బుక్కెడు బువ్వ

మీ మాటలు

 1. వనజ తాతినేని says:

  సూపర్బ్ ! మాటల్లేవ్ అంతే !!

  • చందు తులసి says:

   వనజ మేడమ్…మీ స్పందనకు థాంక్యూ…
   నా ఊడలమర్రి నుంచి..మీ స్పందన నాకెప్పుడూ
   కొత్త బలాన్నిస్తుంది.

  • చందు తులసి says:

   అందరి కన్నా ముందు…నా లాంటి కొత్త వాడి కథను ప్రచురించి ప్రోత్సహించిన అఫ్సర్ సార్ కి..
   సారంగ సంపాదక బృందానికి ధన్యవాదాలు..
   కథను ఎలివేట్ చేసేలా చిత్రం గీసిన సృజన్ రాజ్ గారికీ కృతఙ్ఞతలు…
   చందు

 2. చందు - తులసి says:

  థాంక్యూ మేడమ్..మీ ప్రోత్సాహానికి

 3. Phani kumar says:

  బిచ్చగాడి పాత్రతో మతోన్మాదుల చెంపచెళ్లుమనిపించావుగా చందు. అభినందనలు .

  • చందు తులసి says:

   ఫణి సార్ థాంక్యూ సో మచ్..
   నేను రాయగలనని నమ్మకం ఇచ్చి..ప్రోత్సహించిన, సరిదిద్దిన గురువు మీరు.
   ధన్యవాదాలు సార్.

   • humayun sangheer says:

    మిత్రులు చందు తులసి రాసిన కథ బుక్కెడు బువ్వ నేటి కుళ్ళు రాజకీయాలను ఎండగట్టేల వుంది. కేంద్రంలో ఇప్పుడున్న బెజప ప్రభుత్వం కావాలని ఒక వర్గం వారిని టార్గెట్ చేసింది. గొడ్డు కూర తినడం నాటి నుండి సాగుతోంది. ఇందులో ఏదో ఉద్దేశం వుందని వాళ్ళు కొన్ని శక్తులను ఉసిగొల్పుతున్నారు. ఎనీవే మంచి కథ రాసిన రచయితకి అభినందనలు…

   • చందు-తులసి says:

    హుమాయున్ భయ్యా….థాంక్యూ. నీ బూదెవ్వను ఎప్పుడు చూపిస్తావు.

 4. Sharada Sivapurapu says:

  అసలు సమస్యలని పక్కదారి పట్టించే ప్రస్తుత రాజకీయాలకి ఇదొక చక్కని సందేశం. బాగుంది చందు తులసి గారూ

  • చందు తులసి says:

   శారద గారూ. జనాల్ని పక్కదోవ పట్టించడమే పాలకులపని. అనాది కాలం నుంచి. అసలు బాట పట్టించాల్సిన బాధ్యత అందరదీ. మీ స్పందనకు
   ధన్యవాదాలు…

 5. Gagana Seetaa pati says:

  “duniya ka maja le lo duniya tumhari hai
  duniya ko laat maro duniya salam kare
  mud mud salam kare, jhuk jhuk salam kare ”
  గీ శంషాద్ బేగం పాట ఇన్నవా ఎన్నడన్నా ?
  బిచ్చ గాడు కట్టె దీసుకొంగనే ఎట్ల ఉడాయించిన్రో సూసినవా ?
  అరె నాకు జెర సమజ్ గాదు .. కోళ్ళు , బాతులు , మ్యాకలు , పొట్టేళ్ళు , అడవి పందులు , ఊర పందులు , గుర్రాలు , ఒంటెలు , కుక్కలు , ఉడుములు , కాకులు , గద్దలు, పిట్టలు , గాడిదలు, గడ్డి గాదం … సమస్తం దినొచ్చు గాని గీ గొడ్డు కూర తినొద్దంటరు ఏందిరా బై ? సేస్తే … అయింస సెయొద్దని, దోమల , సీమల భీ సంపోద్దని హర్తాళ్ జెయ్యాలె గాని గీ లిటికేసన్ ఏందీ ? ఆయ్!
  ఆవేశం ల రాసినవ్ … తెలుస్తనే ఉంది . గీ డోస్ ఉండాలే తమ్మీ !
  లేకపోతే మాటినరు – ఏమంటావ్ . ఉంటా – గగన సీతాపతి

  • చందు తులసి says:

   నా కథ సారాంశం మూడు ముక్కల్లో చెప్పారు మీరు. అవును ఆవేశంలోనే కథ రాశాను…తమ్మీ అన్నారు . థాంక్యూ అన్నా..

 6. నేరుగా చెప్పాలనుకున్న విషయాన్నిచెప్పారు. ఫోకస్ అటు ఇటు పోలేదు .. అభినందనలు

  • చందు తులసి says:

   సునీల్ సార్.. కథ చదివినందుకూ..
   స్పందించినందుకూ ధన్యవాదాలు..
   మీ థూ కథ ఎన్నిసార్లు చదివానో….

 7. కె.కె. రామయ్య says:

  ఇంటి ముందుకు ముష్టెత్తుకోను వచ్చె దరిద్రులలో నారాయుణిడిని చూడమని బోధించిన సంస్కృతి, జీవనాధారాలైన గంగని, గోవుని మాతగా కొలుచుకున్న సంస్కృతి, కుల మత వర్ణాల కతీతంగా మనిషిని మనిషి ప్రేమించిన సంస్కృతి, మానవత్వానికి మించిన మతం లేదని బోదించిన సంస్కృతి … నేడిలాంటి వికృత రూపాల్లో, కృతక విలువల్లో కూరుకు పోయి ఉండటం ‘బుక్కెడు బువ్వ’ కధ ద్వారా చూపిన చందు తులసి గారు సిగ్గుతో తలవంచుకుంటున్నాను.

  “గొడ్డుకూర తినడానికి ధైర్నమెందుకు సామె…? ఆకలైతే సాలదా..?“ అన్న బిచ్చగాని ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలి (క్షుదార్తుల కవసరమైన దానికెన్నో రెట్లు ధాన్యం ప్రభుత్వ ధాన్య గిడ్డంగుల్లో రాటన్ అయిపోతున్నదని, జాతీయ సంపదలోని ఏ కొంచం శాతమైనా అట్టడుగు వర్గాల శ్రేయస్సుకు చేరుకుంటే పరిస్తితులింకెంతో మెరుగ్గా ఉంటాయని వాడికి చెప్పే ధైర్యం ఎవరికుంది. మన డర్ట్ చీప్ లేబర్ ని సరిగా వాడుకుంటే దేశం మరెంతో పురోగతి సాధిస్తుందని మనకు నోబెల్ లారేట్ అమర్త్యసేన్ వచ్చి చెప్పే దాకా తెలియకనా ).

  జాతి పునర్నిర్మాణంలో ఇంకా ఎన్నెన్ని అసమానతలు, అమానుషాలు, ఎంతెంత అస్తవ్యస్తాలు. మన ప్రవచనాలు ఎంతెంత ఉన్నతాలు, మన ఆచరణలు ఎంతెంత స్వార్ధపూరితాలు. గొరుసన్న దారిలో నడుస్తున్న చందుతులసి గారు కృతజ్ఞతాపూర్వక వొందనాలు.

  • చందు తులసి says:

   రామయ్య గారూ ముందుగా మీకు కథ నచ్చినందుకు ..స్పందించినందుకూ ధన్యవాదములు.
   మీరన్నట్లే గొప్ప సంస్కృతి మనది…ప్రపంచానికి అహింసను..శాంతిని చూపిన దేశం మనది.
   కానీ ఇవాళ బుక్కెడు బువ్వ చుట్టూ…రాజకీయాలు. ప్రవచనాలు, ఆచరణ ఒక్కటి కావాలని కోరుకుందాం.
   అన్నట్టు గొరుసన్నకు కథ నచ్చిందో లేదో…..మనిషి జాడలేడు….

 8. ముగింపు ఎలా ఉంటుందా అని గబ గబ చదివేసాను.
  నిజం చెప్పాలంటే షాక్ …

  • చందు తులసి says:

   దత్తమాల గారు ధన్యవాదాలు. అవును మేడం మన కథల కన్నా బయట జరిగేవి ఇంకా షాక్ కలిగిస్తున్నాయి. దేశమంతా అదే షాక్ లో ఉందండి.

 9. typical pseudo intellectual story. why only beef. why not pork. people of your kind should open pork joints all over india. yes you can sell beef meat also there.

  • చందు తులసి says:

   అనన్య గారూ..మీ స్పందనకు ధన్యవాదాలు. మొదట ఈ కథ ఆవు మాంసం గురించి కన్నా బుక్కెడు బువ్వ గురించి రాసినదండీ..

   ఇక ఆవు గురించే ఎందుకూ…పంది మాంసం గురించి రాయరెందుకన్నారూ..అది ఆవు మాంసమా పంది మాంసమా అని కాదండీ. ఒక వ్యక్తి తనకిష్టమైనది తింటే…అవతలి వ్యక్తికీ లేదా రాజ్యానికి తినొద్దని చెప్పే నైతిక హక్కు ఉందా…?

   మీరన్నట్లే పంది మాంసం తినే వాళ్లే కాదు, ఎలుకలు, పిల్లులు , కప్పలూ, పాములు, కుక్కలూ తినేవాళ్లూ ఉన్నారు.
   ఇక పంది మాంసం తినని వాళ్లున్నారు…కానీ తినొద్దు అనే వాళ్లున్నారా…? అలా ఎవరైనా అంటే ఎవరైనా వ్యతిరేకించాల్సిందే…
   మంచి చర్చకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు…

  • అనన్య గారు, పంది ముస్లింలకి పవిత్రం కాదు, అది మురికి జంతువు. ఇస్లామిక్ షరియా ప్రకారం ఎవడైనా పందిని ముట్టుకుంటే వాడు స్నానం చేసి, తన బట్టల్ని శుభ్రంగా ఉతుక్కోవాలి. పందిని చంపడం నిషిద్ధం కాదు. విగ్రహారాధకులు పంది మాంసం తింటే ముస్లింలు అభ్యంతరం చెప్పరు.

   • చందు తులసి says:

    ప్రవీణ్ గారూ…చాలా మంది ఆవు కు పందికి ముడిపెడుతుంటారు…కానీ అసలు వాటికీ సమస్యకు సంబంధం లేదు కదా…

    పందిని వాళ్లు తినరు…అంతే కానీ వద్దనరు కదా…మీ పాయింట్ విలువైనది…

   • ముస్లింలు clean animals యొక్క మాంసం తింటారు. ఆవు, గేదె, మేక, గొర్రె clean animals కనుక వాటి మాంసం ముస్లింలకి నిషిద్ధం కాదు. కుక్క, పంది, పిల్లి, సింహం unclean animals. వాటి మాంసం ముస్లింలు తినరు. Unclean animalsని చంపకూడదనే రూల్ లేదు కానీ చచ్చిన జంతువుని ముట్టినవాడు తన బట్టలు శుభ్రంగా ఉతుక్కోవాలి. బట్టలు ఉతుక్కున్న తరువాత కూడా అతను ఆ రోజు uncleanగానే పరిగణించబడతాడు.

   • Srinivas Vuruputuri says:

    చందు-తులసిగారు అన్నట్లు నిజంగా ఆవు vs. పంది చర్చ అనవసరం! ఎవరి నమ్మకాలు వారివి. ఇక్కడ ప్రశ్న ఒక్కటే – రాజ్యమో, బలవంతులైన వారో ఇలాంటి నిషేధాలను అమలు చేయవచ్చునా లేదా అన్నదే.

    ఈ కింద రాసిందంతా ఉత్తి టైమ్ వేస్ట్ విషయం. :)

    ప్రవీణ్ గారూ, పందిని మురికి జంతువుగా ఎందుకు పరిగణిస్తారా అని చూసాను – చారిత్రికమైన కారణాలేమీ కనబడలేదు. ఖురాన్ వాక్యాలు తప్ప (2.173). బహుశా యూదు మతంలో ఉంటాయేమో ఆ Taboo మూలాలు. సైన్సు ప్రకారం కూడా పోర్క్ అనారోగ్యకరం అన్న వాదన కూడా చూసాను కానీ అది పాత ఆచారానికి ఇటీవలి సమర్థన అనుకుంటాను.

    పాక్-నాపాక్, హలాల్-హరామ్, జాయిజ్-నాజాయిజ్ గురించి బోలెడు ఫత్వాలు ఉంటాయట. సైంటిఫిక్ అనాలిసిస్ కన్నా మత గ్రంథాల, పండితాభిప్రాయాల ఉటంకింపులకే ప్రామాణికత హెచ్చట! ఓపికా, ఉత్సాహమూ ఉంటే అరుణ్ శౌరి రాసిన ది వరల్డ్ ఆఫ్ ఫత్వాస్ చూడండి.

    ఏది క్లీన్, ఏది కాదు అనే విషయంలో కూడా ఎవరి నోషన్స్ వారివి అని చెప్పటం నా ఉద్దేశం. అన్నీ సైంటిఫిక్^గా కరెక్ట్ కాకపోవచ్చును, అది వేరే విషయం.

 10. VELDANDI SRIDHAR says:

  ” గొడ్డు కూర తినడానికి ధైర్నమెందుకు సామె…? ఆకలైతే సాలదా..? ఐనా మీరు అడ్డుకోవాలంటే ఆ గొడ్డు కూరతో కోట్ల రూపాయల యాపారం చేసే వాళ్లను అడ్డుకోండి. ఆకలికి కడుపు నింపుకుంటున్న నన్ను అడ్డుకుంటే ఏ లాభం…? చాలా ఎఫెక్టివ్ గా చెప్పారు చందుగారు అభినందనలు…

  • చందు తులసి says:

   శ్రీధర్ సార్.. థాంక్యూ
   – నిజమే సార్..ఏదైనా నచ్చింది తినడానికి ధైర్యమెందుకూ…ఆకలి చాలు కదా?
   తిండి పెట్టని వానికి వద్దనే హక్కెక్కడిదీ…?

 11. -డా.ప‌సునూరి రవీంద‌ర్‌ says:

  చందు తుల‌సిగారు మీ క‌థ చాలా ఆలోచ‌నాత్మ‌కంగా ఉంది.
  ముఖ్యంగా మీ క‌థ‌ల్లో బ‌ల‌హీనుల తిరుగుబాటు బాగుంటుంది. ఐ లైక్ ఇట్‌.
  ప్ర‌స్తుతం దేశంలో జ‌రుగుతున్న అస‌హ‌న దుర్మార్గాల‌పై సంధించిన అస్ర్తం మీ క‌థ‌.
  బీఫ్ మీద ఎద‌వ ఏషాలేసే ఏ నాయ‌కుడి గ‌తైనా ఏమ‌వుతుందో… అటు బీహార్ ప్ర‌జ‌లు, ఇటు మీరు భ‌లే బుద్ధిచెప్పారు.
  కంగ్రాట్స్ మీకు, ధ‌న్య‌వాదాలు సారంగ టీంకి…!!
  -డా.ప‌సునూరి రవీంద‌ర్‌

  • చందు తులసి says:

   అన్నా…నీ ఆత్మీయ స్పందనకు థాంక్యూ….
   నీ కథలు మల్ల మల్ల చదువుకున్న అనుభవం నాది. మేధావులే కాదు. మన పోరగాళ్లం గిట్ట కథలు రాయొచ్చని ..స్ఫూర్తి ఇచ్చినవ్ కద నువ్.

   – బలహీనుడు ఆఖరికి చేసేది తిరుగుబాటే కద..
   నోటి కాడ బువ్వ లాక్కుంటే ఎవలెకైనా.. కడుపుమండుతది కదా..
   నీ క్కూడా కంగ్రాట్స్…

 12. Katha baavundi Chandu Tulasi Garu.
  Mugimpu shockingaa vunna baavundi.
  Beef godava meeda English medialo chala spandana vachindi, mukyangaa cartoonlalo. Mana Telugu cartoonistulu inkaa appadala karranu vadalledu!

  • చందు తులసి says:

   మోహన్ సార్…ధన్యవాదాలు..
   మొదట నేను కూడా ముగింపులో….తిరుగుబాటు ఊహించలేదు. కానీ జరిగేది రాయడంతో పాటూ…ఏం జరిగితే బాగుంటుందో రాయాలనిపించింది సార్.
   అవును మన దగ్గర పొలిటికల్ కార్టూన్ లు తక్కువ. ఏదో ఒక దినపత్రిక కోసం తప్ప …సొంతంగా వేసే వాళ్లు తగ్గిపోయారు.. వేసినా…
   పత్రికల యాజమాన్యాలు ప్రచురించడం కష్టం. ఎవరైనా ధైర్యం చేసి వేసినా….మాటల దాడులు, కేసులు… ఎందుకీ గొడవ అనుకుని హాయిగా అప్పడాలు…డాక్టరు నర్సు..లాంటివి వేస్తున్నారు. ఎవరిదీ తప్పులేదు….

 13. కె.కె. రామయ్య says:

  అన్న్నియ్య గారు, చందు తులసి లాంటి వర్ధమాన ప్రతిభావంతులైన రచయితని కలంతో పోరు చెయ్యనివ్వండి. పంది మాంసం, గొడ్డు మాంసం అమ్మే జాయింట్లను నడిపేవాళ్లకు మన దేశంలో కొరవలేదు కదా, మళ్లీ తనెందుకు. దారిద్య నిర్మూలనం, ఆహార సమస్య తీర్చటం, కనీస మౌలిక వసతులు కల్పించటం, ప్రజలకు జీవనోపాధి చూపింటం లాంటి విషయాలపై మీరు పాలక ప్రబువులకి సలహాలు, సూచనలు ఇస్తే వినాలని ఉంది. విదేశీయుల పాలనలో జరిగిన దోపిడి కన్నా ఎన్నోరెట్లు ఎక్కువగా స్వదేశీయుల పాలనలో జరుగుతున్నదోపిడిని, అవినీతిని ( Plundering of National Wealth )ని ప్రశ్నించండి. ఇవేవీ ముఖ్యమైన విషయాలు కానట్లు మతం, చాందస ఆచారాలు మాత్రమే ముఖ్యమైనట్లు, బలవంతంగా వాటిని అందరిపై రుద్దాలని చెలరేగుతున్న వాళ్లని ప్రశ్నించండి.

 14. చందు - తులసి says:

  రామయ్య గారు..విలువైన …అవసరమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలని అందరం గౌరవిద్దాము. లోపాలుంటే మనమే సరిదిద్దుకుందాము. వైవిధ్యమైన సంస్కృతి, భిన్నత్వం లో ఏకత్వం అంటే….అందరి అభిప్రాయాలకూ విలువివ్వడమే కదా..?

 15. v. shanti prabodha says:

  ప్రస్తుత సామాజిక పరిస్థితికి అద్దం పట్టిన కథ, అవసరమైన కథ చందు తులసి గారు. బుక్కెడు బువ్వ కోసం ఆరాటపడే బిచ్చగాడు చివరికి ఎం చేస్తాడని ఆత్రుతగా చదివా . మంచి ముగింపు ఇచ్చారు. చాలా సహజంగా సాగిపోయింది కథనం. మంచి కథ అందించినందుకు అభినందనలు.

  • చందు తులసి says:

   శాంతి ప్రబోధ గారు ధన్యవాదాలు. అందరమూ ఆరాట పడేది బుక్కెడు బువ్వ కోసమే కదండీ.
   ముగింపు నచ్చినందుకు …స్పందించినందుకూ
   థాంక్యూ.

 16. నీహారిక says:

  ఎపుడు చూసినా ఆర్ట్ సినిమాల్లో లాగా బీదరికాన్ని రొమాంటిసైజ్ చేయకుండా అడుక్కోవడం తప్పని ఏ ఒక్కరూ చెప్పరేంటి ?
  కాళ్ళు చేతులూ తిన్నగా ఉన్నవాళ్ళు బ్రతకడానికి బోళెడన్ని దారులున్నాయి. స్వతంత్ర్యంవచ్చినా బానిసబ్రతుకు బ్రతకడానికి కారణం రాజకీయ నాయకులు మాత్రం కాదు.

  • చందు తులసి says:

   అవును నీహారిక గారూ. పేదరికానికి కారణం కేవలం రాజకీయ నాయకులు కాకపోవచ్చు..
   కానీ పేదరికాన్ని రూపుమాపాల్సిన బాధ్యత మాత్రం..నాయకులదే.
   అడుక్కోవడం సామాజిక స్థాయిలో తప్పే కావచ్చు…కానీ వ్యక్తిగతంగా అది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి కదండీ. కథ చదివినందుకూ…
   మీ స్పందనకు ధన్యవాదాలు మేడమ్.

 17. బావుంది. చందు తులసి గారు. అభినందనలు.

  • చందు తులసి says:

   తిరుపాలు గారూ..
   ఎన్నాళ్లకెన్నాళ్లకు..పునర్దర్శనం. వి శేఖర్ గారి బ్లాగులో చాలా సీరియస్ గా రాజకీయాలు చర్చించేవాళ్లం. ఇప్పుడిలా కథల దగ్గర కలిసాం.
   మీ స్పందనకు ధన్యవాదాలు..

 18. బిచ్చగాడి పాత్ర కాస్త అసహజంగా అనిపిస్తున్నా… మీరు ఆకలినీ, అసహనాన్ని కలగలిపి కథని తీరం దాటించిన తీరు ఆ లోటును లెక్కలోకి రానివ్వడం లేదు. ఆకలితో ఉన్న వాడికి బుక్కెడు బువ్వ పెట్టలేని వారికి ఏ ఆహారం తినాలి అని నిర్దేశించే హక్కు ఎప్పుడూ ఉండదన్న లైన్‌ని విస్పష్టంగా చెప్పారు. హిందుత్వ పాలన మొదలయ్యాక విభజన భావజాలం ఎంతగా పెరిగిపోయిందంటే.. సమూహాలుగా పనిచేసే ప్రదేశాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. దేశభక్తినీ, సంప్రదాయాలనీ ప్రమాదకరమైన కోణంలో ప్రచారం చేసేవారు పెరిగిపోయారు. ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్న వారిని శత్రువులుగా, దేశ ద్రోహులుగా ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి స్నేహితుల్ని కూడా ఈ ఉగ్రవాదం శత్రువులుగా మార్చేస్తోంది. మనిషితనం కంటే మతమే మిన్నగా భావించే వారిని ఇప్పుడు ఎటు చూసినా చూస్తున్నాం. ఇలాంటి ఘర్షణాత్మక వాతావరణంలో ఆకలిని మతాన్ని ముడిపెట్టి రాసిన తీరు అభినందనీయం. ఆలోచింపజేసే కథలు మరిన్ని రావాలి. సాహితీకారులే కాకుండా సామాన్యులు కూడా చర్చించే కథల్ని రాయాలి. మత అసహనం ఎంతటి ప్రమాదకరమో చెప్పే చర్చ బలంగా జరగాలని కోరుకుంటున్నాను. మీ నుంచి మరిన్ని మంచి కథలు వస్తాయని ఆశిస్తూ అభినందనలు.

 19. చందు - తులసి says:

  సీరియస్ అంశం కావడంతో…బిచ్చగాడు కూడా కొంత అతిగా మాట్లాడించానండీ…
  ఏమో బిచ్చగానికి మాత్రం తెలివి లేదని అనగలమా… అందునా నోటికాడి బువ్వ లాక్కుంటే…‌పసిపిల్లలు కూడా అలాగే స్పందిస్తారేమో. అవును మతవిద్వేషం వల్ల స్నేహాలూ చెడిపోయాయి. కానీ కేవలం మన అభిప్రాయం వేరైనంత మాత్రాన మనల్ని ద్వేషించేవారి స్నేహం అవసరమా చెప్పండి..?
  మీ స్పందనకు ధన్యవాదాలు.

 20. తహిరో says:

  చందు తులసి గారికి నమస్కారాలు .
  మీ “బుక్కెడు బువ్వ ” కథ బాగుంది, బాగాలేదు అనేది పక్కన పెడదాం.
  ఇది శిల్ప ప్రధానమైన కథ కాదు. వస్తు ప్రధానమైన కథ. ప్రస్తుతం దేశంలో రగులుతున్న ఒక సమస్యను మీ కోణం నుండి ఆవిష్కరిస్తూ అక్షరబద్ధం చేశారు. బిచ్చగాళ్ళు అడుక్కోవాలో వద్దో అని చెప్పడానికి కూడా ఇది సందర్భం కాదు. కేవలం విషయ విస్ఫోటనం.
  అయితే మీ కథ కరుడుగట్టిన మతోన్మాదుల్లో మార్పు తెస్తుందా ? లేక వాళ్ళలో ఇప్పటికే ఉన్న అగ్నికి ఆజ్యం పోస్తుందా అన్నది పాయింట్. ఏ మార్పు ఆశించి కథ రాసారు? చివరలో మీరు చెప్పినట్టు బిచ్చగాడి తిరుగుబాటే పరిష్కారం అంటారా ? తిరుగుబాటు చేయగానే వాళ్ళు తోక ముడుస్తారా – లేక దాడి చేయడానికి పొంచి ఉంటారా ? మరి సామరస్యంగా ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ? ఎలా చేస్తే సద్దు మణుగుతుంది?
  కంచె చేనును మేస్తున్న సందర్భం ఇది – చేను బతకాలి అంటే కంచెను మార్చాలి తప్ప మరో పరిష్కారం లేదనుకుంటా – ఏమంటారు ?

 21. చందు - తులసి says:

  తహిరో గారికి నమస్కారం.,…….
  మీ స్పందనకు ధన్యవాదాలు…..
  ఏదో ఆశించి కథ రాయం కదా. మరీ కథ చదివి …
  పాఠకుడు వెంటనే మారిపోవాలి అని అనుకోము కదా..ఒక అంశం మీద మంచి చర్చ జరిగితే చాలు అనుకున్నాను.
  తిరుగుబాటు చేయడమంటే కట్టెలు తుపాకులతోనే కాదు.. బ్యాలెట్ తో కూడా చేయొచ్చు. దాని రుచి ఏమిటో బీహార్ లో తెలిసింది లెండి వాళ్లకు…
  మీరన్న కంచెను మార్చడమూ త్వరలోనే జరగాలని కోరుకుందాము.
  మీ స్పందనకు ధన్యవాదాలు.

 22. Excellent
  Proceed సర్.

 23. చందు - తులసి says:

  ధన్యవాదాలు స్టీఫెన్ గారూ..

 24. కథ వ్రాసిన విధానం బావుంది. కొంచం సెంటిమెంటల్ సినిమా చూసినట్లుంది. కథా వస్తువు చూస్తే పైన ఎవరో చెప్పినట్లు కాళ్ళు చేతులు బానే ఉన్నవాళ్లు అడుక్కోవడం ఏంటి ? అన్ని ఉచితం గానే చేసేయాలి దేశం. మరి దేశానికీ వీళ్ళు ఏం చేస్తారో మాత్రం ఎప్పుడు అర్థం కాని విషయం. వీళ్ళు ఏం చేయలేరనే తెలిసే ఆ ప్రధాన మంత్రి గారు విదేశాలలో భవతి భిక్షాం దేహి అంటున్నారు. ప్రస్తుత సామాజికి పరిస్థితి బట్టి కథ వ్రాసి ఉంటే ఆవు మాంసం జరగాల్సిన ఇంత చర్చ విషయమా అసలు ? అది తినేస్తే ఇంకా దేశ సమస్యలన్నీ సమసి పోతాయా ? మీరు ప్రస్తుత సామాజికి పరిస్థితి చూసి ఇలా కథలు వ్రాసి దేశాన్ని చాలా ఉద్దరించాను అనుకుంటే చాలా పొరబాటు. RSS మనుషులుని హిందుత్వం పేరుతో రెచ్చగొట్టుతోంది.రాజకీయలతో సంబంధం లేని నా లాంటి మనుషుల మనోభావాలు public domain లో మీకథలతో కించపరుస్తున్నారు.వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఆ తేడా తెల్సుకోవలసిన అవసరం అందరికి ఉంది. విశిదీకరించండి మరి.

  • చందు తులసి says:

   చంద్రిక గారు…మొదట నేను మీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. చాలా మంది ఈ కథ చదివి ఫోన్ మెసేజ్ పెట్టారు కానీ..ఇక్కడ రాయలేదు. కారణం ఏమిటో అందరికీ తెలుసు. కానీ తాము నమ్మింది చెప్పాలనుకున్నది..కూడా స్నేచ్చగా చెప్పటానికి వెనుకంజ ( భయపడుతున్నారు కూడా నేమో..) వేస్తున్నారు.
   కానీ మీకు నచ్చకున్నా…మీ అభిప్రాయం చెప్పారు. అదే కదా ప్రజాస్వామ్యం.
   నాకు తెలిసీ నేను ఎవరినీ ..ఎవరి మనోభావాలని కించపరచలేదు మేడమ్.. తెలీక చేస్తే సారీ చెప్నాపడానికి… తప్పుదిద్దుకోవడానికి నేను సదా సిద్ధం.
   ఇక ఈ కథలో అసలు అంశం..బీఫ్ కాదండీ….
   బువ్వ. ఎవరి తిండి వాళ్లు తింటారు… వద్దనే హక్కు ఎవరికైనా ఎలా ఉంటుందండీ….?
   ఆవును ఇవాళ కొత్తగా తినడం లేదండీ…కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నదే..మరి ఇవాళే ఎందుకు గొడవ అవుతోంది..? మీకు అభ్యంతరం ఎప్పుడు ఉండాలంటే…అందరూ తినాల్సిందే అని ఎవరైనా బలవంతం చేస్తే…
   కానీ వేల సంవత్సరాలుగా తింటున్నట్టే ఇవాళ కూడా తింటున్నారు కదా.. మరి వాళ్లని తినొద్దు అని చెప్పడం..ఆఖరికి చంపడం న్యాయమేనా.‌?
   ….ఆవును పూజిద్దాం…ఎద్దునూ పూజిద్దాము ..మనిషి పురోగతికి సాయపడే ప్రతి పురుగునూ పూజిద్గాం. అంతకన్నా ముందు…ఎదుటి మనిషి అభిప్రాయాలనీ…ఆకలినీ గౌరవిద్దాము..
   మీ విలువైన స్పందనకు ధన్యవాదాలు…

   • నేను పూజించే ఆవును తింటారని తెలుసు నాకు కూడా. కానీ అదే కథా వస్తువయి మాటి మాటికి అవే కథలు వస్తుంటే నా మనోభావాలు దెబ్బతినటం కాకపోతే ఏంటి మరి!! పైన వ్యాఖ్య లో ఎవరో కథ చదవగానే వెంటనే pork గురించి మాట్లాడారు. అంటే నువ్వలా మాట్లాడితే నేను ఇలా మాట్లాడతాను అనటం. అంటే మీ కథా వస్తువు రెచ్చగొట్టే విధం గానే ఉందన్నమాటే కదా!! మనుషుల్ని రెచ్చగోడ్తే సమస్య తీరిపోతుందా ? ఎవరి తిండి వారిదే. ఆవు పూజ వస్తువు అని పక్కన పెట్టేద్దాం. ఆవు మాంసం పోషక ఆహారం కాబట్టి తింటాము అని ఉద్యమం కాదు చేయాల్సింది ఇంట్లోనే కూరలు పెంచుకునేందుకు వసతి సదుపాయం కల్పించమనో లేక కుటుంబానికి ఒక నాలుగు కోళ్ళు ఇవ్వమనో ఉద్యమం చేయండి. ఉచితం గా కాదు సబ్సిడీ మీదే!! అటువంటి ఉద్యమం మీద మీలాంటి వారు కథా వస్తువు తీసుకుని కథ వ్రాయచ్చు కదా!! అమెరికా లో ఇంట్లో కూరలు పండించుకోడానికి స్థలం లేకపోతే ప్రభుత్వం స్థలం అద్దెకి ఇస్తుంది కొన్ని ఊర్లల్లో అని విన్నాను. అది ఒక permanent food source అవుతుంది ఒక కుటుంబానికి. ఒక ఆవు ని చంపి తింటే వెంటనే పది ఆవులు పెంచగలమా? కూరలు కోళ్ళు పెంచడం కష్టం అయితే ఆవుని తినడం సులభం కానీ పెంచడం కష్టం మరి!! ఈ రోజు ఆవులు ఉన్నాయి కాబట్టి తింటాం అని గోల పెడ్తున్నారు. అవి అంతరించి పోయాక మరి ఏం చేస్తారు? ఎగుమతి చేసేంత గా ఉంది అంటే అవి ఇప్పటికే అంతరించి పోయి ఉండాలి. దేశం లో ఇలాంటి ఉద్యమాలు కాదు కావాల్సింది. రోజు కూలి చేసే వాడికి మద్యం కొట్టులు లో ప్రవేశించే అర్హత ఉండకూడదని ఉద్యమం చేయండి. ఉద్యమాలు చేసి సినిమా హీరోల కొడుకులు, మేనల్లుడులు, మనవళ్ళ వెకిలి సినిమాలు చూడటం ఆపించండి యువత తో. అందరూ చేనేత వస్త్రాలే ధరించాలి అని చెప్పండి మీ కథలతో !! చైనా బొమ్మలు కొనడం మానేసి కొండపల్లి, నిర్మల్ లాంటివి కొనమని చెప్పండి!! ఎన్ని కళలు ఉన్న మన దేశం లో ఓనమాలు సినిమా లో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్లు బియ్యం అంటే బాగుల్లో వస్తాయని, పాలంటే పాకెట్ల లో ఉంటాయని అనుకుంటారు కొన్ని రోజులకి. ఆకలి తీరడానికి మనిషి ఆలోచించాలే కానీ వేయి మార్గాలు. ఆవు మాంసం కాదు ఒక్కటే సమస్య అయినట్లు చదువుకున్న వారు మాట్లాడటం చాలా విచారకరం!! ఇంత మంది మీ కథ చదివారు మీకు మెసేజ్ లు ఇస్తున్నారంటే మీకు కథ వ్రాసే కళ ఉన్నట్లే కదా !! కాబట్టి మీరు దేశ సమాజం ని దృష్టి ని పెట్టుకుని కథలు వ్రాసి RSS కి మీకు తేడా ఉంది అని రుజువు చేసుకోండి.

 25. చందు - తులసి says:

  చంద్రిక గారూ..మీ లాగా ప్రజాస్వామ్యికంగా చర్చించేవారుంటే…విషయం ఇక్కడిదాకా వచ్చేది కాదండీ..
  మీరు చాలా విలువైన సూచనలు చేశారు …..నాకు చేతనైనవి పాటిస్తాను. నలుగురికీ చెబుతాను.
  అలాగే నా ఉద్దేశం రెచ్చగొట్టడం కాదండీ…
  ఎవరికైనా ఫలానాది తినొద్దు..అనే నైతిక హక్కు ఉందా…? అనే
  అలాగే మీరు రాసే తీరు బాగుంది. మీరు కూడా వీలైనంత ఎక్కువగా రాయండి..
  ధన్యవాదములు…

  • చంద్రిక గారు,

   మీ కామెంట్ చాల బాగుంది.

   నిజంగా పేద వాళ్ళు తాగకుండ చట్టం వుంటే ఎంత బావుండు
   అదొక్కటే కాదు. ఇలాంటివి ఎన్నో వున్నాయి.
   ఈ బీఫ్ మీద చేసిన గోలలో పదో శాతం ఇలాంటి వాటి మీద చేస్తే ఎంత bavuntundi ( చేయకూడదు అని నేను అనడం లేదు కానీ దాని కన్నా ముఖ్యమైనవి ఎన్నో వున్నాయి)
   1) అవినీతి : కేవలం రాజకీయ నాయకులూ చేసే అవినీతి కాదు. Govt ఎంప్లాయిస్ చేస్తే అవినీతి తగ్గిన చాలు.
   మరి దీని గురించి ఎందుకు మాట్లాడారు. 43% fitment సాదించే ఉద్యోగ సంఘాలు అవినీతి గురించి మాట్లాడవు.
   వాళ్ళు Votebank కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏమి చెయ్యవు. అవినీతి ఖండించే ఒక్క ఉద్యోగ సంఘం లేదు.
   ఎమైనా అంటే మేమే తింటున్నామ ? వాళ్ళు veellu తింటున్నారు అంటారు.
   2) వర్క్ కల్చర్ : ఎంత మంది Govt ఎంప్లాయిస్ పని చేస్తున్నారు సక్రమంగా ? ఒక 30% చేస్తారేమో ? మిగిలిన వాళ్ళు కేవలం జీతం కోసం వుంటారు. ఎమైన అంటే రాజకీయాలు వున్నాయి, వనరులు బాలేవు అంటారు. వున్నదంట్లో ఎమన్నా చేస్తారా అంటే ఏమి లేదు. Govt హాస్పిటల్స్ చెత్తగా ఉండడానికి అంత Govt కారణం కాదు. ఈ ఎంప్లాయిస్ 50% కారణం.
   ఏమి చేసిన వుద్యోగం పోదు అనే అహంకారం. మరి దీని మీద ఎవ్వరు పోరాటం చేయ్యరెందుకు? పని కోసం వచ్చే వాళ్ళని హీనంగా చూడడం వీళ్ళ జన్మహక్కు. వెళ్ళాను ఏమి చెయ్యలేము.

 26. కథ బాగానే ఉంది. మన దేశంలో రేప్‌లు చేసేవాళ్ళు ఉండొచ్చు, మర్దర్‌లు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఆవు మాంసం తినేవాళ్ళు మాత్రం ఉండకూడదు! Subjectivism kills objectivism!

 27. చందు - తులసి says:

  ధన్యవాదములు ప్రవీణ్ కుమార్ గారు..
  .ఎవరి జీవితం వారిది…ఎవరి బతుకు వాళ్లది
  అందరికీ బతుకే హక్కు ఉందని గుర్తిస్తే చాలు…

  • మత పెద్దలు చెప్పేవి సాధారణ జనానికి అర్థం కావు. “జీవ హింస మహాపాపం” అని చెపితే, “దేవునికి పూజ చేసే రోజు జీవ హింస చెయ్యకూడదు” అనుకుని శని, సోమ & గురు వారాలనాడే మాంసం మానేస్తారు తప్ప జీవ హింస పాపం అని నిజంగా అనుకోరు. “గోహత్య చెయ్యకూడదు” అని చెపితే, “మర్దర్‌లూ, రేప్‌లూ చెయ్యడం కంటే గోహత్య చెయ్యడం మహాపాపం” అని నమ్మేవాళ్ళని చూస్తున్నాం కదా.

   • చందు - తులసి says:

    అవును ప్రవీణ్ గారూ..ఒక రోజు మాంసం తినొచ్చు..కానీ ఇంకొకరోజు తినకూడదు అనడం ఎలా సమంజసం..? దీని వెనుక శాస్త్రీయ కారణం ఎవరైనా చెబితే బాగుండు…

   • వాళ్ళ నమ్మకం ప్రకారం శనివారం నాడు మాంసం ముడితే వెంకటేశ్వర స్వామికి అపచారం అట, సోమవారం నాడు మాంసం ముడితే శివునికి అపచారం అట, గురువారం నాడు మాంసం ముడితే సాయిబాబాకి అపచారం అట! దేవుడు అనే పదార్థమే ఉనికిలో లేదు. ఉనికిలో లేని పదార్థాల పేర్లు చెప్పి ఆహార నియమాలు ఒకటి!

 28. Excellent babai
  Adiripoindi

  Inthakanna matalu ravatledu

  Keep it up

 29. చందు - తులసి says:

  థాంక్యూ …..ఆర్.కే. మీ స్పందనకు ధన్యవాదాలు.

 30. చందు తులసి గార్లకు
  ఎదుటివారికి మన గొడుగు మొనతాకనంతవరకు మన గొడుగుని ఓగించుకుంటు తిరిగే స్వాతన్త్రమున్నది అన్నది ఒక చక్కటి ప్రజాస్వామ్య విధానానికి ఉదాహరణ.
  అలాగే తినేది తినగలిగినది తినే హక్కు, అలాగే చేసేది చెయ్యగలిగినది చెయ్యడానికి హక్కు అందరికి ఉండాలి ఉంటుంది కూడా.
  కాని మనం చేస్తున్నది ఇంకొకరికి ఇబ్బందికలుగుతున్నది అంటె వారి మనోభావాలని పరిగణలో తీసుకు కాసింత అర్ధంచేసుకు ఉండడం తప్పుకాదేమో అదీ భారతదేశం లాంటి దేశం లో కాస్త ఆలోచించండి
  పందిని తిని కొందరిని ఆవుని తిని మరికొందరిని దానికి అక్కరలేని ప్రాచుర్యమిచ్చి అందరిని ఎందుకు బాధించడం ఏ లాభం కోసం ?

 31. చందు - తులసి says:

  జి.బి. శాస్త్రి ..గారూ..మీ వాదనతో నేను ఏకీభవిస్తున్నాను…
  కానీ ఎవరి గొడుగు ఎవరికి తగులుతుందో….ఎవరి మీద దాడులు జరుగుతున్నాయో….దిన పత్రికల్లో చూస్తున్నాం కదా….
  వందల సంవత్సరాలుగా..ఒకరి మనోభావాలని ఒకరు గౌరవించుకునే జీవిస్తున్నాం కదా. ఎన్నడూ ఎవరి మనోభావాలని కించపరచలేదు కదా….
  మరి ఒక్కసారిగా…వాతావారణం ఎందుకు మారిపోయింది..? తినే వారి వల్లనా….వద్దనే వారి వల్లనా…?
  మీ స్పందనకు ధన్యవాదాలు…

 32. చందు - తులసి says:

  శాస్త్రి గారూ…మీ వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ జీవిస్తే ఈ గొడవ ఉండేది కాదు…సార్.
  ఎవరి గొడుగు ఎవరికి తగులుతుందో చెప్పండి..
  వేల సంవత్సరాలుగా ఒకరిని ఒకరు గౌరవించుకునే జీవిస్తున్నాం కదా..
  మరి ఒక్కసారిగా వాతావారణం ఎందుకు మారిపోయింది… ? తినే వారి వల్లనా వద్దనే వారి వల్లనా…?

 33. b.ramnarayana says:

  అంత కలసి బిక్షగాన్ని కాలబెద్తరేమో అనుకొన్నాం ,ఇంతకుమున్దేప్పోదో జరిగిన సంఘటనవోలె .ముగింపు చాల అసహజంగా అనిపించింది.

 34. చందు - తులసి says:

  రామనారాయణ గారూ..మీ స్పందన కు ధన్యవాదములు..
  బిచ్చగాన్ని తగలబెడితే కథ రాయడం ఎందుకు సార్..అది వార్త అవుతుంది.
  ఇలా జరిగితే బాగుంటుంది…అనుకుని రాసిన కథ.
  ఒకరి ఆకలిని…బువ్వ ను ఇంకొకరు శాసించగలరా…? అని చర్చించడమే నా ఉద్దేశం.
  థాంక్యూ…

 35. Story bagane vundhi.. Issue ni story ga malichina theeru…bavundhi.
  NATAKAM ga baaguntundi…
  Present situation chupincharu..
  Good..keep it up

 36. చందు - తులసి says:

  థాంక్యూ శ్రీనివాస్ గారూ…

  • చందు తులసి says:

   శ్రీనివాస్ గారూ…మీరన్నట్లే…మిర్యాల గూడెం కు
   చెందిన కళాకారులు నాటికగా మార్చుకుంటామని
   చెప్పారు. సంతోషం. మీరు గుర్తొచ్చారు.. థాంక్యూ

 37. jaanu Jejjala says:

  చందు తులసి గారు ! మీ కథ చాల చాల బాగుంది , ” సమాజం ” పట్ల మీ అలోచన కోణం వైవిధ్యం గా వుంది. గొడ్దు కూర పై జరుగుతున్న గొడవలు నిజంగా దేశ భక్తి గు్రించా? రాజ కీయ లబ్దికా ? అనే వివేచన మనకే ఉండాలి. మానవత కు మీ కథ ఒక మచ్చు ‘తునక’ .
  ….. జాను జెజ్జాల

  • చందు - తులసి says:

   జాని గారూ…బాగున్నారా..నా కథ చదివి స్పందించినందుకు ధన్యవాదములు..

   మచ్చు తునక…హ హ్హ.. ఆ తునకల గురించే కదా గొడవంతా. థాంక్యూ

 38. Chalabagarasaru bava…..

 39. jilukara srinivas says:

  చందు తులసి గారు,
  మీ రాజకీయ స్పృహకు అభినందనలు. శాఖాహార ఫాసిజం చేస్తున్న దాడిని చక్కగా రాసారు. నాకైతే బాగా నచ్చింది. ఒక చిన్న సలహా. మీరు ఎప్పటికప్పుడు అందరికి రెస్పాండ్ అవుతున్నారు. అలా చేయకండి. వాదన నడవనీండి.

  • Manchi salaha Jilukara Srinivas garu.. Charcha jarigithene kotta vishayaalu bayatiki vastaayi..

   • చందు తులసి says:

    మంచి చర్చ జరగాలనే…సమస్య అందరికీ అర్థం కావాలనే….నేనూ చిన్న ప్రయత్నం చేశాను…

  • అవును చర్చలు వాదనలు జరగాలి. లేకపోతే ఉచిత వినోదం ఎలా మీ లాంటి వారికి?

   • చందు తులసి says:

    చంద్రిక గారూ….వినోదం కోసమైతే వేరే మార్గాలున్నాయి.

 40. చందు - తులసి says:

  జిలుకర శ్రీనివాస్ సార్….నా కథ చదివి స్పందించినందుకు ధన్యవాదాలు సార్.
  కొత్త వాన్ని కదా…ఏమన్నా అనుకుంటారేమోనని స్పందిస్తున్నాను..
  ఇక నుంచి మీ సూచన పాటిస్తాను సార్…

 41. అరవింద న్యాయపతి says:

  చందు గారూ… భారతీయ సంస్కృతిపై దాడి చేసేలా మీ కథ ఉంది.. ఇలాంటి కథలు రాయడం వల్ల దేశంలో ఏదో జరిగిపోతోందన్న అభిప్రాయం కలుగుతుంది.. నిజానికి అంతేమీ జరగడం లేదు.. అంతే కాదు మన దేశంలో బిచ్చగాళ్లు బాగానే ఉన్నారు.. బ్యాంక్‌ అకౌంట్లు కూడా మెయింటైన్‌ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.. మీ కథనం ఆకట్టుకున్నా.. కథ మాత్రం వాస్తవ విరుద్ధంగా ఉంది…

 42. గగన సీతాపతి says:

  బిచ్చగాడిపై మతోన్మాదులు దాడి చేయడం భారతీయ సంస్కృతి అంటారా అరవింద గారూ ?
  బిచ్చ గాళ్ళు బ్యాక్ అక్కౌంట్లు మైంటైన్ చెయ్యకూడదా?!
  రచయిత ఆలోచన అది కాదు . ఎవడి తిండి వాడు తినే స్వేచ్చ ఈ దేశం లో లేదా అనేది ఆయన అడుగుతున్నాడు –
  కాకపోతే కథ కథలా కాకుండా విస్ఫోటనం లా పేలింది . అంతే !
  – గగన సీతాపతి

  • చందు తులసి says:

   గగన సీతాపతి గారూ…నా ఉద్దేశం మీకన్నా అర్ధమైంది…థాంక్యూ

 43. కథ చాలా అన్యాయంగా ఉంది. ఒక్క విషయం స్పష్టమైంది. మీరు బిచ్చగాడి ఆకలి బాధను ఎంత హైలెట్ చేశారో అంతగా ఆవు మాంసం తింటే తప్పులేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అరవింద గారు రాసిన దానికి గగన సీతాపతి గారు కౌంటర్ ఇచ్చారు. కానీ ఆయన ఒక్క విషయం తెల్సుకోవాలి. ఆవుని గోమాతగా హిందువులు పూజిస్తారు. దాన్ని తినాలన్న కుతి ముస్లిం కంటే సోకాల్డ్ మేధావులు, కుహనా సెక్యులరిస్టులకే ఎక్కువగా ఉందన్న విషయంలో జనానికి చాలా క్లారిటీ ఉంది. అంతేకాదు తినని వాళ్లకు కూడా తినిపించాలన్న తాపత్రయం వీళ్లల్లో కనిపిస్తోంది. అదేం సెక్యులరిజమో వాళ్లే క్లారిటీ ఇవ్వాలి. ఇతర మతస్తుల సంప్రదాయాలను గౌరవించాలని మైకులు, బల్లలు బద్దలు కొట్టి మరీ వాగేసే నేతలు, మేధావులు, కవులు, కళాకారులు….ఈ గుంపు అంతా హిందువులు పవిత్రంగా భావించే గోమాతను చంపడాన్ని ఎందుకు ఖండించరు. అసలు ఆ విషయంపై ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడరు. ముస్లింలు కొడతారన్న భయమా… లేక హిందువులు నోరెత్తరన్న ధీమానా. ఈ దేశంలో హిందువులు పవిత్రంగా భావించే వాటిని కించపరిచినా, ధ్వంసం చేసినా ఎవ్వరూ నోరెత్తరు. దేశంలో రగులుతున్న సమస్యకి అద్దం పట్టిందని మరికొందరు మిత్రులు రాశారు. ఆకలికి, ఆవుకు సంబంధం లేదని మీరు భావిస్తే చాలా చాలా చాలా తప్పు. ఆకలేస్తోంది కదాని ఎదుటి వాళ్ల సెంటిమెంట్ హర్ట్ చేస్తే ఎవ్వరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఆ విషయం తెల్సుకుంటే మంచిది. ఏ చిన్న సంఘటన జరిగినా మతోన్మాదం అనడం ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది. హిందువుల సెంటిమెంట్స్ హర్ట్ చేయడం.. ఎవరైనా దానిపై రియాక్ట్ అయితే మతోన్మాదం అంటూ గగ్గోలు పెట్టడం… ఈ పోకడలు తగ్గించుకుంటే చాలా మంచిది.

  • చందు తులసి says:

   ఆనంద్ గారూ…మీ స్పందనకు ధన్యవాదాలు…
   @
   ఆకలేస్తుంది కదా అని ఎదుటి వారి సెంటిమెంట్ హర్ట్ చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోరు…అన్నారు….
   చేతులు అందరికీ ఉంటాయి కదండీ..

  • చందు - తులసి says:

   ఆనంద్ గారూ…
   ఆవుని గోమాతగా హిందువులు పూజిస్తారు. దాన్ని తినాలన్న కుతి ముస్లిం కంటే సోకాల్డ్ మేధావులు, కుహనా సెక్యులరిస్టులకే ఎక్కువగా ఉందన్న విషయంలో జనానికి చాలా క్లారిటీ ఉంది.
   ….ఫలానాది తినాలనే కుతి…అన్నారు‌..
   ఇక్కడ కుతి అనే పదం వాడడం సమంజసమేనా..
   ఎవరైనా కుతి కోసం తింటారని నేననుకోను.. ఆకలికి కడుపు నింపుకోవటానికి తింటారు కానీ….కచ్చితంగా ఆవునే తింటానని
   ఆవు కోసం వెతకరు….

   @ఆవును చంపడాన్ని ఎందుకు ఖండించరు అంటున్నారు.. ఎందుకు ఖండించరు… ఆవునే కాదు…చీమను చంపడాన్నైనా ఖండించాల్సిందే.

 44. కె.కె. రామయ్య says:

  అరవింద గారూ, భారతీయ సంస్కృతికి కళంకం తెస్తున్నది మన మతం ఔనత్యము తెలియని, పరమత సహనం లోపించిన వాళ్ల వికృత చేష్టల వల్లనే. “నిజానికి దేశంలో అంతేమీ జరగడం లేదు” అంటున్నారు. మీ వాదన నిజమే అనుకున్నాపరిస్థితి పూర్తిగా దిగజారే వరకూ చూస్తూ ఊరుకోవాలంటారా. ప్రపంచానికే అహింసా మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధిని హత్యచేసిన గాడ్సే వర్ధంతిని జరుపుతామంటున్నా, మత మౌడ్యాన్ని హేళనచేసిన వారిని, హేతువాదులను చంపుతున్నా ( అవి చెదురుమదురు సంఘటనలగా భావించి ) చూస్తూ ఊరుకోవాలంటారా. గోమాతను పూజిద్దాం. కాని గొడ్డుమాంసం తింటే చంపుతామనటం మన సంస్కృతి కాదనీ వాదిద్దాం. దురదృష్ట వశాత్తు మన దేశంలో చాలా మందికి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక స్వేచ్చ ఇంకా రాలేదు. కవులు, కళాకారులు, రచయితలూ వాళ్ల పక్షం నిలవాల్సిందే. సృజనాత్మక శక్తిగల చందుతులసి లాంటి రచయిత సామాజిక సమస్యలని తన రచనల ద్వారా ప్రశ్నించటాన్ని దయచేసి వారించకండి.

  • చందుతులసి says:

   రామయ్య గారు…మీరన్నట్లే ఈ దేశంలో ఇంకా చాలామందికి పూర్తి స్థాయి స్వేచ్ఛ రాలేదు. స్వేచ్ఛ కోసం పోరాడుతుంటే….కొందరు వెనక్కి వెళుతున్నట్లు…అసలు తిండి మీదనే నానా యాగీ చేస్తున్నారు…. ఎదుటివాడి భావ స్వేచ్ఛను అంగీకరించే స్థాయికి అంతా చేరుకోలేదు. వ్యక్తి స్థాయికి పరిమితమైన తిండిని..తమ సంస్కృతి మీద దాడిగా భావించే వాళ్లు…మత మౌఢ్యాన్ని ప్రశ్నించినందుకు…దాడి చేయడాన్ని, చంపడాన్ని చెదురు మదురు సంఘటనలుగా చూస్తున్నారు.

 45. కథ బాగుందా లేదా అన్న సంగతి పక్కన పెడదాం. ఇక్కడ సమస్య పక్క దోవ పడుతోంది. దేశం లో జరుగుతున్న చర్చ లాగే.
  ఆవును తినడం ఇవ్వాల కొత్తది కాదు. పూజించడం కొత్తది కాదు. రెండు రకాల ప్రజలూ కలిసే బతుకుతున్నారు. వాళ్ళు కొట్టుకోవడం లేదు. ఆవును ఇంతకాలం పట్టించుకోని వాళ్ళు..ఒక్క నాడైన ఒక్క పోస గడ్డి పెట్టని వాళ్ళు ….ఆవు గురించి నీతులు చెబుతున్నారు. మరో వైపు తినడానికి ఆవు తప్ప ఇంకేమి లేనట్లు ….చెబుతున్నారు. ఇద్దరిదీ తప్పే … ఎవరి జీవితం వాళ్ళను బతకనివ్వండి ..ప్లీజ్ .
  ఫిలిప్స్ ..కోడూరు

  • చందుతులసి says:

   ఫిలిప్స్ గారు..! ఒక్కనాడైనా ఆవుకు గడ్డిపోస పెట్టని వాళ్లు….ఆవుకు నీతులు చెబుతున్నారు. విలువైన మాట
   స్పందనకు అభినందనలు…

  • White collar ఉద్యోగాలు చేసుకునేవాళ్ళకి ఇంటిలో ఆవుని పెంచుకోవలసిన అవసరం ఉండదు కానీ వాళ్ళు జనానికి ఇంటికోఆవుని పెంచుకోమని చెపుతారే, అదీ ఇక్కడ విచిత్రం.

 46. Srinivas Vuruputuri says:

  ” ప్రపంచానికే అహింసా మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధిని హత్యచేసిన గాడ్సే వర్ధంతిని జరుపుతామంటున్నా…”

  As long as they are not inciting violence or induging in physical violence, they have their right to conduct such meetings. Don’t they?

  • ఇక్కడ రామయ్య గారి ప్రశ్న నైతికతకు సంబందించింది.చట్టానికి కాదు. మీరు సూటిగా చెప్పండి.మహాత్ముణ్ణి చంపడం మీరు సమర్దిస్తారా.?

   • SrInivas Vuruputuri says:

    సమర్థించను.

    “ఊరుకొమ్మంటారా?” అన్నారు కనుక ఆ మాట అన్నాను. మీటింగులకి హక్కు ఉంటుంది. దాడులకు, హత్యలకు ఉండదు. నేను చెప్పాలనుకున్నది అంతే. భావప్రకటన స్వేచ్ఛ గురించి మాత్రమే నేను చెప్పాను.

   • చందుతులసి says:

    ఫిలిప్స్ గారూ….శ్రీనివాస్ గారు అడిగిన ఉద్దేశం వేరనుకుంటా…
    మహాత్ముణ్ణే కాదు…మామూలు మనిషినిపైనా దాడిని ఎవరూ సమర్థించకూడదు…

  • చందుతులసి says:

   శ్రీనివాస్ వురుపుటూరి గారు…..

   ఉంటుంది..అందరికీ హక్కు ఉంటుంది. ఎదుటి వారి మీద దాడి చేయనంత వరకూ …..
   స్పందనకు థాంక్యూ

 47. లింగం says:

  ఒరెక్కో…అటు తిరిగి…. ఇటు తిరిగి గొడ్డు కుర గొడవ ఇక్కడకు కుడా వచ్చిందా. అది ఇవ్వాల్టి ముచ్చట కాదు. ఒక్క రొజుతొ పోయేది కాదు. ఎనకటి నుంచి ఉన్నదే . కొట్టుకుని కొట్టుకును చావాల్సిందే తప్ప ఒక్కనాడు ఒడిసేది కాదు …కథ బాగుంది. కనీ జరా మంచిగా వుంటే బాగుండేది.

  • చందుతులసి says:

   లింగం గారూ…అవును…ఈ వివాదం ఇవాళ్టిది కాదు సార్. మనమేదో పరిష్కరిస్తామని కాదు… చిన్న చర్చైనా జరుగుతోంది కదా…
   స్పందనకు థాంక్యూ.

   • చందుతులసి says:

    అన్నట్లు లింగం గారూ..ఒరెక్కో అన్న పదం విని చాలా కాలమైంది. తెలంగాణ ప్రాంతంలో మా చిన్నపుడు పెద్దలు బాగా వాడిన పదం.
    ఒరెక్కో అన్న పదానికి …అసలు సమాన ఆంగ్లపదమే లేదనిపిస్తోంది. ఎన్ని పదాలు అంతరించిపోతున్నాయో ….

 48. చందు – తులసి గారు,
  ఈ సమస్య మీద ఇటీ వలీ చాలా పెద్ద పెద్ద మేధావులనుండి గొప్ప వ్యాసాలూ, చర్చలు కొనసాగినాయి కాని, మీ కధ ఐలెట్ గా ఉంది – ఇక్కడ చర్చ చూస్తు ఉంటే. హేత్సప్! హిందువులకు గోవు పవిత్ర మైనది ఎందుకైనది అంటే– వ్యవసాయం తెలియక ముందు, పశువుల్ని మేపుకొని, వాటి నుండి వచ్చిన పాడి జీవనాదారంగా ఉండేది. వేధ కాలం ఆర్యులు కు గోగణాలే సంపదగా చెలామణి అయ్యేది. ఎన్ని పశువులు ఉంటే అంత ధనికులుగా భావించుకొనే వారని ప్రతీతీ! గోవుల కొరకు యుద్దాలు కూడా జరిగాయి – ఎందుకంటే గోవులే సంపద కనుక. వ్యవసాయం నేర్చుకొని పశు సంపద పెంచుకొని నాగరికత పెరిగిన తరువాత, ఆ నాడు గోవు ‘ సంపద’ గనుక పూజితురాలైన్ది. ఈ నాటి ఆస్తి పరులు దానిని ఉపయోగించి రాజకీయాలు కూడా మొదలెట్టి నారు.

  • చందుతులసి says:

   తిరుపాలు గారూ. రాజకీయ నాయకులు ఏది వదిలిపెట్టారు కనుక. తమకు ఓట్లు రాల్చే అవకాశం ఉంటే దేన్నైనా వివాదం చేస్తారు.
   థాంక్యూ

 49. ఈ వ్యాసం చదవండి: http://blog.marxistleninist.in/2015/11/blog-post_18.html

  • చందు - తులసి says:

   ప్రవీణ్ గారూ…సమస్య వెనుక ఆర్థిక కోణాన్ని
   వివరంగా చెప్పారు.. మార్క్స్ ప్రకారం అన్నీ
   ఆర్థిక సంబంధాలే అన్నట్లు… గొడ్డు కూర వెనక కూడా ఆర్థిక సమస్య ఉందని చెప్పారు…బావుంది.

 50. కె.కె. రామయ్య says:

  “ఒరెక్కో అన్న పదం విని చాలా కాలమైంది. భాషలో ఎన్ని పదాలు అంతరించిపోతున్నాయో …. ” అంటూ ఆవేదన వెలిబుచ్చిన చందుతులసి గారు, మాండలిక భాషలో రచనలు చేస్తున్న మీవంటి ( సీనియర్స్ గొరుసన్నల్లాంటి ) వాళ్ళ వల్ల ఆ కొరత కొంత తీరుతున్నది. కడప మాండలీకం లో రాస్తున్న బుడ్డగిత్త కధ పుట్టా పెంచాల్దాసు, చౌరస్తా వంశీధరరెడ్డి నుండి పెద్దలు నామిని అన్న, స.వెం. రమేశ్ ల నుండి ఎందరెందరో మహానుభావుల కృషిని, తెలుగు భాషని సుసంపన్నం చేస్తున్న కృషిని, ఈ సందర్భంగా ప్రస్తుతించాలనిపిస్తోది.

  “ఈదేసిన గోదారి” శీర్షికన దాట్ల లలిత గారు రాసినవీ మరీ మరీ చదువుకోవాలనిపించేలా, ప్రింట్లు తీసుకుని పదిమందికీ పంచిపెట్టుకోవాల్సినంత గొప్పగా ఉన్నాయి. వాటిలోనూ మెరుస్తున్నమాండలికము, ఆయా ప్రాంతాల సంస్కృతీ, సంప్రదాయాల సౌరభాలు విరజిమ్ముతున్నాయి.

  http://saarangabooks.com/retired/tag/%E0%B0%A6%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A4/

  • చందు - తులసి says:

   అవును రామయ్య గారూ….చాలా మంది పెద్దలు
   మాండలికంలో రాసి భాషను కాపాడుతున్నారు..
   ఇక స.వెం. రమేశ్ గారి కృషి ప్రత్యేకమైనది…..

   లలిత గారి కథలు నేనూ చదివాను…ముఖ్యంగా భాష ఆకట్టుకుంటుంది..
   ధన్యవాదాలు…

 51. అడుక్కునేవాని గతి అట్లనే ఉన్నది.కథలో నాటకీయత ఉన్నా ముగింపులో తిరుగుబాటు చదువరికి క్షణిక సంతృప్తి నిస్తుంది. గోవు గొడ్డుకూర సమస్యను ఇలా ఎదుర్కోవలసిందే.కథకుడిగా మీ పాత్ర పోషిస్తున్నారు. సెహబాష్ …

  • చందు - తులసి says:

   నర్సన్ గారూ..థాంక్యూ.. మన పని మనం చేయాలి కదా…కవితలు రాసే వాళ్లు కవితలు …కథలు రాసే వాళ్లు కథలు…లేదా వ్యాసాలు…
   చర్చ జరగాలి….వాస్తవం అర్ధం కావాలి…

 52. Ee charcha goddu kura daggara modalai.. Aagrahaalu ragilinchi.. Ippudu cool gaa maaandalikaalu.. Padabandhaala disagaa saagutondannamaata.. Good..

  • చందు - తులసి says:

   మాండలికాలు…పదాలు, సామెతలు కథలో భాగమే కదా.. వాటినీ చర్చించడం కథలో భాగమే

 53. దేవికారాణి says:

  సారంగలో మొదటి కథ…అభినందనలు అన్నయ్యా….
  విషయానికి వస్తే కథనం బాగుంది. కానీ కథ నచ్చలేదు. కేవలం ఒక వర్గాన్ని తప్పుబడుతూ రాశావు. ఆవును పూజించడమే తప్పైనట్టు.. హిందువులంటే అసహనవాదులే అన్నట్టుంది. అసలు నిజంగానే దేశంలో ఇంత అరాచక పరిస్థితి ఉందా‍? ఈ గడ్డపై మైనార్టీలకు నిజంగానే రక్షణ కొరవడిందా.? దాద్రి లాంటి ఘటనలు ఇంతకుముందెన్నడూ జరగలేదా.? హిందువులపై ఎలాంటి దాడులు జరగలేదా.? దేశంలో కేవలం హిందువులు మాత్రమే దోషులు..మైనార్టీలు మాత్రమే బాధితులా? అవును అని వితండవాడం చేస్తున్న వాళ్లల్లో నువ్వూ చేరడం బాధాకరం. అసలు బీఫ్ పై నిజంగానే రచ్చ చేస్తున్నదెవరు. గోమాతగా పూజించడం పక్కనపెట్టి మానవాళికి ఎంతో మేలు చేసే ఆవును రక్షించుకుందాం అంటే తప్పా.ఇంత పెద్ద ప్రజాస్వామ్యదేశంలో ప్రజాప్రభుత్వం చేసిన గో రక్షణ చట్టాన్నిఅమలు చేయండి అంటే పాపం,నేరమూనా.. బీఫ్‌పై ఇంత పెద్దఎత్తున చర్చ, రచ్చ జరుగుతున్న పరిస్థితుల్లో దళితులు కానీ, ముస్లింలు కానీ ఎవరూ బయటకు రావడంలేదు. కేవలం హిందుధర్మం మీద కక్షతో కావాలని ..పనిగట్టుకుని కొందరు రచ్చ చేస్తున్నారు. హిందుత్వపై విషం చిమ్ముతున్నారు. దేశం పరువు తీస్తున్నారు. హిందూజాతి శాంతి, సహనం కోరుకుంటుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ..ఇంకా ఇలా రెచ్చగొట్టుకుంటూ పోతే నిజంగానే హిందువుల్లో సహనం చచ్చిపోతుంది. అది మరింత ప్రమాదకరం. సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, సోకాల్డ్ మేధావులు ఇది గుర్తిస్తే మంచిది. సర్వేజనా సుఖినోభవన్తు.

 54. DEVIKA RANI says:

  సారంగలో మొదటి కథ…అభినందనలు అన్నయ్యా….
  విషయానికి వస్తే కథనం బాగుంది. కానీ కథ నచ్చలేదు. కేవలం ఒక వర్గాన్ని తప్పుబడుతూ రాశావు. ఆవును పూజించడమే తప్పైనట్టు.. హిందువులంటే అసహనవాదులే అన్నట్టుంది. అసలు నిజంగానే దేశంలో ఇంత అరాచక పరిస్థితి ఉందా‍? ఈ గడ్డపై మైనార్టీలకు నిజంగానే రక్షణ కొరవడిందా.? దాద్రి లాంటి ఘటనలు ఇంతకుముందెన్నడూ జరగలేదా.? హిందువులపై ఎలాంటి దాడులు జరగలేదా.? దేశంలో కేవలం హిందువులు మాత్రమే దోషులు..మైనార్టీలు మాత్రమే బాధితులా? అవును అని వితండవాడం చేస్తున్న వాళ్లల్లో నువ్వూ చేరడం బాధాకరం. అసలు బీఫ్ పై నిజంగానే రచ్చ చేస్తున్నదెవరు. గోమాతగా పూజించడం పక్కనపెట్టి మానవాళికి ఎంతో మేలు చేసే ఆవును రక్షించుకుందాం అంటే తప్పా.ఇంత పెద్ద ప్రజాస్వామ్యదేశంలో ప్రజాప్రభుత్వం చేసిన గో రక్షణ చట్టాన్నిఅమలు చేయండి అంటే పాపం,నేరమూనా.. బీఫ్‌పై ఇంత పెద్దఎత్తున చర్చ, రచ్చ జరుగుతున్న పరిస్థితుల్లో దళితులు కానీ, ముస్లింలు కానీ ఎవరూ బయటకు రావడంలేదు. కేవలం హిందుధర్మం మీద కక్షతో కావాలని ..పనిగట్టుకుని కొందరు రచ్చ చేస్తున్నారు. హిందుత్వపై విషం చిమ్ముతున్నారు. దేశం పరువు తీస్తున్నారు. హిందూజాతి శాంతి, సహనం కోరుకుంటుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ..ఇంకా ఇలా రెచ్చగొట్టుకుంటూ పోతే నిజంగానే హిందువుల్లో సహనం చచ్చిపోతుంది. అది మరింత ప్రమాదకరం. సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, సోకాల్డ్ సెక్యులరిస్టులు ఇది గుర్తిస్తే మంచిది. సర్వేజనా సుఖినోభవన్తు.

  • చందు-తులసి says:

   అక్కా కథ చదివి, స్పందించినందుకు ధన్యవాదాలు.
   సర్వే జనా సుఖినో భవన్తు అంటే…అందరూ సుఖంగా ఉండడమే కదా. అంటే ఎవరికి నచ్చినట్లు వారు ఉండడం. నచ్చినట్లు ఉండాలంటే నచ్చింది తినడమే కదా అక్కా. అది వద్దంటేనే కదా గొడవంతా.

 55. కాకికి సున్నం కొట్టి దాన్ని తెల్లకాకి అంటే అది తెల్లకాకి అయిపోదు. ఆవుని తల్లి అన్నంతమాత్రాన అది నిజంగా తల్లి అయిపోదు. ఆవు చర్మంతో కుట్టిన చెప్పులు వేసుకోవడానికి లేని సంకోచం, ఆవు మాంసం విషయంలో మాత్రమే ఎందుకు కలుగుతోంది?

  • చందు-తులసి says:

   ఆవు చర్మంతో కుట్టిన చెప్పులు వేసుకోవడానికి లేని సంకోచం, ఆవు మాంసం విషయంలో మాత్రమే ఎందుకు కలుగుతోంది?
   ఒక్క ఆవు చెప్పులే కాదు సార్. తోలు బెల్టులు, పర్సులు, పులిగోర్లు, ఏనుగు దంతాలు, ఉన్ని కంబళ్లు, ఆఖరికి పెయింటింగ్ బ్రష్ లు ఇవన్నీ జంతువులను హింసించడం ద్వారా వచ్చిన ఉత్పత్తులే. బహుశా మనిషి ఇంకా జంతువును హింసించకుండా బతకగల స్థాయికి పూర్తిగా చేరలేదనుకుంటా…

   • G B Sastry says:

    గోవధపై జరుగుతున్నా దంత జంతువులపై కృరత్వమ్ గూర్చికాడు.కొందరు పవిత్రంగా భావించే జీవిని చంపి తినడం గూర్చి మాత్రమే .ఎన్నో కట్టడాలున్నదేశం లో బాబ్రి కట్టడం కూల్చడం ఎందుకు వివాద స్పదమైనదొ అదే కారణంతో గోవధ వివాదాస్పదమైంది
    మనసులకి సంభందించిన విషయాలకి లౌకికమైన విషయాలతో పోల్చి సామాన్యీకరణ సమంజసం కాదనుకుంటాను
    ప్రశ్న ఆకలి తిండి గురించి కాదని గుర్తించడం అవసరం. గుర్తించకుండా చేసె ఆలోచనాధోరణి మంచి చేయలేదు అందర్నీ కొంచెం చేస్తుంది

   • Even I did agree that non-violence is not the objective behind the ban on cow slaughter. I oppose ban on cow slaughter because laws should not be made by religious sentiments in a secular country.

   • చందు - తులసి says:

    శాస్త్రిగారూ…
    ఎన్నో కట్టడాలున్న దేశంలో బాబ్రీ మసీదు కూల్చి వేత వివాదం కావడం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు…
    కానీ ఇవతలి వారికీ కూడా లక్షలకొద్దీ గుళ్ళున్నాయి కదా…. అసలు దాన్ని వివాదం చేసింది ఎవరు..ఏ ప్రయోజనం కోసం చేశారు..? పోనీ అక్కడా చిత్తశుద్ధి లేదు. సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు గుర్తుకు వస్తుంది..?
    గో వధ కూడా అంతే.. మీరన్నట్లు కొందరికి అది మనోభావాలకి సంబంధించినది. ఇటు వైపు వారికి తిండికి ఆకలికి సంబంధించినది.. ఆకలి ముఖ్యమా, మనోభావాలు ముఖ్యమా..?

 56. కె.కె. రామయ్య says:

  దేవికారాణి గారూ, దయచేసి అర్ధం చేసుకోండి. బీఫ్‌పై జరుగుతున్న చర్చల్లో రచ్చలో దళితులు కానీ, ముస్లింలు కానీ ఎవరూ బయటకు రావడంలేదు అంటే వాళ్లలో ఉన్న అభద్రతా భావం కూడా కారణం కావచ్చేమో ఆలోచించండి. ఈ గడ్డపై మైనార్టీలకు నిజంగానే రక్షణ కొరవడిందా? అంటున్నారు. రక్షణ సంగతి పక్కన పెట్టండి. వాళ్ళెంత వివక్షతకు, అణిచివేతకు గురవ్వుతున్నారో ఆలోచించండి. అబివృద్ది ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నాయా ? ఇంక్లూజివ్ గ్రోత్ స్లోగన్లకే పరిమితమవుతున్నది. మన స్వేచ్చా భారత్ లో ఒక వర్గం నుంచి మరో వర్గం రక్షణ కోరుకునే పరిస్తితులెన్దుకుండాలి.

  గోమాత రక్షణ చట్టాల ద్వారానో, హింసాయుత చర్యల ద్వారానో కాక మరోలా అయ్యే పద్దతి ఉందేమో ఆలోచించండి.

  ప్రస్తుత మన సమాజంలో సర్వజనులు సుఖులుగా ఉన్నారా? అలా ఉండే అవకాశాలు ఇంకా ఇంకా కల్పించాల్సిన అవసరం లేదంటారా ? విలువలతో కూడిన నిజమైన హిందూ ధర్మం పట్ల అందరికీ ఎంతో గౌరము ఉంది. సమస్య అంతా హిందూత్వాన్ని వక్రిస్తున్న, కులాలని, మతాలని రాజకీయాలు చేస్తున్న వాళ్ల వల్లే వస్తున్నది. నీతో విభేదిస్తాను కానీ నీ భావ ప్రకటనా స్వాతంత్రాన్ని కాపాడటానికి పోరాడుతాను లాంటి వాతావణాన్ని కాపాడుకోవద్దూ.

  మీ మనోభావాలు తెలిపి చందుతులసి గారి ప్రతిభకు పదునుపెట్టటానికి చేసిన ప్రయత్నం బాగుంది.

  • చందు-తులసి says:

   రామయ్య గారూ….మీరన్నట్లుగానే దళితులు, మైనారిటీల్లో కొంత అభద్రత వాతావరణం ఉండి ఉండవచ్చు. అలాగే అసలు వాళ్లేమనుకుంటున్నారో వాళ్ల అభిప్రాయాలు తెలియజెప్పే వేదికలుంటే తెలుస్తుంది. బహుశా ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి….

 57. ఆవుల్ని రక్షించడానికి మనుషుల్ని చంపాల్సిన అవసరం వచ్చిందంటే, దాన్ని బట్టి ఏమి అర్థమవుతోంది? గోహత్యా నిషేధం వల్ల అహింసావాదం పెరగదు అనే కదా.

  • చందు-తులసి says:

   ప్రవీణ్ గారు. నిషేధం వల్ల ఎక్కడా ఏదీ తగ్గిన దాఖలా చరిత్రలో లేదు. మద్య నిషేధం విధిస్తే , దొంగ సారా, మాఫియా పెరగడం చూస్తున్నాం కదా.

   అసలు ఇందులో రెండు కోణాలున్నట్లున్నాయి. ఆవులను సంరక్షించడం వేరు. గోవధ నిషేధం వేరు. ఆవులను , పశువులను సంరక్షిస్తోంది ఎక్కువ మంది నాకు తెలిసి దళితులే. పెద్ద రైతులు ఆవులను పెంచినా వాటిని మేపడానికి కింది కులాల వాళ్లనే జీతగాళ్లుగా పెట్టుకుంటారు. వాళ్లలో చాలా మంది గొడ్డు మాంసం తింటారు. అంతమాత్రాన వాళ్లకు ఆవు మీద ప్రేమ లేదని కాదు. ఇవన్నీ మన బంధాలు-అనుబంధాల పరిధిలో అర్థమయ్యేవి కావు. ప్రత్యక్షంగా చూస్తేకానీ అర్థం కాదు.

 58. చందు తులసి గారు!! ‘ప్రతి పురుగునూ పూజిద్గాం చీమను చంపడాన్నైనా ఖండించాల్సిందే.ఒక రోజు మాంసం తినొచ్చు..కానీ ఇంకొకరోజు తినకూడదు అనడం ఎలా సమంజసం..? దీని వెనుక శాస్త్రీయ కారణం ఎవరైనా చెబితే బాగుండు’ అంటూ మీరు ఇచ్చే సమాధానాలలోనే తెలుస్తోంది ఒక మనిషి నమ్మకం మీద మీకు ఎంత గౌరవమో!! ఎవరో సోమవారం శివుడిని పూజించే వారిని, గురువారం సాయిబాబా ని పూజించే వారి మనసులు వారి వ్యాఖ్య లతో గాయపరచి ఆత్మ సంతృప్తి చెందారు. ఇంకొకరి మనోభావాల మీద ఎంత ఏవగింపో!! వాదోపవాదాలు కావాలి అందుకే. చర్చలు జరగాలి. జరిగితేనే కదా మీకు తెలిసేది ఎంత మంది మనోభావాలు గాయపరిచారో తెలిసేందుకు. అందుకే ఈ చర్చ జరగముందే చెప్పాను నా వ్యాఖ్య లలో హిందుత్వం పేరుతో రెచ్చగొట్టే వారికీ మీకు తేడా లేదు అని, మీరు ఏమి తీసిపోరని!! రుజువు చేసుకున్నారు !!

  • ఎంత మనోభావం రంగు పులుముకున్నా స్వేచ్ఛా నిర్ణయం కంటే మూఢనమ్మకమ్ గొప్పది కాదు.

 59. దేవికారాణి says:

  అవును చంద్రికగారూ కొందరికి రెచ్చగొట్టడమే పనైపోయింది. ముఖ్యంగా హిందుధర్మంపై పెద్ద కుట్ర జరుగుతోంది. హిందుత్వలో లోపాలున్నాయి.. కాదనలేం. కానీ ఇతర మతాల్లో ఉన్న లోపాలు వీళ్లకి ఎందుకు కనిపించవో అర్థం కాదు.

  • మీ కథ బాగుంది. కానీ మీరు ముష్టి ఎత్తుకునే మనిషిని వాడు, వీడు అనడం బాగులేదు. మీలో unconscious గా ఉన్న పెత్తందారీ తనం అలా అనడంలో కనిపిస్తోంది. డబ్బు, చదువు ఉన్నవాళ్ల గురించి రాసేటప్పుడు అలా అంటారా?
   దేవికారాణిగారూ, హిందుత్వలో లోపాలు ఉన్నాయని ఒప్పుకున్నారు, బాగానే ఉంది. ఆ లోపాలను తప్పు పడితే ఎందుకు ఒప్పుకోరు? ఇతర మతాల్లో లోపాలు లేవా అని అడుగుతున్నారు. ఆ మతాల్లోని లోపాలను ఆ మతం వాళ్ళు చూసుకుంటారు. అది మీకెందుకు? మీ పక్క ఇంట్లో మురికిని, కుళ్ళును దాచుకున్నారని మీ ఇంట్లోనూ దాచుకుంటున్నారా? ఎత్తి అవతల పోయడం లేదా? మీ ఇంట్లో కుళ్ళు, మురికి ఉన్నాయి, బయట పారేయండని చెప్పవచ్చు, తప్పులేదు. ముందు మీ ఇంటికి శుభ్రం చేసుకోవాలి కదా?

   • చందు తులసి says:

    రమణ గారూ..స్పందనకు థాంక్యూ సర్…
    యాచకున్ని బిచ్చ గాడు…వాడు అనడం లో తప్పు ఒప్పుకుంటున్నాను. క్షమించండి.
    కానీ బిచ్చగాడు అనే పదం తప్ప యాచకుడు అనో ముష్టెత్తుకోనే మనిషి అని రాస్తే ఫోర్సు రావడంలేదండి. తప్పదు ఒక్కోసారి… నాలోనే కాదు చాలామందిలో అంతర్లీనంగా ఎక్కడో ప్యూడల్ మనస్తత్వం దాగి ఉందండీ. దాన్ని వదిలుంచుకోవాల్సిందే సర్. థాంక్యూ

 60. కె.కె. రామయ్య says:

  ఇతర మతాల్లో ఉన్న లోపాలు పట్ల మనమెందుకు ఆవేశపడాలి దేవికారాణి గారు? మన సంగతి మనం చూసుకోవాలి కాని. అన్ని మతాలూ బోదించేది మానవత్వమే అని గుర్తుంచుకుంటే ఏ మతంతోనూ, ఏ మతంలోనూ ఎలాంటి విభేదాలూ కనిపించవు.

  తన మతాన్ని, ఆచారాల్ని వొదులుకోకుండానే నేను హిందువుని, ముస్లింనీ, క్రైస్తవుడినీ అని జాతిపిత మహాత్మా గాంధి ఎందుకు ప్రకటించుకున్నారు? పరమత సహనం, సర్వమత సమానత్వాన్ని చాటిచెప్పటానికే కదా. ధార్మిక విషయాలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలూ వ్యక్తుల సొంత పరిధి దాటనంత వరకూ, ఇతరులను ఇబ్బంది పెట్టనంత వరకూ ఎవరూ ఏవీ అనరు, వ్యాఖ్యానించరు. కాని అవి పరిధులు దాటుతున్నప్పుడు ప్రశ్నించాల్సిన్దే నండి.

  ప్రశ్నించటాన్ని వేల సంవత్సరాల నుండి అనుమతించడం కూడా హిందూమత ఔనత్యము, పరిణితి కిందే వస్తుంది కదండి. మరిప్పుడెన్దుకు హఠాత్తుగా ఇంత అసహన పూరిత వాతావరణం నెలకొంటున్నది.

  ఎంతో వినయవిధేయతలతో సమాధానాలు చెప్పుతున్న రచయిత చందుతులసి గారిది రెచ్చగొట్టే తత్వంగా అనుమానించకండి. సమాజంలోని అవకతవకల పట్ల ఓ సృజనాత్మక వ్యక్తి ఆవేదనగా అర్ధంచేసుకోండి.

 61. కెకె రామయ్య గారు!! నిజానికి దేశం లో ఒక్క సంఘటన తప్ప ఏం జరిగింది? ఆ ఒక్క సంఘటన తో ప్రపంచానికి భారత దేశం లో అంతా ఏదో అయిపోతోందనే సందేశం ఇస్తున్నారు ఇలాంటి రచయితలు, మీడియా వారు. భారత దేశం లో ఆవు మాంసం దళితులు కూడా తింటారని నాకు ఈ మధ్యనే మొదటి సారి తెల్సింది. అంటే ఈ విషయం ఎంత గుప్తం గా ఉండేదో అర్ధం అవుతోంది. ఒకరి మనోభావాలు దెబ్బ తింటాయి అనే గౌరవం కి నిదర్శనం ఆ విషయమే తెలియకపోవడం. అది భయం మాత్రం కాదు!! ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య అక్టోబర్ లో అమెరికా స్నేహితులు ఒకరు కేరళ లో అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్లి దర్శనం అయ్యాక భోజనానికి గుడికి కుత వేటు దూరం లో ఉన్న రెస్టారెంటు కి వెళ్తే బీఫ్ మెనూ చూసి ఆవిడా తినలేక వచ్చేసారు. అమెరికా లో అంటే చూసుకుని తింటాను కానీ నా స్వదేశం లో అందునా దక్షిణ భారతం లో ఇలా చూసుకుని తినాలని మొదటి సారి తెల్సింది అన్నారు. ఆకలి ఎవరిదైనా ఆకలే కదా మరి? చట్టం ఉండచ్చు కేరళ లో, కానీ గుడి దగ్గర ఇలా బీఫ్ పెట్టి ఎవరిని కించ పరుస్తున్నారు చెప్పండి. పరమత సహనం ఎవరికి ఉంది ఇక్కడ ఎవరికీ లేదు చెప్పండి? నిజం గా ఒక వర్గం వారు అంత భయపడుతూ వారికీ కావాల్సిన తిండి తినలేనంత సమాజ పరిస్థితి ఉంటే చాలా స్వానుభవాలే ఉంటాయి. అవే కథలు గా వస్తాయి. ఆ కథల లో నిజమైన ఆవేదన కూడా ఉంటుంది. ఈ కథ కల్పించి వ్రాసిన కథ. ఈ కథలో ఆవేదన ఎక్కడుంది ? ఆయన ఆలోచనలే కథ గా మారాయి. మీరు గాంధీ గారి గురించి, హిందుత్వం గురించి చెబుతున్నారు, కానీ ‘ప్రతి పురుగునూ పూజిద్గాం చీమను చంపడాన్నైనా ఖండించాల్సిందే.ఒక రోజు మాంసం తినొచ్చు..కానీ ఇంకొకరోజు తినకూడదు అనడం ఎలా సమంజసం..? దీని వెనుక శాస్త్రీయ కారణం ఎవరైనా చెబితే బాగుండు’ అన్న ఆయన సమాధానాల లో మీకేమీ కన్పించకపోవడం ఆశ్చర్యం గా ఉంది. అందుకే అంటున్నాను హిందుత్వం అని రెచ్చగొట్టే వారికీ ఈయనకి తేడా లేదు అని. చేతిలో కలం ఉంది కదా అని ఏదో ఒకటి వ్రాస్తే ఎలా? సైన్స్ అనేది మనిషి ప్రాణాలు తీస్తుంది మనిషి ప్రాణాలు పోస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేదే మనిషి తేల్చుకోవలసిన విషయం. చేతిలో కలం ఉన్న రచయితా అంతే మరి.

 62. కె.కె. రామయ్య says:

  చంద్రిక గారు, క్షమించండి మీ ఏ ఒక్క వాదనతోనూ నేను ఏకీభవించలేకపోతున్నాను. ( గోమాత పట్లా, నదీమతల్లి పట్లా, ఇంకా ఇతరవిషయాల పట్ల నాకున్న పవిత్ర భావనలను నాలోనే దాచుకుంటాను.అవే శిలాశాసనాలని ఇతరుల పై రుద్దటానికి ప్రయత్నించను. నా ఈ స్వోత్కర్శకి ప్రస్తుత చర్చకీ ఎలాంటి సంబంధం లేదు ).

  గోమాంసం తిన్నాడనే అనుమానంతో అక్లాఖ్ ని చంపడ మొక్క సంఘటనే కాదు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్లేల బాహాబాహి ముష్టియుధాలు, దేశం ఎదుర్కుంటున్న ప్రముఖ సమస్యలను పెడదోవపట్టిస్తో ఈ బీఫ్ గొడవేవిటీ అని చిరాకు పడ్డ కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తలతీస్తానని మరో ఎమ్మేలే అనటం ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు.

  కేరళ రాష్ట్రంలోని హోటళ్ళలో సీఫుడ్, బీఫ్ సర్వ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయం. ఇందులో నొచ్చుకోవాల్సినదేమున్ది.కొంపతీసి మీ అనుమానం అనంతపద్మనాభస్వామి దేవాలయం దగ్గరలోని రెస్టారెంట్ల వాళ్ళందరూ వ్యాపారం కోసం కాక కేవలం గుడికి వస్తున్న ధార్మిక హైందవుల మనోభావాలను దెబ్బతియ్యటానికే అలా కుట్ర చేస్తున్నారని అనుకోమంటారా ఏవిటి. తిరువనంతపురంలోని అనంతపద్మనాభస్వామి దేవాలయం దగ్గరలో చక్కటి పొంగల్, వడా, ఇడిఅప్పం లాంటి తినుబండారాలు కూడా దొరుకుతాయే. మరేవిటి గొడవ.

  ” హిందుత్వం అని రెచ్చగొట్టే వారికీ ఈయనకి ( చందుతులసి గారికి ) తేడా లేదు ” అని పదే పదే అనాలనుకుంటున్నారా. సరే అనుకోండి. మీరన్నంత మాత్రాన అదే నిజం అవ్వాల్సిన అవసరం లేదు కదా.

  ” నాకు ఒక్క ముద్ద పెట్టని వాళ్లకి … నాకు దొరికింది నేను తింటుంటే… తినొద్దని చెప్పే అధికారం, హక్కు ఎవడిచ్చాడ్రా….?” అన్న బిచ్చగాని మౌలిఖ ప్రశ్ననొదిలేసి మిగిలిన విషయాలు మాట్లాడుకోవటం ఎంబావుంది చెప్పండి.
  ‘ఆవుల్ని రక్షించడానికి మనుషుల్ని చంపాల్సిన అవసరం వచ్చిందంటే’ అని ప్రశ్నిస్తున్న ప్రవీణ్ గారికి మనవేవి సమాధానం ఇవ్వగలం?

 63. దేవికారాణి says:

  రమణ గారూ హిందుత్వలో లోపాలున్నాయన్నారు మరి తప్పుబడితే తప్పేంటి అన్నారు. నిజమే. కానీ హిందువులుగా చెప్పుకోవడం ఇష్టం లేనివాళ్లు ఆ లోపాల్ని పెద్దగా చూపుతున్నారనేది నా ఆరోపణ. మాకు మతంతో సంబంధం లేదు.. మేం లౌకికవాదులం, మేధావులం కూడానూ అని ప్రకటించుకునేవాళ్లు పదేపదే హిందుత్వలో తప్పుల్నే కాదు ఒప్పుల్నీతప్పుబడుతున్నారన్నదే నాలాంటివాళ్ల బాధ అండీ. మరి లౌకిక వాదులకు హిందుత్వలోని లోపాలే ఎందుకండీ కనిపిస్తాయి. అవి తలుచుకుంటేనే వాళ్లకు ఎందుకండీ ఎక్కడాలేని అసహనం. అన్ని మతాలు, ధర్మాలు, వర్గాల తప్పుల్ని ఎత్తిచూపుతూ సరిదిద్దాలని సూచించడం వాళ్ల బాధ్యత కదండీ ..మేధావులు కదా మరీ…రామయ్యగారూ మీకూ ఇదే సమాధానమండీ. నాది ఆవేశం కాదండీ…హిందుధర్మం మీద ఇంతకుట్రా అని ఆవేదన, ఆందోళన.

  • దేవికారాణిగారూ, హిందుత్వలో లోపాల సంగతి ఎలా ఉన్నా మీ వాదంలో అవగాహనలో లోపాలు ఉన్నాయండీ. హిందుత్వలో లోపాల్ని మాత్రమే ఎత్తి చూపుతూ, హిందువులుగా చెప్పుకోవడం ఇష్టంలేని హిందువుల్నిమీరు ఎంతమందిని చూశారో, పేర్లతో, ఉదాహరణలతో చెప్పగలరా? నేను హిందువునే నండీ. ఆ సంగతి నేను చెప్పుకుంటాను. అందులో ఇష్టం అయిష్టం ఉండవు. అది నా identity. ఏదో ఒక కులంలో పుట్టడం కూడా ఒక identity. ఐడెంటిటీని ఎలా కాదంటారు ఎవరైనా? నేను హిందువును కనకే హిందుత్వలోని లోపాల గురించి మాట్లాడతాను. అది నా బాధ్యత. మాకు మతంతో సంబంధం లేదనీ, లౌకికవాదులమనీ అనే వాళ్ళ గురించి కూడా మీకు సరైన అవగాహన లేదు. ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకండి. లౌకికవాదులు మతంతో సంబంధం లేదని అనరు, మతం వ్యక్తిగతం అంటారు. వ్యక్తులుగా ఏ మతాన్ని అయినా మీరు అనుసరించవచ్చు, ఏ పూజలైనా చేసుకోవచ్చు. కానీ మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి జనంలో చీలికలు తేవద్దు అంటారు. మేధావుల గురించి కూడా మీకు అవగాహన లేదు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల్లా మేధావులనే ఒక తెగ ఉండదండీ. అన్ని మతాల్లోనూ, కులాల్లోనూ మేధావులు ఉంటారు.

   • చందు - తులసి says:

    @ ముస్లింలు, క్రైస్తవుల్లా మేధావుల తెగ ఉండదండీ….
    రమణ గారూ…విలువైన మాటలు…

 64. దేవికారాణి says:

  రామయ్యగారూ చంద్రికగారి వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తూ కర్నాటక, సిద్ధరామయ్య ప్రస్తావన తెచ్చారు కదా…సిద్ధరామయ్య తీరును మీరు సమర్థిస్తున్నారా. ఓ వర్గాన్ని రెచ్చగొట్టి మతరాజకీయం చేస్తోంది సిద్ధరామయ్య కాదంటారా. గోరంతను కొండంతలు చూపుతూ ..ఇంతను అంతంత చేస్తూ కుహనా లౌకికవాదులు ఓ వైపు రచ్చచేస్తూ.. కుహనా మేధావులు అవార్డు వాపసీఅంటూ మరింత రెచ్చగొడ్తుంటే ఎన్నడూ లేంది టిప్పు సుల్తాన్ జయంతిచేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి…
  ‘కొంపతీసి మీ అనుమానం అనంతపద్మనాభస్వామి దేవాలయం దగ్గరలోని రెస్టారెంట్ల వాళ్ళందరూ వ్యాపారం కోసం కాక కేవలం గుడికి వస్తున్న ధార్మిక హైందవుల మనోభావాలను దెబ్బతియ్యటానికే అలా కుట్ర చేస్తున్నారని అనుకోమంటారా ఏవిటి.’ అన్నారు కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా ఇంచుమించు అలాగే జరుగుతోంది. ఆధ్యాత్మక క్షేత్రం తిరుమలనూ వదలడంలేదు. అక్కడా విచ్చలవిడి మతప్రచారానికి తెగబడుతున్నారు. అలాంటివి మీకు కనిపించడంలేదా రామయ్యగారూ.
  ప్రవీణ్ గారి ‘ఆవుల్ని రక్షించడానికి మనుషుల్ని చంపాల్సిన అవసరం వచ్చిందంటే’ వ్యాఖ్య నేను గమనించలేదు. ఆవులను రక్షించడానికి మనుషుల్ని చంపారా. ఎవరండీ…ఎక్కడండీ…ఎంతమందినండీ… నాలాంటిఎంతో మంది మనోభావాల్ని దెబ్బతీసేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. నేను ఇంతకుముందే అన్నట్టు ఇలాంటి వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతినడమే కాదు…హిందువుల్లో సహనం చచ్చిపోతుంది. అది నిజంగానే ప్రమాదకరం ..దయచేసి గుర్తించండి…సర్వమానవ శ్రేయస్సు కోరుకునేవారే అయితే నిష్పాక్షికంగా ఆలోచించండి ..వాస్తవాలు గమనించండి..కుహనాలౌకికవాదులు భయపడుతున్నట్టు దేశంలో అంత ఘోరాలు ఏం జరగడంలేదు..భారతం చాలా ప్రశాంతంగా ఉంది. మొసలి కన్నీరు కారుస్తూ వితండవాదాలతో దేశంలోని ప్రశాంతవతావారణాన్ని దయచేసి కలుషితం చేయవద్దని సోకాల్డ్ సెక్యులరిస్టులకు నావిన్నపం ..

 65. కె.కె. రామయ్య says:

  దేవికా రాణి గారు, మా మిత్రుడు బందరు R.V. రమణ ఇచ్చిన వివరణల కంటే ఎక్కువగా నేనేవీ రాయలేను. దేశంలో పెచ్చరిల్లుతున్న మతవిద్వేషాలకు ( religious intolerance కు ) నిరసనగా ప్రభుత్వం తమకిచ్చిన పురస్కారాలను తిరిగి ఇచ్చివేస్తున్న వాళ్లు కుహనా మేధావులు కారు. చిల్లర రాజకీయాలు చేసేవాళ్లు అంతకన్నా కారు. కన్నడ రాజ్యోత్సవ సంబరాల సందర్భంగా కర్నాటక ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవం నిర్వహిస్తే హిందూ మతానికొచ్చిన విపత్తేవిటి? హిందూ మతం పట్ల హైలీ పొసెస్సివ్ గా, హైపర్ సెన్సిటివ్ గా, చిన్న చిన్న విషయాలకు కూడా సహనం కోల్పోతున్నట్లుగా మనం కనపడాల్సిన అవసరం లేదని నా మనవి. దేశప్రజల కనీస అవసరాలైన కూడు, గుడ్డా, నీడ, జీవనోపాధి, విద్య వైద్య రవాణా సౌకర్యాలు, సుపరిపాలన వంటి విషయాలు వదిలేసి మతాన్ని మాత్రమే జపిస్తూ కూర్చుంటే మనదేశవెట్లా బాగుపడుద్దండి.

 66. devikarani says:

  రమణ గారూ మీ అంత మేధావిని అయి ఉండకపోవచ్చుకానీ…నాకూ అంతో ఇంతో అవగాహన ఉందండి. నేను మీలాంటి లౌకికవాదులను ఏమీ అనడంలేదు…కుహనా లౌకికవాదులను అంటున్నాను. అందుకు మీరు భుజాలు తడుముకుంటున్నారెందుకు? మతాన్ని రాజకీయంతో ముడిపెట్టొద్దు అంటున్నారు. కానీ నిజంగానే రాజకీయాలు అలా ఉన్నాయంటారా? అంతటా కుల రాజకీయాలు, మత రాజకీయాలే కదా. అలాంటప్పుడు ఒక్కపార్టీనో ..ఒక మతాన్ని అనుసరించేవారిని మాత్రమే ఎలా తప్పుబడతారన్నదే నా ప్రశ్న.హిందువులుగా చెప్పుకోవడం ఇష్టంలేని హిందుత్వలోని లోపాల్ని మాత్రమే ఎత్తిచూపేవాళ్లను చూపిస్తారా అన్నాడు. ఓ బోలెడుమందిని చూపిస్తా..
  రామయ్యగారూ మీ అంత మేధావినీ నేను కానేమో..కానీ నాకు కొంచెం బాగానే తెలుసండీ. జర్నలిస్టునైన నేను తెలుగు సాహిత్య విద్యార్థినిని కూడా. అవార్డులు వాపస్ చేసిన వాళ్లల్లో 90 శాతం రాజకీయపార్టీల ప్రేరేపితులేనన్నది మాత్రం వాస్తవం. సాహిత్య పురస్కారాలు తీసుకున్న వాళ్లల్లో ఇప్పుడు 1200 మంది వరకు బతికున్నారు. మరి వాపస్ ఇవ్వని వాళ్లంతా మేధావులు కాదంటారా. ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరకు మద్దతుగా నిలిచి…అంతా ప్రశాంతంగా ఉందన్న సైంటిస్టు భార్గవ లాంటి వాళ్లను మీరెలా సమర్థిస్తారండీ. అందుకు ప్రతిఫలమే ఆయనకు పద్మ అవార్డు. ఆ జగమెరిగిన సత్యం మీరెరుగరని నేననుకోను. ఢిల్లీలో సిక్కుల ఊచకోతప్పుడు, కశ్మీరీ పండిట్లను తరిమికొట్టినప్పుడు, వాళ్ల సాహిత్యాన్ని తగులబెట్టినప్పుడు వాళ్ల మేధావి తనం ఏమైంది? ఇప్పుడు మాత్రం ఏదో జరుగుతోందని గగ్గోలు పెడితే ఎలా?వాళ్లు కుహనా మేధావులు కాక ఇంకేంటి?.

  • దేవికారాణిగారూ మేధావుల ప్రస్తావన తెచ్చినది మీరేనండీ. ఇక్కడ విషయం ఎవరు ఎంత మేధావులో నిరూపించుకోవడం గురించి కాదు. నాకూ ఎంతో కొంత అవగాహన ఉంది అన్నారు. మీకు చాలా విషయాల్లో గొప్ప అవగాహన ఉంటే ఉందేమో. కానీ ఇక్కడ చర్చిస్తున్న విషయంలో మీ అవగాహన గురించే నేను అన్నాను. దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు ఆ విషయం పై ఎంతో కొంత అవగాహన ఉంటే సరిపోదని మీరు ఒప్పుకుంటారనుకుంటున్నాను. హిందుత్వలోని లోపాలను మాత్రమే ఎత్తి చూపుతూ హిందువుగా చెప్పుకోవడం ఇష్టంలేని వారిని మీరు ఎంతమందిని చూశారో వారి పేర్లు, ఉదాహరణలతో ఇమ్మని మిమ్మల్ని అడిగాను. ఓ బోలెడు మందిని చూపిస్తానన్నారు కానీ ఒక్క పేరూ చెప్పలేదు. దీనిని తప్పించుకోవడం అంటారండీ. హిందువు అయినంత మాత్రాన నేను హిందువును అని ఎవరూ మొహం మీద పట్టీ అంటించుకుని తిరగరు. తిరుపతి లాంటి ఏ క్షేత్రానికి వెళ్ళినప్పుడో హిందువు అవునా కాదా అన్న ప్రశ్న వస్తుందేమో కానీ, పబ్లిక్ స్థలాలలో, పబ్లిక్ రాజకీయాల్లో హిందువును అని చెప్పుకునే అవసరం ఎందుకొస్తుందండీ. రాకూడదనే లౌకికవాదులు కోరుకుంటారు. హిందూత్వ గురించి చెప్పే పార్టీని, వర్గాలను ఇష్టపడేవారే, హిందువుగా చెప్పుకోవడం ఇష్టం లేని వారు అంటూ మీరు చేసిన ఆరోపణ చేస్తారు. ఇది ఇష్టం, అయిష్టానికి చెందిన విషయం కాదు. అవసరం, అనవసరం అన్న దానికి సంబంధించినది. ఇంతకీ మీ బాధల్లా కుల, మతరాజకీయాలు చేస్తున్న అన్ని పార్టీలనూ అనకుండా హిందువుల పార్టీని మాత్రమే అంటున్నందుకా, లేక అసలు కుల, మత రాజకీయాలు చేస్తున్నందుకా? స్పష్టంగా చెప్పండి. మొత్తం కుల, మతరాజకీయాలనే మీరు వ్యతిరేకిస్తుంటే మీతో నాకు ఎలాంటి వివాదం లేదు. నేనైతే ముస్లిం, క్రైస్తవ మత రాజకీయాలను కూడా వ్యతిరేకిస్తాను. మీరు కూడా హిందూ మత రాజకీయాలను వ్యతిరేకిస్తానని చెప్పగలరా? ఒకదానితో ఒకటి పోటీ పెట్టి తప్పించుకోకుండా మీ అభిప్రాయం చెప్పండి.
   మీరు కుహనా లౌకిక వాదులు అని ఇంకో మాట వాడారు. ఆ మాటకు నిర్వచనం ఏమిటి? వివరించగలరు.

 67. కె.కె. రామయ్య says:

  ప్రియమైన దేవికారాణి గారు, మీరు జర్నలిస్టు, తెలుగు సాహిత్య విద్యార్థిని అని తెలుసుకుని సంతోసిస్తుంనాము. మీరు కాని, చంద్రిక గారు కాని మేధావులు కారన్నట్లుగా మేమేమైనా వ్యాఖ్యానించి ఉంటే మన్నించండి, (మేము సాధారణ పాఠకులము. అందువల్ల విషయ పరిజ్ఞానంలో మా లోపాలు మాకుంటాయి). కాని హిందూ మతం తలుచుకుంటూ ఉద్రేకపూరితులవుతూ మీరు చేస్తున్న వాదనలతో ఏకీభవించలేకున్నాను.

  నాటి సైంటిస్టు భార్గవ, సూరి భగవంతం ల ప్రస్తావన కన్నా నేడు తమ నిరసన గళం విప్పిన మేధావులను అర్ధంచేసుకోవటానికి ప్రయత్నిద్దాం; అవార్డు గ్రహీతల మొత్తం సంఖ్యలో వాళ్లు చాలా తక్కువ శాతం అని భావించినా, రాజకీయ ప్రేరితులైనవాళ్లైనా సరే.

  ఢిల్లీలో సిక్కుల ఊచకోతప్పుడు, కశ్మీరీ పండిట్లను తరిమికొట్టినప్పుడు, వాళ్ల సాహిత్యాన్ని తగులబెట్టినప్పుడు కూడా మేధావి వర్గం తన నిరసన తెలియచేసింది. అదే స్థాయిలో కాకున్నా, అలాంటి సంఘటనలే కాకున్నా నేడు జరుగుతున్నవి కూడా అవాంచనీయ సంఘటనలే. వాటిని ప్రతిఘటించాల్సిన్దే.

  అలాగే ఈ దేశ ఇతర మైనారిటీ వర్గాల … ముస్లింలు, క్రిష్టియన్లు, దళితులూ, స్త్రీలు ఇలా అనేక వర్గాల హక్కుల పరిరక్షణకు మీలాంటి భాధ్యతాయుతమైన జర్నలిస్టులు, యువత మద్దత్తు ఇవ్వాలి. మీరెంతో ప్రేమించే మీ మాత్రుదేశం ఓ ఆప్ఘనిస్తాన్ లాగో, ఓ సిరియా లాగో కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదున్నది. దయచేసి మీరు ఒక్క హిందూ వర్గ రక్షకులుగా మిగిలిపోకండి. అసమానతలు, అన్యాయాలకు గురవుతున్న సహచరుల చెమట, కన్నీటి, రక్త చారికలు మూగ నేరారారోపణ చేస్తున్నప్పుడు నోరువిప్పని దోషులుగా మనం నిలపడొద్దు. ఓ సెక్కులర్ హిందూగా కాదు, ఈ గడ్డమీద పుట్టిన ఓ సాధారణ పౌరుడిగా ఇది నా విన్నపం.

  • కాని హిందూ మతం తలుచుకుంటూ ఉద్రేకపూరితులవుతూ మీరు చేస్తున్న వాదనలతో ఏకీభవించలేకున్నాను.

   1) This is the fundamental flaw in so called intellectuals & leftist or . If Muslims practice their religion, It is their right. When hindus do it, It is communalism. Worse thing this so called Left liberals do is ideological intolerance. They can’t tolerate the existence of hindu right but they pander to Minority right shamelessly.
   CPI & CPM were part of UPA I which had MIM & muslim league. Even on this website any hindu who asks questions is labelled sanghi.
   నాటి సైంటిస్టు భార్గవ, సూరి భగవంతం ల ప్రస్తావన కన్నా నేడు తమ నిరసన గళం విప్పిన మేధావులను అర్ధంచేసుకోవటానికి ప్రయత్నిద్దాం; అవార్డు గ్రహీతల మొత్తం సంఖ్యలో వాళ్లు చాలా తక్కువ శాతం అని భావించినా, రాజకీయ ప్రేరితులైనవాళ్లైనా సరే.

   2) We can only support them when we respect their motive. Trust me Most of them ( I would say 90%) are doing it for political reasons.
   ఢిల్లీలో సిక్కుల ఊచకోతప్పుడు, కశ్మీరీ పండిట్లను తరిమికొట్టినప్పుడు, వాళ్ల సాహిత్యాన్ని తగులబెట్టినప్పుడు కూడా మేధావి వర్గం తన నిరసన తెలియచేసింది. అదే స్థాయిలో కాకున్నా, అలాంటి సంఘటనలే కాకున్నా నేడు జరుగుతున్నవి కూడా అవాంచనీయ సంఘటనలే. వాటిని ప్రతిఘటించాల్సిన్దే.

   3) So if 10,000 Sikhs are butchered by Congress, No writer & liberal returns his award. If 200,000 Hindus are attacked & killed & raped, No one talks about intolerance.
   Same applies to Neil Massacre, Bhagalpur riots or 2002 riots, Where thousands of Muslims were massacred .
   When four people die, They return 100 awards because the victims are rationalists ( one of their own). This is looks like worst kind of Racism & elitism . We only care when we are attacked. Rest doesn’t matter.
   Let me tell you that worst part. If you ask them any questions, You are labelled a Sanghi. They can paint the whole nation bad & one billion hindus are intolerant as bad as Nazi’s but we don’t even right to question them. If this is not worst kind of racism & elitism, What is ? . This people themselves are intolerant to the core to other ideas & perspectives.
   అలాగే ఈ దేశ ఇతర మైనారిటీ వర్గాల … ముస్లింలు, క్రిష్టియన్లు, దళితులూ, స్త్రీలు ఇలా అనేక వర్గాల హక్కుల పరిరక్షణకు మీలాంటి భాధ్యతాయుతమైన జర్నలిస్టులు, యువత మద్దత్తు ఇవ్వాలి.

   4) We would definitely do support the rights minorities as equal citizens.But we are not ready to listen to this stupid brigade .
   మీరెంతో ప్రేమించే మీ మాత్రుదేశం ఓ ఆప్ఘనిస్తాన్ లాగో, ఓ సిరియా లాగో కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదున్నది. దయచేసి మీరు ఒక్క హిందూ వర్గ రక్షకులుగా మిగిలిపోకండి. అసమానతలు, అన్యాయాలకు గురవుతున్న సహచరుల చెమట, కన్నీటి, రక్త చారికలు మూగ నేరారారోపణ చేస్తున్నప్పుడు నోరువిప్పని దోషులుగా మనం నిలపడొద్దు. ఓ సెక్కులర్ హిందూగా కాదు, ఈ గడ్డమీద పుట్టిన ఓ సాధారణ పౌరుడిగా ఇది నా విన్నపం.

   5) I never voted for BJP. I would definitely do it now. Why ? Even though I don’t like their rightist elements, At Least they don’t pander to minority fundamentalism at cost of ruining the nation. We know that Congress & leftists support minority fundamentalism and BJP supports majority fundamentalism. Which I should choose as hindu? They way this leftists are making mountain out of mole in this issue, Now we know why BJP is needed. For all it’s flaws & mistakes, BJP showed us the true colors of Media & liberals of this country. If

 68. కె.కె. రామయ్య says:

  అప్రస్తుతమో కాదో తెలియదు కాని, ఈ సందర్భంగా ప్రముఖ తెలుగుకదా రచయిత త్రిపుర గారి అల్లుడు, శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు కినిగే అంతర్జాల పత్రికలో రాసిన “ఇద్దరు మావయ్యల కధను ” మరోసారి చదావలనిపిస్తోంది. నలుగురికీ చూపాలనిపిస్తోంది.
  http://patrika.kinige.com/?p=5708

  • చందు - తులసి says:

   రామయ్య గారూ….కథ చదివాను…. చాలా బాగుంది. కథ ముగింపులో…వాళ్ల అమ్మగారు చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుంటాయి..
   మంచి కథను చదివించిన మీకు ధన్యవాదములు.

 69. // అవార్డులు వాపస్ చేసిన వాళ్లల్లో 90 శాతం రాజకీయపార్టీల ప్రేరేపితులేనన్నది మాత్రం వాస్తవం//
  రాజకీయపార్టీల ప్రేరేపితులు కాని వారు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? ఉంటే ఎలాంటి వాళ్ళు ? ఇక్కడ కామెంట్ చేస్తున్నా రామయ్య గారా? రమణ గారా ? చంద్ర్తిక గారా? లేక మీరా? ఎవరండి రాజకీయా ప్రేరేపితులు? కాని వారు?
  ఒక జర్నలిస్టుగా మీరు ప్రజల వైపునుండి మాట్లాడాల్సిన వారు పాలక వర్గాల వైపు నుండి మాట్లాడతున్నారు. ‘ హిందు’ రాజకీయం చేస్తున్న వారు పాలక వర్గాల వారు. వారిని అనుసరించడమే మీ న్యాయమా ? అయితే మీరు కరెక్టే ! ప్రజల వైపు నుండి మాట్లాడాలని అనుకుంటున్నారా అయితే మీరు కరెక్ట్ కాదు. హిందువులంతా రాజాకీయాలు నడపలేదు. హిందు రాజకీయాలగురిమ్చే మాట్లాడాలి. హిందువుల గురించి కాదు. మీలాంటి జర్నలిస్టులకు హిందువులకు హిందు రాజకీయాలకు తేడా తెలియక పోవడం దురదృష్ట కరం.

 70. కధ గురించి చెప్పడానికేమీ లేదు. ఈ దేశంలో ఒకవేళ ముస్లింలు ఆవుని పూజించే జాతి, హిందువులు దానిని తినే జాతి అయి వుంటే ఈ పాటికి అంత పెద్ద జంతువైన, పవిత్రమైన ఆవుని సుత్తితో తల పగలగొట్టి, నరికి చంపడం ఎంత అరాచకమో కధలు వ్రాసే వారూ. పైగా మైనారిటీలు పూజించే ఆవుని చంపి వారికి ఎంత క్షోభ కలిగిస్తున్నారో అని బాధ పడేవారు. అదో మానసిక స్థితి! ప్రాణులన్నీ ఆహరం కోసం వేరే ప్రానిపై ఆధార పడతాయి. అవసరానికి తింటాయి. దిక్కుమాలిన మనిషి జాతి కాపీనంతో అవసరానికి మించి తింటుంది. అవసరానికి మించి ఒళ్ళు పెంచుకుని తరవాత జాగింగులూ, వ్యాయామాలూ చెయ్యాలని చూస్తారు. వల్లా కాదు. ఇక మనసులో ఏదో తొలుస్తుంది. ఆవు ఎండెంజ్రడ స్పస్ అవబోతదని దానిని తినోద్దన్నారు. కొంత స్థానిక సెంటిమెంట్. ఉండకూడదా? తినే జంతువేదైనా, దానిని గౌరవంతో చూడరు. చంపడంలో కాసింత దయ చూపరు. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారని అదో వాదన-నెమళ్ళూ పావురాలూ ఇంకా చాలా పక్షులు నశించి పోయాయి. తినడం, మనుషులు కాబట్టి ఓ అధికారంగా చూస్తారు. జంతువులు విప్లవం తెచ్చి ఈ చెత్త మానవ జాతిని అదుపు చేస్తే బావుండు-నా వోటు జంతువులకే, నేను మనిషిని కాబట్టి అవి నన్ను తినేసినా కూడా. మనిష-అడుక్కునే వాడైనా, రాజకీయపు వాడైనా పరిస్థితుల బట్టి అలా వుంటారు. లోపల ఇద్దరూ ఒకటే.
  కుదిరినన్నాళ్ళూ పాలు పిండు. నీ కూతురితో , కోడలితో సమానంగా గర్భం మోస్తుంది ఆవు. పని తీరాక అమ్మీసేయ్. ఆ ముసలి జంత్వుకి మోక్షం కలిగించే వాడు ఎక్కడో ఉంటాడు. ఇంతలోగా కావలసినంత రాజకీయం. సక్యత లేదు, ఇంగితం లేదు,ఏ ఒక్క విష్యం పైనా అవ్గాహన్ లేదు. ఊరికే మనలిని మనం దుమ్మేత్తుకోడమే గొప్ప. ఆవగింజ సంస్కరణ ఉందా అంతే అదీ లేదు. ఎలా వుంటుందీ. అసలు నీకూ నాకూ కావలసింది అది కాదుగా. కాలక్షేపం, పనికి మాలిన …ఏవనాలి…

  • చందు-తులసి says:

   హరి గారూ. కథలు కవితలూ….ఎవరు కూడా ఒక మతం వాళ్లను కించపరుద్దామనో…అవమానిద్దామనో పనిగట్టుుకుని రాయరు. రచయిత ఒక ఉద్దేశంతో రాస్తే అది ఈకలు పీకే వారు ఇంకో కోణంలో విపరీతార్థాలు తీయడం వల్ల వివాదాస్పదం అవుతాయి.
   ముస్లింలను నెత్తికెక్కించుకుని, హిందువులను మాత్రం కించపరుస్తారని మీరు ఆరోపిస్తున్నారు. సహజంగా సృజన కారులు, రచయితలు, మేధావులు బలహీనులకు మద్దతు ప్రకటిస్తారు. అది సహజం. న్యాయం కూడా. ఆ క్రమంలోనే ఇక్కడ మైనారిటీల తరపున మాట్లాడుతున్నారు తప్పితే…ముస్లింల తరపునో, క్రైస్తవుల తరపునో కాదు.
   ముస్లింలను ఎందుకు ప్రశ్నించరు అని అంటున్నారు….మన సోకాల్డ్ మీడియా, పత్రికలు వాటికి పెద్దగా ప్రాధాన్యతనివ్వడం లేదు కాబట్టి మనకు తెలియడం లేదు కానీ…అన్ని మతాల్లోని లోపాల్ని ప్రశ్నిస్తున్నవారు ఉన్నారు. దాడులు ఎదుర్కొంటున్నారు కూడా.

 71. రామయ్య గారు, నేను మీ లాగే కాలక్షేపం కోసం కథలు చదివే పాఠకురాలిని మాత్రమే. కథలు వ్రాసినా , నిరసనలు చేసినా రాత్రికి రాత్రికి కీర్తి గడించేయాలి అన్న ఆత్రం కాకుండా ఒక సామాన్య మానవుడికి ఉపయోగం కలగాలి అన్నదీ నా వాదన. మీరు వ్రాసిన ఈ వ్యాఖ్యలు ఎవరైనా పరాయి దేశం వారు చదివితే దేశం అల్లకల్లోలం అయిందనే అనుకుంటారు – ‘మీరెంతో ప్రేమించే మీ మాత్రుదేశం ఓ ఆప్ఘనిస్తాన్ లాగో, ఓ సిరియా లాగో కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదున్నది’. దేశం లో అంత దారుణమైన పరిస్థితి లేదు అన్నదీ నా వాదన అందుకే అన్నాను – ‘నిజం గా ఒక వర్గం వారు అంత భయపడుతూ వారికీ కావాల్సిన తిండి తినలేనంత సమాజ పరిస్థితి ఉంటే చాలా స్వానుభవాలే ఉంటాయి. అవే కథలు గా వస్తాయి. ఆ కథల లో నిజమైన ఆవేదన కూడా ఉంటుంది. ఈ కథ కల్పించి వ్రాసిన కథ. ఈ కథలో ఆవేదన ఎక్కడుంది ? ఆయన ఆలోచనలే కథ గా మారాయి’ అని. దేశం లో అంత దారుణమైన పరిస్థితి లేదు కాబట్టే ఇలా కథ కల్పితం అయింది. ఇలాంటి కథలు సమాజాన్ని రెచ్చగొట్టడానికి తప్ప ఏమైనా ఉపయోగమా ? దేశం లో సమస్యలు బోలెడు ఉండగా ఆవు మాంసం గురించి కథలు వ్రాసి చర్చించాల్సినంత విషయమా అని నేను ఈ కథ పై వ్రాసిన వ్యాఖ్యలు జాగ్రత్త గా చదివితే అర్ధం అవ్వాలి. నేను చెప్తున్నది మీరు అర్ధం చేసుకుని ఉంటే ఇన్ని వాదన,చర్చలు ఉండవు. నేను ఎవరితోనూ వాదించదలచుకోలేదు. ధన్యవాదములు -సెలవ్!!

  • చందు - తులసి says:

   ఈ కథ కల్పించి రాసిన కథ..ఆయన ఆలోచనలే కథ రాశారు.. ఇందులో ఆవేదన ఎక్కడుంది…?

   కథలు కల్పించే రాస్తారు. యథాతథంగా జరిగింది రాయరు. సమాజంలో జరుగుతున్న సంఘటనల స్ఫూర్తిగా కొంత కల్పన జత చేసి రాస్తారు….నాకు తెలిసి…
   నిజంగా జరిగినవీ రాస్తారూ కానీ అక్కడా కొంత కల్పన ఉంటుంది. ఇది కేవలం నాకల్పనే అని దేశంలో ఎక్కడా ఏమీ జరగలేదంటున్నారు మీరు..!. మీకు ఏం చెప్పగలం…!!

   నేను చాలా సార్లు చెప్పాను. ఈ కథ బుక్కెడు బువ్వ గురించి..అంతే….
   నేను అడిగింది కూడా సూటిగా చిన్న ప్రశ్న….నాకు
   తిండి పెట్టని వ్యక్తికి…నేను తినే బువ్వను తినకూడదు అని చెప్పే అధికారం ఉందా..?
   ఇదే నా ప్రశ్న…
   ఇప్పుడు సూటిగా చెప్పండి…ఉందా, లేదా..? ఉండదు అని ఒప్పుకుంటే మన మధ్య గొడవే లేదు….
   అధికారం ఉంది అంటే మన మధ్య చర్చకే అవకాశం లేదు…

   • చందు - తులసి says:

    చంద్రిక గారూ పై పోస్టులో నా ప్రశ్న మీకే..మీ పేరు రాయడం మర్చిపోయాను. సారీ..ఏమీ అనుకోకండి మేడమ్.

 72. Srinivas Vuruputuri says:

  ” జంతువులు విప్లవం తెచ్చి ఈ చెత్త మానవ జాతిని అదుపు చేస్తే బావుండు-నా వోటు జంతువులకే, నేను మనిషిని కాబట్టి అవి నన్ను తినేసినా కూడా.”

  మీ మిగతా అభిప్రాయం పట్ల నాకు రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ మీ పై వ్యాఖ్య మాత్రం నాకు నచ్చింది. ఎన్నో సార్లు హైదరాబాద్ వీధుల్లో కొక్కాలకు వేళ్ళాడుతున్న జంతువుల కళేబరాలనూ, వేల్చబడుతున్న కోళ్ళనూ చూసినప్పుడు నాకూ అనిపించేది – ఎక్కడో ఒక జంతువుల రాజ్యం ఉండకపోతుందా అక్కడ అద్దాల తలుపుల వెనక మనుషులను ఇలా వేళ్ళాడతీయకపోతారా అని,,,

  హింస మన జీవితాల్లో అనివార్యమేమో కానీ అది తగ్గితే బావుణ్ణని ఆశ.

  • చందు - తులసి says:

   శ్రీనివాస్ గారూ…జంతువులు తిరుగుబాటు చేయకపోవచ్చునేమో…కానీ ప్రకృతి ఆ పని తప్పక చేస్తుంది. మనిషికీ…అతడి ఆగడాలకూ అట్టుకట్ట వేస్తుంది…..

 73. మీరు ప్రశ్న ఎవరి గురించో అడుగుతున్నరో నాకు అర్ధం కాలేదు.
  కథ లో బిచ్చ గాడి గురించే అయితే ఇది నా సమాధానం:
  కాళ్ళు చేతులు సక్రమంగానే ఉండి ఏమి కష్టపడకుండా చెత్తలో దొరికిన పదార్థం ఏదైనా సరే ఏరుకుని తింటూ ఆనందం తో కడుపు నింపుకునే అతన్ని ఎవరికీ ప్రశ్నించే హక్కు లేదు. అతను ఎవరూ తనకి బువ్వ పెట్టడం లేదని కూడా అంతే ప్రశ్నించకూడదు ఎందుకంటే అడుక్కు తినటం అతడు ఇష్టం గా ఎంచుకున్న పని కాబట్టి.
  అలా కాకుండా మాములుగా ఒక మనిషి గురించి( in general) అయితే ఇది నా సమాధానం:
  ఒక మనిషి నేను ఒక సమాజం లో బ్రతుకున్నాను, సమాజం మీద ఆధార పడి ఉన్నాను అనుకుంటే సమాజం లో ఉన్న కట్టుబాట్లని బట్టి సమాజానికి ఆ మనిషిని అడిగే హక్కు, అధికారం అన్ని ఉంటాయి. నేను ఒక సమాజం లో బ్రతకట్లేదు, నేను సమాజం మీద ఆధారపడను, ఆశించను అనుకునే మనిషిని సమాజానికి అడిగే హక్కు, అధికారం లేవు. సమాజం లో ఉన్నానా లేదా అని ఏ మనిషైనా నిర్ణయించుకోవాలి.

 74. DEVIKA RANI says:

  రామయ్యగారూ నేను ప్రేమించే నా మాతృదేశంమీద నాకెంతో భక్తీ గౌరవం ఉన్నాయి కనుకే ఈ ఆవేదన. ఆఫ్ఘనిస్తాన్ లా, సిరియాలా నా దేశం కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఆ బాధ్యత నాకు తెలుసు కనుకే కుహనా మేధావుల వేషాలు, కుహనా లౌకికవాదులు కుట్రలు చూసి ఆందోళన చెందుతున్నా. హిందూ వర్గ రక్షకురాలిగా మాత్రమే నేను ఉండాలనుకోవడం లేదు. హిందూ వర్గాలకూ రక్షణ కావాలంటున్నా.
  తిరుపాల్ గారూ పాలకవర్గాలవైపు నుంచి నేనెప్పుడు మాట్లాడానండీ. అసలు నావ్యాఖ్యల్లో పార్టీలు, పాలకవర్గాల ప్రస్థాపన ఎక్కడ వచ్చింది. హిందువులకు , హిందు రాజకీయాలకు తేడా తెలియదని నాగురించి మీరెలా జడ్జ్ చేశారండీ. నాగురించి మీరు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు సరిగా అర్థం కాలేదు. కొంచెం అర్థమయ్యేట్టు నా స్థాయిలో చెప్పగలరా వీలైతే…

 75. రాఘవ గారూ.. చిన్నప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.. అని రోజూ ప్రతిజ్ఞ చేస్తూ పెరిగాం. దాని అర్థం ఏమిటి..? వ్యక్తులుగా ఎవరు ఏ మతంలోనైనా పుట్టి ఉండవచ్చు, ఏ సంప్రదాయాలనైనా పాటిస్తూ ఉండవచ్చు. అది వారి ‘ప్రైవేటు వ్యవహారం’. కానీ దేశంగా అంతా ఒక్కటే. మనది మెజారిటీ హిందూ దేశం కాబట్టే మైనారిటీలకు భరోసా కల్పించేలా రాజ్యం నడుచుకోవాలి. వందమంది బలవంతుల మధ్య ఐదుగురు బలహీనులు ఉన్నప్పుడు ఆ ఐదురురి మనోభావాలకు తగిన గౌరవం, వారి గొంతుకకు సమాన స్వాతంత్ర్యం, వారి హక్కులకు రక్షణ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్లు బలహీనులు కాబట్టి. ఏ దేశంలోనైనా బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు, లెఫ్టిస్టులు, మీడియా( ?) సాధారణంగా మహిళలు, దళితులు, మైనారిటీల పక్షం వహిస్తారు. ఎందుకంటే మెజారిటీకి ఏమైనా జరిగితే వారి సంఖ్యే ఆ అన్యాయాన్ని తిప్పికొడుతుంది. మైనారిటీలు బలహీనులు కాబట్టే వీరికి ఆలోచనా పరుల నైతిక మద్దతు అవసరం.
  ఇక మతం విషయానికి వద్దాం. ఈ దేశ ప్రజలు బీజేపీ హిందుత్వ సిద్ధాంతాన్ని చూసి ఓట్లు వెయ్యలేదు. కేవలం నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రాన్ని చూసి మాత్రమే ఓట్లు వేశారు ( గుజరాత్ మోడల్‌ని ఎలా ప్రచారం చేశారన్నది మరో చర్చ). సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకించే వాళ్లు కూడా మోదీ ఏదైనా చేస్తారేమో అని నమ్మారు. కానీ అధికారంలోకి వచ్చాక మహిళల వస్త్రధారణమీద, మైనారిటీల మీద, దళిత క్రైస్తవుల మీద, ముస్లింల మీద సంగీయుల చేస్తున్న విధ్వేషపూరిత ప్రకటనలు కచ్చితంగా ఆయా వర్గాల్లో ఆందోళనకు దారి తీశాయి. ముగ్గురు రచయితలను మత శక్తులు అతి కిరాతకంగా హత్య చేసినా దేశ నాయకత్వం మత శక్తులను దండించే ప్రయత్నం చేయలేదు. ఇది దేనికి నిదర్శనం? ఎప్పటికప్పుడు టెక్నాలజీతో ట్వీట్లతో సామాన్యులకూ అందుబాటులోకి వచ్చిన మోదీ మతం పేరుతో చేస్తున్న దాడులపై ఎన్ని ట్వీట్లు చేశారు. తన వాళ్లను అదుపు చెయ్యలేక మాత్రం కాదు.. ప్రశ్నించే గొంతులకు ఈ దాడులు హెచ్చరికలా పని చెయ్యాలని భావించారు. ఇప్పటికిప్పుడు దేశంలో ఏదో జరిగిపోతోందని ఎందుకు భావిస్తున్నారని చాలా మంది మిత్రులు అంటున్నారు. మరి హిందూ మతానికి ఇప్పటికిప్పుడు వచ్చిన కష్టం, నష్టం ఏముంది? ఇతర మతస్తుల హక్కులకు భంగం కలుగుతోందని ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించిన వారు భారతీయులే కాదు అనీ, పాకిస్థాన్‌కి పోండి అనీ ఈ ‘కుహనా హిందూ ధర్మ రక్షకులు’ వాదిస్తుంటారెందుకు? హిందూ మతం (పవిత్రత జోడించనంతవరకు ఏ మతమైనా) గంగానది లాంటిది. ఆ నదిని అలా ఉండనిచ్చినంత వరకూ బాగానే ఉండేది. కానీ దానికి పవిత్రత జోడించి శవాలను, శ్రేష్ఠంగా భావించి అనే వ్యర్థాలను అందులో కలపడం ప్రారంభించాక అసలైన ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుటికీ పవిత్రతా మంత్రమే జపిస్తే నదిలో శవాల దిబ్బలు, కలుషితాల కుప్పలు తప్ప నీళ్లుండవు. ఈ ఉదాహరణతో మీకు విషయం బాగా అర్థమౌతుందని చెప్పాను. ఏ మతమైనా అంతే. మతాలు మనిషి పరిణామక్రమంలో భాగంగా అలవాట్లు, ఆచార వ్యవహారాల ఆధారంగా రూపుదిద్దుకుంటాయి. అలాంటి మతాన్ని పాటించడమో, పాటించకపోవడమో తప్ప రక్షించడాలు ఉండవు. ఎందుకంటే రక్షించడం అంటే గంగానదికి పవిత్రత జోడించి పాడు చేసినట్లే. హిందూమత పరిరక్షణకు దిగిన వాళ్లైనా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులైనా తెలుసుకోవాల్సిన సత్యం ఇది.

  మరి హిందూమతంపైనే ‘అంతా’ ఎందుకు దాడి చేస్తున్నారు అని మీరు అనొచ్చు. మీరనుకునే దాడి చేస్తున్నది హిందూ మతంపై కాదు. ఆ ముసుగు తొడుక్కొని తమను తాము రక్షకులుగా, దేశభక్తులుగా చెప్పుకునేవారిపైన. దేశభక్తి… అందరినీ ప్రేమించడంలో, ఎదుటి వారి మనోభావాలను గౌరవించడంలో ఉంటుందిగానీ, ద్వేషించడంలో ఉండదు. కేవలం మతం పేరుతో ఆహార అలవాట్లపై, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు చెయ్యడం కచ్చితంగా హిందూ మత ధర్మం మాత్రం కాదు. మతం కోసం గుండెలు బాదుకునే వారికి ఈ ఆలోచన ఎందుకు కలుగదో ఆశ్చర్యం వేస్తుంది. హిందూ మతంలో విలువైనదిగా చెప్పుకునే పరమత సహనం వల్లనే ‘హిందుత్వ’ పుట్టుకకు ముందు ఈ దేశంలో ఇంతటి అసహనం లేదు. ఇక్కడ ‘హిందుత్వ’ వేరు, ‘హిందువులు-హిందూ మతం’ వేరు అనేది గుర్తించాలి.
  ప్రతిజ్ఞ చేస్తూ పెరిగినట్లు భారతీయులందరినీ(మనుషులందరినీ కూడా) సహోదరులుగా భావించకపోతే అది దేశభక్తి కాదు దేశద్రోహమే. దేశ భక్తులెవరో, దేశద్రోహులెవరో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.

  • *ఈ దేశ ప్రజలు బీజేపీ హిందుత్వ సిద్ధాంతాన్ని చూసి ఓట్లు వెయ్యలేదు. కేవలం నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రాన్న చూసి మాత్రమే ఓట్లు వేశారు*
   అది మీ అభిప్రాయం. బిజెపి కి హిందుత్వకి గల అవినాభావ సంబందం దేశ ప్రజలకు బాగా తెలుసు. అందులో వాళ్లేసుకొన్న ముసుగేమి లేదు. లెఫ్ట్ లిబరల్స్ మీడియాలో నమో గుజరాత్ మోడల్ పెద్ద బోగస్ అని, ఆయన కరుడు గట్టిన హిందుత్వ వాదని,
   12 సంవత్సరాలకు పైగా ప్రచారం చేయలేదా? గత ఎన్నికలలో ఆయనను అడ్డుకొనటానికి, అతని ఇమేజ్ పై చల్లని బురదలేదు. కుహనా లౌకిక వాదుల ప్రచారాలను తిప్పొ కొడుతూ, మోడికి దేశ ప్రజలు అధికారం కట్టబెట్టారు.

   • చందు - తులసి says:

    మోడీ విజయానికి ఆయన పనితీరు కన్నా..
    రాహుల్ గాంధీకి ఎక్కువ క్రెడిట్ దక్కాలి.
    మరో ప్రత్యామ్నాయం ఉండి ఉంటే మీరు చెప్పింది నిజమే అనుకోవచ్చు.

   • చందు - తులసి says:

    ఇంకో సంగతి ఏంటంటే….మీరు బీహార్ తీర్పును మర్చిపోయి మాట్లాడుతున్నారు.
    మీరు చెప్పినవి బీహార్ లో ఎందుకు పనిచేయలేదు..?
    ఎందుకంటే ఆల్టర్నేట్ ఉంది కాబట్టి…

   • దేశాన్ని 500 వెనక్కి నడిపించడానికి రవి అస్తమించని బ్రితిష్ సామ్రాజ్యం లాంటిది అవసరం లేదు. “ఆవుని చంపినవాణ్ణి హత్య చెయ్యాలి” అని తమ పత్రికల్లో బహిరంగంగా వ్రాసుకునే హిందూత్వ సంస్థలు ఉంటే చాలు. అభివృద్ధి మంత్రం జపించే నరేంద్ర మోదీ ఈ beef lynching ఘటనపై ఏమీ మాట్లాడలేదు. భాజపాకి నవ ఉదారవాద అజెందా కావాలి, వెనుకబాటు నమ్మకాలు కూడా కావాలి.

 76. తులసి గారు,
  “రాఘవ గారూ.. చిన్నప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.. అని రోజూ ప్రతిజ్ఞ చేస్తూ పెరిగాం. దాని అర్థం ఏమిటి..? వ్యక్తులుగా ఎవరు ఏ మతంలోనైనా పుట్టి ఉండవచ్చు, ఏ సంప్రదాయాలనైనా పాటిస్తూ ఉండవచ్చు. అది వారి ‘ప్రైవేటు వ్యవహారం’. కానీ దేశంగా అంతా ఒక్కటే. మనది మెజారిటీ హిందూ దేశం కాబట్టే మైనారిటీలకు భరోసా కల్పించేలా రాజ్యం నడుచుకోవాలి. వందమంది బలవంతుల మధ్య ఐదుగురు బలహీనులు ఉన్నప్పుడు ఆ ఐదురురి మనోభావాలకు తగిన గౌరవం, వారి గొంతుకకు సమాన స్వాతంత్ర్యం, వారి హక్కులకు రక్షణ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్లు బలహీనులు కాబట్టి. ”
  1) మైనారిటీస్ కి సమాన హక్కులు కచ్చితంగా ivvali. నిజానికి రాజ్యాగం ఇంకా ఎక్కువే హక్కులు ఇచ్చింది. అవార్డు వాపసి ని వ్యతిరేకించే వాళ్ళంతా దాద్రి ని నిర్ద్వాన్దందంగానే ఖండిస్తున్నారు.

  ఏ దేశంలోనైనా బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు, లెఫ్టిస్టులు, మీడియా( ?) సాధారణంగా మహిళలు, దళితులు, మైనారిటీల పక్షం వహిస్తారు. ఎందుకంటే మెజారిటీకి ఏమైనా జరిగితే వారి సంఖ్యే ఆ అన్యాయాన్ని తిప్పికొడుతుంది. మైనారిటీలు బలహీనులు కాబట్టే వీరికి ఆలోచనా పరుల నైతిక మద్దతు అవసరం.
  2) సో కాల్డ్ intellectuals మద్దతు ఇస్తుంది మైనారిటీ హక్కులకు కాదు. మైనారిటీ వోట్ బ్యాంకు రాజకీయాలకు. ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా లో Polygamy గురించి మాట్లాడే దమ్ము వీళ్ళలో ఒక్కడికి కూడా లేదు. అన్యాయం ఎవరికీ జరిగిన సపోర్ట్ చెయ్యాలి కదా వాళ్ళకి . మొదటగా అసలు ఇండియా లో మెజారిటీ , మైనారిటీ కాన్సెప్ట్ దండగ . ఎందుకంటే హిందుస్ ఒక్క ethnicity వాళ్ళు కాదు. langauage & Caste , Region తో డివైడ్ అయ్యారు. మెజారిటీ వారి కి జరిగిన అన్యాయాలని తిప్పి కొట్టగలిగితే కాశ్మీర్ పండిట్ లు ఇంత దారుణ పర్తిస్థితి లో వుండే వారా ? హిందూ దేవాలయాలు గవర్నమెంట్ చేతిలో వుంటాయి కానీ ఇతర మతాల వారివి వారి ఇష్టం. దీన్నే ప్రతిఘతించలేని స్థితిలో వున్నారు. మరి వీరికి లెఫ్టిస్ట్ లు ఏమి మాట్లాడార ? అంటే హిందువులు మనుషులు కారా లెఫ్టిస్ట్ కి ? కేవలం మైనారిటీస్ కి మాత్రమే మేము పని చేస్తాం మెజారిటీ ఎలా చచ్చిన మాకు సంబంధం లేదు అంటే ఎలా ? ఈ ఇజం ఐన ముందు హ్యుమానిటీ వుండాలి కదా ? అది మర్చిపోయారా?
  ఇక మతం విషయానికి వద్దాం. ఈ దేశ ప్రజలు బీజేపీ హిందుత్వ సిద్ధాంతాన్ని చూసి ఓట్లు వెయ్యలేదు. కేవలం నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రాన్ని చూసి మాత్రమే ఓట్లు వేశారు ( గుజరాత్ మోడల్‌ని ఎలా ప్రచారం చేశారన్నది మరో చర్చ). సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకించే వాళ్లు కూడా మోదీ ఏదైనా చేస్తారేమో అని నమ్మారు.
  3) అసలు వేరే alternative వుంటే మోడీ వచ్చే వాడా ? లేదు? రాహుల్ గాంధీ లాంటి బఫూన్ ని కాంపిటీషన్ గా పెడితే మోడీ ఎం కర్మ ఎవడిన గెలుస్తాడు ?
  కానీ అధికారంలోకి వచ్చాక మహిళల వస్త్రధారణమీద, మైనారిటీల మీద, దళిత క్రైస్తవుల మీద, ముస్లింల మీద సంగీయుల చేస్తున్న విధ్వేషపూరిత ప్రకటనలు కచ్చితంగా ఆయా వర్గాల్లో ఆందోళనకు దారి తీశాయి. ముగ్గురు రచయితలను మత శక్తులు అతి కిరాతకంగా హత్య చేసినా దేశ నాయకత్వం మత శక్తులను దండించే ప్రయత్నం చేయలేదు. ఇది దేనికి నిదర్శనం?
  4) For Sakshi Maharaj there is an Akbaruddien Owisi . For every Sadvi Prachi there is an Azam Khan.
  Fringe Elements రెండు వైపులా వున్నాయి. వాటిని కంట్రోల్ లో పెట్టాలి. ఇది కచ్చింతంగా మోడీ ఫెయిల్యూర్.
  జేసుదాస్, మురళి మోహన్ కూడా మహిళల మీద కామెంట్స్ చేసారు. ఢిల్లీ చర్చి అటాక్స్ ఒక పెద్ద ఫార్సు అని రుజువయ్యింది.
  చనిపోయిన వాళ్ళలో ఇద్దరు కాంగ్రెస్ గవర్నమెంట్ టైం లో చంపబడ్డారు. మరి సోనియా గాంధీ ని ఒక్కరు అడగరెందుకు ?
  లా & ఆర్డర్ స్టేట్ సబ్జెక్టు కదా. పోనీ చంపినా వాళ్ళు ఎవరో తెలిసి కూడా BJP గవర్నమెంట్ protection ఇస్తోందా ? అల వుంటే ఈ మీడియా ఎప్పుడో బయటపెట్ట్ది వుండేది.

  ఎప్పటికప్పుడు టెక్నాలజీతో ట్వీట్లతో సామాన్యులకూ అందుబాటులోకి వచ్చిన మోదీ మతం పేరుతో చేస్తున్న దాడులపై ఎన్ని ట్వీట్లు చేశారు. తన వాళ్లను అదుపు చెయ్యలేక మాత్రం కాదు.. ప్రశ్నించే గొంతులకు ఈ దాడులు హెచ్చరికలా పని చెయ్యాలని భావించారు. ఇప్పటికిప్పుడు దేశంలో ఏదో జరిగిపోతోందని ఎందుకు భావిస్తున్నారని చాలా మంది మిత్రులు అంటున్నారు. మరి హిందూ మతానికి ఇప్పటికిప్పుడు వచ్చిన కష్టం, నష్టం ఏముంది? ఇతర మతస్తుల హక్కులకు భంగం కలుగుతోందని ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించిన వారు భారతీయులే కాదు అనీ, పాకిస్థాన్‌కి పోండి అనీ ఈ ‘కుహనా హిందూ ధర్మ రక్షకులు’ వాదిస్తుంటారెందుకు? హిందూ మతం (పవిత్రత జోడించనంతవరకు ఏ మతమైనా) గంగానది లాంటిది. ఆ నదిని అలా ఉండనిచ్చినంత వరకూ బాగానే ఉండేది. కానీ దానికి పవిత్రత జోడించి శవాలను, శ్రేష్ఠంగా భావించి అనే వ్యర్థాలను అందులో కలపడం ప్రారంభించాక అసలైన ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుటికీ పవిత్రతా మంత్రమే జపిస్తే నదిలో శవాల దిబ్బలు, కలుషితాల కుప్పలు తప్ప నీళ్లుండవు. ఈ ఉదాహరణతో మీకు విషయం బాగా అర్థమౌతుందని చెప్పాను. ఏ మతమైనా అంతే. మతాలు మనిషి పరిణామక్రమంలో భాగంగా అలవాట్లు, ఆచార వ్యవహారాల ఆధారంగా రూపుదిద్దుకుంటాయి. అలాంటి మతాన్ని పాటించడమో, పాటించకపోవడమో తప్ప రక్షించడాలు ఉండవు. ఎందుకంటే రక్షించడం అంటే గంగానదికి పవిత్రత జోడించి పాడు చేసినట్లే. హిందూమత పరిరక్షణకు దిగిన వాళ్లైనా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులైనా తెలుసుకోవాల్సిన సత్యం ఇది.
  మరి హిందూమతంపైనే ‘అంతా’ ఎందుకు దాడి చేస్తున్నారు అని మీరు అనొచ్చు. మీరనుకునే దాడి చేస్తున్నది హిందూ మతంపై కాదు. ఆ ముసుగు తొడుక్కొని తమను తాము రక్షకులుగా, దేశభక్తులుగా చెప్పుకునేవారిపైన. దేశభక్తి… అందరినీ ప్రేమించడంలో, ఎదుటి వారి మనోభావాలను గౌరవించడంలో ఉంటుందిగానీ, ద్వేషించడంలో ఉండదు. కేవలం మతం పేరుతో ఆహార అలవాట్లపై, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు చెయ్యడం కచ్చితంగా హిందూ మత ధర్మం మాత్రం కాదు. మతం కోసం గుండెలు బాదుకునే వారికి ఈ ఆలోచన ఎందుకు కలుగదో ఆశ్చర్యం వేస్తుంది. హిందూ మతంలో విలువైనదిగా చెప్పుకునే పరమత సహనం వల్లనే ‘హిందుత్వ’ పుట్టుకకు ముందు ఈ దేశంలో ఇంతటి అసహనం లేదు. ఇక్కడ ‘హిందుత్వ’ వేరు, ‘హిందువులు-హిందూ మతం’ వేరు అనేది గుర్తించాలి.
  ప్రతిజ్ఞ చేస్తూ పెరిగినట్లు భారతీయులందరినీ(మనుషులందరినీ కూడా) సహోదరులుగా భావించకపోతే అది దేశభక్తి కాదు దేశద్రోహమే. దేశ భక్తులెవరో, దేశద్రోహులెవరో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.

  4) మోడీ రెస్పాన్స్ అస్సలు ఏమి బాగా లేదు. అందరు మన్మోహన్ కన్నా వీక్ గా respond అయ్యాడు అని అంటున్నారు. అది నిజమే. దాన్ని ఖండించండి. నిరసనలు అన్ని రకాలుగా వ్యక్తం చెయ్యండి. కాని ఇదే అన్నిటికన్నా ఘోరం అంటే మీ ఆలోచన సరళిని ఖండిచాల్సిందే. పైన చెప్పినట్టుగా అది 1984 లాంటి riots లో చనిపోయిన వాళ్ళని అవమానిచడమే. I stand by what I said above that it looks like pure elitism and worst form of racism where 3 of our lives are far more important than thousands of normal people ‘స life because we are special.

  If they care about Minorities, How many awards were returned for 2002 riots?
  If they care about Dalits, How many awards were returned for khairalanii, karamchedu and lakshmipeta massacres
  If they care about women, How any awards were returned about vakapalli, Nirbhaya,acid attacks or jessica lal or Priyadarshini matoo .
  As you told already they don’t care about hindus, So we don’t expect any thing from them.
  I am sorry if the above comparisons look childish. Trust me Award wapasi looks Stupid.
  Only person returned his award before for 1984 Riots and that was khushwanth singh.
  There seems to great intolerance to the fact that some like Modi whom they hated so much came to power.That is very bad for democracy as it shows that you don’t respect people’s mandate.
  Even today most of leftist would ban BJP if it would have been possible.
  I hate leftist idea that hindu right can’t exist as it is against their school of thought.
  For me that is the greatest intolerance. You can see how mani shankar ayyar went to pakistan berated this country. That reminded of treachary by left to this country during 1962 war. Desperate times calls for desperate measures I guess.
  It is more about class than anything else. How can anyone who is not from delhi and didn’t study in St.Stephens or JNU or Oxford can rule the country. How can he make Lyuten mafia irrelevant.
  We are sophisticated & educated and this guy is chaiwala .
  No matter what they say, I can see this in their actions. You can too if you look objectively.

  Even Media is very unhappy that he is not giving the perks that were there for them before.

  You hands have to be clean first if you want to clean the society. Most of the award wapsi candidates are with some agenda or the other. I am not saying that all of them of are పొలిటికల్ బట్ మోస్ట్ అరె

  లెఫ్ట్ అన్నిచోట్ల మైనారిటీ appeasement చేస్తోంది కాబట్టే రైట్ కి బలం పెరుగుతోంది.
  సో కాల్డ్ Intellectuals , లెఫ్ట్ ఘోరం గా విఫలం అయినందు వల్లే ,BJP వచ్చింది . Left హిందూ ద్వేషాన్ని వదిల్లేసి హిందువులు మనుషులుగా చూసేంత వరకు రైట్ గెలుస్తూ వుంటుంది
  ఒక సామాన్య హిందువు గా నాకు ఏమనిపిస్తోందంటే , ఇద్దరు దొంగలే కానీ నాకు తెలిసిన దొంగ మేలు అని.
  నేను 100% ముస్లిమ్స్ బీఫ్ తినే హక్కుని సమర్దిస్తాను కాని ఈ అవార్డు వాపసి ని కాదు.

  Finally I want three things

  1) Modi should act tough against this fringe and work for his mandate
  2) Left should learn from their mistakes and grow again. We seriously need a good left of the center option.
  3) The biggest issue in india are corruption & illiteracy.I hope country will focus on them.

  • చందు-తులసి says:

   రాఘవ గారూ….
   @ లెఫ్ట్ అన్నిచోట్ల మైనారిటీ appeasement చేస్తోంది కాబట్టే రైట్ కి బలం పెరుగుతోంది.
   సో కాల్డ్ Intellectuals , లెఫ్ట్ ఘోరం గా విఫలం అయినందు వల్లే ,BJP వచ్చింది . Left హిందూ ద్వేషాన్ని వదిల్లేసి హిందువులు మనుషులుగా చూసేంత వరకు రైట్ గెలుస్తూ వుంటుంది.
   చాలా విలువైన వాక్యాలు. లెఫ్ట్ నాయకులకు ఎవరైనా ఈ విషయం చెపితే బాగుండు.

   @ ఒక సామాన్య హిందువు గా నాకు ఏమనిపిస్తోందంటే , ఇద్దరు దొంగలే కానీ నాకు తెలిసిన దొంగ మేలు అని.

   -జనం అదే అనుకున్నారు

   @ నేను 100% ముస్లిమ్స్ బీఫ్ తినే హక్కుని సమర్దిస్తాను కాని ఈ అవార్డు వాపసి ని కాదు.

   అవార్డులు వెనక్కు ఇవ్వడం వ్యక్తిగత విషయం. వాళ్ల పరిధిలో వాళ్లు నిరసన తెలిపారు. గతంలో ఎందుకివ్వలేదు అని అడగలేము. అలా ఇవ్వడంలో రాజకీయ ప్రయోజనాలు ఉండి ఉండవచ్చు. ఇవ్వని వాళ్లను ఎందుకివ్వలేదు అనీ అడగలేమో..ఇచ్చిన వాళ్లను ఎందుకిచ్చారు అనీ అడగలేము. చర్చ చేయాల్సింది…ఎందుకిచ్చారు, ఎందుకివ్వలేదు అని కాదు, ఇచ్చిన కారణం మీద.

   చాలా విలువైన చర్చ చేశారు. ధన్యవాదాలు.

 77. ఆరి సీతారామయ్య says:

  “సామే. నీకు దండం పెడత. మూడు రోజుల్నించీ తిండిలేదు. ఏదో నాకింత కూడు దొరికింది. ..అది ఏందో కూడా నాకు తెలవదు.ఏదో కడుపు నింపుకోవడానికి దొరికింది నేను తింటున్న. అంతే. ”
  ” అరే నీచ్ కమీనే కుత్తే… నీ ఇష్టమొచ్చింది…నువ్వు ఎట్ల తింటవురా.? ఈ దేశంలో ఉండాలంటే మేం చెప్పిందే తినాలే.”

  ఇంత వరకూ సరళంగా, దాదాపు వాస్తవికంగా జరిగిన కథ, ఈ పై వాక్యాలతో ఒక మలుపు తిరిగింది.
  రాజకీయ ప్రయోజనాలకోసం ఒక పాత్ర చేత అసహజమైన మాటలు మాట్లాడించారు రచయిత.

  బిచ్చగాడు నాకు ఇష్టమయింది నేను తింటున్నాను అనలేదు. నాకు దొరికింది నేను తింటున్నాను అన్నాడు.
  దానికి సమాధానంగా గడ్డం నాయకుడి చేత ఇష్టం అన్న మాట వాడించారు రచయిత. ఇది కథను తమకు ఇష్టమైన వైపు మరల్చటానికి రచయిత చేసిన ప్రయత్నం.

  “ఈ దేశంలో ఉండాలంటే మేం చెప్పిందే తినాలే” అని అనడానికి ఇంతవరకూ జరిగిన సంభాషణల్లో ఎలాంటి తావులేదు.
  ఇది కూడా రాజకీయ ప్రయోజనాలు జొప్పించడానికి తిప్పిన మలుపే.

  • చందు-తులసి says:

   సీతారామయ్య గారూ నమస్కారం సార్. మీ లాంటి సీనియర్ కథారచయిత చదివి….స్పందించడం సంతోషం. మీ కథలు చాలా చదివాను.
   అవచారం కథ.., వలస పోయిన పిట్టల కథ అంటే చాలా ఇష్టం. కెన్యా టూ కెన్యా కూడా ఆంధ్రజ్యోతిలో చదివాను.
   ఇక నా కథ విషయంలో మీరు చెప్పిన అంశాలు చాలా ఉపయోగకరం. నేను కొత్త రచయితను. ఇతివృత్తం, శైలి, పాత్రోచిత సంభాషణ ఇవన్నీ నేను ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు. తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటాను. అందుకే మీరు చేసిన విమర్శ రెండు మూడు సార్లు చదువుకున్నాను. భవిష్యత్ లో సరిదిద్దుకుంటాను సార్.
   ఇక రాజకీయ ప్రయోజనాలు అనేవి నా స్థాయికి చాలా పెద్దవి సార్. ..ఈ దేశంలో జరుగుతున్న ఒక అంశం గురించి నా స్పందనగా ఈ కథ రాశాను. వ్యక్తి ఆహారాన్ని, అలవాట్లను ఒక సమాజం నిర్దేశించడం సమంజసమా…అసలు అలాంటి అధికారం సమాజానికి ఉంటుందా…? అన్నదే ఇక్కడ నా ఉద్దేశం.
   విలువైన సూచనలు చేసిన మీకు ధన్యవాదాలు.

 78. రాఘవ గారూ..
  అవార్డు వాపసీ అనేది నిరసనల్లో ఒక భాగం. మనుషుల్ని చంపేసినా పర్లేదుగానీ.. నిరసన మాత్రం తెలియజేయకూడదంటే ఎలా. పెద్ద వాళ్లు, బలమైన రాజ్యంతో నేరుగా తలపడలేని వాళ్లు దాడులను వ్యతిరేకిస్తూ తమ నిరసన తెలియజేసేందుకు ఎంచుకున్న ఒకానొక మార్గమే అవార్డులను వెనక్కి ఇచ్చి వేయడం. అదేదో గర్ వాపసీలాగా బాధపడిపోతున్నారేంటి..? అంటే సాహితీ వేత్తలను హత్యలు చేసినా పర్లేదుగానీ.. రచయితలుగా, మేధావులుగా, ఎవరూ తమకు తోచిన రీతిలో నిరసన తెలుపకూడదంటారా మీరు. మీరే ఒప్పుకున్నట్లుగా 2002 అల్లర్ల సమయంలో, కారంచేడు, చుండూరు ఘటనలు జరిగినప్పుడు అవార్డులు ఎందుకు ఇవ్వలేదన్న మీ వాదన నిజంగానే చిన్న పిల్లల చేష్టే. ఎందుకంటే ప్రజాస్వామికవాదులు ఎవరైనా జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని స్పందించడమే, ఖండించడమో, నిరసన తెలపడమో చేస్తారేగానీ.. అన్యాయానికి గురైన వాడి మతాన్ని బట్టీ రియాక్ట్ అవడం ఉండదు. ఎన్ కౌంటర్లు జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు, ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు, అల్లర్లు చెలరేగినప్పుడు ఇలా ఏ సందర్భంలోనూ ఆలోచనా పరులకు మతం ప్రాతిపదికే కాదు. మీరు కాశ్మీర్ పండిట్ల గురించి చెబుతున్నారు. పండిట్లు బాధితులు కారనీ, వారికి న్యాయం జరగకూడదనీ ఎవరండీ అంటారు..? అధికారంలో ఉన్నప్పుడు ప్రెజర్ గ్రూప్స్ రకరకాల మార్గాల ద్వారా నిరసనలు తెలియజేస్తారు. ఒత్తిడి తెస్తారు. లోపాలను ఎత్తిచూపుతారు, విమర్శిస్తారు. ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలంటే ఈ ఒత్తిడి ఉండాలి. అంతేగానీ అధికారం ఉందికదా అని ప్రశ్నించే వాళ్లనూ, తన మతం కాని వాళ్లనూ హింసించే హక్కు ఎవరికీ ఉండదు.

  అవార్డు వాపస్ ఇవ్వడాన్ని మీరేదో చేయకూడని నేరం అన్నట్లుగా పదే పదే వాదిస్తున్నారు. అవార్డులు వాపస్ ఇవ్వడం ఆయా రచయితల స్వేచ్ఛ, వ్యక్తిగత నిర్ణయంగా భావించాలి. గుండెలు బాదుకోవాల్సిన పనిలేదు.

  అన్నట్టు.. మీ కామెంట్లో నేను రాసినవి కోడ్ చేశారుగానీ.. సమాధానం మాత్రం లేదు.. వీలైతే విశ్లేషించండి..

  • First Things first. I see more anger than anguish in your పోస్ట్.
   intolerance వుంది అంటే నోరుమూసుకుని ఒప్పుకోవాలి గని వీడేంటి మమ్ముల్నే ప్రశ్నిత్స్తున్నాడు.
   అవార్డు వాపసి చేస్తోంటే చప్పట్లు కొట్టి త్యాగముర్తులని పొగడకుండా ఏమిటి ఇదంతా అన్నటు వుంది.

   ఎందుకంటే ప్రజాస్వామికవాదులు ఎవరైనా జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని స్పందించడమే, ఖండించడమో, నిరసన తెలపడమో చేస్తారేగానీ.. అన్యాయానికి గురైన వాడి మతాన్ని బట్టీ రియాక్ట్ అవడం ఉండదు. ఎన్ కౌంటర్లు జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు, ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు, అల్లర్లు చెలరేగినప్పుడు ఇలా ఏ సందర్భంలోనూ ఆలోచనా పరులకు మతం ప్రాతిపదికే కాదు.

   1) సరే.
   ఢిల్లీ లో చర్చి మీద vandalization జర్గినప్పుడు. అది స్కూల్ పిల్లలా ? తాగుపోతుల పనా ? అని చూడకుండా మీడియా నే కోర్ట్ లాయర్ judge అయ్యిపోయి తిర్పులిచ్చింది . సిపిఎం బ్రిందా కారత్ తదితర నాయకులూ జాతర లో పూనకం వచ్చిన వల్లల వుగిపోయారు (వేప మండలు, మిరపకాయలు లేకుండానే పాపం ).
   ఏట కోట్ల మంది దర్శించే తిరుపతి గుడి ముందు Evangelist మాఫియా మత ప్రచారం చేసింది. తిరుపతి ఏడు కొండల పిన వుంది. కావాలని వస్తే తప్ప కుదరదు . ఒక్క తిరుపతి ఏమిటి అన్నిపెద్ద గుడుల దగ్గర ఇదే తంతు.మరి సో కాల్డ్ intellctuals , లెఫ్ట్ ఇది తప్పు. ఇలా చెయ్యకూడదు అని ఒక్క సారి అయిన చెప్పరా ? నేను చూడలేదు ? మీరు ఏమిన వీడియోస్ గాని , లింక వుంటే చెప్పండి.
   దాద్రి ఘటన తర్వాత కాంగ్రేస్, లెఫ్టిస్ట్ లు ఖండించారు బాధ పడ్డారు. మంచిదే.
   వెంటనే ఒక హిందూ కూడా చంప బడ్డాడు ముస్లిమ్స్ చేతిలో ( Just for bursting crackers).
   మరి దాద్రి కి వచ్చిన coverage లో 1/100థ్ వీరికి వచ్చిందా ?ఒక్క లీడర్ రారే ?
   http://timesofindia.indiatimes.com/city/agra/1-killed-in-communal-clashes-sparked-by-bursting-of-crackers-in-Aligarh/articleshow/49772748.కమ్స్

   నరేంద్ర దబోల్కర్, పంసరే కి ఎంతో సపోర్ట్ ఇచ్చారు. చాల మంచిది.
   Sanal Edamaruku గురించి మీరు విన్నారా ? అతను కూడా indian Rationalist కానీ కాథలిక్ చర్చి తో పెట్టుకున్నడు కనుక ఫిన్లాండ్ పారిపోవలసి వచ్చింది. ఒక్క ఛానల్ కూడా అతన్ని interveiw చెయ్యదు ఇండియా లో వున్నప్పుడు.సో కాల్డ్ Intellctual పేపర్స్ ది హిందూ లాంటివి ఒక్క లైన్ కూడా రాయవు అతని గురించి.
   బాబా లకు మొక్కమని నేను చెప్పను కాని ఇంత హైపోక్రాసి న ?

   ఇంత వరకు సో కాల్డ్ Leftistist ( కాంగ్రెస్, Communists ,లెఫ్ట్ లీనింగ్ intellectuals ) కాశ్మీర్ పండిట్స్ గురించి మాట్లాడినట్టు చూడలేదు. If you have any proofs, Please show.

   If you belive all the above stated things are just coincidences , I have nothing else to say.
   You can debate & disagree with above but I would ask you to think about them first.
   How would any normal hindu see them no matter how secular or neutral he is.

   What I believe are the reasons for it
   1) Left has built some narratives as their basics and sees the world only through it’s lens.
   ( Caste discrimination in hindus, Apprehensions in Minorities). They can see nothing positive about hinduism and that’s why never take the case of hindus.
   2) Some sections of the population have enjoyed great support from this leftists. For good or bad, Left is too much soft on them. That’s why the moment, RSS says reservations need to reviewed, Everybody jumped on him. Nobody has guts to talk about changes needed in reservations. If you talk about creamy layer in Dalits, You are labelled as castiest (అగ్రకుల దురహంకారి ). In reality Only six casts have been benefited disproportionately in dalits. Can’t we change this help other dalits as well. I can bet that we can’t even ask for study on this issue. There will calls to slash your throats, burn the state and what ever. If you have time read the article below. Same is the case with OBC’s
   http://www.firstpost.com/politics/how-creamy-layer-dalits-have-betrayed-ambedkars-vision-68392.html

   You said that Gharwapasi is wrong . That shows certian bias against hindus.

   1) Evangelicals convert close to one million people yearly. Most of them are done with bribing or forcing them . I have seen cases where students have been driven to suicides especially in AP because of pressure to convert into christianity. They work like MNC with monthly & yearly target ( of course achievement bonuses). Read about “Project Joushuwa ” and you will get an Idea. In AP, This was done mainly because of Christina Chief Minister at helm. I never saw any Left acknowledging this let alone protesting .

   How ever when VHP converts 100 people into hindusim , All the hell breaks loose.
   What we have in india is purest form of Hindu Bashing coupled naked hypocrisy branded as secularism.

   నేను చాల క్లియర్ గ క్లాసు డివైడ్ గురించి రాసాను.
   I hate leftist idea that hindu right can’t exist as it is against their school of thought.
   For me that is the greatest intolerance. You can see how mani shankar ayyar went to pakistan berated this country. That reminded of treachary by left to this country during 1962 war. Desperate times calls for desperate measures I guess.
   It is more about class than anything else. How can anyone who is not from delhi and didn’t study in St.Stephens or JNU or Oxford can rule the country. How can he make Lyuten mafia irrelevant.
   We are sophisticated & educated and this guy is chaiwala .
   No matter what they say, I can see this in their actions. You can too if you look objectively.

   • కేవలం ఆవుని చంపినందుకే మనిషిని చంపడాన్ని intolerence కాకపోతే ఏమనాలి? ఆ వ్యక్తి చెత్తకుండీలో పడేసినది మేక తోలు కానీ ఆవు తోలు కాదని అతని తమ్ముడు చెప్పాడు. అతను ఆవు మాంసం తినలేదని అతని పక్కింటిలో ఉండే హిందువులే చెప్పారు. కేవలం పుకారు విని హత్యచెయ్యడాన్ని సమర్థించేవాళ్ళకి సహనం ఏమాత్రం ఉంటుంది?

   • ‘I see more anger than anguish in your పోస్ట్.అవార్డు వాపసి చేస్తోంటే చప్పట్లు కొట్టి త్యాగముర్తులని పొగడకుండా ఏమిటి ఇదంతా అన్నటు వుంది’

    ఎస్.. యు ఆర్ రైట్ రాఘవ గారూ.. మనుషుల ( అది కూడా సాహితీవేత్తలు, మేధావులు అయినవారు ) ప్రాణాలు పోయినా పర్లేదు గానీ అవార్డులను వెనక్కి ఇచ్చి తమ నిరసనను మాత్రం తెలియజేయకూడదు అంటున్న మీ వాదన మీద anguish కి చోటే లేదు కాబట్టి కచ్చితంగా యాంగరే ఉంటుంది.

    “intolerance వుంది అంటే నోరుమూసుకుని ఒప్పుకోవాలి గని వీడేంటి మమ్ముల్నే ప్రశ్నిత్స్తున్నాడు”
    ఇక్కడ చర్చే ప్రశ్నించాలి.. ప్రశ్నల నుంచే పరిష్కారాలు వెతగాలి అనే ధోరణిలో జరుగుతున్నప్పుడు ప్రశ్నించకూడదు.. నిరసన తెలుపకూడదు అంటున్న మిమ్మల్ని నేను ప్రశ్నించవద్దని ఎలా అనగలనండి.. ?!

    దాద్రీ ఘటన తర్వాత ముస్లిమ్స్ చేతిలో ఒక హిందూ చనిపోయారు అది కూడా టపాకాయలు కాల్చినందుకే అని మీరు అన్నారు.. ఒక లింక్ కూడా ఇచ్చారు. కానీ ఆ లింక్ ఓపన్ కాలేదు. ఆ ఘటన నిజమే అయితే కచ్చితంగా ఖండించాల్సిందేనండీ. ఇప్పటిదాకా ఈ ఘటనపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని కచ్చితంగా తప్పుబట్టాల్సిందే. దీనిపై మీరు ఇచ్చిన లింక్ ఓపన్ కాలేదు. వీలైతే మళ్లీ సరైన లింక్ ఇవ్వండి.

    “ఏట కోట్ల మంది దర్శించే తిరుపతి గుడి ముందు Evangelist మాఫియా మత ప్రచారం చేసింది. తిరుపతి ఏడు కొండల పైన వుంది. కావాలని వస్తే తప్ప కుదరదు . ఒక్క తిరుపతి ఏమిటి అన్నిపెద్ద గుడుల దగ్గర ఇదే తంతు. మరి సో కాల్డ్ intellctuals , లెఫ్ట్ ఇది తప్పు. ఇలా చెయ్యకూడదు అని ఒక్క సారి అయిన చెప్పరా ? నేను చూడలేదు ? మీరు ఏమైనా వీడియోస్ గాని, లింక వుంటే చెప్పండి.”

    రాఘవగారూ.. మీరు పైన ఒక పోస్టులో వామపక్షాలు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తే మీకు లెఫ్ట్ ఐడియాలజీ తెలుసేమో అనుకున్నా. కానీ పై మీ వ్యాఖ్యలతో తెలియదని స్పష్టమైపోయింది. అన్ని మతాలూ వేటికి అవే అనిగానీ.. మతమే వద్దు అనిగానీ వాదించే లెఫ్టిస్టులు తిరుమల వచ్చి అన్యమత ప్రచారాన్ని ఎందుకు అడ్డుకుంటారు..? నా ఉద్దేశం వారి దృష్టిలో అంతకు మించిన ప్రజా సమస్యలు చాలా ఉంటాయి. అలాంటప్పుడు వారు మత ప్రచారాలను అడ్డుకొని వీడియోలు తీయించుకున్న లింకులను మీకు ఇవ్వడం సాధ్యం కాదండీ.. సారీ.

    లెఫ్టిస్టులు, ప్రజాస్వామిక వాదులు, మీడియా, అందరూ అణగారిన వర్గాలకే సపోర్టు చేస్తాయి. హిందుత్వను వినిపిస్తే ఎవరూ పట్టించుకోరని అంటున్నారు.. అదే నిజమైతే మంచిదే కదండి. కానీ అలా జరగడం లేకనే కదా సమస్య. ఇక్కడ మీరు నేను హిందువును కాననో.. హిందూ వ్యతిరేకిని కాబోలు అనో తప్పుగా అర్థం చేసుకోకండి. అభ్యంతరం హిందుత్వ పరిరక్షకులుగా చెప్పుకుంటూ మానవత్వాన్ని మరిచిపోయి మాట్లాడేవాళ్ల గురించే.

    ” Evangelicals convert close to one million people yearly. Most of them are done with bribing or forcing them . I have seen cases where students have been driven to suicides especially in AP because of pressure to convert into christianity. They work like MNC with monthly & yearly target ( of course achievement bonuses). Read about “Project Joushuwa ” and you will get an Idea. In AP, This was done mainly because of Christina Chief Minister at helm. I never saw any Left acknowledging this let alone protesting . How ever when VHP converts 100 people into hindusim , All the hell breaks loose.”
    దీనికి నా కామెంట్ వ్యక్తిగత స్థాయిని దాటిన మతం ఒక మత్తుమందు.. ఆకర్షించి నాశనం చేసే విషం పదార్థం అని మాత్రమే.
    లవ్ జీహాద్ చేస్తున్నారంటూ గత ఏడాది ఇలాంటప్పుడు జరిగిన రచ్చ చివరికి ఇద్దరు సాధారణ ప్రేమికుల జీవితాలను కల్లోలపరిచిందో ఈ రిపోర్ట్ చదవండి..
    http://neha-dixit.blogspot.in/2014/10/exposing-love-jehad.html
    నేరుగా బాధిత యువతి మాటల్లోనే వినాలంటే కింది యూ ట్యూబ్ లింక్ చూడండి.
    https://www.youtube.com/watch?v=PEXFP44dNss

    ఇక రిజర్వేషన్ల గురించి వ్యాఖ్యానించారు. ఇక్కడ ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా..
    విశాఖపట్నం ఏజెన్సీలో చదువుకున్న ఒక కుర్రవాడు విశాఖ సిటీలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే పోటీ పడగలడా..? నేను ఏజెన్సీ కుర్రాడు విశాఖ సిటీలోని ప్రభుత్వ పాఠశాల కుర్రాడితో అనే అడిగాను.. వాళ్ల కులాలతో సంబంధం లేదు.. సిటీలో కుర్రవాడు ధనవంతుడు కాదు, పెద్ద కోచింగులు కూడా తీసుకోడు. వీళ్లిద్దరిలో ఎవరు మెరుగ్గా పరీక్ష రాయగలరో చెప్పండి.. రిజర్వేషన్ల విధానాన్ని ప్రక్షాలించాలేగానీ పూర్తిగా ఎందుకు తీసివేయకూడదో మీకే అర్థమైపోతుంది.

    మొదట ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యను ఒకే స్థాయిలో అందించగలిగితే రిజర్వేషన్ అవసరం ఉండదు. కానీ అలాంటి విద్య అందుతోందని మీరు భావిస్తున్నారా.. ? నిందించాల్సింది స్వాతంత్ర్యం వచ్చి 66 ఏళ్లవుతున్నా అందరికీ నాణ్యమైన విద్యను అందివ్వలేని ప్రభుత్వాలనే.

   • మనిషిని చంపినందుకు ప్రతీకారంగా హత్య చేసేవాళ్ళ కంటే ఆవుని చంపినందుకు ప్రతీకారంగా హత్య చేసేవాళ్ళకి సహనం ఎక్కువ ఉంటుందా? అది కూడా ఒక పుకారు విని హత్య చేసేవాళ్ళది అసహనం కాకుండా పోతుందా? నిజం ఒప్పుకోవడానికి సంకోచం ఎందుకు?

 79. ఎక్కడైనా మతం ప్రాతిపదికగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయంటే.. ఆ నిప్పు మొదలైంది ప్రజాస్వామిక వాదుల నుంచి కాదు. హిందూ మత పరిరక్షకులుగా చెప్పుకునే వారో, ఇస్లాం పరిరక్షకులుగా, క్రైస్తవ పరిరక్షకులుగా చెప్పుకునే వాళ్లో ఆ నిప్పు రాజేస్తారు. అది దావానలంలా మారి చివరికి వారినీ.. వారి ముసుగునూ కాల్చేస్తాయని గ్రహించలేరు. ఈ ఘర్షణలో అమాయకులు.. ఆకలితో తప్ప ఆరాధనలతో సంబంధం లేని వాళ్లు నలిగిపోతుంటారు.. రాలిపోతుంటారు..

 80. కె.కె. రామయ్య says:

  చందుతులసి గారు ఎంత చక్కటి వివరణలతో కూడిన సమాధానం ఇచ్చారు రాఘవ గారు లేవనెత్తిన అభ్యంతరాలకి. నాకు శ్రమ తగ్గించారు, మనఃశాంతినికలిగించారు. ధన్యవాదాలు. ( కెన్యా టు కెన్యా ఫేమ్ ) ప్రముఖ కధా రచయిత శ్రీ ఆరి సీతారామయ్య గారు స్పందించటం కూడా సంతోశానిచ్చింది.

  కేంద్రంలో లెఫ్టిస్ట్లు ఓ బలమైన పత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించిన రాఘవ గారికి కృతజ్ఞతలు. సంకుచిత రాజకీయాల కతీతంగా, ప్రగతిశీల పురోగామి శక్తులు సంఘటితమవ్వాలసిన అవసరం మునుపటికన్నా ఎప్పుడు ఇంకా ఎక్కవ అవసరంగా ఉంది.

  • చందు-తులసి says:

   అవును రామయ్య గారూ. ప్రశ్నించేవాళ్లు ఐక్యంగా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా మనదేశంలో ప్రస్తుతమున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా…. ఐతే విషాదమేమిటంటే మతతత్వ శక్తుల్లో ఐక్యమత్యం ఉండడం…. ఆలోచనాపరులు గ్రూపులుగా చీలిపోవడం. ప్రశ్నించే గొంతుకలన్నీ ఏదో ఒకరోజు ఒక్కటవుతాయనే నా ఆశ…

 81. G B Sastry says:

  జాతి,మతం,కులం,రంగు,భాష,ప్రాంతం,నాగరికత,ధనిక,పేద,ఆడ,మొగ,చిన్న,పెద్ద,బాంధవ్యం,కుటుంబం అన్ని కూడా వేరు వేరు స్థాయిల్లో జీవి కావలసిన సంఘజీవనంలో,తనదైన గుర్తింపు కలిగించుకొనే ప్రయత్నానికి గల వేరు వేరు పేర్లు మాత్రమే వీటన్నింటికి మించినది మానవత్వం ఎందుకంటే అదొక్కటే బలహీనుడ్నికూడా బతకనిస్తుంది అందరికి బతుకునిస్తుంది.
  వద్దు అనుకుంటే రాజ్యం వీరభోజ్యం అనుకుంటే ఎవరికీ వారు వారి ఆలోచనే సరిఐనదనుకొంటు ఇతరులపై రుద్దుతూ రుద్దించకుంటె చంపుతూ చస్తూ బతకడమొక్కటే మనిషికున్న మార్గం

  • చందు-తులసి says:

   @G B శాస్త్రి గారూ….
   జాతి,మతం,కులం,రంగు,భాష,ప్రాంతం,నాగరికత,ధనిక,పేద,ఆడ,మొగ,చిన్న,పెద్ద,బాంధవ్యం,కుటుంబం అన్ని కూడా వేరు వేరు స్థాయిల్లో జీవి కావలసిన సంఘజీవనంలో,తనదైన గుర్తింపు కలిగించుకొనే ప్రయత్నానికి గల వేరు వేరు పేర్లు మాత్రమే వీటన్నింటికి మించినది మానవత్వం .
   మీరు చెప్పిన వన్నీ మనిషికి గుర్తింపునివ్వచ్చు కానీ… జాతి,మతం,కులం,రంగు,భాష,ప్రాంతం, నాగరికత,ధనిక,పేద,ఆడ,మొగ,చిన్న,పెద్ద, బాంధవ్యం,కుటుంబం….పేరుతో వివక్ష చూపడం అన్యాయం కదా సార్. దాన్ని ఎవరూ సమర్థించకూడదు.

   @ వీటన్నింటికి మించినది మానవత్వం ఎందుకంటే అదొక్కటే బలహీనుడ్నికూడా బతకనిస్తుంది . అందరికి బతుకునిస్తుంది.
   – అందరూ సమానమే ఐతే మళ్లీ బలవంతుడు, బలహీనుడేమిటీ…? ఐనా ఒకరిని ఒకరిని బతకనివ్వడం అనే ఉదారత్వంలోంచే ఆధిపత్య భావన పుట్టుకొస్తుంది. ఎవరూ ఎవర్ని బతికించాల్సిన అవసరం లేదు సార్. ఎవరి బతుకు వారిని బతకనిస్తే చాలు….

   @ రాజ్యం వీరభోజ్యం అనుకుంటే ఎవరికీ వారు వారి ఆలోచనే సరిఐనదనుకొంటు ఇతరులపై రుద్దుతూ రుద్దించకుంటె చంపుతూ చస్తూ బతకడమొక్కటే మనిషికున్న మార్గం
   _ కాబట్టి ఆధిపత్య వర్గానికి అణగిమణగి జీవించాలి….లేదంటే బలవంతుడు బలహీనున్ని చంపుతాడు అంటారా…? సమాజంలో ఘర్షణలకు కారణం…బలహీనులు ప్రశ్నించడం కాదు. బలవంతుల ఆధిపత్యమే సార్.
   మీ స్పందనకు ధన్యవాదాలు

 82. Rishi Srinivas says:

  పేరు గుర్తులేదు గానీ విపులలో ఒక కన్నడ అనువాద కధ చదివాను. బీఫ్ ని తీసేసి చదివితె ఇంచుమించు అదే కధ చదివినట్లు అనిపించింది. ఇది కాపీ అని చెప్పడం నా ఉద్దేశం కాదని రచయిత గమనించగలరు.

  • చందు - తులసి says:

   రిషి శ్రీనివాస్ గారూ..ఆ కథ లింక్ లేదా ఏ నెల విపులో చెప్పగలరా…? ప్లీజ్ నేను కూడా చదువుతాను. ఇక దేశమంతటా బీఫ్ గొడవ జరుగుతోంది కదా…ఇదే అంశంతో అన్ని భాషల్లోనూ కథలు వచ్చి ఉండవచ్చు. మీరు లింక్ ఇస్తే..లేదా ఏ నెలో చెబితే చదివి చెబుతాను..

 83. చందు - తులసి says:

  రిషి శ్రీనివాస్ గారూ…ఈ నెల విపులలోనే వచ్చింది కదా ఆ కథ. కర్రోడు త్రిశూలం పట్టాడు..
  ఇపుడే చదివాను. ఆ కథ ఒక బానిస లేదా..వెట్టివాడి కథ. నా కైతే పోలికలు ఏమీ కనపడలేదు…చివరలో తిరగబడడం ఒకేలా వున్నా సందర్భాలు వేరు వేరు.. మీ సమాచారానికి ధన్యవాదాలు..

 84. Rishi Srinivas says:

  చందు గారు. నేను ముందుగానే చెప్పినట్లు ఈ రెండు ఒకే కధలు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. చాలా కాలంగా నోరు మెదపకుండా ఉన్నఒక బీదవాడు ఆకలికి తట్టుకోలేక తిరగబడడంతో ఒకే సబ్జెక్ట్ లా అనిపించింది. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రామే.

  • చందు - తులసి says:

   రిషి శ్రీనివాస్ గారూ..నేను కూడా మీ సమాచారానికి ధన్యవాదాలు చెప్పాను.
   పైన నేను చెప్పింది మీకు నా అభిప్రాయం లాంటి వివరణ. మీరు చెప్పింది నిజం. రెండింటిలోనూ ఆకలి గురించే ఉండడంతో అలా అనిపించడం సహజం. వాస్తవానికి ఆ కన్నడ కథ చాలా లోతుగా మెచ్యూర్డ్ గా ఉంది. బహుశా కుం.వీరభద్రప్ప కన్నడలో సీనియర్ అయి ఉంటారు.
   మీ సమాచారం వల్ల నాకు వ్యక్తిగతంగా ఉపయోగపడింది. థాంక్యూ సార్.

 85. కె.కె. రామయ్య says:

  రాజ్యాంగ స్పూర్తికి, మతసమైక్య స్పూర్తికి భంగం కలిగిస్తూ ప్రస్తుతం నెలకొన్న అసహన వాతావరణానికి ( హేతువాది కల్బుర్గి హత్యకు ) నిరసనగా ప్రముఖ కన్నడ రచయిత కుం. వీరభద్రప్ప 2008 లో తన “అరమనే” నవలకు ఇచ్చిన సాహిత్య అకాడమి అవార్డును తిరిగి ఇచ్చేస్తూ ఇలా అన్నారు :

  “In the changed political situation, where State and Centre are mute spectators for all the atrocities by fundamentalist forces, writers, rationalists and intellectuals are living under fear.”

  • చందు - తులసి says:

   రామయ్య గారూ…ఏ భాషలో ఐనా…ఏ దేశమైనా
   ప్రశ్నించేవారు ఒకేరీతిగా ఆలోచిస్తారన్నమాట…
   నేను కూడా వీరభద్రప్ప గురించి తెలుసుకోవాలి…

 86. ఆవుల్ని రక్షించడానికి మనుషుల్ని చంపడాన్ని ఎవరూ అహింసావాదం అనరు. అహింసావాదం అనే objective లేని గోరక్షణ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఆవు మాంసం తినాలనుకున్నవాళ్ళని అది తిననివ్వండి.

 87. DEVIKARANI says:

  సో కాల్డ్ intellectuals మద్దతు ఇస్తుంది మైనారిటీ హక్కులకు కాదు. మైనారిటీ వోట్ బ్యాంకు రాజకీయాలకు. ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా లో Polygamy గురించి మాట్లాడే దమ్ము వీళ్ళలో ఒక్కడికి కూడా లేదు. అన్యాయం ఎవరికీ జరిగిన సపోర్ట్ చెయ్యాలి కదా వాళ్ళకి . మొదటగా అసలు ఇండియా లో మెజారిటీ , మైనారిటీ కాన్సెప్ట్ దండగ . ఎందుకంటే హిందుస్ ఒక్క ethnicity వాళ్ళు కాదు. langauage & Caste , Region తో డివైడ్ అయ్యారు. మెజారిటీ వారి కి జరిగిన అన్యాయాలని తిప్పి కొట్టగలిగితే కాశ్మీర్ పండిట్ లు ఇంత దారుణ పర్తిస్థితి లో వుండే వారా ? హిందూ దేవాలయాలు గవర్నమెంట్ చేతిలో వుంటాయి కానీ ఇతర మతాల వారివి వారి ఇష్టం. దీన్నే ప్రతిఘతించలేని స్థితిలో వున్నారు. మరి వీరికి లెఫ్టిస్ట్ లు ఏమి మాట్లాడార ? అంటే హిందువులు మనుషులు కారా లెఫ్టిస్ట్ కి ? కేవలం మైనారిటీస్ కి మాత్రమే మేము పని చేస్తాం మెజారిటీ ఎలా చచ్చిన మాకు సంబంధం లేదు అంటే ఎలా ? ఈ ఇజం ఐన ముందు హ్యుమానిటీ వుండాలి కదా ? అది మర్చిపోయారా?

  రాఘవగారూ…మంచి ప్రశ్న. కానీ వాళ్ల దగ్గర సమాధానం ఉండదు..ఎందుకంటే వాళ్లు చేస్తున్నది తప్పని వాళ్లకి తెలుసు. పాపం ఉనికి కోసం ఇంకా ఏవో పాట్లు పడుతున్నారు. దిక్కుతోచకున్నారు…మీలాంటి, నాలాంటి వాళ్లం అలాంటివాళ్ల పట్ల సానుభూతి చూపడం తప్ప ఏం చేయలేం . ప్చ్…ప్చ్…ప్చ్…

  నిజంగా ప్రజాస్వమ్యవాదులమని చెప్పుకునేవాళ్లు హిందూమతాల్లోని లోపాల్ని ఎత్తుచూపుతూనే.ఇతర మతాల లోపాల్ని ఎత్తి చూపాలి. కానీ వాళ్లకి అంత దమ్ము లేదు. ముస్లిం పర్సనల్ లా గురించి నోరెత్తమనండి వీళ్లని..అస్సలు ఎత్తరు .ఎందుకంటే ఏం జరుగుతుందో వాళ్లకీ తెలుసు. అందుకే కేవలం హిందుత్వనే టార్గెట్ చేస్తారు..

  • “ముస్లింలు బహుభార్యత్వాన్ని ఆచరిస్తున్నారు కనుక హిందువులలో ఉన్న వైధవ్యం లాంటి ఆచారాలని విమర్శించేవాడు pseudo-secular అవుతాడు” అని నమ్మితే, “వాళ్ళు గడ్డి తింటున్నారు కనుక మనం అన్నం తినక్కరలేదు” అని నమ్మినట్టు అవుతుంది.

   • చందు తులసి says:

    ఒకరి లోపం ఎత్తిచూపితే ఆత్మవిమర్శ చేసుకోవాలి…అవతలివారిలో లోపం లేదా అంటున్నారంటే ..లోపం ఉందని ఒప్పుకుంటున్నట్లే.. ఇక మిగిలింది దాన్ని దిద్దుకోవడమే..

  • దేవికా రాణి గారూ…మేధావులు మద్దతు ఇస్తోంది కేవలం ఓట్ల కోసమే అంటున్నారు. నాకు తెలిసినంత వరకూ దాడులను ఖండించారు తప్పితే ఎవరినీ ఓట్లు వేయమని అడగలేదు.
   ఆ సంగతి పక్కన పెడితే మరి హిందూత్వం ముసుగు వేసుకున్న మతోన్మాద శక్తులు చేస్తున్నదేమిటి. సరిగ్గా ఎన్నికలకు ముందే రథయాత్రలు చేస్తారు. రామునికి గుడి కట్టాలంటారు. తీరా ఎన్నికలు ఐపోయిన తర్వాత మళ్లీ ఎన్నికల దాకా వారికి గుడి గుర్తుకు రాదు. మతం పేరుతో ఓట్ల రాజకీయాలు చేస్తోంది మతతత్వ శక్తులు తప్ప మేధావులు కారు.
   ఇక ముస్లింల బహుభార్యత్వాన్ని ఖండించరెందుకు అంటున్నారు…పోనీ బహు భార్యత్వం మంచిదే అని ఏ మేధావైనా మద్దతు ప్రకటించారా…? ప్రకటిస్తే అప్పుడు మీరు తప్పు పట్టాలి.
   అంతెందుకు ఆఫ్రికాలోని కొన్ని తెగల్లో నరమాంసం తింటారు. దాన్ని మన మేధావులు ఖండించలేదు. అందుకని అక్కడ ఖండించలేదు కాబట్టి ఇక్కడ మాట్లాడకూడదంటే న్యాయమేనా…?

   • మేధావులు మద్దతు ఇస్తోంది కేవలం ఓట్ల కోసమే అంటున్నారు. నాకు తెలిసినంత వరకూ దాడులను ఖండించారు తప్పితే ఎవరినీ ఓట్లు వేయమని అడగలేదు.

    1) So called Intellectuals are acting as per the script. They can’t be called neutral intellectuals.

    ఆ సంగతి పక్కన పెడితే మరి హిందూత్వం ముసుగు వేసుకున్న మతోన్మాద శక్తులు చేస్తున్నదేమిటి. సరిగ్గా ఎన్నికలకు ముందే రథయాత్రలు చేస్తారు. రామునికి గుడి కట్టాలంటారు. తీరా ఎన్నికలు ఐపోయిన తర్వాత మళ్లీ ఎన్నికల దాకా వారికి గుడి గుర్తుకు రాదు. మతం పేరుతో ఓట్ల రాజకీయాలు చేస్తోంది మతతత్వ శక్తులు తప్ప మేధావులు కారు.
    ఇక ముస్లింల బహుభార్యత్వాన్ని ఖండించరెందుకు అంటున్నారు…పోనీ బహు భార్యత్వం మంచిదే అని ఏ మేధావైనా మద్దతు ప్రకటించారా…? ప్రకటిస్తే అప్పుడు మీరు తప్పు పట్టాలి.
    2) Even Hindu males may practise polygamy in rural places ( or rarely urban places). THe problem is that Polygamy shouldn’t be allowed in any civilized state. We should remove such sections from muslim personal law. That’s what we are asking. As per Muslim personal law, Girl child can only inherit half of what boy is eligible. Any civilized society would say this is unacceptable.So as per you, We should allow this as they aren’t supporting this ?
    Again They can have only personal law but it shouldn’t discriminate women in anyway.
    అంతెందుకు ఆఫ్రికాలోని కొన్ని తెగల్లో నరమాంసం తింటారు. దాన్ని మన మేధావులు ఖండించలేదు. అందుకని అక్కడ ఖండించలేదు కాబట్టి ఇక్కడ మాట్లాడకూడదంటే న్యాయమేనా…?
    3) Let us start by being equal to all religions in India. We can talk about Africa later.

   • Do you think that Hindu girls inherit property from their parents? All I have is inherited from my paternal grandfather but nothing from my maternal grandfather.

   • ముస్లింలు బాగుపడలేదు కనుక హిందూ మతాన్ని కూడా ఎవరూ విమర్శించకూడదు అనుకుంటే హిందువులు కూడా ముస్లింలలాగే వెనుకబడి ఉండిపోతారు. “మీరు ముస్లింలని ఎందుకు విమర్శించడం లేదు” లాంటి ప్రశ్నలు అడగడం అంటే “మేము ముస్లింల కంటే బాగుపడం, అలా ఉండడమే మాకు ఇష్టం” అని చెప్పుకోవడమే అవుతుంది. హిందువులకీ, ముస్లింలకీ మధ్య ఉన్నది వాళ్ళు పూజించే దేవుని విషయంలోనే తేడా తప్ప సాంఘిక దురాచారాల విషయంలో ఈ రెండు మతాల మధ్య పెద్ద తేడా లేదు.

   • చందు తులసి says:

    రాఘవ గారూ ఆఫ్రికాలో ముస్లింలు అధికంగా ఉన్నారు కాబట్టి…అక్కడి వాళ్లు తమ మతంలోపాలు ఎత్తిచూపుతున్నారు. మన పక్కన బంగ్లాదేశ్ లోనూ జరిగాయి కదా. పాకిస్తాన్ లోనూ చాలామంది ఉన్నారు.

  • దేవిక గారూ…రాఘవ గారూ… ముస్లింలోపాల్ని ఖండించే దమ్ము వీరిలో ఒక్కడికి కూడా లేదు అంటూనే మీరు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం మతంలోని లోపాల్ని కూడా వ్యక్తం చేసే వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. బలై పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. క్రైస్తవ మతం మీద చాలా పుస్తకాలు వచ్చాయి. ఇక్కడ ఉన్న వాళ్లు హిందువులు కాబట్టి, హిందూ మతాన్ని విమర్శిస్తారు తప్పేముంది…..?

   • దేవిక గారూ…రాఘవ గారూ… ముస్లింలోపాల్ని ఖండించే దమ్ము వీరిలో ఒక్కడికి కూడా లేదు అంటూనే మీరు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    1) వాళ్ళు బావుండాలనే కదా మా కోరిక.

    ముస్లిం మతంలోని లోపాల్ని కూడా వ్యక్తం చేసే వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. బలై పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు.
    2) ఇండియా లో ఎవరు వున్నారు. ఆఫ్రికా లో, మిడిల్ ఈస్ట్ లో వుంటే మనకు ఏమిటి లాబం.
    క్రైస్తవ మతం మీద చాలా పుస్తకాలు వచ్చాయి. ఇక్కడ ఉన్న వాళ్లు హిందువులు కాబట్టి, హిందూ మతాన్ని విమర్శిస్తారు తప్పేముంది…..?

   • చందు తులసి says:

    అవును బాలాజీగారూ.. మన లోపాలు మనమే చూపాలి. మనమే దిద్దుకోవాలి..

 88. కె.కె. రామయ్య says:

  దేవికారాణి గారు, రాఘవ గారూ! కేవలం ఒక మతంలో ఉన్న దురాచారాలకే మనమెందుకు ఉద్రేకపడాలో ( ఆ మతస్తుల పట్ల ద్వేష భావం ఎందుకు కలిగుండాలో ) నాకు అర్ధం కావటంలేదు. చదువుకున్న, మెరుగైన ఆర్ధిక స్థితుల్లో ఉన్న, ప్రజాస్వామిక, అభివృద్ది చెందిన దేశాల్లో ఉన్న ప్రజలు (మన దేశంలో ఉన్నవాళ్ళూ ) వాళ్లు ఏమతానికి సంబందించిన వాళ్లైనా దురాచారాలకతీతమైన మెరుగైన జీవితం గడుపుతున్నారు కదండి. అలాంటి అవకాశాలు లభించని వాళ్ల అభివృద్ది కోసం ప్రభుత్వం, సభ్యసమాజమూ కృషి చేస్తుంటుంది. దేశవిభజన, కాశ్మీర్ లో పండిట్ లకు జరిగిన అన్యాయం మొదలైనవి రాజకీయమైన విషయయాలుగా కూడా చూడకుండా ఓ వర్గాన్నో, ఓ మతం వారినో నేరస్తులుగా చిత్రించే ప్రయత్నం చేసే Right Wing Politics కు మనమెందుకు సానుభూతి చూపాలండి. “పాపం ఉనికి కోసం ఇంకా ఏవో పాట్లు పడుతున్న లెఫ్టిస్ట్ లను ” కూడా వదిలెయ్యండి. మానవత్వాన్ని, సర్వమానవసమానవత్వాన్ని ప్రభోదించేవాళ్లనే అబిమానించండి. ( ఒకానొక కాలంలో మానవత్వం పేరెత్తిన వాళ్లను కమ్యూనిస్ట్ లుగా అనుమానించారు అది వేరే విషయం ). ప్రజలు మైనారిటీ వోట్ బ్యాంకు రాజకీయాల ప్రలోభంలో ( వాటివల్ల మైనారిటీ వర్గాలకు పెద్దగా ఒరిగిన్దేవీలేదు ) పడకుండా చూడాలి కాని విద్వేషాలు రెచ్చగొట్టి పరిస్తితి మరింత దిగజార్చకూడదు కదండి.

  • చందు తులసి says:

   రామయ్య గారూ….మార్పు ఏ మతానికైనా అనివార్యం. వందేళ్ల క్రితం ఉన్న మూఢవిశ్వాసాలు ఇప్పుడు లేవు కదా… ఆ రోజు కూడా అనేక ప్రతిఘటనలు వచ్చాయి.. రామ్మోహన్ రాయ్, వీరేశలింగం లాంటి వారు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు… ఎవరు ఎంత ప్రతిఘటించినా మారకతప్పలేదు కదా..
   అవతలివారు మారలేదు కాబట్టి మేము మారమని అనడం కుదరదు. మార్పు ఒప్పుకోవాల్సిందే..

 89. నాకు తెలిసినంత వరకు భాజపా విదేశీ పెట్టుబడులు తప్ప ఏదీ అవసరం లేదని నమ్మే పార్తీ. భాజపా అభిమానుల్లో కూడా అనేక మంది నాస్తికులూ, ఆజ్ఞేయవాదులూ ఉన్నారు. విదేశీ పెట్టుబడులు తప్ప ఏదీ అవసరం లేదని చెప్పడానికి “ఆవుని చంపినవాణ్ణి హత్య చెయ్యాలి” అని ప్రచారం చెయ్యడం అవసరమా? జనంలో ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నా మన దేశానికి విదేశీ పెట్టుబడులు వస్తాయి. విదేశీ పెట్టుబడిదారులకి ఇక్కడ దొరికే cheap labour కావాలి కానీ ఇక్కడి జనంలో ఉన్న నమ్మకాలు ఎలాంటివి అనేది వాళ్ళకి అనవసరం. కానీ నాలుగు voteల కోసం జనాన్ని మూఢనమ్మకాల మత్తులో ఉంచడాన్ని మనం సమర్థించలేము.

  • చందు తులసి says:

   నిజం ప్రవీణ్ గారూ…మతం, పాలన వేరు వేరు…
   అధికారులు, ప్రభుత్వము మతానికి దూరంగా ఉండాలి.. మనది లౌకిక దేశంగా ప్రకటించుకున్నాం కాబట్టి. మతం, రాజకీయాలు కలిసిపోతే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి

 90. ముహమ్మద్ అఖ్లాక్ కుటుంబ సభ్యులు ఆవు మాంసం తినలేదని వాళ్ళ పక్కింటిలో ఉండే హిందూ కుటుంబాలవాళ్ళే చెప్పడం జరిగింది. ఆ హత్యాయత్నాన్ని పక్కింటివాళ్ళు ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆ లోపే ఆ దుండగులు ముహమ్మద్ అఖ్లాక్‌ని హత్య చేసారు. 2017లో ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికలలో రాబోయే హిందువుల voteల కోసమే ఆవు మాంసం పేరుతో గొడవ చేసి ముహమ్మద్ అఖ్లాక్‌ని హత్య చేసారు. నిందితులలో ఒకడు భాజపా నాయకుని కొడుకు కావడం వల్ల పోలీసులు ఆ కేస్‌ని మాఫీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.

  • చందు తులసి says:

   ప్రవీణ్ గారూ.. మత రాజకీయాలు అలాగే ఉంటాయి సార్…
   బెర్నార్డ్ షా చెప్పినట్లు లంపెన్ల ఆఖరి ఆశ్రయం రాజకీయాలు..
   నేనేమంటానంటే రాజకీయనాయకుల ఆఖరి దిగజారుడు అస్త్రం మత రాజకీయాలే..

  • Srinivas Vuruputuri says:

   “2017లో ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికలలో రాబోయే హిందువుల voteల కోసమే…”

   The poor man was lynched with an eye on the election that is a year and a half away? That seems far-fetched.

   On your earlier question:

   “విదేశీ పెట్టుబడులు తప్ప ఏదీ అవసరం లేదని చెప్పడానికి “ఆవుని చంపినవాణ్ణి హత్య చెయ్యాలి” అని ప్రచారం చెయ్యడం అవసరమా?”

   Did you come across the news about someone who is doing the ప్రచారం that you mentioned? If so, can you please share the links?

   “నిందితులలో ఒకడు భాజపా నాయకుని కొడుకు కావడం వల్ల పోలీసులు ఆ కేస్‌ని మాఫీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.”

   The SP govt. doing that? Really??

   • చందు - తులసి says:

    శ్రీనివాస్ గారూ…మీరన్నట్లు ఉత్తరప్రదేశ్ ఘటన ఎన్నికల కోణంలో చూడకున్నా….
    ఇటువంటి ఘటనలు, దాడుల అసలు లక్ష్యం రాజకీయమే కదా.. రాజకీయ నాయకులకు కావాల్సిందీ ఓట్లే కదా..

   • ఆవుని చంపాడనే నెపం వేసి ఆ వ్యక్తిని చంపితే జనం నుంచి వ్యతిరేకత రాదు అనుకున్నారంటే దాని అర్థం గోహత్య మహాపాపం అనే అభిప్రాయం జనంలో ఉందనే కదా. ఒకరి ఇంటి విషయాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోరు అనే ధైర్యంతో తమ పిల్లల్ని చదువు పేరుతో ఇష్టమొచ్చినట్టు కొట్టే తల్లితండ్రులని చూస్తున్నాం. గోహత్య చేసినవాణ్ణి చంపబోతే ఎవరూ ఆపరు అనే ధైర్యంతో ఒక మనిషి మీద గోహత్య నెపం వేసి చంపేవాళ్ళు కూడా ఇలాగే తయారవుతారు. 2017 ఎన్నికలని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు హత్యలు చెయ్యడం కూడా సాధ్యమే. కేవలం సర్పంచ్ పదవి కోసం హత్యలు చేసినవాళ్ళు ఉన్న దేశం ఇది.

   • మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు నెమ్మదిగా జరుగుతాయి. లవ్ జిహాద్ లాంటి పుకార్లు ఇప్పుడు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. అవి ఎన్నికలకి నెల రోజుల ముందు మాత్రమే వ్యాపిస్తాయా?

   • చందు - తులసి says:

    అవునండీ మందిరాలు, రథయాత్రలు, లవ్ జిహాద్, విదేశీ కుట్ర, కాందిశీకులు, గోవధ…ఇలా రకరకాల ప్రచారాల ద్వారా సమస్యను ఎన్నికల దాకా నిత్యం వార్తల్లో ఉంచుతారు.
    కొన్ని రాష్ట్రాల్లో విజయవంతమైన ప్రయోగాన్నే అన్నిచోట్లా అమలు చేయాలనుకుంటున్నారు.

 91. పోలీసులు FIRలో పది మంది పేర్లు వ్రాసారు. వాళ్ళలో ఒకడు భాజపా నాయకుని కొడుకు, కొందరు అతని బంధువులు, మరి కొందరు అతని అనుచరులు. ఆ గ్రామంలో 18 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అక్కడ మిగితావాళ్ళందరూ హిందువులే. హిందూ voteల కోసమే ఆ హత్య జరిగినట్టు తెలుస్తోంది.

  • చందు - తులసి says:

   మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా హత్యలు చాలా చూస్తుంటాం ప్రవీణ్ గారూ…
   ఉదాహరణకు మంత్రగాళ్లనే నెపంతోనో, బాణామతి చేశాడనో ఆరోపణతోనో తమకు అడ్డుగా ఉన్న వ్యక్తులను హత్య చేయడం గ్రామాల్లోని పెత్తందార్లు చేస్తుంటారు..

  • 7 of the 10 accused are related to BJP leader Sanjay Rana. Google again about it.

   • balajiraju says:

    శ్రీనివాస్ గారు…
    ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్నది ఎస్పీ ఐనా అక్కడ బీజేపీ కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. కేంద్రంలో అధికారంలో కూడా ఉంది… అలాంటపుడు మీరు ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు కదా..

 92. balajiraju says:

  హింస చేయడమే కాదు…అసహనం కూడా హింసలాంటివ అంటారు మహాత్మాగాంధీ.
  అసహనమే క్రమక్రమంగా హింసకు దారితీస్తుంది.

  • చందు - తులసి says:

   అవునండీ ఇవాళ అసహనమే దేశానికి పెద్ద ప్రమాదకరంగా మారింది..
   ప్రపంచానికి శాంతిని, సహనాన్ని బోధించిన దేశంలో పరమతసహనం లోపించడం దురదృష్టకరం.

   • అసహనం అంటే ఏంటండి మీరు ఎలా కథలువ్రాస్తున్నా సహనం తో చదివి కామెంటుతున్న పాఠకులదా ? ‘ప్రతి పురుగునూ పూజిద్గాం చీమను చంపడాన్నైనా ఖండించాల్సిందే.ఒక రోజు మాంసం తినొచ్చు..కానీ ఇంకొకరోజు తినకూడదు అనడం ఎలా సమంజసం..? దీని వెనుక శాస్త్రీయ కారణం ఎవరైనా చెబితే బాగుండు’ అంటూ కామెంటుతున్న మీదా ?

   • మనిషిని చంపినందుకు ప్రతీకారంగా హత్య చేసినవానికి ఉన్న అసహనానికీ, ఆవుని చంపినందుకు ప్రతీకారంగా హత్య చేసినవానికి ఉన్న అసహనానికీ మధ్య తేడా లేదా? బిసాడా గ్రామంలో జరిగినది కేవలం ఒక పుకారుని నమ్మి చేసిన హత్య. ఒక పుకారుని నమ్మి హత్య చేసేవాళ్ళకి ఇంకా ఎక్కువ అసహనం ఉంటుంది. భాజపాకే చెందిన సంగీత్ సింగ్ సోమ్ అనే శాసన సభ్యుడు దున్నపోతు మాంసం ఎగుమతి చేసే ఒక కంపెనీలో షేర్లు కలిగి ఉన్నాడు. ఆ శాసనసభ్యుడు కూడా ఆవు మాంసాన్ని నిషేధించాలని కోరాడు. మన దేశంలో ఇప్పటికీ ఎక్కువ మంది దున్నపోతులతోనే పొలాల్లో దుక్కి చేస్తారు. పాలు ఇచ్చే జంతువుని చంపడానికీ, దుక్కి చేసే జంతువుని చంపడానికీ మధ్య తేడా ఎంత? వీటిలో ఒకటి లేకపోతే పాలు దొరకవు, ఇంకొకటి లేకపోతే పంటలు పండవు.

   • చందు - తులసి says:

    చంద్రిక గారూ…
    రాముని తోక పివరుండిట్లనియే అన్నట్లు మీకు అనుకూలంగా ముక్కలు చేసి అడగకండి. నేనేమన్నానో ఒకసారి చదవండి.
    ఆవునూ పూజిద్దాం. గేదెనూ పూజిద్దాం, మనిషి మనుగడకు ఉపయోగపడిన ప్రతీ పురుగునూ పూజిద్దాం అన్నాను.
    దీన్లో తప్పేముంది. పూజ అంటే పసుపు కుంకుమలతోనే కాదు..మనసులో కృతజ్ఞత
    చెప్పినా పూజించడమే.
    ఇక మాంసం గురించి ….ఒక రోజు తినవచ్చు …ఇంకో రోజు తినకూడదు అనడం వెనుక కారణాలున్నాయా అని అడిగాను. ఏం నేను కారణం అడగకూడదా.. ? కారణం అడిగితేనే మనోభావం దెబ్బతినింది అంటే ఎలా..?
    మీకో విజ్ఞప్తి. నేను ఇతర మతస్తున్ని కాదు, మతం విషయంలో వ్యక్తిగత నమ్మకాలు నాకున్నాయి. మీ వ్యక్తిగత నమ్మకాల్ని నేను ప్రశ్నించలేదు. మీరెవరో నీకు తెలీదు కాబట్టి నాకా అవకాశం లేదు.
    ఇక మీరు అసహనం గురించి అడిగారు.. అసహనమంటే ఏమిటో…గత నెలరోజుల పేపర్లు తిరగేయండి. లేదా గూగుల్ లో అసహనం అని వెతకండి.
    నాది అసహనం అంటున్నారు. ప్రశ్నించడమే అసహనమైతే…అదీ తప్పైతే సారీ. నేనింతే ప్రశ్నిస్తూనే ఉంటాను.

   • మన దేశంలో ఆవు మాంసం తినేవాళ్ళు చాలా తక్కువ. మన దేశంలో ఉన్న మాంసం ప్రాసెసింగ్ కంపెనీలు అన్నీ ఆవు మాంసాన్ని విదేశాలకి ఎగుమతి చేస్తాయి తప్ప స్థానికంగా అమ్మవు. దున్నపోతు మాంసాన్ని ఎగుమతి చేసే ఒక కంపెనీలో షేర్లు కలిగి ఉన్న ఒక శాసనసభ్యుడు కూడా ఆవు మాంసాన్ని నిషేధించాలని కోరుతున్నాడంటే, గోపూజలు చేస్తున్నది నాలుగు voteల కోసమే అని అర్థం కావడం లేదా?

 93. కె.కె. రామయ్య says:

  రచయిత చందు తులసి గారికో విన్నపం. చర్చోపచర్చల ఇన్ని కామెంట్ల నడుమ కదాకదనం పై మీ ప్రతిభకు పదునుపెట్టాలని ప్రముఖ కధా రచయితలు గొరుసన్న, శ్రీ ఆరి సీతారామయ్య గార్లు ఇచ్చిన విలువైన సలహాలను మర్చిపోవద్దు. మరోసారి మనసారా అభినందనలు.

 94. చందు-తులసి says:

  రామయ్య గారూ. మీలాంటి పెద్దలు, సీనియర్ రచయితల సలహాలు నాకు చాలా విలువైనవి. నేనింకా అ, ఆ ల దగ్గరే ఉన్నాను. మీలాంటి వాళ్లు చేయి అండగా ఉన్నంతకాలం నాకేం భయం లేదు సార్. నా మొదటి కథ నుంచి మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. మీ సూచన గుర్తుంచుకుంటాను. థాంక్యూ.

 95. సంగీత్ సింగ్ సోమ్ అనే భాజపా శాసనసభ్యుడు దున్నపోతు మాంసం ఎగుమతి చేసే ఒక కంపెనీలో షేర్లు కొన్నాడు. గూగుల్‌లో వెతకండి.

 96. ఏం నేను కారణం అడగకూడదా.. ? కారణం అడిగితేనే మనోభావం దెబ్బతినింది అంటే ఎలా..?

  @ చందు తులసి, రచయిత అనే వాడికి రాసే దాని మీద మంచీ అవగాహన ఉండాలి. కొద్దో గొప్పో పండితుడై ఉండాలి. కాని ఈ మధ్య కాలం లో చలా మంది అవేవి లేకుండా రాస్తున్నారు. ఒకప్పుడు హిందూ మతం మారుతున్న కాలానికి అనుగుణం గా మారటంలేదని భావించి రాసిన రచయిత లందరికి హింద్దు మత గ్రంధాల పై మాంచి అవగహన ఉన్నాది ఉదా కొ.కు, శ్రీ శ్రీ. అలాగే వెస్ట్ లో నాస్తిక వాదన చేసే మేధావులకి బైబిల్ గురించి పూర్తి అవగాహన ఉంది. వీళ్లు రాసే ఆలోచనలన మొదట ప్రజల నుంచి వ్యతిరేకతవచ్చినా, తరువాత వాళ్లు చెప్పిన అంశం పై ఆలోచిస్తారు.

  ప్రస్తుతం బ్లాగు లో, సోషల్ మీడియాలో రాసే వారికి మార్క్సిజం, మోడరనిజం, లేకపోతే చట్టాన్ని అడ్డుపెట్టుకొని హక్కుల ప్రస్థావన తెస్తూ హిందూ మత నమ్మకాలను విమర్సిస్తారు. . ఎవరైనా అభ్యంతరంచెపితే నేను పేఆనిస్తాను అని మొడి చాదన చేసి, సమాజన్ని పేఆనించేవిప్లవ వీరులవలే భావించుకొంటారు. మీకు మద్దతుగా రాసిన ప్రవీణె తీసుకోండి, ఆయన కు పెద్ద నాన్నన, చిన్నాన కూతుళ్లను, పిన్ని వరుస వారిని పెళ్లి చేసుకొంటే తాప్పేమి లేదని, ఇస్లాం తో పోలిస్తే హిందూ మహిళలకు స్వేచ్చ లేదని బలమైన అభిప్రాయం. ఆయనకు అర్థమయ్యేట్ట్లు చెప్పటానికి రెండూ మతాలు తెలిసిన పండితుడు, ఒక పెద్ద పుస్తకం రాయాల్సి ఉంట్టుంది. బ్లాగిఉలో వ్యఖ్యలు రాసి చెప్పే పరీథితి కాదు. ప్రశ్నలు వేస్తూమే ఉంటారు. ఎచరికి అంత ఓపిక , తీరికా ఉండదు. ప్రశ్నించటం పెద్ద విషయమా? మీరొక లైన్ రాస్తే అదెలా వీలౌతుంది? నాకర్థం కాలేదు, ఎందుకు, అదెలా? అని ప్రశ్నించుకొంట్టూ పోవచ్చు. చర్చను పొడిగించు కొంట్టు పోవచ్చు. ఎవరి ప్రశ్నలకు వారు జవాబులు వెతుక్కోవాలి గాని, నా ప్రశ్నలకు మీరు జవాబులు చెప్పండి అనటం హాస్యాస్పందం.

  హిందువులు గోవుకు గౌరవం మొదటి నుంచి ఇచ్చారు. అది భారతీయులను సమ్రక్షించింది. పూర్వం దాని పై జీవితం ఆధారపడని భారతీయుడు లేడు. గాంధినే గాదు మొన్నటి కంచి పరమచార్యులు కూడా గోవును గౌరవించారు. ఆచరణ లేని విశ్లేషణలు చేసే సూడో సెక్యులర్ మేధావులకన్నా ,ప్రజలకి జీవితకాలం చెప్పినదాచరించిన గాంధి, పరమాచార్యుల మాటల పై గౌరవం.

  మీకు కె.కె.రామయ్య వంటి సెక్యులర్ మేధావులు వంత పాడి ఉండవచ్చు కాని, హిందూ అభిమానులను మీ కథతో ఆకట్టుకొనలేదని, చంద్రికా, దేవిక రాణి మొదలైన వారి వ్యాఖ్యలను చదివితే అర్థమౌతున్నాది.

  • చందు-తులసి says:

   శ్రీరాం గారూ. మీరన్నట్లు నాకు పాండిత్యం లేని మాట నూటికి నూరుపాళ్లు నిజం. మీ ఉద్దేశం ప్రకారం మత గ్రంథాలన్నీ ఔపాసన పట్టిన తర్వాతనే సోషల్ మీడియాలో, బ్లాగుల్లో రాయాలన్నమాట. మంచి సూచన.
   పాండిత్యం లేదంటే ఒప్పుకుంటాను…కానీ అవగాహన కూడా లేదంటే ఎట్లా సార్..? పోనీ లేండి. నా కథలో నేనడిగింది ఒకటే ప్రశ్న. ఒక వ్యక్తికి తిండి పెట్టని వాడికి …అతడికి దొరికింది తింటుంటే వద్దనే హక్కు ఉంటుందా..?
   ఈ విషయం గురించి ఏ మత గ్రంథంలో ఉందో మీ లాంటి పండితుడు చెబితే చదువుకుంటాను.

   – ఇక ప్రవీణ్ కుమార్ గారు వేరే బ్లాగులో ఏదో రాస్తే ఆయన గురించి నన్నడిగితే నేనేమి చెప్పలేను. అది ఆయనతోనే చర్చించడం మంచిది .

   – నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని నేనేమీ నాకున్న సందేహాలను ఇక్కడ తీర్చుకోవడం లేదు కదా సార్. చర్చలో భాగంగా ప్రశ్నలడిగానేమో కానీ….అలా అడగడమూ తప్పని నాకు తెలీదు. ఇక నుంచి నేనేమీ ప్రశ్నలడగను. సరేనా.

   – హిందువులకు మొదటినుంచి గోవు జీవనాధారం అన్న సంగతి అందరికీ తెలిసిందే. దూడల మూతి కట్టేసి పాలు తాగి, నేతులు తాగి, నీతులు చెప్పడం పూజించడం అంటున్నారు. నిజంగా పూజించడమే ఐతే ….పెద్ద గోమాతను పూజిస్తూ …చిన్నారి ( లేగ ) మాత మూతి మాత్రం కట్టేసి పాలు పిండుకోవడం దేనికి…? అది పూజించడమేనా..? యజ్ఞ వేదికల జంతువులను బలిస్తారన్న సంగతి మీకు తెలుసనే అనుకుంటున్నాను.
   గాంధీ గారే కాదు….నేను కూడా గోవును గౌరవిస్తాను…నేనే కాదు….పల్లెటూళ్లలో ఆవు కూర తినే వాళ్లు కూడా ఆవులను ప్రేమిస్తారు.
   పూజించడం అంటే రోడ్ల మీద తిరిగే ఆవుకు దండం పెట్టడమో…ఆవు బొమ్మకు దండ వేయడమో కాదు.
   ఆవులను మేపడం, దాన్ని పెంచి పోషించడం, దానికి రోగమొస్తే…చికిత్స చేయడం అన్నీ చేస్తారు. తమ సంస్కృతిలో భాగంగా, ఆహారపు అలవాట్లలో భాగంగా ఆవును కూడా తింటారు. అంతే
   -ఇక నా కథను ఎవరో మెచ్చుకోవాలని నేను రాయలేదు. నాకు తోచినట్లు నేను రాశాను. నచ్చిన వాళ్లకు నచ్చింది. నచ్చని వాళ్లకు నచ్చలేదు.
   మీ విలువైన స్పందనకు ధన్యవాదాలు.

  • ఎంత మతం విశ్వాసాలు ఉన్నా, ఆవు మాంసం తిన్నందుకు మనిషిని చంపడాన్ని ఎక్కడా అనుమతించరు. మీరు ఆవుకి గుది కట్టుకుని పూజించినా సరే అది చట్టానికి అనవసరం.

   • చందు - తులసి says:

    ప్రవీణ్ గారూ.. మత విశ్వాసాల ప్రకారం చూసినా మనిషిని చంపడం తప్పే కదా…
    ఏ మత గ్రంథమూ హత్యలను సమర్థించదు.
    ఒక్క రాజకీయం తప్ప

   • @చందు తులసి,
    మత గ్రంథాలేమి, అన్నిగ్రంథాలలోఇతరులను ప్రేమించాలి, మంచి నడవడిక కలిగి ఉండాలి అని రాసి ఉంటారు. సమాజం లో వాస్తవం వేరు కదా! ప్రగతి శీల వాదులనే తీసుకోండి, వాళ్ల కథలలో ఎప్పుడు స్రీ, దళిత వర్గాల వారి కి మద్దతుగా రాస్తారు. ఎన్నో వాదనలు చేస్తారు. వాస్తవం లో వారి ప్రవర్తన అందరి సామాన్య మానవుల లాగే ఉంట్టుంది. ఈ క్రింది వార్త చదవండి.

    http://www.hindustantimes.com/india/maoists-kill-20-year-old-girl-who-chose-school-over-guns/story-O3OgKRbDvNVWlNDndc2ZKP.html

   • చందు - తులసి says:

    @ శ్రీరాం గారూ.. అంటే మత గ్రంథాలలో ఏవో రాస్తారు…వాటిని పట్టించుకోవద్దు అంటారా..? అలాంటపుడు మళ్లీ మతాన్ని అడ్డం పెట్టుకోవద్దు కదా..
    చెప్పేదొకటి చేసేదొకటి కాకూడదు కదా..?
    మావోయిస్టులైనా, మార్క్సిస్టులైనా, మతోన్మాదులైనా తప్పు ఎవరిదైనా తప్పే..

 97. చందు-తులసి గారు!! మీ వ్యక్తిగత నమ్మకాలు మీకు ఉన్నపుడు మీకు తెలీదా ఆవు ని పూజ చేస్తారో పురుగుని పూజ చేస్తారో!! ‘ఆవు’ ‘పురుగు’ సమానమేనా ? ‘చీమ’,’ ఆవు’ ఒకటేనా? ‘ఒక రోజు తినవచ్చు …ఇంకో రోజు తినకూడదు అనడం వెనుక కారణాలున్నాయా అని అడిగాను’ అంటున్నారు. అడగటం తప్పు కాదు. కారణం తెలుసుకోవటం తప్పు కాదు. కానీ ఎవరిని అడిగారు ? ఇదేమి ధర్మ సందేహాలు తీర్చే బ్లాగు కాదే మరి? మీ ప్రశ్న లోనే మీ అవహేళన , అసహనం తెలుస్తూనే ఉన్నాయి. ప్రపంచం లో మీరు ఎన్ని దేశాలలో నివసించారు? ఎన్నిదేశాలు చూసారు? అంత అక్కర్లేదు. పోనీ సిరియా, పాకిస్తాన్, ఇరాక్, లెబనాన్ దేశాల లో నివసించిన ప్రజలతో ఎప్పుడైనా మాట్లాడారా ? అమెరికా కి వలస వెళ్లి మళ్లీ తిరిగి భారత దేశానికి వచ్చిన భారతీయుల్ని చూస్తాము. కొన్ని దేశాల వారు అమెరికా కి వలస వెళ్ళాక అసలు వారి దేశాన్ని తిరిగి దర్శించడం కూడా చేయరు. ఇంటర్నెట్ ముందు కూర్చొని ప్రతి వ్యాఖ్య కి వెనువెంటనే సమాధానం చెప్తున్న మీరు అసహనం గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదం గా ఉంది. ఎంత మంది మీ కథ చదివారు? ఎంత మంది అసహనం వ్యక్తం చేసారు అని మీరు ఇలాంటి వ్యాఖ్య వ్రాసారు? ఇదెలా ఉందంటే అమీర్ ఖాన్ గారు పది ముందు మైకు పట్టుకుని చాలా అభద్రత గా ఉంది అన్నట్లే. ఆయన కి తెలీదు భారత దేశం లో కాబట్టే ఆయనకి బ్రహ్మ రథం పట్టారు, అదే వేరే ఏ దేశం లో అయితే ఆయన చివరి పేరు చూడగానే డేగ చూపులతో వేధించుకు తింటారని. ఇలాంటి వ్యాఖ్య చేసేటపుడు ఒకటి కి రెండు సార్లు ఆలోచించుకుని చేయండి. ఎందుకంటే భారత దేశం లాంటి దేశం ఈ ప్రపంచం లో లేదు. అసహనం తో పూనకం వచ్చిగోరంత లు కొండంతలు చేసి ఊగిపొతున్న మీడియా ని నెల రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు దేశం లో అందరూ. డబ్బు కోసం కథలు సృ ష్టించే వారి మాటలు ఆధారం గా చేసుకొని దేశం లో అసహనం పెరిగిపోతోంది అనటం ఎంత వరకు సబబు?

  • చందు-తులసి says:

   చంద్రిక గారూ.

   1-@ .ఇంటర్నెట్ ముందు కూర్చొని ప్రతి వ్యాఖ్య కి వెనువెంటనే సమాధానం చెప్తున్న మీరు అసహనం గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదం గా ఉంది. ఎంత మంది మీ కథ చదివారు? ఎంత మంది అసహనం వ్యక్తం చేసారు అని మీరు ఇలాంటి వ్యాఖ్య వ్రాసారు?

   — అంటే వెంటవెంటనే ఓపికగా సమాధానాలు ఇవ్వడమే అసహనం అంటున్నారా చంద్రిక గారూ.. ఇవ్వకపోతే జవాబు లేక ఇవ్వలేదు అనే వాళ్లను చూశాను కానీ…ఇప్పటి వరకూ మీరు రాసిన …వ్యాఖ్యలకు ఓపికగా సమాధానం ఇవ్వడాన్ని కూడా మీరు అసహనం అంటున్నారంటే మీరు ప్రపంచాన్ని తలకిందులుగా చూస్తున్నారని అర్థమవుతోంది. మీలాంటి వాళ్లకు ఎంత చెప్పినా ….. శంఖారావమే నన్నమాట. సంతోషమండీ.

   మీరు రాసిన వ్యాఖ్యలనే మరోసారి చదువుకోండి.
   @ – ఇదేమీ ధర్మ సందేహాలు తీర్చే బ్లాగు కాదే…? అంటున్నారు. ఇది ఎలాంటి బ్లాగో పక్కన పెడదాం. ఇంతకీ మీ దగ్గర నా ప్రశ్నకు సమాధానం ఉందా లేదా..? మీ దగ్గర ఉంటే చెప్పండి. లేకుంటే మీరు కాకుంటే ఇంకెవరైనా చెపుతారు.

   — హిందువులెవరూ ఆవు మాంసం తినరూ అనే భ్రమల్లో మీరున్నట్లున్నారు. నేను చెప్పేది జాగ్రత్తగా చదవండి.
   భారదేశం మొత్తంలోని హిందువుల్లో 17 శాతం ఎస్సీలు, 9 శాతం గిరిజనులూ ఉన్నారు. వీళ్లంతా ఆవును తింటారు. మిగిలిన కులాల్లోనూ ఇంకొందరూ తింటారు. మొత్తంగా ముప్పైశాతం మంది గొడ్డు కూర తింటున్నారు. మిగిలిన కులాలు, అగ్రకులాల్లోని కొందరు కూడా తింటారు. ఇది ఇవాళ కొత్తగా కాదు. వేల సంవత్సరాలుగా….
   మరి మీరు వీళ్లంతా హిందువులేనని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా..? వీళ్లు కూడా హిందువులేనని మీరు ఒప్పుకుంటే గొడ్డును తినడం భారతీయ సంస్కృతిలో ఎప్పటినుంచో ఉంది. ? మీరు ఎంత మనోభావం అన్నా….మీకు నచ్చకపోతే మీకు నచ్చింది తినండి. మీ తిండి గురించి ఎవరూ ఆంక్షలు పెట్టడం లేదు. మీరు కూడా అవతలి వారి గురించి ఆంక్షలు పెట్టకండి.

   2-@ ప్రపంచం లో మీరు ఎన్ని దేశాలలో నివసించారు? ఎన్నిదేశాలు చూసారు? అంత అక్కర్లేదు. పోనీ సిరియా, పాకిస్తాన్, ఇరాక్, లెబనాన్ దేశాల లో నివసించిన ప్రజలతో ఎప్పుడైనా మాట్లాడారా ?
   – నేనెన్ని దేశాలు తిరిగానన్న సంగతి పక్కన పెడితే మీకు ఎన్ని దేశాల గురించి తెలుసో మీ ప్రశ్నలోనే తెలుస్తోంది. టర్కీ, ఇరాన్, తజకిస్తాన్, తుర్కెమెనిస్తాన్, కజకిస్తాన్, ఇండోనేషియా, మలేషియా, బ్రూనై, ఆఫ్రికా దేశాలు బోలెడన్నీ కూడా ఉన్నాయి. మీరెలాగూ ప్రపంచదేశాలన్నీ చుట్టివచ్చారు కాబట్టి ఈ దేశాల్లో కూడా ముస్లింలే ఉన్నారని అక్కడ మతవిద్వేషం లేదన్న సంగతి తెలిసే ఉంటుంది.

   — ఇక చివరగా మీకు చెప్పేదేమంటే మీరు మీకు ఇంకెక్కడో జరిగిన లేదా రాసిన వాటి బాధను ఇక్కడ వెళ్లగక్కుతున్నారని….. ఐనా నేను చాలా మర్యాదగా సమాధానాలిచ్చాను. ఐనా మీరు వ్యక్తిగత స్థాయిలో దాడి చేస్తున్నారు. (1-ఇంటర్నెట్ ముందు కూర్చొని వెంటవెంటనే సమాధానం ఇస్తున్నారు. 2- ఎన్ని దేశాల్లో నివసించారు….లాంటివి. ) చర్చ వ్యక్తిగత స్థాయికి వచ్చిన తర్వాత ఆవేశకావేషాలు తప్ప నిజాలు బయటకు రావు. మీ విశ్వాసాలు మీవి. నా విశ్వాసాలు నావి.
   — ఇంత కాలం చర్చించినందుకు ధన్యవాదములు.

   • Chandrika says:

    ఆవు మాంసం గురించి మీరు అడిగిన ప్రశ్న కి ఇదివరకే నేను మీకు సమాధానం చెప్పడం జరిగింది. ఒకసారి చూసుకోండి. మీరు అన్న ‘అసహనం’ వ్యాఖ్య గురించి మాట్లాడాను నేను. మీరు చేసిన వ్యాఖ్య లో నే మీ అవహేళన, మీ అసహనం తెల్సుస్తోంది అని చెప్పాను. మీకు నేను వ్రాసింది అర్ధం కాకపోతే వ్యక్తిగత దాడి అంటే ఏమి చేయలేను. ఇప్పుడు కూడా మీ ఈ వ్యాఖ్య లో నే తెలుస్తోంది మీకు ఎంత సహనం ఉందో. నేను కూడా సామెతలు, జాతీయాలు ఉపయోగించి వ్రాయగలను. ఆ విధం గా దూషించే ఉద్దేశ్యం నాకు లేదు. ఒక generalized statement ఇచ్చేటపుడు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి. ‘అసహనం’, ‘అభద్రత’ అంటూ మాట్లాడితే దేశానికీ ‘అప్రతిష్ట’ కాదా ?తెలిసీ తెలియక ఈ రోజున మీడియా చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. భారతీయులయి ఉండి భారత దేశానికీ వన్నె తేవాలి కానీ అంతర్జాతీయం గా అపకీర్తి తెస్తున్నారు మన దేశ మేధావులు. ఈ మేధావులు సృష్టించిన రాజకీయాలు వలన ఎంతో మంది చిరకాల స్నేహితులనే కోల్పోతున్నారు. మీరు సమాధానం ఇచ్చిన తీరు కి సమాధానం ఇవ్వకూడదు అనుకున్నాను. కానీ మీకు తెలియజేయాలనే మళ్లీ సమాధానం చెప్తున్నాను.

   • చందు - తులసి says:

    చంద్రిక గారూ..
    @ మీడియా తెలిసీ తెలియక ప్రచారం చేస్తోంది. మేధావులు కూడా దురుద్దేశంతో దేశానికి అప్రతిష్ట తెస్తున్నారు.

    …..ఒకరో ఇద్దరో మాట్లాడితే సరే మీరన్నట్టే తెలిసీ తెలియక అనుకోవచ్చు. కానీ ఇంతమాట్లాడుతున్నారంటే ఊరికే అంటారా..
    మీడియాకూ తెలీదు, మేధావులకూ తెలీదు….మరి ఎవరికి తెలుసు..?

   • ‘@ మీడియా తెలిసీ తెలియక ప్రచారం చేస్తోంది. మేధావులు కూడా దురుద్దేశంతో దేశానికి అప్రతిష్ట తెస్తున్నారు.
    …..ఒకరో ఇద్దరో మాట్లాడితే సరే మీరన్నట్టే తెలిసీ తెలియక అనుకోవచ్చు. కానీ ఇంతమాట్లాడుతున్నారంటే ఊరికే అంటారా..
    మీడియాకూ తెలీదు, మేధావులకూ తెలీదు….మరి ఎవరికి తెలుసు..?’
    నా ప్రశ్న అదే !! బాధాకరం అయిన విషయం ఏంటంటే దేశం లో సగం మంది ప్రశ్న అదే!! ఎన్నో జరిగినపుడు ఎవరు ఏమి మాట్లాడకపోవడం ఇప్పుడు అదే పని గా ‘ఇంత’ మాట్లాడడం ఏంటి అనే? ఈ ప్రశ్న కి సమాధానం ఎవరైనా చెబితే బాగుండు !!

 98. చంద్రిక గారూ.. అమీర్ ఖాన్ ఏ సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేశారో.. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు అంత పెద్ద నటుడిలో(మీరనుకున్నట్లు.. నిజానికి ఆయన తన భార్య గురించి చెప్పారు) అభద్రతా భావం వచ్చిందో మీరు గమనించారా.. ? ఆ తర్వాత దానిపై అమీర్ ఖాన్ ఇచ్చిన వివరణ చదివారా..?(చూశారా?)

 99. నా మాట కూడా అదే ఎన్నడూ లేనిది ఇప్పుడేంటి అని దేశం లో ఈ వింత పోకడ అని? నేను వాళ్ళ ఆవిడ మాటలు గురించి చెప్పలేదు. ఆయన మాటలే చెప్పాను . జాగ్రత్తగా గమనించండి ఆ వీడియో లో !! అంత భయపడేవారు అయితే అంత హాయిగా కుర్చీ లో కూర్చుని ప్రతి ప్రశ్న కి సమాధానం ఇస్తారా ? ‘no comments’ అని కదా సమాధానం వస్తుంది? ఆయన నిజం గా అభద్రత గా ఉన్నారో లేదో గానీ తన ‘నటనాకౌశలం’ తో హాయిగా ఉండేవారిని అభద్రత కు గురి చేసారు. హైదరాబాదు లో మా చిన్నతనం లో ప్రతి బోనాలకి , నిమజ్జనం కి పాతబస్తీలో గొడవలు జరిగేవి. కర్ఫ్యూ ఉండేది. మనుషులు ఒకరినొకరు పొడిచేసుకునేవారు!! అమెరికా లో పిల్లలు స్నో సెలవల కోసం చూసినట్లు ఆ తెలియని వయసు లో ఆ కర్ఫ్యూ సెలవల కోసం ఎదురు చూసేవారం. ఆ ప్రాంతాల పేర్లు నాకు ఈ రోజు కి నోటికి వచ్చు. ఈ రోజున ఉన్న మీడియా ఆ రోజులేదు. మరి ఎలా గుర్తున్నాయి నాకు ఆ ప్రాంతాల పేర్లు ? ప్రతి ఏడాది రేడియో లో ఆ పేర్లు విన్నా కాబట్టి!! అంత గొడవలు ప్రతి మారు( recurring events) జరుగుతున్నా ఆ ప్రాంతాలలో ఉండే మాకు తెల్సిన స్నేహితులు ఏ రోజున అభద్రత కిగురవ్వలేదే ? దేశం లో ఒక్క సంఘటన తో కార్ల్లలో, సెక్యూరిటీ తో తిరిగే ఆయన అంత అభద్రత కి గురవ్వడం ఏమిటి? PK సినిమా చూసి, సత్యమేవజయతే అంటూ ఆయన కార్చిన మొసలి కన్నీరు చూసి ఆయనని కోటీశ్వరుడిని చేసిన వెర్రి జనం, ఆయన మాటలు విని కొంతమందైనా కళ్ళు తెరిచారు ఈ వింత పోకడ ఏంటి అని!! భారత దేశం లో కూర్చుని ఇంటర్నెట్ లో వ్యాఖ్యలు వ్రాయటం కాదు అసహనం, అభద్రత అంటే తెల్సుకోవాలంటే వేరే దేశాలలో నివసించే వారితో నాలుగు మాటలు మాట్లాడండి తెలుస్తుంది !!

  • ‘భారత దేశం లో కూర్చుని ఇంటర్నెట్ లో వ్యాఖ్యలు వ్రాయటం కాదు అసహనం, అభద్రత అంటే తెల్సుకోవాలంటే వేరే దేశాలలో నివసించే వారితో నాలుగు మాటలు మాట్లాడండి తెలుస్తుంది’.

   మీరు ఏ దేశాలనైతే చూడమని.. మాట్లాడమనీ చెప్తున్నారో.. ఆ దేశాల్లో ఆ పరిస్థితికి కారణం ఏమిటో మీకు తెలుసా..? ఇరాన్, ఇరాక్, పాకిస్థాన్, లెబనాన్, సిరియా దేశాల్లో మతం పేరుతో విధిస్తున్న ఆంక్షలు.. చేస్తున్న దాడులే కారణం. మతం పేరుతో చేసే నియంత్రణ, సంస్కృతి కాపాడాలన్న ముసుగు తొడుక్కొని చేసే రాయకీయాలు ఇలాంటి పరిణామాలకే దారి తీస్తాయి. భారతదేశంలో వందలు, వేల ఏళ్లుగా అన్ని కులాలు, మతాలు కలిసి ఉన్నాయంటే అది ఇప్పుడున్న హిందూ పరిరక్షకులు కాపుకాయడం వల్ల కాదండీ. ఎవరి బతుకు వారిని బతకనివ్వడం వల్ల. ఒకరిపై మరొకరు పెత్తనం చెయ్యకపోవడం వల్ల. చరిత్రలో మతాల కోసం జరిగిన యుద్ధాలు చివరికి ఆయా రాజ్యాల వినాశనంతో పరిసమాప్తం అయ్యాయి. ఏ చరిత్ర తీసుకున్నా మతం కేంద్రమైనప్పుడు వినాశనమే శేషం అవుతుంది. భారతదేశం ఇరాన్, ఇరాక్, పాకిస్థాన్, లెబనాన్ లాగా మారకుండా ఉండాలంటే.. మత పరిరక్షకుల పేరుతో హిందూ ఉగ్రవాదులు చేస్తున్న దాడుల్ని అడ్డుకోవాలి. నిరసన తెలపాలి. ఆ మేరకు ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత రచయితలకూ, తరచూ ఇంటర్నెట్ చూసి ప్రపంచ పరిణామాలను గమనిస్తున్న మీలాంటి వారికీ ఉంటుంది.

   ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ జరుగుతోంది. యూనివర్సిటీలో 80శాతానికి పైగా ఉన్న బీఫ్ తినే విద్యార్థులంతా వారి సంప్రదాయ పండుగ కింద పెద్దకూర పండుగ చేస్తున్నారు. దీన్ని అడ్డుకుంటే త్వరలో వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని భావిస్తున్న బీజేపీ నాయకులు అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఏకంగా కత్తులు పట్టుకొని ఫోటోలు దిగి.. ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. రాజా సింగ్ అనే ఒక ఎమ్మెల్యే అయితే.. బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే దాద్రీలో చేసినట్లే ఉస్మానియాలోనూ చేస్తాం(అఖ్లాక్‌ని చంపినట్లే..) అని హెచ్చరించాడు.

   ఇప్పుడు చెప్పండి. ఇలాంటి ఘటనలపై స్పందించడం జరిగే పరిణామాలపై సమాజాన్ని జాగృతపరచడం రచయితలకు లేదంటారా..? రచయితలతే కాదు కాస్త ఆలోచనా జ్ఞానం ఉన్న ఎవరైనా మతం పేరుతో జరిగే అరాచకాలను అడ్డుకోవాలి. ఇది భారతదేశం పరువు తీయడం కాదు. మతోన్మాదులను అడ్డుకోకపోతేనే మీరు భయపడుతున్న పరిణామాలు జరిగి భారతదేశం భయానకదేశం అవుతుంది.

   • భారత దేశం లో ఏదో జరిగిపోతోంది అన్నట్లు ‘అసహనం’ అన్న వాదన ని ఖండిస్తూ నేను ఉదహరించిన దేశాలు అవి. ‘అసహనం’, ‘అభద్రత’ అనేవి భారతీయుల వ్యాకరణం లోనే లేవు. ‘అసహనం’, ‘అభద్రత’ అంటే ఆ దేశాలకి వర్తిస్తుంది అని చెప్తున్నాను. మీకు అర్ధం కాకపోతే ఏమి చేయలేను సామెతలు చెప్పడం తప్ప!! భారత దేశం లాంటి దేశం ఈ ప్రపంచం లో లేదు అని మళ్లీ మళ్లీ చెప్తున్నాను. నేను ఉదహరించిన దేశాలు పక్కన పెట్టినా ప్రపంచం లో democratic countries అని చెప్పుకునే దేశాలలో కూడా ఇంత సహనం ఉండదు. రంగు ని బట్టి ,ఇక ఇస్లాము మతానికి చెందిన వాడు అని పేరు చూడగానే ఎదుటి మనిషి ప్రవర్తన మారిపోవడం జరుగుతుంటుంది. దాన్నే ‘అసహనం’ అంటారు. మీరు PK సినిమా చూసారా? ‘‘అసహనం’ అన్న మాట కి అర్ధం తెలిస్తే PK సినిమా ఏ హిందువు చూడడు. కానీ ‘ఒక సినిమా ని సినిమా లాగే చూడాలి’ అని హిందువులే చూసారు. అమీర్ ఖాన్ గారి ఐశ్వర్యాన్ని కొన్ని కోట్లు పెంచారు. హిందువులు ‘అసహనం’ గా ఉంటారు అని ‘అభద్రత’ కి లోనయ్యే ఇతర మతస్తులు పబ్లిక్ రోడ్డు మీద నుంచుని వారి మతం లోకి రమ్మంటూ ఆహ్వాన లేఖలు, వారి మత గ్రంథాలు పంపిణీ చేయరు. ఇక బీఫ్ ఫెస్టివల్ గురించి – మీరే చెప్పండి మొదట ఎవరు కయ్యానికి కాలు దువ్వుతున్నారో !! పిల్లవాడిని గిచ్చి ఏడవకు అన్నట్లు!! !హిందూ ‘ఉగ్ర వాదమా’? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియాలి. ఇలాంటి రాతలు వ్రాయటం ‘అసహనం’, ‘అభద్రత’ అనటం.

 100. మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును
  అని గురజాడ గారు చెప్పి నూరు ఏండ్లు దాటినా మనం అక్కడె వున్నాం .

  • చందు - తులసి says:

   అవును భార్గవ గారూ….
   కచ్చితంగా మతములన్నియు మాసిపోవును…
   జ్ఞానమొక్కటే నిలుస్తుంది.

   • Chandrika says:

    చందు-తులసి గారు!! నిజమే మతం పేరుతో మారణ కాండ జరుగుతోంది. కానీ క్షణ క్షణం కాదు !! అలా జరుగుతుంటే మనిద్దరం ఇలా కులాసాగా వ్యాఖ్యలు వ్రాసుకోం కదా!! జరుగుతున్నది అక్కడక్కడా అప్పుడప్పుడే !! మతం పేరు తో అంత కంటే మంచి కూడా ఉంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాడు. పుట్ట పర్తి బాబా గారి దయ వల్ల super speciality ఆసుపత్రి పేదలకి వచ్చింది. అది నిజంగా మతం మహిమే కదా మరి? ‘అక్షయ పాత్ర’ ని సృష్టించిన ISCON వారు మతాన్నే కదా బోధిస్తున్నారు!! ఇవి నాకు తెల్సిన కొన్ని ఉదాహరణలు మాత్రమే!! మతం పేరు తో ఎన్నో సేవలు ఎన్నో చోట్ల జరుగుతూనే ఉంటాయి. క్రిస్మస్ Santa Claus ని సృష్టించింది. రంజాన్ మాసం లో తప్పకుండా సమాజ సేవ చేయాలి అంటారు. ఉపవాసం, ప్రార్థన రోజు చేయలేరు. అందుకే ఆ 30 రోజులు అనేవి తాత్కాలికంగా మనిషిని క్రమ శిక్షణ లో ఉంచుతాయి. మతం సమసి పోతే ఎలా? మతం లేకపోతే గుడి ఎక్కడుంటుంది? గుడి పక్కన కూర్చుని కొబ్బరికాయలు అమ్మేవారు ఏం చేస్తారు? ఒక్కోసారి మతమే కొందరికి జీవనాధారం కూడా!! ఒక విధం గా మన PK గారిని కోటీశ్వరుడిని చేసింది కూడా మతమే కదా!! బ్రిటిష్ వారు మన పశు సంపద ని నాశనం చేస్తుంటేనే హిందువులు గోవధ చేయం అని చెప్పారు!! ఈ రోజు న బీఫ్ తినడానికి ఉంది అంటే ఆ రోజు న బీఫ్ ని కాపాడింది మతమే కదా !! చూసారా ఎటు తిరిగినా ‘ఆవు’ వ్యాసం కే వెళ్తున్నాము :)!!

   • ఒక్క హైదరాబాద్ సిటిలోనే వినాయక చవితి ఉత్సవాలకి 5000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. 20,000 కుటుంబాలకి ఉపాధి దొరుకుతుంది. ఈ వేడుకలను పరిశీలిస్తే, అది ఎక్కువ గా పేద,దిగువ మద్యతరగతి వర్గాల వారికే ఉపాధి కలిపిస్తుంది. ఈ లెక్కన చూస్తే దేశవ్యాప్తం గా సుమారు లక్ష కోట్ల వ్యాపారం జరిగినా ఆశ్చర్య పోనక్కరలేదు. మతాన్ని అడ్డుపెట్టుకొని చంపుకొనే వారిని అడగాల్సిన ప్రశ్నలు హిందువులను అడగటం, హిందూ మతాన్ని ఇతర మతాల తో పోలికేమిటి అంట్టు ఒక వైపు వాదిస్తూ, హిందూ మతాన్ని పోల్చటం ఇదెక్కడి న్యాయం?

  • Chandrika says:

   నిజమే కానీ అది జ్ఞానుల విషయం లో. కానీ ఒక సామాన్య మానవుడి విషయం లో కాదు. జ్ఞానులకి ఏ మతం అవసరం లేదు. కొండ శిఖరం ఎక్కి పైన కూర్చున్న వాడికి తెలుసు, కొండ ఎక్కడానికి ఏ దారి లో వచ్చినా శిఖరం చేరుకుంటాడని. కొండ ఎక్కుతున్న వారు ఎవరికీ వారే వారి దారే సరిఅయినది సులభంగా శిఖరం చేరుకుంటారన్న భ్రమ లో ఉంటారు. కొండ శిఖరం చేరుకునే వారు జ్ఞాని. కొండ ఎక్కుతున్న వారు సామాన్యులు. మతం అనేది ఉండటం వలన సామాన్య మానవుడి పాపభీతి అనేది ఉంటుంది. ప్రపంచం ఈ మాత్రం ఉంది అంటే మతం సృష్టించిన క్రమ శిక్షణ. కాబట్టి మతం ఉండాలి.

   • చందు - తులసి says:

    చంద్రిక గారూ.. ప్రపంచం ఇలా ఉండటానికి కారణం మతం అంటున్నారు…
    ప్రపంచ వ్యాప్తంగా అరాచరానికి, ఉగ్రవాదానికి కారణం కూడా మతమేనని మర్చిపోకండి. క్రూసేడుల దగ్గరనుంచి ఇవాల్టి దాకా యుద్ధాలకుకారణం మతం.
    మహిళల వెనకబాటుకు కారణం మతం.
    ప్రజల్ని దోపిడీని, అణచివేతను ప్రశ్నించకుండా చేస్తోంది మతం..
    పరలోకంలో ముక్తి ఏమో గానీ ఈ లోకంలో పుట్టినప్పటినుంచి, చచ్చేదాకా మనిషిని బానిసగా బతికేలా చేస్తోంది మతం.
    ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మతాల పట్ల అపనమ్మకం మొదలయ్యింది. ఇంకో ఐదు వందల ఏళ్ల తర్వాత మతం అన్న పదం కూడా వినిపించనంత సమోన్నతంగా మానవ సమాజం ఎదుగుతుంది.

 101. కె.కె. రామయ్య says:

  “మతం పేరుతో చేసే నియంత్రణ, సంస్కృతి కాపాడాలన్న ముసుగు తొడుక్కొని చేసే రాయకీయాలు ఇలాంటి పరిణామాలకే దారి తీస్తాయి. ఏ చరిత్ర తీసుకున్నా మతం కేంద్రమైనప్పుడు వినాశనమే శేషం అవుతుంది. మతోన్మాదులను అడ్డుకోకపోతేనే … భయానకదేశం అవుతుంది.” ఎంత చక్కగా చెప్పారు తులసి గారు. ప్రపంచంలోని మతోన్మాదుల రాజ్యంలో మహిళలు, బడుగులు ఎక్కువగా అన్యాయాలకు గురవుతున్నారు. తులసి గారికి, “మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును” అన్న గురజాడని గుర్తుకు తెచ్చిన భార్గవ గారికి కృతజ్ఞతలు.

  తులసి గారు, త్రిపుర గారి అల్లుడు, శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు కినిగే అంతర్జాల పత్రికలో రాసిన “ఇద్దరు మావయ్యల కధను ” చదివారా http://patrika.kinige.com/?p=5708

 102. Chandrika says:

  చందు-తులసి గారు !! ‘అసహనం’ మీద మనం నాలుగు రోజులు గా చాలా మాట్లాడుకున్నాము.’అసహనం తో పూనకం వచ్చిగోరంత లు కొండంతలు చేసి ఊగిపొతున్న మీడియా ‘ అని కూడా వ్రాసాను. అమీర్ ఖాన్ గారేమో ‘అభద్రత ‘ గురించి గురించి మాట్లాడారు. ఈ ఆవు మాంసం కథ వలన మనోభావాలు దెబ్బ తింటున్నాయి, గోవు అంటే పూజించే వస్తువు అన్న ప్రతి వారికీ ఏదో ఒక సమాధానం ఇస్తూ వచ్చారు మీరు. అందరూ మీ ‘freedom of speech’ ని చాలా సహనం గానే తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఈ article చదివి మనోభావాలు దెబ్బ తింటే సహనం ఎలా కోల్పోతారో తెలుసుకోండి !! మీడియా వారు వారి ఈ ‘freedom of speech’ ని పూనకం తో ఊగిపొతు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పండి !! సహనం ఎవరికి ఉంది PK సినిమా ని సినిమా లాగే చూడాలి అన్న హిందువులకా , ఆవు మాంసం మీద కథ వ్రాస్తే చదివిన వ్యాఖ్యలు వ్రాస్తున్న మా లాంటి పాఠకులకా, పత్రిక ఆఫీసు ల మీద దాడి చేసిన వీరికా ?
  http://www.ndtv.com/india-news/muslim-groups-in-maharashtra-attack-offices-of-daily-over-cartoons-1249471

మీ మాటలు

*