నా హీరో కోసం…

Naa hero ..

-కత్తి మహేష్

mahesh“హేయ్ విక్టర్ ! మెయిల్ చెక్ చేశావా?” అంటూ పక్క క్యూబికల్ నుంచీ మిస్టర్ వాస్ అనబడే కామినేని వసంత్ ఎగ్జయిటింగ్ గా అరిచినంత పని చేశాడు. మళ్ళీ ఒక్కసారి అటూ ఇటూ చూసి, తనవైపు చూస్తున్న చూపుల్ని పట్టించుకోనట్టు దర్జాగా నా దగ్గరకొచ్చి, మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు…రెట్టిస్తూ.
“లేదే” అన్నాను క్యాజువల్గా. “ఎనీ థింగ్ స్పెషల్?” అంటూ పనిచేస్తున్న విండో క్లోజ్ చేసి మెయిల్ ఓపన్ చేశా. హెచ్.ఆర్ నుంచీ ఏదో అర్జంట్ అని మార్క్ చేసిన మెయిల్. వాస్ వైపు కొంచెం ఖంగారుగా చూసేసరికీ, భుజం మీద క్యాజువల్ గా చెయ్యేసి నవ్వుతూ, “నథింగ్ టు వర్రీ…జస్ట్ చెక్” అన్నాడు.

ఓపన్ చేస్తే, ఎదో ఈవెంట్ ఇన్విటేషన్. సినిమా విత్ టీం. కాదు కాదు, ఎంటైర్ ఆఫీస్.
“హౌ ఎగ్జయిటింగ్ కదా !” అన్నాడు పొంగిపోతూ.
“సినిమానా!” అన్నాను, పొంగివస్తున్న చికాకుని కనిపించనీకుండా.
“అలాంటి ఇలాంటి సినిమా కాదు బాస్. బాహుబలి. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్. టికెట్లు దొరక్క జనాలు కొట్టుకు ఛస్తున్నారు. మనకేమో కార్పొరేట్ బుకింగ్. ‘ఎస్’ అని మెయిల్ కొట్టెయ్. ఆరువందల రూపాయలకి అందరూ కొట్టేసుకుంటున్న కొత్త సినిమా టికెట్ తోపాటూ పాప్ కార్న్, కూల్ డ్రింక్ కాంప్లిమెంటరీ.” అని లొడలొడా ఒక రన్నింగ్ కామెంట్రీ చెప్పేసాడు.
అతని ఎక్సయిట్మెంటు చూస్తూ పక్కనున్న క్యుబికల్స్ లోవాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతూ, మెయిల్ పంపడంలో బిజీ అయిపోయారు. కీబోర్డ్ టకటకలు తప్ప మరేమీ వినిపించడం లేదు.
మిస్టర్ వాస్ నావైపు, నా కంప్యూటర్ స్క్రీన్ వైపు, నా కీబోర్డ్ వైపు మార్చిమార్చి అంతే క్యూరియస్గా చూస్తున్నాడు.

“నేను తెలుగు సినిమాలు చూడను వాస్ గారూ” అన్నాను మెల్లగా.
నేను ఎంత మెల్లగా అన్నా, నాకే పెద్దగా వినిపించింది. అప్పటివరకూ టక్కుటక్కు మన్న కీబోర్డులు ఒక్కసారిగా ఆగిపోవడం నాకు క్లియర్గా తెలుస్తోంది.
“వాట్!!!” హార్ట్ అటాక్ వచ్చిన పేషెంటులా గుండెపట్టుకుంటూ వాస్ అంటుంటే, కొన్ని తలల క్యూరియస్గా క్యూబికల్స్ నుంచీ తాబేటి తలల్లా బయటికి వచ్చాయ్.
“ఇది తెలుగు సినిమా కాదండీ! ఇండియన్ సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా. అని నేను చెప్పడం కాదు. కరణ్ జొహర్ చెప్పాడు. అర్థమయ్యిందా?” అని కొంచెం సీరియస్ టోన్లో అన్నాడు వాస్.
“ఫరవాలేదు వాస్ గారూ. తెలుగులోనే సినిమా ఉంటుందిగా, తెలుగువాళ్ళే తీశారుగా. వద్దులెండి.” అని పొలైట్ గా అనేసి నా పని నేను చూసుకోవడానికి అటుతిరిగాను.
“స్ట్రేంజ్ మ్యాన్ యార్ ! బాహుబలికి రమ్మంటే, తెలుగు సినిమానే చూడనంటున్నాడు. వాటె పిటీ.” అనుకుంటూ వాస్ తన క్యాబిన్ వైపు నడుస్తూ గొణుక్కోవడం నాకు తెలుస్తూనే ఉంది. వెనకనుంచీ కొన్ని జతలకళ్ళు నా వీపుకి గుచ్చుకోవడం అనుభవంలోకి వస్తూనే ఉంది.

దాదాపు ఇరవై  సంవత్సరాలయ్యింది తెలుగు సినిమా చూసి.
ఒకప్పుడు…సినిమా అంటే పిచ్చి.

***

సినిమా అంటే ఒక పండగ.
వారంవారం వచ్చే పండగ.
ఇల్లంతా సినిమా పోస్టర్లే.
ఇల్లంటే ఇల్లుకాదు. షెడ్ లాంటిది. ఆస్ బెస్టాస్ రేకులతో కట్టిన చిన్న ఇల్లు.
అమ్మ. నేను. ఇళ్ళలో పాచిపని చేస్తే వచ్చే అంతో ఇంతతో సంసారం, నాచదువులూ.
పోస్టర్ పడిన రోజే తడిఆరని పోస్టర్లని జాగ్రత్తగా చించితీసుకొచ్చి ఇల్లంతా అంటిస్తే, ఏమీ అనకుండా నవ్వేది అమ్మ. రాత్రి నిద్రపట్టనప్పుడు కప్పువైపు చూస్తూ, కనిపించే చిరంజీవినీ, బాలకృష్ణనీ చూసి డిషుండిష్షుం అంటుంటే మెత్తగా కసురుకునేదీ అమ్మే. రాంజేంద్ర ప్రసాద్ పోస్టర్ చూసి ఫక్కున నాక్కూడా తెలీకుండా నేను ఏదో తెరమీది జ్ఞాపకాన్ని తెరలుతెరలుగా గుర్తుతెచ్చుకుని నవ్వితే, పిచ్చోడ్ని చూసినట్టు చూసేదీ అమ్మే.
అమ్మే నాకు లోకం.
సినిమా నాకు ప్రాణం.

***

ఏ సినిమా రిలీజ్ అయినా, రిలీజ్ రోజు హడావిడి మొత్తంనాదే.
ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ సినిమా అంటే ఏటమాంసం తెగే పెద్దపండగతో సమానం.
సిటీ నుంచీ వచ్చే కటౌట్, రిలీజ్ రోజు ముందరే థియేటర్ ముందు నిలబెడుతుంటే, నా జతోళ్ళతో కలిసి డప్పు కొట్టించేది నేనే. రాత్రంతా మేలుకుని రంగుకాయితాల సరాలు కట్టించేది నేనే. వారంరోజులు ఎండబెట్టిన టపాకాయలకి కావిలి నేనే. ఎగరెయ్యడానికి న్యూస్ పేర్లు చించి బస్తాల్లో నింపేదీ నేనే. జనాల్ని తోసుకుని టికెట్ తెచ్చేది నేనే.

షర్ట్ చిరిగినా, చెయ్యి ఒరుసుకుపోయి రక్తం కారినా, అప్పుడప్పుడూ పోలీసుల లాఠీలు వీపు విమానం మోత మోగినా. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటంలోని ఆనందమే ఆనందం.

ఈలలూ గోలలూ థియేటర్ మారుమ్రోగిస్తుంటే. కర్పూర హారతులు హీరోలకు నీరాజనాలందిస్తుంటే. ఐదు,పది,పావలా బిళ్ళలూ ఉత్సాహంగా గాల్లో ఎగురుతుంటే. అప్పుడు సరిగ్గా తెరపై కనిపించని హీరోకూడా సూపర్ మ్యాన్ లాగే ఉండేవాడు. వినిపించని డైలాగ్ కూడా విజిల్ వేసే రేంజ్ లో అనిపించేలా ఉండేది. సినిమా చూడ్డంకాదు. అలా సినిమా చూడ్డమే, అసలైన సినిమా చూడటం.

సినిమా చూసేంత డబ్బుండేది కాదు.
మా క్లాసు లో ఉండే మిగతావాళ్లకి డబ్బుండేది.
సినిమా అంటే అభిమానమూ ఉండేది. కొందరు హీరోలంటే ప్రత్యేకమైన అభిమానమూ ఉండేది.
కొన్ని గ్రూపులు కొన్ని సినిమాలకే పొయ్యేవి. కానీ నేను మాత్రం అందరికీ కావాలి.నాకు అన్ని సినిమాలూ కావాలి. తెర మీద బొమ్మ పడితే చాలు, అన్ని కష్టాలూ తీరిపోయి, కొత్తలోకాలకు కనపడేవి.

***

ఒక రోజు ఉదయమే స్కూలు పిట్టగోడ మీద మీటింగ్ జరిగింది.
ఒకరి సినిమాకు మరొకరు పోని రెండు గ్రూపులూ కలిసి నన్ను పిలిపించాయి.
“చెప్పరా…నీకు చిరంజీవి ఇష్టమా ! బాలకృష్ణ ఇష్టమా?” అంటూ సూటిగా పాయింట్ కి వచ్చేశాడు. కొంచెం లావుగా, పొడవుగా ఉన్న ఒక కుర్రాడు. చాలా సార్లు, రంగుకాయితాలకూ, గమ్ముకూ డబ్బులిస్తుంటే చూసాను అతన్ని. అప్పుడప్పుడూ నోట్లిచ్చి చిల్లర తెమ్మనేదీ అతనే.
“ఇద్దరూ ఇష్టమే అన్నా..వాళ్లతో పాటూ రాజేంద్ర ప్రసాద్ కూడా” అంటూ నసిగాను.
పెద్దగా నవ్వుతూ, ఆ మాట అడిగినోడు వాళ్ళ గ్రూప్ వైపుకి తిరిగి, “రాజేంద్ర ప్రసాద్ ని కలుపుతాడేందిరా వీడూ ! ” అంటూ పెద్దగా నవ్వి, నావైపు తిరిగి, “ఇష్యూ అది కాదు. బాలకృష్ణనా…చిరంజీవా!” రెట్టించి తను.
“ఇద్దరూ ఇష్టమే” అని బింకంగా నేను.

chinnakatha
“నీకిట్లా చెప్తే అర్థం కాదుగానీ, చూడూ…బాలకృష్ణ మావోడు. చిరంజీవి వాళ్ళోడు. ఈరోజు నువ్వు ఎవరి వైపు వెళ్తే వాళ్ళ సినిమాకే పనిచెయ్యాల. వాళ్ల సినిమానే చూడాల. అర్థమయ్యిందా.” అంటూ గోడ మీద కూర్చున్న మరో గ్రూపుకేసి చూశాడు. ‘అంతేకదా!’ అన్నట్టు అక్కడి తలలు ఊగాయి.
నాకు ఏమీ అర్థంకాక, మౌనంగా చూస్తూ ఉండిపోయాను.
నన్ను దగ్గరగా లాక్కుని, తీక్షణంగా చూస్తూ… “చెప్పు. చిరంజీవా…బాలకృష్ణనా!”
“అందరి సినిమా కావాలన్నా” అన్నాను బలహీనంగా.
ఇంతలో ఆ గ్రూప్ నుంచీ ఒకరు ఒక్క గెంతుతో నాదగ్గరకొచ్చి, “ఏయ్, డిసైడ్ చేసుకోమంటే పోజుకొడతావేందిబే? అయినా, చిరంజీవి, బాలకృష్ణా ఇద్దరూ మీవోళ్ళు కాదు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకొమ్మంటే పొగరారా నీకు!” అని చిరాగ్గా నన్ను చూసి, అప్పటి వరకూ నన్ను బెదిరించిన కుర్రాడితో, “చూడు సాగర్. వీడు మీవోడూ కాదు. మావోడూ కాదు. ఇద్దరికీ పనికొస్తాడు అంతే. వీడు కాకపోతే ఇంకొకడు. వదిలెయ్.” అని మొత్తం గ్రూప్ ని అక్కడ్నించీ తీసుకెళ్ళిపోయాడు.

సాగర్ నావైపు తీక్షణంగా చూస్తూ, “ఇంకెప్పుడైనా థియేటర్ దగ్గర కనిపించావో…” అంటూ నన్ను కిందకి తోసేసి గ్రూప్ వైపు వెళ్ళి పిట్టగోడ మీద కూచున్నాడు. నేను ఒంటరిగా ఇటువైపు మిగిలాను. నేల మీద నుంచీ లేస్తూ, మట్టిని విదుల్చుకుంటూ, వాళ్లవోళ్ళేమిటీ, వీళ్ళవోళ్ళేమిటో నాకు అర్థంకాక గుండెల మీద చెయ్యిపెడితే, సిలువ తగిలింది. వాళ్ళూ వీళ్ళూ మాట్లాడింది కులమని అప్పుడే అర్థమయ్యింది.

గుండెల్లో భగ్గుమన్న బాధ. ఆడుతున్న సినిమా మధ్యలో కార్బన్ సెగ ఎక్కువై, రీలు కాలిపోతున్న వాసన. తెరమీది మంటలు తెరనే కాల్చేస్తున్నట్టు భ్రమ. కలలో వచ్చినట్టు, ఇంటికొచ్చేసా. చుట్టూ ఉన్న పోస్టర్లలోని గన్నులు, నామీదే ఎక్కుపెట్టినట్టు ఫీలింగ్. ఒంటికాలి మీద ఎగిరిన హీరో, నా మీదకే దూకుతున్నట్టు భయం. వెక్కిరిస్తున్నట్టు. వెర్రిగా చూస్తున్నట్టు. కళ్ళు మసకబారి, పోస్టర్లోని ఫోజులన్నీ కెలికేసినట్టు భయంకరంగా…చాలా భయంకరంగా.

భయం. ఉన్మాదం. కోపం. ఉక్రోషం. ఒక్కో పోస్టర్నీ బలంగా లాగేస్తుంటే, అప్పటిదాకా ఆస్ బెస్టస్ రేకులమీద కనిపించకుండా ఉన్న ఎన్నో బొక్కలు ప్రత్యక్షం అవుతున్నాయి. వెయ్యి ముక్కలుగా చించేస్తుంటే, మనసు వంద ముక్కలుగా విడిపోయింది.

పడిపోయాను. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి స్పృహ లేకుండా నిద్రపోయాను. లేచేసరికీ మూడవుతోంది. కాళ్ళీడ్చుకుంటూ, ఇల్లూడ్చేశాను. సినిమా ఆనవళ్ళు లేకుండా తుడిచేశాను. ఏంచెయ్యాలో తోచక మళ్ళీ ఊర్లోకి వచ్చాను.

***

సుజాతా టాకీసులో, ఏదో సినిమా ఆడుతోంది.
డబ్బింగ్ సినిమా. సగం సినిమా అయిపోయిందేమో. పెద్దపెద్దగా శబ్దాలు వినిపిస్తున్నాయి.
జేబులో పావలా ఉంది. గేటు దగ్గర సౌదులన్న బీడీ తాగుతున్నాడు.
చేతిలో పావలా పెట్టి నవ్వితే, చల్లగా గేటు తీశాడు. మెల్లగా లోపలికి నేను.
తెర మీద హీరో అర్జున్ కనిపిస్తున్నాడు. సూట్ కేస్ తీసుకుని రైల్వేస్టేషన్ దగ్గరికి హడావిడిగా వస్తున్నాడు. వెనకాలే హీరోయిన్. రోజా సినిమాలో చేసిన అమ్మాయి. హఠాత్తుగా పాట మొదలయ్యింది. విచిత్రమైన బీటు. ఒక చిన్నపిల్లాడెవడో బుల్లిబుల్లి అడుగులు వేస్తూ, కాస్తపాడేసరికీ మైకేల్ జాక్సన్ లాంటి గొంతేసుకుని, ఒకతను గెంతుతూ తెరమీద ప్రత్యక్షం అయ్యాడు. అతని మెడలో సిలువ, చెవిపోగులకున్న సిలువా నా కళ్లను జిగేలుమనిపించాయి.
ఏదో ఆలోచన వచ్చింది. పక్కన ఎవరైనా ఉన్నారేమో చూశాను. ఎవరూ లేరు.
ముందున్న సీట్లోవాళ్ళని బలంగా తడుతూ అడిగాను, “ఎవరతను?”
“ప్రభుదేవా” అని సమాధానం.
“ప్రభు…దేవా పేరు. మెడలో సిలువ. చిరంజీవి-బాలకృష్ణకన్నా మంచి డ్యాన్సర్. నా హీరో…మావాళ్ల హీరో” అనుకుంటూ, స్పీడుగా బయటొచ్చి, డిస్ల్పేలో ఉన్న ఒక ఫోటో కార్డ్ రహస్యంగా దొంగిలించి, సైదులికి తెలీకుండా గేటు దాటి రయ్యిమని స్కూల్ దగ్గరికి వచ్చాను.

పిట్టగోడ దగ్గర తన గ్యాంగ్ తో సాగర్ ఇంకా కూర్చునే ఉన్నాడు. గర్వంగా అడుగులేసుకుంటూ వెళ్ళాను. “ఏమిటన్నట్టు” చిరాగ్గా ముఖం పెట్టాడు.
చేతిలో ఉన్న ప్రభుదేవా ఫోటో కార్డ్ దగ్గరగా పెట్టి “ఇదిగో మా హీరో..ప్రభుదేవా” అన్నాను.
ఫోటోనీ నన్నూ మార్చిమార్చి చూస్తూ, కసిగా నవ్వి, “పేరు ప్రభుదేవానే, డ్యాన్స్ మాస్టర్ సుందరం కొడుకు. బహుశా బ్రాహ్మలై ఉంటారు. మీ వాళ్ళు కాదు.” అని నలిపి నా ముఖాన కొట్టాడు.

ఆ తరువాత నాకు ఏమీ వినిపించలేదు. అప్పటి నుంచీ నాకు తెలుగు సినిమా కూడా కనిపించలేదు.

****
టైం ఐదయ్యింది.
కంప్యూటర్ క్లోజ్ చేసి బయటకొస్తుంటే, క్యాంటిన్ దగ్గర మిస్టర్ వాస్ అనబడే కామినేని వసంత్ కనిపించాడు. కళ్ళు కలవగానే ఏదో సైగ చేస్తూ ఆగిపోయి, బై అన్నట్టు చెయ్యి ఊపాడు. వెళుతుంటే, నాకు వినిపిస్తూనే ఉంది, పక్కనున్న వాళ్లతో “హి ఈజ్ నాట్ కమింగ్ టు బాహుబలి యార్…హౌ సాడ్ ! హి ఈజ్ మిస్సింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్” అనడం.
కిందకొచ్చేసరికీ, రిసెప్షనిస్ట్ “సర్… మార్నింగ్ పేపర్ అడిగారు కదసర్. ఇదిగోండి.” అంటూ పొద్దున అడిగిన పేపర్ ఇప్పుడిచ్చింది. చేతిలో పట్టుకుని కార్ ఎక్కాను. పక్క సీట్లో పేపర్ పడేసి, కార్ స్టార్ట్ చేసేసరికీ, న్యుస్ పేపర్ పేజీలు విడిపడ్డాయి.
ఒక న్యూస్ ఐటం ఆకర్షించింది.
“బాహుబలి రిలీజ్ సందర్భంగా భీమవరంలో రాజుల సందండి – పర్మిషన్ కి పోలీసుల నిరాకరణ”
బాధగా అనిపించింది.
సినిమాని సినిమాగా చూశాను ఒకప్పుడు.
ఇప్పుడు కులంగా తప్ప మరేరకంగానూ చూడలేకపోతున్నాను.
మాకులపోడు కూడా టాప్ హీరో అయితేతప్ప తెలుగు సినిమా చూడకూడదనుకున్నాను.
నా హీరో కోసం…ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాను.
తప్పు నాదా ! సినిమాదా! ! లేక, ఇలా సినిమాని కులంగా మార్చేసిన కులాలదా !!!
ఒక లాంగ్ డ్రైవ్ తప్పదనిపించింది.
కార్ ని ముందుకు పోనించాను.

*

మీ మాటలు

  1. సూపరన్నా.. ఎందుకు ఈ విశయం మీద ఎవరూ ఏమీ ఇంకా రాయట్లేదనుకున్నా.
    గూబ గుయ్యి మనేలా, చెంప చెళ్ళు మనేలా వుంది.

    • mahesh kathi gaaru correct ga chepparu kula pichi manavallu ekkadiki vellina marichipovatam ledhu veelaki america vellina europe vellina adhe kula pichini chusaanu

  2. మంచి సబ్జెక్ట్.నేను రిలేట్ చేసుకోగలిగాను.చిన్న డౌట్…మరి ప్రభాస్ రాజు సినిమాకి కామినేని వసంత్ ఎందుకు అంత ఎగ్జైటిగా వున్నట్టు?

  3. Chimata Rajendra Prasad says:

    సినిమా రంగం మన రాష్ ట్ర మ్ లోనె ఇలా ఉందా బాలీఉడ్ లో,తమిళనాడు లో కూడా ఇదే పరిస్థితి ఉందా?
    సినీ రంగ చరిత్ర తెలిసిన కంపల్లె రవిచంద్రన్ లాంటి వాళ్ళు ఈ పరిస్థితికి దారి తీసిన కారణాలు విశ్లేషించ గలరనుకుంటా

  4. విలాసాగరం రవీందర్ says:

    బాగుంది కథ మంచి సబ్జెక్టు

  5. ఒకరు says:

    చెరువులో గుడ్డలిప్పుకుని ఈత కొట్టేవాళ్ళ మీద కోపం వచ్చి, ఎవరో ఏదో కడుక్కోవడం మానేశారట. ఎవరికి నష్టం? సినిమా అభిమానులు కులాల గజ్జితో కొట్టుకు చస్తే, దానికి సినిమా మీడియా ఏం చేస్తుందీ? సినిమా అనేది ఒక వ్యాపారం. ఆ వ్యాపారం చేసే వాళ్ళు, కులాల గజ్జి అభిమానుల్నీ ప్రోత్సహిస్తారు, మతాల చీడ అభిమానుల్నీ ప్రోత్సహిస్తారు. సినిమా అనే సరుకుని కొనుక్కుంటున్నప్పుడు, ఆ సరుకులో ఏం వుంది అని చూడాలి గానీ, ఆ సరుకుని ఇష్టపడే చెడ్డ మనుషులెవరూ, దాన్ని తయారు చేసే మనుషులు ఎవరూ అని చూస్తే, సినిమాయే కాదు, మరే సరుకూ కొనలేము. చాలా తప్పుగా వుంది ఈ కధ.

    — ఒకరు

    • కథ కులంకారణంగా ఏలియనేట్ చెయ్యబడిన ఒక సినిమా అభిమానిది. కేవలం సినిమాని సినిమాగా ప్రేమించిన ఒక దళిత క్రిస్టియన్ ది. అతని నిర్ణయం మీకు చీప్ గా అనిపించొచ్చు. నేను అదొక విప్లవం అనుకుంటున్నాను. ఎవరి ఆలోచన వారిది.

      • ఒకరు says:

        “సినిమాని సినిమాగా ప్రేమించిన” ఒకరి నిర్ణయం మీకు విప్లవంగా కనబడింది. మరి, మీరేగా, కొన్ని వారాల కిందట, ఇదే పత్రికలో, “సినిమాని సినిమాగా చూడకూడదు” అంటూ ఒక పెద్ద వ్యాసం రాసిందీ? అప్పుడు తప్పైన విషయం, ఇప్పుడు విప్లవకరంగా ఎలా అయిందీ?

        సినిమా అనే సరుకుని కొనుక్కుంటున్నప్పుడు, ఆ సరుకులో ఏం వుందో చూస్తామా, దాన్ని అభిమానించే చెడ్డ మనుషులెవరో చూస్తామా అని అడిగిన ప్రశ్నని ఎగరగొట్టేశారు.

        ఒకరు

  6. చక్రి says:

    వాడడెవడో కులాన్నంటగడితే మీ కేమి బాధ, కథలో చొప్పించాల్సింది అభిమానులను గురించి కాదు, హీరోలు తమ డైలాగుల్లో రక్తం, వంశం..ప్రాంతం అంటూ చెప్పకనే చెప్పే తమ కుల వంశ ప్రాంతాల గొప్పదనాన్ని అవతలి వాడిని దిగజార్చే విధానాన్నీ చూసి తెలుగుసినిమా చూడటం మానేశా అని ఉండాలి కథ !!!

  7. Seetharam chowdary says:

    ఇది ఎలా వుందంటే….

    కమ్మ రెడ్డి కాపు రాజు కులాల మీద అక్కసు వ్హేల్లగాక్కినట్టుగా
    ఆథ్మనెఉనథ భావం తో అల్లాడిపోతున్న వాడు రాసిన పిచి కథల
    ఏమయ్య kathii …మంచిని చూడడం నేర్చుకోలేద నువ్వు…అన్ని నెగటివ్ పాయింట్స్ పట్టుకుని వేలాదతావ్
    కుల గజ్జిని సినిమాలకు పూసె కొంతమంది దోవ్ర్బగ్యులు వున్నారు…కాదనటం leedu ..
    నీ బుధి ఎటు పోయింది అంటున్న…..శిలువ సుడగానే ఎంటరుక లేసి నిలబడింది అని రాసుకున్నావ్….అది కులగజ్జి కాదంటావా… ఖలికి బలపం పట్టుకుని బాహుబలి చేత అని ప్రచారం చేసావ్ కదరా….
    ఈ ఆటిట్యూడ్ పట్టుకుని సినిమా ఇండస్ట్రీ లో ఎం సదిధం అని ….
    మంచి మాట్లాడు…..పాజిటివ్ గ వుండు…మంచి మూవీస్ తీయు…నిన్ను అబిమనిస్తం…అంతేగాని ఎ రాచ రంబోల మీటింగులు పెట్టి ప్తు వీడి మొహం పాడుగాను అని మాత్రం అనిపిమ్చుకోకు …

    • అంత పాజిటివ్ నెస్ కూడా మంచిదికాదులెండి (AIDS positive అని చెప్పగా గంతులేసిన వ్యక్ల్తిని నేనింతవరకూ చూడలేదు). ప్రపంచంలోని చెడునంతా ఇగ్నోర్ చేసి, అపరిచితుడులో రాము లా ఉండడం practikalకాదు. అలా మీరుకూడా ఉండరని నాకు తెలుసు. ఆంగ్లేయుల పాలనలో పాజిటివ్ అంశాలు వెదుక్కొని మనం వారి చంకలు నాకుతూ ఉందిపోయేదానికి మనకు స్వాతంత్ర్యమెందుకన్నట్లుంది మీవాదన.

  8. మహేశ్ గారు కొత్త విషయాన్ని లేవనెత్తారు. కానీ చక్రిగారన్నట్లు సినిమాల్లో చూపుతున్న రెడ్డి, కమ్మల కులగజ్జిని ఎండగట్టి ఉంటే ఇంకా బావుండేది. ఇటీవల కొత్త రూపంలో వచ్చిన బాపన గజ్జిని కూడా. ఇటీవలి సినిమాల్లో హీరోలు బాపన వేషాలు వేస్తున్నారు. కొందరు ఆ కులాన్నిఅకారణంగా కించపరుస్తున్నారు. ఎక్కడా ఏ కులాన్నీ కించపరచకూడదు. కులాధిపత్య ధోరణినే ఎండగట్టాలి.

    పై వ్యాఖ్యలు చూస్తుండే కొంతమంది ఇది కాదని పొరబడినట్టుంది. రచయితను, కథలో కథచెప్పే వ్యక్తిని వేరుగా చూడాలి కదా. కథలోని పాత్రల భావాలను రచయితకు ఆపాదిస్తే విషయం చాలా దూరం పోతుంది.

    ఇక సినిమా పిచ్చి గురించి. చిన్నప్పుడు నేను కూడా విపరీతంగా సినిమాలు చూసేవాడిని. కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు చూడ్డం లేదు. కారణాలు బోలెడు. తాజా కారణమొకటి చెబుతాను. మహేష్ బాటు శ్రీమంతుడు సినిమా గురించి బెలెడు ప్రచారం చేస్తున్నారకదా. అందులోంచి. నేను ఆ సినిమా చూడలేదు. ఊరకే చూపించినా చూడను.
    టీవీలోనో, రేడియోలోనో ఆ సినిమాలోని ఒక సంభాషణ విన్నాను..
    హీరో అంటున్నాడు ఎవరితోనో అంటున్నాడు.. ఆ సంభాషణ..
    ‘మీ నాయన ఏం చేసేవారండి?‘
    ‘వ్యవసాయం..‘
    ‘మరి ఆయన తర్వాత మీరది ఎందుకు చేయలేదు‘

    ఇది ఎలా ఉందంటే.. చెప్పులు కుట్టేవాడి కొడుకు చెప్పులే కుట్టాలి అన్నట్లు. ఇలాంటి సినిమాలతో మహానుభావులు దేశాన్ని ఉద్ధరిస్తున్నారు. ఆ ఉద్ధరణ తట్టుకోలేకే సినిమాలు మానేయడం.

  9. కథ బాగుంది మహేశ్ కత్తి గారూ! ఇటీవల జరిగిన అభిమానుల అరాచకాల నేపథ్యం లో ఈ కథ రావడం బావుంది. సినిమావ్యాపారం లో నిర్మాతలు వారి లాభాలకోసం ఎలాఅయినా తీస్తారు. అభిమానులు మాత్రం వాడు మా కులం వాడు, వీడు కాదు … సహించకూడదు వీడిని అనుకుంటూ వారి కాలాన్నీ జీవితాలనీ వ్యర్థం చేసుకుంటారు. అభిమాని ఎవడైనా ఈ గొడవల్లో చస్తే ఆ హీరో ఒక సంతాప ప్రకటనా, యాభైవేల చెక్కు పారేసి పోతాడు, అంతే! మంచి విషయం చెప్పారు, అభినందనలు.
    అమ్మతో అనుబంధం గురించి బాగా రాసారు, అభినందనలు.
    ఐతే, కథల్లో కులాల ప్రస్తావన తేవడం, మీవి కాని కులాలని తక్కువచేసినట్టు రాసి, మీ మతాన్ని భుజాలకెత్తుకోవడం మంచి సాహిత్యం కాదని నేను అనికుంటాను.

    • కథ కులాల గురించి కాదు. సినిమా గురించి. పనిగట్టుకుని కొన్ని కులాల్ని ఎక్కువ చేసి చూపించడం, తక్కువ చేసి చూపించడం కథలో ఎక్కడా లేదు. “మీ మతాన్ని” అని మీరు నన్ను ఎందుకన్నారో తెలీదుగానీ, నేను ఎథీయిస్టుని మాత్రమే కాదు, నిహిలిస్టుని కూడా.

  10. నీహారిక says:

    >>>>>మాకులపోడు కూడా టాప్ హీరో అయితేతప్ప తెలుగు సినిమా చూడకూడదనుకున్నాను<<<<<
    మీ కులంలో ఒక్కడంటే ఒక్క హీరో కోసం మేము కూడా ఈ ఎడారిలో కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం. ఒక రాజేంద్రప్రసాద్, ఒక నాని లాగా తెలుగుతనం ఉట్టిపడేలా "నేచురల్ హీరో" ఎపుడొస్తాడు ? విమర్శదేముంది ప్రతి ఒక్కరూ చేయగలరు. హీరో అవడం అనేది పెసరట్టు వేసినంత ఈజీ ఏమీ కాదు.

  11. నీహారిక says:

    >>>>మాకులపోడు కూడా టాప్ హీరో అయితేతప్ప తెలుగు సినిమా చూడకూడదనుకున్నాను.<<<

    మీ కులంలో ఒక్కడంటే ఒక్క హీరో కోసం మేము కూడా ఈ ఎడారిలో కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం. ఒక రాజేంద్రప్రసాద్, ఒక నాని లాగా తెలుగుతనం ఉట్టిపడేలా "నేచురల్ హీరో" ఎపుడొస్తాడు ? విమర్శదేముంది ప్రతి ఒక్కరూ చేయగలరు. హీరో అవడం అనేది పెసరట్టు వేసినంత ఈజీ ఏమీ కాదు.

  12. అనిల్ డ్యాని says:

    మహేష్ అన్న కధా కధనం అంతా చాలా బాగుంది కనీసం కధలో కుడా వాళ్ళ కులపు హీరోల్ని అంటే పడని వాళ్ళని మనం చేయగలిగింది ఏమీ లేదు హీరో లు కావడం పెసరట్టు వేసినత తేలికేం కాదు కాని ఆ కులపోళ్ళని రానివ్వకుండా ఉండడం అంతకన్నా చాలా తేలిక

  13. ఈ కథకుడు ‘తన స్వీయానుభవం” అని అంటున్నాడు కాబట్టి ఇక ఏమనలేమ్. కాకపోతే చిరంజీవి, బాలకృష్ణ కాలంలొ అందరు సినిమాని ఒక పిచ్చిగా చూసిన ప్రజలలొ నేను కూడ ఒకడినే.. అందునా….

    చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు ల అభిమానలందరు నా వద్దకు వచ్చి వారి హీరోల సినిమాల విడుదల సమయంలో నా చేత పెద్ద పెద్ద హోర్డింగ్స్ లాంటి పేయింటింగ్స్ వేయించుకొని వెళ్లిన వాళ్లే. అందరి హీరోలకు అలా కటౌట్ లాంటి పేయింటింగ్స్ వేసిన వాడిని, నన్నెవరూ కూడ ఈ కథలో లాగ నీవు ఎవరివి అని అంటూ అడగనే లేదు మరి..! కాని అప్పట్లో ఇప్పటిలాగ “కుల స్పృహ” అస్సల్ లేనే లేదు నాకు తెలిసినంత వరకు.

    కోస్తా, సర్కారు జిల్లాలు, కృష్ణ, గుంటూరు వరకు అప్పట్లో ఏవైనా కులాల వారిగా విడిపోయి వున్నారేమో గానీ.. రాయల సీమ ప్రాంతంలో అప్పటికి ఇంకా ఈ కుల స్పృహ లేనే లేదు. మరి రచయత చిత్తూర్ జిల్లా వాసి. వారి ప్రాంతంలొ ఏవైనా అప్పట్లోనే అలా కులాల వారిగా అభిమానులు ఏర్పడ్డారేమో..?

    నాకు తెలిసి గ్లోభలైజేషన్ వచ్చిన తర్వాత..90 దశాబ్దపు చివర్లో ఓ ఐదారు సంవత్సరాలకు గానీ కులాల వారిగా అభిమానం అన్నది ఏర్పడటం మొదలయ్యిందని అనుకొంటాను. మరి కథకుడు ఇప్పటి కాలపు పైత్యాన్ని అప్పటి కాలాని ఆపాదించడం…. బహుశ తన కథలోని సారాంశం మాత్రమే చెప్పాలనే ఉద్దేశంతో అలా రాసారేమొ అని అనుకొంటున్నాను

    • రచయిత తన స్వీయానుభవం అని ఎక్కడా చెప్పలేదు. ఇదొక ఫిక్షనల్ నెరెటివ్.

      నిజాలు మాట్లాడాలంటే…
      సినిమాల్లో కులం చూడటం ఎన్.టి.ఆర్ రాజకీయాల్లోకి రావడంతో మొదలయ్యింది.
      తిరుపతి లాంటి పట్టణాలలో బాలకృష్ణ – చిరంజీవి ఫ్యాన్స్ కులం ఆధారంగా విడిపోయి కొట్టుకోవడం 80ల చివరిముంచీ సర్వసాధారణం. గ్యాంగ్ లీడర్ – ముద్దుల మావయ్య సినిమాల నుంచీ అనుకోవచ్చు.
      కేవలం కోస్తా జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అదే ధోరణి కొనసాగింది. ఇప్పటికీ కొనసాగుతోంది. కులాల జోడింపు కొనసాగుతోంది అంతే. మరింతగా ధోరణి పెరుగుతోంది. అంతే.

      • కమల్ says:

        ఈ లింక్‌ని కామన్ ఫ్రెండ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన చోట మీరిచ్చిన కామెంట్‌లో “నా అనుభవంలో జరిగినవి” కొన్ని రాసాను అని వివరించారు. అందుకు ఆ విషయాన్ని మీకు కోట్ చేయాల్సి వచ్చింది.

        తిరుపతిలొ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం హాస్టల్స్‌లలొ కులాల వారిగా వుండటం అన్నది అక్కడి ఆనవాయితి. అదే సినిమాల అభిమానుల విషయంలో ప్రతిబింబించిందేమొ గానీ..!

        యన్.టి.ఆర్ రాజకీయాల్లోకి వచ్చాకే కులం చూడటం మొదలయ్యిందని అంటున్నారు. అప్పుడు నేను కాలేజీ విద్యార్థిని. నాకు తెలిసి అప్పటికింకా “కులం” అనే కోణమే లేదు ప్రజలలో బహిరంగంగా..! ఇక హీరోల అభిమానుల మద్యన గొడవలు అన్నవి అక్కినేని, యన్.టి.ఆర్ అభిమానుల మద్యన కోకొల్లలు జరిగాయి. తలలు కూడ పగల గొట్టుకొన్నారు అవి మీకు తెలీవు. బహుశ మీరు ఇంకా పుట్టి వుండరనుకొంటానులే.

        మీరు కోస్తా మాత్రమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా సాగిందని అంటున్నారు. కడప, కర్నూల్ జిల్లాలలో ఎక్కడా కూడ కులపరంగా అభిమాన సంఘాలు ఏర్పడటం కానీ.. లేక గొడవలు జరిగినట్లుగాని రికార్డ్స్ లేనే లేవు. మీరు అలా గుత్తాధిపత్యంగా మొత్తం రాష్ట్రమంతటా అని చెప్పడం భావ్యం కాదు. నేను ప్రత్యక్ష సాక్షిని ఆ కాలపు యువకుల్లో.

        కడప ప్రాంతంలో అస్సల్ కుల ప్రాతిపదికన చీలన ప్రజా వ్యవస్థే లేదు. ఇక సినీ అభిమాన సంఘాలు ఏర్పడటమా..? మీరు చరిత్ర గురించి కాస్త తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.

  14. Dr.Pasunoori Ravinder says:

    మ‌హేష్ గారు సూప‌ర్ బాగా రాశారు.
    బ‌ర్నింగ్ ఇష్యూని తీసుకొని మంచి క‌థ రాశారు.
    సినిమాను సినిమాగా చూసే రోజు రావాలి. కులాల కుల్లుతో నిండిపోయిన తెలుగు సినిమా ఇప్ప‌ట్లో బాగు ప‌డే ఛాన్సే లేదు. దానికి బాహుబ‌లి సినిమా రిలీజ్ స‌మ‌యంలో ఆంధ్రాలో క‌మ్మ‌లు, రాజులు చేసిన హంగామే నిద‌ర్శ‌నం. అగ్ర‌కుల‌రాజ‌కీయాల‌కు ఏమాత్రం తీసిపోకుండా త‌యారైంది సినిమా ఇండ‌స్ర్టీ. మంచి క‌థ‌ను రాసిన మ‌హేష్‌గారికి, అందించిన సారంగ‌కు ధ‌న్య‌వాదాలు.

  15. కథ బాగుంది. ఒక పాయింట్ ఆ వ్యూని థ్రో చేస్తుంది.
    ఈ కథ మెటామోడర్న్ సాహిత్య లక్షణాలను సమర్ధవంతంగా ఇముడ్చుకొండి. ప్రస్తుతం వస్తున్న అత్యాధునిక సాహిత్యం యొక్క ప్రధాన లక్షణాలు 1. భిన్న అస్థిత్వాల స్వీయాత్మ ప్రకటన 2. చరిత్ర నిరాకరణ. నిజానికి ఇదే అత్యాధునిక కవిత్వానికి ఆయువుపట్టు.
    ఈ రెండు అంశాలు తెలుగుకో, తిరుపతికో పరిమితం కాని విషయాలు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఇవే “అంతర్జాతీయంగా” సాహిత్యంలో తొంభైల తరువాత స్థిరీకరింపబడుతున్న విలువలు.
    పై రెండు అంశాలు పై కథలో ఏ విధంగా ప్రతిబింబించాయో, ఈ కథను విమర్శించే వారు గమనించాలి.
    ఇలాంటి కథలు అత్యాధునిక సాహిత్యానికి గ్లోబల్ నమూనాలు. రచయితకు అభినందనలు
    బొల్లోజు బాబా

  16. ఎక్కడో ఒక చోట జరిగిన దానికి మీడియాలో వచ్చిన వార్తల రంగు మరింత పులిమి, హడావుడి చేయడం ఇటువంటి రచయితలకు మామూలై పోయింది. సోషల్ మీడియాలో ఫాలోయర్లు ఉన్నంత మాత్రాన తాము ఏమి రాసినా అది అమ్ముడై పోతుందనీ, అందరూ జేజేలు కొడతారనీ పిచ్చి నమ్మకం!

    పైన చక్రి అనే వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పగలరా? రెడ్డి, నాయుడు చౌదరి అనే వాళ్ళంతా హీరోలూ, వూరి పెద్దలూ, తొడగొడితే వూరంతా దద్దరిల్లే వాళ్ళూనూ! వాళ్ల గురించి ఏమీ అనడానికి నోరు పెగల్దు. దమ్ము అంతకంటే లేదు.

    మా వంశం, మా రక్తం అని డైలాగులు కొట్టే హీరోల్ని వేలెత్తి చూపేందుకు అసలే వీలు లేదు.

    ఎంత సేపూ మీ దళిత కోణం నుంచే ప్రతి సమస్యనూ పరిశీలించడం, గ్లోరిఫై చేయడం నుంచి బయట పడండి కాస్త

    • కథలో లేనిదాని గురించి చర్చిస్తే సమాధానాలు ఏముంటాయ్ ? కథలో ఏం ఉండాలో మీరు డిసైడ్ చేస్తే, ఇక కథ ఎందుకు? కథ గురించి ఏమైనా చర్చకు తెస్తే, మాట్లాడుకుందాం.

  17. ఈ కులాలా రొచ్చు గత పది సంవత్సరాల నుండి మొదలైంది . అంతకు ముందు చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ నాగార్జున లాంటి నటుల పేర్లే తప్ప వాళ్ళ కులం గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు , మాట్లాడిన వేరే టాపిక్ లో తప్పిస్తే సినిమా చూడటానికి కాదు . కథలో కథానాయకుడు లా, రాజేంద్రప్రసాద్ ని, సుమన్ ని, కృష్ణం రాజు ని , రాజశేఖర్ ని ఇష్టపడే జనాలు చాలా మంది ఉన్నారు, పేదరికం, కులం లాంటివి అడ్డు రాలేదు వాళ్లకి . ఒక రూపాయిన్నర తో వందల సినిమాలు చూసిన అనుభవమే నాది కూడా. ఎవరో చచ్చు పుచ్చు సన్నాసులు , ఒక పది మంది చేసిన దాన్ని ఇంతల గ్లోరిఫై చేసి , దానికి మతం రంగు పులిమీ రాయడం చూస్తుంటే, greatandhra లాంటి వెబ్సైటు ప్రభావం ఉంది .

  18. ఎవడో ఎల్లయ్య says:

    కత బా రాసినావు కత్తయ్య. కులం పేరు రిజిస్టర్ల కాడ పేర్ల మున్డుకాడ కత్తిరిచేయ్యల్ని రూల్బెట్టి ఓ యాబై సమచ్చరాలు అట్ట పోనిస్తే కొన్నాళ్ళకి రాబోయే పిల్ల జనం దాన్ని మరిసి పోయి అది మాసిపోద్దనిపిస్తాది నాకు. నా మట్టుకు నాకు చాన పెద్ద ఈడు వచేదాక నా కులమే తెలీదు. అట్ట పెంచిన్రు మా అమా అబ్బ. ఈ రోజు గురుతుకు తెచుకున్న గూడా నాతొ సదివిన పిలకాయల పేరులు ఇంటి పేరులతో సహా గురుతే గానీ ఆళ్ళ కులం తెలీదు. కులం వద్దనే వాడే మల్ల దగ్గిరుండి గజ్జి నేరిపిస్తాన్నాడు. ఏం జెయ్యలే తమ్ముడూ?

  19. సూపర్ కథ..
    ఒక మాదిగ ను హీరో గా చూసినప్పుడే అది మన సినిమా..
    ఒక ఎరుకల ను హీరో గా చూసినప్పుడే అది మన సినిమా..
    ఒక డక్కలి ని హీరో గా చూసినప్పుడే అది మన సినిమా..
    ఒక కోయ ను హీరో గా చూసినప్పుడే అది మన సినిమా..
    అంతే.. !
    ఆ రోజు ఇప్పటికీ రానందుకు ఈ దేశం సిగ్గుతో శరంతో తల నేల లోకి పాతుకోవాలి…

  20. p v vijay kumar says:

    మన ఖర్మ ఏంటంటే – బాహుబలి మొదటి ఎక్స్ క్లూజివ్ ప్రివ్యూ షో – రాజులకు వేయడం. వాళ్ళు సినిమా ఎంగిలి పడ్డాక, మనం ఆహా ఓహో అని ఆపుకోలేక విస్తరాకుల కోసం పరిగెత్తడం.

  21. Rishi Srinivas says:

    మహేష్ గారూ… కులాల వారీగా అభిమానులు విడిపోవడం అనే కాన్సెప్టు ని ఎత్తి చూపించినందుకు అభినందనలు. కాకపోతే నాకు అర్ధం కానిది ఏమిటి అంటే వేరే అభిమానుల కుల గజ్జిని కధానాయకుడు అంటించుకున్నట్లా ? అలా అయితే కుల గజ్జిని అంటించుకొమ్మని సందేశం ఇస్తున్నట్లా ? నాకు కూడా ఆ నాలుగు కులాల వాళ్ళు కాకుండా ఎవరైనా హీరో అయితే చూడాలని ఆశ. మీరు డిరెక్టరు కదా.. మరి మీరే ఒక సామాన్యుడికి అవకాశం ఇస్తే ఆ కొరత తీర్చిన వారు అవుతారు.

    • సినిమాని కేవలం సినిమాగా ప్రేమించే కుర్రవాడు, కులాల ఆధారంగా ఏర్పడిన అభిమాన సంఘాల్ని చూసి, తను ఏలియనేట్ చెయ్యబడి, సినిమా ఉంచీ ఏలియనేట్ అవ్వడం కథ. నాదంటూ సినిమానే కానప్పుడు, “నావాడెవడూ” లేకపోతే అది నా సినిమాకానప్పుడు, నాకెందుకు సినిమా అనుకున్న ఒక టీనేజర్ కథ. ఇక్కడ అతనిది కులగజ్జి కాదు. నిస్సహాయత. ఒక సామాజిక నిజం. ఇప్పటివరకూ ఒక దళిత హీరో కూడా లేని సినిమా పరిశ్రమంత పచ్చి నిజం.

  22. mercy margaret says:

    మహేష్ గారు ఇప్పుడే మీ కథ చదివాను .. బాగా రాసారు .. ఇలాంటి సంభాషణలు మాటలు నేను కూడా విని వుండడం వల్లా చదవాలన్న ఆసక్తి ఇంకా పెరిగింది ..

  23. బహుజనులలో చూసే వాల్లెకాదు,తీసేవాళ్ళు ఉండల్ల్న్తే ఎదిన ఒక ప్లాట్ఫారం ఏర్పడాలి .లేకపోతే ఇంకో 100 ఇయర్స్ వరకు వీళ్ళకు ఛాన్స్ ఇవ్వరు.

  24. satyanarayana says:

    నేను Athiest ని ,అనటం మెచ్చుకోతగ్గ విషయం .
    ఒక బుద్ధి జీవి ,ఈ Universe ,దాని పరిధి ,మనం పుట్టిన ఈ అతి చిన్న “pale blue spot ” (యూనివర్స్ ,Multiverse తో పోల్చినప్పుడు ), దాని పరిమితులు , తెలుసుకున్న వాడయితే నూ , ఖచ్చితంగా Darwin ,Carl Sagan ,Richard Dawkins ,Stephen Hawkins మొదలగు Scientists ,ఇంకా ఎంతో మంది మేధావుల పరిశోధనల ఫలితాల సారాన్ని గ్రహించ వాడయితేనూ , ఎలాటి అనుమానం లేకుండా ,Athiest గా మారాలి .
    మీరు అలా గ్రహించి Athiest అయి వుంటారు .
    అంతే కాని ,మీరు Nihilist అని నేను అనుకోను . ( నెట్ ద్వారా నేను గ్రహించినది )
    ఈ నాగరిక సమాజం లో ,కులము ,మతము,ప్రాంతం మొదలగు వాటి ప్రస్తావన తెచ్చినట్లయితే ,అసహ్యించు కోవాలి .

Leave a Reply to mercy margaret Cancel reply

*