బిహైండ్ ద సీన్!

 

 అరుణ్ సాగర్

 

నువ్వేమీ ఫీలవకు

ఈ రాత్రి ఒంటరిదేమీ కాదులే!

 

మిణుగురు చుక్కలున్నాయి

అర్ధచంద్రుడున్నాడు

కొమ్మలు ఎండిన చెట్టు ఒకటి

ముడుచుకు పడుకున్న కుక్క ఒకటి

పోయే ప్రాణంలా

వెలిగీఆరే ట్యూబులైటు ఒకటి

 

అరే భై

ఈ రాత్రి ఒంటరిదేమీ కాదని చెప్తున్నానా లేదా?

 

రోడ్డుమీద మట్టి ఉంది

మూలమీద చెత్తకుండీ ఉంది

పగిలిపోయిన బిర్యానీ ప్యాకెట్ ఒకటి

ఏరుకుంటున్న రాగ్ పిక్కర్ ఒకతె

 

రాత్రులు-చీకటి రాత్రులు

తెల్లారని రాత్రులు-దహించే రాత్రులు

సోడియం దీపాల వెలుతురులో

ముసుగేసిన నల్లని వీధులు

కళ్లలో నిప్పురవ్వలు రాలినట్టు

ఎటుచూసినా

మండుతున్న నిశీధి కొసలు

 

నువ్వేమీ ఫీలవకు

ఈ రాత్రి వలే నువ్వు కూడా ఒంటరివేమీ కాదులే!

 

కళ్లలో మరణించని దృశ్యం

గొంతులో ఇరుక్కుపోయిన వాక్యం

రక్షణవలయాన్ని ఛేదించిన జ్ఞాపకం

ఇన్ ద ఎండ్

నీ బిక్షాపాత్రలో మిగిలిన సత్యం

 

దీనెబ్బా! ఇంటికెళ్తే నిద్దర్రాదు కదరా!

 

-ఆజ్యం

:ఎక్కడో ఎవడో యఫ్ఎమ్ పెట్టాడు!

“తేరే దునియా…సె హోకే మజ్ బూర్ చలా,

మై బహుత్ దూర్…బహుత్ దూర్…

బహుత్ దూ….ర్ చలా”

 

హుహ్!

మిత్రమా, మై ఫెలో మేల్!

మియ్యర్ర్ మేల్!

-తిరస్కృతుడా, బహిష్కృతుడా!

 

ముందుగా:

నేనొక నైరూప్య వర్ణచిత్రం గీస్తాను

ఆపైన:

నీకు దాన్ని ఎలా చూడాలో నేర్పిస్తాను

జూమ్ ఇస్కో దేఖో!

నీ కంటి అద్దాలు కూడా మారుస్తాను

 

వయ్?

ఎందుకంటే, బికాజ్!

నాడీమండలం ఒక నిత్యాగ్నిగుండం

ఓల్డ్ ఫ్లేమ్ ఈజ్ యాన్ ఆరని జ్వాల!

 

నువ్వేమీ ఫీలవకు

ఈ రాత్రి వలే నువ్వు కూడా ఒంటరివేమీ కాదులే!

*

arun sagar

 

మీ మాటలు

  1. బ్రెయిన్ డెడ్ says:

    కళ్ళలో మరణించని దృశ్యం

    గొంతులో ఇరుక్కుపోయిన వాక్యం

    రక్షణవలయాన్ని ఛేదించిన జ్ఞాపకం
    మరణించని దృశ్యం

    గొంతులో ఇరుక్కుపోయిన వాక్యం

    రక్షణవలయాన్ని ఛేదించిన జ్ఞాపకం

    ఇన్ ద ఎండ్

    నీ బిక్షాపాత్రలో మిగిలిన సత్యం

    ఇక్కడ దాక చదవడం, పోయినదేదో దొరికిన బిక్షపాత్ర మోహమై వెలగడం మళ్ళీ చదవడం

    ఇంతా బాగుంది కాని సారు బిక్షపాత్రలోను మియర్మేళ్ళ పక్షపాతమా ??
    ఇంతకు మించిన కంప్లెయింట్స్ ఏమి లేవు ఒకటోసారి ముగించాక

  2. Madhu Chittarvu says:

    Nyroopya varNa cithram.challaa bavundi.addalu koodaa maarvaali.

  3. ప్రసాదమూర్తి says:

    అరుణ్ సాగర్ కవిత చదివితే అరుణ్ సాగరే గుర్తుకొస్తాడు. తనలాగా మరొకరు రాయలేని శైలిని అతని సొంతం చేసుకున్నాడు. మంచి పోయం ఇచ్చిన సాగర్ తమ్ముడికి అభినందనలు

  4. akbar mohammad says:

    వండర్ఫుల్ పోయెమ్ ….బొమ్మ ఆప్ట్ గా వుంది….

  5. కె.కె. రామయ్య says:

    ” నాడీమండలం ఒక నిత్యాగ్నిగుండం. ఈ రాత్రి వలే నువ్వు కూడా ఒంటరివేమీ కాదులే! ” అన్న అరుణ్ సాగర్ గారూ అభినందనలు.

మీ మాటలు

*