ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
Good review
well done!
Thank u.
గుడ్ Review
Thank u.
గుడ్ రివ్యూ సర్ .. ప్రేక్షకుల ధోరణి కూడా మారాలి ,, అప్పుడే తెలుగు సినిమా బాగుపడుతుంది. దర్శకుడు క్రిష్ కు మంచి డైలాగ్ రైటర్ దొరికాడు…సినిమా లో డైలాగ్స్ కుడా బాగున్నాయి.
నిజం చెప్పారు నారాయణ గారూ…
మీరు చెప్పింది నిజం sir.
krish… very.good.director.
చాల కాలం నుంచి హీరో కోసం కథ — హీరో డామినేషన్ —హీరో చెప్పిన వాళ్ళే
అ సినిమాలో ఉండాలి —-(actors..hero-ins.-మ్యూజిక్ director.–అంతా )
అ తిరు పోయి డైరెక్టర్ ల కు importance…పెరిగినప్పుడే మార్పు రాక పోదు
మార్పు అవసరం —
——————————————–బుచ్చి రెడ్డి గంగుల ————————
అవును. హీరోని కథ డామినేట్ చేసినప్పుడే తెలుగు సినిమాకు పురోగతి.
సినిమా గురించి బాగా చెప్పారు .ఆ సినిమా చూడలేదు కాని మీది చదివాక చూడాలనిపిస్తోంది .కీప్ ఇట్ అప్.
ధన్యవాదాలు అనూరాధ గారూ..
రివ్యూ చూశాక నాకూ సినిమా చూడాలనిస్తోంది. ఇదివరకు ’1942 లో ఒక గ్రామం’ చూశాను. మెలోడ్రామా ఎక్కువై జనాన్ని ఆకట్టుకోలేదు. ఇలాంటి సినిమాలకు కమర్షియల్ హంగులు ఉండాలేమో..
వాస్తవికతకు ఎంతోకొంత నాటకీయత జోడించకపోతే అది డాక్యుమెంటరీ అవుతుంది కానీ సినిమా కాదు. సామాజిక దృష్టికి వ్యాపార దృష్టిని జోడిస్తేనే అది జనం వద్దకు వెళ్తుంది.
తెలుగు సినిమాను మార్చడానికి సర్వ విధాలా
ప్రయాసపడుతున్న దర్శకుడు క్రిష్. నాకున్న కంప్లయింట్ ఏంటంటే..చాలా కొత్త కథ చెప్పటానికి ప్రయత్నిస్తారు..కానీ చివరలో తడబడతాడు. వేదంలో కానీ ముఖ్యంగా రానా సినిమాలో ముగింపు కానీ నిరాశ కలిగిస్తాయి. అలాగే డైలాగ్ లు..నాటకంలా ఉంటాయి. ఒకటి రెండు సార్లు ఓకే కానీ..సినిమా అంతా ఐతే ఇబ్బంది.
కంచె లాంటి ప్రయత్నం అభినందనీయం. క్రిష్ లాంటి దర్శకుణ్ని ఎంకరేజ్ చేయాలి.
తులసి గారూ.. క్రిష్ సినిమాలన్నీ పూర్తిగా నాటకీయ సంభాషణలతో ఉంటాయన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి నాటకీయంగా ఉంటాయనడాన్ని నేను అంగీకరిస్తాను. మీ కంప్లైంట్ బహుశా ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాకి సంబంధించిందని అనుకుంటాను. అందులో కథానాయకుడి పాత్రే నాటకాల రాయుడి పాత్ర. అందువల్ల ఆ పాత్ర డైలాగులు నాటకీయంగా ఉండటమనేది వాస్తవిక చిత్రణే కదా. ఇకపోతే క్రిష్‌లాంటి దర్శకులు కావాలని నేను చెప్పిన దాన్ని బలపరిచినందుకు సంతోషం.
చక్కటి విశ్లేషణ మూర్తిగారూ.తెలుగు సినిమా ఏ స్థితిలో ఉందో నిర్మొహమాటంగా చెప్పారు.తెలుగు సినిమా చాలా కంచెల్ని దాటవలసి ఉంది.అభినందనలతో
శివ్
ధన్యవాదాలు శివ్ గారూ…
యజ్ఞమూర్తి …గారూ , మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను :) మీరన్నది నిజమే .. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది అనడానికి “కంచె ” ఒక నిదర్శనం. నేను ఫేస్ బుక్ లో రాసుకున్న నా అభిప్రాయం ఇది.
రొడ్డ కొట్టుడు తెలుగు సినిమాలనుండి, వెకిలి “హాస్యం” నుండి కొంత ఉపశమనం క్రిష్ “కంచె”. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి కథని తెర కెక్కించడం ఒక సాహసమే. కథను జ్ఞాపకాల రూపంలో ముందు నుండి వెనక్కీ వెనకనిండి ముందుకీ చూపించే ప్రక్రియ క్రిష్ కు “గమ్యం” నుండే అలవాటు . కథ కంటే యుద్ధ సన్నివేశాలు ఎక్కువ అయ్యాయేమో కొంత అనిపించింది . షావుకారు జానకి వెండితెర మీద 65 ఏళ్ళుగా నటిస్తూనే ఉండడం “గ్రేట్ ” . బహుశా ఇన్నేళ్ళు వెండితెరను ఏలిన తారలు ప్రపంచంలో లేరేమో ! తెరమీద ఆమెను చూడగానే వొళ్ళు పులకరించింది. వరుణ్ తేజ్ ఇంకా నటనలో “పుటం ” పెట్టుకోవాలి . అదేంటొ తెలుగు చిత్రాల్లో హీరో ల కంటే విలన్లే “హాండ్సం ” గా అందంగా ఉంటారు . 60 ఏళ్ళ నాటి ఆర్ . నాగేశ్వర్ రావు నుండి ఇప్పటి సుబ్బరాజు, అజయ్ లాంటి వాళ్ళ వరకూ :) ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు .
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 70 ఏళ్ళ నాటి కట్టూ , బొట్టూ … ఆహార్యం విషయంలో క్రిష్ ఫెయిల్ అయ్యాడు. చూస్తుంటే రెండవ ప్రపంచ యుద్ధం తో పాటూ సినిమా కథ 2015 లో జరిగినట్టు ఉంది. శ్రీ శ్రీ ని , చలం ని వాడుకోవడం క్రిష్ కు ఉన్న మంచి సాహిత్య పరిచయాన్ని చెబుతుంది. ఏదేమయినా మంచి ప్రయత్నం. భిన్నమయిన కథతో వచ్చిన క్రిష్ ను అభినందించకుండా ఎలా ఉండగలం !
అదీ సంగతి యజ్ఞమూర్తి గారూ :)
తహిరో గారూ.. పాత తరం తారలపై మీకున్న అభిమానం మీ స్పందనలో బాగా కనిపించింది. సినిమాలో జానకిగారి హావభావాలు కళ్లముందు ఇంకా నిలిచే ఉన్నాయి. గొప్ప నటి. వరుణ్‌తేజ్‌తో ఈ స్థాయి నటననైనా రాబట్టిన క్రెడిట్ డైరెక్టర్ క్రిష్‌దే. తొలి సినిమా ‘ముకుంద’తో పోలిస్తే అతని నటన బాగా మెరుగయ్యిందని మీరూ ఒప్పుకుంటారు. 2015లోనూ కథ నడిచినట్లు అనిపించిందని మీరు చెప్పింది ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ గురించేననుకుంటా. అయితే అది నెగ్లిజిబుల్ అనేది నా ఉద్దేశం. మీ స్పందనకు ధన్యవాదాలు.