సిద్దార్థా మిస్ యూ!!

 

 

-కేక్యూబ్ వర్మ
 
varma
నీ ఊరు నుండి
నీ వార్డు నుండి
ఒక్కో ఇటుకా పంపించుకాసింత పుట్ట మన్ను
రాగి కలశంలో నీళ్ళు
తీసుకొని గుంపుగా
డప్పులు మోగిస్తూ
నీ కోవెలలోనో నీ మసీదులోనో నీ చర్చిలోనో
సామూహిక ప్రార్థనలు చేసి పంపించుమీ అందరికీ ఇక్కడ కాంక్రీటు దిమ్మలతో
నువ్వూ నీ పిల్లలూ అబ్బురపడే
వీడియో గేంలలో తప్ప చూడని
మాయా మందిరాలను నిర్మిస్తాంకురచ ముక్కు ఉబ్బుకళ్ళ ఇంజనీర్లు
పోటీ పడి సర్రున జారే రోడ్లతోను
రయ్యిన ఎగిరే ఇమానాల రొదతోను
నిండిపోయే నగరాన్ని నీకోసం
హాంఫట్ అంటూ మరికొద్ది రోజుల్లో
ముప్పై వేల ఎకరాల పంట భూములను
మింగేస్తూ నువ్ కలలో కూడా
ఊహించని మాయాలోకాన్ని సృష్టిస్తారునువ్వూ నీ పాపలూ కలసి దూరంగా గుడిసెలో
టీవీలో అక్కడ తిరిగే ఓడలాంటి కార్లనూ
సూటూ బూట్లతో తిరుగాడే పెద్ద మనుషులనూ
హాశ్చర్యంగా చూస్తూ సల్ది బువ్వను రాతిరికి
ఎండు మిరపకాయతో మింగుతూ గుటకేయొచ్చువానలూ కురవనక్కర్లేదు కోతలూ కోయనక్కర్లేదు
ఆధార్లో నీ వేలి ముద్రలు మాయం
నీ కార్డుకు బియ్యం కోత
నీ బొడ్డు తాడుకు పేగు కోత తప్పదు
సెల్ ఫోన్లో మాత్రం చార్జింగ్ అవ్వకుండా చూసుకోబాబు గారో బాబు గారి సుపుత్రుడో
పైనున్న పెదాన మంత్రిగారో
తమ కెందుకు ఓటేయ్యాలో మెసేజిస్తారుట్విట్టర్లో ట్వీట్లకు కోట్ల స్పందనలు
నాగార్జున సాగర్ గేట్లెత్తిన ఉచ్చ కూడా బోయట్లేదంట

అమరావతిలో సిద్దార్థుడు పారిపోయాడంట

నీ పాడికి నువ్వే ఎదురు కర్రలు ఏరుకోవాలింక
నీకోసం ఏడ్చే తీరికెలేదిక్కడెవ్వడికీ
నిన్ను పాతడానికి ఆరడుగుల నేలా లేదిక్కడ!!

*

మీ మాటలు

 1. Superb sir

 2. చాలా చాలా బాగుందండి. అభినందనలు.

 3. balasudhakarmouli says:

  నిరసన.. ఎంత నిరసన చేస్తే అంత నిరసన చెయ్యాలి. మీ నిరసన ప్రకంపన నాలోనూ.

 4. gnana prasuna mamanduru says:

  Nice lines…

 5. బావుంది వర్మగారు.
  ఇది సిద్ధార్థుడికి బాబు జరిపిస్తున్న నిర్యాణం. అమరావతి సిద్ధార్థుడు నిజానికి బ్రిటిష్ ఏలుబడిలోనే కిడ్నాప్ అయ్యాడు. అబ్బాకొడుకులు ఆయన్నిక చేేసేదేమీ లేదు. మరో సిద్ధార్థుడు హుసేన్ సాగర్ మురికినీళ్లలో ఇంకో అబ్బాకొడుకుల కంపు పాలన భరించలేక చస్తున్నాడు.

 6. నిప్పులాంటి నిజాలు చెప్పారు. ఇక్కడా అక్కడా దగా దగా…దోపిడీకి కలిసున్నా విడిపోయిన పండుగ సీజన్…

 7. ప్రియ కారుమంచి says:

  మరి దాని పేరే అభివ్రుద్ది అంట …నిజంగానే ఈ అభివృద్ధి హడావిడి చూసి సిద్దార్డుడు పారి పోయి ఉంటాడు …మొన్న ఒకటిగా ఉన్న అరటి తోట ఈ రోజు రెండుగా చీలి రోడ్డు అయింది ..మరి మంత్రులు కార్లు పరిగెత్తాలిగా ….నిన్నటి పంట పొలం ఈ రోజు ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యి అంటూ స్థలం అయింది …కూలీల చేతులు విరగ్గొట్టి పిడికెడు మన్నులో చెంబెడు నీళ్ళ కలిపి కట్టు కడుతున్నారు …..రోడ్డు పక్కన నిన్న ఉన్న ఇల్లు ఈ రోజు మాయమవుతుంది ….అమరావతి మూకుమ్మడిగా వచ్చి పడిన మాయదారి మందను చూసి భీతిల్లిపోయింది …

 8. అమరావతి ని అమ్ముడు ఊరు గా చీసీసిన రాజకీయాన్ని చాల చక్కగా ముంచెత్తుతున్న దరిద్రాన్ని భోధ పరిచారు ..

 9. బాగుంది వర్మా ….లవ్ జె

 10. బ్రెయిన్ డెడ్ says:

  మీరొక్కరే నిరసనలొ కూడ ఇంత ఆర్దత చూపగలరు సర్ జీ.

 11. Delhi (Devarakonda) Subrahmanyam says:

  జరుగుతున్న దోపిడీ మాయను అద్భుతం గా మీ కవిత లో చూపించినందుకు హార్దిక అభినందనలు. ఇలాంటి మాయలెన్నో ఇంకెన్నో జరుతాయి , అన్నీ అభివ్రుది పేరు మిద మనల్ని ఉద్దరించే పేరు మిద.

 12. సాహితి says:

  ఇక్కడ గొర్రెలు కసాయి వాడినే నమ్ము తాయి. మెడ మీ ద కత్తి పడేదాకా వాటికి ఆ సంగతే తెలియదు పాపం!

 13. కె.కె. రామయ్య says:

  కేక్యూబ్ వర్మ గారు, మీ ధర్మాగ్రహ నిరసన మా అందరిలో ప్రకంపించింది. అవును అవినీతి అక్రమ రాబళ్ల కోసం భూమితల్లిని నమ్ముకున్న వాళ్ల పొట్టలు కొట్టి నిర్మించే అమరావతిలో మహాబోధి సిద్దార్థుడుండడు. అభివృధి పేరుతో వేల ఎకరాల పచ్చదనాన్ని కాంక్రీటు జంగిల్ గా మార్చేస్తున్న వాళ్లను ప్రజలు పాతేసే ఓ రోజు వస్తుంది.

  ‘కాలంతో కవిత్వాన్ని కరచాలనం చేయించే కవిత్వాన్ని సృజించే కేక్యూబ్ వర్మ గారూ’, నిద్రిస్తున్న యోధుడి సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు… అన్న మీ కవిత నన్ను వెన్నాడుతూ ఉంది. అది మీరు తరలివెళ్లిన త్రిపుర గారికి నివాళిగా రాసారేమో అనుకున్నా.

 14. అందరికీ ధన్యవాదాలు. జరుగుతున్నకుట్రపూరిత మోసపూరిత దగాకోరు అభివృద్ధిని నిరసించిన మీ అందరికీ నమస్సులు.

 15. Jayashree Naidu says:

  వర్మ గారు… ఎన్ని ఆర్ద్రతలో ఎన్ని ఆవేదనలో కలగలిపినా అక్షరాలూ చాలవు.. నిప్పుల్లో నిజాలు ఆకాశాల్లో చూపులు పాతేయడమే రాజకీయాలయ్యాయి. సామాన్యుడు అడ్రస్ లేడూ.. వున్నా మనుగడలేని దారులే అన్నీ

 16. రవి says:

  “కురచ ముక్కు ఉబ్బుకళ్ళ ఇంజనీర్లు”
  ఎందుకూ ఆ ఇంజనీర్లని తిట్టడం? వాళ్ళు కూడా జీతం కోసం పనిచేసే మేధా శ్రామికులే కదా?
  రవి

 17. ఇందులో అంత కుట్ర ఏముందో వివరించండి.

  పొలాల రేట్లు పెరిగాయని రైతులు, కొత్త పనులు దొరుకుతాయని కూలీలు, కొత్త అవకాశాలోస్తాయని యువకులు , కాంట్రాక్టులు దొరుకుతాయని మంత్రులు, సైట్లు కొనుక్కుంటే మానసిక కోటీశ్వరులు అవ్వొచ్చని మధ్యతరగతీ అంతా ఒకే ఆనందభైరవి రాగం ఆలపిస్తున్నారు.

  గత అనుభవాలనుంచి రాజ్యం చాలా నేర్చుకుంది. కానీ, ఏమీ నేర్చుకోనిది ప్రగతిశీల వాదులే అని మాత్రం బాగా అర్ధం అవుతోంది.

  – శశాంక్

 18. కె.కె. రామయ్య says:

  రవి గారూ “కురచ ముక్కు ఉబ్బుకళ్ళ ఇంజనీర్లు” జీతం కోసం పనిచేసే మేధో శ్రామికులే అనుకున్నా వాళ్ల కొచ్చే జీతాలు భూములు పోగొట్టుకుంటున్న కర్షకులు, చెమట రక్తం ఒకటిగా పనిచేసే కార్మికుల కొచ్చే ఆదాయం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. వాళ్లకి జీతం కంటే గీతం ఇంకా ఎక్కువ. ప్రకృతి సమతుల్యం కాపాడటం, పేదల కన్యాయం జరగకుండా చూడటం కన్నా దోపిడి వర్గం కొమ్ము కాస్తున్నారనే ద్రష్టిలో కవికి ఇంజనీర్ల పై ఆగ్రహం ఉండటంలో తప్పేవిటి. ఈ నేల, నింగి, గాలి, ప్రకృతి సంపద అంతా ఒక తరం గుత్తేదారుల సొత్తేనా, లేక వాటిపై భావితరాలకీ హక్కు ఉండదా?

  శశాంక్ గారూ, నిజమే గత అనుభవాలనుంచి రాజ్యం చాలా నేర్చుకుంది. కాని ఆ నేర్చుడు ఎవరి ప్రయోజనాల కోసమో వాడుతున్నారో అలోచించండి. ఆకాశహార్మ్యాలు, ఆరులేన్ల రోడ్లు వెయ్యటానికి చూపే ఉత్సాహం ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యల పరిష్కారం పై కూడా ఉండొద్దా. అభివృద్ది అవసరమే, కాని అడ్డూ ఆపూలేని అడ్డగోలు అభివృద్ది వల్ల గతంలో జరిగిన ఘోరాలు పునరావృత్తమ్ కాకుండా చూసుకోవాలిగా. అవును మన దేశంలో అసంఘటిత, అల్పసంఖ్యాక ప్రగతిశీల వాదులు నేర్చుకోవలసినది ఇంకా ఉంది.

  • ‘గీతాల’ ఇంజనీర్లూ, ‘దుర్మార్గ’ శారీరక శ్రామికులూ ఉన్నది సమాజం లోని ప్రత్యేక స్థితిలో, సాధారణ స్థితిలో కాదు. ఏ లెక్కన చూసినా, మేధా శ్రామికుల జీతాలెప్పుడూ, శారీరక శ్రామికుల జీతాల కన్నా ఎక్కువ గానే వుంటాయి. టీచర్లూ, ప్రొఫెసర్లూ, డాక్టర్లూ, ఇంజనీర్లూ, గుమాస్తాలూ, వగైరా వాళ్ళందరూ శారీరక కార్మికుల కన్నా ఎక్కువ జీతం పొందేవారే – మన లాంటి వాళ్ళతో కలిపి. మళ్ళీ ఆ మేధా శ్రామికుల జీతాల్లోనే ఎన్నో తేడాలు. అయినా సరే, మేధా శ్రామికులు కూడా దోపిడీకి గురవుతూనే వుంటారు – శారీరక శ్రామికులంత కాక పోయినా. మేధా శ్రామికులనీ, శారీరక శ్రామికులనీ విడదీయకూడదు. వాళ్ళు శతృ వర్గాలకి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళ మధ్య శతృ వైరుధ్యం లేదు. తక్కువ దోపిడీకి గురవుతున్న మేధా శ్రామికులని దోపిడీ దారులతో కలిపి తిట్టకూడదు. వాళ్ళని, వేరే సందర్భాల్లో వేరే రకంగా తిట్టొచ్చు. మేధా శ్రామికులూ, శారీరక శ్రామికులూ ఏకం అయినప్పుడే తిరుగుబాటు తొందరగా జరుగుతుంది. మేధా శ్రామికులు, శారీరక శ్రామికులకి జరిగే ఎక్కువ అన్యాయాన్ని అర్థం చేసుకుంటూ, వారి పట్ల సానుభూతితో వుండాలి.
   రవి

 19. ప్రభుత్వ విధానాలను విమర్శించడం వ్యతిరేకించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికీ కాదనలేని హక్కు. అయితే, ఆ విధానాలలో లోపాలను ఎత్తి చూపడానికి ఉద్యోగులను వృత్తి నిపుణులను అకారణంగా తప్పుపట్టనవసరం లేదు. ఒకే గాటన కట్టవలసిన అవసరం లేదు. ఇక, ఇతర దేశాల/జాతుల నిపుణులను వారి శరీరాకృతులను ఎత్తిచూపి హేళనచేయడం కవిగారి జాత్యాహంకార ధోరణిని, మానసిక అల్పత్వాన్ని బట్టబయలు చేస్తోంది.

  మేధో శ్రామికులని, శారీరక శ్రామికులని విపరీతమైన generalizations చేసేసి, కొందరిని దోపిడీదారుల తొత్తులుగా తిట్టిపోయడం ఏవిధమైన ప్రగతిశీల వాదన? ఏరకం శ్రామికులైనా తప్పు చేస్తే తప్పే కదా?

  • రవి says:

   “మేధో శ్రామికులని, శారీరక శ్రామికులని విపరీతమైన generalizations చేసేసి” => ఇలా ఎవరూ పని కట్టుకుని కూర్చుని చెయ్యలేదు. ఇవి సమాజంలో ఎప్పుడూ వుంటూనే వున్నాయి. దీనర్థం ఇవి ఎప్పుడూ ఉండాలని కాదు. ఉన్నాయన్నది నిజం మాత్రమే. ఈ జనరలైజేషన్ పోవాలంటే, ప్రతీ ఒక్కరూ మేధా శ్రామికుడి గానూ, శారీరక శ్రామికుడి గానూ వుండాలి. అప్పుడే ఈ తేడా ఉండకుండా పోతుంది.

   “కొందరిని దోపిడీదారుల తొత్తులుగా తిట్టిపోయడం” => ఎవరా కొందరు? జీవించడం కోసం దోపిడీదారుల తొత్తులుగా మారితే, అది ఆ అవసరం పోయినప్పుడే పోతుంది. సాధారణంగా, మేధా శ్రామికులకే ఇది కుదురుతుంది. పనేమీ చెయ్యకుండా, “నిన్ను సమర్ధిస్తానూ, నన్ను పోషించూ” అని ఏ శారీరక శ్రామికుడన్నా, అది పని చేయదు. మేధా శ్రామికులయితే, ఒక పక్క మేధతో పని చేస్తూ, ఇంకో పక్క మేధతో తొత్తులుగా కూడా వుండగలరు. కాబట్టి, తొత్తులుగా ఉన్నవారిని తిడితే, తప్పు ఉండదు.

   “ఏరకం శ్రామికులైనా తప్పు చేస్తే తప్పే కదా?” => అవును, ఎవరు చేసినా, అది తప్పే. అయితే, ఆ తప్పుకి గల పునాది, రెండు రకాల శ్రామికులకీ ఒకే లాగా వుండదు. పునాది వేరేగా వున్నప్పుడు, వారికి తగిలే చీవాట్లు కూడా వేరేగా వుంటాయి. ఒకే లాగా వుండవు.

   రవి

   • “ఈ జనరలైజేషన్ పోవాలంటే, ప్రతీ ఒక్కరూ మేధా శ్రామికుడి గానూ, శారీరక శ్రామికుడి గానూ వుండాలి. అప్పుడే ఈ తేడా ఉండకుండా పోతుంది.”

    వ్యక్తి స్వాతంత్రం హరించబడకుండా, ఇదెలా సాధ్యమో వివరించగలరా? ప్రస్తుతంగాని, చరిత్రలోగాని ఇది సాధ్యంచేయబడిన ఏవైనా సమాజాలు/దేశాల ఉదాహరణలివ్వగలరా?

    “తొత్తులుగా ఉన్నవారిని తిడితే, తప్పు ఉండదు.”

    అదే నేనూ చెప్పింది. అయితే, ఈ sweeping generalizations వలన వచ్చే సమస్యేమిటంటే… మేధోశ్రమ చేసేవారికి తొత్తులుగా మారడానికి ఎక్కువ అవకాశముంటుందికాబట్టి మేధో శ్రామికులందరూ అనుమానితులే అనే గుంపు న్యాయానికి వీలివ్వడం.

    “ఎవరు చేసినా, అది తప్పే. అయితే, ఆ తప్పుకి గల పునాది, రెండు రకాల శ్రామికులకీ ఒకే లాగా వుండదు. పునాది వేరేగా వున్నప్పుడు, వారికి తగిలే చీవాట్లు కూడా వేరేగా వుంటాయి. ఒకే లాగా వుండవు.”

    పునాది అంటే… జరిగిన తప్పుతో పాటుగా ఆ వ్యక్తి కులము, మతము, చదువు, వృత్తి, ఆర్ధిక స్థితి, కుటుంబగౌరవం వగైరాలన్నీ కూడా పరిగణించబడాలంటారు…. పదో తరగతి పాసైతే ఆరు నెలలు, డిగ్రీ చేస్తే ఒక సంవత్సరం, PG గాని అంతకంటే ఎక్కువైతే మూడేళ్ళు జైలు శిక్ష…

Leave a Reply to రవి Cancel reply

*