బైరాగి కోసం..ఒక వెతుకులాట..

నాకు తెలుసు, నాకు తెలుసు

ప్రళయవేదనా పంకిల ప్రపంచపథం మధ్య

ప్రేమలు పొసగవని

ఈ బండరాళ్లపైన ఏ మొక్కలు ఎదగవని

మనమంతా చీకటిలో ఆకటితో పోరాడే

అస్వతంత్ర సైనికులమని,

పెనుతుఫాను చేతులలో చిక్కుకొన్న

త్రోవలేని నావికులమనీ

జీవిత ప్రభంజనం

కలయిక సహించదనీ

ఉన్నగడువు కొద్ది అనీ

నాకు తెలుసు! నాకు తెలుసు!

-ఆలూరి బైరాగి 

.

bairagi

మీ మాటలు

 1. sandarbham says:

  “మంచి ప్రయత్నం.
  ధన్యవాదాలు.”

 2. కె.కె. రామయ్య says:

  ఆదిత్య గారు! ఆలూరి బైరాగి గారి గురించి సోమాజీగూడా ప్రెస్ క్లబ్ మీట్ కి రాలేని మాలాంటి నిస్సహాయకులకి కూడా బైరాగి రచనల కానుక దొరికే వీలున్నదా. పెద్దలు సోమయ్య గారు, చినవీరభద్రుడు గారు వస్తున్నట్లు ప్రకటించలేదేవి? మీరు చేస్తున్న మంచి ప్రయత్నానికి ధన్యవాదాలు.

 3. What are the roots that clutch, what branches grow
  Out of this stony rubbish? Son of man,
  You cannot say, or guess, for you know only
  A heap of broken images, where the sun beats,
  And the dead tree gives no shelter, the cricket no relief,
  And the dry stone no sound of water.

  :-)

  Whenever I see ఈ బండరాళ్లపైన ఏ మొక్కలు ఎదగవని, I was reminded of this poem (actually, other way round, since I read Bairagi first). I pondered quite a bit about the similarities. In particular, I think Eliot benefited from having an editor, which Bairagi lacked. For instance, look at all the images that Bairagi crams in here. Some of them are concrete, some abstract, with different motifs. I wish there was an overriding motif towards which he could have deployed the words.

  If we look at the earlier manuscript of Wasteland, which was called “He do the police in different voices”, you will see similar problem. There, he errs on the side of being too concrete. His imagery ends up too descriptive. With the edits of Ezra pound, the poem becomes taut, where the reader supplies the missing imagery. I particularly recall “the fire sermon” and the part of the secretary and how it became less visceral and more poetic after the edits of Pound.

  I know that I was attracted to Bairagi for the sheer intellectual brilliance. Yet, I wonder if we should study him and understand his craft critically. Sure, his diction was influenced by his education. Sure, his poetic forms too are unorthodox. And, they are problematic in places — it would be nice to discuss these issues are, instead of gold plating them. He would have loved it. “ఈ విశ్వ వ్యథా వారి నిథీ తటాన …” May be too much of nit picking on my side. But, would love to hear from fellow Bairagi readers.

  — Ramarao Kanneganti

 4. buchireddy gangula says:

  very.గుడ్ effort.sir..
  ———————————
  buch..reddy.gangula.

 5. కె.కె. రామయ్య says:

  కన్నెగంటి రామారావు గారు, మామూలు ‘ఫెలో బైరాగి రీడర్’ కాదు, ఆలూరి బైరాగిని గుండెల్లో పెట్టుకు తిరిగే ఆదిత్య. బైరాగిపై వారి వ్యాసమొకటి సారంగ లో క్రితంలో వచ్చినది చూడగలరు.

  గంగుల బుచ్చిరెడ్డి గారు, బైరాగి రచనలన్నీ (దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఆధ్వర్యంలో వచ్చిన బైరాగి సంస్కరణ సంచికతో సహా) పాఠకులకి అందుబాటులోకి తేవాలనే ప్రయత్నంలోని ప్రముఖ భాగస్వామి యువకుడు ఆదిత్యగారిని ఇంకా పెద్దఎత్తున మనమందరమూ అభినందించాలి, ప్రోత్సహించాలి.

  http://saarangabooks.com/retired/2014/03/26/%E0%B0%86%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%A4%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81%E0%B0%96-%E0%B0%B8%E0%B1%87%E0%B0%A4/

 6. Ramarao Kanneganti says:

  కే.కే. రామయ్య గారూ: అవునండీ — ఆదిత్య నన్నెప్పుడూ pleasant గా surprise చేస్తుంటాడు. It is a pleasure to read his old article again. I wish I could have been there.

మీ మాటలు

*