కల్బుర్గి తల నవ్వింది..

 

-సత్యమూర్తి

 

ఒళ్లంతా నెత్తురోడుతున్న కల్బుర్గిని దేవదూతలు బలవంతంగా స్వర్గం వాకిట్లోకి తోసేశారు. ఆ వృద్ధుడు బలాన్నంతా కూడదీసుకుని మళ్లీ బయటకి రావడానికి ప్రయత్నించాడు. కానీ అడుగు ముందుకు పడ్డం లేదు. దేవదూతలు పగలబడి నవ్వారు.

‘అయ్యా, తమది వృథా ప్రయత్నం! ఒకసారి స్వర్గంలోకి వచ్చాక బయటికెళ్లడం అసాధ్యం. మీకు స్వర్గసుఖాల రుచి తెలియదు కనుక పారిపోవాలనుకుంటున్నారు. ఈ సాయంత్రానికి మీ మనసు మారిపోతుంది. ఆనక ఇక్కన్నుంచి వెళ్లగొట్టినా వెళ్లరు’ అని అన్నారు.

కల్బుర్గిని లక్ష యోజనాల పొడవూ, లక్ష యోజనాల వెడల్పూ ఉన్న స్వర్ణమందిరంలోకి తీసుకెళ్లి మేనకకు అప్పజెప్పి వెళ్లిపోయారు.

మేనక వగలు పోతూ కల్బుర్గి ముందు నిలబడి కొంటెగా చూసింది. అతడు ముక్కు మూసుకున్నాడు. అప్సరస వద్ద నుంచి చెమటకంపు గుప్పుమని కొడుతోంది. ఆమె కాసేపటి క్రితమే విశ్వామిత్రుడి గాఢపరిష్వంగంలో నలిగింది. విషయం గ్రహించి చప్పున పక్కనే ఉన్న పన్నీరు బుడ్డి తీసుకుని ఒంటిపై చల్లుకుంది. గాల్లోంచి పౌడరు రప్పించి ముఖానికి దట్టంగా పూసుకుంది. చెలికత్తెలు వీణలు సవరించారు. మేనక ‘మదనా మనసాయెరా..’ అని కీచు గొంతుతో పాట ఎత్తుకుని నర్తనం మొదలెట్టింది.

కల్బుర్గి చెవులు మూసుకున్నాడు. మేనక కంగారు పడిపోయింది. ఇలాగైతే పని కాదని, ఆటాపాటా ఆపి పాత అతన్ని గట్టిగా వాటేసుకుంది. కల్బుర్గి ఆమెను విసురుగా తోసేశాడు.

‘ఏమి చిత్రం? ఏమి చిత్రం? ఒక అల్పమానవ ముదుసలి నా బిగికౌగిలిని నిరాకరించుటయా?’ విస్మయంగా అందామె.

‘ఏవమ్మో, మాటలు జాగ్రత్త! అల్పుడూ గిల్పుడూ అంటే ఊరుకునేది లేదు. ముందు నన్నిక్కన్నుంచి పంపేయండి. హాయిగా మేఘాల్లో, పాలపుంతల్లో తిరుగుతూ ఉంటే మీ వెధవలు ఇక్కడికి లాక్కొచ్చి పడేశారు’ అన్నాడు కల్బుర్గి.

మేనక బుగ్గ నొక్కుకుని, మోహనంగా నవ్వింది.

‘భలే చిత్రంగా మాట్లాడుతున్నారే! నేను పుట్టి కోట్ల కోట్ల కోట్ల కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాలు అయ్యింది. మీలాంటి వింత మనిషిని ఎన్నడూ చూళ్లేదు..’

‘కాకి లెక్కలు చెప్పమాక. నువ్వు మేనకవూ కాదు. ఇది స్వర్గమూ కాదు. అవన్నీ పుక్కిటి పురాణాలు. ఆ మాట అన్నందుకేగా నన్ను తుపాకీతో కాల్చి చంపేసింది. ఇక్కడ.. ఇదంతా ఏదో మాయలా ఉంది. ఏదో పౌరాణిక సినిమా సెట్టింగులా ఉంది..’

మేనకకు అతను చెప్పింది బొత్తిగా అర్థం కాలేదు. అర్థం చేసుకోవాల్సిన అగత్యమూ లేదు కనుక దేవేంద్రుడి ఆజ్ఞ ప్రకారం ఆమె కల్బుర్గిని మళ్లీ వాటేసుకుని పెదవులను ముడేయబోయింది.

కల్బుర్గి ఈసారి మరింత విసురుగా తోసి ఆమె చెంప చెళ్లుమనిపించాడు.

‘ఎందుకలా మీదమీదపడిపోతున్నావ్? కోట్ల కోట్ల కోట్ల ఏళ్లుగా ఎంతమంది దగ్గర పడుకున్నావో ఏమో. ఎయిడ్సూ గట్రా సుఖరోగాలు తగిలుంటాయి. నాకు అంటించమాక.. దూరంగా ఉండు.. మీద పడితే మర్యాద దక్కదు సుమీ..’ అన్నాడు.

అప్సరస నిశ్చేష్టురాలైపోయింది.

‘మానవాధమా, నన్నే కొడతావా? వెంటనే శిలావిగ్రహమైపో!’ అని శపించింది.

కల్బుర్గి విరగబడి నవ్వాడు. అతడు రాయీ కాలేదు, రప్పా కాలేదు.

మేనక విస్తుబోయింది. మళ్లీ శపించింది.

కల్బుర్గి నిక్షేపంగా నవ్వుతూనే ఉన్నాడు.

మేనక కోపంతో చరచరా దేవేంద్రుడి వద్దకు వెళ్లింది. విషయం చెప్పి ముక్కు చీదింది. చీదింది కాసింత ఇంద్రుడిపైనా పడింది. సురపతి దానితోపాటు మూతికంటిన సురను కూడా తుడుచుకుంటూ నవ్వాడు.

‘భామినీ, కలత వలదు! అతడు హేతువాది. అందుకే నీ శాపం పనిచేయలేదు. దయ్యాలు భయపడేవాళ్లనే కదా భయపెడతాయి.. ఆ ముసలాణ్ని అలాగే వదిలేసి ఈసారి వశిష్టుడి పడగ్గదికి వెళ్లు.. ఎప్పుడూ రాజర్షితోనే పడుకుంటున్నావని వశిష్టుడు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నాడు…’ అన్నాడు.

***

కల్బుర్గికి స్వర్గంలో ఏమీ తోచడం లేదు. కొంపదీసి ఇదంతా కల కాదు కదా అనుకుని నాలుగైదుసార్లు గట్టిగా గిచ్చుకుని చూసుకున్నాడు. నొప్పి అనిపించలేదు. అయితే తను చనిపోయినట్టా? అనుమానం తీరక కల్పవృక్షం వద్దకెళ్లి ఒక కొమ్మ తెంపుకుని అరిచేతిపైనా, వీపుపైనా గట్టిగా కొట్టుకొట్టున్నాడు. నొప్పి పుట్టలేదు. రెండు రోజులుగా తనకు ఆకలేయనీ సంగతి కూడా గుర్తొచ్చి తను నిజంగా చనిపోయినట్లు నిర్ధారించుకున్నాడు. కానీ అది స్వర్గమని నమ్మలేకపోతున్నాడు. స్వర్గమైతే చచ్చిపోయిన మహానుభావులందరూ ఇక్కడే ఉండాలిగా, వాళ్లెవరూ కనిపించలేదే అని అనుమానమొచ్చింది.

ఇంతలో ఓ దేవదూత తలపై పెద్ద మధుభాండంతో అటుగా పోతూ కనిపించాడు. కల్బుర్గి అతని వద్దకెళ్లాడు.

‘ఇదుగో అబ్బాయ్. ఇది స్వర్గమేనంటావా? అయితే  మీ దేవేంద్రుడెక్కడోయ్?’ అని అడిగాడు.

దేవదూత విస్తుబోయాడు.

‘ఇది స్వర్గమేనండి. అయినా మీకా అనుమానం ఎందుకొచ్చింది?’ ఎదురు ప్రశ్న వేశాడు.

‘బతుకంతా ప్రతీదాన్నీ ప్రశ్నించి ప్రశ్నించి అలా అలవాటైందిలే. సరేగాని, తలపైన ఏమిటోయ్ తీసుకెళ్తున్నావ్? మాంచి వాసన వస్తోంది..’

‘ఇదా? మేలురకం మద్యం. దేవేంద్రుడి కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. ఆయనగారింట్లో నిండుకుందని చెబితే పట్టుకెళ్తున్నా..’

‘సరేకానీ, నాక్కాస్త పోయవూ! ఆకలిదప్పుల్లేక నోరంతా అదోలా అయిపోయింది..’

‘అమ్మబాబోయ్. ఈ మధువా? మీకా? కుదర్దండి. ఇది దేవాధిదేవుడైన ఇంద్రులవారిది.. ఆయనే తాగాలి’

‘బోడి ఇంద్రుడు లేవోయ్. మా పక్క ఆయన్ని తార్పుడుగాడు అని గౌరవిస్తాం లెద్దూ.. అయినా మీ దేవతలకు ఆకలిదాహాలు ఉండవు కదా. మరి అల్పమానవుల మాదిరి ఈ సారాయిపై అంత కక్కుర్తి ఏమిటోయ్? అచ్చోసిన ఆంబోతుల మాదిరి రంభామేనకలపై ఆ పశువాంఛలేమిటోయ్?’

దేవదూతకు మాట పెగల్లేదు. కల్బుర్గి దేవదూత తలపై ఉన్న భాండాన్ని కాస్త వంచి కడుపారా మద్యం తాగాడు. మనసు కుదుట పడింది.

దేవదూత ఆశ్చర్యం నుంచి తేరుకున్నాడు.

కల్బుర్గి అతన్ని గట్టిగా గిచ్చాడు. దేవదూత కెవ్వుమన్నాడు. అల్పమానవుడు ఊరుకోలేదు. దేవదూతను కితకితలు పెట్టాడు. భాండం జారిపడి రోదసిలోకి వెళ్లిపోయింది.

దేవదూత కల్బుర్గికి దండం పెట్టి తనను వదిలేయమన్నాడు. ఏదో మంత్రం వేసి భాండాన్ని మళ్లీ పైకి రప్పించి తలపై పెట్టుకున్నాడు. కల్బుర్గి మళ్లీ  భాండాన్ని వంచబోయాడు.

‘బాబ్బాబూ, మీ పుణ్యముంటుంది! దాన్ని ముట్టుకోకండి. కావాలంటే వేరొక మద్యం తెస్తా. ఇంద్రుల వారి మద్యాన్ని ఎంగిలి చేశారంటే నా మెడకాయపై తలకాయ ఉండదు’

‘అంతగా వణికిపోతున్నావ్, నువ్వేం దేవుడివోయ్? మెడపైన తలకాయ పోతే మళ్లీ అతుక్కుంటుంది కదా, వినాయకుడి తలకాయలాగా. ఆ మందు తాగకపోతే మాత్రం నేను మళ్లీ చావడం ఖాయం..’ అంటూ కల్బుర్గి భాండాన్ని వంచి గుటకలేశాడు.

‘చచ్చిన పుణ్యాత్ములందరూ ఇక్కడికొస్తారంటారు కదా. మరి, మా వీరశైవ బసవన్న ఎక్కడున్నాడోయ్? ’ అని మత్తుగా అడిగాడు.

దేవదూత దివ్యదృష్టితో పరికించి చూశాడు.

‘ఇక్కడికి దగ్గర్లోనే ఉన్నాడు. అదుగో ఆ మలుపు దాటితే శివాలయం వస్తుంది. అక్కడ అరుగుమీద కూర్చుని వచనాలు వల్లెవేస్తున్నాడు’ అని చెప్పి గబగబా వెళ్లిపోయాడు దేవకింకరుడు.

కల్బుర్గి కాస్త తూలుతూ బసవడి దగ్గరకు వెళ్లాడు.

బసవడు అరుగుపైన శివలింగం పెట్టుకుని అరమోడ్పులతో శివశివా అంటూ ఊగిపోతున్నాడు.

‘అయ్యా..’ పిలిచాడు కల్బుర్గి.

బసవడు పలకలేదు. కల్బుర్గి మళ్లీ పిలిచాడు. వీరశైవుడు పలకలేదు. కల్బుర్గికి మండుకొచ్చి భక్తునికి తొడపాశం పెట్టాడు. బసవడు కెవ్వుమన్నాడు.

‘అయ్యా, నా పేరు మల్లేశప్ప మడివాళప్ప కల్బుర్గి. మీ కన్నడం వాడినే.  కొంతమంది వీరభక్తాగ్రేసులు ఇంటికొచ్చి మరీ కాల్చేసిన పుణ్యం ఫలితంగా ఇక్కడికొచ్చాను.. ఆ పుణ్యంలో మీకూ వాటా ఉందిలెండి..’ అన్నాడు వెటకారంగా.

బసవడు తికమకపడ్డాడు.

‘నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు.. వివరించి చెప్పు’

‘చెబుతా, చెబుతా. ముందు ఆ బారెడు కత్తిని ఒడిలోంచి తీసి పక్కన పెట్టండి. సంఘసంస్కారం కోసం అంతగా తపనపడ్డ మీకు చచ్చాకా ఈ కత్తీగట్రా ఎందుకండీ? కొంపదీసి ఇక్కడా వీరశైవం ప్రచారం చేస్తున్నారా, ఏమిటీ?’

బసవడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.

‘నా ముచ్చట తర్వాత. ముందు నీ సంగతీ, నీ హత్య వల్ల నాకు దక్కిన పుణ్యం సంగతీ చెప్పు’

‘అయ్యా, నేను మీ భక్తివచనాలపై లోతైన పరిశోధన చేశాను. మీలాగే మూఢనమ్మకాలపై అలుపెరగకుండా పోరాడాను. ఓ విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేశాను. ఇరవైకి పైగా పుస్తకాలు, నాలుగొందలకుపైగా వ్యాసాలు రాశాను.. మీ కుటుంబం గురించి, విగ్రహాల పూజ గురించి కొన్ని ప్రశ్నలు లేవదీసినందుకు నన్ను చంపేశారు..’

‘చిత్రంగా ఉందే! నేను కలగన్న మూఢవిశ్వాసాల్లేని కన్నడసీమ ఇంకా సాకారం కాలేదా? ఇంతకూ నాపైన నీ విమర్శలేంటో?’

‘ఏవో కొన్ని ప్రతిపాదనల్లెండి. మీ రెండో భార్య నీలాంబికతో మీ కాపురం వొట్టి అమలిన శృంగారం అని అన్నాను. దానికి వచనాల్లోంచి రుజువులు చూపాను. మీ మేనల్లుడు చెన్నబసవడు మీ చెల్లెలు నాగలాంబికకు, మాదిగవాడైన దోహర కక్కయ్యకు పుట్టి ఉండొచ్చని, పండితులు ఆ సంగతి దాచారని అన్నాను.. దానికీ కొన్ని ఆధారాలు చూపాను..’

బసవడి ముఖం కందిపోయింది. కోపాన్ని బలవంతంగా అణచుకున్నాడు.

‘ఇంకా..’

‘ఇంకా అలాంటివేవో కొన్ని. మీరు జంధ్యం వద్దన్నారు కానీ, మెడలో మాత్రం ఇష్టలింగాన్ని ఎందుకేసుకోమన్నారు అని ప్రశ్నించా. విగ్రహారాధన కూడదని వాదించాను. జనం పాలూపెరుగూ లేక మాడిపోతోంటే రాతిబొమ్మలకు పంచామృతాభిషేకాలు ఎందుకన్నా.. జనం కట్టుగుడ్డలు లేకుండా వణికిపోతోంటే స్పర్శలేని దండగమారి బొమ్మలకు పట్టుగుడ్డలెందుకని ప్రశ్నించా. ఇవన్నీ నా చావుకు తెచ్చాయి..’

బసవడికి కోపంతో పాటు ఆసక్తీ తన్నుకొస్తున్నాయి.

‘కల్బుర్గీ! ఇష్టలింగధారణలో తప్పేముందోయ్.. ఆలయాల్లో డంబాచారాలకు విరుగుడుగా ఆ పద్ధతి తెచ్చాను.. పొదుపుకు పొదుపూ, భక్తికి భక్తీ. శివుడెప్పుడూ మెడలోనే ఉంటాడు..’

‘మీకు తప్పుగా అనిపించలేదు. నాకనిపించింది. విగ్రహారాధన కూడదని నా వాదన. అది గుళ్లో ఉన్నా, మెడలో ఉన్నా శుద్ధ దండగ. మీరు జంధ్యం దండగన్నారు. నేను లింగం దండగన్నాను..’

‘అది కాదోయ్.. ఏకాగ్రత కోసం లింగాన్ని వేసుకోమన్నా.. ’

‘నాకు కాఫీ, సిగరెట్టు తాగితే ఏకాగ్రత. కానీ నేను వాటిని మెడకు కట్టుకుని ఊరేగను..’

‘సరే ఇంకా ఏమని వాదించావు..’

‘ఇలాంటివేనని చెబుతున్నాగా..’

‘ఓసోస్.. ఈ మాటలకే చంపేశారా? ఇలాంటి వాదవివాదాల కోసమే కదా అనుభవ మంటపం పేరుతో జాతిమతవర్ణలింగ వివక్షల్లేకుండాల అందరూ వచ్చి చర్చించుకోవడానికి భవనం కట్టించాను..’

’ఆ భవనం ఎప్పుడో కాలగర్భంలో కలసిపోయింది. తమకు నచ్చని వాదాన్ని వినిపించేవాళ్లను కాలగర్భంలో కలిపేయడమే నేటి వాదం. దానికోసం సరికొత్త అనుభవ మంటపాలు తామరతంపరగా పుట్టుకొస్తున్నాయి..’

‘ప్చ్. ఇదేం బాగాలేదోయ్ కల్బుర్గి..’

కల్బుర్గి బసవడు ఆరాధిస్తున్న శివలింగం కేసి చూశాడు. పీకలదాక మధువు తాగడంతో కడుపుకింద ఒత్తిడి పెరిగింది.

‘మరో సంగతి చెప్పడం మర్చిపోయానండి. నన్ను ఖూనీ చేయడానికి మరో కారణం కూడా ఉందండోయ్..’

బసవడు చెవులు రిక్కించాడు.

‘అనంతమూర్తి అని నా స్నేహితుడొకడుండేవాడు. గత ఏడాదే పోయాడు. నా మాదిరే వాదించేవాడు. నా మాదిరే విగ్రహాలంటే పడదు. అతడు బాల్యంలో ఓ మంచి పని చేశాడు. విగ్రహాలకు మహిమ ఉందో లేదో తేల్చడానికి విగ్రహాలపై ఉచ్చ పోశాడు. అవి శపిస్తాయేమోనని చూశాడు. అవి ఏమీ చేయకపోవడంతో మనోడికి మరింత ధైర్యం వచ్చేసింది. ఆ సంగతి ధైర్యంగా ఓ పుస్తకంలో రాశాడు. నేను ఓ చర్చలో ఆ విషయం చెప్పాను. కాషాయమూకలకు అది నచ్చలేదు. అప్పటికే నాపైన కత్తులు నూరుతున్నారు కదా. సఫా చేసేశారు..’

బసవడు ‘శివశివా’ అని చెవులు మూసుకున్నాడు.

కల్బుర్గికి కడుపుకింద ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. బుర్రలో బలమైన సరదా కూడా మెలిపెడుతోంది.

‘వీరశైవరత్నమా.. మీరు మరోలా అనుకోకపోతే ఒక మాట..’

‘చెప్పు..’

‘ఇది స్వర్గం కదా. ఇక్కడికొచ్చినవారికి చావు ఉండదు కదా.. అనంతమూర్తి చేసిన పరీక్షను నేను బతికున్నప్పుడు ఎన్నడూ చేయలేకపోయానండి. ఇప్పడు జరూరుగా చేయాలనిపిస్తోందండి. మీరు  కాస్త అరుగు దిగితే ఈ శివలింగంపై ఆ పని కానిచ్చేస్తాను..’

కల్బుర్గి మాట పూర్తికాకుండానే బసవడు ఖడ్గంతో ఒక్కవేటున అతని తల నరికేశాడు.

శివలింగం పట్టపానంపై పడిన కల్బుర్గి తల విరగబడి నవ్వుతోంది.

కల్బుర్గి పొట్టకింద నుంచి సన్నని ధార రాతి విగ్రహాన్ని తడుపుతోంది.

 

 

(మతోన్మాదులు చంపేసిన కల్బుర్గికి క్షమాపణతో నివాళిగా..)

మీ మాటలు

  1. మహత్తు వుందో , లేదో తెలుసుకోవడానికి విగ్రహాలపై ఉచ్చ పోయాలా ! ఇదేదో బాగుందే !

    • Srinivas Vuruputuri says:

      “కల్బుర్గి పొట్టకింద నుంచి సన్నని ధార రాతి విగ్రహాన్ని తడుపుతోంది.” – So cheap!

      All iconoclasts start by questioning the efficacy of idols. But then, that’s the beginning of a life long journey of learning. If these worthies kept admiring such juvenile misadventures decades after the actual occurrence, what can one say about their maturity levels? God save these smug Indian Atheists. :)

      Heckling, surely is not the way to reform societies.As Basavanna said,

      నుడిదరె ముత్తిన హారదంతిరబేకు! /నుడిదరె మాణిక్యద దీప్తియంతిరబేకు! / నుడిదరె స్ఫటికద శలాకెయంతిరబేకు! / నుడిదరె లింగ మెచ్చి అహుదెనబేకు ! / నుడియొళగాగి నడెయదిద్దరె కూడలసంగమదేవనెంతొలివనయ్య ?

      “If you should speak, your words should be like pearls strung on a thread! If you should speak, your words should be like the luster shed by a ruby! If you should speak, your words should be like a crystal’s flash that cleaves the blue! If you should speak, the Lord must say “yes, yes, that is true”! But, if your deeds do not reflect your words, how can Lord Kudala Sangama accept you?”

      On a minor note –

      “స్వర్గమైతే చచ్చిపోయిన మహానుభావులందరూ ఇక్కడే ఉండాలిగా, వాళ్లెవరూ కనిపించలేదే అని అనుమానమొచ్చింది.”

      Perhaps, Kalburgi would have wondered if it was a mistake that an heretic like him was admitted into the heaven. :)

      • చక్కగా చెప్పారు. బసవన్న గారి మాటలు అమృతంలా, స్ఫూర్తి దాయకంగా వున్నాయి. చదవగానే నేను ఈ విధంగా మాట్లాడటం నేర్చుకోవాలి అనిపించింది. భగవంతుడు సత్యమా, అసత్యమ్మ అనీది ఎవరికీ తెలీదు-కాని భగవత్ తత్త్వం అని దేనినైతే భావిస్తామే అది ప్రేమ పురితమైనది. బిడ్డ తన మీద వుచ్చ పోస్తే తల్లి కొపగించుకోదు. కానీ ఒకరు ప్రేమతో ఆరాదించే వస్తువుని మలిన పరిచి దానిని బాహాటంగా, గొప్పదనంగా ప్రకటించుకోవడం తెంపరితనం(ఐతే ఇటువంటి సందర్బాలలో అన్నీ వర్గాల వారూ సంయమనం పాటిస్తే సమాజం శాంతియుతంగా ముందుకు పోగలదు.) వ్యక్తిగతంగా నేను హేతువాదిని: పుజలూ పునస్కారాలు చేయక పోయినా-మిగిలినవారు వాటిని ఎందుకు చేస్తారు అనేది నాకు అర్ధం కావాలి. మతం ఒక వ్యాపకం-అది మనిషిని కొన్ని హానికరమైన మానసిక ఉద్రేకాలనుంది కాపాడగలదు-ఐతే సమస్య ఎక్కడ వస్తోందంటే మతంపై అటాచ్మెంట్ లెవెల్స్ ఉద్రేకపూరితంగా హానికరంగా మారినప్పుడు-అలాగే దానికి వ్యతిరేకంగా మాట్టాడేవారుకూడా అవసరానికి మించి ఉద్రేకం ప్రదర్శించి ఎదుటి మనిషి విశ్వాసాన్ని అవహేళన చేస్తారు. ఈ రెండూ చెరుపు చేసే ప్రవర్తనలే. అప్పుడేప్పుడో ఏం జరిగింది అనే విషయం ఇప్పటి సమాజానికి ఉపయోగ పడేదా లేదా గమనించుకోవాలి గానీ పాత విషయాలను తవ్వడం వాల్ల ప్రయోజనం ఏమిటి-కావలసినన్ని సమస్యలున్నాయి-వాటిని పరిష్కరించే దిశగా ప్రోడుక్టివే ఏక్షన్ వుండాలి. (రచయిత రాసిన విధానం చాలా చక్కగా వుంది-వృద్ధ మేధావి ప్ర్రాణం తియ్యడాన్ని నేను ఖండిస్తున్నాను)

  2. బ్రెయిన్ డెడ్ says:

    రంభలు కాళ్ళేత్తి ఇంద్రుడి మీద అలాగే మొత్తం కాల్బురి లా హేతువాదాన్ని నమ్ముకున్న ఆడవాళ్ళు కూడా మొత్తం మహత్తుల శీలపరీక్ష అచ్చం ఇదే మోడ్ లో చేసే రోజుకై ఎదురుచూస్తూ . …కాల్బురి రచనల విషయసారం అర్ధం అయింది . కుడోస్

  3. appalnaidu says:

    చాలా బాగుంది, ఇటువంటి స్పందనలే రచయితల నుంచి రావలసినవి…

  4. ఇటువంటి వ్యంగ్యం కూడా మతవాడులకు నేరమే. గతంలో వారపత్రికలవారు వినాయకచవితికి హాస్య సంచిక ప్రచురించేవారు. అదికూడా కొందరి మనోభావాలను గాయపరుస్తోందని అటువంటి సంచికలుగాని వినయకునిమీద కార్టూన్లు మానివేశారు . ఈ బ్లాగర్ అడ్రస్ తెలిస్తే మతవాదులు ఏమిచేస్తారూనని భయం వున్నా భావ ప్రకటనా స్వేచ్చ మన జన్మహక్కు గా పోరాదదాము. మతవాదుల హత్యాకాండను ఖన్దిద్దాము.

  5. రవిబాబు గారూ ! గతంలో బాబాల బండారం బయట పెట్టడానికి డా. కోవూర్ , వారు చేసిన పనులన్నీ చేసి , ప్రజలను ఆలోచింప చేసేలా ప్రయత్నించారు. అలానే లవణం గారు , రామక్రిష్ణ గారు నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తూ , అనేక సభలు , సమావేశాలు నిర్వహించారు. కాని వీరెవరూ ఎప్పుడూ దైవ దూషణ చేసినట్టులేదు. కారణం ఈ దేశంలో దేవుడిని నమ్మేవారు , కర్మసిధ్ధాంతం పట్ల నమ్మిక కలవారు ఇంకా వున్నారు గనుక. దైవం పట్ల నమ్మకానికి కారణాలు చెపుతూ , వారిని ఆలోచింపచేయాలిగాని , దూషణ వల్ల కాదని వారి నమ్మకం. విమర్శ ఆలొచనకు మూలమవుతుంది , దూషణ ప్రతీకారేచ్చను రగుల్చుతుంది. దేశంలో దైవచింతన , కర్మసిధ్ధాంతం పట్ల నమ్మకం పెరగడానికి ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలు కారణం కాదా ! భావప్రకటనా స్వేచ్చ వుండాలిగాని , అది దుర్వినియోగం కాకూడదు. దాని వల్ల లాభపడేది ప్రభుత్వమే ! ప్రభుత్వానికి తన అజెండా అమలు పరచుకోవడానికి వీలవుతుంది గదా ! దైవభావన్ని నిర్మూలించే నాస్తికత్వాన్ని ప్రచారం చేయాలిగాని , దూషణలు , ప్రయోగాలు పనికిరావని నా భావన !!

  6. ఓ నిండు ప్రాణాన్ని నిలువునా తీసి నేలను రక్తంతో తడపడం కంటే రాతి విగ్రహాన్ని వుచ్చతో తడపడం పెద్ద తప్పేం కాదు.
    ఓ రచయిత రక్తం కళ్ళజూస్తే ప్రతి రక్తం బొట్టునుండీ మరెంతో మంది వుదయిస్తారని ఈ వుగ్రవాదులకు వుపదేశం అవ్వాలి.

    • Srinivas Vuruputuri says:

      మీరు ఏమీ అనుకోకపోతే –

      “వాళ్ళు” పెద్ద తప్పు – క్షంతవ్యం కాని ఘోరమైన తప్పే – చేసారు కాబట్టి “మనం” చిన్న తప్పు చేయటం తప్పు కాదనా?

      “ఓ రచయిత రక్తం కళ్ళజూస్తే ప్రతి రక్తం బొట్టునుండీ మరెంతో మంది వుదయిస్తారని ఈ వుగ్రవాదులకు వుపదేశం అవ్వాలి.” అనటం ఉత్తి rhetoric. అల్లూరి సీతారామరాజు సినిమా గుర్తుకు వస్తుంది.

      • బాగా చెప్పారు. ఆవేశం అనర్ధాలకు దారి తీస్తున్ది. ఆవేశం తగ్గించుకుంటే ఆలోచన, వివేకం పెరుగుతాయి. హేతువాదం అంటే కారణాన్ని పరిశోధించడం-భక్తికీ, మతానికి కారణాలు తెలుసుకోవడం కూడా -హేతువును అర్ధం చేసుకోవడం కూడా ఇందులో భాగమే! ఎక్కువ ఆవేశపడేవారు హేతువాదులు కాలేరేమో అని నాకు తోస్తోంది. వారూ వ్యతిరేక భావనకి బానిసలైపోయే ప్రమాదం వుంది!

      • నేనన్న దాంట్లో ఆవేశం ఏమీ లేదు. సినిమా డైలాగులా అనిపిస్తే అది నా తప్పుకాదు. నిండు ప్రాణాన్ని కాపాడటమనే నమ్మకం ముందు మిగతా నమ్మకాలన్ని ఒట్టివే అని చెప్పడం నా వుద్దేశ్యం.
        వాళ్ళు తప్పుచేశారని మనం చెయొచ్చనీ అనట్లేదు. అంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్షా అని.

  7. శాంతి says:

    ఓం సహనావవతు
    సహనౌభునక్తు
    సహవీర్యం కరవావహై
    తేజస్వి నావధీతమస్తు
    మా విద్విషావహై
    ఓం శాంతిః శాంతిః శాంతిః

  8. కె.కె. రామయ్య says:

    “బసవ భక్తివచనాలపై లోతైన పరిశోధన చేసిన, మూఢనమ్మకాలపై అలుపెరగకుండా పోరాడిన, విగ్రహారాధనను ప్రశ్నించిన, విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేసి ఇరవైకి పైగా పుస్తకాలు, నాలుగొందలకుపైగా వ్యాసాలు రాసిన , 76 యేళ్ల వయోవృద్ధుడు, కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత అయిన మల్లేశప్ప మడివాళప్ప కల్బుర్గి ని, కొన్ని మౌలిక ప్రశ్నలు లేవనెత్తి నందుకు ఇంటికొచ్చి మరీ కాల్చి చంపారు మతోన్మాదులు”. ఇది అత్యున్నత స్థానం నుండి అట్టడుగు వరకూ అందరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయం.

    సందేశాత్మక, అలోచనాప్రేరక నివాళిని అర్పించిన సత్యమూరి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

    MM Kalburgi murder: ‘What if Dayananda Saraswati lived in our times?’
    ~ Written by Sanal Edamaruku

    There is a striking similarity in the murders of Narendra Dabholkar, Govind Pansare and M M Kalburgi. All of them were active rationalists; they wrote and spoke openly against age-old traditions and beliefs and tried to promote scientific temper, spirit of inquiry and reform. Though these are officially the national ethos of modern India and enshrined as Fundamental Duties of citizens in Indian Constitution, they were brutally murdered for practicing and promoting them. Unidentified motorcycle borne killers shot them dead, point blank.

    Malleshappa Madivalappa Kalburgi, a scholar, writer and academic, has authored books and was respected widely for his fearless opinions based on scholarly studies. He was former vice chancellor of Kannada University in Hampi; received national sahitya akademi award in 2006 for a collection of his research articles on Kannada folklore, religion and culture.

    In the new wave of intolerance in India, Kalburgi’s criticism against idolatry in Hinduism was enough for some groups to hate him. The same people who used venomous language against him also attacked another famous Kannada writer U R Ananthamurthy too who was a co-traveller of Kalburgi in the same campaign for rational thought. Ananthamuthy and Kalburgi wrote and campaigned hand in hand.

    Idolatry was heavily criticised by many Hindu reformers during the past centuries. Are we fast losing the tolerant stream of Hinduism that took pride of multiple streams of thought including that of the Charvakas and the Lokayats who denounced Vedas and stood for critical inquiry of old beliefs? Though Charvakas were silenced, a new Hinduism seemed emerging in the last century that took pride of different world-views co-existing. That is pushed back and intolerance has taken the front seat now. Those critics who could not be answered with logic are now silenced with guns. Imagine if Dayananda Saraswati (1824 – 1883, founder of Arya Samaj), who raised harsh criticism against idolatry and ritualistic worship, was living in our times! Will these motorcycle borne criminals spare a reformer like him?

    – See more at: http://indianexpress.com/article/blogs/mm-kalburgi-murder-what-if-dayananda-saraswati-lived-in-our-times/#sthash.jTfDTRlG.dpuf

  9. p v vijay kumar says:

    Well scripted rhetoric article !!
    Damn wit brahminical fundamentalism !!

  10. Pavan kumar says:

    తగిన శాస్తే జరిగింది. ప్రతి వక్కడికి హిందువాలంటే లోకువయ్యం. ఈదే వాడిని క్రిస్తింస్ లేదా ముస్లిం గురించో రాయమనండి చూదం.

    • చచ్చిపోయిన వాడికి, చంపకున్నా ఎలాగూ చావు తథ్యమయిన వాడికి శాస్తి జరిగేదేముంది? శాస్తి జరిగేది సమాజానికి. బతికున్న మీకు, నాకు.
      ఎంత నచ్చని మాటైనా గానీ, అపవిత్రమైన మాటైనా గానీ మాట్లాడనివ్వాలి. చెప్పినందుకో, రాసినందుకో చంపేస్తే.. అదే భారతీయ విధానం అయూంటే ఇన్ని మతాలు ఈ నేలపై పుట్టేవి కావు.
      ఎవ్వరి పద్దతులనైతే ఈసడిస్తున్నామో వాళ్ళనే మనం అనుకరిస్తున్నాం. హిందూ మతంలో రాయనిచ్చారు గనుకే ఎన్నో మతాలు అధిక సంఖ్యాకుల మతాలకు వ్యతిరేకంగా పురుడు పోసుకున్నాయి.
      ఇప్పటి ఈ కసాయి గాళ్ళు అప్పుడున్నట్లయితే బుద్దుణ్ణీ, మహావీరుణ్ణి సైతం తమ మతానికి వ్యతిరేకమని చంపేసేవాళ్ళు.
      పలు విధాల ఆలోచనలు లేకెత్తించే వాళ్ళతో హిందూ మతం లోకువ అవ్వదు. మాట్లాడితే చంపేస్తామని, తగిన శాస్తి జరిగిందనీ చంకలు గుద్దుకునే మీలాంటి వాళ్ళ వల్లే అది లోకువ అవుతుంది.

  11. అజిత్ కుమార్ says:

    కల్బుర్గి తల నవ్వింది – ఈ కధలో సత్యం లేదు సత్యమూర్తిగారూ. కల్బుర్గి గారు విగ్రహాలను
    అగౌరవ పర్చవచ్చన్నందుకు చంపబడివుంటాడనే ఆరోపణలు నమ్మదగినవిగాలేవు. మరేదైనా కారణం ఉన్నదేమో చూడండి. శైవ మతంపైన వారు చేసిన పరిశోధన గురించి వ్రాయండి.
    కల్బుర్గి తల ఎందుకు నవ్వింది అని ప్రశ్నించుకుంటే కల్బుర్గి దుందుడుకు చేస్టలవల్ల ఇలా జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ కధలో తప్పు కల్బుర్గి చేసినట్లుగా తెలుస్తుంది. అతడ్ని చంపడం కూడా తప్పు కాదని అనిపిస్తుంది. వాళ్ళు పూజించుకునే విగ్రహాన్ని వాళ్ళకళ్ళముందే అపవిత్రం చేస్తానంటే భరించగలరా. కాబట్టి కధలో మీరు కల్బుర్గి పాత్రను విలన్ పాత్రలాగా మలచారు. కేవలం హాస్యం పుట్టించడానికని ఇలా రాయడం బాగాలేదు. మీరు పరిణితితో ఆలోచించాలి. మీరు అశుద్ధాన్ని జారవిడుస్తుంది ఒక వస్తువుపై కాదు – అది అనేకమంది దోసిళ్ళలో ఉంది, హృదయాలపై వుంది, శిరస్సులపై వుంది. మీరు దానితో పాటు వారందరిని అపవిత్రం చేస్తున్నారని గుర్తించండి. ఇకపై ఇటువంటి పనులు చేయకండి.
    దేవునికి పూజచేసి ఆయన దీవెనలు పొందాలనుకునే వారికి ఆ దేవుని గురించి పూర్తిగా తెలీక పోయినా ఫరవాలేదు. కానీ ఆ దేవుడ్ని విమర్శించాలనుకునే వారికి ఆ దేవుడి గురించి ఎక్కువ వివరాలు తెలిసి ఉండాలి. లేకపోతే వాదనలో ఓడిపోవాల్సిరావచ్చు. మీరు ఇద్దరు దేవుళ్ళను కలిపి చెప్పారు. అంటే ప్రస్తుతం మీరు చెప్పిందే ప్రచారంలో ఉన్నదిగాని , కనీసం మీకు అది తెలిసిఉండాలి.
    హిందువుల ప్రాచీన మతం శైవం. హిందువులు అంటే ఇండస్ నది అని పిలువబడిన సింధూనదీ ప్రాంతంలో నివసించిన వారు. శైవ మతం గురించి – లింగమును పూజించుట, విభూది పూసుకొనుట, రుద్రాక్షలు ధరించుట, పూజారులు గడ్డం పెంచుతారు, తలపైన జుట్టును ముడి వేస్తారు, కమండలం, దండం, పులిచర్మం, తపస్సుచేయడం ,గంగానది, హిమాలయాలు. దేవుళ్ళు – శివుడు,పార్వతి, బ్రహ్మ,సరస్వతి, యముడు, చిత్రగుప్తుడు, వినాయకుడు, కుమారస్వామి, చంద్రుడు .మతవిధానము- తమ కోరికలు తీర్చమని తపస్సు చేసి దేవుని ప్రార్ధిస్తారు. అంటే ఉపవాసము ద్వారా పూజచేస్తారు. సంగీత,సాహిత్య ,నాట్య, శిల్ప కళలను ఆచరిస్తారు. యోగా చేస్తారు, శాకాహారము భుజిస్తారు. నొసటన మరియు ఇతర శరీర భాగాలపై మూడు నామాలు అడ్డంగా పెట్టుకుంటారు. శివ భక్తులను రాక్షసులంటారు. రావణుడు, బలి చక్రవర్తి మొదలైనవారు.
    బ్రహ్మ పుట్టిస్తాడు, శివుడు చంపుతాడు, యముడు శిక్షిస్తాడు. మనుషులు చేసే తప్పులను చిత్రగుప్తుడు లెక్కరాస్తాడు, మనిషి చనిపోయిన తర్వాత యమలోకంలో వారు చేసిన తప్పులకు శక్షలు అమలు చేయబడతాయి. శిక్షలు పూర్తయ్యాక తిరిగి మానవులుగా పుడతారు. ఒకవేళ తప్పులు లేకపోతే ఆత్మ శివునిలో లీనమౌతుంది. ఇది వారి నమ్మకం.
    ఇక రెండవ వర్గం వైదికులు . వీరు క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాలకు ముందు ఇరాన్ నుండి వచ్చారు. వీరు ఇరాన్ లోని పార్శీ లకు చెందిన వారు. వీరి దేవుళ్ళు – అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు. పూజారులు నెత్తిన పిలకతో, పట్టువస్త్రాలు ధరిస్తారు. వారి గుడులు బంగారపు తొడుగులతో ధగధగా మెరుస్తూఉంటాయి. నొసటన నిలువు మూడు గీతలు నామాలు పెట్టుకుంటారు. వీరికి మాత్రమే స్వర్గప్రవేశము ఉంటుంది. ఈ లోకంలో వీరు తమ మతమునకు చేసిన అభివృద్ది ప్రకారము వారికి స్వర్గలోకములో సుఖము లభిస్తుంది. వీరు తిరిగి తిరిగి జన్మిస్తుంటారు. మతవిధానం యజ్ఞము చేయుట.విగ్రహాలను ఊరేగించుట, వీరు ప్రస్తుతము ఇతరమతాలను తమలో కలుపుకుని బలపడ్డారు. అనగా శివుని, బుధ్ధుని, సాయిని తమలో కలుపుకున్నారు. ఇతర మతాలలో సైతం వారే ఆధిపత్యంలో ఉన్నారు. వీరి భాష సంస్కృతము. ప్రస్తుతము మనము మాట్లాడే భాషకూడా సంస్కృత భాష యొక్క తెలుగు మాండలీకము. ప్రస్తుతం మనం వాళ్ళ కంట్రోలులో ఉన్నాం. వాళ్ళ సలహా లేకుండా ఒక్క అడుగైనా ముందుకు వెయ్యలేం. ఊరికి వెళ్ళాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్ళి చేసుకోవాలన్నా వారు చెప్పినట్లు బుధ్దిగా విని భయభక్తులతో బ్రతుకు తున్నాం. ప్రస్తుతం అన్ని పార్టీలకూ వారే వెనుకనుండి నడిపిస్తున్నారు. కనుక గమనించగలరు.

    • సత్యమూర్తి says:

      “దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవ స్సనాతనః”
      విగ్రహారాధన కనీసం ఇంటికి పరిమితమైనా ఈ దేశం ఇంకాస్త మెరుగ్గా ఉండేది. పట్టణాల్లో గుళ్లను, మసీదులను, చర్చీలను కూలగొట్టి ఆ స్థలాల్లో పేదవాళ్లకు ఇళ్లు కట్టిస్తే మనసున్న దేవుడెవడైనా ఆగ్రహిస్తాడా? రాతిబొమ్మలను పాలూ నెయ్యిలతో ముంచెత్తే బదులు ప్రభుత్వాస్పత్రుల్లో పాలకోసం అంగలార్చే రోగులకు వాటిని పోస్తే జాలీదయా ఉన్న దేవుడు వద్దంటాడా? ఇలాంటి విషయాలు మనకందరికీ తెలుసు. కానీ మతం మన మనసును మొద్దబారుస్తోంది.. రోజురోజుకూ మన మానవత్వాన్ని హరించేస్తోంది.

  12. SreenVas ChandrGiri says:

    Ajith కుమార్ గారు.. శివ మరియు వైష్ణవ మతాల తేడా చాల చక్కగా చెప్పారు.
    సత్యమూర్తి గారు ..హిందూ మతముnu samskarinchadaniki అంబేద్కర్ cheppina మతంతీకర్ణ మార్గం (బుద్ధిసం) తప్ప వెరే solution ఏదయినా ఉందంటార..

  13. సత్యమూర్తి says:

    “మతములన్నియు మాసిపోవును
    జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును..”

    శ్రీనివాస్ గారూ.. సంఘాన్ని సంస్కరిస్తే ప్రయోజనం ఉంటుంది. మతాన్ని సంస్కరిస్తే సంస్కరించిన మతం ఉంటుంది. కానీ అది అప్పటికీ మతమే. మతోన్మాదులు పేట్రేగితే అది మళ్లీ జాడ్యాల్లోకి వెళ్లిపోతుంది. ఒక మతం ఎన్నటికీ వేరే మతాన్ని సంస్కరించదు, సంస్కరించజాలదు. బౌద్ధమతంలోకి మారితే బౌద్ధులే అవుతారు కానీ, సంస్కరణ పొందిన హిందువులు కారు. మతాలన్నీ సారాంశంలో ఒకటే. స్వార్థం, అధికారం కోసం దుర్మార్గులు మతాలను అడ్డుపెట్టుకుని జనాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. నేను ఒక్క హిందూమతాన్నే విమర్శించడం లేదు. మతాలన్నీ మాసిపోయి మానవత్వం పరిఢవిల్లాలన్నది నా కోరిక.

  14. పాపం – పోయాడు-తప్పు-నీకు నచ్చని మాటలను మాట్టాడాడని చంపకూడదు. అసలు మనిషిని మనిషి చంపే స్థితి చాలా చెడ్డది. మతాల మీద చాలా సందేహాలు వుంటాయి-చోద్యం కాకపొతే – తండ్రి లేకండా బిడ్డ పుట్టడం ఏవిటి? వాడు ఆకాశం నుండి ఫలానా జాతిలో పుట్టాడని – ఆ జాతి ఆశీర్వదిన్చబడిదని జనాలంతా గొర్రెల మందల్లా దబుక్కున మోకాళ్ళ మీద పడి మొక్కేదేమిటి! మొగుడు నిన్నోదిలేశాను పో అంతే ఒప్పుకున్నా మతం ఆడమనిషికి అట్టంటి అవకాశం నిరాకరించడం ఏమిటి-లిమిట్ నాలుగు-ఐతే మొదలలోనే లిమిట్ ఫాలో అయినట్టు లేదే!!? ఎనిమిదీ-పదీ-నెంబర్ సరిగా తెలీదు ఏంటో ప్రతిదానిమీడా చాలా డౌట్స్-అమ్మో!ఎందుకొచ్చింది-పిల్లలుగలోల్లం-పేరు రాయాలన్న భయంగా వుంది-పిల్లలు గుర్తొస్తున్నారు-e మెయిల్ కూడా ఫేకే. పెద్ద చెప్పోచ్చవులేవయ్య-నాకు నాలుగు కాలాలు బతకాలని లేదా-సహనం గల దేశం గాబట్టి అన్నేళ్ళు బతికాడు-అదీ నాకు అనుమానం-అసలు కారణం వేరే ఏదో అని-దేవుడికే తెలియాలి. నాకోచ్చిన్ డౌట్స్ వచ్చి అయ్యి బైటికి మాట్టాడుంటే ఇన్నేల్లా!! బుద్దుడు పుట్టిన నేల-హింస తప్పు- నీ పిల్లోడు ఆడుకునే బొమ్మ మీద పోయ్యగలవా? నీ కూతురి ఫోటో మీద పోయ్యగలవా-తప్పు కదా. ఒకరి సెంటిమెంట్ పైన అలా చెయ్య కూడదు -కధలో కూడా చెయ్యకూడదు – దేశానికి విగ్రహారాదన నేర్పిన బుద్ధా విగ్రహం మీద పోస్తావా ఇలా కధలోనైనా? నగ్నత్వాన్ని సత్యమని ప్రేమించి పూజించారు-అటువంటి లింగం వారికి ఆనందకరం ప్రియం -అవమానించకూడదు -పెద్దలు- అర్ధం చేసుకోండి. పిల్లాడికి తండ్రి వున్నా లేక పోయినా విషయం కాదు-నీవలె నీ పోరుగుని ప్రేమించు అని చెప్పాడు-అది ముఖ్యం-ఈ నాలుగు లిమిట్ లో కుడా చాలా మంచి విషయాలు చెప్పారు-అవి ముఖ్యం-వాటిని హైలైట్ చేసి మిగిలినవి క్రమంగా దెలెఅతె చెయ్యాలి-అంతే. ఏదంటే అది రాయ కూడదు.

  15. భావాలను భావాలతోనే ఎదుర్కోవాలి. మనుషులను చంపడంద్వారా కాదు. చీప్ కామెంట్స్ ను పట్టించుకుంటే ఇటువంటి ఉద్రేకాలే వస్తాయి. చాలా శాస్త్రీయంగా కృషి చేసిన డభోల్కర్నీ, పనసారేని ఎందుకు చంపారూ? ఇది ఉన్మాదం కాక మరీమిటి?

  16. imdrakamti pinakapani says:

    “ఓ నిండు ప్రాణాన్ని నిలువునా తీసి నేలను రక్తంతో తడపడం కంటే రాతి విగ్రహాన్ని వుచ్చతో తడపడం పెద్ద తప్పేం కాదు.
    ఓ రచయిత రక్తం కళ్ళజూస్తే ప్రతి రక్తం బొట్టునుండీ మరెంతో మంది వుదయిస్తారని ఈ వుగ్రవాదులకు వుపదేశం అవ్వాలి.”
    ఇది నిజమో కాదో నాకు తెలియదు- కానీ రాతి విగ్రహాన్ని తడిపే ప్రతి ఉచ్చ బిందువు నుండీ మరెంతో మంది ఉగ్రవాదులు ఉదయిస్తారు.కల్బుర్గి మరణానికి ఇదే కారణమయితే మాత్రం అది తగినదె!

Leave a Reply to p v vijay kumar Cancel reply

*