రక్తంతో వెల్ల వేసుకుంటున్న గోడలు !!!

 

పి.  విక్టర్ విజయ్ కుమార్ 

 

There is no exaggeration in saying that the entire destination of the country depends upon its intellectual class. If the intellectual class is honest and independent, it can be trusted to take the initiative and give a proper lead when a crisis arises. It is true that the intellect by itself is no virtue. It is only a means and the use of a means depends upon the ends which an intellectual person pursues. – DR. B R AMBEDKAR

కన్నడ శైవ భక్తి ఉద్యమం కు ఆద్యుడు బసవేశ్వరుడు.  బ్రాహ్మణిక పెత్తందారీ తనానికి తిరుగుబాటు ఉద్యమంగా మొదలయ్యింది. స్వంత ఆస్తి లేని సంస్కృతి కలిగిన ‘ జంగమ ‘ సాధు వ్యవస్థకు బసవేశ్వరుడు  నాంది పలికాడు.  దేవలయాలను, బ్రాహ్మణ పెత్తనాన్ని నిరసించాడు. స్త్రీ, కుల అంతరాలు లేకుండా శివుడి లింగాన్ని ధరించవచ్చు అనే సంస్కృతిని  బసవేశ్వరుడు   ప్రచారం చేసాడు. ( ఆ తర్వాత శైవ భక్తి ఉద్యమం నీరు గారి,  లింగాయతులు కుల వ్యవస్థ లో ఇమిడిపోయారు.  అది వేరుగా చర్చించవలసిన విషయం )  ఈ సంస్కృతికి ప్రాతిపదికగా ఉన్న ‘ వచన సాహిత్యం ‘  పై చేసిన పరిశొధనకు  కేంద్ర సాహిత్య అకాడమీ ‘ అవార్డ్ అందుకున్న మేధావి మల్లేశప్ప కాల్బర్గి.  విగ్రహ పూజను వ్యతిరేకించడమే కాక, బసవేశ్వరుడి అనుచర కులమైన లింగాయతుల అస్తిత్వానికి సంబంధించిన కొన్ని వివాదస్పదమైన ప్రశ్నలు లేవనెత్తాడు.  2014 లో ,   Anti-Superstition Bill   ను సమర్థిస్తూ ‘ హిందూ విగ్రహ రాళ్ళ  మీద ఒంటేలు పోస్తే శాపం తగలదు ‘ అన్న ఙానపీఠ అవార్డ్ గ్రహీత అనంత  మూర్తి రాతలను సమర్థిస్తూ ఉపన్యాసం ఇవ్వడం హిందూ ఛాందస వాదులకు కంటగింపు అవ్వడం, ఫలితంగా అతి హేయంగా హత్య కావించబడ్డం జరిగింది. ఈ చిన్న ఉపోద్ఘాతం , మనకందరికీ తెలిసిన వార్తాంశాలే. కలబర్గి  హత్య మరో సారి లేవనెత్తిన ప్రశ్నలు – ఉద్యమ కారుల మీదనే కాక బ్రాహ్మణియ వ్యతిరేక భావజాలాన్ని సమర్థించే ఆలోచనల కలిగిన మేధో వర్గం పై కూడా ఇటువంటి నిష్కారుణ్యమైన చర్యలు ఎందుకు ?  ప్రగతివాద అలోచనా విధానం బ్రాహ్మణియ వ్యవస్థపై ఎందుకంత చెంప పెట్టుగా ఉంటుంది ? ఈ అసహనం ఎందుకంత భరించలేనంతగా ఉండాలి ?

మన విద్యా వ్యవస్థ  –   Unity in diversity  కలిగున్న దేశం అని చిన్నప్పట్నుంచీ మనకు నేర్పించింది. ఇది వాస్తవం లో   ‘ Geographical unity ‘   గానే మిగిలి పోయింది తప్ప సాంస్కృతిక సహనం లేకుండా ,   Freedom of Speech  , ప్రాథమిక హక్కు స్థాయిని కోల్పోయి, కేవలం   selective right  స్థాయికి దిగజార్చబడ్డది.  మన దేశం లో ఉన్న సంస్కృతులు, సాంప్రదాయాలు – ప్రపంచం మొత్తం మీద ఏ దేశం లోనూ ఉండవు. సామాజిక అభివృద్ధి అంటే – ప్రతి వరుసలో ఉన్న సంస్కృతిక సముదాయం కు సంబందించిన అభివృద్ధి అన్నది ఇంకా మన ఆర్థిక వ్యవస్థలో   sink   అవ్వలేదు. మన ఆర్థిక పురోగతికి – ‘ మెజారిటేరియనిజం ‘  అన్నది ప్రధాన ప్రగతి వ్యతిరేక సంస్కృతి. ఈ ‘ మెజారిటేరియనిజం  కు ప్రధాన ఉనాది ‘ బ్రాహ్మణ హిందూ ఛాందస వాదం ‘.  మన దేశం లొ కుల వ్యవస్థ ఏర్పాటు లోనే – అసహన ప్రాతిపదిక ఉంది. అధికార వర్గం లో ఉన్న అగ్ర కుల వ్యవస్థ ,  తమ ‘ సాంస్కృతిక సైద్ధాంతికత ‘ ను అణువణువునా కాపాడుకునే క్రమం లో డెవెలప్ చేసుకున్న ‘ అసహనం ‘ ఇది.

నిజానికి ‘ అసహనం ‘ అన్న అంశం ప్రజాస్వామిక దృక్పథం లో ‘  sense of belongingness  ” ను తెలియ జేస్తుంది. అయితే ఇదే ‘  sense of belongingness  ‘ అధికార దాహం రుచి చూసినప్పుడు   perversion  వస్తుంది .

ఆర్థిక వ్యవస్థ ఏర్పడే క్రమం లో సంస్కృతి ఏర్పడుతుంది. అదే సంస్కృతి క్రమేనా, అధికార వర్గ రాజకీయాలను బట్టి,  ఆర్థిక వ్యవస్థ ప్రగతిని నిరోధించే స్థాయికెల్తుంది. ముఖ్యంగా   equitable development   గురించి మాట్లాడినప్పుడు ఈ అధికార సంస్కృతి విరుద్ధ స్వభావాన్ని పులుముకుంటుంది.

మన ప్రజల్లో ఎంత విభిన్నత ఉన్నా, ఒక ‘  commonality  ‘ ఉంది. అందుకే ఇన్నాళ్ళు ఈ దేశం లో ఒకే చోట బతుకుతున్నాం. ఐతే వ్యవస్థలో   Commonality   ని గౌరవించాలంటే ‘ స్వేఛ్చ ‘ ఉండాలి. ఆ స్వేచ్చ హక్కు దారునికి కలుగజేసే స్వయంప్రతిపత్తి వలన  సృజనాత్మకత బలపడుతుంది. సృజనాత్మకతకున్న గుణం ఏంటంటే – అది  constant change   కోరుకుంటుంది. బండరాయిగా మిగిలిపోయిన మతానికి  ఋఇగిదిత్య్  అన్న లక్షణం దాని విలువల వ్యవస్థను గట్టిగా కాపాడే క్రమం లో ఏర్పడుతుంది. ఇది ‘ సృజనాత్మక ‘ ఆలోచనను ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. అందుకే మతాలను ఉద్ధరిస్తూ ముందుకు వచ్చిన ‘ భక్తి ఉద్యమాలు ‘ సృజనాత్మకతను సహించలేక వీగిపోయి చివరికి తిరిగి    establish   అయిన మతం లోనే భిన్న రూపాన్ని సంతరించుకుని మిగిలిపోవడం చారిత్రకంగా మనం గమనిస్తున్నాము. పాఠకుల అవగాహన కొరకు క్లుప్తంగా , చిన్న స్కిమాటిక్ రూపం లో కింద ఇవ్వడం జరిగింది.

Commonality ===> స్వేచ్చ ====>హక్కులు===> స్వయంప్రతిపత్తి ===> సృజనాత్మకత ===>  change

ఐతే – ఇంత తీవ్ర స్థాయి అసహనం మన దేశం లో ఎందుకుంది ? ఈ ‘ అసహనం ‘ మత వాద దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా ఇస్లామిక దేశాల్లో, కేథలిక్ ఆర్థోడక్సీ ఉన్న దేశాల్లో చూస్తున్నాము. ఆ మతాల బూచిని చూపి ఇక్కడ ‘ హిందూ బ్రాహ్మణ వాదులు ‘ మన దేశం లో మనమేదో చాలా ఉదారంగా ఉన్నట్టు పోజు పెడుతుంటారు. ఈ దేశం లో మనకున్న స్వాతంత్ర్యం –   negotiate   చేసుకుని సంపాదించుకున్నది అన్న విషయం ప్రతి అగ్రకుల మనువాది, హిందూ ఛాందస వాది చాలా సౌకర్యంగా మర్చి పోతారు.   Two nations theory   ప్రతిపాదించాక, బ్రిటిష్ ను వెళ్ళగొట్టాడం  లో మాకు ఉపయోగపడండి , మనమందరం లౌకిక రాజ్యం ఏర్పరుచుకుందాం అన్న కాంగ్రెస్ , గాంధీ సమావేశ ప్రకటనలు ఎవరికీ గుర్తు రావు. ‘ కమ్యూనల్ అవార్డ్ ‘ ప్రకటించాక, అంబేద్కర్ ప్రతిపాదించిన అద్భుతమైన  separate electorates  ప్రతిపాదనను కు ప్రత్యమ్నాయంగా  తో   negotiate   చేసి,   Poloitical reservations   కు కుదించారని  మర్చిపోయి – ముస్లిములు , దళితులు మా భిక్ష ద్వారానే ఇక్కడ బతుకుతున్నారు అన్న విషయాన్ని ప్రాచుర్యం చేస్తారు. అప్పట్లో విసిగి వేసారిన అంబేద్కర్ ఈ మోస పూరితమైన , వెన్ను పోటు పొడవగలిగిన బ్రాహ్మణీయాన్ని నిరసించి ‘ అసలు మాకు ప్రత్యేక గ్రామాలు ఇవ్వండి. మమ్మల్ని మీరు లోపలికి తీసుకుని మమ్మల్ని ఉద్దరిస్తున్న పోజు మీకెందుకు ? ‘ అన్న ప్రతి పాదన కూడా చేసాడు.

ఉద్యమం చేస్తున్న ఉద్యమ కారునికి కి   aggression   ఉంటుంది. ఆలోచనలను ప్రభావితం చేయదల్చుకున్న మేధావికి   intelluctual conviction   ఉంటుంది. ఈ బ్రాహ్మణియ అసహనత   aggression   ను  intelluctual  conviction    ను ఒకే స్థాయిలో పోల్చి చూడ్డం లో ఉన్న మర్మం మనం జాగర్తగా గమనించాలి.

హిందూ వ్యవస్థ చాలా పురాతన వ్యవస్థ. ఈ వ్యవస్థ మొదట్లో కొంత పురోగతి స్వభావాన్ని కలిగి ఉండడం కూడా పొడిగించబడిన దీని మనుగడకు ఒక చిన్న కారణం అవ్వచ్చు. అయితే చాలా బలహీనమైన మనువాద భావ జాలం పైన స్థిర పడి, ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కూడా – అదే షేప్ ను నిలుపదల్చుకుంది  ( ఎన్ని వ్యాయామాలు చేసినా లేని కండలు రావిక , వట్టి వాపులు మిగలడం తప్ప ) . ఇంత పురాతన హిందూ వ్యవస్థ గోడలు బీటలు వారుతున్నాయి. ఈ సందర్భం లో – దీని అస్తిత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తేనే  ఈ గోడకు ఇంకా నెర్రలు పాకుతాయి.  ( సాధారణంగానే ప్రతి మత వ్యవస్థకు ఈ లక్షణం ఉంటుంది. అయితే పూర్తిగా premitive society stage  నుండి బతుకుతున్న,  హిందుత్వం ఔట్ డేట్ అయిపోయిన మతం కావడంతో కొన్ని పిరికి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. హిట్లర్ సమయం లో , ఈ దాడి ఇంకో అడుగు ముందుకేసి – నాజీ  సంస్కృతిని  నిలబెట్టుకోవడానికి గోబెల్స్ ను నియమించింది. నాకు తెలిసి – ఇదో మోసపూరితమైన సంస్కృతిక వ్యవహారమైనా హిట్లర్ ఆ మేరకు బూటకమైనా సరే, ఒక ప్రజాస్వామిక రూపాన్ని,  దాన్ని బలాన్ని ఆ మేరకు నమ్మాడు. మన ఖర్మ ఏంటంటే – ఇక్కడ అదే మత ఛాందస వాదం, పచ్చి నెత్తురు తాగడం ద్వారానే మార్పు కొనాలనుకుంటుంది ).

మోదీ వచ్చాక ,   political participation of varied culutures   అన్న విషయమే పక్క దారి పట్టి, ప్రధాన విద్యా, ప్రణాళికా సంస్థల్లో ‘ అసహన సిద్ధాంతాన్ని ‘ ప్రతిపాదించే  థర్డ్ క్లాస్ మేధావులనే ఎన్నుకుని మరీ నియమించడం జరుగుతుంది. కాల్బర్గి లాంటి మేధావులను హత మార్చడం జరుగుతుంది.

నిజానికి ‘ వైరుధ్య ఆలోచన ల ‘ సమూహం మనలో సృజనాత్మకతను వృద్ధి చేస్తాయి. భిన్న కోణాల్లో మనుష్యులను వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలో తెలియ జేస్తాయి. నిజానికి, మనిషికి రాజకీయ వ్యవస్థ అవసరం కాదు సౌకర్యం. భిన్న అవసరాలు, భిన్న దృక్పథాలు ఉన్న కోట్ల మనుష్యులు – కలిసి సుఖంగా బతకాలనుకున్నప్పుడు , అందరూ ఒక  క్రమం లో ముందుకెళ్ళడానికి , రాజకీయ వ్యవస్థ ఏర్పడింది. మనింట్లో , మనం సంపాయించి వంట చేసుకోడానికి – రాజకీయ వ్యవస్థ ఎందుకు ? మన భర్తలతో , పెళ్ళాలతో కాపురం చేయడానికి రాజకీయ వ్యవస్థ ఎందుకు ? ప్రతి వ్యక్తి ఒక భిన్నమైన  entity  .  ఈ సృష్టిలో ఉన్న గొప్ప తనమే ఇది. ” విభిన్నత ” ఈ సృష్టి ప్రసాదించిన వరం.

మన ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళాలంటే – మనలో ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ, ఒక డీసెంట్ జీవనాన్ని సాగించాలంటే  – ఆర్థికావకాశాలు  సమానంగా సృష్టించుకోవడం అవసరం. ఇంత వరకు అధికార వాసన చూడని సరి కొత్త శ్రేణులను , ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడం ముఖ్యము. కేవలం ఒకే  గాటికి కట్టినట్టు ప్రయాణించే , ఆర్థిక వ్యవస్థ మనకు   genocides   మాత్రమే మిగులుస్తుంది. ఇందులో భాగంగా – కాల్బర్గి  లాంటి మేధావులు ప్రాణలు వదలాల్సి వస్తుంది. తస్లీమా నస్రీన్ లాంటి మహిళా మేధావులు – దేశం వదిలి బతకాల్సి ఉంటుంది. పెరుమాల్ మురుగన్ లాంటి రచయితలు కలం వదిలేయాల్సి వస్తుంది. సాయిబాబా లాంటి ప్రొఫెసర్లు  physically challenged  అయినా జైళ్ళల్లో మగ్గాల్సి వస్తుంది.  విప్లవ రచయితలు, కళాకారులు  కుట్ర కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అరిస్టాటిల్ అంటాడు ‘  man is a political animal  ‘  అని. మనిషి తన సౌకర్యం కోసం రాజకీయ వ్యవస్థ ను ఎంతగా కాంక్షిస్తున్నాడో, ఎంతగా మమేకమై బతుకుతున్నాడో  తెలపడానికి ఈ మాట అన్నా , అదే రాజకీయ వ్యవస్థలో జంతువులు చేరాక – ఇక సమాజం లో మనుష్యులకు తావేది ?

 

(  PS:  ఈ వ్యాసం లో చాలా చోట్ల ఇంగ్లీషు పదాలు వాడాల్సి వచ్చింది. ఇందుకు తగిన తెలుగు పదాలు లేవని భావించబట్టే ఇలా వాడడం జరిగింది. లేదంటే సంస్కృత పదాలు వాడడం వలన కన్ ఫ్యూ జన్  పెరుగుతుంది తప్ప లాభం ఉండడం లేదు.   పాఠకులు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.)

 

మీ మాటలు

  1. మీ విశ్లేషణ బాగుంటుంది. మీరు రాయాలి . these words are part of socio political awareness.

  2. SreenVass Chandragiri says:

    Upendra cinema laga ardhamavadaniki koncham kashtam ayina ….
    Mee Analysis correct..
    Thanq..

    • P V Vijay Kumar says:

      తప్పలేదు సర్…..ఇంతకంటే సింప్లిఫై చేయడం కష్టమయ్యింది… Social psychological perspective లో కొంచెం complexity ఉంటుంది కాని. అర్థమైతే మజా వస్తుంది.

  3. యువర్ writings అరె ఎడ్యుకేషనల్, త్రుత్ఫుల్, I ఎంకోరాగే యు రీచ్ అవుట్ తో high school స్టూడెంట్స్,
    హిందుఇస్ం being ఎక్ష్ప్లొఇతెద్ బి వన్ కాస్ట్, విత్ నొథింగ్ useful తో హ్యూమన్ రేస్,
    సెల్ఫ్ మదె Shankaracharyas, Vargam, చ్రెఅతెద్ చ్రెఅతెద్ సుచ్ అ కాన్సర్, నౌ గోయింగ్ ఇంసురబ్లె,
    నోయింగ్ థెసె బాడ్ పీపుల్, హెల్ప్లెస్స్ సుద్రాస్, థెఇర్ ఉసెలెస్స్ లీడర్స్, లికె షీప్ ఫాలోయింగ్ butchers, థెయ్ అరె ఫాలోయింగ్ ది ఒప్ప్రెస్సొర్స్,
    టైం , వే అల్ గుడ్ హిందుస్, believers ఇన్ లిబరేషన్ అఫ్ హ్యుమానిటీ, జాయిన్ లికె బ్రిక్స్ , లేట్ అస్ బుఇల్ద్ బ్రిద్గేస్,
    జోహార్లు; లేట్ రామస్వామి Periyar, thripurneni, ! భ్హరథవృఅథ్న అంబేద్కర్ జి,
    లేట్ ఒప్ప్రెస్సెద్ టేక్ different రోడ్ అండ్ స్టాప్ విసిటింగ్ టెంపుల్ లార్డ్స్.
    బర్డ్, ఇరుష్, British ఎదుచతెద్ , సర్జన్, అమెరికన్ ఎదుచతెద్ మద్, beleives ట్రూ ఫ్రీదొంస్ బి లిబెరతింగ్ ఉన్ఫొర్తునతె లోయర్ చస్త్స్, Dalits, ignorant అప్పర్ కాస్ట్ నాన్ Brahmin గ్రూప్,.

  4. మెదడుకు పదును పెట్టె విశ్లేషణ … చాలా బాగుంది.

Leave a Reply to P V Vijay Kumar Cancel reply

*