ముసుగు తెలుపు

-ఎం.ఎస్. నాయుడు 

ఎదురు చూస్తాను
చూడాలనుకునే ఎదురు చూపు ఎక్కడ

*
తీరం తలుపుల మధ్య నలిగిపోయాను
శ్వాసించని నక్షత్రంతో

మలుపు తెలియని అక్షరమే
ఓ దేహం

నీ నేత్రం నాది
నాది కాని నేత్రం నాలో

తెలుపు ముసుగు
ఆత్మాక్షర దహనం

అందిన అక్షరాల ఆకారం
అంధ మౌన మోసం

నగ్న శాంతి
నమ్మకం లేకే విశ్రాంతి

తప్పుకు తిరుగు

*

naidu

మీ మాటలు

 1. చాల బాగుంది నాయుడు గారు చాల నాళ్ళకి మీ కవిత చూసాను – ప్రభు

 2. Sadlapalle Chidambara Reddy says:

  బాగుంది మీ చిన్న కవిత

 3. రా రెడ్డి says:

  ఇట్సోకే నాయుడు గారూ

 4. కె.కె. రామయ్య says:

  ఎం.ఎస్. నాయుడు గారి కవితలు సర్రియలిస్టిక్ చిత్రాల్లా అనిపిస్తూ నాకంతగా అర్ధం కాకున్నా చాలా బాగుంటాయి.

  ‘ఆత్మాక్షర దహనం’ అంటున్న నాయుడు గారికి, త్రిపుర మెచ్చిన కవి నాయుడు గారికి, ‘చాలా నెమ్మది నెమ్మదిగా ఉండే’ నాయుడు గారికి, తను తొడుక్కున్న చొక్కాలాంటి చేతిలోని పుస్తకాన్ని ఎదుటివాళ్ళకి ఇచ్చేసే సత్తెకాలపు నాయుడు గారికి మనఃపూర్వక అభినందనలు.

  ఎం.ఎస్. నాయుడు గారి కవిత్వ వైశిస్ఠ్యాన్ని సోదాహరణంగా వివరిస్తూ కనకప్రసాదు గారు కినిగే పత్రికలో రాసిన ‘అస్పర్స’ వ్యాస పరంపర తప్పక చదవదగినది.

  http://patrika.kinige.com/wp-content/uploads/2014/02/AsparSa-.pdf

మీ మాటలు

*