వొద్దు అన్న సమాధానం…

 

– కందుకూరి రమేష్ బాబు

~

Kandukuri Rameshవేమన
పైన.
ట్యాంక్ బండ్ పైన .

కింద?
మనిషి.
ఎవరో తెలియదు.

వెళుతుంటే,
లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళుతుంటే నిన్న చూసా.
చొక్కా తప్పా తనకు ఏమీ లేదు.
చెప్పులు ఉన్నాయ్ అనుకోండి.
‘మనిషి మాత్రం ఈ లోకం లో లేడు’  అనిపించింది.

మాల్లీ ఇవ్వాళ్ళా చూసా.
చూస్తే చూసాడు.

క్షణం ఆలోచించా ఫోటో తీసుకోవడానికి.
అతడు వొద్దు అనలేదు.

కాని, ఆ తర్వాత అడిగాను..
‘ప్యాంటు తెచ్చి ఇవ్వనా?’  అన్నాను.
తల అడ్డంగా ఊపాడు.

‘పోనీ లుంగీ?’ అని అడిగాను.
వొద్దు అన్నాడు.

వినిపించింది.
ఎం చేయాలో తెలియలేదు.
నిరుత్తరత.

తప్పలేదు.

ఒక వెళ్ళిపోయాను.
మనిషిగా.

కాని, ఛాయా చిత్రకారుడిగా ఇలా
మిగిలిపోయాను.

ఇలా ఎన్నో.

ఎవరి కి చూపుతాం ప్రతీసారి.
అందుకే, ‘నిరుత్తరత’ బాగుంటుంది.
బాధగా బాగుంటుంది.

కొంచెం పంచుతాను, ఈ పూట.
చెప్పక తప్పక.
అతడి ప్రత్యుత్తరం నచ్చక.

*

మీ మాటలు

  1. అయినా ప్యాంటు కావాలా అన్నారు, లుంగీ కావాలా అన్నారు గానీ బువ్వ కావాలా అని అడిగారా మీరు?
    ప్యాంటు, లుంగీ మనకోసం కానీ బువ్వ అతనికోసం. అడిగుంటే కావాలనేవోడేమొ!

మీ మాటలు

*