సృష్టాది శాంతి

-నామాడి శ్రీ‌ధ‌ర్‌

వ‌రిచేను మ‌ధ్య‌న ఒక్క‌డినీ
ఓ హ‌రిత వృక్షాన్న‌య్యాను
పువ్వుల‌కి బదులుగా నేను
నిలువెల్లా మిణుగురుల్ని తాల్చాను

ప‌సుపు రంగు త‌ళుకుతో
ఒకింత ఆరుతో ప్ర‌కాశించే
కుసుమ‌ద‌ళాల‌కి ప్రాణం పోశాను

చుక్క‌ల కాంతిఛ‌త్ర‌మ‌ల్లే
ఈ చెలికాడు చేత‌ప‌ట్టిన‌
జాజ్వ‌ల్య‌మాన‌మైన నీడ‌ప‌ట్టుకి
ఆ జీబు రాతిరిలోంచి నువ్వు
న‌వ్వుతో చేరువ‌గా ప్ర‌వేశించావు

చీకటి చినుకు ఒక్క‌టి కూడ‌
నీ మీద‌న కుర‌వ‌నివ్వ‌క కాచిన‌
చిటారు కొమ్మ‌ల గుబురుప్రేమ వేపు
అవే చిరంత‌న అమాయ‌క క‌ళ్ల‌తో
అప్ప‌టిక‌ప్పుడు ఏదో సృష్టాది శాంతి
మ‌న‌సుకి అందుతున్న‌ట్టుగా చూశావు

*

మీ మాటలు

  1. ఇక్కడ పరిస్థితి మరోలా వుంది సార్… చెట్లు కూలుతున్న దృశ్యాలు …

  2. అవును నర సన్ గారు. మరోలా ఉండకపోతే సృష్ట్యాది (సృష్టి + ఆది) అందరికీ యడంగానే. యే వేపు తిరిగిన వేపుకు తినే త్రిరత్న శోకాలే.

  3. ఎంతో బాగుంది సర్ కవిత

మీ మాటలు

*