కాక్ అండ్ బుల్ స్టోరీ

sidhareddi

 

చీకట్లో ఏందో మెరస్తా ఉండాది. ఏందదని నేను చూస్తా ఉండంగానే అది కొంచెం కొంచెం పెద్దదవతా దగ్గిరికి వస్తా ఉండాది. ఏందో మంటలాగుంది. మంటే. మంట పెద్దదవతా ఉండాది. ఎవురో గట్టిగా అరస్తా ఉండారు. నేను దగ్గిరికిపోతా ఉన్నాను. మంట గూడా దగ్గిరికి వస్తా ఉండాది. భోగిమంట లా ఉంది. బరికె ని అంచులో పట్టుకుని తాటాకు ని కాలస్తా ఉండాడు ఒకాయన. తాటాకు బగ్గున మండింది. మంట పదడుగులు లేసింది. చుట్టూ కూచున్న పిలకాయలు దూరంగా జరిగారు. ఎవురో పరిగెత్తుకోని వస్తా ఉండాడు.

నిప్పుల మీద పరిగెత్తుకుంటా ఎళ్ళిపోయాడు. ఇంకా చానా మంది వస్తున్నారు. నిప్పుల్ని లెక్కజేయకుండా పోతానే ఉన్నారు. నేనాడకి దూరంగా నిలబడి చూస్తా ఉండాను. మా పిల్లోడు బోగిమంటకి తాటాకులు కావాలని నన్ను అడగతా ఉన్నాడు. పీర్లు పట్టుకోని సాయిబులోళ్లు గుండాం తొక్కతా పోతున్నారు. నాకా పూసలు తెచ్చీ. చీరక్కుట్టుకుంటా అని అడగతా ఉంది మా ఆడోల్లు. చాకలోళ్ళ పిల్లోడు గొంతులో కత్తి గుచ్చుకోని అడతా ఉండాడు. విజియుడు పులేషం ఏసుకుని డ్యాన్సాడతుండాడు. గంగిరెద్దులోళ్లు ఎద్దుని పులి సుట్టూ తిప్పతా ఉండాడు. ఆడోళ్లంతా మిద్దెల మీద నిలబడి నవ్వతా చూస్తుండారు. నేను మా పిల్లోన్ని భుజం మీద ఎక్కించికోని పెద్ద బాయి చుట్టూ తిరగతా ఉండాను. మంట పెద్దదవతా ఉంది. ఎవురూ చూట్టంలే. జనాలు కాలిపోతుండారు. మంట మంట అని నేనరస్తా ఉండాను. ఎవురికీ నా మాటలు ఇనిపీటంలే. నా కాడికి పోయి భుజం తట్టి పిల్లోడ్ని తీసుకుని ఇంటికి పో అన్నా. నేను ఎనక్కి తిరిగి నా సాయి చూసుకుంటే మొహం కాలిపోయి నల్లంగా ఉంది. భయమేసి గట్టిగా కేకేసి లేచినా.
ఒకసారి లేస్తే నాకింక నిద్రపట్టదు. పండగ నెల. భలే చలి పెడ్తా ఉనింది. మేము పిలకాయలిగా ఉన్నప్పుడైతే, చేలకాడ సలిమంట యేసుకుని రాత్రంతా కుశాలుగా మాట్టాడుకుండా ఉండేవాళ్లం. మేం నిద్దరపోతే అడివి పందులొచ్చి చేలల్లో పడిపొయ్యేవి. ఇప్పుడు చేను లేదు. చేలల్లో పందులూ లేవు. పెద్ద పండగనే గానీ ఊళ్లో పండగనేదే లేదు. మా పిల్లోడు ఐదరాబాద్ లో ఏడో ఉజ్జోగం జేస్తుండాడు. పండక్కి రారా అని పోన్జేస్తే, రానూ పోనూ కర్చులెందుకన్నాడు.

నాకు నిద్దర పట్టక పీర్లచావిటి కాడికొచ్చి కూకున్నాను. అరుగు మీద పడుకోని ఆకుల్లోనుంచి సుక్కల్ని జూస్తుంటే పీర్ల పండగ గుర్తుకొచ్చింది. ఏందో ఈ ఊళ్లో పండగలనే లేకుండా పొయినై. మబ్బుల్లో సుక్కలు పీర్లకి కట్టే పూసల్లా మెరిసిపోతుండాయి. చుక్కలన్నీ పక్కపక్కన చేరి పీరుకి అంచున కుట్టే తలుకుల్లా మిలమిల్లాడతుండాయి. ఆ సుక్కలకాడ దేవుడుంటాడని చెప్పేది మాయమ్మ. ఇంకా దేవుడాడే ఉండాడో ఏడికన్నా ఎళ్లిపోయుండో? నా చిన్నప్పట్నుంచి చూస్తా ఉండా. ఆకాశం అట్టే మెరిసిపోతా ఉండాది. ఊరు మాత్రం గొడ్డుపోయింది. వానల్లేక చెరువు ఎండిపోయింది. వానలు పడుంటే ఇంకో నెల్లో కుప్పలేసుండేవాళ్లం.

నిద్రపట్టక ఇట్టా ఆలోచిస్తా ఆకాశంలోకి చూస్తా ఉన్నానా, ఎవురో గట్టిగా అరస్తా ఉన్నట్టనిపిచ్చి లేసి కూర్చున్నా. బేట్రీ లైట్ ఏసి చూశా. ఎవురూ లేరు. ఏందోలే అనుకుని పడుకున్నా. కొంచెం సేపిటికి కుమ్మరోళ్ల పిల్లోడు అటు పోతా, ఏమనా ఈడ పొడుకున్నావు? అని అడిగాడు. ఊరికే నిద్రపట్టక అన్జెప్పి, నువ్వేడికి ఈ జామున అని అడిగా. పంచాయితీ ఆఫీస్ కాడ గలభాగా ఉంటే పోతున్నా అన్నాడు. ఆ పిల్లోడు పిలవకుంటే అసలా యవ్వారం అంతా నాకు తెలియకపోను. ఊర్లో పిలకాయలకి ఏం పనిలేదు, ఏందో ఈ కొత్త గలభా అనుకున్నా. ఆడికి పొయ్యి చూస్తే గలభా పిలకాయలది కాదు- యానాది రెడ్డి ది.

అబ్బుసాయబు కొడుకు పళ్ల భాషా, యానాది రెడ్డి ని గట్టింగా పట్టుకోనుండాడు. ఏందిరా గోల అంటా నేనాడకి రాంగానే, చూడు మామా నా పాటికి నేను పొద్దున్నే దొడ్డికి పోతా వుంటే నన్ను పట్టుకోని దొంగంటున్నారా అని యానాది రెడ్డి మొదలుపెట్టిండు. రెడ్డీ ఈయన మాటల నమ్మబాకు. ఈ పెద్ద మనిషి నా కోడిపుంజుని దెంకపోతుంటే పట్టుకున్నా అన్నాడు పళ్ల భాషా.

నాకసలేం అర్థం కాలా. టైము చూస్తే రేత్రి రెండైంది. కొత్త గవర్మెంట్ వచ్చినాక గుడ్డిగా ఎలిగే ఈది లైట్లు కూడా పోయినై. అంతా చీకటిగా ఉంది. పొంగళ్లప్పుడు పిలకాయలు కొట్టుకోబొయ్యి పోలీసుల దాకా పోయింది. ఆ గొడవ లోడుకోని మళ్లీ ఎవురన్నా కొట్టుకుంటుడారేమోనని అదరా బదరా నేనాడికి పోతే – ఆడ ఇంకేందో జరగతా ఉండాది.
నేను లేచొచ్చినట్టే పరమటీది నుంచి, పాతర్ల మిట్ట కాడ్నుంచి ఒక్కొక్కరూ బ్యేట్రీ లైట్లేసుకుని వస్తా ఉండారు. వచ్చినోళ్లకళ్లా మళ్లా మళ్లా జరిగింది చెప్పలేక అరస్తా ఉండాడు పళ్ల భాషా. అసలు భాషా గాబట్టి యానాది రెడ్డి ని అంత సేపు పట్టుకున్నాడు గానీ, ఇంకోడైతేనా!

ఏందయ్యా ఈ దౌర్జన్యమా? సందకాడ ఏం తిన్నానో ఏమో ఒకటే కడుపుబ్బరగా ఉంటే, ఆపుకోలేక వంకకాడికి వచ్చి పోతుంటే ఈ భాషా నా మీద పడి దొంగా దొంగా అని అరస్తా పట్టుకునే. ఉరే, నేనేం జేసాన్రా అని గంటనుంచి అడగతా ఉంటే – కోడి కోడి అని అరస్తా ఉండాడు. ఏందీ అన్యాయం. సుబ్బాడ్డే, నువ్వన్నా చెప్పబ్బా అన్నాడు యానాది రెడ్డి.
రెడ్డా, అబద్ధాలు చెప్పబాకు. ఇంట్లో లెటిన్ కట్టుకుళ్లా. ఆడ పోకుండా వంక కాడ ఏం పని నీకు?
చీకట్లో ఎవురో అడిగారు.

నిజిమే. గవర్మెంట్ డబ్బులు కూడా ఇచ్చుళ్లా. ఇంకా వంక కాడికి ఎవురుపోతుండారు?
వానలు బడి నాలుగేళ్లయితే, అసలు వంకలో నీళ్లేడేడుండాయని?
యానాది రెడ్డి ఏం చెప్పలా.
అడగతా ఉంటే చెప్పవేందబ్బా? అసలు ఈ రేత్రి నీకు వంక దాక వచ్చే పనేముందని? – అడిగారెవరో.

యో! ఏంది మీరంతా. భలే పెద్ద మనుషుల్లా ఉన్నారే! అందరు నామీదే డౌట్ పడతుండారు? అని గట్టిగా అరస్తా భాషా ని ఇదిలించి బయట పడ్డాడు యానాది రెడ్డి. యాడికి నువ్వు పోయేది అంటా మళ్లీ యానాది రెడ్డి ని కతక్కన పట్టుకోబోయాడు భాషా. ఏడికి పోతాడు. నువ్వుండు భాషా అన్నాను.
అప్పుటికి చానా మంది పంచాయితీ ఆఫీస్ కాడికి జేరి తమాషా జూస్తుండారు. నైటాల్ట్ బస్ లో గురక పెడ్తా నిద్రపోతున్న కండక్టర్ గూడా ఈ గోలకి నిద్ర లేచి, ఏం ఊరబ్బా మీది. గంట సేపన్నా నిద్రపోనీరా? అంటా బస్ దిగాడు. మా ఊళ్లో ఇయన్నీ టైమ్ పాస్ లే సుధాకరా, నువ్వు పొడుకో – అన్నా యినకుండా వచ్చి, దుప్పటి కప్పుకుని కూచుని, ఏంది మందల అన్నాడు.
కండక్టర్ కి ఇదంతా పల్లెటూరి ఏళాకోళంగా ఉంది. ఈ టైంలో మస్తానమ్మ బంకు తెరిసుంటే టీ తాగతా చూస్తా ఉంటే భలే తమాషగా ఉంటది కదా సుబ్బాడ్డీ? అన్నాడు. ఈడ ఇంత రచ్చరచ్చవుతుంటే ఈ కండక్టర్ కి టీ గావాల్సొచ్చిందా? వీడి పాసుగాల అనుకున్నాను.

ఈ లోపల ఏందబ్బా గోల అంటా కామేశ్వరయ్య వచ్చాడు. భాషా వచ్చి చెప్పడం మొదలు పెట్టాడు.
తెల్లారితే కనుమ కదా. ఊర్లో అందరికీ కొయ్యడానికి కోళ్లు కాబళ్లే. టౌన్ కి పొయ్యి బుట్టనిండా ఫారమ్ కోళ్లను తెచ్చానా? కోళ్లకు మేతేసి సందకాడే పడుకున్నానా.మాంచి నిద్రపోతుండా. కోళ్లు కొక్కొక్కొ అని అరస్తుంటే ఏందని చూశా. ఎవురో ముసుగు కప్పుకోని, బుట్టెత్తి కోళ్లు దెంకోపోతున్నారు. ఎవుర్రా అది అని వెనకనే పరిగెత్తా. చేలల్లో పడి పరిగెడ్తా పరిగెడ్తా ఉంటే లాస్ట్ కి దొరికాడు. లైటేసి చూస్తే ఇదిగో ఈయన. యానాది రెడ్డి వైపు చూపించాడు.
ఒరేయ్ భాషా. కొట్టానంటే నీ మూతి పళ్లు రాలతాయి. నేను కోడినెత్తుకుపోతే ఆ కోడేది? ఉత్త మాటలు చెప్పబాక. నాకు మండద్ది.
నిజిమే కదా! అసలు కోడేది? చీకట్లో ఎవరో అడిగారు.
భాషా ఏం చెప్పలా.

Kadha-Saranga-2-300x268

యానాది రెడ్డి కోడి కోసమొస్తే, కోడుండాలి గదా చేతిలో. భాషా నువ్వే ఏదో కావాలని చేస్తుండావబ్బా అన్నాడు కామేశ్వరయ్య.
యో! అసలు నిన్ను పంచాయితీ చెయ్యమని ఎవురడిగింది? నేను పొద్దున్నే ఎస్సై కి ఫోన్ జేస్తా. ఆయనే వచ్చి చూసుకుంటాడు అన్నాడు భాషా.
ఏందిరే నువ్వు ఫోన్ చేసేది? నా మొబైల్ లో ఇప్పుడే ఫోన్ జేస్తా ఎస్సై కి. రానీ ఏదో ఒకటి తేల్చుకుందాం అన్నాడు యానాది రెడ్డి
పోలీసుల్దాకా ఎందుకులేబ్బా! మొన్నే వార్నింగ్ ఇచ్చి పోయిళ్లా. మళ్లీ పిలిచి దెంగుల్తినాలా? ఏదో అయిపోయింది. ఈడకి వదిలైండిలేబ్బా అని ఇద్దరి మీద పెత్తనం చెయ్యబొయ్యాడు కామేశ్వరయ్య.
జీన్స్ ప్యాంట్, పైన ఖద్దరూ ఏసుకుని ఉన్న కామేశ్వరయ్య ని చూస్తా, బస్సులో పిలకాయల్నేసుకుని తిరుగుతుంటాడు. ఎవురబ్బా ఈ పిల్లోడు? అడిగాడు కండక్టర్ సుధాకర్. ఈ ఊరోడే. రాజకీయం పిచ్చిలే. ఎమ్మెల్యే మనిషి అని చెప్పాను.

పెద్ద పెద్ద తలకాయలంతా ఈడుంటే ఈ పిల్లోడి పెత్తనం ఏంది? అన్నాడు కండక్టర్.
ఉడుకు రకతమబ్బా. ఊర్లో చదువుకున్న పిలకాయలంతా ఏడో ఉండే. ఇప్పుడీ ఊర్లో ఉన్న పిలకాయలదే రాజ్జెం.
ఎవురిది రాజ్యమైతే ఏముంది లేబ్బా. ఇరవై ఏళ్ల నుంచి వస్తా ఉండా ఈ ఊరికి? ఇప్పుటికీ తార్రోడ్డు ఏపిచ్చుకోలేకపోయేరే!
మీ ఆర్టీసీ వోళ్లు బస్సే క్యాన్సిల్ చేస్తామని చూస్తుంటే ఇప్పుడు రోడ్ ఎవరికి కావాలా? మా ఊరోళ్లకి ఏమీ వద్దబ్బా. ఇట్టా కొట్టుకుంటా చతుర్లాడుకుంటా ఉంటే చాలు.అజ్జూడు ఏమి మునిగిపోయిందని ఇంత మంది కట్టకట్టుకుని వస్తుండ్రో? అదే మొన్న వానలు పడేలా ఉంది. చెర్లో నీళ్లన్నీ పోకుండా తూము రిపేర్ చేసుకుందా పాండ్రా అని అడిగితే వచ్చిన్నా కొడుకు లేడు.
మేమిట్టా చెడీ బొడీ మాట్టాడుకుంటా ఉండాం. టైమ్ నాలుగయిపోయింది. కాలేషా భార్య వచ్చి టీ బొంకు తెరిచింది. తలా ఒక టీ తాగి అందరూ ఇంటికి పోయిండ్రు.అసలు భాషా కోడి నిజంగానే పోయిందా? పోతే అది యానాది రెడ్డే కొట్టేసిండా? కొట్టేస్తే అది ఏడ దాచి పెట్టిండు? ఈ ఇషయాలు మాత్రం ఎవురికీ అర్థం కాలా!

*****

పండగ పోయి వారమైంది. పండక్కి మా పిల్లోడు హైదరాబాద్ నుంచి అనవసరం ఖర్చని రాలా. కూతురు వైజాగ్లో అల్లుడుతో ఉండే. వద్దే అన్జెప్పినా ఇనకుండా దేవుడింటినిండా నిప్పట్లు పేర్చింది మా ఆడది. ఎవుడయ్యి తినేది? నాకేమో డాక్టర్ అట్టాంటి చెడీ బొడీ తినొద్దని చెప్పే. పక్కింటి రామిరెడ్డి పిలకాయలు కూడా పండక్కి రాలా. వాడి కొడుకులిద్దరూ మధ్యప్రదేశ్ లో ఏందో కాంట్రాక్ట్ లు చేస్తుంటారు. పిలకాయలు రాకపోతే ఏమే, నిప్పట్లు, కొబ్బిరొడలు, మనుబూలు, ఉప్పుచెక్కలు బస్ లో పెడదామని నెల్లూరికి బయల్దేరిండ్రు మా ఆడోళ్లు.

టిఫిన్ జేసి పేపర్లన్నీ ముందేసుకుని కూసుని ఉన్నానా, అయ్యోరోళ్ళ పిల్లోడు పేపర్ చదవడానికి వచ్చిండు. ఏందయ్యోరా, చాన్రోజులకి అవపడ్డావే అని అడిగా.
పండక్కి అత్తగారింటికి పొయ్యాలే. ఈ ఊళ్లో ఉన్నా ఏం లాభం, అప్పచ్చులు ఇచ్చేవాళ్లు కూడా లేకుండా పొయ్యే అన్నాడు.
అట్టనబాకు. నీకెన్ని నిప్పట్లు గావాలో చెప్పు. మా ఇంట్లో చానా ఉండాయి.
ఇప్పుడు అప్పచ్చులు ఎందుకులేగానీ, పేటలో దిగి ఒక ఆఫ్ ఎత్తుకొచ్చా. చెరువుకాడికి పోదాం పా రెడ్డా, అన్నాడు అయ్యోరోళ్ల పిల్లోడు.

అయ్యోరు నా కంటే చానా చిన్నోడు. అయినా చానా ఇషయాలు తెలిసినోడు. మందు తాగితే భలే సంగతులు చెప్తాడు. అందుకే నాకేం పెద్ద అలవాటు లేకున్నా అప్పుడప్పుడు ఆ పిల్లోడితో కూకోని మందు తాగతుంటా. మా ఆడోళ్లకి తెలిస్తే చీపరకట్ట తీసద్ది. అందుకే వాళ్లట్ట ఊళ్లోంచి పోంగానే మేము బండి స్టార్ట్ చేస్తాం.
ఇద్దరం చెరువుకట్టకాడ చెట్టుకింద కూసున్నాం. నేను లేనప్పుడు భలే గొడవలు జరిగినయంట. బస్ దిగి కొంచెం సేపు బంకు కాలేషా కాడ కూచున్నా. మొత్తం చెప్పిండు, అని చెప్తా గ్లాసుల్లో మందు పోసిండు.

ఈ అయ్యోరితో వచ్చిన గొడవేందంటే మనల్నేం మాట్టాడనీడు. అంతా వోడే. అది తెల్సిన ఇసయమే కాబట్టి నేను గమ్ముగా ఇంటా కూసున్నా.
కాలేషా చెప్పిననక నేను యానాది రెడ్డి కాడికి పొయినా. తర్వాత భాషా కాడిక్కూడా పోయినా. ఎవురి కథ వాళ్ళు చెప్పిండ్రు.యానాది రెడ్డి నాకేం తెలియదంటాడు. భాషా ఏమో నల్లపుంజు పొయింది మాత్రం నిజిమే అంటాడు. కానీ అసలు కథ వేరే. అది నేను చెప్తా ఇప్పుడు. ఇది నీకు తెలియందేం గాదు. అయినా కూడా ఇను, అని మొదులుపెట్టాడు.

అసలు భాషా ఎవురు? యానాది రెడ్డి కాడ ఒకప్పుడు ట్రాక్టర్ డ్రైవర్. ఆడ ఈడా చేను దున్నతా ఇద్దరూ ఒద్దిగ్గా బాగా డబ్బులు సంపాదిస్తా ఉంటిరి. మధ్యలో యానాది రెడ్డి కొడకు మల్లయ్య వచ్చిండు. నాయనా ట్రాక్టర్ అమ్మిపారినూకి నాకొక లారీ కొనీమని పట్టు పట్టాడా? సరే లేబ్బా చానా మంది ఓబులాపురం నుంచి నెల్లూరుకి లారీలు తిప్పతా దండిగా సంపాదిస్తున్నారని యానాది రెడ్డి కొడుక్కి ఒక లారీ కొనిచ్చాడు. సంవత్సరం రోజులు డబ్బులు గుల్లగుల్లగా రాలేటప్పటికి భాషా కి ట్రాక్టర్ చీప్ గా అమ్మేసి, పెంకుటిల్లు పీకి మిద్దె గట్టి ఎచ్చులుకి పొయ్యాడు యానాది రెడ్డి్. ఈ లోపల ఓబులాపురం సంకనాకిపోయే! లారీ అమ్మితే సగం డబ్బులు కూడా రాకపొయ్యే. ఇప్పుడు మల్లయ్య వచ్చి నా ట్రాక్టర్ నాగ్గావలని భాషా ని పోరుపెట్టిండు. ఒరే అది మీ నాయన నాకమ్మిండని చెప్పినా ఇనకుండా మల్లయ్య రెటమతంగా పోతుంటే భాషా పొయ్యి పేట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.

cock1కరెస్టే అయ్యోరా. కానీ ఇదంతా ఎప్పుడిదో గోల గదా? ఆ కేసు కొట్టేసి తీర్మానం కూడా జరిగిపోయుళ్లా! ఇప్పుడు దానికీ దీనికీ ఏం సంబంధం.
ఉంది రెడ్డా. ఆడికే వస్తున్నా. అసలీ భాషా ది ఏ ఊరు? పక్కనున్న రంతాబాద్. యానాది రెడ్డి ట్రాక్టర్ కి డ్రైవర్ కావాలంటే ఆడ చికెన్ కొట్టు మూసి మన ఊరికొచ్చిండు. ఎవురో పక్కూరోడొచ్చి, సల్లంగా ట్రాక్టర్ కొట్టేసి సుఖంగా ఉన్నాడని యానాది రెడ్డి కి కడుపుమంట. అందుకే ఈ గొడవంతా. భాషా ని ఎట్టైనా ఇరకాటంలో పెట్టాలా అని యానాది రెడ్డి ప్లాన్.
అదేమో గానీ, భాషా అంటే ఊర్లో వాళ్లకి చాలామందికి కోపమేబ్బా! అప్పుడొకసారి నేను గడ్డి తోలుకోని రావాలా, బుచ్చి దాకా పోదాం రాబ్బా అంటే నేను రానన్నాడు. సరేలే అని వొదిలేశా. మొన్న ఏదో తెగులొచ్చిన కోళ్లు తెచ్చి ఊర్లో చికెన్ అమ్ముతున్నాడు తెలుసా నీకు? సరేబ్బా. భాషా ఎట్టాంటోడైనా గానీ, అసలు మనూరోళ్లకే దిక్కులేకుంటే ఏడో పక్కూరోడొచ్చి మనమీద పడి తింటుంటే ఎవురికైనా కోపం వస్తదా రాదా? అని అడిగాను.

ఎందుకు రావాలి రెడ్డా కోపం? అసలు ఈ ఊరు ఏమన్నా నీ సొంతమా? మీ నాయన రమణాడ్డి ది ఏ ఊరు? సరే ఈడే పుట్టిండు కాబట్టి ఈ ఊరే అనుకుందాం. మీ తాత రెడ్డయ్యది? ఈ ఊరా? సంగం దగ్గర కోలగట్ల గదా ఆయన పుట్టింది. వేర్లు పొయిన తర్వాత ఈ ఊరికి కాపరమొచ్చా. అప్పుడు ఈ ఊరు మీదెట్టవుద్ది. అయితే గియితే మీది కోలగట్ల అవ్వాలా. అసలు మాదే ఊరు? గంగారం. మా నాయన కి ఏం పనిలేక ఈ ఊరొచ్చాడు. మమ్మల్ని సంకనాకిపిచ్చాడు. అట్టే భాషా కూడా ఏ ఏడ్నుంచో ఈ ఊరికొచ్చా. ఇప్పుడు ఈడే బతకతుల్లా. అప్పుడు మనకి ఈ ఊరు మీద ఎంత హక్కుందో భాషా కి కూడా అంతే ఉంటుళ్లా?

ఆఖరి పెగ్ పోసిండు. ముందే చెప్పుళ్లా! మందుకొడ్తే మాట్టాడేదంతా మా అయ్యోరే అని. సరే ఏదో వాగతుండాడులే అని ఇంటా ఉండా. అయ్యోరు ఈ సారి కొంచెం డోస్ ఎక్కువేశాడు.
అసలు మనిషి చేస్తున్న తప్పేందో తెల్సా? మనోళ్ళు-పరాయోళ్లు అని చూడ్డం.హిట్లర్ అని ఒకాయనున్నాడు తెలుసా నీకు? ఏం చేసిండా ముండనాయాలు. మనోళ్లు కానోళ్లని కాల్చిపారేయమన్నాడు. సరే లక్షల మందిని సంపి పారినూకారు. ఇప్పుడు అక్కడ సమస్యలే లేవా? అసలు మనోళ్ళు ఎవురు? పరాయోళ్లు ఎవురు? సరే మీ కులపోళ్ళంతా ఒక పక్కనేమన్నా ఉన్నారా? సర్పంచ్ ఎలక్షన్లకి మీరూ మీరు తలకాయలు పగలగొట్టుకుంటిరి. మీలో మీకే పడదు. సరే మీ ఇంట్లో వాళ్లతో మీకు పడుద్దా? ఏడుగురు అన్నాదమ్ముళ్ళు వేర్లు పొయ్యిననక కూడా ఇంకా కొట్టుకుంటా ఉంటిరి. సరే. మీ ఆడోళ్లతో కూడా రోజూ గొడవే కదా నీకు? నీ కొడుకు నీ మాట ఇనకుండా ఏడో ఉండే. అన్నీ వదిలెయ్యబ్బా. కనీసం నీతో నీకన్నా పడుద్దా చెప్పు? ఎలక్షన్లో మీ ఎమ్మెల్యే క్యాండేట్ ఓడీపోయినాక ఏం ఆలోచిచ్చావు? ఒరే ఆ గెలిచిన క్యాండేట్ కి సపోర్ట్ చేసున్నా ఏదో ఒక కాంట్రాక్ట్ వచ్చుండేదని బాధపడుతున్నావా? లేదా? నేను చెప్పేదేంటంటే. – మనతో మనకే పడనప్పుడు ముందు మనది మనం కడుక్కుని గెటాన్ అయిపోవాల- అని గుక్క తిప్పుకోకుండా చెప్పి నీళ్లు కూడా కలపుకోకుండా మిగిలిన మందు అట్టే తాగేసిండు అయ్యోరు.
ఈడమ్మ బొడవ. ఎవురిదో గొడవ నామీదకొచ్చిందా? సరేలే అయ్యోరికి మందెక్కువైతే ఏం మాట్టాడుతాడో తెలియదు. ఇదేం చూశాం లే. అసలు ఫుల్ బాటిల్ ఏస్తే దేవుడి తోనే వాదిస్తాడు. తెచ్చిన ఆఫ్ బాటిల్ అయిపోయింది. మేము చిన్నంగా ఇంటికి వచ్చాం. నిద్రపోతుంటే నాకేమనిపించిందంటే అయ్యోరు చెప్పిందాంట్లో నిజిమైతే ఉంది. యానాది రెడ్డి పాపం భాషా ని అనవసరంగా గెలుకుతున్నాడు. ఈ సారి కనిపిస్తే ఆ భాషా ని ఇబ్బంది పెట్టబాకులే అని యానాది రెడ్డి కి చెప్దాం లే అనుకున్నా.

*****

అప్పుడే సెప్టెంబర్ బొయ్యి అక్టోబర్ కూడా వచ్చింది. వానలు పడినట్టే పడి ఆగిపోయ్యే. మళ్ళీ చుక్క పడలా. ఈ సారన్నా ఒక తడి నీళ్లొస్తే ఎమ్మెల్లే తో మాట్లాడి చెర్లోకి సోమశిల నీళ్లన్నా తెప్పించుకుందామంటే అది కూడా జరిగేతట్టు లేదు. మా కొడుకేమో ఇంకా ఆ ఊర్లో ఏంపనని? అంతా అమ్మిపారినూకు ఐద్రాబాద్ కి రాండి అంటాడు. పండినా పండకపోయినా చేలు ఎట్టా అమ్మేది? అమ్మినా ఇప్పుడెవురు కొనేది? ఎట్టో నాలుగు బర్రెలుంటే పాలన్నా తీసి అమ్ముకుంటా బతకతా ఉంటిమి. నెల్లూరు పొయ్యి ఏమడక్కనూకను? నువ్వు ముందు ఉజ్జోగం చేసి డబ్బులు సంపాదీ. నీకు పెళ్లి చేస్తే మేము గూడా వచ్చి నీతోనే ఉంటం అని వాడికి సమాధానం జెప్తే మాత్రం ఏం మాట్లాడడు. వాడు నాలుగేళ్లు ఇంజినీరింగని సరిగ్గా చదివకుండా ఎందుకు గాలి తిరుగుళ్లు తిరిగిండో, నాలుగేళ్ల నుంచి మాఊళ్లో ఎందుకు వానలు పట్టంలేదో – ఈ ఇసయాలు మాత్రం నాకస్సలు అర్థం కావు.

గంగమ్మ పొంగళ్ళు పెడితే వానలు పడతాయని ఎవురో పెద్దమనిషి చెబ్తే అది కూడా చేస్తిరి. ఆడ కూడా ఈ ఊరోళ్లు ఒక మాట మీదున్నారా అంటే అదీ లేదు. ఆడ కూడా తలలు పగలకొట్టుకునే దాకా తెచ్చిండ్రు. అసలు గంగమ్మ పొంగళ్లు సరిగ్గా పెట్టుంటే వానలు పడుండేయేమో! ఏమో, ఇదంతా పైన కూచుని చూస్తుండే దేవుడికే తెలియాల. ఊళ్లో వాళ్ళకి మాత్రం ఎవురికీ పనిలేక పెంచలయ్య అంగడి కాడో, బైసానోళ్ల అరుగుమీదో, సర్పంచి ఆఫీస్ కాడో, ఇయన్నీ కాకపోతే పీర్ల చావిటి కాడ కూసుని ఉత్తమాటలు చెప్పుకుంటా ఉండారు. సరే, కనీసం ఈ మజ్జెన ఏం తకరాదులు లేవు, ఊరన్నా ప్రశాంతంగా ఉందిలే అనుకున్నానా, అంతే ఆ రాత్రికి స్టార్ట్ చేసిపారినూకిండ్రు.

*****

ఎమ్మారో ఆఫీస్ లో పన్జూసుకుని, ఆరుగంటల బస్ లో సుధాకర్ తో మాట్లాడతా ఉంటే, వాక్కాడ కాలనీ దగ్గిర బస్ ఆపిందాక టైమే తెలియలా. రేప్పొద్దున్నే మళ్లీ రావాల్లేబ్బా. పని గాలేదింకా అని సుధాకర్ కి చెప్పి బస్ దిగా. దిగంగానే నాకు భలే భయమేసింది. మాలకొండ కత్తి పట్టుకుని నా కాడికే వస్తుండాడు. ఈడి కాష్టం కాలా, ఈడు నామీదకొస్తున్నాడేందని నేను కొంచెం బెదిరా. రెడ్డా ఏడికి పొయినువా? ఫోన్ జేస్తే సిచాఫ్ వస్తుంది, అన్నాడు.

అది బ్యాటరీ పొయిందిలే గానీ, ఈ రేతిరిలో ఆ కత్తేంది? ఎవుర్ని పొడవడానికి?
ఆ భాషా గాడిని.
మా ఊరి ముండనాయాళ్ళు మళ్లీ ఏందో కొత్తది లొడబెడ్తున్నారని నేననుకుంటానే ఉన్నా. అట్టే జరిగింది.
అసలేంది మందల?
చెప్తాలే గానీ నువ్వురా ముందాడికి, అని నన్ను బరబరా లాక్కోని పొయ్యాడు మాలకొండ.
ఆడకి పొయ్యేసరికి అంతా చిందరబందర చేసేసున్నారు. భాషా చికెన్ షాప్ పీకి తుక్కు చేసేశారు.

భాషా నీకు ఎప్పుట్నుంచో చెప్తావుండా. నువ్వు ఇట్టే రెటమతంగా ఉంటే ఇది చాందూరం పోద్ది. నా మాటిని షాపు తీసెయ్, అని చెప్తున్నాడు కామేశ్వరయ్య. ఆ పిల్లోడితో ఎప్పుడూ పడని మా రెడ్డి గారి పిలకాయలు తిరపతరెడ్డి, నారప రెడ్డి కూడా ఇదే మాట చెప్తుండారు. భాషా కి వాళ్ల సాయిబులోళ్ళ పిలకాయలంతా సపోర్టింగ్ గా నిలబడి ఉండారు.
మీరేందయ్యా చెప్పేది? ఎవురు అసలు ఈ రూల్ పెట్టింది? నేను అమ్మతా మీరేం చేస్తారో చేసుకోండి, అని భాషా అరస్తుండాడు.
ఏందిరా మీరు. రోజు ఏదో ఒక తకరాదు లేకుండా వగదెగదా మీకు? టైంపాస్ కాకపోతే అట్టపొయ్యి ఏమన్నా పనికొచ్చే పని చెయ్యండి. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు? అని కోపంగా అడిగా.
అబ్బా రెడ్డొచ్చిండు. మళ్లీ మొదులుపెట్టండి, చీకట్లో ఎవురో అన్నారు.

cock1అదన్నది యానాది రెడ్డని నాకు ఖచ్చితంగా తెలుసు. అయినా నేను గమ్ముగున్నా. మనది మనం కడుక్కుంటే చాలని అయ్యోరు చెప్పినకాడ్నుంచి ఎవురి ఇసయాల్లో ఏలు బెట్టకుండా ఉన్నా. ఈడ ఎవురిగోల వాడిది. మజ్జెలో నాకెందుకులే అని పోబోతుంటే, నా, మీ పిలకాయలకి చెప్పనా. లేకపోతే ఈ రాత్రికి ఈ ఊర్లో ఎవురికీ మెడకాయల మీద తలకాయలుండవ్ అని సున్నేసాయిబు నా దగ్గరకొచ్చాడు.

అయన్నీ ఎందుకుగానీ, తకరాదు జరగతాఉందని పోలీసులకి తెలిస్తే వచ్చి అందర్నీ జైలుకి లాక్కోపోయి గుద్దమీద తంతారు. అందరు మూసుకోని ఇంటికి పోండి, అని చెప్పి నేనాడనుంచి సక్కా పోతావున్నా. వాళ్లంత వీజీగా వదిలిపెడ్తారా నన్ను? కూసోబెట్టి బారతమంతా చెప్పారు.
మాల్యాద్రి ఇంట్లో ఎద్దుకి కుడితినీళ్లు పోసే వాళ్లు కూడా లేరు. మాల్యాద్రి టౌన్ లో పళ్లంగడి పెట్టిండు. ఎప్పుడో వారినికొకసారి గానీ రాడు. వాళ్ల నాయన శంకరయ్య మంచంలో పడుండే. అప్పుడప్పుడు పక్కింటి రామిరెడ్డి కొంచెం ఎండు గెడ్డేసి దాన్ని సాకతా ఉన్నాడు. రామిరెడ్డి పిలకాయల దగ్గరకి పోయినకాడ్నుంచి పట్టించుకునే వాళ్ళు లేక ఎద్దు నీలక్కపోయింది. అది ఇంక చసద్ది అని తెలిసిపోయింది మాల్యాద్రికి. అందుకని కాలనీ కాడికి పోయి అంకయ్య ని రమ్మంటే అది మాకేం బళ్లే అని చెప్పిండు. ఏం జెయ్యాలబ్బా అని కాలనీ కాడ్నుంచి నడుచుకోనస్తుంటే భాషా కనిపించిండు.పొద్దు పొద్దున్నే ఏడికో పొయ్యుస్తుండావే మాల్య్రాది? అని భాషా అడిగితే విషయం చెప్పాడు. సరేలే ఇప్పుడది చస్తే పీనిగ తీయడానిక్కూడా ఎవురు రారు. నేను ట్రాక్టర్ ఏసుకొస్తా, దాన్ని తొట్లో ఏస్తే నేనే దాన్ని తీసుకుపొయ్యి ఏదో ఒకటి చేస్తాలే, అని భాషా అంటే, సరేనని ఒప్పుకున్నాడు మాల్యాద్రి. కానీ భాషా ఆ ఎద్దుని తోలుకొచ్చి, హలాల్ చేసి చికెన్ షాప్ లో కేజీల లెక్కన మాంసంగా అమ్మతాడని అనుకోలేదు. అక్కడ నుంచి గొడవ పెద్దదై, ఊర్లో పిలకాయలందరూ భాషా చికెన్ కొట్టుని పగలగొట్టే దాకా వచ్చింది. ఇద్తెలిసి సాయిబులోల్ళ పిలకాయలు కూడా ఎదురుతిరుక్కున్నారు.

అంతా ఇని, ఏందో ఈ జనాలు అనుకున్నా. ఈళ్లకి కొట్టుకోడానికి రోజుకొక కారణం దొరుకుద్ది గానీ గమ్ముగా ఉండడానికి అసలు కారణమే కనిపిచ్చదా, అనుకున్నాను. అసలీ గొడవ తేల్చాలంటే ఎవురి చేతా కాదని నాకనిపిచ్చింది.
చంపతా, పొడుస్తా అని ఒకరి మీదికి ఒకరు పోతానే ఉండారు. ఎవురో పోలీసులకి ఫోన్ జేసినట్టున్నారు. పోలీసుల్ని చూడగానే మా పిలకాయలంతా ఉచ్చపోసుకుంటా ఎళ్ళబారారు. పోలీసోళ్ళు ఒక్కొక్కడిని పట్టుకోని జీబ్ లో ఎక్కించి ఆత్మకూరు జైల్లో ఏశారు. ఆ తర్వాత రోజు నేనే ఎమ్మెల్లే దగ్గరకు పొయ్యి, వకీల్ తో మాట్లాడి మా పిలకాయల్ని ఇడిపిచ్చి తీసుకొస్తుంటే బస్ లో అయ్యోరు కనిపిచ్చాడు. ఏంది రెడ్డీ కొత్త కేసంట అన్నాడు. అసలు ఈ ఊరికేదో శని పట్టింది అన్నాను.
అదేం కాదులే. జనాలకి ఈ మధ్య కోపాలు ఎక్కువైపొయినయి. ఈ జీవితం చానా చిన్నది రా నాయినా అని తెలుసుకుంటే ఇయన్నీ ఉండవు. ఈళ్ళకి ఇదెందుకు అర్థం కాదో నాకు తెలియదు. పక్కనోడినతో కలిసుండడం ఎందుకంత కష్టం? ఒక రోజు కోడి కోసం కొట్టుకునే. ఇంకో రోజు గొడ్డు కోసం కొట్టుకునే. కొట్టుకోడానికి కారణాలు గావాలా? కొట్టుకోవాలనే ఉంటే ఎందుకైనా కొట్టుకోవొచ్చు.
అయ్యోరా, అన్నీ తెలిసినోడివి. నాకీ ఇసయం చెప్పు. అసలు గొడ్డు మాంసం గురించి నువ్వు సదువుకున్న పుస్తకాల్లో ఏమి రాసున్నారు?
ఏడా ఎవురూ ఇదీ అని రాయలేదబ్బా. ఒకేళ రాసున్నా అది అప్పుటి రోజులకి సరిపోద్ది. అప్పుడూ ఇప్పుడూ ఒకేగా ఉన్నామా ఏంది మనం? మా నాయన రోజుకి ఒక్క పూటే తింటా, యాభై ఏళ్లు దేవుడికి పూజ చేసి క్యాన్సరొచ్చి కుక్క చావు చచ్చాడు. మా నాయన చావడం చూసి నాకు జీవితం మీద విరక్తొచ్చి ఏడికో పోతే, నన్ను ఎతుక్కోని వచ్చి మరీ ఈ ఊర్లో పూజారిని చేసుళ్లా మీరు? నేనేమన్నా మా నాయన లాగున్నానా? నేను మాంసం తింటున్నా. మందు తాగుతున్నా. అయినా ఎందుకు నాతో ఏగతున్నారు? మీ ఊళ్లో గుళ్లో దీపం బెట్టే పూజారి లేక. నన్నేమన్నా అంటే నేను అలిగిపోతానని గుద్ద మూసుకోనుళ్లా మీరంతా. అట్టే ఎవురిపాటికి వాళ్లని వదిలెయ్యండి. వాళ్లేమన్నా మిమ్మల్ని తినమని బలవంతం జేస్తున్నారా ఏంది?
నేనే ఆపుకోలేక అడిగా. అది కాదు అయ్యోరా. గవర్మెంట్ కూడా గొడ్డు మాంసం బ్యాన్ చేసుళ్లా, అన్నాను.

గవర్మెంట్ ఏందయ్యా బ్యాన్ చేసేది? మనకి బుద్ధుండబళ్లే! బంగారం లాంటి ఎద్దుని చంపకతినిందేమో మాల్యాద్రి. దాన్ని భాషా కోసి తింటే మాత్రం తప్పయిపోయిందే! మనూర్లో ఒక శెట్టి గారు రోజూ పంది మాంసం తింటుళ్లా. సరే డాక్టర్ చెప్పిండు, తింటే బాగా ఊపిరాడద్దని చెప్తే మందులా తింటున్నాడు. వాళ్లని ఎవురన్నా ఏమన్నా అన్నారా? అట్టే మానూరి సాయిబులు వాళ్లకిష్టమొచ్చింది తింటారు. మజ్జెలో మీకేంది? ఇట్టే పోతే, కొన్ని రోజులకి ఈ కోళ్లు, బర్రెలు గాదు. ఇట్ట కొట్టుకోని మిమ్మల్ని మీరే చంపుకోని పీక్కు తింటారు.
మరి గొడ్డుని చంపడం తప్పు కాదా? అడిగాను.

ఎవురు చెప్పారబ్బా ఇది తప్పు. ఇది కాదు అని. ఆ దేవుడా? అసలు దేవుడే మనిషి ని పుట్టిచ్చాడో లేదో ఎవురికి తెలుసు? కానీ దేవుణ్ణి మాత్రం మనమే పుట్టిచ్చాం. ఈ విషయం నాకెవురు చెప్పారని అడగబాకండి. నిన్న రాత్రి దేవుడితో మాట్టాడతుంటే చెప్పాడని చెప్పినా నువ్వు నమ్మవు. నమ్మినా నమ్మకపోయినా ఈ మాట మాత్రం నీకు చెప్పాల. దేవుడేమన్నాడంటే, నీ పని నువ్వు చూసుకో. పక్కనోడిని గెలకబాకు. ఇది తెలుసుకుంటే చాలు మనం.

అదేదో వేదాల్లో రాసున్నారు కదా! ఆవు దేవుడని, ఏదో చెప్పబోతుంటే ఆపాడు ఆయ్యోరు.
వినాయకుడి వాహనం ఏంది? ఎలుక. దాన్ని చంపటంలే? సుబ్రమణ్యస్వామి వాహనం ఏంది? నెమలి. దాన్ని చంపి తినటం లే? విష్ణుమూర్తి వాహనం ఏంది? పాము. దాన్ని చంపటంలే? ఇయన్నీ పురాణాల్లో అప్పుడెందుకు రాశారో ఏమో? వాటిల్లో ఏదో నిజముండే ఉంటది. కానీ వాటిల్ని అప్పుట్లాగే చూడ్డం తప్పు. అసలంతెందుకు? నేను చిన్నప్పుడు మన శిద్దాడ్డోళ్లింట్లో యాభై ఆవులుండేయి.వాటిల్ని సాకలేక అమ్మేస్తిరి. మీకంత ముఖ్యమైతే మీరే సాక్కోకూడదా? ఎందుకమ్మేయడం? – అని కోప్పడ్డాడు.

అయ్యోరు చెప్పిందైతే పాయింటే. ఇది అందరికి తెలిసిన ఇసయమే. అయినా ఏందీ గొడవలు?
రెండ్రోజులుకి సాయిబులోళ్ల పిలకాయలు కూడా బయటకొచ్చిండ్రు. మళ్లీ ఏం గలభా చేస్తారో అని, నాయకులంతా అందర్నీ పంచాయితీ బోర్డ్ కాడికి పిలిపిచ్చాం. ఇంక ఈ ఊర్లో గొడవలు పెట్టుకోకుండా సక్కంగా ఉండమని నేను చెప్తున్నానా, మధ్యలో యానాది రెడ్డి పుల్లేశాడు.

అంటే ఏంది సుబ్బాడ్డే నువ్వు చెప్పేది? అయినా నువ్వేంది ఎప్పుడూ వాళ్లకే సపోర్ట్ వస్తుండావు? అడిగాడు యానాది రెడ్డి.
యానాది రెడ్డి, ఏందంటే అది మాట్టాడబాకు. నేను చెప్పిందాంట్లో తప్పేంది? అన్నాను.
అంటే ఏదయ్యా మీరు చెప్పేది? పెద్ద మనుషులని పోనీలే అనుకుంటే అన్యాయంగా మాట్లాడుతున్నారే. ఈ ఊర్లో గొడ్డు మాంసం తింటానికి లేదు, అని కోపంగా అన్నాడు తిరపతరెడ్డి.
మేం తింటాం, ఎవురాపేది మమ్మల్ని. రాండి చూసుకుందాం, అని కాలేషా ఇంకా కొంతమంది ముందుకు దూకారు.

మీ పోసుగాల. ఉండండ్రా, అని నేనోళ్లని ఆపాను. భాషా నా మాటిని నువ్వొక పన్జెయ్యి. ఆ చికెన్ షాప్ లో బీఫ్ అమ్మబాకు. దానికి పక్కనేడన్నా ఇంకొక అంగడి పెట్టుకో. ఎవురికీ ఇబ్బంది లేకుండా ఉంటది అని సర్ది చెప్పబోతుంటే- అసలు ఈ ఊర్లో గొడ్డు మాంసం అమ్మడానికి లేదు అని మాల్యాద్రి ముందుకొచ్చి అరిచాడు.
ఒరేయ్ సిగ్గు లజ్జా ఉందా నీకు? గొడ్డు చస్తా ఉంటే కనీసం చెంబుడు నీళ్ళయినా పోసినా? వాళ్ళ కొట్టాం లో ఉంటుందని రామి రెడ్డి చూడకపోతే అదెప్పుడో చచ్చుండును. ఎద్దు పోతే దాని మాంసం అమ్ముతుండాడు భాషా. అసలు దాన్ని చంపిందెవురు? నువ్వు కాదా? అప్పుడు నిన్నేం చెయ్యాలా? నువ్వు మూసుకోనుండు, అని నేను కోపంగా మాల్యాద్రి మీదకు పొయ్యా.
యో, ముసిలాయనా! ఏందో పెద్ద మనిషవని చూస్తావుంటే రెచ్చిపోతుండావే! నువ్వు మూసుకోని ఆడ కూర్చో అని గదిమాడు. అట్ట చెప్పు ఆయనకి ఏందో పెద్ద నీలగతా ఉన్నాడు, అని యెటకారంగా అన్నాడు యానాది రెడ్డి. అట్ట ఎవురికిష్టమొచ్చినట్టు వాళ్ళు మాట్లాడతా, సందకాడ మొదలైంది రేత్రంతా పోతానే ఉంది. ఈ రోజు ఎట్టైనా ఏదో ఒకటి తేల్చందే నిద్రపొయ్యేలా లేరు జనాలు. ఏదో నా మాట ఎట్టా ఇనకపోయే. మజ్జెలో నాకెందుకులే అని పీర్లచావిటి కాడికొచ్చి కూసున్నా.

మొన్న బస్సులో అయ్యోరు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినయి.
చూడు సుబ్బాడ్డీ. ఈ ఊరు ఇట్టా ఎందుకు ఉందని కదా నీ బాధ? ఈడ చెరువుల్తో పాటు మనుసుల గుండెలు కూడా ఎండిపోయాయబ్బా. పక్కనోడి బాధ మన బాధ అయితే మనకీ కన్నీళ్లొస్తాయి. గుండెల్లో వాన కురుసుద్ది. గుండెల్లో పైరు మొలుసుద్ది. అప్పుడు మనిషీ పచ్చగా ఉంటాడు. ఊరూ పచ్చంగా ఉంటది. సర్వే జనా: సుఖినోభవంతు! సమస్త సన్ మంగళాని భవంతు! ఓం శాంతి !శాంతి! శ్శాంతి!
శాంతి? ఏడుందది? ఇప్పుడందరికీ కోపాలే!

గొడవ ఆపలేకపోయినందుకునాక్కూడా కోపమొస్తా ఉంది. గమ్ముగా అరుగు మీద పొడుకున్నా. గాలే లేదు. ఉక్క బోస్తా ఉంది.

ఆకాశంలో సుక్కలు కనిపీటంలే. చీకట్లో ఏందో మెరస్తా ఉండాది. ఏందదని నేను చూస్తా ఉండంగానే అది కొంచెం కొంచెం పెద్దదవతా దగ్గిరికి వస్తా ఉండాది. ఏందో మంటలాగుంది. మంటే. మంట పెద్దదవతా వచ్చి కాష్టాల మిట్ట కాడ ఆగింది. మంట పెద్దదయింది. భోగిమంట అంత పెద్ద మంట. మంట కింద నిప్పులు పీర్లపండక్కేసే గుండాంలా మెరిసిపోతుండాయి. మంట ఇంకా ఇంకా పెద్దదవతా ఉండాది. నేను దగ్గరకి పోతా ఉండాను. పొగ పైకి లేచి ఆకాశాన్ని కమ్ముకుంది. ఆకాశంలో సుక్కలు కూడా మాయమైపోతుండాయి.
ఊళ్లో వాళ్లంతా ఒకొరకరిగా మంటల్లోకి దూకతుండారు.

చూళ్ళేక కళ్ళు మూసుకున్నా. ఏందో తెలియలా. చాన్రోజులకి కళ్లల్లో నీళ్లు అట్టే కారిపోతా ఉండాయి.

*

మీ మాటలు

  1. మా నెల్లూరు యాస లో రాయాలనే ఒక ప్రయత్నం. పబ్లిష్ చేసిన సారంగా వారికి ధన్యవాదాలు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

  2. sasi kala says:

    మీ నెల్లూరా :-) వాస్తవ పరిస్థితి ఇలాగే ఉంది . తీర్పు చెప్పే వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము .

  3. Ajay Reddy says:

    The story was creating very interestingly by narration. Superb concept sir, and its been creating some thoughts about our self.

    Thanking u for this sir.

  4. చాలా బాగుంది కధ.

  5. దాద్రి ఘటన మీద కథారూపంలో తొలి స్పందన అనుకుంటాను. ప్రయత్నం మంచిదే. డెమోక్రటిక్‌ స్పిరిట్తో రాయాలని రాసిన కథ అనిపిస్తుంది. కానీ గ్రామాల్లో అదీ నెల్లూరు గ్రామాల్లో చికెన్‌ షాపుల్లో బీఫ్‌ అమ్ముతారా! మేము అమ్మేది అమ్మేదే అని ప్రకటించి మరీ అమ్ముతారా! నిజమేనా! బాలెన్స్‌ కోసం చేసిన ప్రయత్నమా! బాలెన్స్‌ కోసం చేసిన ప్రయత్నమే అయితే అది సరికాదు.
    చెప్పాలనుకున్న విషయాలు ఎక్కువై పోయి కుక్కేసినట్టు అనిపించింది. చెప్పే పద్ధతి మీద ఇంకా శ్రద్ధ అవసరం అనిపిస్తుంది. భాష కూడా కొన్ని చోట్ల దారి తప్పింది.
    నేరేషన్‌కి ముసలాయన్ని ఎంచుకోవడం వల్ల కూడా కథనం కాస్త ఇబ్బందికరంగా మారినట్టు అనిపించింది. ఆయనకు చిన్నయవస్సులోని అయ్యోరికి ఫ్రెండ్‌ షిప్ అతికినట్టు అనిపించట్లే.
    బయటినుంచి వచ్చినవాడు అనే పిచ్చిమాట గురించి తీసుకున్న వైఖరి బాగుంది. ఓవరాల్‌గా స్పిరిట్‌ బాగుంది కానీ అన్ని సందర్భాల్లోనూ బాలెన్స్‌ కోసం రచయిత పనిగట్టుకుని ప్రయత్నించడం వల్ల పట్టు తప్పినట్టు అనిపిస్తుంది.

    • మీరన్నది నిజమే. నాకసలు పూర్తిగా అవగాహన లేని విషయం. కానీ జరుగుతున్న సంఘటనల గురించి స్పందించాలనే ప్రయత్నం. బ్యాలెన్స్ అని చూసుకుని రాయలేదు కానీ, లోపల ఎక్కడో ఉంటుందేమో కాంట్రవర్శీ కాకూడదనో లేక అసలు ఈ సమస్యకి పరిష్కారం ఉంటుందా అని అనుమానమో…ఏదో అదే నన్నిలా రాపించుంటుంది.

  6. ఎంచుకున్న విషయం బాగుంది . సమకాలీన సమస్యని పల్లె ముఖంగా చెప్పడం మరింత బాగుంది. అయితే నెల్లూరు యాస లో మరికొంత సౌందర్యం ఉంటే బాగుండేది – బహుశా మీరు పూర్తిగా నెల్లూరు ప్రాంతంలో ఉండక పోవడం కూడా ఒక కారణం కావచ్చు . అన్నట్టు మహి ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. కథకు బాగా అమరింది కూడా – గొరుసు

    • యాసలోనూ, కథని ఎలా ముగించాలో తెలియకపోవడంలోనూ, ఇంకా స్ట్రక్చర్ పరంగానూ తడబడిన మాట నిజం. నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే.

      • కిషన్ చంద్ర says:

        బేసిగ్గా కథ బాగుంది. ఈ కథలో ఈ సమస్యకు ఇంతకంటే మంచి ముగింపు నాకు తెలిసి మరొకటి ఉండదు. కొన్ని యాసలు వినడానికే బాగుంటాయి. కొన్ని చదవడానికే బాగుంటాయి. అయినా చేసిన ప్రయత్నం బాగుంది. నెల్లూరు మాండలికం తెలిసినవారు దీన్ని అస్వాదించగలుగుతారు. మధ్యలో ఇంగ్లీషు పదాలు ఇబ్బంది పెట్టాయి. యాసలో మాట్లాడేవారు ఇంగ్లీషు పదాలు వాడరని కాదు. ఇంగ్లీషు పదాలనే వాళ్ళ యాసలో మాట్లాడతారు.

        చివరగా… ఒక సమస్యని తీసుకుని మరొక ప్రాంతంలో జరుగుతున్నట్లు ఊహించి రాయడం పొసగదు. పలనాడు ప్రాంతానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. రాయలసీమ మరొక విధం. అలానే కోస్తా.. ఉత్తరాంధ్ర. వగైరా.. నెల్లూరు ప్రాంతంలో ఇటువంటి అనునిత్యం ఘర్షణలు పడే వాతావరణం ఉందా? చిన్నా చితకా వివాదాల సంగతి వేరు. ఒక ప్రాంతంలో జరిగేది మరొక ప్రాంతంలో జరగడానికి అవకాశంలేదు. కాఫ్కా పీనల్ కాలనీకి కొన్ని లక్షణాలుంటాయి. అందులో బయటినుంచి వచ్చిన ప్రొటాగనిస్ట్ లేక ప్రధానపాత్ర కథ ముగింపులో తనను అనుసరించాలని చూసిన ఆ ప్రాంతవాసులిద్దరిని నావ ఎక్కకుండా కర్రతో అడ్డుకుంటాడు. may be Kafka’s intention is to avoid migration of earth qualities…?

        ఇంతకీ ఈ (రక్త) దాహం భూమిదా ప్రజలదా..?

        ఈ భౌతికమైన సమస్యలు, వాదాలు, కులాలు, ప్రజలు, వాళ్ళ కొట్లాటలు, వాదవివాదాల మెటీరియల్ సర్కస్ మనకేల బ్రదర్. ఎవడు చెప్పినా వినడు. ఇక్కడ అంతా ఒకడికొకడు వైరుధ్యం.. అంతా వైవిద్యం. మనందరం కలిసేది సోల్ సర్కస్. అక్కడికే పొదాం పద… అవే రాసుకుందాం పద.

  7. కొంచెం సేపు నెల్లూరు లో తిప్పి తీసుకొచ్చారుగా!

  8. కథ చాలా బాగున్నది. వెంకట్ గారికి అభినందనలు. పల్లెల గురించి అక్కడ ఉంటున్న ముసల్మానుల గురించి కథలు రాస్తున్న వారు చాల తక్కువ. కనుక ఈ సందర్భంలో ఈ కథ రావడం అభినందనీయం. అలాగే పశు మాంసం గురించి చర్చ పెట్టటం కూడా బాగున్నది. పశువులు పెంచేదీ వాటిని అమ్మేదీ ముసల్మానులు కాదు. అమ్మిన వారు కాకుండా కొన్న వారు కోసిన వారు తిన్న వారు నింద మోస్తున్నారు. జి.ఎస్.గారు చెప్పినట్టు కొడి మాంసం గొడ్డు మాంసం ఒకే షాప్ లో అమ్మరు. రచయిత తన సౌలభ్యమ్ కోసం తీసుకొని ఉంటాడని పాస్ చేసేయ్యలేమో. ఇక నెల్లూరు భాష చాయలు ప్రదర్సించడం లో రచయిత ఓకె. కొన్ని చొట్ల గుడ్ అని కూడా అనొచ్చు. అయితే నామిని గారి ప్రభావం నుంచి బయట పడాలి. బూతులు తగ్గిస్తే మంచిది. నామిని గారు లంజను అలవాటు చేస్తే మీరు మడ్డ దాకా వచ్చారు. ఆ మాటను వెంటనే తీసేస్తే మంచిదేమో ఆలోచించండి. నామిని గారు బూతులు రాస్తే ఆయనను భుజాన మోసే వారు వుంటారు. మీకు వుండరు. పచ్చి బూతులు నామిని గారికి వదిలి పెట్టి మీరు మంచి మాండలికం మీద దృష్టి పెట్టండి సోదరా.

    • తప్పకుండా…

    • Dr. Rajendra Prasad Chimata. says:

      అవి బూతులు కావు, వాడుకులో వచ్చే ఊత పదాలు. అవి వాడకపోతే ఫ్లో రాదు. కండిషన్స్ పెట్టి మంచి ప్రయత్నాన్ని నీరు గార్చకండి. చాలా సార్లు మాట్లాడే వాళ్ళకు, ఆ ఊళ్ళో వాళ్ళకు ఏమీ అనిపించదు కానీ చదివే వేరే ఊళ్ళ వాళ్ళకు బూతు అనిపిస్తుంది. ఆ భాషని అలా ఆస్వాదించండి !!

  9. Although the story is set in one small village it can be magnified to mean much more than that…….. “India lives in its villages”, is a cliche for a reason.

  10. M.SUDHAKARA RAO says:

    “కొత్త గవర్మెంట్ వచ్చినాక గుడ్డిగా ఎలిగే ఈది లైట్లు కూడా పోయినై” ఇది కరెక్ట్ కాదు .

    అంతా అమ్మిపారినూకు ఐద్రాబాద్ కి రాండి అంటాడు………… నెల్లూరు పొయ్యి ఏమడక్కనూకను?

    హైదరాబాద్ రమ్మంటే నెల్లూరు సంగతి ఎందుకు

  11. Anil Prasad Lingam says:

    కధ బాగుంది.

  12. ఆరి సీతారామయ్య says:

    ఒక కథ మీద భాష గురించీ, ముగింపు గురించీ, సందర్భాల ఔచిత్యం గురించీ, పాత్రల స్వభావాల గురించీ, ప్రాంతీయత గురించీ వ్యాఖ్యానాలు రావటం, వాటికి రచయిత సహృదయంతో స్పందించటం దసరా స్పెషల్ లాగా ఉంది.

  13. కథ చాలా బాగుంది. ఒకప్పుడు ముస్లిములంటే మరో మతం వారని పల్లెల్లో అనుకునేవారు కాదు. మరో కులంలా వారూను. ఇప్పుడూ అనుకోరనే భ్రమలోనే వున్నాను.
    మీ కథ చూసి పల్లె కథ ఇంతవరకూ వచ్చిందా అని వేదనగా వుంది.

  14. ఎంచుకున్న అంశం, కధను మలిచిన విధానం చాలా బాగున్నాయి. యాస కధకు సొగసును ఇచ్చింది.
    మనిషి రాను రాను కుంచించుకు పోయి ఓనాడు అంతరించిపోతాడు. ఈ అసహనాలు మొదటి నుంచీ ఉన్నా కూడా గత పదేళ్ళలో ఎక్కువై పోయాయి. Though provoking and timely story.

  15. bhagavantham says:

    ఊరంతా సద్దుమనిగినాక ….. అయ్యోరిని ఊరి చివరకి తీసుకువెళ్ళి రెండు ఫుల్ బాటిళ్ళు ఇచ్చి …దేవుడితో ఈ సారి గట్టిగా ఏం
    వాదిస్తాడో వినాలనుంది

  16. vasavi pydi says:

    కథ బాగుంది నెల్లూరి యాస బాగుంది భాష లో అసభ్యత ను మరీ అవసరమైతే తప్ప వాడకండి ప్లీజ్

  17. కథ బాగానచ్చింది…! చదువుతున్నాంత సేపు మా ఊళ్ళో కి వెళ్ళినట్టుగా వుంది.

    మఖ్యంగా కథ దాద్రి ఘటన పై ఆభిప్రాయం లావున్నా. అండర్ కరెంటుగా పళ్ళెట్టూళ్ళో ఇప్పటి పరిస్థితి,అర్బనైఙేషన్ వళ్ళ అవి కొల్పోయిన వైబవం చక్కగా తెలిపేరు.

    అయ్యెారు చెప్పిన లాజిక్స్ మంచిగా అనిప్పించాయి.

Leave a Reply to Nithesh Cancel reply

*