నిశ్శబ్ద కల్లోలం

 

   –  ఎలనాగ

 

మాట్లాడుకోకపోవడంలో ఉన్న సుఖం మాట్లాడుకున్నాక అర్థమై మాటలను దూరంగా నెట్టేస్తావది సరే కాని encapsulated దుఃఖంలో చిక్కుకుపోయి పొందే ఏకాంత నరకయాతనల పీడనం నుండి నీకు విముక్తి దొరికేదెలా? పరస్పర బంధాల దారాలను పటపటా తెంపేసుకుని పాతాళ ఉపరితలం మీద ముక్కలవ్వాలనే కోరికకు బందీ అయినవాడా! పుట్టుకురావాలి నువ్వు కొత్తగా, ఊపిరాడనితనం లోంచి స్వచ్ఛమైన గాలులు నిండిన బయటి లోకంలోకి. బోనుకు బానిస అయ్యాక ఇక వేరే దేనికీ అతుక్కోలేని హృదయమే మిగులుదల. తెలుసుకున్నాననుకుంటావు గొలుసుల్ని తెంచుకోలేనితనం లోని హాయిని, మనుషుల్ని కలుసుకోలేనితనం లోని మాధుర్యాన్ని. ఆజన్మాంత దుఃఖతాండవానికి రంగస్థలమైన హృదయవేదిక మీద అదేపనిగా తలను బాదుకోవటం ఆపి చీకట్ల తెరలను చీల్చుకుని రా బయటికి.

***

elanaga

మీ మాటలు

  1. వాడికీ, వీడికీ వూచలే అడ్డు. వాడూ, వీడూ ఎదుటివాడు బందీ అనుకున్నంతకాలం, ఎవడు బందీనో తెలిసేదెట్లా?

    PS: అంతా ఒకే పేరాలా కనిపిస్తోంది. ప్లీజ్ సరి చేయండి.

మీ మాటలు

*