ఈ క్లాస్ మేట్స్ నేర్పే పాఠం!

~  కందుకూరి రమేష్ బాబు 

Kandukuri Rameshకుతూహలం.
అందరిలో ఉన్నదే.
ప్రతి ఒక్కరిలో వ్యక్తమయ్యేదే.
తనకంటే భిన్నంగా మరొకరు ఫలానా పనిని ఎలా చేశారా అన్న కుతూహలం.
అందరూ క్లాస్ మేట్సే.
లేదా స్కూల్ మేట్సే.
విద్యార్థులే. కానీ, తన తోటి విద్యార్థి గీసిన చిత్రాన్ని చూసే విద్యార్థుల్లో ఒక కుతూహలం.
అందరూ చిత్రిస్తారు.
కానీ ఒక్కొక్కరిది ఒక విధానం.
ఒకరు చిత్రించినాక దాన్ని ఒకరి కొకరు చూయించుకోవడంలో ఒక కుతూహలం.
చిత్రం.
ఒక సమూహం ఒక అరణ్యం.
అందులో అదృశ్యమవుతున్న మృగాన్ని చూయించడం ఒక చిత్రం.
మా వీధి మొదలులో కాస్త కాళీ ప్లేసు వుంటుంది. మూడు రూట్స్ కలిసే కూడలి అది.  మొదలులో ఒక  బోర్ వెల్ వుంటుంది. రెండు కిరాణా షాపులుంటాయి. చాక్ లెట్లో మరేదో కొనుక్కుని మళ్లీ స్కూలు బ్యాగులను సర్దుకుని పిల్లలు బడిబాట పడుతుంటారు. అక్కడ కాసిన్ని క్షణాలు ఆగుతారు. ఆ ఆగినప్పుడు తరచూ ఎదురయ్యే ఒక చిత్రం ఒకరికొకరు చూయించుకోవడం. అది తాము కొనుక్కున్న చాక్లెట్ కావచ్చు. లాగులో దాచుకున్న అప్పాలు  కావచ్చు, బ్యాగులో వుంచిన నోట్స్ కావచ్చు లేదా ఇలా టీచర్ కు  చూయించాలని వేసిన ఒక చిత్రమూ కావచ్చు. కానీ, ముచ్చటగా వుంటుంది. వాళ్లని చూస్తుంటే. వాళ్లు పరిశీలనగా ఆ చిత్రాన్ని చూస్తుంటే నాలోనూ ఒక కుతూహలం.
+++
మీరు నమ్ముతారో లేదో గానీ నాకూ చూయించాలని వుంటుంది.
నేను తీసిన ఒక ఛాయా చిత్రాన్ని తోటి ఫొటోగ్రాఫర్లకు చూయించాలని వుంటుంది.
జనారణ్యంలో మనిషి ఇంకా వున్నాడని తీస్తూ ఉంటాను కదా! వాటిని అందరికీ చూయించడం ఒకెత్తు. కానీ, నా తోటి ఫొటోగ్రాఫర్లకు చూయించాలని వుంటుంది. ఎందుకూ అంటే, మనందరం మామూలే అనుకునే మనిషిని నేను తీస్తూ ఉంటాను గనుక!
ఒక కుతూహలం. ఒకే తరగతిలో వుండే విద్యార్థుల మల్లే ఒకే ప్రొఫెషన్ లో వుండే విద్యార్థుల మధ్యా ఒక  కుతూహలం.
ఈ చిత్రం చూస్తుంటే నా చిత్రమే అనిపిస్తుంది. అందువల్ల కూడా కుతూహలం.
*

మీ మాటలు

  1. బాగుంది సర్ , ఎక్కడైనా సామాన్యమైన దృశ్యంలో విభిన్నత కనిపిస్తే , మీరైతే ఈ పాటికి ఫోటో తీసేసి ఉండేవారు అనిపిస్తుంది.

  2. చూసాం. మీ చిత్రం భలే బాగుంది. నావి కుడా చుబించాలని వుంది-సరే, ఎప్పుడో కప్పుడు చుబిస్తాను.

  3. kandukuri ramesh babu says:

    థాంక్ యు భవాని గారు.

  4. చందు - తులసి says:

    ఒకే తరగతిలో విద్యార్థుల మల్లే …అన్నారు.
    అలాగైతే మీ తరగతిలో మీరు ఫస్ట్ క్లాస్ లో పాసవుతారు.
    తోటి విద్యార్థులు మెచ్చుకుంటే కలిగే ఆనందం …
    ఎక్కడా దొరకదు.

  5. చిత్రమే కాదు రమేష్ గారు రాసిన అక్షర
    చిత్రాలను కూడా చూపించాలనుకుంటాం . ఒక మనిషి తానూ చేసిన పని ఇంకొకరి ఆమోదమో అంగీకారమో మెచ్చు కోలో కోరుకుంటాడు . బహుశా ఎంత పెద్ద రచయితయినా చిత్రకారుడైనా అంతేనేమో ఇది నా అభిప్రాయం. బాగుంది మీ జీవన దృశ్యం .

Leave a Reply to చందు - తులసి Cancel reply

*