడం.

  15. ముందుగా అందరు అలోచనాపరులూ అంగీకరించాల్సిన విషయం ప్రతీ మతంలోనూ చాందసవాదులు ఉంటారని. దానికి ఏమతం కూడా మినహాయింపు కాదు. తమ మత భావజాలాన్ని విమర్శించిన వాళ్ళను వాళ్ళెప్పుడూ వదలలేదు. సోక్రటీస్ నుంచీ కలుబుర్గీ, తస్లిమా నస్రీన్ వరకూ. ఆ వరసలోనే సుధీంద్ర కులకర్ణి మీద శివసేన ఇంకు పోసినా , హైదరాబాద్ సియాసత్ ఎడిటర్ మీద మజ్లిస్ వాళ్ళు మలం పోసినా. ఎక్కడయినా దాడులు జరగలేదంటే దానర్ధం ఆ మతం గొప్పదని కాదు. దాడి చెయ్యటానికి అక్కడ అవకాశం దొరకలేదనీ, లేదా తమ బలం సరిపోలెదనీ. ప్రస్తుతానికి బలం సంపాయించుకున్న ఒక మతం వేస్తున్న వీరంగం ఇప్పటి అసహనం. రేపు అది ఇంకో మతం అంది పుచ్చుకొంటుంది. అందుకని మొత్తంగా చాందస వాదాన్ని వ్యతిరేకించని ఆలోచనాపరులను ఏమతం ప్రజలూ నమ్మరు. అదే ఇప్పుడు జరుగుతోంది.
    -శశాంక

Leave a Reply to మణి వడ్లమాని Cancel reply

*