ఇక్కడ లేని  సగం…

రేఖాజ్యోతి 
~
Rekha
నువ్వు నీ జ్ఞాపకాలను తవ్వేటప్పుడు

నా లోపల కలుక్కుమంటోంది ,

ఇంకా తెమలని కొన్ని ప్రశ్నలు,
వీడని కొన్ని ముడులు 
అలాగే వున్నాయేమో పునాదిగా !!
 
ఇవాళ కూడా రెండు విస్తళ్ళలో వడ్డించాను,  
ఒంటరితనం అలవాటు కాలేదింకా !
 
నిన్నెవరో పిలుస్తుంటే నేను పలుకుతున్నాను, 
సగం ఇక్కడ లేదన్న సంగతి స్పృహకు రాలేదింకా !
 
మెలకువలోనే పంచుకున్నామా ఆకాశాన్ని, నీది నాది అని
బహుశా మనకు తెలుసేమో, ఆ విభజన రేఖ ఎప్పటికీ కనబడదని ! 
 
ఆ రోజు నువ్వు వెనుదిరిగి వెళ్ళే సూర్యుడ్ని చూశావు 
నీతో కలిసి అదే ఆకాశంలో గూటికి చేరే పక్షుల్ని చూశాను !
 
నేను నీ గమ్యం కాలేదని ఎందుకు నింద చేస్తాను?
మజిలీ అయినందుకు గొప్పగా ఋణపడి ఉంటానే కాని !!
 
ఎంత శ్రద్ధకదా నీకు నా మీద ,
ఒక్కసారిగా వదిలేస్తే పగిలిపోతానని
 
కంటిపాప చెంపమీదకు ఒక కన్నీటి చుక్కను విడిచినంత నెమ్మదిగా విడిచావు కదా?
 

పోనీరా కళ్ళలో నీళ్ళకేం, కొదువా,
పోనీ
వాటి వెనుక ఆ చివార్న మెరిసే నా ఆనందబాష్పానివి కదా నువ్వు ఎప్పటికీ !! 
 
*

మీ మాటలు

  1. నైస్ పోయెమ్

  2. నైస్ ఎక్స్ప్రెషన్, రేఖా!

  3. paresh n doshi says:

    కంటిపాప చెంపమీదకు ఒక కన్నీటి చుక్కను విడిచినంత నెమ్మదిగా విడిచావు కదా?
    నైస్ ఎక్స్ప్రెషన్.

  4. Thank you PARESH DOSHI Sir !

  5. sasi kala says:

    ఎలా వ్రాసారు ఇంత అద్భుతమైన వాక్యం .
    ఎంత నిర్దయగా విసిరేసినా ఇంత ఉదారంగా చెప్పడం నిజంగా హృదయ పూర్వకంగా ప్రేమించిన వారే చెప్పగలరు .
    బహుశా మీ ఇన్నర్ లో నుండే వచ్చి ఉంటుంది ఇది . ప్రేమ చెడ్డదేమీ కాదు . ద్వేషం అసూయ కంటే మంచిదే .
    అచ్చు తప్పులు చూసుకోండి

    *

  6. ‘ఎంత నిర్దయగా విసిరేసినా ఇంత ఉదారంగా చెప్పడం…’ పూర్తి ప్రయత్నాన్ని ఒక్క వాక్యంలో అందంగా చెప్పేశారు, థాంక్యూ శశికళ గారూ !

  7. alluri gouri lakshmi says:

    wonderful ! but not advisable Rekha….congrats…heart touching poem..

  8. నేను నీ గమ్యం కాలేదని ఎందుకు నింద చేస్తాను?
    మజిలీ అయినందుకు గొప్పగా ఋణపడి ఉంటానే కాని !!గొప్పగా చెప్పారు .

  9. ఎం చెప్పాలి!!, కొన్ని వాక్యాలు పదే పదే చదువుతూ ఉండిపోయాను… ఎప్పటిలాగే :)

  10. M .viswanadhareddy says:

    గూటిలో దాగిన కారుణ్య రసాలు

Leave a Reply to Rekha Jyothi Cancel reply

*