(అంబేద్క) ‘ రైటేనా ఐలయ్య ‘ ?

 

-పి. విక్టర్ విజయ్ కుమార్ 

~

 

ఐలయ్య అంటే ఒక ధిక్కార స్వరం.  ఐలయ్య అంటే హిందూ బ్రాహ్మణ వ్యతిరేక గర్జన. ఇదే భావన ఈ వ్యాస కర్తతో పాటు ఎందరో ప్రజాస్వామ్య కాముకులను ఆయన విషయం లో ఆకట్టుకుంంటుంది.    ఐలయ్య రాసిన  Why I am not a Hindu, Buffalo Nationalism: A Critique of Spiritual Fascism.    మొదలైన పుస్తకాలు బ్రాహ్మణ హిందూత్వాన్ని నిలువునా ప్రశ్నించాయి. ఈ మధ్య కాలం లో ఐలయ్య రాస్తున్న వ్యాసాల్లో ఎన్నో   contradictions   కనిపిస్తున్నాయి. నిజానికి  – ఇంకా నిశితంగా చెప్పాలంటే , తెలంగాణా ఉద్యమం ఊపందుకున్నప్పటి నుండి తనదైన ప్రగతి వాద శైలిలో కాకుండా , భిన్న స్వరం తో వ్యాసాలు రావడం మొదలు పెట్టాయి. ఆయనకున్న తెలంగాణా వ్యతిరేకతను అటు ఉంచితే, దళిత సంక్షేమ వాదనలో కూడా తేడాలు కొట్టొచ్చినట్టు అగుపిస్తున్నాయి.

ఈ మధ్య తెలంగాణా రాష్ట్ర వ్యవస్థను దుయ్యపడుతూ, విప్లవ వాదుల  ‘ వరంగల్ డిక్లరేషన్ ‘ ను తప్పు పడుతూ ఇలా రాస్తాడు –

” ఇక్కడే కమ్మ క్యాపిటలిజంపై కోపం వెలమ భూస్వామ్యంపై ప్రేమ మార్క్సిజంగా మారింది. “ “ కమ్మ పెట్టుబడిపై మావోయిజానికి అంత కోపమెందుకొచ్చిందీ, వేలాది మంది చనిపోయినంక వెలమ ఫ్యూడలిజంపై ప్రేమ ఎందుకు కలిగింది? ”

ఈ వాక్యాన్ని – దళిత దృక్పథం  తో గమనిస్తే – పెట్టుబడుల్లో కమ్మ పెట్టుబడి తీరు, రెడ్డి పెట్టుబడి తీరు  లేదా అగ్ర కులాల పెట్టుబడులలో ఒక్కో కులం యొక్క పెట్టుబడి తీరు కేవలం వేరు అని కాక గుణాత్మకంగానే వేరు గా   ఉంటుందని చెప్పడానికి సిద్ధమైనట్టు తెలియ జేస్తుంది. పెట్టుబడుల్లో  అందులో అగ్ర కులాల పెట్టుబడుల్లో – కొన్ని ‘ మంచి పెట్టుబడులు ‘ , కొన్ని ‘ చెడ్డ ‘ పెట్టుబడులు ఉంటాయా ? బ్రాహ్మణియ మనువాద శక్తులు – ఈ దేశ కేపీటలిస్ట్ వ్యవస్థను ముట్టడి చేసాక , మీడీయా, ఎంటర్ టెయిన్ మెంట్, ఇంఫ్రాస్ట్రక్చర్ , రిటెయిల్ అని రంగాలలో  అగ్ర కుల పెట్టుబడులు దేశ వనరులను కొల్ల గొడుతున్నాయి. మన దేశం  జీ డీ పీ అభివృద్ధి లో దళితుల షేర్ ఎంత అని ప్రశ్న వేసుకుని , అగ్ర కులాలు , దళితుల షేర్ లో గేప్ – కనీసం 4 శాతంగా గుర్తించినా , 18 సంవత్సరాలలో , దళిత అగ్ర కులాల మధ్య ఆర్థిక అంతరం ఇప్పుడున్న దాని కంటే రెట్టింపు అవుతుంది ( ఇది ఇకనామిక్స్ లో సింపుల్ మేథ్  మేటికల్ ఫార్ములా  ).  ఇందులో – ప్రజాస్వామిక అగ్ర కులాల పెట్టుబడి వలన పెరిగిన అంతరం ఎంత ? అప్రజాస్వామిక  అగ్ర కులాల వలన పెట్టుబడి వలన జరిగిన అంతరం ఎంత అని చూడ్డం – దళిత దృక్పథాన్నే మార్చి చూడ్డం కాదా ?

అంబేద్కర్ ఈ దేశం గర్వించ దగ్గ మొదటి ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన కేపిటలిజం ను ఆర్థిక దృక్పథం తో చూడ్డం మాత్రమే అన్నిటికీ సమాధానం అన్న పిడి వాదాన్ని నమ్మలేదు. అలాగని – కేపిటలిజం లో మంచి కేపిటలిజం చెడ్డ కేపిటలిజం అని ఉంటుందని చెప్పలేదు.   ” Caste is nothing but a class enclosue ”    అని చెప్పిన అంబేద్కర్ , కేపిటలిజం ను సాంఘిక కోణం నుండి విశ్లేషించిన మొదటి సోషలిస్ట్ ఆర్థిక వేత్త. ( అంబేద్కర్ కోరుకున్నది  ” సోషలిస్ట్ డెమోక్రసీ ” అన్నది ప్రస్తుతం సబ్జెక్ట్ కాదు ఇక్కడ ).

” ఇక్కడే కమ్మ క్యాపిటలిజంపై కోపం వెలమ భూస్వామ్యంపై ప్రేమ మార్క్సిజంగా మారింది. ” అని రాస్తే  ఇలాంటి  ప్రవచనాలు ఏం తెలియ జెప్పుతాయి ? బ్రాహ్మణీయత ను విడదీసి – అందులో ఒకె మెతుకు ఏది ఎక్కువ, ఏది తక్కువ అని చూడ్డం వలన ఎవరికి ఉపయోగపడుతుంది ఈ భావజాలం ? రేపు కమ్మ వాళ్ళందరూ చేరి ” చూసారా ! ఐలయ్య లాంటి గొప్పోడే మా కేపిటలిజం పై కోపం తప్ప విప్లవానికి వేరే వ్యతిరేకత లేదు అంటున్నాడు. మేమెలాగైనా మంచోళ్ళే. ” అంటే ఏం సమాధానం నా లాంటి దళిత పక్ష పాతులు ఇవ్వగలరు ?

అన్నిటికంటే బాధాకరమైన ప్రవచనం ఏంటంటే – ” భారత దేశంలో భూస్వామ్య వర్గానికి కుల అణిచివేత స్వభావం ఎక్కువ ఉంటుందా, లేక పెట్టుబడిదారీ వ్యవస్థలో పనిచేసేవారికి ఎక్కువ ఉంటుందా?  ”

ఏంటి ఈ పోలిక ? ఎక్కడికి దారి తీస్తుంది ? ‘ ఎక్కువ ‘ అంటే ఎంత ? అసలు అణచివేసే దుర్మార్గుల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏంటి ?

ఇలా కాక కొన్ని అసంబద్ధమైన విశ్లేషణలు కూడా విరివిగా కనిపిస్తాయి. ” హైదరాబాదులోని పెట్టుబడి కోస్తా జిల్లాల్లోని ఆగ్రో ఎకానమిలోని సర్ప్లస్ ఆగ్రో ఇండస్ట్రీస్ గా  మారి గ్లోబలైజేషన్లో భాగస్వామ్యంగా ఎదుగుతున్నది. ”

నిజమే ! కోస్తాలో ఆగ్రో ఎకానమీ పెద్ద స్థాయిలో ఉంది. మరి ‘ సర్ ప్లస్  ‘ ఆగ్రో ఇండస్ట్రీ   definition   ఏంటి ? అంబేద్కర్ ‘ సర్ ప్లస్ మేన్ ‘ ‘ సర్ ప్లస్ వుమన్ ‘ అని ‘ సర్ ప్లస్ ‘ ను వాడ్డం జరిగింది కాని – ఒక పరి శ్రమనే ‘ సర్ ప్లస్ ‘ అనడం ఏ సూత్రం ? ఏ దృక్పథం తో అలా అనాలి ?

” మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెంది లేదా విప్లవాత్మక మార్పుకు గురై ఫ్యూడల్ వ్యవస్థ దెబ్బతిని లేదా దెబ్బతీయబడి పెట్టుబడి వ్యవస్థ వైపు ఉత్పత్తి శక్తులు పయనించడం సరైంది. గతితార్కిక సిద్ధాంతం ప్రకారం మార్పు ప్రక్రియ దాన్నే కోరుకుంటుంది ” – అంటూ ఒక చోట మార్క్సిజం గురించి ప్రస్తావిస్తాడు.   ‘సరైంది ‘ అంటే – అలానే ఉండాలి అనా   ? అలా ఉంటుంది అది అంతే అనా ? గతి తార్కిక సిద్ధాంతం దేన్నీ కోరుకోదు. వివరిస్తుంది.  గతి తార్కిక సిద్ధాంతం కులం ఎలా ఉంటుందో అది ఎలా విశ్లేషించాలో ఒక సూత్రాన్ని మనకు చెప్పొచ్చేమో అంతే కాని ఇలా కన్ ఫ్యూజ్  చేయదు. ఇంత సీరియస్ సబ్జెక్ట్ రాస్తున్నప్పుడు పద ప్రయోగం లో  ఇలా ఐలయ్య ఎలా ఫెయిల్ అవ్వగలడొ తెలీదు.

అంబేద్కర్ ఏమన్నాడో చూడండి –  ” It ( Democracy) has left the economic structure to take the shape given to it by those who are in a position to mould it ”   అన్న దృక్పథం తో ఐలయ్య చెబుతున్న దృక్పథం  తో పోలిస్తే ఎక్కడ సమన్వయం కుదురుతుంది ?

bhim-rao-ambedkar

ఇవన్ని ఇలా ఉండగా ” ఫ్యూడలిజంలో ఉత్పత్తి కులాలు పెత్తనం చెయ్యలేనట్లే, పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా అవి పెత్తనం చేయలేవు. కనీసం ఈ చిన్న రాష్ట్రపు ఎన్నికల రంగాన్నైనా ఒక సోషల్ డెమొక్రాటిక్ ఎన్నికల రంగంగా మార్చి కనీసం ఒక దళితున్నో, బీసీనో (ఏదో ఒక సిద్ధాంత పట్టుతోనే) ముఖ్యమంత్రిని చేసి ………”  ఇలా ప్రతిపాదనలు కనిపిస్తాయి.  ఎన్నికల రంగాన్ని మాత్రమే సోషల్ డెమోక్రటిక్ రంగంగా మలచడం ఏంటి ? బ్రాహ్మణిజం ను ఎదుర్కోవడం ఒక రంగానికి మాత్రమే సంబంధించిన విషయమా ?  అంబేద్కర్ ఈ విషయం లో ఏమన్నాడో  చూడండి    ” … Constitutional Lawyers have been dominated by the antiquated conception that all that is necessary for perfect constitution for democracy was to frame a Constitutional Law. Consequently almost all Laws of Constitution, which relate to countries whic are called Democratic, stop with Adult Suffrage and Fundamental RIght. They have never advanced to the conception that Constitutional Law of Democracy must go beyond Adult Suffrage and Fundamental RIghts ”    ఇంత చక్కటి క్లారిటీ అంబేద్కర్ కుంది. ఆయన ఆలోచనా విధానాన్ని ఇలా అసౌష్టవంగా  చూపించడం దేనికి ?

ఐలయ్య గొప్ప దనం ఐలయ్య లో  కొంత ఉంది. అసలు గొప్ప దనం అతని వాదనకు ప్రత్యామ్నాయంగా నిలబడాల్సిన చిత్తశుద్ధి కలిగిన ఉద్యమాలలో అగ్ర స్థానం లో ఉండే విప్లవ సంస్థ ల్లో ఉండే బలహీనత వల్ల ఉంది.   వి ర సం లాంటి సంస్థలు – చలం, గురజాడ కు జరిపిన వేడుక సభలు – జాషువా , అంబేద్కర్ కు ఎన్ని జరిపారు ?  జాషువా గొప్ప ‘ ప్రతిభ ‘ కల్ల వాడు కాకపోవచ్చు వాళ్ల దృష్టిలో. కాని దళిత కుటుంబం నుండి వచ్చి – బ్రాహ్మణియ సాహితీ వ్యవస్థలో తిష్ట వేయడాన్నైనా అభినందించరా ? ఏదో ఒక సభలో కనీసం టేబుల్ మీద ఆయన ఫొటో పెట్టి నివాళులు అర్పించడానికి కూడా అంబేద్కర్ సరిపోడా వి ర సం దృష్టిలో ? ఐలయ్య మార్క్సిజం కు వ్యతిరేకంగా  మాట్లాడి ఉండవచ్చు కాని – ఆయనపై హిందూ మత తత్వ సంస్థలు పోలీసు కేసు పెట్టినప్పుడు  మద్దతు ప్రకటించిన విప్లవ సంస్థలు, విప్లవ సభ్యులు ఒక్కరన్నా ఉన్నారా ?  కాల్బర్గీ హత్య పై మాత్రం అంత స్పందన ఎలా సాధ్యం ? కర్నాటక లో ఉన్న కాలబర్గీ ఎవరో కూడా – ఈ విప్లవ సంస్థలకు తెలీదే ?  పక్కనే ఉన్న ఐలయ్యకు నామ మాత్రంగా అయినా మద్దతు తెలపడానికి ఏ ఇగో అడ్డొచ్చింది ? ఇలాంటి  behaviour  దళితుల్లో,  ముఖ్యంగా ఎడ్యుకేట్ అయిన దళితుల్లో   confidence  నింపలేకపోతుంది.

MRPS  జెండా పట్టి , కుమ్మక్కు రాజకీయాల్లో ఇమడ లేక వీధిన పడ్డ దళితులున్నారు.  చుండూరు ఉద్యమం లో అన్నీ వదిలేసి , దళితుల పై ప్రేమతో ఉద్యమ బాట పట్టి కెరీర్ లను , కుటుంబాలను నష్టం చేసుకున్న దళితులున్నారు. తెలుగు దేశం, ప్రజా రాజ్యం లాంటి అగ్ర కుల బ్రాహ్మణీక పార్టిలు ఈ ఉద్యమాలను వాడుకుని వదిలేస్తే , దిక్కు తోచక సరి అయిన సైద్ధాంతిక ఆచరణ ఏంటొ తెలియని పరిస్థితుల్లో దళితులు చేరి – ఎవడో ఒకడు మనోడు, ఎక్కడొ ఒక చోట, ఎలాగోలా ఉంటే పర్లేదులే అన్న ‘ రాజీ భావన ‘ కు వచ్చారు. చివరికి దళిత దృక్పథం సరి అయిన నాయకత్వం లేక ‘ రాజీ సిద్ధాంతాలతో ‘ బతుకుతుంది. ప్రతి ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని  paranoic (అంటే విషయాన్ని తెలీని అనుమానం తో చూడ్డం)  గా చూడ్డం మొదలయ్యింది. ఇదే ‘ రాడికల్ దళిత వాదంగా ‘ చలామణీ అవుతూ మధ్య తరగతి దళితుల మన్ననలు పొందుతుంది.    ఐలయ్యలా  అక్కడో ఇక్కడో – ఒకటి రెండు అగ్ర కులాలను తిడుతూ – ముఖ్యంగా వెలమ కులాన్ని, ఒకటి అర కులాల్ని ఇదే  paranoic  ధోరణి తో దుయ్య బడితే అది దళిత వాదం అయిపోదు. అంబేద్కర్ చెప్పిన బ్రాహ్మిణిజం ను  letter and spirit  లో అర్థం చేసుకున్న రోజు ఇలాంటి ప్రమాదాలు నివారించ వచ్చు.

ఐలయ్య దుర్మార్గుడు అని చెప్పడం కాదు ఇక్కడ. చారిత్రక నేపథ్యం లో అగ్ర కుల  రాజకీయాలు, దళిత రాజాకీయాలను ఎలా ధ్వంసం చేసాయో గమనించి, ముందుగానే    early symptoms    కోసం గమనించి    cautious   గా ఉండమని చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

*

మీ మాటలు

 1. BUCHI REDDY GANGULA says:

  మా జిల్లా మేధావి

  మతం–కులం — అ రోజుల్లో దొర ల పెత్తనాలు — నాడు –నేడు — వ్యవస్థ తిరు — రాయడం
  చదివాను —-వారి ఒపినిఒన్స్ తో ఎకబవిస్తాను — కాని — యీ మధ్య రాతల్లో — మాటల్లో
  తేడా కనిపిస్తుంది — మొన్న వారు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ –M.L.A. ల మీటింగ్ లో
  మాట్లాడటం —శోచనియెం
  దేశాన్ని –యి స్థితి కి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్లస్ నెహ్రు గారి ఫ్యామిలీ —

  తనను ఎవరు పట్టించుకోవడం లేదన్న — మరియు తెరాస ప్రబుత్వం గుర్తించడం లేదన్న
  —- యివి వారి మనసులో ఉన్నట్టు అనిపిస్తున్నాయి

  కుమార్ జి — చక్కగా రాశారు సర్

  ———————————————–బుచ్చి రెడ్డి గంగుల —————————————-

 2. Wilson Sudhakar says:

  vijay gaaru mella mellagaa meeru dalita vyatirekigaa maari marokari chetullo paavuggaa maaripotunnaaru. meeru virasamlO chere samayam vacchesindi. dalita padavani vadileyyandi.meekoo manchi. maakoo manchidi.

 3. p v vijay kumar says:

  Wilson garu, namaste !

  MRPS and post-Tsunduru movements have not lived up to the expectations of Dalits. There is one more digression and beguile routing on avil. Thats what my sense of reading. If Dalits go blind with ” pranoic theories “, take it from me….sure they wil fumble in bringing up Dalit cause. I hav no fancy for organisations of Virasam as long as they sont furnish apt answers to question of Dalits. Hope u must hav read this para also in my article.

     వి ర సం లాంటి సంస్థలు – చలం, గురజాడ కు జరిపిన వేడుక సభలు – జాషువా , అంబేద్కర్ కు ఎన్ని జరిపారు ?  జాషువా గొప్ప ‘ ప్రతిభ ‘ కల్ల వాడు కాకపోవచ్చు వాళ్ల దృష్టిలో. కాని దళిత కుటుంబం నుండి వచ్చి – బ్రాహ్మణియ సాహితీ వ్యవస్థలో తిష్ట వేయడాన్నైనా అభినందించరా ? ఏదో ఒక సభలో కనీసం టేబుల్ మీద ఆయన ఫొటో పెట్టి నివాళులు అర్పించడానికి కూడా అంబేద్కర్ సరిపోడా వి ర సం దృష్టిలో ? ఐలయ్య మార్క్సిజం కు వ్యతిరేకంగా  మాట్లాడి ఉండవచ్చు కాని – ఆయనపై హిందూ మత తత్వ సంస్థలు పోలీసు కేసు పెట్టినప్పుడు  మద్దతు ప్రకటించిన విప్లవ సంస్థలు, విప్లవ సభ్యులు ఒక్కరన్నా ఉన్నారా ?  కాల్బర్గీ హత్య పై మాత్రం అంత స్పందన ఎలా సాధ్యం ? కర్నాటక లో ఉన్న కాలబర్గీ ఎవరో కూడా – ఈ విప్లవ సంస్థలకు తెలీదే ?  పక్కనే ఉన్న ఐలయ్యకు నామ మాత్రంగా అయినా మద్దతు తెలపడానికి ఏ ఇగో అడ్డొచ్చింది ?

  This is an article on Ambedkar Vs Ilaiah. It equally blames who causes glory to insipid theories. If Ilaiah or anyone go above Ambedkar and Dalits do not notice it, that would be the last day Dalits imagination of casteless soceity gets totally drowned.

 4. kurmanath says:

  సుధాకర్ గారూ,
  ఆయన ఐలయ్య మీద చేసిన విమర్శలు తప్పయితే ఎలా తప్పో చెప్పండి. అందరికీ ఉపయోగపడుతుంది.

  ఆయన ఇదే వ్యాసంలో విరసంపై చేసిన ఆరోపణలు చదవలేదా మీరు?

  • Wilson Sudhakar says:

   కూర్మనాధ్ గారు,
   అయిలయ్యగారు దళిత దృక్పథంతో దళితులకు అనుకూలంగా తన వాదనలు వినిపిస్తున్నారు. హిందూ శక్తులతో యుద్ధం చేస్తున్నారు. ఆయన దళితులకు మిత్రుడు. దళితులపై అత్యాచారాలు జరిపినప్పుడల్లా సైద్ధాంతికంగా ఆయన తన వాణిని వినిపిస్తున్నారు. ఇక్కడ కనిపించకుండా పోయేది మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలే. బీసీలు ముస్లింలు అయినా మాతో కలిసి వస్తారుగానీ మీకు సభ్యత్వం ఉన్న సంస్థలు గొంతు వినిపించవు. వచ్చినా ఏదో మొక్కుబడే. ‘ మేము ఖండించాము కదండీ ‘ అని తప్పుకుంటారు. గట్టిగా నిలదీస్తే ‘ మీకోసం మాట్లాడేవాళ్ళు చాలామంది వున్నారు కదా’ ని చక్కగా తప్పుకుంటారు. అంచేత అయిలయ్యగారిమీద విజయ్ గారి దాడి మాకు అభ్యంతరకరమే. విజయ్ గారికి లోతు తెలియదు. అదీ సమస్య. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలపై అయిలయ్యగారు విమర్శలు చేసారుగనక, వాటిని విజయ్ గారు ఎదుర్కొంటున్నారు గనక విజయ్ పట్ల మీకు సుహృద్భావం. ఒక దళితుడిని మరొక దళితుడు కత్తితో పొడుస్తుంటే ఇద్దరిలో ఒకరికి మీమద్దతు. మేమలా చూస్తాం. ఒక పక్క గొడ్డుమాంసం సమస్యలు, మరొక పక్క గుడిలోకి వెళ్ళినందుకు దళితుల నరికివేతలు కనబడుతున్నా అర్జెంట్ గా అయిలయ్య గారిమీద ఇప్పుడు ఎందుకు దాడి చెయ్యాలి? బయట వాళ్ళతో గెలవలేక ఇంటికొచ్చి పెళ్ళాన్ని చితకబాదినట్లుంది విజయ్ గారి ధోరణి. మీ ధోరణి తోటి కోడలు నవ్వినట్లుంది. మిమ్మల్ని అయిలయ్యగారు విమర్శిస్తే విజయ్ గారు అడ్డుకున్నారు. అదీ అసలు కథ. అదీ విజయ్ పట్ల మీకున్న ప్రేమ. ఎదటివాళ్ళు అయిలయ్యగారిని కాల్చడానికి తన భుజాన్ని వాడుకుంటున్నారని విజయ్ కు తెలియదు. తెలిసినా ఆయన ఇప్పుడు స్పృహలో లేరు. అదీ కథ. ఇందుకు అంబేద్కర్ వాదనలను అడ్డం పెట్టుకోడం శోచనీయం.

 5. p v vijay kumar says:

  ఐలయ్య వాదనలో దళిత సంక్షేమం నెమ్మదిగా కొరవడ్డం జరుగుతుంది. తెలంగాణా వ్యతిరేకించడం, దానికో సైద్ధాంతికత ను కృత్రిమంగా సృష్టించడం – దాని కోసం దళిత దృక్పథం ను ముడిపెట్టడం అంబేద్కర్ ఆలోచనలకు పూర్తిగా భిన్న రూపము.

  అంబేద్కర్ చిన్న రాష్ట్రాలను సపోర్ట్ చేసాడు. రాష్ట్రాలు విడిపోతే వచ్చే అపాయమేంటో అంబెద్కర్ కు తెలీక చిన్న రాష్ట్రాలను సపోర్ట్ చేయలేదు ( లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని , అవి ఎలా జాగర్తగా డీల్ చేయాలో కూడా చెప్తాడు. ప్రస్తుతానికి ఆ పాయింట్ వేరే చోట చర్చిద్దాం) .

  How can communal majority run away with the title deeds given to a title deeds given to a political majority to rule ? …(continues)……..What is the remedy ? No doubt some safeguards against communal tyranny are essential. The question is what can they be ? THE FIRST SAFEGUARD IS NOT TO HAVE TOO LARGE A STATE. THE CONSEQUENCES OF TOO LARGE A STATE ON THE MINORITY LIVING WITHIN IT ARE NOT UNDERSTOOD BY MANY . ( including Ilaiah ??? ) . The larger the state, the smaller the proportion of the minority to the majority… ఇంకా ఇలా వివరిస్తాడు A small stone of a consolidated majority placed on the chest of minority may be borne. But the wieght of the huge mountain, it cannot bear. It will crush the minorities. Therefore, creation of smaller states is a safeguard to the minorities ”

  అంబేద్కర్ మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కావాలన్నప్పుడు , ఈస్ట్ ఇండియా కంపనీ అండదండలతో పైకొస్తున్న గుజరాత్ బనియా అగ్ర కులం ఎదిగే అవకాశాలను మహారాష్ట్ర బ్రాహ్మణ కులం తకెఒవెర్ చేస్తుందని చెబుతూనే – బోంబే తో కూడిన మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని ప్రతిపాదించాడు. అంతే కాని , బ్రాహ్మణ కేపిటలిజం మీద ప్రేమతో , బనియా కేపిటలిజాన్ని వ్యతిరేకించలేదు.

  ఐలయ్య ఈ SPirit కు భిన్నంగా తెలంగాణా విడిపోవడం దళిత వ్యతిరేక వాదనగా చిత్రీకరించడం అపాయకరంగా అనిపిస్తుంది. వెలమ కులానికి ( గూజ్రాత్ బనియా కులానికి ) వ్యతిరేకంగా కమ్మ కులాన్ని పెట్టి ( మహారాహ్ట్ర బ్రాహ్మణ కులం ) , కమ్మ కుల స్వామ్యం ‘ బెటర్ ‘ అని చెప్పే ప్రయత్నం ఏ రకంగానైనా – అంబేద్కర్ వాదన కాదు, కానేరదు. అగ్ర కుల స్వామ్యమే అప్రజాస్వామికం. అందులో కమ్మ, వెలమ వేరు చేసి – కమ్మ కులాన్ని మాత్రమే సపోర్ట్ చేయడం లో ఏదన్నా మతలబు ఉందా అని కూడా మనం ఆలోచించడానికి వెనుకాడ రాదు.

  అంతే కాక – రాజ్యాంగం లో ఆర్టికల్ 3 ప్రత్యేకంగా ప్రతిపాదిస్తాడు అంబేద్కర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించాలి, దాని ప్రకారమే మనం నడుచు కోవాలి అని చెప్తూనే ( సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించడానికి ఎన్నో కారణాల్లో ఇది కూడా ఒక ప్రధాన కారణం ) , ఆర్టికల్ 3 spirit ను ఐలయ్య వ్యతిరేకించడం చాలా విస్మయాన్ని కలుగ జేస్తుంది.

  ఈ వ్యాసం – ఐలయ్య ప్రపంచం లో ఎవర్నీ విమర్శించినా, దేనితో విభేధించినా – పేచీ పడదు. కానీ అంబేద్కర్ spirit ను అంబేద్కర్ దృక్పథాన్ని వ్యతిరేకించడం మాత్రం నిర్మొహమాటంగా తప్పు పడుతుంది. ఇంకో MRPS దగా, ఇంకో చుండూరు ఉద్యమ గందరగోళం జరక్క ముందే, ఖచ్చితంగా దళితులను అలర్ట్ చేయాలని కోరుకుంటుంది.

  ( మావోయిస్టులు మాత్రం దళితులను మోసం చేయట్లేదా అన్నది వేరే ప్రశ్న. అది ఈ వ్యాసం – అంబేద్కర్, జాషువా లపై చిన్న చూపుతో వ్యవహరించడం లో విప్లవవాదుల సంస్కృతి ని తప్పు పడుతూ, ఒక భూతం మీద కోపం తో ఇంకో భూతాన్ని ఊహించి ప్రేమించడం కరెక్ట్ కాదు అని చెప్పడం దగ్గర ఆగిపోతుంది. మావోయిష్టుల అగ్రకుల ధోరణుల పట్ల ప్రత్యేకంగా చర్చ చేయదల్చుకుంటే – వ్యాస కర్తను Consult చేయవచ్చు. లేదా తదుపరి ఆర్టికల్ కోసం వేచి చూడవచ్చు. )

 6. johnson choragudi says:

  1. డా. అంబేద్కర్ రాజ్యాంగం నుంచి ఒక పబ్లిక్ పాలసీని మన దేశంలోని సివిల్ సొసయిటీ ఇప్పటివరకూ ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయింది? అది వుండి వుంటే 5 యేళ్ళ మార్పులతో పని లేకుండా సామాజిక – ఆర్ధిక రంగానికి ఒక మాన్యువల్ వంటిది వుండేది కదా?
  2. అప్పుడు ఏ అధిపత్య కులం లో ఎంత మేర మన పబ్లిక్ పాలసీ అమలయింది అనేదానికి ఒక కొలమానం వుండేదికదా, ఇప్పుడు అటువంటిది లేదుకదా?
  3. మార్క్స్ ను – డా.అంబేడ్కర్ ను ఇప్పుడు మనం మనమున్న కాలంలోనుంచి చూడాలా? లేక ఆయన జీవించిన కాలం లోనుంచి చూడాలా?
  4. డా.అంబేడ్కర్ కు కాన్షిరాం కు మధ్య వున్న – మండల్ ను మనం గుర్తిస్తున్నామా? అస్సలు ఆ ఫాక్టర్ మనం ఎంతవరకు పట్టించుకున్నాం?
  5. సబాల్టర్ వర్గాలు, తమ కల్చరల్ ప్రతినిధులను సవర్ణ వర్గాలు గుర్తించాలి లేదా గవురవించాలి అని కోరుకోవడం దేనిని సూచిస్తుంది? వాళ్ళు ఆపని చేయకపోవడం దేనికి సూచన?
  6.పబ్లిక్ పాలసీ లేకపోవడం వల్లనే ఐలయ్య ఇంకా అటువంటివారు ఎందరికో జీవిత కాలమంతా – పునాదులు వద్ద నిలబడి మాట్లాడుకొవడమే సరిపోతున్నది.
  7. పర్వతాన్ని లక్ష్యం చేసుకున్న ఐలయ్య తన ఆయుధానికి ఒక్కొసారి ఒక్కో వులిని పెట్టి డ్రెడ్జింగ్ మొదలుపెడతాడు. కొన్నిసార్లు బయినాక్యులర్స్ మారుస్తాడు. లేదా తను నిలబడిన స్తానాన్ని మారుస్తాడు. కలిసి వచ్చే వాళ్ళువున్నా లేకపోయినా పని మాత్రం ఆపడు. యేమిటి ఇదంతా అంటే – పర్వతానికి బీటలు తేవడమే..

  • p v vijay kumar says:

   చాలా valid questions వేసారు. అన్నిటికీ ఒక్కొక్కటిగా సమాధానం ఒకే సారి ఇవ్వడం – ఇక్కడ స్థలాభావం ఉంది. వీలైతే తప్పకుండా ఇంకో వ్యాసం రాస్తాను. మీకు వీలైతే reach me in my FB inbox and we can chat leaisure at each and every point clearly . ప్రస్తుతానికి – ఈ వ్యాసం ఒక అలర్ట్ మాత్రమే. దగా పడుతున్న దళితులకు ఒక సువార్త ప్రచారం చేయడం లా మాత్రమే. I know Ilaiah has been standing as an unparallel and unquestionable Dalit icon. I have a serious issue too on why revolutionary and progressive writers not supported him when he was facing police charges by RSS etc. ? ఎట్టి పరిస్థితుల్లో – కమ్మ పెట్టుబడి , వెలమ ఫ్యూడలిజం కంటే బెటర్ లాంటి వాదనలు ఎవరు చెప్పినా నమ్మ వద్దు అని నా విఙ్ప్తి. ఇది అంబేద్కర్ స్పూర్తికి పూర్తిగా విరుద్ధం. ముందుకెళ్ళి మహారాష్ట్ర బ్రాహ్మణులకు సహాయం చేయడానికి , గుజరాత్ బనియాలను అంబేద్కర్ తృణికరించాడు అనే ఘాతుకమైన ఆరోపణ కు దారితీస్తే – మన దళిత సోదరులు అవాక్కవ్వడం ఒకటే మిగుల్తుంది. Organisation structure లో లేని వాళ్ళు unsystemtic గా చర్చలు చేస్తున్నప్పుడు మొట్ట మొదటిగా అలర్ట్ అవ్వాలింది మనమే ! ఇది ఒక గమనం లో ఉంచుకోండి. నేను ఏ మొహమాటం లేకుండ చెప్పడం ఏంటంటే – ఇప్పట్లో నిజాయితీ తో కూడిన ఆత్మ విమర్శ , పబ్లిక్ గా విప్లవ సంస్థల నుండి వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. వాళ్ళు – ఇంకా చలం, గురజాడ నే హీరోలు అనుకునే స్టేజ్ లోనే ఉన్నారు. Dalit perspective will soon take over every inch of right people movement, if not now – tomorrow.

 7. SreenVass ChandrGiri says:

  గొడ్డు మాంసాన్ని ఇష్టంగా తినే కంచ అయిలయ్య గారిని కూడా దళిత వ్యతిరేకి అంటే ఎలా..

 8. p v vijay kumar says:

  ఆయన దళిత వ్యతిరేకి అనేది ఇప్పట్లో conclude చేయాలంటే ఇంకా sufficient evidence కావాలి సర్…:)…..ఆయన అంబేద్కర్ స్ఫూర్తిని, సిద్ధాంతాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నాడు అన్నది మాత్రమే ఇక్కడ సబ్జెక్ట్. ఇకా ఆయన గొడ్డు మాంసం ను ఇష్ట పడ్డం విషయానికొస్తే – ఆనంద దాయకమే ! – ఈ హిందూ మూర్ఖ ఛాదస్తాన్ని ఎదుర్కోవాలంటే – మనమేం తింటున్నామో కూడా campaign చేసుకోవాలి ఇక…. :)

 9. p v vijay kumar says:

  విల్సన్ గారు ! విరుచుకు పడ్డారు కదా ?!….:) :)
  నా disclaimer : నాకు కూర్మనాథ్ కు – ఒక సారి సుమారు ఐదు – పది నిమిషాల పాటు రంగ నాయకమ్మ లాంటి విచిత్ర వ్యక్తుల గురించి కొంత పిచ్చాపాటి, మా కాలేజ్ సీనియర్ కు మితృడిగా ఇంకో సారి, ఒక సారి అంబేద్కర్ రచనల పట్ల ఒక పది నిమిషాల చర్చ, కొంచెం ఫేస్ బుక్కులో General లైకులు, కామెంట్లు, విప్లవ సంస్థల తీరుపై ఫేస్ బుక్కులో గొడవ తప్ప – ఎటువంటి సంస్థాగతమైనా లేదా వ్యక్తిగతమైన అనుబంధాలు లేవు. I have quite differed with him and his friends on the marxist practice .

  సర్…- నేను ఏ అగ్ని పరీక్షకు గురి అవ్వను ?…:)

  Seriously, I need to Thank you that you hav a concern on me and my approach if it is divergent to Dalit perspective .

 10. kurmanath says:

  సుధాకర్ గారూ,
  మీ సందేహాలు తీరేయా? ఆయన ప్రభావంలో పడి నేను అంబేడ్కరైట్ అయిపోతానేమో కానీ ఆయన విరసంలోకి వచ్చే అవకాశం లేదు. ఆయన అంత తీవ్రమైన విమర్శలు చేరే మొహంతోనే చేస్తారా?

 11. johnson choragudi says:

  అలాగే… ధన్యవాదాలు.

 12. johnson choragudi says:

  మొన్న మిస్ అయిన 8 వ ప్రశ్న ఇది – ‘మహారాష్ట్ర లో 2005 తరవాత పలు కారణాలతో నూలు మిల్లులు వరసగా మూతపడ్డాయి. వాటిలొ పనిచేస్తున్న కార్మికుల యూనియన్లలో అంబేద్కర్ స్తాపించిన – ‘రిపబ్లికన్ పార్టీ’ వర్కర్స్ యూనియన్ కూడా వుంది. అప్పుడు వీరు ఏమిచేసారు? ‘శివసేన’ పార్టీ ట్రేడ్ యూనియన్ లో చేరారు.’

  కనుక మీరంటున్న – దళిత సోదరులు అవాక్కయే పరిస్తితులు వున్నాయి, వుంటాయి కూడా. ఎప్పుడు – ఆలోచనాపరులు సంస్తాగత నిర్మాణాలకు పరిమితమయినప్పుడు.

 13. p v vijay kumar says:

  I am proud of my dalit brethern who has shown restraint on oppisite views unlike any other impatient progressives bitten by brahminical bug. The approach is highly exemplary in getting involved in debating with minimal personalisation of arguments. Whatever minimal deviations in an anxiety to prove a point for a cause but not for a personbis understandable. Keep reading Ambedkar as much as you can. Marx cannot be interpreted neither in caste, nor in class, nor in gender, nor in religion in India without knowing approach of Ambedkar.

 14. ఐలయ్యగారి మిగతా వాదాల జోలికి వెళ్లకుండా ”ఇక్కడే కమ్మ క్యాపిటలిజంపై కోపం వెలమ భూస్వామ్యంపై ప్రేమ మార్క్సిజంగా మారింది.“, “కమ్మ పెట్టుబడిపై మావోయిజానికి అంత కోపమెందుకొచ్చిందీ, వేలాది మంది చనిపోయినంక వెలమ ఫ్యూడలిజంపై ప్రేమ ఎందుకు కలిగింది?” అనే ఆయన మాటలను చూస్తే నాకైతే ‘కమ్మ క్యాపిటలిజమైనా, వెలమ క్యాపిటలిజమైనా ఒకటే’ అనే అర్థమే గోచరించింది కానీ రెండూ వేరు వేరు అనే అర్థం కనిపించలేదు. విప్లవవాదులు కమ్మ క్యాపిటలిజంపై కోపాన్ని ప్రదర్శిస్తూ, వెలమ క్యాపటలిజంపై ప్రేమను కనపరుస్తున్నారనీ, ఇది అవాంఛనీయమనే కోణంలో ఆయన రాశారనేది నేను అర్థం చేసుకున్న విషయం.

Leave a Reply to johnson choragudi Cancel reply

*