కొత్త కోతులు కావలెను!

 

కృష్ణ చైతన్య అల్లం

 

Krishna Chaitanya Allamఒక గదిలో ఐదు కోతులు, ఒక నిచ్చెన ఉంచబడ్డయ్. స్వతహాగా ఉండే కుతూహలం అనే జీన్ ఒక కోతిని నిచ్చెన ఎక్కించింది. నిచ్చెన దాటితే గది నుండి బయట పడే మార్గం కనిపిస్తుంది. కోతి నిచ్చెన పూర్తిగ ఎక్కే లోపల మిగతా నాలుగు కోతుల మీద అతి చల్లని నీళ్ళు పడినయ్. కాసేపటి తర్వాత ఇంకో కోతి నిచ్చెన ఎక్కింది. మిగిలిన నాలుగు కోతుల మీద మళ్ళీ చల్లని నీళ్ళు పడ్డయ్. ఏ కోతి మీదికి ఎక్కినా మిగిలిన కోతులకు ఈ శిక్ష పడుతూ ఉంది.

ఈ సారి ఏదైనా కోతి పైకి ఎక్కడానికి ప్రయత్నించినపుడల్లా మిగిలిన నాలుగు కోతులు కల్సి నిచ్చెన ఎక్కడానికి ప్రయత్నించిన కోతిని పట్టుకుని చితక్కోట్టినయ్. ఆ ఐదు కోతులకూ తెలుసు నిచ్చెన ఎక్కితే ఎం అయితదో. మొత్తానికి ఐదు కోతుల్లో ఒక్కటి కూడా నిచ్చెన ఎక్కే సాహసం చేయలేదింక. కొన్ని రోజులకు చల్లని నీళ్ళు మీద పోసే కార్యక్రమం ఆపివేయ బడ్డది. అయినా కూడా ఏ కోతీ నిచ్చెన దగ్గరికి పోయే సాహసం చేయలేదు.

ఈ సారి ఆ అయిదు కోతుల్లో ఒక కోతిని మార్చిన్లు. నాలుగు పాత కోతులు, ఒక కొత్త కోతి. కొత్త కోతి నిచ్చెన దగ్గరికి పోగానే మిగతా కోతులు అన్ని కలిసి కొత్త కోతిని చితక్కోట్టినయ్. కొత్త కోతి మళ్ళీ నిచ్చెన దగ్గరికి పోలేదు. చల్లటి నీళ్ళు లేవు, కానీ నిచ్చెన ఎక్కితే ఏమవుతుందో, నిచ్చేనకీ మిగతా కోతులకీ ఉన్న సంబంధం దానికి ఎప్పటికీ అర్ధం కాదు. ఈ సారి ఇంకో కోతి మార్చబడింది. మళ్ళీ అదే తతంగం పునరావృతమైంది.

చివరికి ఒక్కొక్కటిగా అన్ని కోతులూ మార్చబడినయ్. అయిదు కోతుల్లో ఏ ఒక్క కోతీ నిచ్చెన ఎక్కలేదు, ఇంకోదాన్ని ఎక్కనివ్వలేదు, నీళ్ళు లేవు, నిచ్చెన ఎక్కితే ఏమవుతుందో ఏ కోతికీ అవగాహన లేదు, తెలుసుకునే సాహసం ఏ కోతీ చేయలేదు.

అయిదు కోతులు, ఒక నిచ్చెనతో ఆ గదిలో వాటి ప్రకృతి సహజమైన Sense of wonder కోల్పోయి బయట పడే మార్గం తెలవక బందీలుగానే మిగిలిపోయినయ్.

స్వభావాలని, మనస్తత్వాన్ని అర్ధం చేస్కునే దిశగా కొందరు పరిశోధనవేత్తలు చేసిన ప్రయోగం ఇది.

ఎందుకు, ఏమిటి అన్న  ప్రశ్నలు ఎక్కడ మాయం అయినై? ప్రశ్నించడం ఎక్కడ ఆగిపోయింది? సమాజం కనీస బాధ్యతలని విస్మరించే స్థితికి చేరుకున్నదంటే ఎవరు కారణం? గ్రీక్ తత్వవేత్త “యూరిపైడ్స్” ప్రతీదాన్ని ప్రశ్నించమన్నడు. ఉన్నదాన్ని ఉన్నదున్నట్ట్టు ఒప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పిండు.

నాగరికత సమాజంలో ఒకటిగా బతకమని చెప్పింది కానీ, ప్రశ్నించడం ఆపమని చెప్పలేదు. ప్రశ్నలు కొత్త అనుభవాలని నేర్పిస్తాయి. కొత్తవి నేర్చుకున్నపుడు మరి కొన్ని కొత్తలు ఉద్భవిస్తాయి. పరిణామ క్రమంలో కొత్త జన్యువులని కలుపుతూ పోతాయి.

మొదటి రెండు కోతులకీ కలిగింది అనుభవం. నిచ్చెన ఎక్కవద్దని నేర్చుకున్నై. మిగతా మూడు కోతులు సమాజం. చూసి, విని, నేర్చుకుని పర్యవసానం తెలుసుకుని బాధ్యతాయుతమైన సమాజం పాత్రని పోషించినై. సమాజం మేలు కోసం కొత్త కోతిని సమాజ క్షేమం కోసం వారించినయ్. కొత్త కోతికి అనుభవం నేర్పించిన పాఠం ఎమీ లేదు. భయం వల్ల ఏర్పడిన నమ్మకం తప్ప. చివరికి మిగిలిన అన్ని కోతులూ నమ్మకం, భయాలతో బందీలుగ మిగిలిపోయినయ్. పరిస్థితులు మారిపోయినయ్. తరాలు మారిపోయినై. చల్లని నీళ్ళు లేవు. రోగాలకు మందులు కనిపెట్ట బడినై. కాలం మారింది. భయాలు, నమ్మకాలూ మాత్రం అట్లనే మిగిలిపోయినయ్.  కొత్త ప్రశ్నల్ని మింగుతూనే ఉన్నై. నమ్మకాలు, కోతులు కోతులుగానే ఉన్నయ్. ప్రశించాల్సిన సమూహాలన్నీ నమ్మకం వెనుక బందీలుగానే ఉన్నవి. భయంతో నిచ్చెన ఎక్కిన కోతుల్ని కొడుతూనే ఉన్నయ్. ప్రశ్నించిన గొంతులను హతమారుస్తూనే ఉన్నై.

*

 

మీ మాటలు

  1. బాగుందన్నా..

  2. Allam Vamshi says:

    అప్పట్లొ ఎండ్రిక్కిచ్చల మీద ఇటువంటిదే ఒక కథ ఉంటుందే “పైకి వచెవాళ్లని రాకుండా వెనక్కి గుంజడం” కాన్సెప్ట్ మీద. మంచిగుంది కోతుల ప్రయోగం, నీ వ్యాసం.. :)

  3. లోక మూడత్వాన్ని ఎంత సింపుల్ గా చెప్పినవ్. అల్లం వారసత్వం నిలిపినవ్ శాహబాష్ బేటా…

  4. Dr.Rajendra Prasad Chimata says:

    ” కొత్త కోతికి అనుభవం నేర్పించిన పాఠం ఎమీ లేదు. భయం వల్ల ఏర్పడిన నమ్మకం తప్ప. చివరికి మిగిలిన అన్ని కోతులూ నమ్మకం, భయాలతో బందీలుగ మిగిలిపోయినయ్. పరిస్థితులు మారిపోయినయ్. తరాలు మారిపోయినై. చల్లని నీళ్ళు లేవు. రోగాలకు మందులు కనిపెట్ట బడినై. కాలం మారింది. భయాలు, నమ్మకాలూ మాత్రం అట్లనే మిగిలిపోయినయ్. కొత్త ప్రశ్నల్ని మింగుతూనే ఉన్నై. నమ్మకాలు, కోతులు కోతులుగానే ఉన్నయ్. ప్రశించాల్సిన సమూహాలన్నీ నమ్మకం వెనుక బందీలుగానే ఉన్నవి. భయంతో నిచ్చెన ఎక్కిన కోతుల్ని కొడుతూనే ఉన్నయ్. ప్రశ్నించిన గొంతులను హతమారుస్తూనే ఉన్నాయ్ ”
    భయంకరమైన చేదు నిజం. ముఖ్యంగా ముస్లిం దేశాలలో ప్రశ్నించిన గొంతుల్ని హతమారుస్తుండడం చూస్తుండ గానే బెంగళూరు లాంటి సిటీ లో కల్బుర్గీ లాంటి వారిని హతమార్చడం మీ అనాలిసిస్ ను బలపరుస్తున్నాయి.
    ఇలానే రాస్తూనే ఉండండి

  5. Allam Chaitanya says:

    థాంక్యూ సందీప్, వంశీ, నర్సన్. :)
    dr రాజేంద్ర ప్రసాద్ చిమట గారు, కల్బుర్గీ హత్య ఉదంతం గురించే ఇది రాయడం జరిగింది. ఒక్క ఉదంతం గురించి మాత్రమె కాకుండ సమస్యని ఎత్తి చూపే పనిలో సాధారణీకరించే ప్రయత్నం చేసిన. ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు :)

  6. Allam shashidhar says:

    చాల బాగుంది. మంచి కథ .. చక్కని కథనం ..సరళమైన భాష .. సూటిగా ఆలోచింప చేసే విషయం .. వస్తువు .. ఉన్న రచన …

  7. చందు - తులసి says:

    ఇవాళ సమాజానికి నిజంగా అవసరమైన విషయం ఇది. ప్రశ్నను అణగదొక్కిన సమాజం., ప్రశ్న ద్వారా పైకొచ్చిన సమాజానికి ఊడిగం చేయాల్సివస్తుంది. మన దేశం దుస్థితికి కారణం అదే. చైతన్య గారు గుడ్ .

  8. Allam Chaitanya says:

    అల్లం శశిధర్ & చందు – తులసి, ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు. :)

  9. మన్నే ఏలియా adilabad says:

    ఇంత చిన్న కథలో ఎంతో పెద్ద సందేశం ఇచ్చారు . మంచి ఆలోచన రేకెత్తించే కథ . గొప్ప ఫిలాసఫీ ఉంది కథలో .మేల్కొల్పు ఉంది .

  10. శ్రీనివాసుడు says:

    ఆర్యా,
    అసలు ఐదు కోతులపై సైన్పు ప్రయోగం జరగలేదు. అదొక ఫార్సు. కుహనా మేధావుల సృష్టి.
    అలాంటి సైన్సు ప్రయోగం జరిగిందనడం వెఱ్ఱితనం. మన గొఱ్ఱెదాటు మనస్తత్త్వానికి అదొక మచ్చుతునక. దురదృష్టవశాత్తూ అలాంటి ప్రయోగమే జరగలేదు. ఇలాంటి సూడోసైన్సు ప్రచారంలోకి రావడం నిజంగా ఒక విషాదం.
    ఇది, మొట్టమొదట, 1996 లో ‘‘కంపీటింగ్ విత్ ది ఫ్యూచర్’’ అనే పుస్తకంలో ‘‘గ్యారీహ్యామెల్, సి.కె. ప్రహ్లాద్‘‘ అనే ఇద్దరు వండిన కథ. రచయితలు దానికి ఆధారాలు ఎక్కడా ఇవ్వలేదు. దీనిని గత ఇరవై ఏళ్లుగా ఉదహరిస్తున్న వారెవ్వరూ ఆ ఆధారాల జోలికెప్పుడూ వెళ్ళలేదు. ఆధారాలెందుకు పుట్టలేదంటే ఈ ప్రయోగమెన్నడూ జరగలేదు గనక. ఇది ఈ మధ్యనే ఎడ్డీ ఒబెంగ్ అనే కువ్యాఖ్యాత దీన్నొక పిట్టకథగా చెప్పేడు, అప్పటినుండే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ వ్యాఖ్యాతనే దీని గురించి ప్రశ్నిస్తే, ఇది కాదు గానీ, ఇలాంటిదే ఒక ప్రయోగం జరిగిందని ఒక వ్యాసాన్ని ఉదహరించాడట.
    G.R. Stephenson అనే వ్యక్తి వ్రాసిన వ్యాసం Cultural Acquisition Of A Specific Learned Response Among Rhesus Monkeys (1966).
    http://www.scribd.com/doc/73492989/Stephenson-1966-Cultural-Acquisition-of-a-Specific-Learned-Response-Among-Rhesus-Monkeys#scribd
    అయితే నిజంగా ఈ కథలో చెప్పిన ప్రయోగమేనా అది? దీనికీ దానికీ ఉన్నస్వల్పమైన తేడాలు చూడండి.
    1. స్టీఫెన్సన్ తెలుసుకోదలచినదేమంటే ఒక కోతి యొక్క లెర్న్‌డ్ బిహేవియర్ రెండవ కోతిలో శాశ్వతమైన ప్రభావం చూపగలదా అని. అంతేగానీ, అతడు గ్రూప్ డైనమిక్స్, సమూహ చలనశీలత్వాన్ని గురించి గానీ, లేదా మందపోకడల గురించిగానీ అతడు అధ్యయనం చేయలేదు.
    2. అతడు మగవో, ఆడవో ఒకే లింగానికి చెందిన కోతుల జతలని పరిశీలించాడు గానీ, ఒక సమూహంలోని ఏవో అయిదు కోతులని కాదు.
    3. అతడు వాడిన వస్తువులు ప్లాస్టిక్ ఉపకరణాలు, అంతేగాని అరటిపండ్లు కాదు.
    4. ఆ ప్రయోగంలో నిచ్చన ఎక్కడా లేదు. ఆ ఉపకరణాన్ని గదిలో ఒక మూల పెట్టేరు.
    5. శిక్ష విధించింది. నీళ్ళు జల్లడం కాదు, వేగంగా గాలిని కోతిపై వదలడం.
    ఈ ప్రయోగ వాస్తవ ఫలితాలేమిటంటే
    And what were the actual results of this barely relevant, totally different experiment?
    So in some pairs the new ‘naive’ monkey did learn to fear the object after seeing how the conditioned monkey was afraid of it. However, in other pairs, the fearless behaviour of the naive monkey ended up teaching the conditioned one not to fear the object anymore. Note that this is exactly the wrong type of evidence for a charming story about “following the herd”.
    Curiously, the results were gender-specific: in three male-paired cases the learned behaviour was transferred, in three female-paired cases it was not, and in two it was inconclusive. The female monkeys seemed to learn behaviours simply by observation (including cases in which the punished monkey learned that there would be no more air blasts by watching the new monkey play with the object). The male pairs behaved differently, tending to teach a behaviour physically. The punished monkey actively admonished the newer one by pulling them away from the object.
    The interesting part of the study therefore comes from the gender differences, but even then Stephenson shies away from making any conclusions from his data. This is the sort of thing a scientist says, because science is about real things.
    Unfortunately, a few decades after this study was published some moronic self-help author read it and thought “it’s almost good, but if I make it much more sensational and implausible, I will sell a lot of books! Though I don’t have any real truths, I can help people by showing them essential truths I’ve just made up!” And then you read it on Facebook, and thousands of people shared it, believing it to be true.
    It’s one thing to share a meme because it sounds cool. We have all done it, myself included, even though it is a truly terrible misuse of our intelligence and most of us would not want our children to be mindlessly repeating hearsay and gossip because it sounds cool.
    ఈ పిట్టకథలోని అశాస్త్రీయత గురించి ఇంకా వివరంగా ఇక్కడ చదవొచ్చు.
    https://www.psychologytoday.com/blog/games-primates-play/201203/what-monkeys-can-teach-us-about-human-behavior-facts-fiction
    నేను మొదటగా చెప్పేదేమంటే, మనం కోతులం కాదు, మనుష్యులం.
    కోతులకుండేది కోతి కుతూహలం, మనిషికుండేది జిజ్ఞాస.
    వడ్రంగి, తోక తెగిన కోతి మనకు తెలుసు.

మీ మాటలు

*