త్రాసు సరే, కత్తి మాటేమిటి?!

మోహన్ రావిపాటి 

~

mohan“మనందరం న్యాయదేవత చేతిలో ఉన్న త్రాసు నే చూస్తున్నాం, కానీ రెండవ చేతిలో ఉన్న కత్తిని ఎవరూ చూడటం లేదు, ఆ కత్తి మీద దుమ్ము పట్టుంది, ఆ దుమ్ము దులిపి ఆ కత్తికి పదును పెట్టాలి ” తల్వార్ సినిమాలో ఒక డైలాగ్. నిజమే బాగా దుమ్ము పట్టింది, ఆ కత్తిని పదును పెట్టాల్సిందే.

కానీ , న్యాయదేవత చేతిలో త్రాసుకు ఎలా ఎటూ మొగ్గు చూపకుండా ఉండగలదో, రెండో చేతిలోని కత్తి అలా ఉండలేదు, ఆ కత్తి కి రెండు వైపులు ఉంటాయి, ఆ రెండువైపులా పదును ఉంటుంది. ఆ పదునుకు కుత్తుకలు రాలిపడతాయి. తెగే కుత్తుకలన్నీ నేరస్తులవే కాకపోవచ్చు, కావచ్చు. కళ్ళు మూసుకొని కత్తి ఝలిపించే న్యాయదేవతచేతిలో తెగిపడిన తలదే నేరం అని మన న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అతదే నేరస్తుడు అని సమాజం  భావిస్తుంది  . కానీ కత్తి కొయ్యాల్సిన కుత్తుకనే కోసిందా !!!??!!! ….ఏమో న్యాయదేవతతో సహా ఎవ్వరికీ తెలియదు.. తెలిసే అవకాశమూ లేదు.

2008 లో ఆరుషి హత్య కేసు సృష్టించిన సంచలనం అంతా, ఇంతా కాదు. అప్పట్లో దేశం మొత్తం ఆ కేసు గురించే చర్చించుకుంది. మీడియా అదే వార్తను పదే పదేచుపించింది. ఒక్కోసారి అత్యుత్సాహం చూపించి తనే దర్యాప్తు చేసింది, తీర్పు ఇచ్చింది. ప్రారంభంలో పొలిసులు చేసిన దర్యాప్తు ప్రకారం నేరస్తులు ఆరుషి తల్లిదండ్రులు అయితే, సి.బి.ఐ వారి దర్యాప్తు ప్రకారం నేరస్తులు ఆరుషి తల్లిదండ్రుల క్లినిక్ లో పని చేసే కృష్ణ అతని స్నేహితులు. తిరిగి సి.బి.ఐ దర్యాప్తు మరొసారి చేస్తే ఈ సారి నేరస్తులుమొదట పోలీసులు దర్యాప్తులో ఆరుషి తల్లి దండ్రులు . అన్నిటికీ ఋజువులు ఉన్నాయి. కానీ శిక్ష ఆరుషి తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నూపుర్ తల్వార్ లకు అమలుఅయ్యింది. ప్రస్తుతం వారు జైలు శిక్ష అనుభవిస్తున్నారు . దీన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన చిత్రం “తల్వార్”

ఒకరోజు ఉదయం గుర్గావ్ లోని ఒక అపార్ట్మెంట్ లో శ్రుతి( ఆయేషా పర్వీన్) హర్యకు గురి అవుతుంది. శృతి తన తల్లి నూపూర్ తల్వార్ ( కొంకణాసేన్ ) తండ్రి రమేష్ టాండన్( నీరజ్ కబి) తో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఇనస్పెక్టర్ ధనిరాం ( గజరాజ్ రావ్) ఆధ్వర్యంలొ కేసు దర్యాప్తు సాగుతూ ఉంటుంది. మొదటగా వారి ఇంటిలో పనిచెసే కెంఫాల్ నిఅందరూ అనుమానిస్తారు, కానీ విచిత్రంగా మరుసటి రోజు కెంఫాల్ కూడా పైన లిఫ్ట్ రూం లో శవం గా కనిపిస్తాడు, పొస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం రెండు హత్యలు కొంచెం అటుఇటుగా ఒకే సమయంలో జరిగిఉంటాయి, దానితో కేసు మలుపు తిరుగుతుంది. పోలీసులు శృతి తల్లిదండ్రులు నూపుర్, రమేష్ ని అనుమానిస్తారు. శృతి,కెంఫాల్ మధ్యలైంగిక సంబంధం  ఉంది అని దాన్ని చూసిన తండ్రి వాళ్ళిద్దరినీ చంపేశాడు అని, దానికి తల్లి సహకరించింది అన్న అభియోగం నమోదు అవుతుంది, దానికి రమేష్ క్లినిక్ లోపని చేసే  కన్నయ్య (సుమిత్ గులాటి)  చెప్పిన విషయాలు సాక్ష్యాలుగా సమర్పిస్తారు. కానీ కోర్ట్ ఆ ఆధారాలతో తృప్తి చెందదు. కేసు తీవ్రత దృష్ట్యా దాన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సి.డి.ఐ) కి అప్పగిస్తుంది. సి.డి.ఐ హెడ్ ( ప్రకాష్ బేలవాడి) ఆ కేసు బాధ్యత అశ్విన్ కుమార్ ( ఇర్ఫాన్ ఖాన్) కు అప్పగిస్తాడు. అశ్విన్ ఆ కేసును తిరిగిదర్యాప్తు చేస్తాడు. పోలీసులు ఇచ్చిన ఆధారాలు, తీసుకువచ్చిన సాక్ష్యాలు అన్ని తప్పుడువని, అసలు శృతిని , కెంఫాల్ ని చంపింది, రమేష్ క్లినిక్ లో పనిచేసి, తప్పుడుసాక్ష్యం ద్వారా రమేష్ ని, నూపూర్ ని నేరస్తులగా చిత్రీకరించిన కన్నయ్య  అతని స్నేహితుడు  అని, అతను కెంఫాల్ కి కూడా స్నేహితుడు అని , కెంఫాల్ కొసం వచ్చి మధ్యమత్తులో శృతిని చంపి, ఆ విషయం బయటకు వస్తే  ప్రమాదం అని కెంఫాల్ ని కూడా చంపాడు అని తేలుతుంది.

ఇదే సమయంలో సి.డి.ఐ లో పాత డైరెక్టర్ రిటైర్ అయ్యి కొత్త డిరెక్టర్ ( శిశిర్ శర్మ) పదవీ బాధ్యతలు స్వీకరిస్తాడు. ఇన్వెస్టిగేట్ పూర్తి చేసిన శశి సాక్ష్యులను బెదిరించి సాక్ష్యంచెప్పించాడు అనే అభియోగం రావటంతో శశి ని ఆ బాధ్యతలనుండి తప్పించి మరో అధికారికి (అతుల్ కుమార్) కి అప్పగిస్తాడు, అతుల్ కుమార్ తిరిగి కెసు దర్యాప్తు చేస్తాడు.అతను సేకరించిన సాక్ష్యాధారాల ప్రకారం రమేష్, నూపుర్ లే ఆ హత్య చేశారు అనే నిర్ధారణకు వస్తాడు. దీనితో అధికారులంతా కలిసి, ఈ కేసుని ఏదో ఒక విధంగా ముగింపుపలకాలి అనే ఉద్దేశ్యంతో రమేష్, నూపుర్ కలిసి హత్య చేశారు అని ఉన్న ఆధారాలనే కోర్ట్ కు సమర్పిస్తారు, దాని ఆధారంగా కోర్ట్ వ్యతిరేక ఆధారాలు ఏమి లేవు కాబట్టివాళ్ళిద్దరికి శిక్ష విధిస్తుంది

ఇది స్థూలంగా కథ, ఇది అందరికి తెలిసిన కథే కాబట్టి కథలో దాపరికాలు ఏమి లేవు, కానీ దాన్ని తెరకెక్కించిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేఘనా గుల్జార్ని ఈ విషయంలో అభినందించే తీరాలి.అందరికి తెలిసిన కథలో ఎలాంటి థ్రిల్లింగ్ పాయింట్స్ ఉండవు, తెలియని మలుపులు ఉండవు. అలాంటి కథతో ఒక క్రైం సినిమాతియ్యాలంటే చాలా కష్టం. కానీ దాన్ని మేఘనా గుల్జార్ దాదాపుగా  అధిగమించింది అనే చెప్పాలి. విశాల్ భరద్వాజ్ రచన దానికి చాలా వరకు కారణం అయ్యింది. ఇర్ఫాన్ ఖాన్ అధ్బుతమైన నటన మిగతా కారణం. తనదైన డార్క్ హ్యూమర్ తో సినిమా నడిపించాడు. విశాల్ భరద్వాజ్ సంగీతం కూడా సమకూర్చటంతో తన రచనకు ఎక్కడ ఎంత ఎమోషన్ లో ఎలా ఇవ్వాలో అలా పర్ఫెక్ట్ గా పలికించాడు. పంకజ్ కుమార్ కెమేరా పనితనం సూపర్బ్. ఎమోషన్స్ పలికించటంలో నటన, మ్యూజిక్, కెమేరా మూడు సరిగ్గాసరిపోతే ఎలా ఉంటుందో సినిమా సరిగ్గా అలా ఉంది.

సినిమా కథనంలో అకిరా కురుసోవా రూపొందించిన రోషోమొన్ ఛాయలు కనిపించినా, ఒక సంఘటనను ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పటం , అది ఈ సినిమాకు ప్లస్ పాయింటేఅయ్యింది కాని మైనస్ పాయింట్ కాలేదు. “టాబూ” పాత్ర మాత్రం నిరాశపర్చింది, టాబూలాంటి పొటేన్షియల్ ఆర్టిస్ట్ తో సినిమా కథకు సంబంధం లేని ఒక కారెక్టర్చేయించటం ద్వారా దర్శక నిర్మాతలు ఏమి చెప్పాలి అనుకున్నారో అర్ధం కాలేదు

చివరిగా “మనకు కనిపించేది న్యాయం కావచ్చు, కాకపొవచ్చు, కానీ న్యాయం గా మనకు న్యాయం అనిపించేది న్యాయమే అని అనుకోవటమే న్యాయం ”

*

మీ మాటలు

  1. రివ్యూ బాగుంది . నిజమే , అందరికీ తెలిసిన, అందులోనూ ఇంతకుముందే ఒక చలన చిత్రంగా(రహస్య) రూపొందింపబడిన కథని మరోసారి ఆసక్తికరంగా చిత్రీకరించి చూపడం కష్టమైన పనే . చూడాలి సినిమా

    • mohan.ravipati says:

      తప్పకుండా చూడండి , మీకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను

  2. vasavi pydi says:

    రివ్యుబాగుంది సినిమా కు ఎవరు చేయాల్సిన న్యాయం వారు చేస్తే అదిఅందరు మెచ్చే మంచి సినిమాఅవుతుంది

    • mohan.ravipati says:

      అవునండి , ఈ సినిమాలో అన్నీ సరిగ్గా సరిపోయాయి కాబట్టే సినిమా బాగుంది, తప్పకుండా చూడాల్సిన సినిమా , Thanq

  3. రివ్యూ చాలా చక్కగా, పారదర్శకంగా రాసారు. గత వారమే ఈ సినిమా కూకట్ పల్లి మంజీరా మాల్ లో చూసాను. 4 పదుల మేఘనా గుల్జార్ ఇంత గొప్పగా సినిమాను తీస్తుందని ఊహించలేదు . పాటలూ , డాన్సులూ , స్టెప్పులూ లేకుండా రెండున్నర గంటలు మనలను కూర్చో బెట్టడం అంత సులువు కాదు – దర్శకులకు ఎంతో ప్రతిభ ఉండాలి – అది మేఘనా కు ఉంది . సాంతం ఊపిరి బిగబట్టి చూసాను – సిబీఐ వాళ్ళంటే పోలీసులు ఎందుకు భయపడతారో ఈ సినిమా చూశా కే తెలిసింది .
    మీరన్నది నిజమే – ఆ పాత్రకు “టాబూ” అక్కరలేదు .
    ఒక మంచి సినిమాను మాతో పంచుకున్నారు – అభినందనలు.

    • mohan.ravipati says:

      మేఘనా గుల్జార్ ప్రతిభ ఆమె మొదటి సినిమా filhaal సినిమాలో నే తెలిసింది. సిబిఐ వారి దర్యాప్తు మన సాధారణ పోలీసుల తో పోల్చుకుంటే కొంత శాస్త్రీయంగా ఉంటుంది. అన్నది నిజమే కానీ దానిలో కూడా ఉన్న లొసుగులు మనకు తెలియనవి కావు. మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదాలు

  4. చూడాలి సినిమా అనిపించేట్లు రాశారు. నెట్ లో పెట్టినప్పుడు గుర్తుపెట్టుకుని చూస్తాను తప్పకుండా.. అభినందనలు మోహన్… మరిన్ని రాయండి

    • mohan.ravipati says:

      మీరు సినిమా తప్పనిసరిగా చూడండి. ఒక మంచి సినిమా అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు , మంచి సినిమా లు వచ్చినప్పుడు తప్పని సరిగా వాటి గురించి పంచుకొనే ప్రయత్నం చేస్తాను అండి

  5. dr. kodati sambayya says:

    ఈ సినిమా చూసిన రోజే ‘ నచ్చిన సినిమా ‘ గ్రూప్ లో పోస్ట్ చేశాను. నాకు అన్నింటికంటే మేఘనా గుల్జార్ దర్శకత్వ ప్రతిభ నచ్చింది. అనగనగా ఒక రాజు, అతనికి ఏడుగురు కొడుకులు చిన్నప్పటినుండి వింటున్నదే, అదే కథను కొత్త విధానం లో వింటే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంది.
    మంచి విశ్లేషణ చేశారు మీరు, అభినందనలు .

    • mohan.ravipati says:

      మేఘనా గుల్జార్ దర్శకత్వ ప్రతిభ , ఆమె మొదటి సినిమాతోనే అర్ధం అయ్యిందనే చెప్పాలి .మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు

  6. p v vijay kumar says:

    One of the best movies Indian cinema has ever seen in recent times. Irfan khan is amazing. Last scene on debate who is the murderer is very engaging. Must watch !!!

Leave a Reply to mohan.ravipati Cancel reply

*