…..అందుకే చిన్నప్పుడే చూడాలి!

-కందుకూరి రమేష్ బాబు

~

Kandukuri Rameshఒకటి కాదు, రెండు కాదు, పదినిమిషాల్లో పది బొమ్మలు తీశాను.
కానీ ఒక్కసారి కూడా డిస్ట్రబ్ కాడే వాడు.

దూరం నుంచి కాదు, దగ్గరకు వెళ్లినా అతడిక్కడ లేదు.
ఒక్కసారి కూడా అతడు మనవైపు చూడలేదు.
అసలు తనిక్కడ లేడు.

తనలో తాను.
తనతో తాను.

బహుశా పెద్దయ్యాక లేనిదదే కావచ్చు.
అంత నిమగ్నమై, లీనమై కానరావడం అసంభవం కావచ్చు.

ఉన్నా ఆ పని ఒక ఆట.. ఒక పాట.
ఒక సహజమైన బాటలో కాకుండా యాంత్రికత్వంలోకి జారిపోవడమే కాబోలు.

అందుకే పెద్దవాళ్లను పనిపాటల్లో ఛాయా చిత్రలేఖనం చేయడం మహాకష్టం.
పిల్లలనూ లౌకిక ప్రపంచంలోకి తెచ్చి చూపడమూ అంతే కష్టం.

చూపిస్తే నవ్వుతారు.
వాడికి చెడ్డీ కూడా లేదు.
వేసుకోలేదు.

కానీ వాడి ధ్యాస, ఏకాగ్రత అంతా ఒకటే కాదు ఆ చిత్రం.
ఆ రంగులు.

ఆ తరాజు వాడంతట వాడు ఎంత అందంగా చేసుకున్నాడు.!
వాటిని చూడండి.

అందులో ఆ రాయిని చూడండి.
బ్యాలెన్స్.

తమంతట తాము బుడి బుడి నడకలు పోయేటప్పుడు మనం చూస్తాం., పిల్లలని.
కానీ వీధిలో ఆడుకుంటున్నప్పుడు, స్నేహితులతో గొడవ పడుతున్నప్పుడు, బడిలో పాఠం వింటున్నప్పుడు చూడం. అలాగే, నిదానంగా పెద్దయి విద్యాబుద్దులు నేర్చి వాడు మెల్లగ నశించిపోయాక మనం చిత్రాలు చాలా చేస్తాం. కానీ వాడు వెళ్లిపోతాడు. ఆ బాలడు అదృశ్యమౌతాడు. అదే విషాదం.

అందుకే చిన్నగున్నప్పుడే చూడాలి.
తర్వాత వాడిని ఎన్నో విధాలుగా చూసినా వాడు కాదు.

కానీ ఇక్కడ చూడండి.
తనంతట తాను నేర్చుకుంటున్న ఒక పాఠంలో తానే టీచర్.
తానే విద్యార్థి.

ఒక బాలుడి శిల్పం.

తనను తాను తూకం వేసుకుంటున్న బాల్యం
ఒక తరాజు.

తర్వాత తాను తూకంలోకి వస్తాడు, అదే బాధ.

*

మీ మాటలు

  1. krishna mohan says:

    మీ చిత్రాలన్నీ మంచిగుంటయి సారు

  2. చందు - తులసి says:

    బాల్యంలోకి తీసుకెళ్లారు….

  3. Thirupalu says:

    బాల్యాన్ని బహూ బాగా చిత్రీకరించారు .

  4. VELDANDI SRIDHAR says:

    పెద్దయి విద్యాబుద్దులు నేర్చి వాడు మెల్లగ నశించిపోయాక… చాలా బావుందీ వాక్యం. మీరు చెప్పిన వాటి కన్నా ఇంకా ఎన్నో చెప్పని విషయాలే ఎక్కువ ఈ చిత్రంలో. బాల్యాన్ని అంతగా సహజంగా, సౌకుమార్యంగా పట్టుకోవడం కేవలం మీ కంటి కెమెరాకే సాధ్యం. ఇంతకు ముందు తీసిన అనేక చిత్రాల్లో అది నిరూపితమైంది. ఈ చిత్రం మరో సారి నిరూపించింది. బతుకు తరాజులో జీవితాన్ని పెట్టి తూచినపుడు అన్నీ హెచ్చుతగ్గులు, లాభ నష్టాలు, మోసకారితనం కనిపిస్తాయి. అందుకే చిన్నప్పుడే చూడాలి…ఆ అమాయకత్వం, ఆ పట్టింపు లేని తనం, ఆ లెక్కచేయని తనాన్ని. మరీ ముఖ్యంగా ప్రాకృతికంగా సంచరించే ఆ తెంపరితనాన్ని…మంచి చిత్రాన్ని అందించిన… డా. అఫ్సర్ గారికి, మీకు అభినందనలు..

  5. :ద ఫోటో తీస్తున్నప్పుడు మీరు భలే నవ్వుకుని ఉంటారు కదా!?

  6. :D ఫోటో తీస్తున్నప్పుడు మీరు భలే నవ్వుకుని ఉంటారు కదా!?

Leave a Reply to Radha Cancel reply

*