వెయ్యి క్షణాల మౌనమే వ్యాఖ్యానం..

 

 కందుకూరి రమేష్ బాబు
Kandukuri Rameshసారంగ మిత్రులకు తెలుసు, ఈ వారం నాది ‘ఏక చిత్ర ప్రదర్శన’ జరుగుతోంది అని!
చిత్రం ముందు ఆగి చూడమని చిన్నగానే పెద్ద ప్రయత్నం.
వీలైనన్ని క్షణాలు గంటలు గా మారుతున్నాయి అక్కడ.
హ్యాపీ.

కాని ఇక్కడా ఒక చిత్రమే.
దాదాపు వంద వారాగాలుగా.
ఐతే మాటలు ఎక్కువే.

కాని ఈ  చిత్రం బాధ.
ఒక వేడి. శీతలం  కూడా.

మృత్యు శీతలం.
ఇందు మూలంగా మౌనం శరణ్యం.

ఉన్నదే. ‘ఒక్క చిత్రం వేయి అక్షరాలకు పెట్టు’ అన్న మాట ఉన్నదే.
నా షో కు కూడా అదే  మకుటంగా పెట్టుకున్నాను.
కాని ఇక్కడ, ఈ చిత్రానికి మటుకు అక్షరాలు కూడా అనవసరం.
మౌనం. వేయి క్షణాల మౌనం కావాలి.

ఈ సారి అదృశ్యం జీవితం.
దృశ్యం మరణం మరి.

డెత్ అఫ్ లైఫ్.

చూడండి.
కొద్ది కొద్దిగా తేలియాడుతూ…
మునిగిపోతూ…

అంతిమ దృశ్యం ఇలా ఉంటుందా?
చిక్కగా ..అందంగా…

ఏమో?

*

మీ మాటలు

  1. Dr Nukathoti Ravikumar says:

    చాలా కాలంగా రమేష్ ఫోటోతో వ్యాఖ్యానంతో కాలం మీద ఒక అనివార్య అవసరం కోసం చేస్తున్న చిరంతన తపస్సును చూసి ముచ్చట వేస్తుంది.కీప్ ఇట్ అప్ రమేష్ గారు.
    మీ ఫ్యాన్
    డాక్టర్ నూకతోటి రవికుమార్

  2. మీ అక్షరాలు చిత్రాల కంటే తక్కువేమీ కాదు . చెప్పలంటే కాస్తంత ఎక్కువే

  3. చందు తులసి says:

    అవును రమేశ్ గారు….మీ చిత్రాలు …ఎంత బాగుంటాయో….అక్షరాలు అంతకన్నా భావుకంగా ఉంటాయి. ఒక్కో పదం ఒక్కో చిత్రం
    చిత్రమంటే ఎంత ప్రేమ మీకు…?
    నాకు తెలుసు…..చిత్ర అంటే ఎంత ప్రేమో..!?
    చిత్ర…మే జీవితంగా బతుకుతున్నారు…

  4. kandukuri ramesh babu says:

    అక్షరాలు అంతకన్నా బావుకంగా ..బావుందండి. థాంక్ యు సో ముచ్.

మీ మాటలు

*