జ్వలనమే జననం!

 

విజయ్ కోగంటి
***
koganti
ఒక దశ లోంచీ
మరొక దశ లోకి ప్రవేశించాలంటే
అవశేషాల్లేకుండా దహించ బడాల్సిందే
నివురయ్యేలా నిశ్శేషమవాల్సిందే.
అంతరాంతరాలలో
పేరుకున్న
కోరికలను, దాహాలను, అహాలను
దహిస్తూ జ్వలించడం ఒకజననమే!
సుఖమైనా, దుఃఖమైనా జ్వలనమే.
బ్రతుకుపైజరిగే
కుట్రను ఛేదించడమూ జ్వలనమే.
గొంగళిలా బ్రతకడమూ జ్వలనమే.
రంగుపూల రెక్కలు తొడిగి
ఎగిరే స్వేచ్ఛై విస్మయపరచడమూ జ్వలనమే.
జ్వలించడం ఒక పోరాటం,
ఒకరూపాంతరం!
అందుకే, జ్వలిద్దామా?!?
*

మీ మాటలు

 1. నిరంతర జ్వలనం సాగుతున్నది. కవిత బాగున్నది.

 2. lasya priya says:

  అద్భుతంగా ఉంది కవిత ….

 3. బ్రెయిన్ డెడ్ says:

  కాగాడాలేవో మనసు ని ముట్టించినట్లు . బాగుంది .

 4. చందు - తులసి says:

  మనిషి నిరంతరం జ్వలిస్తేనే….కొత్త వెలుగులు చూస్తాడు.. వెలుగు పూవై పూస్తాడు..
  కవిత బావుంది విజయ్ గారూ..

 5. Vijay Koganti says:

  Chandu- Tulasi garu, Thank you!

 6. కోగంటి వారి గంటం చాల వాడి ఐనది. మాటైనా, paatina , పద్యమైన, గద్యమైన..అందంగా అనవద్యంగా అనితర సాధ్యంగా సుందరంగా, సుకుమారంగా, రమ్యంగా, రసవంతంగా, సున్నితంగా, సునిశితంగా, మత్తుగా, మెత్తగా, మనసుకు హత్తుకునేలా చెప్పగల మేటి జగత్జెట్టి మా కోగంటి. అందుకే ఆయనంటే అందరికి చాలా చాలా ఇష్టం, ముద్దు మురిపెం.

మీ మాటలు

*