డిస్‌క్లయిమర్!

14

-అరుణ్ సాగర్ 

~

 

arun-పెద్దతేడా ఏంలేదుగురూ. జస్ట్ ఒక్క అక్షరం. `గు` తీసి `షు` పెట్టు. మేల్‌కొనమన్న పాపానికి, పురుషులందు పుణ్యపురుగులు వేరయా అని ఒక పెద్దాయన నీచంగాతిట్టినపుడు ఆశ్చర్యంగా వైడ్ ఓపెన్ మౌథొకటి పెట్టుకుని. ఆపై అప్పటినుంచీ మూసుకుని. రాసుకుని.

-పురుగులు లేదా పురుషులు అనండి ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది. (ఈ వాక్యాన్ని వీకో వజ్రదంతి కేప్షన్‌లా చదువుకోవాలి). నచ్చక పోతే షిఫ్టుడిలీటు కొట్టుటకు ఇదివాక్యము కాదుకదా, లేదంటే వైరస్ ఇన్‌ఫెక్టెడ్ ఫైలూ కాదు. మరేమి చేయవలె. ఈ నీచపుత్రులను. తాగుబోతు నాయాళ్లను. తిరుగుబోతు కుక్కలను. గళ్లలుంగీ చారల టీషర్టు అసియ్యపు మీసాల మోసగాళ్లకు మోసగాళ్లను. రాముని మించిన కిష్నులను.  దుర్మార్గపు వ్యక్తులను (హ హ వ్యక్తులూ, వ్యక్తిత్వమూ. యే బాత్ కైకూ రే! ఇంకోమాటచెప్పు). ఈ పచ్చని పొలమును బోలిన ప్రెపంచికానికి పట్టిన పీడపురుగులను, పేడపురుగులను ఏ మందేసి చంపవలెను. పురుషులంట. తొక్కలో పురుషులు. ఈఅందాలలోకంలో దారిపొడవునా అడ్డొచ్చే అడ్డగాడిదలు. ఒంపువయ్యారాల లాండ్‌స్కేప్ పార్కులో పొడిచిన ముళ్లజిల్లేడు చెట్లు. ఈ అద్భుతవనంలోకి కంచె కిందనుంచి దూరివచ్చేసిన పందులు. షావనిస్టు పిగ్గులు.

-ప్రపంచములో మంచికీ, చెడుకీ జెండర్ ఉండును. మంచి అన్నది స్త్రీ లింగము. చెడు అన్నది పురుషలింగము. ఒరేయ్ లింగం, నీకేరా చెప్పేది. తెలియకపోతేమమ్మడుగుము. అంచేత, యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ మెన్ టూ బీ గుడ్. వాడెవడో సరయిన అవగాహన లేని వాడొకడు `ఫ్యూ గుడ్‌మెన్` అని సినిమా తీశాడు, ఇంకోడెవడోరాసిన నవలని బేస్ చేసుకుని! నిజానికి `గుడ్‌మెన్ ఆర్ ఎ ఫ్యూ`! అదీ టైటిలు! చూస్తూనే ఉన్నవ్ కద, చదువుతూనే ఉన్నవ్ కద. యూ నో వాట్? అచ్చులు ఆంబోతులకేఎందుకు వేస్తారు. బాల్స్ ఎద్దులకే ఎందుకు కొట్టేస్తారు. పశువులు కాబట్టి. పురుషుల వలె అవికూడా పశువులన్నట్టు. పురుగుల వలె పందుల వలె నక్కల వలె తోడేళ్ల వలెమొసళ్ల వలె మరియూ ఆ మొసళ్లు కార్చే కన్నీళ్ల వలె కొంగల వలె దొంగల వలె కొంగలు చేసే జపం వలె. లైకులు కొట్టీ పోకులు చేసీ ఛాటుకు వచ్చీ చాటుమాటు వేషాల! (ఛాటులు కలిసిన చప్పట్ల గురించి మాట్లాడుట నిషిద్ధము. అసలు నిన్నెవడు రెస్పాండ్ అవమన్నాడు?). ఈ మగాళ్లున్నారు షూషారూ…మేల్ ఈజ్ ఈవిల్. వన్ ఫైన్ నైట్ఆఫ్ ఫ్రైడే ది థర్టీంత్, అండర్ ఎ బ్లడ్‌మూన్ స్కై. కొడుకుల్ని రక్తం కక్కుకునేలా. ప్రియా ఏంచేస్తే శాంతిస్తావు చెప్పు. ఈ మగజాతిని ఏ ఎండోసల్ఫాన్‌తో నిర్మూలించాలి చెప్పు.

-అసలు స్త్రీలంటే దేవతలు. అభంశుభం ఎరుగరు. ఏనాడూ `పోక్` చేయరు. లీడ్లు ఇవ్వరు. ప్రిడేటర్లు కాదు గురూ. మగవారికి పూర్తిగా `భిన్నులు`. (ఖిన్నుడవైయ్యావా?).ఫెమీన. మంచితనానికి నమూన. నవీన. (అబ్బ..పురుష్! ఓ యబ్బో సిగ్గే, అదంతా?)

-బై ద వే, నిన్నొకడు కలిశాడు (సారీ నిన్న ఒకడు కలిశాడు) వాడికి చెడు అలవాట్లేమీ లేవు. వాడు తాగడు. పొగనూ మందునూ రెంటినీ! అంతేల, టీ కూడా తాగడు సఖీ.ఒక్క వొక్కపొడి పలుకు కూడా వాసన చూడడు చెలీ. కానీ వాడు కర్కశుడు. పెళ్లాన్ని కొడతాడు. పిల్లల్ని కొడతాడు. ఆడపిల్లల్ని బతకనివ్వడు. తెగ సంపాదిస్తాడు. పిల్లికికూడ బిచ్చం పెట్టడు. భార్యకి మాత్రం బస్‌పాస్ తీసిస్తాడు. పరమ సంకుచితుడు. నిన్నొకడు కలిశాడు. వాడు తెగ తాగుతాడు. సిగరెట్ మీద సిగరెట్ పీకుతాడు. కానీపిచ్చోడు, ప్రేమిస్తాడు. పక్కనోడి కష్టం చూసి జేబులో ఉన్నదంతా తీసి చేతిలో పెడతాడు. వాటేసుకుని భోరుమని ఏడుస్తాడు. తూలుకుంటూ నిలదొక్కుకొని తలుపు తీయగానేబిడ్డ నుదుటనొక ముద్దుపెట్టి సారీ మమ్మీ అనేసి సైడయిపోతాడు. గదిలో కెళ్లి బజ్జుకుంటాడు. అర్ధం కాలేదు కదా! కదా? ఎక్స్‌పెక్ట్ చేశా! అర్ధం కాదు గురూ. ఎప్పటికీ అర్ధంకాదు. తాగి పడిపోమని చెప్పట్లే. సిగరెట్ పీల్చి పీల్చి ఊపిరితిత్తులు కాలి చచ్చిపోరా అనీ చెప్పట్లే. పాయింటేంటంటే చెడ్డ మగాళ్లు వేరు, చెడ్డ అలవాట్లున్న మగాళ్లు వేరు. చెడ్డఅలవాటున్నోడు పశువూ కాదు, చెడ్డ అలవాటులేనోడు మానవజాతి మణిరత్నమూ కాదు. ఓ బిట్ పేపర్ కొషనడుగుతా ఆన్సర్ చెయ్యి ;-) …గొప్పవాడికీ మంచివాడికీ గలతేడాలను పేర్కొనుము.

-రేయ్ రేయ్ రేయ్ నోరు పెరుగుతుందేంటిరా. ఎక్స్‌ట్రా నెయ్యీకారం మాటలు మాట్లాడుతున్నావేందిరా. ఏంటి వెర్షన్ మారుస్తున్నవ్? ముయ్ రా కుయ్యా. లుచ్ఛా కీ బచ్చా.పాటపాడి మరీ చెప్పారు కదరా `నన్ను ప్రేమిస్తే నువ్వే లుచ్ఛా` అని. రాక్షసుడా. కిరాతకుడా. కీచకుడా. మృగాడా. బాబూ సాటి, మేటి పురుగ్స్! చెప్పండమ్మ చెప్పండి,ఉప్పందించండి. ఇంకా మాంఛి టైటిల్స్…కమాన్ క్విక్. పెద్దతేడా ఏంలేదుగురూ. జస్ట్ ఒక్క అక్షరం.

-ఏం ర భయ్! ఇంత తిట్టినా తోలుకు టచ్చవుతలే? చెవులు దొబ్సా? మనకి నో సిగ్సా? హుమ్…నీతోని అయ్యేది కాదులేగానీ. సరే ఆ పక్కన కూర్చుని గట్టిగా నట్టువాంగంవాయించుకొనుడు. ఛుపారుస్తుమ్. `మ` కు ఉకారమిస్తే `ము` ఛుపాకే!

ఆల్ మెన్ ఆర్ లివింగ్ థింగ్స్

పిగ్స్ ఆర్ లివింగ్ థింగ్స్

: సో ఆల్ మెన్ ఆర్ పిగ్స్

దిస్ ఈజ్ కాల్డ్ ఫిగరేటివ్ లాజిక్. మేధమెటికల్లీ కరెక్ట్. లీవ్ ద పొలిటికల్ కరెక్ట్‌నెస్. హేస్టీ, నాస్టీ జెనెరలైజేషన్. ఫ్లోసీనాసీనిహిలిపిలిఫికేషన్!

బట్. బిఫోర్ దట్, నోట్ దిస్ పాయింట్- అందమైన సింహపు జూలు నేలరంగు. నీలఖచిత నెమలిపింఛము ఆకాశవర్ణము.

-అద్సరే గానీ ఈ మగపురుగులులేని అందమైన లోకములోనికి మగవాసన వచ్చే పిచ్చిపూలు లేని రంగులవనంలోనికి కలలప్రపంచములోనికి స్వేచ్ఛాస్వర్గములోనికి`జాతిని` ఎప్పుడు మేల్కాంచెదవు ప్రమీలా!

(పోస్ట్‌స్క్రిప్ట్; ఆకాశవాణి కొత్తగుడెం కేంద్రం, జనరంజని కార్యక్రమంలో స్త్రీలు కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు గృహప్రవేశం చిత్రం నుంచి కేజే జేసుదాస్ పాడిన పాట.కోరినవారు, వాషింగ్ పౌడర్ నిర్మా ఫ్యాక్టరీ నుంచి హేమ, రేఖ, జయ ఇంకా సుష్మా. “దారి చూపిన దేవతా ఈ చే….యి ఎన్నడు వీడకా”)

*

Artwork: Rajasekhar Gudibandi

 

మీ మాటలు

 1. రాజశేఖర్ గుదిబండి says:

  షివాల్రీయస్….మార్వెలస్ ..

  “పాయింటేంటంటే చెడ్డ మగాళ్లు వేరు, చెడ్డ అలవాట్లున్న మగాళ్లు వేరు. చెడ్డఅలవాటున్నోడు పశువూ కాదు, చెడ్డ అలవాటులేనోడు మానవజాతి మణిరత్నమూ కాదు.”

 2. Bhoomyakaasalu motham… Purushule… Joolunna సింహం.. Andamaina nemali pincham… Maga janthuvula sontham ayinappudu…. Meeru leni Andamaina lokam inka ekkaduntundi…. Amazing Arunsagar.. As usual!!!

 3. Aruna.Gogulamandaa says:

  ..truly liked the nuances your write up discussed on man woman relations.Those who claim themselves to be modern, should also be able accept everything that comes with that tag of” being modern”..here i’m talking about your references to ‘leads’ in the in boxes.After all said and done, knowing very well that one have every right to freely express his/her thoughts,it is surprising to see people barging in and grab the rights to write and post, without logically, rationally discussing about the issues. Looking at this personalized comments and abuses growing so rapidly for the last some days on social networking sights, your write up comes as an answer to two questions for sure. One about the complementary manner man woman relations should go ahead even after all the fight for hegemony continues as long as it can, and the right to freedom of expression which none has the right to hijack. Your right up reminds the democratic and objective manner literary expression should be read,discussed and analysed.Thank you Arun Sagar.

 4. Chimata Rajendra Prasad says:

  మీ రాత ఇద్దరు స్త్రీలను కదిలించిందంటే మీ రచన విజయం సాధించింది. మగాభినందనలు !!

  • Aruna.Gogulamanda says:

   ..బట్ ఐ డింట్ లైక్ యువర్ జెండర్డ్ స్టేట్మెంట్ సర్, ఐ థింక్, ఐ రెస్పాండెడ్ రేషనల్లీ అండ్ యాజ్ యాన్ ఇండివిడ్యుఅల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, దేన్ ఏ వుమన్.ఐ ఫీల్ ఆల్ ఆఫ్ అజ్ షుడ్ స్టార్ట్ థింక్ యాజ్ ఇండివిడుయల్స్ ఫస్ట్, దేన్ యాంట్రిబ్యోటింగ్ జెండర్ అన్నేస్ససరీలీ.

 5. స్త్రీ అనగానే ‘మంచి’ అనీ.. పురుషుడు అనగానే ‘చెడూ’ అని లోకం ఆది లోనే ఫిక్సయిపోయింది సార్.. దానికి అన్ డూ బట్టన్ లేదు. !! :)

 6. పరకాయ ప్రవేశం అంటే అదొక తాంత్రిక విద్య మాత్రమే. అదిప్పుడు సాధ్యం కానే కాదని భావించేవాడిని. అందుకెన్నో మంత్రతంత్రాలు తెలుసుండాలి. మనమిక చూడలేం అనుకునే వాడిని. ఇది చదివాక మీరు ఆడదాని జన్మలోకి పరకాయ ప్రవేశం చేసిన పిమ్మట అలాంటిదొకటి ఉందని.. అది వాస్తవమేనని.. పుక్కిట పురాణం కాదని.. ఘఠ్ఠిగా నమ్ముచుంటిని. ఇది నీకు నచ్చి తీరాలహె అని రాయుట మీకు మాత్రమ సాధ్యమెలా మగానుభవా! మగత్వం బట్టలూడదీసి.. బడిత పూజ చేసేశారు కదండీ! ఇది చదివిన మగతనం ఏ ముహం పెట్టుకుని ఈ సమాజంలో సంచరించాలి? అయినా ఇన్నేసి శాపాలా! వీటి సడలింపు కూడా మీరే ప్రకటించాలి తప్పదు. తప్పదంతే!!!

 7. Mythili Abbaraju says:

  ” గుండె జబ్బుల వార్డ్ లలో నాన్నలు ” – చదివి , మేల్ కొలుపుకి నేను అభిమానిని.

  ముద్రలు వేసేయటానికి పూర్తిగా వ్యతిరేకిని. ఏ మాత్రమూ ఫెమినిస్ట్ ను కాను.

  అయితే- చెడ్డ అలవాట్లున్న మగవాళ్ళు , చెడ్డ మగవాళ్ళు – రెండూ కాని ‘ మామూలు ‘ వాళ్ళే ఎక్కువెక్కువ మంది ఉండగా- ఈ contrast లు ఇంకా అవసరమా ? మేల్ కొలుపు వచ్చి చాలాకాలమైంది , ఇప్పుడు రాసేది ఇంకాస్త , ఇంకొకలా – ఉండటాన్ని ఆశించాను , a bit disappointed.

 8. Wonderful writing Arun Sagar garu. కాని English words ని తెలుగు లో రాసినప్పుడు చదవటం చాలా ఇబ్బంది గా ఉందండి. Not sure may be just me.

 9. కె.కె. రామయ్య says:

  స్వేచ్ఛాస్వర్గములోనికి `జాతిని` మేల్కొల్పచేసిన మీ ప్రయత్నం అభినందనీయం అరుణ్ సాగర్ గారూ

 10. What a plerause to meet someone who thinks so clearly

మీ మాటలు

*