పుష్కర పోస్టుమార్టం 

                

   –బమ్మిడి జగదీశ్వరరావు

 మా యింట్లో అందరూ

పుణ్యాత్ములే!

మేం పుష్కర స్నానాలు చేసాం!

           ***

పాపాల్ని గోదాట్లో

వదిలేసాం!

పాపం చేపలు యేమవుతాయో ఏమో?

          ***

పిండాలు పెట్టేశాం!

పెద్దలకీ

నదికీ

         ***

ఓకే.. లైట్స్ ఆన్..

స్టార్ట్.. కెమేరా.. యాక్షన్..

కట్ చేస్తే- యిరవయ్యేడుగురు!

***

కొందరు మనుషులకీ

కొన్ని యిల్లకీ

శవాలే తీర్థ ప్రసాదాలు!

        ***

మూడే మునకలు

మూడే నిముషాలు

అయినా యింట్లో యీకోలీ సంగీత కచేరీలు!

        ***

గోదారి నీళ్ళు

పరమపదసో’పానం’

సేవిస్తే వైకుంఠవాసం!

        ***

పుణ్యం ప్రజలకి

ప్రచారం ప్రభుత్వానికి

స్వచ్ఛ భారత్ గోదావరికి!

        ***

గోదావరి పొర్లి పొర్లి యేడుస్తోంది!

ఉన్నప్పుడు ఊసే లేదు!

చచ్చాక పిండ ప్రదానం!

***

పాప ప్రక్షాళనకీ నదీ ప్రక్షాళనకీ

                           యెన్ని పుష్కరాలు పడుతుందో?

             ప్రభుత్వ ప్రక్షాలనకి!

***

గౌతమ మహామునికి కూడా తెలీదు

మాయ గోవు మర్మం!

 గోదావరి జలాల పంపకం!

***

త్రయంబకం బంగాళాఖాతాల మధ్య

ప్రవహించేది గోదావరి కాదు!

జన జీవిత రహదారి!

****

                                                          ప్రజలవద్దకు పాలన!

ప్రజలవద్దకు పుష్కరం!

                         గోదావరి జలమిప్పుడు ‘గాడ్ జల్’!

                                    ***

      తాగేనీళ్ళు సరే, తల మీద నీళ్ళూ

                           బాటిల్ పాతిక!

     పోస్టాఫీసులో ప్రవహిస్తోంది గోదావరి!

                    ***

అందరూ సమానులే

దేవునికీ ప్రజాస్వామ్యానికీ!

మంత్రులూ విఐపీలూ కొద్దిగా యెక్కువ సమానం!

                  ***

                  అటు ఆరొందల కోట్లు

            యిటు పదహారొందల కోట్లు

ఆనకట్టల కన్న స్నాన ఘట్టాలే మిన్న!

        ***

కృత్య దేవతల్నితిన్నదో లేదో

అకృత్యమైపోయింది ఆథ్యాత్మికం

నదిని మింగిన మనుషులొచ్చారు!

***

గాయపడ్డ గోదారి

క్రిష్ణమ్మతో పలికింది

యిక నీవంతే జాగ్రత్త సుమీ అని!*

మీ మాటలు

 1. జనం లో మెప్పు — నమ్మకం — గుర్తింపు కోసం —-రొండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు —
  పోటి గా — అక్కరకు రా ని ఖర్చులు —

  ఏలుతుంది రాజులు — మల్లి దొరల పాలన ????

  అంతా రాజకియెం

  రావు గారు భాగుంది sir….

  ————————————–బుచ్చి రెడ్డి గంగుల ————————-

 2. విలాసాగరం రవీందర్ says:

  True లైన్స్. నైస్

 3. delhi subrahmanyam says:

  చాలా చాలా బావుంది గురువు గారూ

 4. Sujatha.c says:

  Sujatha.సి
  Bammidi baga rastadu.

మీ మాటలు

*