ప్రియసఖుని గృహం…

 

కబీరు గీతాలు 

 

 

 

ఓ సఖుడా

నా పరిపూర్ణ ప్రియతముడు

ఉండే గృహానికి సాటిలేనే లేదు

అక్కడ

సుఖ:దుఃఖ్ఖాలు లేవు

సత్యాసత్యాలు లేవు

పాపపుణ్యాలు లేవు

అక్కడ రాత్రీపగలు లేవు,సూర్యచంద్రులూ లేరు

 

అక్కడ జ్ఞానము లేదు,ధ్యానమూ లేదు

మంత్రజపమూ లేదు తపస్సూలేదు

వేదగ్రంధోక్తుల ఉపదేశాలు లేవు

వ్యాపారనిర్వాపారాలు,పట్టువిడుపులూ

ఆ ప్రదేశములో అన్నీ క్షయమవుతాయి

గూడు లేదు

గూడు లేకపోవడమూ లేదు

అఖిలప్రపంచపు,సూక్ష్మ ప్రపంచపు అస్తిత్వమే లేదు

పంచప్రాథమికాంగాలు,త్రిత్వమూ రెండూ అక్కడ లేవు

సాక్ష్యంగా నిలిచే మ్రోగించని శబ్దధ్వని కూడా అక్కడ లేదు

వేర్లు లేవు పువ్వులూ లేవు కొమ్మా లేదు విత్తూ లేదు

చెట్టు లేకుండా ఫలాలు కాచాయి

ఆది ప్రణవనాదము,శ్వాసలో లీనమయ్యే సోహం

అవీ ఇవీ ఏవీ లేవు

శ్వాస కూడా పూర్తిగా అపరిచితం

 

ప్రియసఖుడు ఉన్నచోట ఏమీ లేవు

అంటున్నాడు కబీరు నేను తెలుసుకోగలిగానని

నేను తెలియపరచే సౌజ్ఞను చూసినవారు

ముక్తి లక్ష్యాన్ని చేరగలరు.

 

సేకరణ,అనువాదం:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

మీ మాటలు

 1. రాజేంద్రకుమార్ గారూ!
  అనువాదమే అయినా అచ్చు మీరు వ్రాసినట్టే వుంది మీ “ప్రియసఖుని గృహం”
  అద్భుతం! యింకా వ్రాయండి!
  మీ,
  రమణారావు!

 2. రాజేంద్రకుమార్ దేవరపల్లి says:

  ధన్యవాదాలు రమణారావు గారు.నేను అనువదించిన కబీరు గీతాలు సారంగ పత్రిక వారివద్దే ఉన్నాయి.వీలు వెంబడి వరుసగా ప్రచురిస్తారు.

మీ మాటలు

*