ఆమె మాట ఎప్పటికీ బంగారు మాటే !!

 

-పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

ఆకాశం లో అర్ధ భాగం ను తెంపుకుని వచ్చి కొడవంటి కుటుంబ రావు గారి  జీవితం లో అర్ధ భాగం పంచుకున్నది వరూధిని అమ్మ. తొంభై ఒక్క ఏడు దాటినా – ఏ మాత్రం సడలని నిబ్బరం, ఏ మాత్రం వీగిపోని సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇంకా వికసిస్తున్న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇవన్నీ చూస్తే – ఆమె పెరిగిన సిద్ధాంతాల వాతావరణ ప్రభావం అంత గట్టిగా ఉంటుందేమో అనిపిస్తుంది.

వ్యక్తిగా నిలదొక్కుకోవడం ఒక ఎత్తైతే – ఒక సామాజిక జీవిగా ఇంకా చేతనం కలిగి ఉండడం అంత సులభ తరం కాదు.

పెదనాన్న స్త్రీ వాది చలం, నవలా రచయిత కొమ్మూరి సాంబశివ రావు తమ్ముడు,  తురగ జానకి రాణి, ఇస్మాయిల్, వజీర్ రెహ్మాన్ అందరూ చుట్టూ దగ్గరి బంధువులు. కూతురు కేంద్ర సాహితీ పురస్కార గ్రహీత. కొడుకు, రోహిణీ ప్రసాద్,  భారత దేశం లో పేరెన్నిక గన్న న్యూక్లియర్ శాస్త్ర వేత్త కావడమే కాక, ప్రజల భాషలో సైన్స్ ను వివరించాలనుకునే ‘ స్టిఫెన్ హాకింగ్ ‘ లాంటి వాడు అంతే అతిశయోక్తి కాదు. ఇంత మంది మధ్యలో 90 ఏళ్ళ నుండి పెరిగాక , ఆమెకు వయో భారం వలన వచ్చే మానసిక దైన్యం దాదాపుగా కనిపించదు.

రోహిణీ ప్రసాద్,    BAARC    లో సైంటిస్టుగా ఎన్నో పేటెంట్లు సాధించడానికి కారకుడు. వ్యక్తిగా తన సైన్స్ విజ్ఞానాన్ని పదిలపరుస్తూ ఎన్నో సైన్స్ పుస్తకాలు – వీక్షణం, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , ప్రజా సాహితీ సంస్థల సహాయం తో ముందు తీసుకు రాగలిగాడు. విశ్వ రహస్యాన్ని ఎంత సింపుల్ గా ప్రముఖ శాస్త్ర వేత్త స్టిఫెన్ హాకింగ్ పాఠకుల ముందు ఉంచాడో – అలా తెలుగులో అటువంటి ప్రయత్నం ఆ స్థాయిలో చేయగలిగింది రోహిణి ప్రసాద్ గారే. నేను, అతడు ఒకే వెబ్ మేగజైన్ కు ఆర్టికల్స్ రాసేవాళ్ళం. చిన్న పత్రిక, పెద్ద పత్రిక అనే స్థాయి లేకుండా – అదే ‘ ఇంటలక్చువల్ మోతాదులో ‘ సైన్స్ ఆర్టికల్ రాసి ఇచ్చేవాడు. తన ఆరోగ్యం పాడవుతుంటే – తనే రీసర్చ్ చేసి వ్యాధి, దానికి చికిత్స గురించి పరిశొధించి డాక్టర్లకు అడ్వైజ్ చేసేవాడు. ఆయన్ డాక్టర్ రోహిణీ ప్రసాద్ అంటే – నిజంగానే డాక్టర్ ఏమో అని వైద్యులు నమ్మేసేంత అమాయకానికి వారిని గురి చేసాడు. సైంటిస్టుగా నిజాయితీ కలిగిన ‘ సైంటిఫిక్ టెంపర్ ‘ కలిగిన వ్యక్తి. సంగీతం లో విద్వాంసుడు.

స్వంతంగా ఎన్నో స్వరాలను సురచించిన వాడు కావడం తో ఆయన రిటైర్ అయ్యాక, ఎవరో సాయి బాబా భక్తులు , సాయి బాబా కోసం స్వరాలు సమకూర్చమంటే – చప్పున ముగించి ఇచ్చేసాడు. వరూధిని అమ్మ ‘ ఏంటీ ? నీకు సాయి బాబా అంటే నమ్మకమా ? ‘ అంటే ‘ కాదు వాళ్ళిచ్చే డబ్బు మీద నమ్మకం ‘ అన్నాడు.  చాలా మంది హేతువాదులు, కుల నిర్మూలనా వాదులు – ఈ సందర్భాన్ని తప్పు పట్టొచ్చు. వాళ్లందరూ కూడా ‘ డబ్బు మీద నమ్మకం లేని వాళ్ళైతే ‘ బాగుణ్ణు. విప్లవ సాహిత్యం లో ఉన్న వాళ్ళ పై జరిగే విపరీతమైన దాడి ఏంటంటే – వాళ్ళు సౌకర్యమైన జీవితాలు గడుపుతున్నారని. నిజానికి కొడవటిగంటి కుటుంబ రావు , రోహిణీ ప్రసాద్ లు సంపాదన మాత్రమే లక్ష్యం పెట్టుకుని ఉంటే – వారు సంపాదించింది చాలా తక్కువే. ఒక ఊహాత్మక ఆదర్శం లో – ప్రగతి వాదులను ఇరికించి ‘   impractical expectations     ‘ పెట్టుకోవడం  ఒక రకమైన ‘   totalitarianism    ‘ అవుతుంది తప్ప ఇందులో గొప్పగా ప్రశంసించ  దగ్గ విషయం ఏమీ లేదు. ఒక మనిషి సాధించిన దేమిటో వదిలేసి, సాధించనిది ఏమిటో ఆలోచించడం మధ్య తరగతి    frustration     లో భాగం తప్ప మరేమీ కాదు.

కలాం లాంటి సైంటిస్ట్ – సైన్స్ నే కాదు, అత్యున్నత రాష్ట్రపతి పదవి స్థానం యొక్క ఆత్మ గౌరవాన్నే వదిలేసాడు. అది పక్కా  ‘  careerism ‘.  ప్రతి విప్లవ కళా కారుడి కుటుంబాన్ని ‘   full time revolutionary   ‘  జీవితం నడపాలని ఆశించడం లో తప్పు లేదు గాని , అలాగే ఉండాలనే ‘ ఆంక్షల జీవితాన్ని ‘ డిజైన్ చేయడం సరి అయిన దృక్పథం కాదు. శ్రీ శ్రీ – సినిమా రచనలు చేసాడు అని విమర్శిస్తే  మనమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ? సినిమాలు అసలు ఉండవద్దనా , సినిమాలు ఉన్నా పర్లేదు శ్రీ శ్రీ మాత్రం రచనలు చేయవద్దనా ? ఈ రకమైన విమర్శ మనలో ప్రతి ఒక్కరు అసలు ఎటువంటి సినిమాలూ ఉండకూడదు , మనం ( మన లాంటి మధ్య తరగతి ప్రజలు )  కూడా ఎటువంటి ‘ బాహుబలి సినిమాలకు ‘ టెంప్ట్ కాకూడదు అనుకున్నప్పుడు సద్విమర్ష అవుతుంది. ఈ డిబేట్ – పక్కన పెడితే – రోహిణీ ప్రసాద్ గారు ఖచ్చితంగా  ‘ సైంటిఫిక్ టెంపర్మెంట్ ‘ కలిగిన నిజాయితీ శాస్త్రవేత్తగానే జీవితాంతం ఉన్నాడు.

వరూధిని అమ్మ , కొకు గారి రచనల ప్రచురణార్థం , ఎటువంటి ఆర్థిక ప్రతిఫలం ఆశించలేదు. అదే శ్రీ శ్రీ రచనల విషయం లో ఏం జరిగిందో చాలా మందికి తెలుసు.

మన పరిస్థితులు మన    conviction    ను ఛాలెంజ్ చేయొచ్చు కాని దిగజారకుండా నిలబడ్డం లో గొప్ప తనం ఉంది.

కుటుంబ రావు గారికి వరూధిని అమ్మకు – వయసులో చాలా వ్యత్యాసం. కుటుంబ రావు గారు , వరూధిని అమ్మ వాళ్ళ నాన్న అప్పట్లో నడిపే తెలుగు సినిమా పత్రికకు రివ్యూలు రాసే వాళ్ళు.  శ్రీ శ్రీ, ఆరుద్ర, మొక్క పాటి నరసింహ శాస్త్రి – వాళ్ళ కుటుంబ మిత్రులుగా మెదిలే రోజులు. కొ కు గారు, తనకున్న ఆర్థిక పరమైన కారణాల వల్ల , చదువు పూర్తి చేయలేక – బోంబే లో ఎయిర్ ఇండియా టికెటింగ్ క్లర్క్గా పని చేస్తున్న రోజుల్లో, వరూధిని అమ్మ వాళ్ళ నాన్న గారు, కొ కు గారు తమ అమ్మాయికి సరి అయిన జీవన సహచరుడవుతాడని ప్రతిపాదించాక – ఇద్దరి సమ్మతం తో ఏ తంతూ లేకుండా వివాహం జరిగింది.

కొకు గారు దినమంతా రచనల్లో తల మునకలైతే – ఇళ్ళు మేనేజ్ మెంట్ అంతా వరూధిని గారిదే. కోపం తో అందరికీ వడ్డించి ‘ మీ వంట మనిషి భోజనానికి పిలుస్తుంది..రండి  ‘ అంటే ‘ నేను వంట మనిషితోనే  కలిసే భోజనం చేస్తాను ‘ అంటు మనసు తేలిక చేయగలిగే వారు కొకు గారు.

వరూధిని అమ్మ ” ఈ రోజుల్లో డబ్బు పిచ్చిలో పడి మనుష్యులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగ్గి పోయింది ”  అంటారు. చిన్న జ్వరం వచ్చినా తనను వదిలి వెళ్ళని కొకు గారు గురించి తెలుసుకుంటే  – విప్లవ సాహిత్యం లో ఉండే కఠినత్వం , మనుష్యుల విషయం దగ్గర ఎంత సున్నితంగా మారిపోతుందో తెలుస్తుంది.

ఇది ఆయన జీవితాన్ని ‘ గ్లోరిఫై ‘ చేయడం కాదు కాని, కుటుంబం  లో ప్రజాస్వామ్యం ఉండాలనే పేరుతో ‘ యాంత్రికత ‘ ను ప్రవేశ పెడుతున్న ఎంతో మంది ప్రగతి వాదులు ఆలోచించుకోవాల్సిన విషయం.

వరూధిని అమ్మ ‘ ఏంటి ? ఎవరాయన చాగంటి అట ? స్నానం ఎలా చేయాలో చెప్తాడేంటి ? ‘ అని పుష్కర స్నానాలను సున్నితంగా అపహాస్యం చేసినా,  ‘ వీళ్ళు పాపాలు చేయొద్దని చెప్పాలి గాని, స్నానం చేస్తే పాపాలు పోతాయంటారేంటి వెధవలు ?! ‘ అని  విసుక్కున్నా – అ    momentary reaction   ఆమె కుటుంబం నమ్ముకుంటూ వచ్చిన విలువల ప్రతిబింబమే.

చలం , వాళ్ళ అక్క ఇంటి కెల్తే ‘ మాల మాదిగల ఇంట్లో తిరిగొచ్చాడని ‘ వరండాలోనే విస్తరి వేసేది. వరూధిని అమ్మ – ఇది ప్రత్యక్షంగా చూసింది.  ప్రజాస్వామిక వాదుల జీవితాలు ఆకాశం నుండి రాలి పడవు. వీళ్ళు నలుగురి మధ్య ఉండి జీవనం నడుపుతూ ఒక ‘ ప్రజల గొంతు ‘ వినిపించాలి. అందుకు కుటుంబం ప్రతిబంధకం అవుతుంది, కుటుంబం లో వ్యక్తుల   aspirations   కూడా ప్రతిబంధకం అవుతుంది. వీరి చుట్టూ ‘  utopian world  ‘ ను విమర్శకులు కట్టి,  positivity     ని తక్కువ చేస్తూ చూడ్డం లో సరి అయిన ప్రమాణం లేదు.

ఒక సారి కొకు గారి మీద , మా రంగ నాయకమ్మ గారు యథావిధిగా ఏదో తనకు తెలిసిన విమర్శ రాసారు. అది వరూధిని అమ్మ చదివింది. అది తప్పుల తడక అని కూడా తెలుసు. రంగ నాయకమ్మ తో కుటుంబ మితృత్వం  ఉన్నందుకు ఆ మాత్రం ఇబ్బంది పడక తప్పదు మరి. ఆ వ్యాసం రాసాక – చాలా రోజుల వరకు , రెగ్యులర్ గా ఫోన్ చేసి పలకరించే రంగనాయకమ్మ వద్ద నుండి వరూధిని అమ్మకు ఫోన్ లేదు. ఒక రోజు అకస్మాత్తుగా ఆమె నుండి ఫోన్ వచ్చింది.

వరూధిని అమ్మ ఫోన్ లో యథాలాపంగానే పలకరించాక, ఉండబట్టలేక రంగ నాయకమ్మ ” మీకు చూపు సరిగ్గానే ఉందా ? ”  అని ఆడిగింది.

వరూధిని గారు ” ఆ ..పర్లేదు …పత్రికలు చదువ గలుగుతున్నాను ”  అని సమాధానం ఇచ్చింది ఆమె ఎందుకు వాకబు చేస్తుందో తెలిసి.

” మరి నే కుటుంబ రావు గారి గురించి వ్యాసం రాసాను చదవలేదా ? ” అని ప్రశ్నించింది.

వరూధిని అమ్మ ఏ మాత్రం హావ భావాలు లేకుండా ” ఆయన పబ్లిక్  పర్సనాలిటి. ఎందరో ఆయన్ను విమర్శిస్తుంటారు. పొగుడ్తుంటారు. అవన్నీ నేనెక్కడ పట్టించుకోను ? ” అన్నది.

అటు పక్క ఫోనులో ఎక్స్ ప్రెషన్  ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం. ప్రజల గురించి రాసిన రచనల మీద – ఇక రాసిన వ్యక్తికి ఏం హక్కు ఉంటుంది ?  అదొ ప్రజల ఆస్తిగా మిగిలాక ,  రచయితగా ఆ వ్యక్తి ఏం చేయాలి ఇక ? వ్యక్తులను, రచనలను వేరు చేసి తమపై వస్తున్న విమర్శ ను స్వీకరించాలని ఈ రోజుల్లో ఎంత మంది ప్రగతి వాద రచయితలు తెలుసుకున్నారు ? తమ రచనకు ఎటువంటి విమర్శ రాకుండా, పూర్తి స్థాయిలో , ఫుల్ టైం బేసిస్ మీద – లాబీయింగ్ – చేస్తున్న రచయితలను మనమెంత మందిని చూడ్డం లేదు ?!

ఇదే విషయమై – వరూధిని అమ్మను తట్టి చూస్తే అంటుంది ” ఈ రోజుల్లో రచయితలకు వ్యక్తిగత ప్రతిష్ట యావ ఎక్కువయ్యింది. ఒకరి భుజాల మీద ఇంకొకరు శాలువాలు కప్పుకుందామనుకుంటారు. ఇదంతా ఒక రొచ్చు లా అయ్యింది ” అంటారు. తనను – కొకు గారి గురించి ఏవన్నా చెప్పమని టీ వీ ఛానల్స్, పత్రికల వాళ్ళు ఎగబడి ఆహ్వానిస్తున్నప్పుడు తను వాళ్ళతో అన్న మాట – ” కుటుంబ రావు గారి రచనలు నేనెంత చదివానో మీరూ అంతే చదివారు. ఇక వ్యక్తిగతమైన విషయాలు , మీతో  నేను పంచుకోవాలనుకుంటే మీరు అర్థం చేసుకోవాల్సింది – అది నా పర్సనల్ వ్యవహారం. పది మందికి చెప్పుకుని పేరు తెచ్చుకునే వ్యవహారం కాదు ” అని.

‘ అమ్మా ! మీరు ఇంత మంది సాహితీ వేత్తల మధ్య పెరిగారు . మీరెందుకు రచనలు చేయలేదు ? ‘ అని ప్రశ్నిస్తే వరూధిని అమ్మ ” కుటుంబ రావు గారు రాసిన సాహిత్యం చదివి విమర్శించాల్సింది మొదట నేనే కదా ? నేను బాగో లేదన్న కథను ఆయన వెంటనే పారేసే వారు. మార్పులు కూడా చేసే ప్రయత్నం చేసే వాళ్ళు కారు. ” అంటారు.

పేరు ప్రతిష్టల  గొడవలో కొట్టుకు పోతున్న ఈ తరం ప్రగతి వాద రచయితలు –   identity crisis    అన్నది లేకుండా బతకడం ఒక ఆచరణే కాదు, మనం నమ్ముకున్న కొన్ని సామాజిక విశ్వాసాలపై ఉన్న     confidence  , మన రచనల్లో అంతర్లీనంగా మనం ప్రకటించిన ఆత్మ విశ్వాసం  అన్న విషయం తెలుసుకోవాలి.

ఈ రోజుకూ రాజకీయ వార్తలను శ్రద్ధగా చదవడం , అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం ఆమెకు షరా మామూలుగానే ఉంది. ” అలా కాదు..చంద్ర బాబు, వేరే దేశాలకెళ్ళి, మన దేశం లో వ్యాపారం చేయమని అడుగుతున్నాడేంటి ? మరి మన వ్యాపారస్తులు ఏమైపోతారు ? ” అమాయకంగా అడిగినట్టు ఉంటుంది కాని, ఈ దేశం లో పాతుకుపోతున్న సామ్రాజ్య వాద వ్య్వస్థ పై ఇంకా ఆ ఆక్రోషం ఉంది ఆమెలో. ” మనం సింగ పూర్ లా మారడం ఏంటి ? మనం మన దేశం లా ఉండాలి కాని ” అంటుంది. ” విప్లవం రావ డానికి ఇంకా చాలా కాలం పడుతుందనుకోండి. అంత వరకు వీటిని ఇలానే భరించాలి మనం ‘ అని లీలగా  నిరాశ  పడుతుంది.

కుటుంబ రావు గారు ఎప్పుడూ అవసరానికి మించిన ధనం ఉండ రాదు అని నమ్మే వారు. ఆయనకు నచ్చేది    classical music  .  కచేరీ ఎక్కడ జరిగినా ఫేమిలీ మొత్తం వెళ్ళే వాళ్ళు. అందుకేనేమో రోహిణీ ప్రసాద్ గారికి కు చిన్నప్పటి నుండి సంగీతాభిమానం. నిజానికి కొ కు గారికి ఫేమిలీ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. కూరగాయలైనా, ఇంట్లో ఏవన్నా కొనాలన్నా అంతా వరూధిని అమ్మనే చూసుకునేది.  ఆయన సమయం మొత్తం రచనల్లోనే గడిచిపోయింది. చంద మామ ను అందంగా తీర్చి దిద్దడం లో కుటుంబ రావు గారి పాత్ర ఎనలేనిదనే చెప్పుకోవాలి.

చలసాని గారి లాంటి ఆప్త మితృలను కొల్పోతుంటే – వరూధిని అమ్మ కళ్ళల్లో పటుత్వం సడలదు గాని, బాధ ఒక గీతలా గీసినట్టు ఉంటుంది.

ఎప్పుడన్నా వృద్ధాప్యం వలన మనసు బలహీనమైనప్పుడు , వరూధిని అమ్మ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటే – ఆమె ఆప్తులు ‘ నీవు మర్రి చెట్టు నీడలో పెరిగావు. నీవు ఇలా కన్నీళ్ళు పెట్ట రాదు  ‘ అని తనను  ఓదార్చుతారని చెప్తుంది.  నేను ఆమెలో బలహీనతను చూడ్డం ఇష్టం లేకనో, ఆమెలో బలం ఎలాగన్నా అలాగే కొన సాగాలనే   దురాశ వల్లనో  ” అంతే కదమ్మా ? ” అనబోతాను కాని ” అందరూ మామూలు మనుష్యులే. అందులో విలక్షణత ప్రతి క్షణం, ప్రతి ఒక్కరికీ సాధ్య పడదు  కదా !  ” అని సర్దుకుంటాను.

*

మీ మాటలు

  1. కుమార్ గారు

    బాగా రాశారు sir.

    అన్ని విషయాలు —అమ్మ చాల నిజం గా చెప్పింది — నిండుకుండ sir.

    డబ్బు — డబ్బు — యీ దోపిడీ వ్యవస్థలో —అమెరికా అయినా — అమలాపురం అయినా —
    ముఖ్యం గా తెలుగు జనాని కి డబ్బే ముఖ్యం — మానవతా సంభంధాలు అన్ని డబ్బు తోనే
    ముడి ప డి ఉన్నాయి —

    తెలుగు సాహితీ ప్రపంచం లో — కొంతమంది రచయితల కు గ్రూప్ లున్నాయి –రాజకీయాలు ఉన్నాయి — రాసిన రచన భాగా లేకున్నా —- గ్రేట్ // సూపర్ — అంటూ
    రాయడం —- యిక పేస్ బుక్ లో ఒక రచయిత బొమ్మ (కొంచం పేరున్న ) ను చూసి
    ***మీరు టామ్ సేల్లిక్ లా – జేమ్స్ బాండ్ లా — అంటూ కామెంట్స్ రాయడం ???
    (10% కూడా పోలిక లేకున్నా )
    వెళ్ళిన కాడల్లా — శాలువలు కప్పు కోవడం —-ఫండ్ రైసింగ్ —ఆలోచ ల తో — కోరిక తో —
    కావలిసింది డబ్బు — గుర్తింపు —-
    కో కు — బుచ్చి బాబు — లా — నేడు అ రచయితలు లేరు
    మిగిలిపోయింది — వర వర రావు — గారు /// శివా రెడ్డి గారు మాత్రమే — అ రోజుల్లో ని
    రచయితలు గా గుర్తు ఉంచు కునేది ???
    ——————– గంగుల –బుచ్చి రెడ్డి

  2. వనజ తాతినేని says:

    గొప్ప వ్యక్తిత్వాన్ని పరిచయం చేసారు . ధన్యవాదాలు అండీ !

  3. చందు తులసి says:

    మహా రచయిత గారి వెనుక ఉన్న మహా మనిషిని పరిచయం చేశారు. ధన్యవాదాలు.

  4. వరూధిని అమ్మ గురించి పెద్దగా తెలియదు. మీ పరిచయం చక్కగా సూటిగా ఉంది విజయ్ కుమార్ గారూ. థాంక్స్.

  5. p v vijay kumar says:

    Thanq for taking time to go through this. I have attempted to expand the canvas of looking into a person lived with people of various ideologies around and tasteful social sense in a social perspective so as to not let the article remain as a portrayal of my personal association in ‘ tea/coffee time talk ‘ with such an experienced individual.

  6. Nice write-up. Yes, she’s adorable. Worthy companion of a worthy personality.

  7. ….and I liked her answer to Ranganayakamma.

    • p v vijay kumar says:

      She is full of wit sir. Ranganayakamma was once a good friend to her family. Unfortunately, with her interfering nature and dogmatic approach, she lost Varudhini amma as her friend

  8. SivaLakshmi says:

    విజయ్ కుమార్ గారూ,
    మీరు నాకు వరూధిని అమ్మ ద్వారా,లలిత గారి ద్వారా,రోహిణీ ప్రసాద్ గారి ద్వారా బాగా తెలుసు.మొన్న కూడా చలసాని ప్రసాద్ అంకుల్ మీటింగ్ కి మీరే తీసుకొస్తున్నారని అమ్మ చెప్తే చాలా ఎదురు చూశాం.
    మీరు రాసిందంతా చదువుతుంటే అన్నీ తెలిసిన విషయాలే అయినా చాలా సంతోషంగా అనిపించింది.
    ‘అమ్మా! మీకు షుగరుందా?’ అని ఎవరైనా అడిగితే “లేదు పొగరుంది” అని చెప్తారమ్మ.బాధల్లో ఉన్నప్పుడు అమ్మ దగ్గరకెళ్తే మనసు క్షణాల్లో తేట పడుతుంది!
    అదేమిటి? టివీ లో ఒక చానెల్ వాడు ఒకటి చెప్తే,ఇంకొకడు దాన్ని ఖండిస్తాడు.మామూలు ప్రజలు ఏది చూడాలి? అంటారు.మీరు రాసినట్లే అవార్డుల కోసం ఆరాట పడే రచయితలందరూ ఒకరి వీపు ఒకరు గోక్కుంటున్నారంటారు. ఇక రోహిణీ ప్రసాద్ గారైతే “మా అమ్మ చాలా బలమైన వ్యక్తిత్వంతో రాక్షసి లాంటి ఈ బ్రాహ్మణీయ సనాతన ప్రపంచానికి ఎదురు నిల్చి పోరాడింద”ని ఒకసారి అన్నారు.’నాది సామ్యవాద దృక్పధం’ అని చెప్పే పురుషుల్ని నావెల్ గా చూసే ఈ ప్రపంచం అదే విషయాన్ని నమ్ముతున్న మహిళల్ని మాత్రం విడ్డూరంగా ఎగా దిగా తక్కువ చేసి చూస్తుంది.ఆరోజుల నుంచి ఈ రోజువరకూ నమ్మిన విలువల్ని చెక్కు చెదరకుండా నిలుపుకున్న సాహస వ్యక్తిత్వం ఆమెది!
    ఎప్పుడైనా “దీర్ఘాయుష్షు వల్ల జీవితం చాలా గట్టి దెబ్బలు కొడుతుంది” అని అమ్మ అన్నప్పుడు మాత్రం “అలా అనొద్దమ్మా,మీరు మాకు స్ఫూర్తి,అని అంటూ ఉంటాం మేము.ఈ తరానికి అమ్మను పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు!

    • p v vijay kumar says:

      మీరు నాకు ఫోన్ కూడా చేసారు కదా ? చలసాని మీటింగ్ కు అమ్మను తీసుకు రావడం గురించి ?
      She is beautiful . She simplifies any problem. అండి . Pl connect to me on FB or mail, Madam….

  9. కె.కె. రామయ్య says:

    కొ.కు. నాయన సాహిత్యం సంపుటాలలో చూసిన వరూధిన అమ్మను గురించి మళ్లీ విపులంగా రాసిన విక్టర్ విజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. సంగీతం, సాహిత్యం, సైన్స్ విషయాలపై రోహిణీప్రసాదు గారి వ్యాసాలూ అద్భుతంగా ఉండేవి. రోహిణీప్రసాదు గారితో తనకున్న అనుబంధాన్ని అట్లూరి అనిల్ గారి వ్యాసాల్లో కూడా చూడవచ్చు.

    విరసంలో వీరశైవుడు అని శ్రీశ్రీ చే కీర్తించబడిన కొ.కు. నాయన రచనల సర్వస్వం ప్రతి ఇంటా ఉండాల్సిన, ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఉత్తమశ్రేణి సాహిత్యం. ఓ ఉద్యమ స్పూర్తితో, సామాజిక బాధ్యతతో, జీవితపర్యంతమూ రచనలు చేసిన కలంయోధుడు కొ.కు. నాయన ను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి.

  10. వరూధిన అమ్మ గారి పరిచయం చాలా బాగుంది. కొ.కు. గారిని, రోహిణి ప్రసాద్ గారిని గుర్తు చేయడం మనసుకు ఆర్ధంగా వుంది. పాఠ కుల్లో శాస్త్రీయ దృక్పదాన్ని కల్పిమ్చాడానికి కొ.కు. గారు ఎంత తాపాత్రయ పడి నాడో, రోహిణి ప్రసాద్ గారు కూడా ఈ తరాన్ని ముద నమ్మ కాలనుండి విముక్తి కలిగించడానికి కృషి చేసారు.

    • p v vijay kumar says:

      తిరుపాల్ గారు…కరెక్ట్ గా చెప్పారండి. Rohini Prasad is Andhra level Stephen Hawking అండి

  11. KCube Varma says:

    మీ పరిచయం హత్తుకుంది ధన్యవాదాలు సర్

  12. @ విక్టర్ విజయ్ కుమార్ : మీ వ్యాసంలో : >> ఒక సారి కొకు గారి మీద , మా రంగనాయకమ్మ గారు యథావిధిగా ఏదో తనకు తెలిసిన విమర్శ రాసారు. అది వరూధిని అమ్మ చదివింది. అది తప్పుల తడక అని కూడా తెలుసు.>>

    ఆ విమర్శ దేని గురించి? దాన్ని కనీసంగా ప్రస్తావించకుండానే అది తప్పుల తడక అనెయ్యటానికి మాత్రం ఉత్సాహపడిపోయారు.

    ఆ విమర్శ- కొ.కు. తత్వశాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రజ్యోతిలో 2012 డిసెంబరు 24న రంగనాయకమ్మ రాసిన వ్యాసం- (శీర్షిక- ‘సోషలిజం తేవడం చాలా తేలికే’).

    ఆ వ్యాసం ప్రచురణ తర్వాత వరూధిని- రంగనాయకమ్మ గార్ల మధ్య ఏం జరిగింది? .

    మీరు వరూధిని గారి వర్షన్ ను ఈ వ్యాసంలో ఇచ్చారు. ఈ విషయంలో రంగనాయకమ్మ గారి వర్షన్ ను కూడా చూడాలి కదా?

    అది రెండేళ్ళ క్రితమే- ‘ చినుకు’ అనే మాసపత్రికలో 2013 ఏప్రిల్ సంచికలో వచ్చింది. ఆ వ్యాసం ప్రకారం చూస్తే వరూధిని గారు మీరు రాసిన పద్ధతిలో కాకుండా వేరే రకంగా స్పందించారు. (మీ వ్యాసం వెలుగులో చూస్తే… దెయ్యాల తత్వవేత్త బంధువు అని ప్రస్తావించినవారు వరూధిని గారే అని అర్థం చేసుకోవచ్చు)

    ‘ఆయన (కొ.కు.) ఇప్పుడు లేరు, లేని మనిషి మీద విమర్శలెందుకు?’ అనీ , ‘ఆయన మీద మీరు పర్సనల్ గా రాశారు ’- ఈ పద్ధతిలో. ఆ మాటలకు రంగనాయకమ్మ గారి స్పందన కూడా ఆ వ్యాసంలోనే ఉంది.

    ఆ వ్యాసాన్ని కింది లింకులో చదవొచ్చు.

    https://www.scribd.com/doc/282820943/RN-s-Article-in-April-Chinuku

    కొ.కు. నేను భాగా ఇష్టపడే రచయిత. కానీ ఆయన దయ్యాలూ, ప్రేతాత్మల గురించి రాసిన విషయాలను అంగీకరించను. మార్క్సిస్టులు గానీ, నాస్తికులు గానీ ఆ విషయాలను వ్యతిరేకించాల్సిందే. ఆ పని తన విమర్శతో చేశాశారు రంగనాయకమ్మ.

    ఆమె రాసింది తప్పుల తడక అంటున్నవారు పరలోకాలనూ, పూనకాలనూ, దయ్యాలనూ, ప్రేతాత్మలనూ నమ్ముతున్నట్టే!

    రెండేళ్ళ క్రితం రాసిన ఆ విమర్శకు విరసం నుంచి గానీ, మరెవరి నుంచీ గానీ సమాధానం గానీ, ప్రతి విమర్శ గానీ ఇంతవరకూ రాలేదు!

  13. p v vijay kumar says:

    Venu garu, thanq for bringing ur concern to my notice. I wil go thru this and get back to u. As u r aware, this article is an introduction of a family and not a debate and hence cudnt get thebneed to go to the depth of it.

  14. ఒక పాఠకుడు says:

    ఈ వ్యాసం లో ఎన్నో విషయాలూ, వరూధిని గారి జీవితంలో ఉన్న ఎంతో మంది వ్యక్తుల సంగతులూ వచ్చాయి గానీ, ఒక ముఖ్యమైన విషయం మాత్రం రాలేదు. వ్యాసకర్తకి అది ముఖ్యంగా అనిపించలేదేమో మరి.

    వరూధిని గారు, కుటుంబరావు గారికి మూడొవ భార్య. ఆయన మొదటి భార్య, రచయిత అవసరాల కృష్ణారావు గారి అక్క. మొదటి భార్య మరణించాక, ఇంకొకామెని పెళ్ళి చేసుకున్నారు, కుటుంబరావు గారు. ఆ రెండొవ భార్యకి ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకు ఈ క్షణానికి జీవించే వున్నాడు. ఆ రెండొవ భార్య మరణించాక, కుటుంబరావు గారు కొంత కాలానికి వరూధిని గారిని మూడో పెళ్ళి చేసుకున్నారు. ఇందులో, కుటుంబరావు గారి తప్పు గానీ, వరూధిని గారి తప్పు గానీ లేదు. తప్పర్థం చేసుకోకండి. అయితే, వరూధిని గారికి ఒక సవతి కొడుకు వున్నాడు. సవతి తల్లిగా వుండటం మామూలు విషయం కాదు. సవతి కొడుకు విషయాలు కూడా వరూధిని గారి జీవితంలో భాగమే. అవి కూడా ప్రస్తావించి వుంటే, చాలా వివరంగా అని కాదు – ఎంతెంతో మంది గురించి ప్రస్తావించారు కదా – ఈ వ్యాసం కాస్తన్నా సమగ్రంగా వుండేది. లేకపోతే, ఏదో కారణం వల్ల విషయాలు దాచి పెట్టారు అనే నింద వస్తుంది. ఆ విషయాలు అనవసరం అని వ్యాసకర్త అనుకుంటే, అవి అవసరమా, లేక అనవసరమా – ఒకరి జీవితం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు – అనే సంగతి మిగిలిన పాఠకులకే వదిలెయ్యడం అసలైన విజ్ఞత. భర్త కున్న మొదటి కొడుకు సంగతే అనవసరం అనుకుంటే, కుటుంబ వ్యక్తి గాని రంగనాయకమ్మ సంగతి ఎందుకూ?

    ఒక పాఠకుడు

  15. @ P V Vijayakumar: ఒక కుటుంబాన్ని పరిచయం చేయటం మాత్రమే మీ వ్యాసం లక్ష్యమా? అలా అయినపుడు రంగనాయకమ్మ- వరూధిని గార్ల మధ్య జరిగిన అంశాల్లో మీరు ఒకరిని ఏకపక్షంగా సమర్థిస్తూ, మరొకరిని హీనపరుస్తూ రాయకుండా ఉండాల్సింది.

    మీ కామెంట్లలోనూ రంగనాయకమ్మ గారి స్వభావం interfering nature అనీ, ఆమెది dogmatic approach అనీ తీర్పులిచ్చేశారు. సంయమనం పాటించకుండా మీ ఇష్టమొచ్చినట్టు రాసేసి, విషయం చర్చనీయాంశం చేసేసి, తీరా ఇప్పుడు చర్చ అవసరం లేదంటే ఎలా?

  16. బాగా అడిగారు వేణుగారు.
    విజయ్ గారికే కాదు, చర్చలు లేవనెత్తే చాలా మందికి తమకు ఇష్టమైన విషయాలే మాట్లాడాలని కోరిక, ఆదేశం. ఇబ్బంది కలిగించేవి అనవసరం.

  17. P.Jayaprakasa Raju. says:

    సారంగ వల్ల , పి.వి. విజయ కుమార్ గారి వల్ల రంగనాయకమ్మ గారిని గురించి మరింత ఎక్కువమంది తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఆవిధంగా వారు ఆమెకు ఎక్కువ ప్రచారం కల్పించారనుకుంటాను.

  18. ”Ranganayakamma was once a good friend to her family. Unfortunately, with her interfering nature and dogmatic approach, she lost Varudhini amma as her friend” – ఇవీ వ్యాసకర్త తన వ్యాఖ్యలో చెప్పిన మాటలు.
    .
    అంటే… వారి మధ్య దూరం పెరగటానికి రంగనాయకమ్మ గారి (చెడు) స్వభావమూ, వైఖరీ కారణమని ఆయన చెప్తున్నారు.
    .
    ఇలాంటి వివాద సందర్భం చెప్పదల్చినపుడు రెండో పక్షం వారి కోణాన్ని కూడా తెలుసుకుని చెప్పివుంటే ఆక్షేపణ ఉండేది కాదు. అది సాధ్యం కానప్పుడు ఆ ప్రస్తావనే తీసుకురాకూడదు.
    .
    కానీ ఈ విషయంలో రంగనాయకమ్మ తప్పు చేశారని ఆయన ఏకపక్షంగా తీర్పు ఇచ్చేశారు. వరూధిని గారితో మాట్లాడే ఈ నిర్థారణకు వచ్చి రాసివుండాలి.
    .
    అందుకే… ఈ విషయంలో రంగనాయకమ్మ గారి కోణం కూడా చూడటం సబబు. నవంబరు 2013లో ‘చినుకు’ పత్రికలో దీని గురించే ఆమె ఓ వ్యాసం రాశారు. దానిలో వరూధిని గారి పేరును ఆమె రాయలేదు. ‘కామేశ్వరమ్మ’ అనే మారుపేరు పెడుతున్నానంటూ తమ స్నేహం ఎలా పెరిగిందీ, చివరికెలా తగ్గిపోయిందీ వివరంగా ప్రస్తావించారు. (ఆమె రాసింది వరూధిని గారి గురించేనని పాఠకులు తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు).
    .
    ఆ వ్యాసం https://www.scribd.com/doc/282820650/RN-Article-in-Nov-Chinuku లింకులో చదవొచ్చు.
    .
    వరూధిని గారి ఘనత గురించి చెప్పాలంటే మరొకరిని హీనపరచాలా? అవసరం లేదు. కానీ ఈ వ్యాసకర్త చేసింది ఇదే. ఆయన అలా చేయటం వల్లనే రెండో పక్షం వాదన కూడా ఉందని, దాన్ని గుర్తు చేయాల్సివచ్చింది.

  19. https://www.scribd.com/doc/282820650/RN-Article-in-Nov-చినుకు వ్యాసం చదివితె కొన్ని ఆలోచనలోస్తాయి.

    ఆ వ్యాసంలోని వ్యక్తి వరూధినిగారని అది కోట్ చేసిన వారికెల తెలుసు?

    “ఆవిడ భర్తకి నా పుస్తకాలు నచ్చవు” అని మొదటే రచయిత్రి ప్రకటన.

    అందుకేనా అతను ఎన్నిమంచి రచనలు చేసినా ఒక తప్పుడు రచన చేసినందుకు దెయ్యాల తత్వవేత్త పేరుని శాశ్వతంగా స్థిర పరించింది ?.

    -శశాంక్

    • పాఠకుడు says:

      శశాంక గారూ,

      మీరు చాలా సంస్కారవంతంగా అడిగారు ఒక ప్రశ్న, “అందుకేనా అతను ఎన్నిమంచి రచనలు చేసినా ఒక తప్పుడు రచన చేసినందుకు దెయ్యాల తత్వవేత్త పేరుని శాశ్వతంగా స్థిర పరించింది ?” అని. దానికి సమాధానం తిరిగి సంస్కారవంతంగానే ఇవ్వాలి.

      మొదటగా, కుటుంబరావు గారు అంతకు ముందు చేసిన మంచి రచనల విలువలు పోయాయని ఎవరూ అనలేదు. ఆయనకి “దెయ్యాల తత్వవేత్త” అనే పేరు ఎవరూ మొత్తానికి స్థిర పరచలేదు. ఆ రచనకి సంబంధించి మాత్రమే ఆయనకి ఆ పేరు వుంటుంది. తాగుబోతూ, తిరుగుబోతూ అయిన కవి రాసిన కవిత్వంలోని విలువ ఎలా అయితే పోదో, కుటుంబరావు గారు రాసిన ఇతర రచనలలోని విలువలు కూడా అలాగే పోవు. అయితే, ఇక్కడ ఒక తేడా వుంటుంది.

      కుటుంబరావు గారినీ, యండమూరినీ మొత్తంగా పోల్చకూడదు. ఒక్క దెయ్యాల రచనకి సంబంధించి మాత్రమే ఇద్దరినీ పోల్చాలి. ఎక్కువ మంది పాఠకులని ఆకర్షించడానికి ఏ రచన కావాలో, యండమూరి ఆ రచన చేస్తారు. కుటుంబరావు గారు అలా కాదు. ఆయనకి కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. ఆయన ఒక విప్లవ సంఘంలో సభ్యుడు. నాస్తికత్వమూ, మార్క్సిజమూ వున్న రచయిత. అటువంటి రచయిత, ఇలాంటి దెయ్యాల రచన చేస్తే, ఇతర రచనల లోని నిజాయితీ మీద తప్పకుండా ప్రశ్నలు వస్తాయి. ఆ రచనలలో నాస్తికత్వం గురించి రాసి, ఈ రచనలో దెయ్యం గురించి రాస్తే, ఎలా నమ్మేదీ? ఏది నమ్మేదీ? యండమూరి లాంటి కమర్షియల్ రచయితలకైతే ఆ సమస్య లేదు. ఎప్పుడేది అవసరం అయితే అది రాసుకోవచ్చు. ఇష్టం వున్న వాళ్ళు ఇష్టమొచ్చినట్టు ఇష్ట పడతారు. అది వారి స్వేచ్ఛ.

      చెప్పేదొకటీ, చేసేదొకటీ అయితేనే విమర్శిస్తామే, మరి చెప్పేదే ఒక దానికొకటి వ్యతిరేకంగా వుంటే, విమర్శించమా?

      ఒక పాఠకుడు

      • 1.”ఆయనకి కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. ఆయన ఒక విప్లవ సంఘంలో సభ్యుడు. నాస్తికత్వమూ, మార్క్సిజమూ వున్న రచయిత.”
        2.”చెప్పేదొకటీ, చేసేదొకటీ అయితేనే విమర్శిస్తామే, మరి చెప్పేదే ఒక దానికొకటి వ్యతిరేకంగా వుంటే, విమర్శించమా?”

        ఈ రెండూ వేర్వేరు విషయాలు గా నాకు తోస్తున్నాయి, మొదటి వాక్యం లో ‘ఆదర్శాలు’- అన్నప్పుడు సమానత్వం, దోపిడీ కి వ్యతిరేకతా ఇలాటి విషయాలని స్పష్టమౌతోంది. ‘విప్లవసంఘం లో సభ్యుడు’ అంటే దోపిడీ కి వ్యతిరేకం గా చేసే పోరాటం లో చెయ్యి కలుపుతానని అర్ధం చేసుకోవచ్చు. నాస్తికత్వమూ ఆయనకు హేతుబద్దమై సరి అనిపించవచ్చు, అది మారి దేవుడికీ, అతీతశక్తులకీ ఒకవేళ ఆయన open అయ్యి అవి ఉన్నాయేమో అని అనుకోనూ వచ్చు. ఐతే marxism నమ్మిన రచయిత అవరు, marxism గతితార్కిక ‘భౌతిక’ వాదం అని అనే ముందు ఒక చిన్నసందేహం.
        సమానత్వమా? భౌతిక వాదమా? ఏది fundamental marxism ku? రెండూ ఒక్కటేనా? భౌతిక వాది కాకుండా ‘marxism నిజమైన సిద్ధాంతం, దాని తోనే ప్రపంచం లోని సమస్యలను అర్ధం చేసుకోవచ్చూ, పరిష్కరించ వచ్చూ’ అని ఎవరైనా ఎందుకు నమ్మకూడదు?
        “చెప్పేదొకటీ, చేసేదొకటీ…”
        అవార్డులు పుచ్చుకుంటే అందరి కంటే తాను ఎక్కువ అని నమ్మినట్టే కనుక – అది మార్క్సిస్ట్ భావన కాదు.కానీ ఆత్మలుంటాయి అని నమ్మడం ఆయన వ్యక్తిగతం! రెండూ ఒక రకం కాదు.
        ఇద్దరు భార్యలను చేసుకోవడం, స్త్రీ పురుష సమానత్వానికీ, సహజీవనానికీ విరుద్ధం కనుక అది మార్క్సిస్ట్ కు తగిన ఆచరణ కాదు, కానీ తండ్రికి తద్దినాలు పెడతారు, జాతకాలను నమ్ముతారు కనుక మార్క్సిస్ట్ అవలేరు అనడం వారి వ్యక్తిగత స్వేచ్చ ను హరించడమే.
        bible ను నమ్మని వారందరినీ persecute చెయ్యడానికీ దీనికీ తేడా ఏమిటి?

  20. నీహారిక says:

    వరూధిని గారి ఘనత గురించి చెప్పాలంటే మరొకరిని హీనపరచాలా? ……valid point !
    విజయ్ కుమార్ గారు,
    మీరు ఇదివరకు కలాం గారిని నారాయణన్ గారితో పోల్చారు.ఇపుడిలా వ్రాస్తున్నారు.రంగనాయకమ్మగారితో సహా ఏకపక్షంగా వ్రాసిన వారెవరికీ గౌరవం దక్కే చాన్స్ లేదు.ఒక వ్యక్తిని పొగడాలన్నా తిట్టాలన్నా డైరెక్ట్ గా వాళ్ళ గురించే వ్రాయాలి వేరొకరితో పోల్చకూడదు.మనుషులంతా ఎవరికివారు ప్రత్యేకమే కదా ?

  21. నీహారిక says:

    >>>>>అందుకేనా అతను ఎన్నిమంచి రచనలు చేసినా ఒక తప్పుడు రచన చేసినందుకు దెయ్యాల తత్వవేత్త పేరుని శాశ్వతంగా స్థిర పరిచింది ?<<<<<<

    యండమూరి ఎన్నో గొప్ప గొప్ప రచనలు చేసినా తులసీదళం, కాష్మోరా మాత్రమే గుర్తుపెట్టుకుంటారు.ఒక ఆటో డ్రైవర్ కూతురు ఐ ఏ ఎస్ అయిందనుకోండి ఆమె ఎన్ని కష్టాలుపడి చదివిందో ఎవరూ చూడరు,సక్సెస్ మాత్రమే చూస్తారు.విజయం ప్రభావం ఎంతగా ఉంటుందో ఒక తప్పుడు రచన ప్రభావం కూడా అంతే ఉంటుంది.

  22. @ Sashank: ‘ఆ వ్యాసంలోని వ్యక్తి వరూధిని గారని అది కోట్ చేసిన వారికెలా తెలుసు?’ అని అడిగారు మీరు.
    .
    ‘సారంగ’లో విక్టర్ విజయకుమార్ గారు రాసిన ఈ వ్యాసం వరూధిని – రంగనాయకమ్మ గార్ల స్నేహం ముగిసిందని చెపుతోంది. చినుకు వ్యాసంలో కూడా రంగనాయకమ్మ గారు పెద్ద వయసులో ఉన్న పెద్ద రచయిత భార్యతో తన స్నేహ సంబంధాలు ఎలా దూరమయ్యాయో రాశారు. కుటుంబ సభ్యుల వివరాలు కూడా సరిగ్గా సరిపోయాయి. కాబట్టి ఆమె వరూధిని గారేనని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
    .
    >> ‘అతను ఎన్నిమంచి రచనలు చేసినా ఒక తప్పుడు రచన చేసినందుకు దెయ్యాల తత్వవేత్త పేరుని శాశ్వతంగా స్థిర పరిచింది ?’>>
    .
    ఒక రచన కాదు. మూఢ నమ్మకాలను సమర్థించే ఎన్నో వ్యాసాలు రాశారాయన.
    .
    ‘దెయ్యాలు లేవని భావించడం ఈ కాలపు మూఢ నమ్మకాలలో ఒకటి ’ అని 1934లో ఓ వ్యాసంలో కొ.కు. రాశారు. 1958, 1975, 1977, 1980లలో కూడా ఆత్మలూ, జ్యోతిషం, హస్త సాముద్రికం, తేలు మంత్రాలను సమర్థిస్తూ రాసుకొచ్చారు. అంటే మరణించేవరకూ ఆయన అతీత శక్తులను నమ్ముతూ, వాటిని సమర్థిస్తూ రాస్తూనే ఉన్నారు. ఇలాంటి రచయిత తాను భౌతిక వాదిని అని చెప్పుకున్నా, విరసం లాంటి సంఘాలు అలా చెప్పినా అది అవాస్తవమే అవుతుంది.
    .
    కొడవటిగంటి కుటుంబరావు గారు నా అభిమాన రచయిత. ఆయన రాసిన నవలలూ, కథలూ నాకెంతో ఇష్టం. వివిధ అంశాలపై ఆయన రాసిన వ్యాసాల నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. ఆ మంచి రచనల మంచి ఎక్కడికీ పోదు. కానీ ఆయన ప్రకృతి గురించి రాసినవాటిలో అశాస్త్రీయ విషయాలతోనే పేచీ. అవి విమర్శను తప్పించుకోలేవు!

  23. /కొడవటిగంటి కుటుంబరావు గారు నా అభిమాన రచయిత. ఆయన రాసిన నవలలూ, కథలూ నాకెంతో ఇష్టం. వివిధ అంశాలపై ఆయన రాసిన వ్యాసాల నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. ఆ మంచి రచనల మంచి ఎక్కడికీ పోదు. కానీ ఆయన ప్రకృతి గురించి రాసినవాటిలో అశాస్త్రీయ విషయాలతోనే పేచీ. అవి విమర్శను తప్పించుకోలేవు! /
    అభిమానం అంటే ఇలా వుండాలి! అది కొ.కు. అయినా, శ్రీ శ్రీ అయినా రంగ నాయకమ్మ గారైనా మరెవరైనా! చక్క గా చెప్పారు వేణు గారు. కొందరికి రచనాభిమానానికి , వ్యక్తిగాతాభినానికి తేడా తెలియట్లేదు.

  24. జె. యు. బి. వి. ప్రసాద్ says:

    రంగనాయకమ్మ గారు వరూధిని గారికి ఒకప్పుడు మంచి ఫ్రెండనీ తర్వాత కాలంలో వరూధిని గారితో, తన డాగ్మటిక్ ఎప్రోచ్ వల్ల, స్నేహాన్ని పోగొట్టుకున్నారనీ వరూధిని గారితో ఇంటర్వ్యూ జరిపిన విజయకుమార్ రాశారు. రంగనాయకమ్మ గారికీ, తనకీ ఒకప్పుడు స్నేహం వుండేదనీ, ఆ స్నేహాన్ని రంగనాయకమ్మ గారు పోగొట్టుకున్నారనీ, వరూధిని గారు చెప్పడం వల్లే ఆమెను ఇంటర్వ్యూ చేసిన విజయకుమారు గారు ఇక్కడ చెప్పారన్న మాట.
    కొడవటిగంటి కుటుంబరావు గారి ‘తాత్విక వ్యాసాల’ మీద రంగనాయకమ్మ గారు రాసిన వ్యాసాలు నేను గతం లోనే చదివాను. (‘పల్లవి లేని పాట’ అనే సంపుటంలో వున్నాయి.)
    సారంగలో విజయకుమార్ చేసిన ఇంటర్వ్యూ, దాని మీద వ్యాఖ్యలూ చూశాక, వరూధిని గారితో, కుటుంబరావు గారి వ్యాసాల విషయమై జరిగిన సంభాషణ గురించి రంగనాయకమ్మ గారిని అడిగాను. అందుకు జవాబుగా, ఆ విషయమై వరూధిని గారికి తను రాసిన ఒక ఉత్తరాన్ని రంగనాయకమ్మ గారు నాకు పంపారు. ఆ ఉత్తరం లింకు ఇక్కడ ఇస్తున్నాను.

    https://www.scribd.com/doc/283230141/To-Varudhini-19-1-13

    కుటుంబరావు గారు ఎంత అశాస్త్రీయంగా ఆలోచించారో, ఆయన వ్యాసాల్లోంచే సంవత్సరాల వారిగా, ఆధారాలు చూపినా అంగీకరించని వరూధిని గారిదే ‘డాగ్మటిక్ ఎప్రోచ్’ (మూఢ వైఖరి) అని స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి, విక్టర్ విజయకుమార్ ఇతరేతర కారణాలతో రంగనాయకమ్మ గారికి వ్యతిరేకంగా విషప్రచారానికి పూనుకున్నట్టు అనుమానం కలుగుతుంది. ఇంతకీ విజయకుమార్ గానీ, రంగనాయకమ్మ గారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విరసం వారి కూర్మనాధ్ వంటివారు గానీ దయ్యాల తత్వ శాస్త్రాన్ని సమర్థిస్తారా?

    జె. యు. బి. వి. ప్రసాద్
    క్యూపర్టీనో

  25. rani siva sankara sarma says:

    నాకు దెయ్యాలు ఆత్మల మీద నమ్మకం ఉంది . రంగనాయకమ్మ గారిని మార్క్సు ఆత్మే శాసిస్తోంది. అందుకే మార్క్సు మతమే ఆమె మతం. మార్క్సు మతం మత్తు మందు అన్నాడు నిజమే కాని భారతీయులది మరీ నాటు సరుకు అన్నాడు .తాగడం తప్పకపోతే మంచి వెస్టరన్ బ్రాండు తాగమని సలహా యిచ్చాడు.మనిషిని ప్రకృతి ఆరాధన పశు ప్రాయంగా మారుస్తుంది అన్నాడు.ప్రక్కృతి పైన సార్వభౌముడైన మానవుడు కొతినీ ఆవునీ పూజించడం హీనస్థితికి దిగజారడం అన్నాడు. ఇది భారతీయుల విస్వాసాలపైన ప్రొటెస్టమ్టు క్రయిస్తవ దాడి.అమెరికా స్కూలు పుస్తకాల్లో భారతీయులు జంతువులని పూజించె మూఢవిశ్వాసమ్ కలిగి వున్నారని విమర్శలు ఉండేవి. మాకు మానవరూపమ్ గల దేవతలున్నారని కోర్టు కెక్కి నేగ్గారనుకోండి .మార్క్సు లాంటి పాశ్చాత్యులు కల్పించిన ఇన్ఫీరియారిటీ అటువంటిది. మాకు క్రీస్తు లాంటి మానవ దేవుడున్నాడని సమాధానం చెప్పుకోవలసి వచ్చింది. అందువల్లే హిందువాదులు రాముడనే మానవ దేవుణ్ణి జాతీయ నాయకుడిగా ముందుకు తెచ్చారు. రామాయణ విష వృక్షం రాసిన రంగనాయకమ్మ మార్క్సు రాసిన హిందూ రామాయణాన్ని ఎందుకు ఖండించలేదు? ఆదేయ్యం యూరపునె కాదు రంగనాయకమ్మని కుడా పట్టుకుందా?

  26. ఆనంద్ says:

    ‘వరూధిని అమ్మ’ గారి గురించీ, ఆవిడి కుటుంబం గురించీ, విజయకుమార్ గారు రాసింది చదివాను. ఆయన, “కూతురు కేంద్ర సాహితీ పురస్కార గ్రహీత.” అని రాశారు. ఆ కూతురి పేరు రాయలేదు. కొడుకుల పేర్లు ముఖ్యం గానీ, కూతుళ్ళ పేర్లు ముఖ్యం కావనుకుంటాను. సరే, ఆ కూతురి పేరు – ఆర్. శాంతసుందరి. ఈమె ముఖ్యంగా హిందీ, తెలుగు భాషల్లో కధలు అనువాదం చేస్తూ వుంటారు.

    సెప్టెంబరు నెల విపులలో ఒక కధ చదివాను. చదివి ఆశ్చర్య పోయాను. ఆ కధ పేరు, “ఎవరా అమ్మాయి”. హిందీ రచయిత, పంకజ్ సుబీర్. అనువాదం, ఆర్. శాంతసుందరి. ఈ కధలో, ఒక అబ్బాయి కాలేజీకి వెళ్ళేటప్పుడూ, తిరిగి వచ్చేటప్పుడూ, ఒక ఇంటి కిటికీ దగ్గర నించుని వున్న ఒక అమ్మాయిని చూస్తాడు. ఒక రోజు, ఆ అబ్బాయి, ఆ ఇంటి తలుపు తడతాడు. తలుపు తీసిన ఆంటీతో మాట్టాడి, “ఇంట్లో ఇంకెవరూ లేరా?” అని అడుగుతాడు. “ఎవరూ లేరు బాబూ. మా అమ్మాయి పోయి రెండేళ్ళయింది. నీ కేమన్నా కిటికీ దగ్గర కనబడిందా?” అంటుంది. ఆ పిల్లాడు దడుసుకుంటాడు. అంతే కధ అయిపోయింది. అంటే, ఆ కిటికీ దగ్గర ఆ అబ్బాయికి రోజూ కనబడేది దెయ్యం అన్న మాట.

    తండ్రి భౌతికవాది. తల్లి నాస్తికురాలు. తమ్ముడు సైంటిస్టు. అటువంటి కుటుంబంలోంచి వచ్చిన మనిషి, ఇలాంటి కధనా అనువాదం చేసేదీ? “నాకు నమ్మకాలున్నాయి” అని అంటారేమో ఆవిడ. భౌతిక వాది అయిన తండ్రి దగ్గర, కూతురు చక్కటి భావాలే నేర్చుకున్నారు. భౌతిక వాదులే స్వయంగా రాసింది, తాను అనువాదం చేస్తే తప్పు లేదనుకుని వుంటారు. చాలానే విషయాలు తెలుస్తున్నాయి.

    ఆనంద్

Leave a Reply to Thirupalu Cancel reply

*