ఆ బ్రెడ్డుకు మరీ ఇంత బటరేంది సారూ !

 

పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

సోమవారం పొదున్నే బ్రేక్ ఫాస్ట్ కోసం బ్రెడ్ కు బటర్ రాసుకుంటూ ‘ వివిధ ‘ పేజీలు తిప్పాను. ‘ ఇదేం ఆనందం సారూ ! ‘ అని రాసిన ఆర్టికల్ లో నా ఆర్టికల్ ప్రస్తావిస్తూ ఒక రంగనాయకమ్మ అభిమాని రాసిన వ్యాసం చదివాక, ముచ్చటేసింది. బ్రెడ్ నోట్లో పెట్టుకుని నముల్తూ ఉంటే, చదువుతూ బటర్ ఎక్కువ రాసానేమో, వెగటనిపించి పక్కన పెట్టి, ఇంకో బ్రెడ్ మీద ‘ జాం’ రాసుకుని తినేసాను. ఇక ఈ వ్యాసానికి ప్రత్యుత్తరం రాయాలనిపించి ఇదుగో –

‘ వసంత కన్నాభిరాన్ గారు వ్యక్తిగతంగా రంగ నాయకమ్మను విమర్శిస్తూ రాసిన కవిత గురించి మొదట మాట్లాడాలి, ఆ అప్రోచ్ తీవ్రంగా వ్యతిరేకించదగ్గది ‘ అనే పాయింట్ ప్రధానంగా కనిపిస్తుంది ఈ వ్యాసం లో. వ్యక్తి ప్రతిపాదించిన విషయాన్ని వదిలి వ్యక్తిగత విమర్శ చేయడం అన్నది తప్పుడు నడక అనే వాదన గురించి ఈ సాహితీ లోకం లో ఇప్పుడు మాట్లాడ్డం పదో తరగతి కుర్రోడు రెండో ఎక్కం నేర్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి – ఈ రెండో ఎక్కం వ్యవహారం మాట్లాడే ముందు – 2010 సంగతి మాట ఒకటి చూద్దాం. ఆజాద్, హేమచంద్ర పాండే ఎన్ కౌంటర్ జరిగాక, అంత్య క్రియల సందర్భంగా వర వర రావు గారు చదివిన మెసేజ్ ను విమర్శిస్తూ రంగ నాయకమ్మ ఆంధ్ర జ్యోతి లో ‘ ఒకే కలం….’ అనే వ్యాసం లో ఇలా రాసింది

” మరి, నిషేధిత పార్టీ తో ఎంతో దగ్గిర సంబంధం లో ఉన్నట్టు ఆధారాలతో సహా కనబడుతోన్నా, వర వర రావు గారి మీద పోలీసుల దృష్టి పడలేదంటే , ఆ వింతకి ఏదో ప్రత్యేక కారణం ఉండి ఉండదా ? “. వాళ్ళ సంస్థ నిర్మాణం లో భాగం కాకుండా దూకుడుగా ‘ వర వర రావు కోవర్ట్ ‘ అనే విషయాన్ని సజెస్ట్ చేస్తూ రాయడం , ఇది వ్యక్తిగత విమర్శగా రంగ నాయకమ్మ అభిమానులకెందుకు తట్ట లేదు ? ఇది కేవలం వ్యక్తి గత విమర్శ అని సర్దుకు పోవడానికి కూడా కుదరని ఘాతుకమైన విమర్శ !! అంతే కాదు – ఈ స్థాయిలో విమర్శించబడ్డ వ్యక్తి రాసిన వ్యాసం పరిశీలనకు ఎలా తగిందో కూడా ఎవరికీ క్లూ లేదు.

ఒక సిప్ టీ తాగేసా. చక్కర సరిగ్గా సరిపోయింది.

ఈ ఆర్టికల్ రాసిన అభిమానిలో ఒక అమాయకత్వం ఉంది. మార్క్సిస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ – మధ్య తరగతిని ఎలా కన్ ఫ్యూజ్  చేయొచ్చో తెలియజేయాలి.

‘ మార్క్స్ తో  పాటు  అంబేద్కర్ కూడా  కావాలి ‘ అని విప్లవ సంస్థలు కూడా గ్రహించి ఒకడుగు ముందుకెళ్ళి, దళిత దృక్పథం తో సంస్థలను స్థాపించడం, దళిత పోరాటాలకు వెనుదన్నుగా నిలవడం జరుగుతున్న పరిస్థితి వచ్చాక మధ్యలో కలగ జేసుకుని , ‘ అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి ‘ అనడం లో కుట్ర తేట తెల్లంగా కనిపిస్తుంది. దీనికో భీభత్సమైన సైద్ధాంతిక  చర్చ  ఏముంది ? అంబేద్కర్ సాధించిన వృద్ధి ‘ వ్యక్తి కి సంబంధించిన ది మాత్రమే . వ్యవస్థకు సంబంధించింది కాదు ‘ అనే  బోలు వాదన – ఎన్నో ఏళ్ళుగా కొరవడిన దళిత ఉద్యమాలను వాటి మహోన్నత కుల నిర్మూలన ఆశయాన్ని కించ పరచడం లో భాగం ఎందుకవ్వదో తెలుసుకోలేని పరిస్థితిలో రంగనాయకమ్మ అభిమానం చేరుకుంది. దీనికి గొప్ప సైద్ధాంతిక చర్చ అవసరం లేదు అన్న విషయాన్ని ఇంకా గమనించుకోలేని సాధారణ ఆలోచన కూడా ఈ అభిమానం లో ఒక లేమి.

టి మరో సిప్ చేసా. చిక్కగా ఉంది.

ఇక రంగనాయకమ్మ ప్రజలను, అభిమానులను – చైతన్య వంతం చేసిన విధానం గురించి కృతఙతతో ఉండడం అనే కారణం తో ఆమె తప్పు రాసినా  అర్థం చేసుకోవాలనే ఒక లిబరల్ దృక్పథం  ను ప్రగాఢంగా వాంఛించడం. నిజమే ! రంగ నాయకమ్మ మార్క్సిజం కు సమబంధించి మంచి ‘ గైడ్స్ ‘ రాసింది. అది ఎంత మంచో పక్కన పెడితే – అదే లాజిక్ తీసుకుంటే – ఈ దేశం లో ప్రభుత్వం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని, ప్రభుత్వం తయారు చేసిన సిలబస్ చదివి పైకొస్తున్న ప్రజలు ఇంక ఎవరూ ప్రభుత్వాన్ని విమర్శించరాదు. ఎందుకంటే విద్య ప్రభుత్వ పుణ్యమే కాబట్టి.

ఇక ఆమె చెప్తున్నదే మార్క్సిజమా అన్నది మౌళికమైన ప్రశ్న ! ఆమె చెప్తున్న మార్క్సిజం ఆమె వర్షన్ మాత్రమే. గతి తార్కిక భౌతిక వాదాన్ని వదిలేసి , ఆదనపు విలువ సిద్ధాంతాన్ని మాత్రమే లెక్కలేసి  వివరించడం పూర్తి మార్క్సిజం కాదు. అది నిజం మార్క్సిజం కాదు. దీనికి తోడు   – మార్క్సిజం ను అన్వయించాలసిన సమస్యలకు  ‘ బూర్జువా ‘ టేగ్ తగిలించేస్తే , అది మార్క్సిస్టు  విశ్లేషణ కాదు.

నాకు మార్క్స్ అంటే ఇష్టం, అంబేద్కర్ అంటే ఇష్టం, చలసాని ప్రసాద్ అంటే ఇష్టం –  కానీ రంగనాయకమ్మ చెప్పిందాని లో గూఢం అర్థం చేసుకోను అంటే – ఇదేదో పప్పులో వెల్లుల్లి వేస్తే ఇష్టం, పోపు పెడ్తే ఇష్టం అన్నట్టు మాత్రమే ఉంటుంది.

‘ బూర్జువా డెమొక్రసీ ‘ పరిధికి మించి అంబేద్కర్ ఆలోచనలు ఉపయోగ పడ్తాయా ‘ అనే ప్రశ్న ఈ వ్యాసం లో ఎక్కడో తగుల్తుంది. ఈ బూర్జువా పదం ఇదేదో దండకం అయిపోయిందన్నది ఇక్కడ స్పష్టం. దళితులు సమానత్వాన్ని కోరుకోవడం – ఒక ప్రజాస్వామిక డిమాండ్.  సమానత్వం వచ్చాక , ఎటువంటి విప్లవం తీసుకోవాలో అప్పుడు అది ‘ బూర్జువా సమస్య ‘ అవుతుందో కాదో తేల్చొచ్చు. ఇదే పేరుతో దళితులకు సమానత్వం సాధించడం సెకండరీ అని చిత్రీకరించిన బ్రాహ్మణిక కుట్రలు ఈ రోజో రేపో బౌన్స్ అవ్వక మానవు.

టి కప్పు జాగర్తగా పట్టుకుని సిప్ చేసా. వేడిగా ఉంది టీ.

ఈ వ్యాసం లో చాలా విచిత్రంగా – రంగ నాయకమ్మ రాసిన  పుంఖాను పుంఖాలైన వ్యాసాలకు బలవంతంగా ఒక సింపతీ తీసుకురావాలనుకోవడం. అదే సమర్థనీయం ఐతే – కుట్ర కేసులకు వ్యక్తి గత జీవితాలను ఒడ్డిన వి ర సం కు ఎంత సిపతీ కావాలి అన్న ఆలోచన రంగనాయకమ్మ అభిమానులకు ఎందుకు తట్టదో తెలుసుకోలేనంత ‘ దూరా ‘ భిమానం ‘ అయ్యింది. మళ్ళీ అదో ప్రశ్న – ‘  ఏం ఈ పుస్తకాలు  మార్క్సిస్ట్ – లెనినిస్ట్ పార్టీలు తీసుకు రావచ్చుగా ‘  అని ? …  ఏం ఎందుకు తీసుకు రావాలి ? – ఒరిజినల్ మార్క్స్ పుస్తకాలు చదవడానికి,  చదివే వాళ్ళకు బద్దకమైతే – అది భగ భగ మండి పోతున్న ‘ విప్లవ సమస్యా ‘ ?  అలా పుస్తకాలు తీసుకు వస్తేనే సిన్సియారిటీ నా ? ఇది విప్లవోద్యమమా లేపోతే ‘ పబ్లికేషన్స్ ఉద్యమమా ‘ ? ఇలా పుస్తకాలు ప్రచురించే బెంచ్ మార్క్ ఏంటో ఎన్ని టీ కప్పులు ఖాళీ చేసినా తెలీదు.

ఇంకో సిప్ కొట్టా. నాలుక పై వేడిగా టీ దిగుతుంది.

అలాగే – శ్రీ శ్రీ విషయం లో వర వర రావు గారి వ్యాసం శీర్షిక భాగం లో ” ఎటువంటి రాజకీయ , సాంస్కృతిక సందర్భం లోనైనా శ్రీ శ్రీని ముందు బెట్టి రచయితలను కలుపుకు  రావచ్చనేది చలసాని అవగాహన ” అని ఉంటే అందులో ‘ వీర పూజ ‘ ప్రస్తావన ఎక్కడిది ? ఆయన్ని తల మీద పెట్టుకుని ఊరేగినట్టు ఏముంది ? ఇదే శ్రీ శ్రీ,  విరసం నుండి  బహిష్కరించబడ్డప్పుడు మరి ‘ వీర ద్వేషం ‘  కనిపించలేకుండ పోవడం తమాషా. శ్రీ శ్రీ వి రసం లో చేరకున్నా విరసం ఏర్ప్డడేది . అదో చారిత్రక సందర్భం. శ్రీ శ్రీ , మోటార్ సైకిల్ కు పెట్రోల్ అడ్జస్ట్ చేసి ఇవ్వాలనుకున్న ఫస్ట్ కిక్కు మాత్రమే. వెంటనే ఇచ్చే రెండో కిక్కుకు మోటార్ సైకిల్ చచ్చినట్టు కదిలేది. అలాగని మొదటి కిక్కు వృథా చేసుకోకూడాదనుకునే  ‘ ఎంథూసియాజం ‘ మాత్రమే చలసాని ప్రసాద్ గారికి ఉంది  అన్న సాధారణ విషయాన్ని కూడా ఇంత విడమరిచి చెప్పాల్సి వస్తుందేంటో ?!  శ్రీ శ్రీ ని వెంటనే కార్ ఎక్కించకుండా – ఒక రెండు నెలలు ‘ మార్క్స్ ‘ టెస్ట్ పెట్టి తీరుబడిగా ఆహ్వానించి ఉంటే సరిపోయి ఉండేదా ?  పైగా వి ర సం ఏర్పడాలంటే – మొదట ప్రణాళిక రాసుకోవాలట, తర్వాత కార్య వర్గం నిర్మించాలంట –  ఆ తర్వాతే వి ర సం ఏర్పాడలట ! మార్క్సిస్టు ‘ రూలు బుక్కు ‘ ఒకటి తయారు చేయాలిక. ఎప్పుడెలా ప్రవర్తించాలి అని. రంగ నాయకమ్మ అభిమానులు గ్రహించాల్సింది ఏంటంటే – దోపిడీ, అణచివేత కు రూల్స్ లేవు,  మార్క్సిస్ట్ ఫిలాసఫీ రిజిడ్ ఫిలాసఫీ కాదు.  మార్క్సిజం మీద గైడ్స్ రాసి రంగ నాయకమ్మ ఇప్పుడు ‘ విప్లవ రూల్ బుక్కులు ‘ రాస్తుంది.

టీ అయిపోవచ్చింది. దాని ఘాటైన వాసన మనస్సును ఉత్తేజ పరుస్తుంది.

రంగ నాయకమ్మ కలం కు,  పోటు ఇవ్వడం తెలీదు. ఆ పోటుకు అభిమానులనుకున్నట్టు బాధితులెవరూ లేరు. నిజానికి ఇదంతా రంగ నాయకమ్మకు దళిత వాదులు, ప్రజాస్వామిక కాముకులు ఇచ్చే పోటు. అసలు కలం పోటు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే విరసం తో మమేకమైన చెరబండ రాజును చదవాలి. అంతే కాని ఇన్ని సంవత్సరాలు  ఎప్పుడో పాతిన ‘ వృక్షాలను ‘ ‘ మొక్కలను ‘ అమ్ముకుంటూ బతకడం కాదు.

చివరి సిప్ చేసేసా. ఈ రోజు ఏంటో టీ మస్త్ కిక్ ఇచ్చింది ! లేచి బటర్ ఎక్కువ రాసేసుకున్న బ్రెడ్ ను డస్ట్ బిన్ లో పారేసి వచ్చేసా.

 

(PS : This write up absolutely aims to dispassionately convince the masqueraded arguments in the name of Marxism and this comes with an earnest request to all readers to consider the essence of the article with an objective view and feel free to reach the writer in his inbox for any queries at pvvkumar@yahoo.co.uk or on Facebook )

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. Delhi Subrahmanyam says:

  వెంత గొప్పగా రాసీసినావ్ యిజయ్ కుమార్ బావ్. వందల నా పేరుంది కనే వెతి సేప్పలనుకున్నదో వదీ సరిగ్గా సేప్పనేకపోనాడు. ఈళ్ళు మనవెంత విస్టేరి సేపుతున్న యిన్కోకుండా ఈ వ్యక్త పూజ మీద అదే గోల. వనగే, లేని ప్రెసనలకు జవబివ్వలేదేటి అనింక్ గోల. ఒల్లకో ఇజయకుమార్ బావ్ ఈల్లు తర్కం ఇనకున్ద వుండాలని వోట్టేసేసుకున్నారు

 2. విలాసాగరం రవీందర్ says:

  మంచి వ్యాసం. వ్యక్తి పూజ వాదులకు చెంపపెట్టు

 3. భక్తి పారవశ్యం పూనకంలో వూగుతున్న వారలందరికీ ఈ విషయాలు అర్థం అయితే బాగుండు.

 4. ఓకే.
  పత్రిక సంపాదకులకు చెప్పండి ఎడిట్ చెయ్యమని. ( ఎడిటర్ గారూ, నా కామెంట్లో ప్రస్తావించిన పేరు తొలగించండి) . ఎడిట్ చేసే యాక్సెస్ నాకు లేదు.
  అయినా ఆయన పేరు తీసుకునే రాసేరు కదా జ్యోతిలో.

 5. buchireddy gangula says:

  యీ దోపిడీ వ్యవస్థలో —-మనం చూస్తున్నది — **వ్యక్తి పూజలు ** buttering… చేయడం — అవేగా ???
  విజయకుమార్ గారు — చక్కగా చెప్పారు సర్

  —————————–బుచ్చి రెడ్డి గంగుల

 6. Aranya Krishna says:

  అందరూ మరిచిపోతున్న సమయంలో, తనని తానే జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయంలో చేసిన ఒక డెస్పరేట్ అటెంప్ట్ బాగానే క్లిక్కయింది మేడం గారికి. ఎంత ఘోరంగా చలసాని, వరవరరావు గార్ల మీద రాయకపోతే ఎంతో అభిమానించే వారు కూడా “ఆవిడ మాటల్లో తడి వుండకపోవచ్చు” అనొ లేదా ఆమె విశ్వనాధ సత్యనారాయణగారి జానర్ అనో అంటారు! ప్రతిదీ పద్ధతి.కామ్మ్ లో జరగాలనే వారు చివరికి నిష్క్రియాపరత్వం లోనే నిజాయితీని వెతుక్కుంటారు. గతకాలపు వైభవాన్ని చూపించి ఇప్పుడు రాయితీలు అడిగితే ఎలా? విజయ్ కుమార్ గారూ మీరు బ్రెడ్ మీద మరోసారి బట్టర్ పూయనీయకుండేంతగా రాసారు. మా ఇంట్లో మెనూలోంచి ఇంక బ్రెడ్, బట్టర్ లేకుండా చేసారు. మీతో పచ్చీస్!

 7. Dr.Rajendra Prasad Chimata says:

  రంగనాయకమ్మ వల్ల మార్క్సిజం గురించి చెప్పుకోదగ్గంత మంది తెలుసుకున్నారనేది, 1970 85 మధ్య లో పత్రికలే ఎక్కువ కాలక్షేపం గా ఉన్న రోజుల్లో ఒక రకం భావ విప్లవం తెచ్చారనేది వాస్తవం . ఈ రోజు వాళ్ళం తా 60 ఏళ్ళ వయసులో ఉండే అవకాశం ఉంది.వాళ్ళల్లో చాలా మందిని ఆమె మంచి భావాల వైపుకు(Progressive thinking) మళ్ళించి ఉంటారనె అనుకుంటా.
  ఆమె లోని బలహీనత తను నమ్మినదే రైటు మిగిలిన వాళ్ళందరూ తప్పు.
  అభిమానంతో శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళిన ముళ్ళపూడి వెంకట రమణ లాంటి వాడికే ఎందుకెళ్ళాం రా బాబు అనిపించగల మనస్తత్వం. ప్రజాసాహితి ఎడిటర్ గా ఎక్కువ కాలం ఉండలేక పోయారు. ఆమె దృష్టి లో ఆమె తప్ప అందరూ రివిజనిస్టు లే లేదా పాలక వర్గాలకు అనుకూలురే. ఎవరు ఎన్ని అన్నా రాయడం ఆమె జీవితం.ఈ మధ్య నవ్య లో ఆమె రాస్తున్న సీరియల్ ఎందుకు రాస్తుందో ఎవరికోసం రాస్తుందో ఏమి చెప్తోందో అగమ్య గోచరం. మళ్లి కులాలు వర్గ పునాదులమీద మార్క్సిజాన్ని వ్యతిరేకించే వాళ్ళమీద ఆంధ్ర జ్యోతి 4 వ పేజీ లో విరుచుక పడడం ఆమెకే చెల్లు. మీరెన్ని మనమెన్నిఅనుకున్నా ఆమె అలాగే రాస్తూనే ఉంటుంది.మనం అంటే చదివే వాళ్ళందరూ ఆమెను భరించాల్సిందే. మార్క్సిజాన్ని ఆమె దృష్టి లో ఆమె ఒక మొక్కవోని సైనికురాలి గా కాపాడుకుంటున్నందుకు అభినందించాలి

  • Aranya Krishna says:

   డా.రాజేంద్ర ప్రసాద్ గారూ! మనం ఆమెని కాపాడుకుంటున్నామా లేక భారిస్తున్నామా?

   • Dr.Rajendra Prasad Chimata says:

    చదివే వాళ్ళు భరించాల్సిందే. మార్క్సిజాన్ని ఆమె దృష్టి లో ఆమె ఒక మొక్కవోని సైనికురాలి గా కాపాడుకుంటున్నది

మీ మాటలు

*