కవిత్వం luxury కాదు!

 

-నిశీధి 

~

Poetry is not a luxury . కవిత్వం ఎపుడు ఒక విలాసం కాదు . మన ఉనికికి అదో ముఖ్యమయిన ఆధారం ,మనుగడ కలకో ఊతనిచ్చే ఆలోచన ముందు భాష గా మారి మార్పు దిశగా పయనించి ఎప్పటికయినా ఆ కల సాత్కారం అవుతుందన్న నమ్మకమే కవిత్వం అంటారు Audre Lorde. ఎంత నిజం కదా కవిత్వం వైయక్తిక భావనగా మనిషికో ఎదుగుదల చూపినా అసలు ఒక సామాజిక కోణంలో , అణగారిన వర్గాల్లో వాక్యం విలువ ఎంత గొప్పదో . అది ఎన్ని  భయాల అనుభవాలను చెక్కితే  అవధులు లేని ఆశగా మార్పు చెందుతుందో అనుభవించని వాళ్లకి తెలియడం కష్టం .

Audre Lorde (1934–1992)  ఉప్పెనైన కవిత్వానికో పూర్తి చిరునామా . కాబట్టేనేమో ఇంత పదును నిజాలు ఈ రోజు మన మధ్య నిలబడ్డాయి . ఇవి చూడండి “ మనమధ్య తేడాలు కాదుమనల్ని నిజంగా  విడదీస్తుంది  అసలా  తేడాలున్నాయని గుర్తించి సాల్వ్ చేసుకోలేని మన  అశక్తత మనల్ని విడదీస్తుంది .”  అలాగే  “నన్ను నేను నిర్వచించుకోక తప్పదు లేకపోతే జనం వాళ్ళ  కల్పనల్లో నా అస్తిత్వాన్ని సజీవంగా నంచుకొని తింటారు. “ఇదే కాదు  “నా ధైర్యాన్నంతా వాడి శక్తివంతంగా ఉంటూ నాకో విజన్ అంటూ ఏర్పడితే అసలు నాకింకా  భయమేముంది  “ అని చెప్పినా అది తను మాత్రమే అవుతుంది . అలాగే తనని తాను  “ బ్లాక్ , లెస్బియన్ , మదర్ , వారియర్ , పోయెట్ “ గా నిర్వచించుకొనే ఈ రైటర్ సాహిత్యలోకపు కుదుపులు కుదపడమే కాకుండా  , రేసిజం , సెక్సిజం , హోమోఫోబియా ఇలా ప్రతి సామాజిక అన్యాయాన్ని తన చివరి శ్వాస వరకు పోరాడి ఎదురునిలిచింది .

a6

లార్డ్ రాసిన  లవ్ పోయెం ఇంకా  , కోల్ తన కవిత్వాన్ని ఉన్నత స్తాయి కి తీసుకెళ్ళిన మాట నిజమే కాని వ్యక్తిగతంగా  నాకెందుకో తను రాసిన “ పవర్ “ కవితలో మొదటి వాక్యం “  కవిత్వం మరియు వాక్చాతుర్యాన్ని మధ్య వ్యత్యాసం మీ పిల్లల బదులు మీరే  చావడానికి సిద్ధంగా ఉండటం  “ అన్నది అసలు మొత్తం ప్రపంచ సాహిత్యానికే సవాలుగా అనిపిస్తుంది . సేఫ్ గేం  ప్లే చేస్తూ సోయగాల గురించొ సొరకాయ దప్పళం గురించో పద్యాలు రాసుకొనే 99% కవులు రచయితలు తర్వాత తరాలని బలిస్తున్నట్లేగా అనిపిస్తింది. కాని ఎక్కడో మన కలబుర్గీలు , Asharaf Fayadh లు పూర్తిగా  అమ్ముడుపోని లిటరరీ ప్రపంచాన్ని ఇంకా నమ్మగలిగే స్థైర్యాన్ని ఇస్తూనే  ఉంటారు .

అస్థిర పరిస్థితులలో వణుకుతున్న స్వరంలో అయినా అసహనాన్ని చూపుతున్న గుప్పెడు మందిని మందలో రచయితలు సైతం ఇంటాలరేన్సా  అంటే ఏమిటీ అని ప్రశ్నిస్తున్న కాలంలో

 

క్వీన్స్ లో  పదేళ్ళ పిల్లవాడి

రక్తంలో బూట్లు తడుపుకున్న పోలీసు

విచారణలో తన సొంత రక్షణకోసమే బాయినేట్ ఎక్కుపెట్టానని

పరిమాణాలు పరిణామాలు ఏవి చూడలేదు

రంగు మాత్రమే  కనిపించిందని చెప్పాడని

కవిత్వంలో జరుగుతున్న చరిత్రని ,జరిగిన ఎన్నో అన్యాయాలని ఆక్రమణలని భయపడకుండా రాయగలిగిన దమ్ము ఆమె కలానిదే . తన కవిత్వానిదే కదా .

అందుకే ఈసారి మనకోసం మరొక్కసారి power పోయెమ్ .

ad1

 

Power

BY AUDRE LORDE

The difference between poetry and rhetoric

is being ready to kill

yourself

instead of your children.

 

I am trapped on a desert of raw gunshot wounds

and a dead child dragging his shattered black

face off the edge of my sleep

blood from his punctured cheeks and shoulders

is the only liquid for miles

and my stomach

churns at the imagined taste while

my mouth splits into dry lips

without loyalty or reason

thirsting for the wetness of his blood

as it sinks into the whiteness

of the desert where I am lost

without imagery or magic

trying to make power out of hatred and destruction

trying to heal my dying son with kisses

only the sun will bleach his bones quicker.

 

A policeman who shot down a ten year old in Queens

stood over the boy with his cop shoes in childish blood

and a voice said “Die you little motherfucker” and

there are tapes to prove it. At his trial

this policeman said in his own defense

“I didn’t notice the size nor nothing else

only the color”. And

there are tapes to prove that, too.

 

Today that 37 year old white man

with 13 years of police forcing

was set free

by eleven white men who said they were satisfied

justice had been done

and one Black Woman who said

“They convinced me” meaning

they had dragged her 4’10” black Woman’s frame

over the hot coals

of four centuries of white male approval

until she let go

the first real power she ever had

and lined her own womb with cement

to make a graveyard for our children.

 

I have not been able to touch the destruction

within me.

But unless I learn to use

the difference between poetry and rhetoric

my power too will run corrupt as poisonous mold

or lie limp and useless as an unconnected wire

and one day I will take my teenaged plug

and connect it to the nearest socket

raping an 85 year old white woman

who is somebody’s mother

and as I beat her senseless and set a torch to her bed

a greek chorus will be singing in 3/4 time

“Poor thing. She never hurt a soul. What beasts they are.”

 

చివరగా ఇంకో మాట లార్డ్ poems  మిస్ అయినా పర్లేదు కాని కవిత్వం అంటే ఏమిటో ఎందుకో లాంటి ప్రతి ప్రశ్నకి సమాధానం కావాలంటే మాత్రం ఇంటరెస్ట్ ఉన్నవాళ్ళు  తను రాసిన Sister Outsider సాహితీ వ్యాసాలు మాత్రం అసలు మిస్ అవ్వకండి .

*

 

మీ మాటలు

 1. నిత్యా వి says:

  అద్భుతంగా వివరించారు.

 2. ఎప్పుడో ఒకటో రెండో చదివిన జ్ఞాపకం.. మళ్ళీ చదివే పని పెట్టారు .. బాగుంది నిశీధి

 3. Powerful poetry. Powerful intro, as always. Thanks and kudos Nishee.

 4. subhashini says:

  అద్భుతమైన వివరణ .ఇలాంటి కవిత్వాన్ని మాకు పరిచయం చేస్తున్నందుకు, లోపలి ఆలోచనలను సజీవంగా ఉంచుతున్నందుకు థ్యాంక్స్ నిశీ..

 5. Indus Martin says:

  నిశీధి గారు… వందనం. మీ వ్యక్తిత్వానికి దగ్గరగా మాట్లాడిన ఆడర్ లోర్డ్ కవితల్ని పరిచయం చేసినందుకూ, కవిత్వం రాయడం దానికోసం నిలబడడం అంత సునాయసం కాదనే వాస్తవాన్ని ఎత్తి చూపినందుకూ మీకు బోల్డన్ని చప్పట్లు (క్లాప్స్). ‘నరంలేని నాలుక నలభై నాలుగు రకాలుగా తిరగగలదు ‘ అని తమ రచనలద్వారా ప్రూవ్ చేస్తున్న చిన్న పెద్దా కవులందరూ విధిగా తమ సిద్దాంతాల పట్ల అవగాహన మరియూ అంకితభావం కలిగి వుండాలని గుర్తుచేశారు. అలాగే నాన్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ రాసుకుంటూ జీవితాంతం పోగేసుకున్న కవిత్వం దొంతరలతో ఎవరికీ వుపయోగంలేదని, అవి కనీసం వారికి కూడా ఒక పరిచయ వాక్యాలు కానేరవని నేను అర్ధం చేసుకున్నాను.

 6. తిలక్ బొమ్మరాజు says:

  వొక్కోసారి చలించాలి హృదయం నిండుగా.యిటువంటి కవిత్వమో ,కవిత్వ పరిచయమో మనల్ని తట్టి లేపుతుంది.కవిత్వమంటే కేవలం పదాలు మాత్రమే కాదు ..వొక ఆవేదనా, తపనా అనే భావన నిజమేనని తెలుస్తుంది . మంచి పరిచయం.

 7. ఇలాంటివి మరిన్ని కూడా చెప్పి “నిర్వచించుకొనే” దారి చూపండి . ఇంత వెలుగులు చూపిన మీరు నిశీధి ఎలా అవుతారు?

 8. Oh,
  Great Poem.
  But, how misplaced do these words sound today? Look around you Nishee. I can’t say (or not say) that about you as I would never know you. You are conveniently hidden. I really don’t know how many of us are not killing children instead of themselves. And how much of such rhetoric is being peddled as poetry? It is up to you to think. Don’t you guy think it is high time we thought about this vital thing?

 9. “The difference between poetry and rhetoric
  is being ready to kill
  yourself
  instead of your చిల్ద్రెన్”

  Oh,
  Great Poem.
  But, how misplaced do these words sound today? Look around you Nishee. I can’t say (or not say) that about you as I would never know you. You are conveniently hidden. I really don’t know how many of us are not killing children instead of themselves. And how much of such rhetoric is being peddled as poetry? It is up to you to think. Don’t you guys think it is high time we thought about this vital thing?

 10. mohan.ravipati says:

  పవర్ ఫుల్ పోయమ్ . ఆ లైన్స్ ని అంతకన్నా మీ style లో ప్రజంట్ చేసారు

 11. శక్తివంతమైన కవిని కవిత్వాన్ని పరిచయం చేయడానికి ఓ అర్హత ఉండాలనుకుంటా.అది మీరే నిశీమా.. ఇలాంటివి చదివి లోలోపలికి ఇగిరెంతలోనే మాయలో పడిపోయే నాలాంటి వారికి చెంపపెట్టు అనుకుంటా. ధన్యవాదాలు.

మీ మాటలు

*