ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
హ్మ్మ్.. అంత ఘోరం.. నిజంగానే భయమవుతోంది.. మురికివాగుల్లో కొట్టుకుపోయే పిల్లలూ.. రాజ్యపు పందికొక్కులు తినేస్తున్న శిశువులూ , కనబడని జైళ్ళల్లో మగ్గుతున్న జర్నలిస్టులూ.. దెయ్యాలు వల్లిస్తున్న వక్రీకరించిన వేదాలూ.. నిజంగా భయమవుతోంది..
అవును సార్ భయమవుతున్నది…
శునకమరణం పాలవుతామని…..
కానీ శునకం కూడా ప్రతిఘటించునన్న సంగతి మరచి….
గుంట నక్కల్లా గోతుల్లో దాచుకుని బతకాల్సి వస్తుందోనని ……..భయం భయం…..
యోనుల్లో బాయొనెట్లూ చితికి రక్తం చిమ్ముతున్న పురుషాంగాలు. హత శరీరాలపై హెచ్చరికలు స్రవిస్తున్న క్రూరఘోరకర్కశగాయాలు. భయమైపోతున్నది. రాజ్యము బలమూ మదమూ నీవే నీవే. మరియూ మతమూ నీవే. టూ బీ వెరీ క్లియర్ బోత్ రెండూ నీవే.
ఈ ఒక్క లైన్ చాలు కదూ మన బ్రతుకు కూపాలలో జీవితం ఎంత మిగిలిఉందొ చెప్పడానికి .
భయపీడిత ప్రాణాల మధ్య మీగుండెల్లో మిగిలిఉన్న ఆ కాస్త ధైర్యాన్ని మాకందించినందుకు ఒకపెద్ద హార్టీ హాగ్ Arun Sagar జీ . ఈవాక్యాలు చదివాకా ఇంకో వందమంది కవులు వంద సార్లు సొసైటీ ని మోసం చేసినా సౌ ఖూన్ మాఫ్ చేసేంత ఉపశమనం .
“లాగి ఒక్కటి పీకితే భయం దెయ్యం వదిలినట్టు వదుల్తది.. భయం ఈజ్ నాట్ ఎటర్నల్.” – ఇది రాయకుండా ముగిస్తారేమో నని భయపడి చచ్చాను, అమ్మయ్య, భయం దెయ్యం వదిలించే మార్గం చూపించారు,
భయమైతున్నది ప్రభూ. యోనుల్లో బాయొనెట్లూ చితికి రక్తం చిమ్ముతున్న పురుషాంగాలు. హత శరీరాలపై హెచ్చరికలు స్రవిస్తున్న క్రూరఘోరకర్కశగాయాలు.
ఆది యందు కవి వాక్యము భయప్రేలాపితమైనుండెను. అంతమునందు కవి వాక్కు ఫిరంగిధ్వానము వలే పేలుచున్నది. “లాగి ఒక్కటి పీకితే భయం దెయ్యం వదిలినట్టు వదుల్తది.. భయం ఈజ్ నాట్ ఎటర్నల్.” ఇప్పుడు భయపడ్డ మార్జాలం నేత్రాలు యుద్ధ టాంకుల వలే మెరయుచున్నవి. అసహ్యకరమైన శతృవా! ఏదో ఒకనాటికి నీకు శునకమరణము తప్పదని ఈనాటి ఘటనలు ఏదో ఒక మేరకు హామీ ఇచ్చుచున్నవిలే.
bhayapadaalannadi vaari aim kaavatchu.. kaani bhayam taatkaalikam and vjm saswatam
ఇన్ కంటిన్యుయేషన్ భయమేస్తోంది బతుకును చించేస్తున్న శునక రాజములను చొచ్చొ అనడానిక్కూడా భయమేస్తున్నది ఇది నరకానికి దారి అని తెలిసీ బయటికి చెప్పడానికి బయమేస్తున్నది రాజ్యం హస్తినలోనే వుంటుందనే భైరవ రాగాన్ని కాదనాలనినచో రోడ్డు మీద దాని చొక్కా పట్టి నిలదీయాలనినచో చాల భయమేస్తున్నది నాకేవేవో ఎరలేసే టీవీ ఛానల్లో రాజ్యముందేమో కుంచెం మేజా బల్ల కింద చీకట్లో చూస్తాన్రా ఫ్యాషన్ నిపుణ ధురీణా అని అడగడానికి అడిగి బల్ల మీద బట్ట కాస్త పైకెత్తి అక్కడి నెత్తుటి మరకలు ఏ నాగరికతా దురాక్రమిత అడవులవో అడివి జనులవోనని అనుమానించడానికి కూడా చాలంజాల భయమేస్తున్నది మేల్కొల్పడం కష్టమే నిదుర నటనా సమర్థులను పసి గట్టి ఎదిరిందాలంటే భయం లేనోళ్ల మధ్య చేరిన వున్నోడి పార్శ్వాలను పసి గట్టినా నా లేనోడి పిరికితనాన్ని దాటి హెచ్చరించాలంటే చాల చాల చాలంజాల భయమేస్తున్నది ఎన్నో సీసా ఎన్నో పెగ్గులో రాలి పడిన నిష్క్రయాశ్రుకణమిది యని నన్ను నేను అడగడానికి భయమేస్తున్నది వదలండిరా పిల్లల్ని వాళ్లేం చేయాలో వాళ్లను యోచించుకోనివ్వండని అటు ఇటు ఒకే సారి చెప్పడానికి చెప్పి చెప్పిన చోట నిలబడడానికి భయంకరమైన భయమేస్తున్నది భయమేస్తున్నది ఇళ్ల నిండా వీదులు నిండా వార్తల నిండా వార్తా చిత్రాల నిండా కొట్టివేయబడుతున్న చెట్ల కొమ్మల నిండా మనిషిని కాపాడాల్సిన అక్షరాల నిండా పరుచుకుంటున్న హిపోక్రిటికల్ ఎగ్జోర్ఠేషన్లంటే ఇవాళెందుకో భూగోళమంత భయమేస్తోంది
అరుణ్, చాలా గొప్పగా వుంది, ఈ ఆగ్రహ ప్రకటన.
భయమో, ఖేదమో, నిరాశో కలగడం లేదిది చదువుతుంటే. ఈ వ్యాక్యాలు భయం గురించి కాదని, భయపడడం గురించి కాదని తెలుస్తూనే వుంది. మా అందరి, మన అందరి pent up క్రోధాల గురించి.
వేల తల్లుల, తండ్రుల, తమ్ముళ్ళ, చెల్లెళ్ల, అక్కల హృదయాలను రగులుస్తున్న, మెదళ్ళను తొలుస్తున్న శ్రుతీ, సాగర్ల రక్తమోడుతున్న చిత్తరువులు వెంటాడుతున్నాయి.
మా యొక్క వాక్కు. మా యొక్క హక్కు. ఆదియందు ఉండెడిదది-వాక్కు నుండి వాడును పుట్టియున్నాడు. వాక్కు లేక వాడు లేడు. వాడొక వదరు బోతని తెలిసీ, ఆ అమ్బోతుని ఊల్లొకి విడిచి, అది కుమ్ముతోందని ఈ రోజు వగచీ-ననుబ్రోవ రావే శ్రీ రఘువర! వద్దొద్దు మల్ల రాజకీయం-పరమేశ్వరా అనే అను. కొండల్లో, మంచు బండల్లో తిరిగేటి వాడు – వీడింకా రాజకీయ రంగ ప్రవేశం చెయ్యలే! బిడ్డలు గల్లోడు. తప్పక వింటాడు. వింటాడా? సంతాన భక్షక కధలు తీసేసి – నువ్వు మా తండ్రివి మేము మీ బిడ్డలమని దేహిమ్చే చేతుల ఆపేసి – ! ఇంతకీ బలయుతులకు దుర్భలులకు బలమెవ్వడు?!
. లాగి ఒక్కటి పీకితే భయం దెయ్యం వదిలినట్టు వదుల్తది. …a uni laagi okkati peekadam nerchukovaali vidhigaa nerpinchaali.
మనకాలం వీరులు రశ్యా నవల మల్లి చదువలనిపిస్తోంది
ఆది యందు కవి వాక్యము భయప్రేలాపితమైనుండెను. అంతమునందు కవి వాక్కు ఫిరంగిధ్వానము వలే పేలుచున్నది. “లాగి ఒక్కటి పీకితే భయం దెయ్యం వదిలినట్టు వదుల్తది.. భయం ఈజ్ నాట్ ఎటర్నల్.” ఇప్పుడు భయపడ్డ మార్జాలం నేత్రాలు యుద్ధ టాంకుల వలే మెరయుచున్నవి. అసహ్యకరమైన శతృవా! ఏదో ఒకనాటికి నీకు శునకమరణము తప్పదని ఈనాటి ఘటనలు ఏదో ఒక మేరకు హామీ ఇచ్చుచున్నవిలే.