మట్టి, ఆ మట్టిలో కలిసేవి.

 

 

-కందుకూరి రమేష్ బాబు

~

Kandukuri Rameshచాలా సాహసం అనిపిస్తుందిగానీ ఏమీ కాదు.
దైనందిన జీవితంలో యధాలాపంగా కనిపించే ప్రతీదీ మాట్లాడుతుంది.

అసలు రోజువారీ జీవనచ్ఛాయలోనే సమస్తం ప్రవహించి గడ్డ కడుతుంది.
ఫ్రీజ్ చేసి చూస్తే అన్ని వ్యాపకాలు పరుగులు పెడతాయి.

నిశ్శబ్దంగా చిత్రం పలు చిత్రాలు చెబుతుంది.

నిజానికి ఛాయాచిత్రకళ సింగిల్ ఎగ్జిబిట్.
దేనికదే ఒక గ్రంథం.

తొలుత పుట అనుకుంటాం.
కానీ, పిదప అది పుస్తకం, గ్రంథం.
ఒక్కోసారి ఖురాన్, భగవద్గీతా అవుతుంది.
లేదా ఏమీ కాకుండా చదివిన మర్మాలనెల్లా వదిలించే బ్యాక్ టు బేసిక్ లెసన్ ఒకటి చెబుతుంది.

లేదా సుసాన్ సాంటాగ్ ఆన్ ఫొటోగ్రఫీలా వివరణ.
వివరణలు పోతుంది.
మరోసారి హెన్రీ కార్టియర్ బ్రస్సన్ నిశ్చలం చేసే లిప్త- డిసిసివ్ ముమెంట్.
అంటే మన నుంచి తప్పుకునేదే కాదు, మనం తప్పుకోకుండా ఆగి చిత్రించేదీ అన్న సోయినీ కలిగిస్తుంది.

చిత్రం సామాన్యమైన కొద్దీ పరిపరి విధాలు.
మొదట పరామర్శ లేదా పరిచయం అనుకుంటాం
ఇంకా చూస్తే అంతిమ విశ్లేషణా అవుతుంది.

ఈ చిత్రం నా వరకు నాకు సంక్షిప్తం. విస్త్రృతమూ.
సామాన్యశాస్త్రం. ఒక సింగిల్ ఎగ్జిబిట్.

మొదట బాగోదు.
కానీ, చూడగా చూడగా ఒక డైజెస్ట్ చేసుకోతగ్గ ఫ్యాక్టు ఇందులో రిఫ్లెక్ట్ కావడం లేదూ అని ఎన్నిసార్లు అనుకున్నానో!

కానీ మొహమాట పడ్డాను.
ప్రచురణకు పంపాలంటే రెండేళ్లు పట్టింది.
ఇప్పటికీ అధిగమించడం నయమైంది.

తెలుస్తున్నదేమిటంటే చిత్రించినప్పుడే మొహమాటం అధిగమించానని!
చిత్రించినప్పుడే వికసించామని!

కెమెరా లెన్స్ కలువ పువ్వులా తెరుచున్నదీ అంటే బురద నుంచి వికసించిందనే అర్థం.
అక్కడే వికాసం ఉన్నదీ అంటే వస్తువు నిన్ను హత్తుకున్నదీ అంటే అది సత్యం శివం సుందరం
ఇది అదే మరి!

చూడండి.
మట్టి,
ఆ మట్టిలో కలిసేవి.

ఒకానొక ఉషోదయాన…మేడారం మట్టిలో…చిలకలగుట్ట దిగువన
ధన్యురాలైంది ఈ చిత్రాన్ని భద్రపర్చిన కుంకుమ భరిణె నా కెమెరా.
జీవితం, మృత్యువు. రీసైక్లింగ్ తో పావనం చేసింది ఈ మనిషిని.

ఒక ఫిజికల్ మెటాఫిజికల్ ఎనలైటెన్డ్ భావన.
తీసిన చిత్రం మహత్తరం అని తెలిసినప్పటికీ
ఆ తీసిన చిత్రాన్ని చూపించడం కూడా సామాన్యం కాదనీ తెలుస్తుంది.

చూపిస్తే నా పని పూర్తవుతుంది.
ఈ వారం నా వివరణే దృశ్యాదృశ్యం

నీడ,
జీవనచ్ఛాయ.
రెండూ చూడండి.

పేడు, పేడ.
రెండూ ఒక్కచోట.
సైకిల్, రీసైకిల్డ్.

సత్యం శివం సుందరం.

*

మీ మాటలు

  1. ఎప్పట్లానే మీ కెమెరా కుంకుమ భరిణ లోంచి అందమైన రంగురంగుల చిత్రం అక్షరమై రాలింది .

  2. Jayashree Naidu says:

    చిత్రాన్ని చూసి మీ వివరణ ఎలా ఉంటుందా అన్న కుతూహలమే ఈ పేజిలోకి తీసుకొచ్సిన్డీ
    చివరి వరకూ చదివించారు… సక్సెస్ఫుల్ గా… :)

  3. సాయి.గోరంట్ల says:

    చిత్రం,మరియు మీ వివరణ రెండూ బాగున్నాయి

మీ మాటలు

*