రంగనాయకమ్మ లవ్స్ రంగనాయకమ్మ !!

 

పి.  విక్టర్ విజయ్ కుమార్ 

 

రాబర్ట్ నాగేంద్ర పొద్దున్నే దక్షిణ్ ఎక్స్ ప్రెస్ కు దిగాడు.

 

బలవంతంగా నిద్ర లేచి వాడిని పిక్ అప్ చేసుకుని బైక్ మీద రూం కు తీసుకొచ్చాను. దారిలో అడిగాను ” ఏంట్రా కబుర్లు ” అని. వాడు గడ్డం గీక్కోవడం నాకు బైకు అద్దం లో కనిపించింది. ” ఆ స్టుపిడ్ గడ్డం తీసేయొచ్చు కదా ? ” విసుక్కున్నాను. వాడు కిసుక్కుమని ” బిన్ లేడెన్ కు అసలు షేవ్ చేసుకుందామని జీవితం లో ఒక్క సారన్నా టెంప్ట్ అయి ఉంటాడంటావా ? ” అన్నాడు.  ” ఆ… టెంప్ట్ అయి ఉంటాడు ” ఒక క్షణం పాజ్ ఇచ్చి ” ఎప్పుడు అని మాత్రం నీవడగవని నాకు తెలుసు ” అన్నా.

” యు ఆర్ గ్రోయింగ్ అప్ మై బోయ్ ” అని భుజం తట్టాడు నాటకీయంగా.

రూం చేరుకునేంత వరకు ఇద్దరి మొహాల్లో నవ్వు బిగబట్టుకుని ఉన్నాము.

ఇంటికొచ్చి రిఫ్రెష్ అయిపోయి, టిఫిన్ పానాదులయ్యాక కాఫీ చేతులో పెట్టి మళ్ళీ అడిగా ” ఏంట్రా కబుర్లు ” అని. హైదరాబాదుకు ట్రెయిన్ పట్టుకునే ముందు ఆప్పుడెప్పుడో వాడితో మాట్లాడిన ” యూరిన్ పాలిటిక్స్ ” తర్వాత ఇదే మళ్ళీ వాడితో కన్ ఫ్రంటేషన్ కుదిరిన ఛాన్స్.

” చూడ్రా భై …మోడి దుబయ్ లో ‘ కేవలం మాటల ద్వారానే ఏ సమస్య అయినా సాధించుకోవచ్చు ‘ అని అంగానే అక్కడ పొట్టేగాండ్లు విజిల్స్ ఎందిరా నాయ్నా ! అదేమన్నా ఈయన పేటెంట్ పెట్టి కనుక్కున్న ఒక ఫార్ములా నా  లేపోతే అమితాబ్ బచ్చన్ షోలే డైలాగ్ ఆ ? ” అని సిగరెట్ వెలిగించాడు.

” భక్తులు రా…భక్తులు….అంతే ”

” అవున్ రా భై …వీళ్ళకన్నా రంగ నాయకమ్మ భక్తులే బెటర్ ”

వాడి సెటైర్ కు నవ్వేసాను కాని – ” ఒరేయ్ ! రంగనాయకమ్మ లో తప్పులుండొచ్చు కాని మరీ మోడీ తో కంపేర్ చేయడం బాలేదు రా ” నేను కూడా కొంచెం సెంటిమెంటల్ ఫీల్ అయ్యి నొచ్చుకున్నా.

” అబ్బో ! నీవు ఆమె పూజ ఎప్పుడు మొదలు పెట్టావురా బాబాయ్…” అని ట్రే కోసం సీరియస్ గా కలియ తిరిగి కూర్చున్న కుర్చీ పక్కనే యేష్ విదిలించాడు. ఆ చుట్టూ తిరిగి చూడ్డం కూడా ఓ బహానా వాడికి. అలా చూస్తే నేనే పరిగెత్తుకెళ్ళి ఎక్కడున్నా హడావిడిగా ట్రే పట్టుకొచ్చి వాడి పక్కన పెడ్తానని వాడి అంచనా .

మళ్ళీ దమ్ము తీసి అన్నాడు –

” విప్లవ రచయితల సంఘం, ఎలాంటి కుట్రలతో, ఎలాంటి అబద్దాలతో, ఎంత నిజాయితీ హీనంగా, ఎంత విప్లవ వ్యతిరేకంగా ఏర్పడిందో, ఆ పాత చరిత్రని ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవచ్చు. ఈ వాక్యాలు ఎక్కడన్నా విన్నట్టుందా ” అప్పజెప్పినట్టు చెప్పి అడిగాడు.

” ఐ నో యు ఆర్ రెఫెరింగ్ హర్ ఆర్టికల్ ఆన్ విరసం ”

” కదా ! కుట్ర కేసులు పెట్టించుకుని తిరుగుతున్న విరసాన్ని కుట్ర పూరితం అనేసింది. రంగనాయకమ్మను నేను ఆడ మోడీ అంటే నీకు వచ్చిందా ? ”

” వి ర సం పేద్ద ….. వీర సాహిత్య సంస్థా మరి ? ”

” అది వాళ్ళు సమాధానం ఇచ్చుకుంటారు వీరులైతే . మనకెందుకు కాని ” అని రావు గోపాల్ రావు స్టైల్ లో గొంతు మార్చి అన్నాడు ” మడ్డరు జేసినోడు దొంగ కొడుకు, ముడ్డి మీద ఏసుకునే డాయర్ ఎత్తుకెల్లినోడు దొంగ కొడుకైతే , ఈ పెపంచకం లో పెతోడు సమానంగా దొంగ కొడుకులే రా సెగట్రీ   ”

” ఐ అబ్జెక్ట్ మై డియర్ బట్ట తల బిన్ లేడెన్…..నీవు పాయింట్ డైవర్ట్ చేస్తున్నావు. ఆమెను మోదీ తోనూ , ఆమె పాఠకులను మూర్ఖ మోదీ భక్తులతోనూ పోల్చడం దారుణం ”

” ఒరేయ్ తప్పుల్లో డిగ్రీలు లేవనేది  ఆమె పాటించే సూత్రమే. అందుకే విరసానికి, వీ ఎచ్ పీ కీ తేడా లేకుండా తిడుతుంది ”

” మరి విరసం తప్పులు లేని సమాజం కోసం కృషి చేస్తున్నప్పుడు తప్పుడు దారులు ఎలా తొక్కుతుందిరా ? రంగ నాయకమ్మ తిట్టడం లో ఘాటు ఎక్కువయ్యింది కాని , సారాంశం లో తప్పు లేదు కదా ? ” కాఫీ సిప్ చేస్తూ అడిగాను.

” బామ్మర్దీ ! వాస్తవాలు , ప్రజలకు వీర రసం తాగించే విరసం చెప్పేంత వరకు ఆగు. అది ఆమె విరసం ను తిట్టడం అని నీవనుకుంటున్నావా ? నా బాబే ! అది జస్ట్ ‘ సెల్ఫ్ లవ్ ‘ ”

అనేసాడు వీడు. అనాల్సిన మాట గబుక్కున అనేసాడు.

* * *

వీడు చిన్నప్పట్నుండి అనాథ జీవితమే. ఆల్ మోస్ట్ మా ఇంట్లోనే పెరిగాడు. వాడికి మనుష్యులంటే ప్రేమ.

కాలేజిలో ఎంతో శ్రద్ధగా ” రామాయణ విషవృక్షం “ చదువుతుంటే వచ్చి అల్లరిగా లాగేసేవాడు. ఏమంటే ఇందులో ‘ మార్క్సిజం తక్కువ. మనాయకం ఎక్కువ అనే వాడు ‘. ఈ మధ్య ‘ తత్వ శాస్త్రం- ఒక చిన్న పరిచయం ‘  అనే బుక్కు కొన్నానని వాడికి ఢిల్లీకి ఫోన్ చేసి చెప్తే అడిగాడు ” ముందు మాటలో మొదటి వాక్యం చదువు అన్నాడు ”

” ‘ తత్వ శాస్త్రం పట్ల నాకెప్పుడూ ఆసక్తి రాలేదు ‘ అని ఉంది ఏం ? ” అడిగా.

అందుకు వాడన్నాడు ” పుస్తకం గురించి వ్రాయమంటే ఈమె మనసులో ఏమనుకుందో, ఆ మనసు లోపల  లోపల ఉన్న మనసులో ఇంకేమనుకుందో, ఆమెలో వస్తున్న ఎమోషనల్ చేంజ్ కు ఆ విక్రం గైడు లాంటి పుస్తకానికి ఏవన్నా సంబంధం ఉందిరా ?  చదువు…చదువురా…రేయ్ చదువు…..ముందు మాట తోటే నీకు దిమ్మ తిరిగిపోద్ది. అందులో ‘ నేను పెన్సిల్ తో రాసుకున్నాను, మళ్ళి రుద్ది చెరిపేసాను, మళ్ళి రాసాను, మళ్ళీ చెరిపేసాను ‘ లాంటి దిక్కుమాలిన  డీటైలింగ్ చూసాక భారతం లో భారతుడిలా పిచ్చోడైపోయి ఆమెనే అనుకుని ఆమె చెప్పులకు పూజ చేస్తావు ”

” భారతం కాదు …రామాయణం….” టక్కున అన్నా

” ఇదే మరి రంగ నాయకమ్మ భక్తి తెలివి అంటే. అంత ముఖ్యమైన విషయం వదిలేసి…ఎక్కడో దొర్లిన టైపో లాంటి తప్పును పట్టుకుని ఊగులాడ్డం ”

* * * *

వాడు తాగేసి కప్పు కింద పెడుతూ , కాఫీ అడుగున మిగిలిపోయిన చక్కర వేలుతో తీస్తూ నాకుతూ అన్నాడు ” ఆమె ఒకరిని తిట్టినా…ఆమె ఒకరిని పొగిడినా…అంటే ఆమె మార్క్సు, ఏంగెల్స్ &  కో ను తప్ప ఎవరినీ పొరపాట్న కూడా మెచ్చుకోదనుకో….వాటెవర్….అది ఆమె మీద ప్రేమను ఆమె అలా వ్యక్త పరుచుకుంటుంది అంతే –  I mean its pure platonic self-love  ”

నా మొహాన్ని చూసి చప్పరిస్తూ అన్నాడు ” నీ బోటి వాళ్ళు చూసి ‘ ఆహ ఏమి సద్విమర్శ , ఓహో ఏమి మొహమాటం లేని విమర్శ ‘ అంటారన్న మాట ”

నేను కుర్చీలో ఇబ్బందిగా సర్దుకున్నాను.

నాలో కనిపించని ఇబ్బందిని గమనించి దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేసి అన్నాడు.

” మచా ! నీకో పిట్ట కథ చెప్తాను ఉండు. జాగర్తగా విను. ఒక నిర్భాగ్యుడెవడో  కొండ మీద నుండి కాలు జారో, ఎవరో తోసేస్తేనో…పడిపోతున్నాడు…దొర్లుతూ…గిర గిరా తిరుగుతూ…. అప్పుడు రంగ నాయకమ్మ లాంటి వాళ్ళను ‘ విషయం కాస్తా చూడండి ‘ అని ఎవరో…ప్రభుత్వాధికారి అనే అనుకో…. పంపాడు . ఆమె హుటా హుటిన అక్కడికి చేరింది. కొండ మీద నుండి జారి పడే మనిషిని చూసింది…తీక్షణంగా గమనించింది..సెకన్ లలో సమస్యను సూక్ష్మంగా ఆకళింపు చేసుకుంది….ఆమె చాలా షార్ప్ కదా మరి…. వెంటనే అప్పటికప్పుడు ఒక మెయిల్ పంపింది…… ” అసలు ఈ కొండ ఇక్కడ భూ అంతర్భాగం లో జరిగిన మార్పుల వల్ల ఏర్పడి, ప్రమాదాలకు తావుగా నిలుస్తుంది. భూ అంతర్భాగం లో జరిగే మార్పులను పసిగట్టి మనం అరికడితేనే ఈ సమస్యకు మూలం దొరుకుతుంది. ఐతే ‘ కొండ ఎత్తుగా ఉంటుంది…కాలు పెట్టడంలో  జాగర్తగా ఉండాలి’ అని తెలుసుకోలేని అవివేకత్వం  ఈ సమాజం లో ఉన్నంత కాలం ఈ ప్రమాదాలు తప్పవు. ఇప్పుడు ఇక్కడ కింద పడిపోతున్న వ్యక్తి నిజానికి ఎన్నో రాళ్ళను , గడ్డి పీచులను ఆసరా తీసుకోవడం లో కనీస తెలివి కూడా చూపించ లేకపోవడం అన్నది మనమెవ్వరూ గమనించట్లేదు. నిజానికి మనం అవసరం ఏమీ లేకుండానే ఇతడు రక్షించుకునే పరిస్థితిని కూడా విస్మరించాడు. దీనికి ప్రధాన మూలం ఎక్కడుందంటే అతని బుర్ర లోనే ఉంది. అది పగిలే దాక ఆయన్ని రక్షించడం వృథా ! ”

నన్ను అనునయంగా నిమురుతూ అన్నాడు ” విమర్శించడం గొప్ప కదురా ! భూలోకం పైన కాళ్ళు వదిలేసి ….అందరు పరలోక రాజ్యం లో బతుకుతున్నట్టు…అప్పుడు ఎవడన్నా గట్టిగా దగ్గినా తుమ్మినా తప్పౌతుంది….అలా విమర్శిస్తే ఏమౌతుంది ?  That clearly explains one has blurred vision of priorities of society. ఇప్పుడు నాకు ఒక ఘోరమైన కేన్సర్ ఒకటి  వచ్చిందనుకో. హడవిడిగా ఒక టెబ్లెట్ వేసుకున్నాను. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలిసీ వేసుకున్నాను. లేపొతే నొప్పి భరించ లేకపోతున్నాననుకో.తర్వాత  వ్యాధి తగ్గించిన విషయం వదిలేసి – ఆ టెబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి విమర్శిస్తే ఎలా ఉంటుంది ?    ”

సిగరెట్ పీక ఆర్పి కిటికి లోంచి చాకచక్యంగా విసిరి, నా కుర్చీ హేండ్ రెస్ట్ మీద వాడు రెస్ట్ తీసుకుంటూ ”  This is nothing but perversion for idealistic attitude.  నేను నీతో బెట్ వేస్తా. ఇటువంటి  Attitude  ఉన్న వాళ్ళ మీద నా అంచనా. …. అఫ్ కోర్స్ ఆ బెట్ డబ్బులు నీ జేబులో నుండే నా దగ్గరకొచ్చి మళ్ళీ నీ జేబులోకి పోతాయనుకో . ఎవరన్నా ఒక్కరంటే ఒక్కరు ….. barring her husband  …..సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుండి ” నేను రంగ నాయకమ్మ ఫ్రెండ్ ” అని గర్వంగా ఒక్కరు డిక్లేర్ చేయ కలిగినా లేదా ఈమె తడపాయించే ఒక్క శ్రామికుడు లేదా ఒక్క దళితుడు….ఇదో గొడవ …దళితుడంటే ‘ ఎవరూ ‘ అని దీర్ఘం తీసేస్తుందిప్పుడు ‘ నోర్ముయ్ అందరూ పేదోళ్ళే అని అరిచేస్తుంది ‘….సరే ఏదైతేనేం…ఒక్కరన్నా …ఒక్కరంటే ఒక్కరు….వచ్చి ఈమె వలన సాంఘిక న్యాయం మాకు కలిగింది అంటే ……. again I am telling you , I will pay you one thousand rupees signed by Raghuram rajan and will shave my lovely beard off… ” అన్నాడు.

నేను ఒక్క ఉదుటున లేచి నవ్వుతా వాడిని  వంగో బెట్టి రెండు గుద్దులేస్తూ పక పకా మని నవ్వాను.

వాడి కాలర్ పట్టుకుని ” ఒరేయ్ ! నీకు మాత్రం సెల్ఫ్ లవ్ తక్కువా ” అన్నా.

” సరెలేరా …. పెతోడికి కొద్దో గొప్పో ఉంటుంది. చూశావా…రంగ నాయకమ్మ వాసనలు ఎలా తగిలాయో నీకు….ప్రతి మనిషికి అంతో ఇంతో ఉండే ఇసుమంత సెల్ఫ్ లవ్ ను…ఆమెకుండే  Obsessed self-love   ను ఒకటేలా చూస్తున్నావ్ !  ” అని మొహానికి చేయి అడ్డుగా పెట్టుకున్నాడు నే కొడతానేమో  అన్నట్టు.

కాలర్ వదిలేసి నేను గట్టిగా నవ్వుతూ ఎదురుగా ఉన్న దివాన్ మీద జారగిల పడ్డాను.

” ఓకే రా…. I agree with you for now  కాని ఆ ఇంకో పెద్దామె చటుక్కున ఈమెను పర్స్ నల్ అటాక్ చేస్తూ కవిత వ్రాయడం మాత్రం తప్పురా. ఈ విషయం లో నీవేం చెప్పినా నే తలూపను ” అనేసి గట్టిగా నా చెవుల చుట్టు చేతులు పెట్టి తల పట్టుకున్నాను.

వాడు నా చెవి దగ్గర గట్టిగా అరుస్తూ ”  Self-love never generates logical thinking in other person. In fact, it obstructs the logical thinking and diverts the targeted audience’  attention to the person talking about the subject but not on the subject, per se. And so Mrs. Ranganayakamma runs the risk of taking the brunt personally. ”  నా చెవులపై చేతులు  పక్కకు లాగి  ” And this goes on as long as Ranganayakamma loves Ranganayakamma but nothing else !!! ”  అని గట్టిగా గుయ్ మంటూ అరిచాడు వెధవ .

*

మీ మాటలు

 1. Aranya Krishna says:

  సూపర్బ్! సెటైర్ ధర్మంగా నవ్వించినా చాలా సీరియస్ విశ్లేషణ వుంది. రంగనాయకమ్మ స్థాయి రచయిత ఎటో ఒకవైపే వుండాల్సి వస్తుంది. అదీ తంటా. ఏదో నా బోటి చిన్నవాడు విరసాన్ని సమర్ధించినా, రాజ్యహింస గురించి గొణుక్కున్నా పెద్దగా పట్టిచుకోదు ప్రభుత్వం. రాజ్యహింసని ప్రతిఘటించే విరసం బైట నుండే విరసం భావజాలాన్ని సమర్ధిస్తే రంగనాయకమ్మ స్థాయి వ్యక్తిని రాజ్యం క్షమించదు. అరెస్టులు, జైలు జీవితం ఎందుకొచ్చిన తంటా? అందుకని విరసం మీద దాడి చేస్తే ఏ సమస్యా వుండదు. విరసం విప్లవద్రోహకరంగా వ్యవహరిస్తున్దంటే ఆమె కార్యాచరణని, నిబద్ధతని ఎవరూ ప్రశ్నించరు కదా! ఈ మొత్తం రైటప్ లో ఒక గొప్ప సత్యం వుంది “ఆమె మార్క్సు, ఏంగెల్స్ & కో ను తప్ప ఎవరినీ పొరపాట్న కూడా మెచ్చుకోదనుకో”. మెచ్చుకుంటే చేతులు కలపాలి. అది సమస్యలకు దారి తీస్తుంది. ఒక అద్భుతమైన, దోషరహిత, నూటికి నూరుశాతమ్ నికార్సైన విప్లవ సంస్థ ఎవరైనా ఏర్పాటు చేస్తే ఆవిడొచ్చి సభ్యత్వం తీసుకొని ఆ సంస్థని పావనం చేస్తారన్న మాట. మీరు రంగనాయకమ్మ లో స్వీయ ప్రేమ చూసారు. నాకైతే అది స్వీయ చర్మ సంరక్షణ లా కనిపించింది.

 2. Delhi Subrahmanyam says:

  చక్కగా విమర్శించిన విజయకుమార్ గారూ, మంచి వ్యాఖ్య రాసిన అరణ్య కృష్ణ గారికీ అభినందనలు.

 3. p sambasivarao says:

  అరణ్య క్రిస్ష్ణ గారు. వీర బొబ్బిలి గారు వేరే పోస్ట్ లో పెట్టిన కామెంట్ ఇక్కడ పేస్టు చేస్తున్నాను. మీ వ్యాఖ్యలకి ఇది కూడా సరిగ్గా జవాబు ఇస్తుంది.

  వీరబొబ్బిలి
  August 20, 2015 at 11:32 pm

  ARANYA KRISHNA గారూ,సెబాసండి మా బాగ సెప్పేరండి.మీరు మంచి జోకులేస్తారండి.నవ్వలేక సత్తన్నానండీ బాబు…

  “విరసం బైటనుండైనా ఏదో ఒక మేరకు విరసానికి సహకరిస్తే రాజ్యం ఆమెని క్షమించదు.“నేను విరసంలో భాగం కాదు” అని చెప్పుకోవాల్సిన అగత్యం ఏర్పడింది”. అనిమీరన్నారు గదండి.నాకు నవ్వాగలేదండి.అవునండి,అంచేత యిలాగా రాసేస్తాదండీ..నిజమండి.పెబుత్వం వారి అరెస్టులకి,జైల్లకి బయ్యం పడే ఆవిడ విరసాన్ని యిమర్శిత్తాదండి.విరసాన్నియిమర్శించే బదులు యిప్లవాన్ని యిమర్శిస్తే బాగున్నండి.పెబుత్వం వారూ పిలిసి పీటేసి ,సన్మానాలో బిరుదులో యిద్దురండి .కానీ ఆవిడకా గ్యానం నేదండి.
  విరసమంటే పెబుత్వానికి శానా బయమండి.అందుకే విరసం రచయితలందర్నీ జైల్లో పెట్తేస్తాదండి.యిప్పటికీ ఓయాభై మంది జైల్లోనే వుండి వుంతారుకదండీ( ఓ సారీ..అంతమంది విరసంలోనే లేరంతారా-పాపము సెమించుగాక) అసలు ఈవిడకు జైలంతే బయమెందుకోనండి.ఆ విషయంలో వరవరరావుగారు గొప్పేనండి,కోర్టు బెయిలిచ్చినా రద్దుచేసుకొని మరీ జైలుకెల్లారు గదండి.

  మడిసన్నతరువాత ఆపాటి లౌక్యముండాలండి.అలానేప్పోతే ‘మడిసికి గొడ్డుకి తేడాఏటుంటాదం’డి.ఆసంగతి వేణుగోపాల్ గారికి తెలుసండి.ఏకకాలంలో శతృవుతోనూ మితృడితోనూ కరస్పర్శ చేయగలరండి.ఈవిడకా లౌక్యం లేదు సరికదా ఉన్నోలని విమర్శించేస్తాదండి.(ఈ పేపరోలొకటండి.ఆవిడరాసినచెత్తంతా ఏసేస్తారండీ బాబు.)
  ఈవిడికి భగమంతుడు ఆగ్యానమివ్వలేదండి,ఈవిడ భగమంతున్ని కూడా నమ్మదటండీ,అటుభగమంతున్నీ నమ్మక ,ఇటు విరసాన్ని నమ్మకపోతే ఆవిడతోటెలాగండి.కష్టమేనండి.అందుకేనండి ఆవిడ ‘విరసానికి వి హెచ్ పి కి తేడా చూడలేదు.’ అంటారండి.ఆపాటిమాట అనొచ్చండి.
  సివరగా ఓమాటండి.
  మనబోటివాళ్ళం ఉహూ..ఉహూ..ఎన్నిమంత్రాలేసినా ఆవిడ తగ్గదండి.
  ఆవిడరాసినరాతలన్నీ తప్పులతడకలనీ,అబద్దాల్నీ రుజువు పరిస్తే ఆవిడ నోరూ మూయింపించ వొచ్చటండి.( మావూరి సిద్దాంతి చెప్పేదండి)కాబట్టి బాబ్బాబు ఆపని సేయిద్దురూ…

  • Aranya Krishna says:

   సాంబశివరావు గారూ! అక్కడ వీరబొబ్బిలి గారికి అక్కడే ఇచ్చిన నా సమాధానం కూడా పేస్ట్ చేయాల్సింది.

 4. ప్రియ says:

  ఎవరినీ వదలవేం..పాపం రంగనాయకమ్మ ……జాగ్రత్తగా అక్షరం పొల్లు పోకుండా ప్రింటు తీసి పోస్ట్ చేస్తాలే …అప్పుడు ఉంటుందీ ,…..:)

  • P V Vijay Kumar says:

   మీరు ప్రింట్ ఔట్ చేతిలో పెట్టాక…ఆమె నే చెప్పింది కాదంటే ఒట్టే !

 5. నీహారిక says:

  బలిపీఠం వ్రాసిన దగ్గరనుండీ రంగనాయకమ్మ నా బెస్ట్ ఫ్రెండ్ తెలుసా ???

  ఈ సమాజం పైకి చలం వదిలిన “రామబాణం” రంగనాయకమ్మ ….. సీతమ్మ తప్ప మరొకరు ఆమెకి సమాధానం చెప్పలేరు.

 6. బ్రెయిన్ డెడ్ says:

  సటైర్ గానే తీసుకుంటే ఒహ్ యెస్ కిర్రాక్ రైట్ అప్ . ఫ్యాక్స్ట్ మాట్లాడాల్సి వస్తే మాత్రం , ఇన్ని రసాల వాళ్ళ నాట్ సో ఆర్గాజమిక్ వ్యవ్స్తీకృత జీవితాలు పక్కన పెడితే ఒక తరం అంతా , అంతా కాకపోయిన కొంత యాదృచ్చికంగా అయినా అలోచించారు అని చెప్పుకోవడనికి ఉన్న తార్కాణం ఆవిడ మాత్రమే . అక్షరాల్లో భావప్రాప్తి వెతుక్కోకుండానే మన చలాలు బుచ్చిబాబులు లాంటి ఎంత మంది మగ స్త్రీ జన ఉద్ధరకుల ముందు తను నమ్ముకున్న ఇజాన్ని సిగరెత్తుక్కో మందుకో తాకట్టు పెట్టకుండా ఆష్ ట్రేలు వెతుక్కోకుండానే చెప్పగలిగారు . విచిత్రం ఏమిటంటే ఆవిడ మారలేదు అప్పుదు ఇప్పుడు ఎప్పుదు అలాగే ఉన్నారు , మనల్ని అంటేనే పాపం తోకలింకా మండుతున్న హనుమావతారాలు కనిపిస్తున్నయి అందర్లో. ప్చ్ రంగనాయకులు గారు అయి ఉంటే పాపం ఇంత దాడి ఉండేది కాదేమో . Definitely many comments and posts about her are filled with typical Indian male chauvinistic attitude and lol few of them playing real charmers ( oops )

  • P V Vijay Kumar says:

   :) :)

   మీరు మొత్తంగా ఏం చెప్పారో అర్థం చేసుకోలేకపోయాను కాని – ఆమెను విమర్శించడం part of male chaveunism అన్న విషయం చెప్తున్నట్టు తెలుస్తుంది.

   ఈ విషయం గురించి నా దగ్గర నుండి ఏవన్నా సమాధానం ఎక్స్ పెక్ట్ చేయ దల్చుకుంటే ( అల్రెడీ మగ బ్రాండ్ కొరడా ఝులిపించారు కాబట్టి ఏమన్నా ఆన్సర్ ఎక్ష్క్స్ పెక్ట్ చేస్తున్నారనే కాన్ ఫిడెన్స్ లేక ఇలా మెన్షన్ చేయ వలసి వస్తుంది ) , నాకు మీ వద్ద నుండి ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలిస్తే , నా మగ దురహంకారాన్ని, సాధ్యమైనంత వరకు అదిమి పెట్టుకుని నా సగటు బుర్రకు తోచిన విషయం మీతో షేర్ చేసుకోగలను. అది తెలిస్తే ఈమెను విమర్శించడం పురుష స్వామ్యం ఎంత ఉందో ఒక అంచనాకు నేను రాడానికి నాకు ఉపయోగ కరంగా ఉంటుందని మనవి.

   ( 1) మీ దృష్టిలో రంగనాయకమ్మ లాంటి ….ఐ మీన్ ఎగ్జాక్ట్గా…లేదా ఆల్మోస్ట్…..లేదా సిమిలర్ గా…..అలాంటి తింగరి వాదనలు చేసే రంగ నాయకులు ఎవరన్నా ఉన్నారా ? ఉంటే అటువంటి రంగ నాయకులను ముద్దు పెట్టుకుని రంగనాయకమ్మను మాత్రమే తృణికరించిన సందర్భాలు మన సాహిత్య ప్రపంచం లో ఏవన్నా జరిగి ఉంటే – సోదాహరణగా తెలుప గలరు .

   (2) లేదా అలాంటి రంగ నాయకుల విషయం లో ఈ సటైర్ వ్యాస కర్త ( అంటే నేను) ఉదాసీనంగా వ్యవహరించిన సందర్భం ప్రజాముఖంగా మీ దృష్టిలోకి వచ్చినవి ఏవన్నా ఉన్నాయా ?

   (3) వసంత కన్నాభిరాన్ పురుషురుడు కాదు. ఆ విషయం మీకూ తెలుసు. స్త్రీ గా విమర్శించిందే. అది కూడా మగ దురహంకార ప్రపంచం కుట్రలో భాగంగా చూస్తున్నారా ? ఆమె male chaveuinsm ను సపోర్ట్ చేస్తుంది అన్న దృక్పథం ఏవన్నా ఉందా ? ఆమె విషయం లో ‘పురుష స్వామ్య ‘ బ్రాండ్ ఉపయోగించడం ఎందువల సాధ్య పడదో తెలుసుకోవచ్చా ?

   (4) ఇలా ఇంప్రెషన్ లను ‘ లేబుల్స్ ‘ కింద మార్చి ‘ బ్రాండ్’ వేసే సిద్ధాంతం నాకు పూర్తిగా తెలీదు గాని – అదే ఫార్ములా ఉపయోగిస్తే – రంగనాయకమ్మ రాజ్యం ఏజంట్ అనే బ్రాండ్ వేస్తే , ఈ ఫార్ములా ఆమె విషయం లో మాత్రం అన్వయించదని మీరు ఏవన్న వివరించగలరా ?

   పైన వేసిన ప్రశ్నలు సీరియస్ ప్రశ్నలు. మీరే కాదు. చాలా విమర్శకులు – empirical evidence తర్వాత చూపిస్తామనే కాంఫిడెన్స్ ఓ ఏమో తెలీదు కాని, ఫస్ట్ ఏదో బ్రాండ్ వేసేస్తే ఇక చర్చ ఎలా ముందుకు సాగనివ్వాలనుకుంటారో, అసలు చర్చ చేయ కూడాదు అని కోరుకుంటారో తెలీక తిక మక వస్తుంది.

   ఫైనలీ , ఆమె మారక పోవడం గొప్ప అని మీరంటున్నారు. అది తిక్క ఇప్పట్లో కుదరదు అని నేననుకుంటున్నాను.

   ( by the way మీరు ‘ ఆర్గాజం ‘ అని ప్రస్తావించడం పురుష దురహంకారం పట్ల హేయ భావన ఉన్నట్టు convey అవుతుంది. ఆ contempt అర్థం చేసుకోదగ్గదే. కాని నాలుగు వాక్యాల్లో రెండో సారి భావ ప్రాప్తి అని ప్రస్తావినను ‘ ఇరికించడం ‘ సెక్స్ ను హీన కార్యంగా దిగ జార్చి ప్రస్తావిస్తున్నట్టుగా అవుతుంది ( I really do not think sex is actually not that hateful or heinous ) . ఏదైతేనేం మీ వ్యక్తి గత అభిప్రాయాన్ని గౌరవించ వచ్చు కాని, నా సూచన సెక్స్ ను లోకువ కట్టి మాట్లాడ్డం పురుష స్వామ్య భావ జాలం కిందికి వస్తుంది. మీరు స్త్రీ అణచివేత అంశాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యం లో, ఇది కేవలం సూచన మాత్రమే . )

   • P V Vijay Kumar says:

    I missed out one last question . I am very sorry. Posting comments do not look so friendly that I can properly synchronise where I am typing and how my key board is perceiving.

    హిజ్రా ఆత్మ కథను చీల్చి చెండాడేసాక, రంగ నాయకమ్మ ఇంకా పురుష స్వామ్య భావజాలానికి వ్యతిరేకమైన గుంపులో ఉందా లేదా అనుకూలమైన గుంపులో ఉందా ? మీకు తెలిసిన దాఖలాలు ఏమిటో చెప్ప గలరు.

   • విజయ్ కుమార్ గారు, హిజ్రాలు పురుషాధిక్యతకి వ్యతిరేకులు కాదు. నపుంసకునితో పోట్లాడితే మగతనం పోతుందనే మూఢనమ్మకాన్ని ఉపయోగించుకుని రైల్వే ప్రయాణికుల దగ్గర డబ్బులు లాగుతారువాళ్ళు. హిజ్రాల మీద అనేక సార్లు రైల్వే పోలీసులకి శికాయత్ ఇచ్చిన అనుభవం నాది.

 7. అరణ్య కృష్ణ గారు మరింత ఆలోచన వెచ్చించి ఉంటె ఎంత బాగుండేది? విరసాన్ని లేదా దాని అనుబంధ సంస్థల్ని ప్రశ్నిస్తే అది రాజ్యాను కూల ఆలోచన అవుతుందా? ఇది ఏ రకం గా ప్రజా స్వామిక ఆలోచన . ప్రజా రస జన సాహితీ ల పైన వచ్చిన విమర్సాలకి విరసం సభ్యులు ఎలా స్పందించారు? రాజ్యానికి ఎదురుగా విరసం తప్ప మరేమీ లేవంటే సరే!

  • Aranya Krishna says:

   చిత్ర గారూ! ఆమె ఏం ప్రశ్నించారండి అసలు? దాడి తప్ప. ప్రజారస, జనసాహితి సభ్యులు విరసం వారి చిన్నచూపుల్ని భరించిన మాట వాస్తవమే. వాళ్ళప్పుడు అలా వున్నారు కాబట్టి వాళ్ళకు ఇప్పుడు మంచి శాస్తి జరిగిందని సంబర పడదామా? విప్లవం ఎవరింట్లోనూ పెళ్లి కాదు కదా ఇచ్చిపుచ్చుకోవటాలకి, మర్యాదలకి ప్రాముఖ్యతనివ్వటానికి! విజ్ఞాతా దోషం ఒకరికి లేకపోతే మరొకరికి ఉండాల్సిన పనిలేదంటే ఎలా?

   • జన సాహితీ ఏమంత అభివృద్ధికర భావజాలం ఉన్న సంస్థ కాదు. స్త్రీలు బొట్టూ, గాజులూ పెట్టుకోకూడదని రంగనాయకమ్మ గారు అన్నప్పుడు, అవి పెట్టుకోకపోతే జనం తమని అమంగళాన్ని చూసినట్టు చూస్తారని ఒక జన సాహితీ సభ్యురాలు అంది. సాధారణ జనం నమ్మే అమాం బాపతు నమ్మకాల్ని నమ్మే వీళ్ళు విప్లవకారులు ఎలా అవుతారు?

 8. నేను విరసం రచనలలో చదివినవి ఆ సంస్థ ప్రచురించిన శివసాగర్ కవితలు & కొ.కు. చరిత్ర వ్యాసాలు అని నాకు గుర్తుంది. ఆ సంస్థ అజెందా గురించి నేను చర్చించను కానీ మీరు రంగనాయకమ్మ గారిని విమర్శించే ముందు గద్దర్ పాలకవర్గం నుంచే గన్‌మేన్ రక్షణ ఎలా తీసుకున్నాడో ఆలోచించండి. అది రంగనాయకమ్మ గారు చేసిన విమర్శ కూడా కాదు. ఒక విప్లవకారునికి పాలకవర్గం పోలీస్ ఉద్యోగి రక్షణ కల్పించడం గురించి నేను ఫేస్‌బుక్‌లో చదివాను.

  • p v vijay kumar says:

   pradtutaaniki…ranga naayakamma meeda charcha chooddaamaa…pls…..desham lo anta mandi meeda opinion enti ante ekkannunchi ekkadikelledi ?

 9. P V Vijay Kumar says:

  అఖిల భారత రంగ నాయకమ్మ భక్త కోటి సమూహానికి ,

  నమస్సులు !

  మీ మధ్య తరగతి బుర్రలను మార్క్సిజం కోసం ఛారిటీ నడుపుతున్న రంగ నాయకమ్మ ఎలా బురిడీ కొట్టించిందో తెలియజేద్దామని రాబర్ట్ నాగేంద్ర వ్రాయు ఈ చిన్న లేఖ.

  మొదటగా ఆమె గురించి మీకు అభిమానానికి కారణం – ఆమె నిజాయితీగా, నిర్మొహమాటంగా మాట్లాడుతుంది అనే అభిప్రాయం. నిజాయితీగా, నిర్మొహమాటంగా మాట్లాడ్డం అంటే – చుట్టు పక్కల ఏముంది , ఏం జరుగుతుందో తెలీకుండా బడా బడా వాగేయడం కాదు. నిజాయితీగా మాట్లాడాలంటే నిజాన్ని , కనీసం నిజానికి దగ్గిరగానైనా మాట్లాడ్డం ఉండాలి.

  మీకు ఆ విషయం ఆమె వ్రాసిన ‘ రామాయణ విష వృక్షం ” లో మార్క్సిజం పేరుతో ముందు మాట చదివినప్పుడన్నా అర్థం అయి ఉండాలి. అప్పట్లో అంత ఆలోచించలేదు అనుకున్నా – మీరు ఆమె 1990 చివర్లో వ్రాసిన ” బుద్ధ్డు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి ” చదివినప్పుడైనా – మార్క్సిస్టు విశ్లేషణ గురించి తెలిసి ఉండాలి. అదీ కాదు అనుకున్నా ఈ మధ్యనే వ్రాసిన ‘ తత్వ శాస్త్రం – చిన్న పరిచయం ‘ అనే గైడ్ బుక్కు ముందు మాట చదివినా అర్థం కావాలి మరి.

  మార్క్సిస్టు విశ్లేషణ అంటే ” ఈ ప్రపంచం లో ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్కటీ గబ్బే…నేను తప్ప ” అనే పర్ స్పెక్టివ్ లో విమర్శించడం కాదు. మీకు నేను చెప్పిన టేబ్లెట్ ఉపమానం అర్థమయ్యిందో లేదో మళ్ళో సారి చెప్తా – మీలో ఇంత వరకు పెయిన్ కిల్లర్స్ వాడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ? నొప్పి తగ్గాలని వేసుకునే పెయిన్ కిల్లర్ కు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే విషయం మీకు తెలుసు. నొప్పి తగ్గాలనే విషయం వదిలేసి , టేబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తిడుతూ పోతే – నొప్పి ఇక తగ్గేదెప్పుడు ? మహా అంటే అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న పెయిన్ కిల్లర్ వాడుతారు కాని, భరించలేని నొప్పి కి కావాల్సిన ఉపశమనం గురించి వదిలేసి, పర్ ఫెక్ట్ పెయిన్ కిల్లర్ కావాలి అని ఉన్న పెయిన్ కిల్లర్స్ ను తుంగలో తొక్కమంటే – అది అమాయకత్వం అవుతుంది తప్ప నిజాయితీ గా మాట్లాడ్డం అవ్వదు. అమాయకత్వమే కాక ప్రయారిటీస్ నిర్ణయించుకోలేని చాతకాని తనం కూడా అవుతుంది.

  మీకు నేను , మా వాడు వ్రాసిన ఆర్టికల్, చివరిగా వేసిన ప్రశ్న సరిగ్గా అర్థమైనట్టు లేదు. భక్తి భావం తో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు అలా మిస్ చేయడం సహజమే. ఒక్కరన్నా ఆమె వలన వ్యక్తి గతంగా కాక, సాంఘిక అంశాలలో ప్రయోజనం పొందిన వారు ఇదుగో అని మీరు చూపించ గలరా ? దానర్థం virtual గా చూపించమని కాదు. దానర్థం ఒక సాంఘిక ప్రయోజనం కోసం పోరి తెచ్చుకోవడం వేరు, జీవితం లో perfection సాధించాలనే ఆశయం వేరు. ఈ విషయం మీరు తీరుబడిగా ఆలోచించి – రంగ నాయకమ్మను ఒక సారి కదిపి లేదా కుదిపి చూస్తే అర్థమౌతుంది.

  సో మై డియర్ భక్త్స్ !, ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు అన్నట్టు మీరు ఆమెను చేసే పూజ చూడ ముచ్చటగా ఉంది. అది కొంత వరకు నిజమే అని ఒప్పుకోవాల్సిన దౌర్భాగ్యం. అలా సర్ది చెప్పుకు పూజ చేసుకునే బదులు – మీరు మీ కళ్ళు తెరిసి ఒక్క సారన్నా ఆమె చెప్పేది నిజంగా మార్క్సిజమా అని ఆలొచించి చూడండి. తర్వాత ఆమె పాదాలకు నమస్కరిద్దాం.

  గతి తార్కిక భౌతిక వాదాన్ని ఎక్కడా ఎక్కువ గా ప్రస్తావించకుండా – మార్క్సిజం అంటే అంకెల్లా చేసే అమె గొప్ప తనం గురించి… Give a thought !

  ఈమె కున్న ఎనర్జీ మిమ్మల్ని ముచ్చట గొలిపేలా చేస్తుంది . నిజం ! . ఆ ఎనర్జీ మన సమాజానికి నొప్పి కలిగించే మత ఛాందస వాదం మీదనో, లేండ్ బిల్ మీదనో, నక్సలైటు సమస్య మీదనో పోనీ పాలస్తీన సమస్య మీదనో ఒక రెండు శాతమైనా కేటాయించదేం అని మీరు బాధ పడే రోజు కోసం నేను ఆశావహంగా ఉన్నాను. ( దళిత సమస్య ను ఎంచక్కగా కాఫీ , టీ ఒడ బోసినట్టు ఒడబోసింద్….బాగా జీర్ణం చేసుకుంది గా…సో ఇక దాని గురించి అడగడం శుద్ధ దండుగ )

  ఈ మె తెలివి తేటలు కూడా మిమ్మల్ని అబ్బుర పరుస్తాయి. మొత్తం మీద అంతో ఇంతో ఒప్పుకోవాల్సిందే. కాని ఈ దేశం లో అంబేద్కర్ చేసిన అభివృద్ధిని వ్యక్తి అభివృద్ధిగా అనలైజ్ చేయగలిగే నికృష్ట మార్క్సిజం ఎలా ఉంటుందో మీకు అర్థం కాదు. అవి ఎటువంటి తెలివి తేటలో మీరు ఇప్పట్లో అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారో లేదో నాకు అంచనా లేదు. ఎందుకంటే – మీరు మార్క్సిజం అసలు పుస్తకాలు వదిలేసి ఆమె వ్రాసిన ” విక్రం సిరీస్ ‘ గైడ్స్ చదివారు కాబట్టి. అంబేద్కర్ మార్క్సిస్టు కాడు. అంబేద్కర్ మార్క్సు ఫిలాసఫీని తప్పు పట్టలేదు. సోషలిస్ట్ డెమోక్రసీ గురించి ఆకాంక్షించిన అంబేద్కర్ ‘ శ్రామిక వర్గ నియంతృత్వం ‘ మరియు ‘ హింస ‘ అనే రెండింటిని క్లియర్ గా విభేధించాడు. మీరు మార్క్స్ బుక్కులే చదవలేదు అంబేద్కర్ బుక్కులు కూడా చదవరని ఆమె కాన్ ఫిడెన్స్.

  ఇక మిమ్మల్ని ముగ్ధులను చేసిన ప్రఙా పాటవాలను గురించి వదిలేస్తే – నేనో చిన్న బెంచ్ మార్క్ ఇస్తాను. లిట్మస్ టెస్ట్ చేసి చూడండి. ఆమెను అభిమానించే 100 మంది భక్తుల్లో అనామకంగా తప్ప, 99 శాతం మంది దళితులు అయి ఉండరు. ఇది కాకతాళీయం కాదు. పేద వర్గాలు ఓన్ చేసుకున్న మనుష్యులు చాలా మందే ఉన్నారు మన మధ్యలో. ఒక సారి ఒక లిట్మస్ టెస్ట్ చేసి చూడండి.

  ఇక ఆమె – Attitude bankruptcy గురించి ఒక మాట. చలసాని ప్రసాద్ సహాయం తీసుకున్నా అతనిని రాజకీయంగా విభేధించింది అని మీరు ” ఆహా …ఓహో ” అనుకుంటున్నారు. అసలు విషయం ఇంకో అడుగు ముందుకేసి ఆలోచించి చూస్తే తెలుస్తుంది. ఈమెను నమ్ముకున్న గాంధీ తప్ప ఎవరూ ఈమెను దగ్గరకు తీయలేరు అని తెలిసినా చలసాని ప్రసాద్ మాత్రమే దగ్గర తీయ గలిగాడు. ఎవరూ దగ్గరకు తీయకున్నా ఆమె ఫైట్ చేస్తుంది అని అది గొప్ప్ ” హీరోయిజం ” ని మీరందరూ గెంతేసి చప్పట్లు కొట్టే లోపు, పైన వివరించిన మూర్ఖత్వం, తెలివి లేని తనం గురించి ఒక సారి ఆలోచించండి. ఆమె తనతో రాజకీయంగా విభేధిస్తుంది అనే విషయం తెలీని మూర్ఖుడు చలసాని కాదు. ఆమె తనను కూడా దిక్కుమాలిన తనంగా విమర్శ చేస్తుందని అంచనా వేయలేని క్లాస్ రూం మార్క్సిస్ట్ కాదు . అవి పక్కన పెట్టి ఆమెను సాదరంగా దరికి తీసుకున్నాడు అన్నది వాస్తవం. మరి ఇందులో ఆయన వ్యక్తిత్వం లో ఉన్న గొప్ప తనం కనపడలేదా ? రంగనాయకమ్మ హీరోయిజం మిమ్మల్ని చిరంజీవి ఫైటుకు మించి ఆకట్టుకుంది అనే విషయం తెలిసీ అడుగుతున్నందుకు క్షంతవ్యుడను. మీ భక్తిని గట్టిగా ప్రశ్నిస్తే ఫేస్ బుక్ వాల్ చాటుకెళ్ళి , విమర్శిస్తున్న వాల్లతో కాక , మీలో మీరు తెగ మాట్లాడేసుకుని, ఒకరి భుజాలు ఒకరు చరుచుకుని వాపు చూసుకోవడం మాత్రమే తెలిసిన మీకు , ప్రజాస్వామిక దృక్పథాన్ని ( ఇదో గొడవ…ప్రజాస్వామికం అనేది లేదు…ఓన్ లీ మార్క్స్ వాదం అనాలి కాబోలు ) నమ్మితే ఉండే వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోకుండా మీకు మత్తు మందు పెట్టింది అనే విషయం తెలిసి అప్పుడప్పుడు , మందు కొడుతున్నప్పుడొ, సిగరెట్ తాగుతున్నప్పుడో బాధ పడుతూ ఉంటాను. అలా కాదు….మీ గురించి బాధ పడుతూ మందు గాని సిగరెట్ గాని కొడుతూ ఆలోచిస్తాను.

  ఎవ్వరూ మహానుభావులు కాదు అనే విషయం మీకు తెలిసినా రంగ నాయకమ్మ కు మాత్రం మీరు ఇచ్చే ఎగ్జంప్షన్ బాగుంది. నాకు కూడా ముద్దొస్తుంది.

  రంగ నాయకమ్మను మీరు ముద్దు చేయండి.
  మీలో మీరు ఒకరినొకరు ముద్దు చేసుకోండి.
  మార్క్సిజం గురించి మాట్లాడ్డం అంటే obsessed self-love అనే థియరీ మీకు బాగా ఎక్కించింది కదా ?! కానీవండి….

  నేనో సారి దమ్ము కొట్టొస్తా….

  మీ

  రాబర్ట్ నాగేంద్ర

  • Aranya Krishna says:

   బాబూ విజయ్ కుమార్ గారు! మీ రాబర్ట్ నాగేంద్రని మళ్ళీ వెంటనే దక్షిణ్ ఎక్స్ప్రెస్ ఎక్కించి పంపండి. ఇక్కడే వుంటే అతనికి డేంజర్.

   • వీరబొబ్బిలి says:

    అయ్యా!ARANYAKRISHNA గారూ యిక్కడ డాక్టర్ గారికొచ్చిన భయమేమిలేదు.మరీ ముఖ్యంగా రంగనాయకమ్మగారి అభిమానులవలన. ఎందుకంటే వారెవరిచేతినా ఆయుధాలూ లేవు,వారివెనక పార్టీలు లేవు.

    మీరు విరసం సభ్యులేనని మీవ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి.చాలా సంతోషం.

   • p v vijay kumar says:

    :)….sar sorry..train missed out

  • విక్టర్ గారూ..
   ”ఆమె వలన వ్యక్తి గతంగా కాక, సాంఘిక అంశాలలో ప్రయోజనం పొందిన వారు ఇదుగో అని మీరు చూపించ గలరా ?” అని అడిగారు.
   నేను చూపించగలను. రంగనాయకమ్మ ‘పెట్టుబడి’ని చదవకోకుండా ఉండుంటే నాకు అదనపు విలువ తెలిసేది కాదు. నాకే కాదు, మా వూరిలో(ప్రొద్దుటూరు) ‘పెట్టుబడి’ని, ఆమె ఇతర రచనలను చదివి మార్క్సిస్టులు అయిన వాళ్ళు నాకు తెలిసి పది మందికి పైఅగా వున్నారు. వారిలో కొందరు ఇప్పుడు విరసం నాయకత్వంలో వున్నారు. కొందరు రాజ్యంతో పోరాడి జిల్లాకు వెళ్ళారు. కొందరు ఎన్కౌంటర్ అయ్యారు. ఆమె పుస్తకాల ప్రభావంతో సంస్కారవంతులు అయిన వాళ్ళు కూడా నాకు తెలుసు.
   నా కాలేజి మిత్రుడు రమణ బ్రాహ్మణుడు. అప్పట్లో వాడికి రామాయణ్ విషవృక్షం ఇచ్చాను. వాడు చదివాడు, కానీ ఒప్పుకోలేక పోయాడు. దాన్ని వాళ్ళమ్మ కూడా చదివింది. సీతకు అన్యాయం వంటి కొన్ని విషయాల్లో ఆమె ఒప్పుకుంది. తర్వాత బలిపీటం వంటివి చదివింది. ఆమెలో చాలా మార్పు వచ్చింది. అదివరకు ఆమె మాకు తాగడానికి గ్లాసులు ఇచ్చాక వాటిని తాకకుండా పక్కనపెట్టి మేం బయటకొచ్చాక శుద్ధి చేసేది. మేం దళితులం కాకపోయినా(ఎవరు ఎవరో ఎట్లా తెలుస్తుంది అని). కానీ రంగనాయకమ్మ పుస్తకాలు చదివాక.. మాకు టిఫిన్లు పెట్టి తానె పల్లెలను కడిగేది.
   రంగనాయకమ్మ తానూ చెప్పిందే మార్క్సిజం అని ఎక్కడా చెప్పలేదు. అందరూ మార్క్సిజాన్ని జర్మన్, ఇంగ్లీష్ మూల్లాల్లోకి వెళ్లి చదవలేరు. రంగనాయకమ్మ ఇంగ్లీష్ నేర్చుకుని దాన్ని చదివి సామాన్యులకు చెప్పారు. అందుకు ఆమెను అభినందించాలి. ఆమె తప్పులు రాసి వుంటే చూప్పాలి. వీలయితే సరైంది రాయాలి.
   మరో మాట.. చాలా మంది మాదిరే నేనూ భారతాన్ని పూర్తిగా చదవలేదు. రంగనాయకమ్మ రాసిన ‘ఇదండీ మహాభారతం’ చదివాకే గుట్టు తెలిసింది. ఎవరు ఒప్పుకోకపోయినా మాబోటి సామాన్య పాటకులకు రంగనాయకమ్మ లెజెండ్.

   • p v vijay kumar says:

    Meeku chaduvu nerpindi ee prabhutvam…..daani infrastrictire…..aa chaduvu lekapotje ranga nayakamma pustakaalu chadive vaallaa.?…modata prabhutvaaniki runa padandi…tarvata ranga nayakamma ku runa padandi…..

   • వికార గారూ..
    వాదించి వాదించి మీకు సహనం పోయినట్లుంది. మీ ప్రశ్నలకు స్పందించడమే తప్పయింది. నాకు చదువు నేర్పిన గురువులకు రుణపడి వుంటాను కానీ ప్రభుత్వానికి కాదు. మీరు రుణపడితే నాకు అబ్యంతరం లేదు. సర్కారు జనానికి ఉచితంగా చదువు చేబుతోన్దనుకోవడం మీ అమాయకత్వం.(ఎలాంటి చదువనేది పక్కనపెట్టండి). ఉప్పు నుంచి పిల్లల టాయిలెట్ గుడ్డవరకు సర్కారు గోల్లూడగొట్టి పన్నులు దొబ్బి, చదువు కోసం పిసరంత విదిలిస్తోంది.

   • స్కూల్ పుస్తకాల్లో బోధించేవి గుమాస్తాలని తయారు చెయ్యడానికి మాత్రమే పనికొచ్చే చదువులు.

   • P V Vijay Kumar says:

    కదా మరి ?

   • చదువుని కనిపెట్టినది ఇప్పటి పాలకవర్గం కాదు. దానికి ఇప్పటి పాలకులకి ఋణపడక్కరలేదు. మన దేశంలో అక్షరాలని ప్రవేశపెట్టింది మౌర్యులు. అప్పటి పాలకులు రాళ్ళ మీద, బ్రాహ్మి లిపిలో, శిల్పుల చేత శాసనాలు వ్రాయిస్తే ఇప్పటి పాలకులు ప్రభుత్వ కార్యాలయాల్లో, తెలుగు లిపిలో, గుమాస్తాల చేత రికార్ద్‌లు వ్రాయిస్తున్నారు. చదువురానివాడు మెదికల్ షాప్‌లో మందు సీసా కొంటే దాని లేబల్ మీద ఏముందో చదవలేడు కాబట్టి ఇప్పటి పాలకులు అందరికీ చదువు నేర్పిస్తున్నారు. ఆ సాంకేతిక విషయాన్నే మనం గొప్ప అనుకుంటున్నాం.

 10. వీరబొబ్బిలి says:

  డాక్టర్ గారూ మీ ప్రిస్క్రిప్సన్ (ఔషధనిర్ణయం) చీటి చూసేక ముచ్చటేసిన్ది .మీరనుకున్నదే పెయిన్ కిల్లర్ అని అనుకుంటున్నారు.అందులోను చాలా రకాలుంటాయి కదా సార్!అదిమాత్రమే సరిపోదు అని రంగనాయకమ్మభావించొచ్చు.అది మీకు నచ్చకపోవచ్చు. దానివలనవచ్చినయిబ్బన్దేమీలేదు.ఇటు మీకుగానీ అటు రంగనాయకమ్మగారికి గానీ.

  చదువుకున్నవారు ఒక్కరంగనాయకమ్మరచనలనే చదివి వూరుకుంటారని మీరు అనుకోవచ్చు.అందువలన మాబోటివారికి వచ్చిన యిబ్బంది అంతకన్నాఏమీలేదు.

  యిక్కడ మీరనుకున్నట్టు రంగనాయకమ్మ భక్తకోటి ఎవరూ ఉన్నారని నేననుకోవడంలేదు. బహుసా అభిమానులు కొందరు వుంటే వుండవచ్చు. (నిజానికి రంగనాయకమ్మ గారు భక్తులనుకూడా అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా! ).
  నిజానికి రంగనాయకమ్మగారికి ఒకవేళ వుంటే గింటే భక్తులకంటే పది పాతికరెట్లు యాంటీ భక్తులే వుంటారన్నది కాదనలేనివాస్తవం.
  యిక్కడ సమస్యేమిటంటే వైద్యం సరిగ్గా జరగటంలేదనేది ఆమె వాదన.పాతగాయం మానటంలేదు సరికదా యిలాగే కొనసాగితే కొత్తకొత్తగాయాలు కూడా మిగులుతాయన్న హెచ్చరికే ఆమె విమర్సలని నాబోటి సామాన్యుడికి అర్ధమయింది.

  మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు.”విక్రం గైడ్ సీరీసు” పాఠకులగురించి అంతబాధపడకండి.అందరూ మార్క్స్ లూ కారూ ,అంబేద్కరులూ కాలేరు.గనక తరతమస్థాయిల్లో వారివారి బుద్ది వికసించినమేరకు ఆలోచిస్తారు. గనక విచారించకండి.
  “మీకు మత్తు మందు పెట్టింది అనే విషయం తెలిసి అప్పుడప్పుడు , మందు కొడుతున్నప్పుడొ, సిగరెట్ తాగుతున్నప్పుడో బాధ పడుతూ ఉంటాను. అలా కాదు….మీ గురించి బాధ పడుతూ మందు గాని సిగరెట్ గాని కొడుతూ ఆలోచిస్తాను.” అంటున్నారు.మాగురించి అంతగా ఆలోచించి మందో సిగరెట్లో ఎక్కువైపోయి మీ ఆరోగ్యం పాడవుద్దేమో నని మాకు బాధగావుంటుంది.గనుక మాకోసం మీరు,మీకోసం మేము బాధపడడం అవసరమంటారా!

  తెలుసుకోవలసినవారు తెలుకోవలసొచ్చినపుడు తెలుసుకుంటారు.

  • Aranya Krishna says:

   వీరబొబ్బిలి గారూ! నేను విరసం సభ్యుణ్ణి కానని నిన్నటి నా వ్యాఖ్యలు చదివిన చిన్న పిల్లలక్కూడా తెలిసి వుంటుంది. ఎందుకంటే అసలు విరసం సభ్యులేందుకు మౌనంగా వున్నారని, వసంత గారి కవిత్వం నాకు నచ్చలేదని, ఆమె వ్యాసం రాసి వుండాల్సిందని, విమర్శకి, ప్రతివిమర్శకి కవిత్వం మార్గం కారాదని సవినయంగా తెలియచేసాను. మీక్కూడా మరోసారి తెలియచేస్తున్నాను.

   • p v vijay kumar says:

    Virasam aite entanta problem modi bhaktullaku ….sorry…ranganayakamma bhaktulaku…

  • p v vijay kumar says:

   Kadaa ?

 11. Delhi Subrahmanyam says:

  ఒరోరి రోబోర్ట్ నోగేంద్ర బావ్ వెంత గొప్పగా సెప్పీసీనవ్. విప్పుడు పోయింటేతంతే నూవ్విన్ని కొత్త ఇసయాలు సెప్పినావ్ గన్దా ఆవేత్తయినా ఇక్కడీల్లకి పట్టినాదంతావా. వెందుకు బావ్ విన్నికబుర్లీలతో. ఒగ్గీ బావ్. విని కొత్త ఇసయాలు తేలుసోకొలని సిన్న మాతరమయిన సరదానేనప్పుడు ఒగ్గేయడమే మంచిది. పైన సూడు ఒక బావినగన్నాడు “విజయ్ కుమార్ గారు, హిజ్రాలు పురుషాధిక్యతకి వ్యతిరేకులు కాదు. నపుంసకునితో పోట్లాడితే మగతనం పోతుందనే మూఢనమ్మకాన్ని ఉపయోగించుకుని రైల్వే ప్రయాణికుల దగ్గర డబ్బులు లాగుతారువాళ్ళు. హిజ్రాల మీద అనేక సార్లు రైల్వే పోలీసులకి శికాయత్ ఇచ్చిన అనుభవం నాది”

  అంతే వన్తే కానీ వారొక్క పూట తిండి కోసం బతుకు మార్గనింకో మార్గం మనం కానీ ప్రజాస్వామిక రాజ్యం కానీ పెద్ద కృషి చేసినట్టు మీకు కనిపిస్తే చెప్పండి. నేనిది వరకే చెప్పాను, ఒక HIVసర్వే లో హైదరాబాద్ లో వారితో చాలా సామ్యంగాడిపి యెన్నో తెలుసుకున్నాను. అదే సుర్వే లో HIVతో బాధపడుతున్న ఒక హిజ్ర ఇన్వెస్టిగేటర్ తో కలిసి నేను కడప లో పని చేశాను . అతను?ఆమె దగ్గర చదువుకూన తనకి కూడా ఒక పని కావాలంటే యెంత కష్టమో తెలుసుకున్నాను. ఇవాణ్ణే తెలుసుకోకుండా పైన తన నుభవ్మ్ చెప్పినయాన్ని నేనార్ధం చేసుకోగలను. కానీ వల్ల మీద వ్యాసం రాసిన రచయిత్రి వారి జీవితలను తెలుసుకొందుకు యెంత కష్ట పడ్డారని?.

  ఒగ్గీ ఇజాకుమార్ బావ్ ఈల్లతో నీకేల.

 12. హిజ్రాల కడుపు నిండడం ముఖ్యం కనుక “హిజ్రా కావలించుకుంటే మగతనం పోతుంది” అనే మూఢనమ్మకం ఉండడం పెద్ద సమస్య కాదనుకోవాలా? ఏమి గొప్ప ఆదర్శవాదం బాబూ మీది? రైలులో దొంగోడు నన్ను పట్టుకుంటే తోటి ప్రయాణికులు ఆ దొంగని ఆపుతారు కానీ హిజ్రావాడు నన్ను పట్టుకుని ఎంతకీ వదలకపోతే “మనకెందుకు ఆ బాధ” అనుకుని పక్కవాడు ఎవడూ జోక్యం చేసుకోనిది “వాడితో పెట్టుకుంటే వాడు తమ మగతనానికి ఏ ముప్పు తెస్తాడో” అనే భయం వల్ల. ఈ మూఢనమ్మకాన్ని cash చేసుకునేవాళ్ళ మీద దయ ఒకటి?

 13. ఈ నాటకం అంతా ఎందుకు? తాము చేస్తున్నది వర్గ పోరాటం కాదు, వర్గ సహకారం అని విరసం స్వయంగా చెప్పుకుంటే సరిపోతుంది. తెలంగాణా నిజంగా రాదనుకుని తెలంగాణాకి అనుకూలంగా లేఖలు వ్రాసిన ఆంధ్రా నాయకులు ఉన్నట్టు, విప్లవం నిజంగా రాదనుకుని గతితార్కిక భౌతికవాదాన్ని సమర్థించే పాలకవర్గం నాయకులు ఉండరు. వరవరరావు సూఫీ మతాన్ని నమ్ముకున్నా, గద్దర్ పాలక వర్గం దగ్గరే గన్‌మేన్ రక్షణ తీసుకున్నా, విప్లవ వ్యతిరేక వర్గం తన వర్గ స్వభావాన్ని మార్చుకోదు.

  • p v vijay kumar says:

   Bhakta kotiki…vinati…idi varavara rao camp, venu camp, gaddar camp, ranganayakamma camp lani mIranukunTE…dhanyosmi. Vaalla paina vimarsalaku vallu samaadhaanam istaaru…..prastutam ranga naayakammanu samaadhaanam ivvamdi. Idemo godava…vallu tappu cesaaru veellu tappu chesaarane tikka argumemts enti…ranga nayakamma gurinci matladakundaa ?

 14. finally

  పి. విక్టర్ విజయకుమార్ గారు లవ్స్ పి. విక్టర్ విజయకుమార్ గారు !!

  • manjari lakshmi says:

   బాగా చెప్పారు రాజు గారు

  • manjari.lakshmi says:

   ఒక్క ముక్కైన చాలా బాగా చెప్పారు రాజు గారు

   • P V Vijay Kumar says:

    లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా….డైరెక్ట్ జడ్జ్ మెంట్ ఏంటో !

   • నావద్ద అంబుల పొది లేదు , నేను బాణాలు వేయలేదు.

    ` సారంగ ‘లో మీరు వ్రాస్తున్న వ్యాసాలు చదువుతుంటాను . మీ ఆలోచనలు , మీ అభిప్రాయాలు సూటిగా చెపుతుంటారు. వాటిని మెచ్చుకొని ఆనందించే అభిమానులు చాలామంది వున్నారు. ఒక్కొక్కసారి విమర్శించిన వాళ్ళకు తిట్లు , శాపనార్ధాలు కూడా మీ అబిమానులు పెడుతుంటారు. అది సహజం.

    మీలాగే రంగనాయకమ్మ గారు కూడా తను చూసినవి , చదివినవి , ఆలోచించినవి పదిమందితో పంచుకోవాలనీ , అందరకూ తెలియజేయాలనీ వ్రాస్తుంటారు. అవి ఒక్కొక్కసారి సమీక్షలుగా , కొన్నిసార్లు విమర్శలుగా వుంటాయి. వాటి తీవ్రత సహజంగానే ఎక్కువగా వుంటుంది. ఆమెకూ అభిమానులు వుంటారు. వారు ఆమెను విమర్శించేవారిని ఎదుర్కొంటుంటారు. [ భక్తులు అనే మాట నేను వాడను , ఎందుకంటే దానిలో దేవుడి భావన వుంటుంది. అది నాకిష్టం లేదు.]

    రంగనాయకమ్మ గారు ` హిజ్రా ‘ లపై వ్రాసిన సమీక్ష మీకు నచ్చలేదు. ప్రసాద్ గారిలాంటి ఆమె అభిమానులు ఆమెను సమర్ధిస్తూ వ్రాసినవి కూడా మీకు నచ్చలేదు . మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ కూడ కొందరు వ్రాశారు . ఎవరి ద్రుష్టి వారిది.

    విరసం మీద , వరవర రావు , వేణుగోపాల్ , గద్దర్ మొదలైన వారిపైన ఆమె చేసిన విమర్శలకు సమాధానం కాకుండా ఆమెను గురించి ఏమి మాట్లాడాలి ?

    రంగనాయకమ్మ గారు మార్క్సిజం గురించి , కేపిటల్ గురించి , తత్వశాస్త్రం గురించి ఆమె అర్ధం చేసుకున్న రీతిలో వ్రాశారు. అందులో తప్పులుంటే ఖండిస్తూ వ్రాయాలి. వ్రాయడమే తప్పంటే ఎలా ?

    కొడవటిగంటి కుటుంబ రావు గారు మానవాతీత శక్తులు వున్నాయని వ్రాస్తే విమర్శించగూడదా ?

    శ్రీ శ్రీ తన జీవితం లో చేసిన పొరపాట్లను ఎత్తిచూపడం నేరమా ?

    బాలగోపాల్ గారు మార్క్సిజం ఈ దేశానికి పనికి రాదనీ , అది పెట్టుబడీదారీ సమాజాన్ని అధిగమించడానికి పనికిరాదనీ అంటే ఆమె అభిప్రాయం వ్రాయడం తప్పా ?

    వేణుగోపాల్ గారు వ్రాసిన సంతాప ప్రకటనను ఖండిస్తూ వ్రాయడం తప్పెలా అవుతుంది ?

    అలాగే అందరిగురించి ఆమె అభిప్రాయాలు సూటిగా చెపుతారు. ఇష్టమైన వాళ్ళు చదువుతారు , లేదా విమర్సిస్తారు.

    మీరెలా మీ అభిప్రాయాలు , ఆలోచనలు వ్రాస్తున్నారో , ఆమె కూడా అంతేగదా !

    అందుకే రంగనాయకమ్మ లవ్స్ రంగనాయకమ్మ ! పి. విక్టర్ విజయకుమార్ గారు లవ్స్ పి. విక్టర్ విజయకుమార్ గారు !!

    కాదంటారా !!!

 15. P V Vijay Kumar says:

  లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా….డైరెక్ట్ జడ్జ్ మెంట్ ఏంటో !

  • p v vijay kumar says:

   Sir, meeru cheptunna points lo valid concern undi. Sri sri gurinchi, venu gurinchi virasam em stand teesukundo lokam ku telusu. Ranga nayakamma kottagaa cheppedemi ledu. Gaddar nu ela warn chesindo kuda andariki telusu. Ranga nayakamma digi vaccenta varaku virasam wait cheyledu. Ee article lo precise ga ” directoon leni vimarsa ” gurinche….adi vimarsa kaadu..eeme vesyalanu hijralanu koodaa solution suggest cheyaalsindi poyo vimarsistundi….idem vimarsa nadavadika.. Tablet side effects gurinci cheppina upamaanam chadive untaaru. Meeru specific gaa point by point frame chesukondi…u wil get 100 answer from me..if u want toook at it dispassionately

 16. P V Vijay Kumar says:

  ఆమె వ్రాసేది మార్క్సిజమా ? గతి తార్కిక భౌతిక తత్వాన్ని వదిలేసి కేవలం ఆదనపు విలువ ను లెక్కల ఫిలాసఫీ గా మార్చిన ఆమె వ్రాసేది మార్క్సిజమా ? ‘ రామాయణ విషవృక్షం ‘ ముందు మాట లో మార్క్సిజం పేరుతో వ్రాసింది మీకు గుర్తు రావట్లేదా …. ఇలా ఒకే ఫ్రేం లో మనిషిని ఇరికించి …ఇలానే ఉండాలి….ఒక్క ఇంచు పక్కకు పోరాదు అన్నట్టు…మార్క్సిజాన్ని ఇరికించిన ఈమె వ్రాసేది మార్క్సిజమా ? One must read Marx or Ambedkar books to see if she is writing real analysis ఈమె మార్క్సిజం గురించి గైడ్లు వ్రాసింది. అది ఆమె point of view మాత్రమే. ఈమె మత ఛాందస వాద సమస్య గురించో , రిజర్వేషన్ సమస్య గురించో, కాశ్మీర్ సమస్య గురించో, పాలస్తీనా సమస్య గురించొ తన మార్క్సిస్ట్ విశ్లేషణ వ్రాయమనండి. అది అటెంప్ట్ చేయదు. because she herself not sure of how to empirically apply marxism to various social issues. I bet – show me one particular major and significant incidents of her analysis in her writings. Please go back to her and ask this.

 17. మీకు అసలు భౌతికవాదమే తెలిసినట్టు లేదు. విరసం వీరులు అదనపు విలువ సుద్ధాంతాన్ని ఒక ఊహ అంటారు. దాని అర్థం కార్మికులు ఆ ఊహ కోసం వర్గ పోరాటాలు చేస్తారనా? వైరుధ్యం అనేది వాస్తవ పరిస్థితి నుంచి పుడుతుందా లేదా ఊహ నుంచి పుడుతుందా? భౌతికత అనేది పునాది, భావం అనేది ఉపరితలం అనే భౌతికవాద సూత్రం కూడా ఈ విరసం వీరులకి తెలిసినట్టు లేదు.

 18. కశ్మీర్ సమస్య రెండు పాలకవర్గాలకి సంబంధించింది. అది పాలితులకీ, పాలకులకీ మధ్య ఉన్న వైరుధ్యం కాదు. పాలస్తీనాలో జరుగుతున్నది జాతీయ విముక్తి పోరాటమే కానీ కశ్మీర్‌లో జరుగుతున్నది అది కూడా కాదు. కశ్మీర్ సమస్య గురించి రంగనాయకమ్మ గారు చర్చించినా, ఎవరో non-Marxist చర్చించినా పెద్ద తేడా ఏమీ రాదు.

  • p v vijay kumar says:

   aa mahatalli varame ee alochana idantaa….
   .ee samaajam lO prati samasya ..communism vaccake chusukundaam anukunte…..aame janaala gurinci maatram ensuku vimarsha chestindanta ? Marxism gurinci maatrame raasukovaccu kadaa ?….samasyaku marxist vilseshanalu lepithe marxism nu exhibition lo petti explain cheyaalika…

   • నేను మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెపుతాను. పాలకవర్గంవాళ్ళు స్కూల్ పుస్తకాలలో సంఘసంస్కర్తల గురించి వ్రాస్తోన్నా నిజజీవితంలో విధవావివాహాలు జరగడం లేదు. వాళ్ళు విధవావివాహాలు నిజంగా జరగవు అనే నమ్మకంతోనే ఆ పాఠాల్ని స్కూల్ పుస్తకాల్లో వ్రాస్తున్నారు. ఇందియాలో కమ్యూనిజం వచ్చేంత వరకు విధవావివాహాలు జరగవు. అంతమాత్రాన కమ్యూనిజం రాకముందు విధవావివాహాల గురించి మాట్లాడకూడదని కాదు దాని అర్థం. ఇందియాలో కమ్యూనిజం వచ్చేంత వరకు ‘తమ సమస్యకి మూలం తెలుసుకోకుండా ప్రభుత్వ & IT ఉద్యోగాల్లో అవకాశాల కోసం అగ్రకులాలవాళ్ళతో వీధి పోరాటాలు చేసే’ దళితులు ఉంటారు. అంతమాత్రాన కమ్యూనిజం వచ్చేంత వరకు కుల సమస్య గురించి మాట్లాడకూడదని కాదు దాని అర్థం.

    కశ్మీర్ సమస్య విషయంలో ఎవరిని సపోర్త్ చేస్తాం? కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాల్ని ప్రోత్సహించే హిందూ భారత దేశాన్నా లేదా హిందువులకి వ్యతిరేకంగా స్కూల్ పుస్తకాల్లో వ్రాసి ఇస్లామ్‌ని కీర్తించే పాకిస్తాన్‌నా? ఆ ఇద్దరు దొంగల్లో ఎవరికి కశ్మీర్ దక్కాలి అనే విషయం ఒక మార్క్సిస్త్ చెపుతాడా?

  • P V Vijay Kumar says:

   రణనాయకమ్మా మార్క్సిట్ సమాజం ఏర్పరిచేంత వరకు…ఆమె గమ్యం చేరేంత వరకు….జస్ట్ ముక్కు మూసుకుని సమస్యల మీద తపస్సు చేస్తూ ఉండాలా…….మోడీ బూర్జువా, రాహుల్ గాంధి బూర్జువా, సీతారాం బూర్జువా, కెజ్రివాల్ బూర్జువా ……అని పొద్దున్నే దండకం చదువుకుంటూ ఉండాలా ? పోనీ వరవ రావు రివిజనిస్ట్, చలసాని దొంగ మార్క్సిస్ట్, గద్దర్ అడుక్కు తినే కమ్యూనిస్ట్ అని తిడుతూ ఉన్నా కూడా పర్లేదా ? అంటే – అదనపు విలువ మేజిక్ చేసాక – మతం టప్పున మాయముతుంది, వర్గం టప్పున మాయమౌతుంది, కులం ఆ రాత్రే ఉరేసుకుంటుంది, నెక్స్ట్ డే కార్మికులందరూ మర్సిడిస్ లో తిరుగుతారు……ముడ్డి కింద సమస్యలు కాల్తుంటే – సమస్యలు ఎక్కన్నుంచి ఎలా ఆరిజినేట్ అయ్యి ఎలా వ్యాపించాయో తెలీకుండా…తిక మక పడుతూ …. నూతన ఆర్థిక విధానాలు అంటే ఏంటి అన్నది మన్మోహన్ చెప్పిందే కరెక్ట్ అని నమ్మాలో వద్దో తెలీకుండా….రంగ నాయకమ్మ ఏమి వ్రాస్తుందో తెలీకుండా….అందరు పెరడులో ఒక గుడి కట్టుకోవాలి. ఎవరికి అని అడక్కండి.

   • పెట్టుబడి కొన్ని కులాల చేతుల్లోనే ఉంది కనుక పెట్టుబడి ఉన్నంత వరకు కులం పోదు. మన దేశం ఇంకా అర్థభూస్వామ్య దేశం. ఇక్కడ నిరుద్యోగుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ లేదా IT ఉద్యోగాలు మాత్రమే కావాలంటున్నవాళ్ళు తప్ప యంత్ర పరిశ్రమలు కావాలంటున్నవాళ్ళు కాదు. ఇందియాలో సోషలిస్త్ విప్లవం వచ్చేంత వరకూ ఇక్కడ దళితులు – అగ్రకులాలవాళ్ళు ప్రభుత్వ & IT ఉద్యోగాల్లో అవకాశాల కోసం ఒకరినొకరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. నేను మాట్లాడకపోయినంతమాత్రాన ఈ నిజం మారదు.

    గాంధీతో పోలిస్తే అంబేడ్కర్ చాలా నయమే. దళితుల్ని ఊరి చెరువులో నీళ్ళు తోడుకోనివ్వకపోతే దళితులకి వేరే చెరువులు తవ్వాలని గాంధీ అనేవాడు కానీ అంబేద్కర్ అలా కాదు. అంబేడ్కర్ మహద్ పట్టణంలో దళితులకి చెరువులో నీళ్ళు తోడుకునే హక్కు కల్పించడానికి దళితుల తరపున కోర్త్‌లో కేస్ వేసాడు. అంబేడ్కర్ లేకపోతే గాంధీ లాంటివాళ్ళే eternal మహాత్ములు అయ్యేవాళ్ళు. గాంధీలాగే అంబేడ్కర్ కూడా పెట్టుబడి ఉండాలన్నాడు కాబట్టి రంగనాయకమ్మ గారు అంబేడ్కర్‌ని విమర్శించారు. అంబేడ్కర్‌లోని పరిమితులు చూడలేకపోతే అది మీ సమస్య.

 19. CH.HARIBABU says:

  ఇందాక నా కవితలోని లైన్లు వరుస తప్పాయి. ఇప్పుడు సరిగా పంపుతున్నాను. గమనించగలరు.

  సంతలో వసంత

  ‘ప్రకృతి‘, వసంతం పోయినా….
  తిరిగి చిగురిస్తుంది–
  అది సహజం.
  ’ఈ వసంత‘, ఎన్నేళ్ళైనా
  ఇంతే, చిగురించదు–
  ఇదీ సహజమే.
  .
  ఓర్వలేనితనం దశాబ్దాలుగా
  పెరిగింది వసంతలో గుట్టలుగా
  పునర్ముద్రణలవుతున్న
  ’రచయిత్రి‘ గ్రంథాలతీరు
  కలిగిస్తున్నది వంసతలో భళే కంగారు.

  బూర్జువా విమర్శించేది
  మార్క్సిస్టునే–అది పాతపాట.
  మార్క్సిస్ట్ ముసుగు‘ విమర్శించేదీ
  మార్క్సిస్ట్ నే–ఇది కొత్తపాట.

  బియ్యం, పప్పు, ఉప్పు–
  సంతలోని సరుకులు
  ఈర్శ్య, ఈసూయ, ద్వేషం-
  వసంతలోని పలుకులు.

  కాలేదు ’రచయిత్రి‘ ఎప్పుడూ ఒంటరి,
  కాదు కాదు అసలెప్పటికీ ఒంటరి.
  ఒంటరనే ఊహ ఒకటి
  విసిరిన ఓ తుంటరీ ,
  జ్ఇానరేఖ చూడలేని
  అంధకార బంధురీ.

  తలదించు, తలదించు
  తలపెట్టి, మొదలెట్టు
  ’ పెట్టుబడి‘ చేతబట్టు
  జ్ఇానం నీ ఒంటబట్టు.

  తెలుగునాట మార్క్సిజానికి
  ’ఈ రచయిత్రే ‘ పర్యాయం
  వెలుగుబాట విప్లవానికి
  ’ ఆ పెట్టుబడే ‘ ఆధారం.

  — సి.హెచ్. హరిబాబు.

  నా ఫేస్ బుక్ అడ్రస్– uhpreetham@gmail.com

 20. విప్లవకారులు పాలకవర్గం దగ్గర అవార్ద్‌లు తీసుకోవడం తప్పని రంగనాయకమ్మ గారు ఎప్పటి నుంచో చెపుతున్నారు. దాన్ని మీరు అరిగిపోయిన రికార్ద్ అనుకుంటే నేనేమీ చెయ్యలేను.

  విధవా వివాహాలు నిజంగా జరగవు అనే నమ్మకంతో, సంఘసంస్కరణ నవలలకి అవార్ద్‌లు ఇచ్చే పాలకులు ఉంటారు. కానీ విప్లవం నిజంగా రాదనే నమ్మకంతో, గతితార్కిక భౌతికవాదంపై వ్రాసిన ఒక సంవాదానికి అవార్ద్ ఇచ్చే పాలకులు ఎక్కడా ఉండరు. వర్గం విషయంలో అంత రిస్క్ తీసుకునే ధైర్యం ఏ పాలకవర్గ ప్రతినిధికీ ఉండదు.

  • p v vijay kumar says:

   Tamaru sarihgaa chadavaledu…award prakatimcindi ” arasam “…..adi almost sunna ippudu…charcha ” virasam ” gurinchi….

 21. V Venkata Rao says:

  అదనపు విలువ ఊహే అయితే, ఇక శ్రమ దోపిడి లేనట్లే. శ్రమ దోపిడి లేకపోతే వర్గాలు లేనట్లే. వర్గాలు లేకపోతే వర్గపోరాటాలు ఎవరి మీద? విరసం వారు గానీ, ఇతరులు ఎవరైనా చెబితే తెలుసుకోవాలని ఉంది.

  • వాళ్ళు నాస్తికహేతువాదుల్లాగ కుల వ్యతిరేక & మత వ్యతిరేక పోరాటం మాత్రమే చేసి దాన్ని మార్క్సిజం అనుకుంటున్నారేమో! నాస్తికహేతువాదులకైతే అదనపు విలువ గురించి తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళ అజెందా కుల నిర్మూలన & మత నిర్మూలన మాత్రమే కానీ వర్గ నిర్మూలన కాదు.

  • p v vijay kumar says:

   Srama dopidi lepothe…next day vargaalu maayamayi povu…..adi magic kaadu….socialism establish cheyadam oka process….adanapu viluvanu abolish cheyadam oka pradhaana vidhaanam….vargaalu maayamavvadam varga samsktruti kuda nirmoolincaalsi untundi…..adanapu viluva ooha ani ame iccina reference mundu venuka emi vrasindo chudakunda vraasina comment adi…

 22. మొత్తానికి రంగనాయకమ్మ వేసిన ప్రశ్నలకు అటు విరసం కానీ, దాని అభిమానులు కానీ జవాబులు చెప్పలేక పోయారు.
  ఏతావాతా తేలిన విషయాలు ఇవీ.. రంగనాయకమ్మ గతంలో అంబేద్కర్ను విమర్శించారన్న కక్షతో అంబేడ్కరిస్తులు ఆమెపై రాళ్ళు వేశారు. ఆమె గతంలో విరసాన్ని, విరసం నేతలను విమర్శించారన్న కక్షతో విరసం వీరాభిమానులు కూడా రాళ్ళు వేశారు. విరసంపై కక్ష ఉన్నవాళ్ళు ఆమె అందించిన ఆయుధాలను విరసంపై మళ్ళీ ఎక్కుపెట్టారు.
  అంబేడ్కరిజంతో సమసమాజం ఏర్పడుతుందని కొందరి అడ్డగోలు వాదన.
  అదనపు విలువ మార్క్సిజంలో భాగం కాదని మరికొందరి అతి తెలివి.
  ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తిట్లు, దబాయిమ్పులతో పాండిత్య ప్రదర్శన.

  • p v vijay kumar says:

   Devudaaaaaa…..ranga naayakamma meeda vesina prasnalaku….samaadhaanam cheppa kundaa….virasam ganta kodataarenti ?…vaallu (virasam) samaadhaanam ivvakapothe eeme cheppindantaa correct ayipotundaa…….shd i give a legal undertaking i dont even attend one single meeting of virasam…i dont evem read aruna tara….i havnt interacted with vara vara rao…not even for few minutes thru out my life….naaku ee pativrata testing endi swamy…..

  • అవును , అంబేద్కర్ భక్తులు కి ఉన్న కోపమే ఇదంతా ..

   • P V Vijay Kumar says:

    అంబేద్కర్ కాపోతే..తొక్కలో రంగ నాయకమ్మకు పూజ చేయాలా ? Dont test the patience my boy . I answer u doesnt mean u talk some crap about Ambedkar. And, more so…. have first hand reading of Marx instead of Vikram series guides and u wil get to understand the value of Ambedkar. Damn with lazy intelluctuality !

  • kola shyam says:

   అంబేడ్కరిజంతో సమసమాజం ఏర్పడుతుందని కొందరి అడ్డగోలు వాదన.”

   ఇవి మోహన్ అన్న మాటలు ….చాలా దురుద్దేశము తో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది .
   మార్క్సిజం తో సమసమాజం ఎలా ఏర్పాటు అవుతుందో చెప్పండి ,ఈ దేశములో కులాలు ఉన్నాయి ,ఒక మనిషి ఎదో ఒక కులము అయి ఉంటాడు ,బ్రాహ్మణీయ ని చన మెట్ల కుల వ్యవస్థలో ఎలా సమం చేయగలరో చెప్పండి .
   ఈ సమాజములో పేదరికం కులమే అయినప్పుడు ,ఈ దేశములో కులము వల్లనే పేదరికము వచ్చినప్పుడు కులము ను సమం చేయకుండా ఎలా సమసమాజాన్ని నిర్మిస్తారు .

   రంగనాయకమ్మ అంబెడ్కర్ గారిని విమర్శిస్తే చాలా మంది అగ్రకుల కమ్యూనిస్ట్ లు సంబరపడ్డారు ,
   అంబెడ్కర్ ,బుద్ధుడు చాలదు ,మార్క్స్ కావాలి ఈ దేశానికి అని ఆమె చెబితే మార్క్సిస్టు దళితులూ
   ఊరుకున్నారు కానీ నాకు తెలిసి అతికొద్ది మంది మాత్రమే విమర్శించారు ,నాకు తెలిసిన సోదరుడు ఇప్పటికి రంగనాయకమ్మ అభిమానిగా ఉన్నాడు ,అంటే మార్క్సిజం లో ఆమె ఏది చెప్పిన నిజమే స్థాయిలోకి నెట్టివేసింది ఆమె వ్రాతలు అన్నది నిజం ,అదే అదనుగా అగ్రకుల అహంకారం తో అంబేద్కరిజం పైన విషం కక్కుతుంటే అగ్రకుల కమ్యూనిస్ట్ లు ఆమె భక్తులు మారడములో నాకు వింత ఏమి కనబడలేదు

   రంగనాయకమ్మ అంబెడ్కర్ గారిని విమర్శిస్తే అంబేద్కరిజానికి వచ్చే నష్టం ఏమి లేదు ,దళితులూ మార్క్సిజం ను ఎవరైతే తలా పైకి ఎత్తుకున్నారో వారికి దిమ్మ తిరిగే దెబ్బ కొట్టింది ,అయితే ఇక్కడ ఆమె అలా మాట్లాడింది కొందరి దళిత వ్యతిరేకుల కడపమoట చల్లార్పడం కోసమే అని అందరికి అర్థం అయ్యింది

   అన్న అంబేద్కరిజం మీద మీ వాఖ్యలు వెనక్కి తీసుకుంటారని ఆశిస్తూ

   శ్యామ్ కోలా

   • ఇది పూర్తిగా ఏక పక్ష వాదం. రంగనాయకమ్మ గారు ” బుద్ధుడు చాలడు, అంబెడ్కర్ చాలడు మార్క్స్ కావాలి” అంటున్నారు. ఆమె చెప్ప దలుచుకున్నభావం పూర్తిగా ఈ శీర్షిక ప్రతిఫలిస్తుంది. ఇది ఎలా దళితులకు వ్యతిరేకమో నాకర్ధం కావటం లేదు. అంబెడ్కర్ గారు ఆయన పరిధిలో దళితులకోసం పోరాడాడు. ఆయన పోరాటం పరిమితం మైనదే ! (ఈ విషయంకూడా ఆయనకు తెలిసే ఉంటుంది. ఒక వేళ రంగనాయకమ్మ గారు చెప్పినట్లు ఆయన మార్క్స్ ను అనుసరించి ఉంటే పాలక వర్గాలకు ఆయనను మత్తు పెట్టడం చాలా ఈజీ అయివుండేది నిజమే! ) దానివల్ల మొదటి తరం లో కేవలం ఒక శాతం దళితులు బాగుపడి ఉంటారు. రెండో తరానికి వచ్చే సరికి ఈ బాగుపడిన దళితులు మాత్రమే మిగిలేటట్లు ( రిజర్వేషన్లకు) చేసు కున్నారు పాలక వర్గాలు. కింది తరగతి దళితులకు ఏ అవకాశాలు చేశారు . వారు ప్రధాన స్రవంతి లో చేరడం అటుంచి బతకడమే భారంగా ఉంది. ( ఈ రోజు జరగుతున్న దళితులమీద దాడులు ఈ కింది తరగతి దళితులను టార్గెట్ చేసినవే! పై తరగతి దళితులు ఎవరైనా ఈ దాడుల్లో భాదితులైనట్లు చూసారా మీరెవరైనా? వీరు పాలక వర్గాలకు, దళితుల తరుపున, చేదోడు వాదోడుగా ఉంటున్నారు. రంగనాయకమ్మ గారు సరిగ్గానే చెప్పారు.

 23. నాకు విరసంపై కక్ష లేదు. మార్క్సిజమ్‌ని పుక్కిటిపురాణం స్థాయికి దిగజార్చేవాళ్ళు విరసం సభ్యులైనా, ఇంకెవరైనా నేను వాళ్ళని ఒకలాగే చూస్తాను

 24. p v vijay kumar says:

  Naaku virasam to affiliation ledu. Tala tikkagaa direction lekundaa…..academic gaa vimarsinche lo moorkhatvam, arrogance, tappa emee ledu

  • విజయ్ కుమార్ గారు తొక్కలో రంగనాయకమ్మ అనకండి ఆమె వాదనలో ఎప్పటికి ఇలాంటి అంటే తొక్కలో అనే పదాలు వాడరు ఆమె అంటే నాకు చాల గౌరవం ఆమెని చదవటం మొదలు పెట్టాకనే నాలో చాల మార్పులో వచ్చాయి ఆమె అంబేద్కర్ లో ఏమి చూడ లేకపోయరో మీరు రాయండి మేము చదువుతాము విషయం గా చెప్పండి విషం లాగ కాదు నిజంగా నేను ఎప్పటి నుండో బుక్స్ చదువుతున్నాను ఆమె చూపిన ప్రభావం నా పై ఎవరు చూపించలేదు ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు తగ్గుతున్నాయి సర్కారీ బళ్ళు సరియా నడవవు ఇది చాల ఆందోళన కలిగించే విషయం వెనుక బడిన వర్గాల పరస్థితి గురించి ఆలోచించాలి మనం అంబేద్కర్ దళితులకి చూపిన దారులన్నీ ముసుకు పోతున్నట్లే వున్నాయి మనం మన సమాజం లో వ్యక్తుల గురించి ఆలోచిద్దాం అంబేద్కర్ చాల గొప్ప వ్యక్తి ఎవరు కాదనరు అలాగే రంగనాయకమ్మ గారు చెప్పే కమ్యునిజం చాల దేశాలలో వచ్చింది వెళ్ళింది కనుక అంబేద్కర్ అనాలనే ఉద్దేశ్యం ఆమెకు వూడదు అనే అనుకుంటున్నా అయన సిద్దాంతాల పై ఆమె అభిప్రాయం చెప్పారు అనుకుంటున్నా ఆమెకు అయన పై ద్వేషం ఏమి వుండదు కాని చాలా క్లిష్టమైన పరస్తితులలో కూడా అంబేద్కర్ రంగనాయకమ్మ కూడా తమ సత్తా చాటారు వారిని చదువుదాము

 25. p Sambasivarao says:

  వెంకట్ గారూ. హర్ట్ అవ్వకండి. ఈ తొక్కలోది, తోలులోది, ఈ భాష ఏంట్రా బాబూ అని తల పట్టుకుంటున్నారా? నేను రంగనాయకమ్మని, అంబేద్కర్ని యెక్కడ పోల్చాను అని కామెంట్స్ వెరిఫై చేసుకోకండి. అదంతా వారి శైలీ విన్యాసంలో ఒక భాగమని ముచ్చట పడుతూ వుండాలి. Don’t test his patience my boy! వారికి కిర్రా…క్ తెప్పిస్తే, తొక్కలో మార్క్స్ గాడికి పూజ చెయ్యాల్నా ఏంటి అనికూడా అనగలరు.

 26. Dr. Rajendra Prasad Chimata. says:

  24/8/2015 ఆంధ్ర జ్యోతి 4 వ పేజీ లో రంగనాయకమ్మగారికి జవాబు వ్యాసం, వసంత గారి కి జవాబు కవిత. సారంగ పాఠకులకు కొత్త మేత !!

 27. P.Jayaprakasa Raju. says:

  మార్క్సిజాన్ని నమ్మమని , ఆ లక్ష్యంతో పోరాటం సాగించాలని దానిపై నమ్మకమున్నవాళ్ళు చెపుతుంటారు. ప్రజలెదుర్కొనే అన్ని సమస్యలకు అదే విరుగుడు అని నమ్మే వాళ్ళుంటారు.

  ఆ దారిలో కాకుండా వేరే దిశలో పోరాటం సాగిస్తే ఫలితం వుంటుందనుకుంటే మీరు ఆ మార్గాన్ని నమ్ముకోవచ్చు , లేదా అలా పోరాడేవారికి మీ మద్దతు ప్రకటించవచ్చు , ఎవరూ అడ్డుకోరు గదా ! ఎవరి నమ్మకం వారిది. ఏ మార్గం సత్ఫలితాన్నిస్తుందో ప్రజలు ఆవైపు చూస్తారు. ఒకరు విమర్శించినంతమాత్రాన ఎవరూ విశ్వసించరు. వారి ఆలోచనలు వారికుంటాయి.

  ఏ మార్గం సత్ఫలితాన్నిస్తుందో కాలమే చెపుతుంది.

 28. థూ థూ థూ…
  వాఖ్యలు, ప్రతి వాఖ్యలు సొల్లు కబుర్ల స్థాయికి పడి పొయ్యాయి. వీటిని చూశాక నాకనిపిస్తున్నదేంటంటే “సెల్ఫ్ లవ్”కు ఎవరూ అతీతం కాదని.

 29. అరణ్య కృష్ణ గారు జబ్బు పడి ఆలస్యంగా చదివాను మీ సమాధానం . బావుంది. మనం మాట్లాడు కోవడానికి , ఈ విషయం లో, ఏమీ మిగలలేదని తెలిసింది. ఓడిపోయానని ఒప్పుకుంటూ తప్పుకుంటున్నాను . ఉంటాను.

 30. రాఘవ says:

  “ప్రపంచం లోని దోపిడీశక్తులన్నీ గొప్ప ఐక్యత తోనూ,అద్భుతమైన సృజనాత్మకత తోనూ వర్గపోరాటం సాగిస్తూ ఉన్నాయి.పీడితుల పక్షాన నిలవాల్సిన వాళ్ళు మాత్రం పరస్పర కుమ్ములాటల్లో వాళ్ళ శక్తుల్ని ధారపోస్తున్నారు” -జేమ్స్ పెట్రాస్
  రంగనాయకమ్మ ఇలా మాట్లాడారంటే అందులో కొత్తగా ఆశ్చర్యపోడానికేముంది..? ఆవేదన చెందడానికేముంది? ఆమె ఎప్పట్నుంచో ఇలాగే ఉన్నారు.ముందు ముందు కూడా ఇలాగే ఉంటారు. ఆమె స్వయంగా యుద్ధమేమీ చేయరు గనుక అందులో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సంగతి ఆమెకు బహుశా తెలీదు, తెలిసినా పట్టించుకోరు. పరిమితుల్ని ఉపేక్షించరు. యుద్ధం ఎవరి పక్షాన చేస్తున్నారు అనే దాన్ని బట్టి కొంత పక్షపాతం చూయించాలి గదా అని మనబోంట్లకు అనిపిస్తుంది. కానీ ఆమెకు అలా అనిపించదేమో. ’పరిశుద్ధ శాస్త్రం’ ఏం చెబుతుందో అలా..అచ్చం గా అలా..అలా మాత్రమే యుద్ధం చేయాలంటారు. ఒక్క అంగుళం అటూ ఇటూ అయినా చీల్చి చెండాడేస్తారు. “అయ్యో…కొద్దో గొప్పో ప్రజల పక్షాన వీళ్ళన్నా ఉన్నారు – వీళ్ళ స్థైర్యాన్ని దెబ్బ తీసేలా మాట్లాడితే ఎలా? – ఇదే అదును గా విప్లవ వ్యతిరేకులు పేటేగుతారేమో…ఈమె ఇస్తున్న ఆయుధాల్ని వాళ్ళు అందుకుంటారేమో” అని మనబోంట్లకు అనిపిస్తుంది.కానీ ఆమెకు అలా అనిపించదేమో. విరసం పులుగడిన ముత్యం లా ఉందనీ ,నూరుశాతం కరెక్టుగా ప్రతిచోటా ప్రతి విషయంలోనూ ఉందనీ ఎవరూ అనరు. కానీ ప్రజల పక్షాన తనకున్న పరిమిత వనరులతో,ప్రతికూలత ల నడుమ కూడా పని చేస్తూనే ఉంది కదా. ఆ మాత్రం పని చేస్తున్న మరో సంస్థ ఏదైనా ఉందా ఇక్కడ? ఈ సంస్థ తప్పులు చేస్తోందనుకుంటే అసలా సంస్థనే పనికి మాలిందని అనాలా? లేక మిత్ర వైరుధ్యంతో చర్చించాలా? –
  మరో వైపు నుంచి రంగనాయకమ్మ గారు చెప్పిందాన్ని విని అందులోంచి విమర్శను స్వీకరించి వీలైతే సరిదిద్దుకోవాలి,లేదంటే తమ వాదన చెప్పాలి. అంతేగానీ రంగనాయకమ్మ అనే ఆమె అసలెందుకూ పనికిరాని వ్యక్తి అన్నట్లు మాట్లాడితే ఎలా?
  – ఇంతకీ రంగనాయకమ్మా ఏమీ మాట్లాడటం లేదు,విరసమూ ఏమీ మాట్లాడటం లేదు..మనం మాత్రం చాలా గోల చేస్తున్నాం. దీని వల్ల ఆమె కు గానీ ,విరసానికి గానీ, ఇద్దరికీ గానీ ఏమైనా ప్రయోజనముంటుందా? పీడిత ప్రజల పక్షపు వర్గ పోరాటానికి ఏమైనా ప్రయోజనముంటుందా?

  • నా మనసు లో అనుకుంటున్నమాటలు యథాతం గా రాసారండీ, మీ నోట్లో మిఠాయి పెట్టి, shakehand ఇవ్వాలి.అంత సంతోషంగా ఉంది. మరీ మరీ నచ్చుకున్నవాక్యాలు…
   ‘ అయ్యో…కొద్దో గొప్పో ప్రజల పక్షాన వీళ్ళన్నా ఉన్నారు – వీళ్ళ స్థైర్యాన్ని దెబ్బ తీసేలా మాట్లాడితే ఎలా? – ఇదే అదును గా విప్లవ వ్యతిరేకులు పేటేగుతారేమో…ఈమె ఇస్తున్న ఆయుధాల్ని వాళ్ళు అందుకుంటారేమో”
   రంగనాయకమ్మ గారు చెప్పిందాన్ని విని అందులోంచి విమర్శను స్వీకరించి వీలైతే సరిదిద్దుకోవాలి,లేదంటే తమ వాదన చెప్పాలి. అంతేగానీ రంగనాయకమ్మ అనే ఆమె అసలెందుకూ పనికిరాని వ్యక్తి అన్నట్లు మాట్లాడితే ఎలా?

   • p v vijay kumar says:

    Pls write comments with original IDs and names. Else, no comment wud carry credibility.

 31. రాఘవ గారు బాగా చెప్పారు. జేమ్స్ పెట్రాస్ చెప్పింది నిజం.

  ప్రగతి శీల వాదులకు ఇవాళ ఉమ్మడి శత్రువు కనిపించకపోవటం వల్ల వచ్చిన తంటా ఇది.

  “ప్రపంచం లోని దోపిడీశక్తులన్నీ గొప్ప ఐక్యత తోనూ,అద్భుతమైన సృజనాత్మకత తోనూ వర్గపోరాటం సాగిస్తూ ఉన్నాయి”. ఎందుకంటే వాటికి తమ శత్రువెవరో స్పష్టంగా తెలుసు గనుక. ప్రస్తుతానికి ఆ శత్రువు బలహీనుడే ఆయినా తిరిగి లేవకుండా చేయటానికి వాళ్ళు నిరంతరం జాగరూకతతో ఉన్నారు.

  శత్రువెవరో తెలియనిది పీడితుల పక్షాన నిలవాల్సిన వాళ్ళకె. అందుకే ఇవాళ తెలుగు నెల మీద పరస్పర హరాహరనోద్యోగంలో పీకల దాక మునిగి కొట్టుకొంటున్నారు. దానికి అటూ ఇటూ మినహాయింపు లేదు.

  ఇదే సరిగ్గా అవతలి వాళ్ళకు కావాల్సింది.

  – శశాంక్

 32. Sadlapalle Chidambara Reddy says:

  అన్నొయ్ శానా బాగా రాసిండావు. యర్రగావుండె కొరివి కారం లోకి ఎనుము నెయ్యి ఏసుకొని ఎర్రగడ్డ నంజుకొని ఉడుకుడుకు సంగటి తిన్నట్లున్ది.

 33. ఇవాళ రంగనాయకమ్మ విరసాన్ని విమర్శించారని చాలా కూతలు వినబడుతున్నాయి. అవును, వాటిని విమర్శలని అనకూడదు. ఆ కూతలకి కారణం ఆవిడ విమర్శించారని కాదు. లోపలి కారణం ఆమె విషవృక్షం రాసిందనీ, దళిత సమస్యకి…, రాసిందనీ ఇతరత్రా ఏవో లోపలి కారణాలు. బైటికి కనబడేవి మాత్రం, విరసాన్ని విమర్శించిందనీ, అదనీ, ఇదనీ. ఒక పెద్ద మనిషయితే, మార్క్స్ కాపిటల్ కి పరిచయం మాత్రం ఎందుకు? మొత్తం కాపిటల్ నే అనువాదం చెయ్యకుండా అని! ఆవిడ ఏం రాయలనేది కూడా వీళ్ళే నిర్ణయించాలి! అందరు పాఠకులూ ఇంగ్లీషు కాపిటల్ చదివి వీళ్ళంత అర్థం చేసుకునే తెలివైన వాళ్ళు కాదుగా? అయినా ఒరిజినల్ కాపిటల్ చదవమని అందులోనే రంగనాయకమ్మ రాశారు. తెలుగులోనే ఒరిజినల్ కాపిటల్ దొరుకుతుంది కూడా (విశాలాంధ్ర పబ్లికేషన్స్). మళ్ళీ కాపిటల్ పరిచయం మీదా “నువ్వు మార్క్స్ లోనే తప్పులు కనిపెడతావా” అని రాతలు. మీరు ఇది తప్పుగా రాశారు, అది ఇలా ఉండాల్సింది అని ఒక్కరూ చెప్పరు. ఇందులో బ్రెడ్డు, జామూ, కాఫీ కధ ఒకటి. పోనీ ఈ కూతలు పెట్టేవాళ్ళలో చాలా మందికి విరసం గురించీ, మార్క్సిజం గురించీ పూర్తిగా తెలుసనేది అనుమానమే. దేవుణ్ణి విమర్శించావా, నిన్ను తిడదాం. అంబేద్కర్ని విమర్శించావా నువ్వు దళితులకి వ్యతిరేకం, హిజ్రాలకి ఆత్మగౌరవం నేర్పడానికి ప్రయత్నిస్తావా, నువ్వు వాళ్ళ సమస్యని అర్థం చేసుకోలేదు, నీకేం తెలుసు వాళ్ళ సమస్యలు అంతే. తల్లిదండ్రుల్లో కూడా ఎంతెంత దొంగలుంటారో రాస్తే దాని మీద పత్రికలో అంతగా లేఖలు లేవు. అయితే వానలో నలుగురు బూతు కధ రాస్తే దానికి ప్రశంసలు. కథలోని స్త్రీని ఎంత అవమానించి రాసినా ఏ స్త్రీవాదులూ కనపడరు. తన వ్యక్తిత్వాన్నే సరిచేసుకోని వ్యక్తిత్వ వికాస నిపుణుడికి డాక్టరేట్ ఒకటీనూ. రంగనాయకమ్మ శ్రీశ్రీనీ, చలసాని ప్రసాద్ నీ ఎవ్వరినీ విమర్శించకూడదు. ఏమిటీ ఈవిడ అందర్నీ విమర్శిస్తుందా అని చిందులు. ఇక మీదట శ్రీశ్రీని విమర్శించాలంటే ఆయన జయంతి ఉత్సవాల వాళ్ళనీ, విరసాన్ని విమర్శించాలంటే విరసం సభ్యుల్నీ అడిగి మరీ విమర్శించాలి కాబోలు. విమర్శకి ప్రతివిమర్శ ఎక్కడో గానీ కనపడదు. మిగిలినవంతా కడుపుమంట, దుగ్ధ, అసూయా, ద్వేషాలే.

  బైటికి కనబడే సమస్యలకి కారణం శ్రమదోపిడీలాగానే, బయటికి వినబడే కూతలన్నీ (విమర్శలు కాకుండా ఉన్న కూతలు) లోపలున్న ద్వేషంనించి పుట్టేవే. వాటికి కారణాలు కూడా రామాయణాన్ని విమర్శించిందనీ, ఇంకోటనీనూ. రంగనాయకమ్మ లవ్స్ రంగనాయకమ్మ అట! ఒకప్పుడు తను రాసిన పుస్తకాలని తనే విమర్శించుకునే మనిషి మీద ఈ అవాకులూ, చవాకులూ. విమర్శించే ముందు కళ్ళూ, చెవులే కాదు మెదళ్ళు కూడా మూసుకుపోతాయేమో ! – విజయ, బొబ్బిలి

  • hariprasad.g says:

   చాలా చక్కగా రాశారు విజయ గారు

  • స్వాన్ says:

   నేను ”కళ్ళు తెరచిన సీత” సీరియల్ వస్తున్నప్పటి నుండి నవ్య వీక్లీ లో రంగనాయకమ్మ గారి పుస్తకాల గురించి నవ్యలో, ఆంధ్ర జ్యోతి లో వచ్చే ప్రతి ఆర్టికల్ చదువుతూనే ఉన్నాను. ”రామాయణ విషవృక్షం” బుక్ కొని చదివాను. నాకు రంగనాయకమ్మ గారి రచనలు అభిప్రాయాలూ బాగా నచ్చాయి. మంచి మానవ విలువలు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. k.విజయ గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. విజయా గారు నేను మీలాగే రంగనాయకమ్మ గారి అభిమానిని. ప్రస్తుతం వస్తున్న సీరియల్ ”దొంగ తల్లిదండృలున్నారు జాగ్రత్త” చదువుతున్నాను. ఎక్కువ మంది రాయటానికి ఇష్టపడని సబ్జెక్ట్ మీద చక్కగా రాస్తున్నారు. నిజంగా రాముడి గురించి, తల్లి ప్రేమ గురించి వ్యతిరేకంగా రాసే ధైర్యం ఎంత మంది రచయితలలో ఉంటుంది చెప్పండి. కానీ పిల్లల్ని చంపే వాళ్ళు, చిత్రహింసలు చేసేవాళ్ళ గురించి రోజూ న్యూస్ లో చూస్తూ కూడా ఏ రచయితా ఇలాంటి నవలలు రాయటానికి ఇష్టపడరు. Really rangaji medam is so… greart.

  • స్వాన్ says:

   k.విజయ గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. విజయా గారు నేను మీలాగే రంగనాయకమ్మ గారి అభిమానిని. ప్రస్తుతం వస్తున్న సీరియల్ ”దొంగ తల్లిదండృలున్నారు జాగ్రత్త” చదువుతున్నాను. ఎక్కువ మంది రాయటానికి ఇష్టపడని సబ్జెక్ట్ మీద చక్కగా రాస్తున్నారు. నిజంగా రాముడి గురించి, తల్లి ప్రేమ గురించి వ్యతిరేకంగా రాసే ధైర్యం ఎంత మంది రచయితలలో ఉంటుంది చెప్పండి. కానీ పిల్లల్ని చంపే వాళ్ళు, చిత్రహింసలు చేసేవాళ్ళ గురించి రోజూ న్యూస్ లో చూస్తూ కూడా ఏ రచయితా ఇలాంటి నవలలు రాయటానికి ఇష్టపడరు. Really rangaji medam is so… greart.

  • హంస లేఖ says:

   k.విజయ గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. విజయా గారు నేను మీలాగే రంగనాయకమ్మ గారి అభిమానిని. ప్రస్తుతం వస్తున్న సీరియల్ ”దొంగ తల్లిదండృలున్నారు జాగ్రత్త” చదువుతున్నాను. ఎక్కువ మంది రాయటానికి ఇష్టపడని సబ్జెక్ట్ మీద చక్కగా రాస్తున్నారు. నిజంగా రాముడి గురించి, తల్లి ప్రేమ గురించి వ్యతిరేకంగా రాసే ధైర్యం ఎంత మంది రచయితలలో ఉంటుంది చెప్పండి. కానీ పిల్లల్ని చంపే వాళ్ళు, చిత్రహింసలు చేసేవాళ్ళ గురించి రోజూ న్యూస్ లో చూస్తూ కూడా ఏ రచయితా ఇలాంటి నవలలు రాయటానికి ఇష్టపడరు. Really rangaji medam is so… greart.

 34. b.ramnarayana says:

  చాల చక్కగా చెప్పారు విజయ గారు ! హాట్స్ ఆఫ్.

 35. నీహారిక says:

  @ vijaya,
  2008 నుండీ బ్లాగులు చదువుతున్నాను ఆడవాళ్ళల్లో మీలా ఇంత నిష్పక్షపాతంగా విమర్శించినవారిని ఇంతవరకూ చూడలేదు. .
  Nice to meet you !

 36. చాలా సరైన శ్రుతిలో అందుకున్నారు విజయగారూ,
  యీ మొండి బండ గొంతులతో మేం పాడిందే పాటరా అనే గీరగాళ్ళూ, చిడతలు మోగించుకుంటూ భట్రాజు గణం…చెవులు కన్నాలు పడిపోయాయండీ.పొరపాటున ఏదైనా తర్కసహితమైన వ్యాఖ్యానం కనబడిందో, ఘంటాకర్ణుడిలా తలలుఊగించేసి గోలగోల చేసేస్తున్నారు… … ‘హిజ్రాలకి ఆత్మగౌరవం నేర్పడానికి ప్రయత్నిస్తావా’ అని కాకపోతే ఏమిటి వీళ్ళకంప్లైంట్?
  వ్యభిచారం సమస్యకీ పేదరికానికీ సంబంధం ఉందంటేనూ, transgender లను స్వలాభం కోసం జబర్దస్తీగాముష్టి ఎత్తిస్తున్నారనీ రాస్తే అది ద్రోహమట. రంగనాయకమ్మకు వారంటే సానుభూతి లేదట! ‘అయ్యోపాపం’ అనేస్తే వారి సమస్య తీరిపోతుందా?నిజమైన concern ఉండడం చేతనే ఆమె వారి విషయం రాస్తున్నది, అన్నఇంగితం కూడా లేదు.

 37. Sarala Kumari says:

  చక్కగా చెప్పారు విజయ కే గారు.. ఇది సరిపోదు.. ఇంకా వాయించేయాలి .. ఈ చెత్త వాగుళ్ళకి రంగనాయకమ్మ గారే సమాధానం చెప్పగలరు.
  మళ్ళీ ఇంతోటి ఈ తొక్కలో వ్యాసానికి చాలెంజులు, గెడ్డం గీకేసుకుంటారట. Yes రంగనాయకమ్మ గారి ద్వారా ఇన్స్పిరేషన్ పొంది నాకు నా భర్త చేస్తున్న అన్యాయాన్ని ఎందిరించి నిలిచి నా జీవితాన్ని కాపాడుకున్న వారిలో నేను ఉన్నాను. నేను మనిషిగా మిగలడం లో రంగనాయకమ్మ గారి రచనలు నాకెంతో సహకరించాయి. ఇప్పుడు మరి గెడ్డం గీకేసుకుంటాన్నారా లేదా ?? వెయ్యి రూపాయలు ఎవరు ఎక్కడ ఎలా అందజేస్తారో చెప్పగలరు.
  ఏదయినా విమర్శ ఉంటె విమర్శ గానే రాయచ్చు. కానీ ఈ వ్యంగ్యాలేంటి మధ్యలో అర్ధం పర్ధం లేని చెత్త వాగుడులాగా ఉంది తప్ప ఇంక ఏ ప్రయోజనం లేదు. రంగనాయకమ్మ గారు విరసం ని విమర్శించినందుకు విరసం వాళ్ళు ఎవ్వరు కుడా ఆమెని ఏమీ అనలేదు ఎక్కడా కుడా..!! పైపెచ్చు వాళ్ళే ఆత్మ విమర్శా చేసుకున్నారు కుడా. ఖండించాలి అనిపించినా వారు ఖండించారు కానీ ఎక్కడా ఆఖర్లేని చెత్త వాగుడు ఎవరు వాగలేదు.
  దేశం లో రోజు రోజు కీ ఇన్ని అన్యాయాలు మితి మీరి పోతుంటే అవ్వన్నిటి గురించీ ఇంత శోధన చేసి రాయాలి అని వీరికి ఏమి అనిపించలేదు . తీరిగ్గా కుర్చుని చాలా మంచి పని చేస్తునట్టు రంగనాయకమ్మ మీద పిచ్చి కూతలు మొదలెట్టారు. ఒక ఆడదానికి ఇంత తెగింపా, ఇంకా చంపకుండా వదిలేసమేంటా అని ఏడుపుతో ఇదంతా వెల్లగక్కుతూనే ఉంటారు. వీళ్ళు మాత్రం ఏది తోస్తే అది రాసి ఎక్కడ పడితే అక్కడ పోస్టింగులు చేస్తూ గుంపుల్ని పోగేసుకుంటూ ఉంటారు. కానీ రంగనాయకమ్మ గారు మాత్రం రాయకూడదు. మనం మాత్రం మన అభిప్రాయాల్ని రాయకూడదు. ఆడవాలం కదా నోర్ముసుకుని ఉండాలి. అభిమాన కోటి కి దండాలు అంటున్నారు. కోటి మంది అభిమానులు ఉన్నారంటే పనికి రాని రాతలు రాస్తేనే అభిమానులు వచ్చార?

  • Vijay Kumar P V says:

   దేవుడా , I havnt observed all this and amused to see that still people are getting irritated on this article . వాయించేయండి…వాయించేయండీ…..:)… ..ఏ మాత్రం బుర్రతో ఆలోచించకుండా వాయించెయండి…వాయించేయండి…

 38. avula venkata subrahmanyam says:

  నేను కూడా ఇంజనీరింగ్ చదువు నుంచి రంగనాయకమ్మ రచనాశైలి ప్రస్నిన్చేతత్వం వలన ఎంతో నేరుచుకొన్నాను. ప్రజా సాహితి లో వచ్చిన అంకుల్ తోమ్స్ కేబిన్ నవల మరియూ వివిధ శీర్షికలు నాలో సామజిక స్పృహ ను కలిగించారు ఇప్పుడు ఆంధ్ర జ్యోతి లో వస్తున్న దొంగ తల్లితండుర్లు ఉన్నారు జాగ్రత్త నవల మా ఇంటిలో అందరు చాల ఆసక్తిగా చదువుచున్నాము

 39. ప్రవీణ్ కుమార్
  పాలకవర్గంవాళ్ళు స్కూల్ పుస్తకాలలో సంఘసంస్కర్తల గురించి వ్రాస్తోన్నా నిజజీవితంలో విధవావివాహాలు జరగడం లేదు. వాళ్ళు విధవావివాహాలు నిజంగా జరగవు అనే నమ్మకంతోనే ఆ పాఠాల్ని స్కూల్ పుస్తకాల్లో వ్రాస్తున్నారు. ఇందియాలో కమ్యూనిజం వచ్చేంత వరకు విధవావివాహాలు జరగవు.

  హరిబాబు సూరానేని
  భలేగా ఉందీ లాజిక్:-)ఈ భూ ప్రపంచంలో ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ఇట్లాంటి లాజిక్కులు పీకగలడనుకుంటాను.దీన్ని ప్రవీణిజం అనాలా?మళ్ళీ దెనికి తెలంగాణాకీ ముడిపెట్టాడు?

  అంటే,ఆదవాళ్ళు చీరలూ కట్టడం లేదని రూఢిగా తెలిశాకే పాఠ్యపుస్తకాల్లో పోచంపల్లి గురించీ పట్టుచీరల గురంచీ రాస్తున్నారా?అంటే జనం పండగలు చేసుకోవడం మానేశారని తెలిశాకనే పండగల గురించి రాస్తున్నారా?

  ఈ ప్రవీణ్ అనే వ్యక్తి రంగనాయకమ్మ్మ పుస్తకాలు చదవటం వల్ల మరియూ మార్క్సిజం చదవటం వల్ల మాత్రమే ఇలాంటి తింగరి లాజిక్ ఇతని బుర్రలోకి వచ్చిందని ఎవరయినా రుజువు చెయ్యగలిగితే చాలు మార్క్సిజం అనేది ఎంత ప్రమాదకరమైన భావజాలమో జనానికి తెలిసి దాని గురించి కనీసం తెలుసుకోవడానికి కూడా భయపడతారు

  ఓ మై గాడ్?నేను మురమ్నా పుస్తకం ఒక్కటి కూడా పూర్తిగా చద్వలేదు,భగవంతుడి అద్య వల్ల!!

 40. దేవుడి పైన భారం వేసి జీవనం సాగించడానికి ఎంతో అద్రుష్టం వుండాలి . ఈ మార్క్సిజం , క్యాపిటల్ చదివి బుర్ర బ్రద్దలు కొట్టుకోవడం , వాటిని గురించి ఆలోచించడం శుధ్ధ దండగ . చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష అనుకుని , ప్రపంచం ఎటుపోతే నాకేమి అనుకుంటూ హాయిగా జీవించాలి . “ వస్తే రానీ ! కష్టాల్ , నష్టాల్ , కోపాల్ , తాపాల్ , శాపాల్ ” , అన్నిటికీ ఆ దేవుడే వున్నాడనుకొని కాలం గడపటం ఎంత హాయి !! అప్పుడప్పుడు లోకం భ్రష్టుపట్టి పోతోంది అనుకుంటూ , నాలుగు మాటలు ఇతరులతో పంచుకుంటూ , మనం కూడా ఈ జనంలో ఒకళ్ళమే అనుకుని బ్రతకాలి !!!

  • manjari lakshmi says:

   చాలా బాగా రాసారు జయప్రకాశ్ రాజు గారు. మీ దగ్గర కుడా ఇంత వ్యంగ్యం ఉందని ఇప్పుడే తెలిసింది.

 41. పూర్తి మార్క్సిస్టు దృక్పధంతో ఉన్న సంఘం ఏదీ లేదు అని ఒక డిస్క్లైమర్ పారేసి తను ఏ ఒక్క వాస్తవికమైన పోరాటంలోనూ పాల్గొనకుండా తప్పించుకుంటూ అమరకోశం నిఘంటువుల నుంచి తెచ్చుకున్న నిషిధ్ధాక్షర పాండిత్యాన్ని అవధానుల మీద ప్రదర్శించి చప్పట్లు కొట్టించుకునే పండితమ్మన్యుల మాదిరి తనలా కాకుండా గట్టిమేల్ తలపెట్టడానికి పోరాడుతున్న సాటి విపలవకారిలకి తలంటు పఓసే రంగనాయకమం చేస్తున్నది కూడా అదే అనాని తెలియకపోతే ఈ వ్యంగ్యం నాకు మాత్రమే తగుల్తుంది.కానీ నేను “ఓ మై గాడ్” అనుకుంటున్నట్టు “ఓ మై మి” అనుకుంటుంటూ ఉంటారు మూరమ్నా గారు అని తెలిస్తే మీరు కొడుతున్నవ్యంగ్యం నాకన్నా మీ అభిమాన రచయిత్రికే అది వర్తిస్తుందని తెలుస్తుంది”-)

  ఎవరో ఆవిడ మార్క్సునీ మావోనీ విమర్శించకుండా వొదిలేస్తుందని చాలా అపఓహలో ఉన్నట్టున్నారు.సీతారాముల నచ్చలేదంటే అవి నాన్ కమ్యునిస్టులు పాటించే ఐడియల్సు గాబట్టి నచ్చలేదనుకోవచ్చు, కానీ దానికి భిన్నమైన మావో దంపతులు పాటించిన స్వేచ్చా ప్రణయాన్ని కూడా “చీ ఛీ గ్లాసుడు మంచినీళ్ళ సిధ్ధాంతం,యాక్ ధూ!” అని చీత్కరించుకుంది.ఇటు సీతారాముల దాంపత్యమూ నచ్చక అటు గ్లాసుడు మంచినీళ్ళ సిధ్ధాంతమూ నచ్చక ఈవిడ దాంపత్యానికి ప్రత్యేకమైన సూత్రాలు ఏమైనా చెప్పిందా అంటే అదీ లేదు.

  మద్దెల కటో దెబ్బ ఇటో దెబ్బా అనంటూ రాముణ్ణీ తిడుతుంది మావోనీ తిడుతుంది – తిట్టడమే ఆవిడ పంధా.”MR” అని పరవశించి పోయే వీరభక్తులు శ్రీ శ్రీలాంటివాళ్ళకి వాళ్ళ భిమానులు చేసే వీరపూజని మాత్రం వ్యతిరేకిస్తారు,అదే విచిత్రం:-)

  P.S:అన్నిటికీ ఆ దేవుడే వున్నాడనుకొని కాలం గడపటం ఎంత హాయి !! అప్పుడప్పుడు లోకం భ్రష్టుపట్టి పోతోంది అనుకుంటూ , నాలుగు మాటలు ఇతరులతో పంచుకుంటూ , మనం కూడా ఈ జనంలో ఒకళ్ళమే అనుకుని బ్రతకాలి
  దాన్ని ఇలా మారిస్తే
  అన్నిటికీ ఆ మార్క్సే వున్నాడనుకొని కాలం గడపటం ఎంత హాయి !! అప్పుడప్పుడు సాటి కమ్యూనిష్టు లంతా భ్రష్టుపట్టిపోతున్నారని అనుకుంటూ , నాలుగు మాటలు ఇతరులతో పంచుకుంటూ , మనం కూడా పొడిచేస్తున్నాం అనుకుని బ్రతకాలి
  మురంనా జీవన విధానం :-)

 42. సామాజిక మార్పు కోరేవారు ఇన్ని చీలికలు , పేలికలు కావడం ఎందుకు , అందరూ మార్క్సిస్టు ద్రుక్పధం తోనే ఆలోచన , ఆచరణ సాగించాలనుకుంటారుగదా !
  ఉద్యమంలో పాల్గొనేవారు మాత్రమే వ్రాయాలా ? ఉద్యమంలో పాల్గొనేవారు కొందరయితే , ప్రజలను చైతన్యపరిచేవారు కొందరుంటారు.
  ప్రజల బాగు కోసం పనిచేసేవారు , ఆలోచించేవారు , వారి జీవితంలో పొరపాట్లు జరిగితే , వాటిని ఎత్తి చూపడం తప్పెలా అవుతుంది ?
  వీరభక్తులు వుండేది దేవుళ్ళకి , రచయితలకు అభిమానులు మాత్రమే వుంటారు.
  నిజమే. కమ్యూనిష్టులు భ్రష్టుపట్టిపోతున్నారని బాధపడుతూ , మనమేమి చెయ్యలేకపోతున్నామే అనికూడా అనుకుంటాం. కాని దీనికి కారణం దేవుడో , ఖర్మో అని మాత్రం అనుకోము.

 43. జప్రకాశ్
  ఉద్యమంలో పాల్గొనేవారు మాత్రమే వ్రాయాలా ? ఉద్యమంలో పాల్గొనేవారు కొందరయితే , ప్రజలను చైతన్యపరిచేవారు కొందరుంటారు.
  ప్రజల బాగు కోసం పనిచేసేవారు , ఆలోచించేవారు , వారి జీవితంలో పొరపాట్లు జరిగితే , వాటిని ఎత్తి చూపడం తప్పెలా అవుతుంది ?
  హరిబాబు
  పనిగట్టుకుని పూర్తి మార్క్సిస్టు దృక్పధంతో పని చేసే సంఘం లేదు అని ఒక డిస్క్లెయిమర్ పారేసి ఏ పనీ చెయ్యకపోవడం కూడా సమర్ధనీయం అయితే ఇంక ఆ భావజాలం ద్వారా ఎవర్ని ఎడ్యుకేట్ చేస్తున్నట్టు?

  ఆవిడ వాదనలో ఉన్న అసలైన మెలిక నాకు అర్ధ్మయింది,ఆవిణ్ణి సమర్ధిస్తున్న వారికే అర్ధం కావటం లేదు!

  పూర్తి మార్క్సిస్టు దృక్పధం ఉన్న సంస్థ గాలిలో నుంచి పుట్టుకు రాదు కదా సారూ?
  మాటా గాలిలోనుంచి పుట్టుకు రాదు,బాటా గాలిలోనుంచి పుట్టుకు రాదు:-)
  తను అందుకు పూనుకోవటం లేదంటే తనకి కూడా అది లేదని ఒప్పుకుంటున్నట్టా!

 44. వృద్ధుల కల్యాణ రామారావు says:

  రంగనాయకమ్మ లవ్స్ రంగనాయకమ్మ ఎంత నిజమో మనం అందరం లవ్ మన అందరం respectively . ఆమె చెప్పిన కొన్ని నిజాల మీద విమర్శ కష్టం కాబట్టి, ఆమె చెప్పిన విధానం మీద, ఆమె వ్యకిత్వం మీద కొందరు దాడి చేస్తున్నారు. ఆమె మీద దాడి తీవ్రతే ఆమె వ్రాసినదాంట్లో నిజాలను చెప్తున్నాయి.

  • p v vijay kumar says:

   వ్యక్తిత్వం మీద దాడి…అన్నదిఎక్కడ కనిపించింది మీకు ? ఆమె వ్యక్తీ గత జీవితం మీద గాని , ఆమె వ్యక్తిగత ప్రపంచంలోని వ్యక్తుల మీద గాని ఎవన్నా రెఫెరెన్సెస్ కనిపించాయా మీకు ?

   సోదాహరణంగా వివరిస్తారా ?

 45. వృద్ధుల కల్యాణ రామారావు
  ఆమె చెప్పిన కొన్ని నిజాల మీద విమర్శ కష్టం కాబట్టి, ఆమె చెప్పిన విధానం మీద, ఆమె వ్యకిత్వం మీద కొందరు దాడి చేస్తున్నారు. ఆమె మీద దాడి తీవ్రతే ఆమె వ్రాసినదాంట్లో నిజాలను చెప్తున్నాయి.

  హరిబాబు సూరానేని
  ఆవిడకి కమ్యునిష్టు సిధ్ధాంతం బాగా తెలిసి ఉండవచ్చు, ఎక్కువగా చదివితే/బాగా రుబ్బితే ఎవరు దేనిలో నయినా మంచి పాండిత్యం సంపాదించవచ్చును.నా సబ్జేక్తు కాకపోయినా ఆసక్తి కొద్దీ చదివినందువల్ల నాకు సైకాలజీకి సంబంధించి మంచి పరిజ్ఞానమే ఉంది.కానీ తనకి సైన్సులో ఎంత పాటి నాలెడ్జి ఉందని కొకు “బుధ్ధికొలత” వ్యాసాల్ని చేతబడి లాంటి మూఢనమ్మకంతో పోల్చింది?కొకు జీవిత కాలం అక్టోబర్ 1909 నుంచి ఆగస్టు 1980.1905 తర్వాత్ రెలేటివ్ క్వాంటం ధియరీ ప్రాచుర్యం లోకి వచ్చాక ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ప్రతిపాదించబడిన నూతన సిధ్ధాంతాల గురించి మీకెవరికయినా తెలుసా?మీరు ఇప్పటికిప్పుడు నేను “ఈ విశ్వాన్ని ఎన్ని కొలతలతో వర్ణించగలరు?” అని అడిగితే ఠక్కున “మూడు!పొడవు,వెడల్పు,ఎత్తు/లోతు” అనేస్తారు,అవునా?రిలేటివిటీ గురించి గనక కొంచెమయినా తెలిస్తే తైం-స్పేస్ కంటిన్యువం గుర్తొచ్చి నాలుగు అంటారు.కానీ 1920ల నుంచీ ఈ విశ్వానికి 10 నుంచి 12 డైమెన్షన్లు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అంగీకరించి వాటి గురించి పరిశోధనలు చేస్తున్నారు.ఒక బ్రాంచ్ ప్రకారం ఉన్న 10 డైమెన్షన్లలో ఆఖరు దాన్ని “The Tenth Dimension: Infinite Possibilities” అని అన్నారు. కొకు బుధ్ధికొలత వ్యాసాలు నేను చాదవలేదు గానీ వాళ్ళు చెప్పిన నిర్వచనం మనం ఉన్న విశ్వాన్ని ఇప్పుడు శాస్త్రజ్ఞులు కూడా ఉన్నాయని ఒప్పుకున్న అనంతకోటి విశ్వాలతో కూదా కలిపి అర్ధం చేసుకోవటం అనే విధంగా ఉంటుంది. కొకు నిజంగానే తన బుధ్ధికొలత వ్యాసాలలో చేతబడినీ బాణామతినీ సమర్ధించి ఉంటే నేను కూడా మురమ్నా విమర్శ కరెక్తే అని ఒప్పుకుంటాను గానీ అలా కానట్లయితే తనకి తెలిసిన పదో క్లాసు చదువుతో ఆగిపోయిన నాలెడ్జితో ఇప్పటికీ ఆమె సైన్సుకి సంబంధించిన బుధ్ధికొలత వ్యాసాల్ని గురించి కనీసం విమర్శ కూడా అనిపించని తిట్లదండకం చదవటం ఎంతవరకు సబబు?

  ఇది సైన్సుకి సంబంధించిన విసహ్యం గనక తొందరపడి నాకు శత్రుభావం అంటగట్టకుండా మీ అంతత మీరు కొకు వ్యాసాల్నీ సైన్సు చెప్తున్న కొత్త దైమెన్షన్లనీ పోల్చి చూచూసి కొకుని గానీ నన్ను గానీ తప్పు పడితే అప్పుడు అది శాస్త్రీయమైన విమర్శ అవుతుంది,ఆలోచించండి. ఒకవేళ వాటికి ఆధారాలు లేకపోయినా స్ట్రింగ్ ధియరీని ప్రతిపాదించి,కొంతకలం దాన్ని సమర్ధించుకుంటూ వాదనలు చేసి,తర్వాత తనే వెనక్కి తీసుకున్న స్త్రింగ్ ధియరెని ప్రతిపాదించిన వ్యక్తినీ గుర్తుకు తెచ్చుఓండి.కమ్యునిష్టు అంతే ఎంతసేపూ,పెట్టుబడి,అదనపు విలువ,శ్రామికులూ వరకే పరింతమవాలా?సైన్సు గురించి కొత్త ఆలోచనలు చెయ్యటాన్ని మీఎ ఎజెండానుంచి తొలగించేసారా?

  “మీరు నడుస్తున్న దారిలో ఒక గోడ అడ్డం ఉండి దానిమీద మీరు ముందుకు వెళ్ళదలచినచో దీనిని యెక్కి దిగవలేను అని బోర్డు ఉంటే ఒక కమ్యునిష్టు లేక హేతువాది ఎలాగొలా ఒక నిచ్చెన తనంతట తను తయారు చేసుకునో,ఎక్కడినుంచయినా తెచ్చుకునో సుబ్బరంగా ఎక్కి దిగేసి వెళ్ళిపోతాడు,కానీ హిందూ సన్యాసి/ముస్లిం ముల్లా/క్రిస్టియన్ సెయింట్ అయితే గోద ముందు మఠం వేసుకుని కూర్చుని దౌవప్రార్ధన చేస్తూ ఊర్చుంటాడు యేళ్ళు అగడిచినా నా దేవుడు వస్తాడు నన్ను పైకెక్కిస్తాడు కిందకి దించుతాడు అంటాడు.” – ఇది సాధార్నంగా మీరు/మురమ్నా ఆధ్యాత్మికవాదుల్ని వెక్కిరించటానికి వాడే ఒక సన్నివేశంలా ఉంది కదూ,అవునా? పూర్తి మార్క్సిష్టు దృక్పధంతో నడుస్తున్న సంస్థ యేదీ లేదు గాబట్టి నేను ఇప్పుడున్న వాటిల్లో ఏ సంస్థలోనూ చేరటం లేదని మురంనా చెప్పడం కూడా సరిగ్గా ఆధ్యాత్మికవాదులు చెప్పే సాకులాగానే ఉంది:-)

  పింగళి నాగేంద్రరావు ఆణిముత్యం లాంటి ఒక మాట అన్నాడు,”ఎవరూ పుట్టించకపోతే మాటలు ఎలా పుదతాయి” అని!దాన్నే మీ విప్లవ కార్యాచరనకి అప్లై చేసుకుంటే “ఎవరూ స్థాపించకపోతే పూర్తి మార్క్సిష్టు దృక్పధం ఉన్న సంస్థలు ఎట్లా పుదతాయి!” అని తెలుస్తుంది,అవునా? ఇప్పుదున్న వాటిల్లో అలాంటిది లేదు అని తెగేసి చెప్పిన మనిషికి అలాంటి సంస్థ ఎలా ఉండాలో కూడా ఒక అవగాహన ఉండి ఉండాలి కదా!లేదు అని తెలిసినప్పుదు తను ఎందుకు ప్రారంభించలేదు? ఈ మహా ఘనత వహించిన ముప్పాళ రంగనాయకమ్మ రంగప్రవేశం చేసి ఆ సంస్థనీ తద్వారా సమాజాన్నీ ఉధ్ధరించెయ్యటం కోసం వేరే ఎవరో పూర్తి మార్క్సిష్తు దృక్పధం ఉన్న సంస్థని ఏర్పాటు చేసి ఆహ్వానపత్రాలతో ఎదురుకోళ్లతో పిలిస్తే పిలిస్తే మళ్ళీ ఈవిడ వాళ్ళు రాసుకున్న రూల్సు నన్నిట్నీ ఎన్నో అగ్నిపరీక్షలకి గురిచేసి సరిచూసుకుని తనకి అన్నీ నచ్చితేనే అందులో చేస్రి పని చేస్తుందన్నమాట?! ఆధ్యాత్మికవాదులే నయం,వాళ్లపాటికి వాళ్ళు ప్రార్ధనలు చేసుకుంటూ కూర్చుని వేఅరేవాళ్ళు నిచ్చెనలూ గట్రా తెచ్చుకుని యెక్కిపోతుంటే తమకి పట్టనట్టు ఉండగలరు – ఈవిడ లాగా తను యెక్కనూ యెక్కక యెక్కేవాళ్లని కూడా కిందకి లాగుతూ హదావిడి చెయ్యరు!

  విప్లవ దివాళాకోరు తనం అంటే ఇదే!దీనికే ఆమెని మీరు అభిమానిస్తున్నారు అనుకుంటాను.వరవరరావుల్నీ చెరబందరాజుల్మీ వేధించే ప్రభుత్వాలు మురమ్నాని ముట్టుకోకపోవడానికి కారణం ఆవిడలోని విప్లవ దివాళాకోరుతనం తన్మకు ఏమాత్రం ప్రమాదకరం కాదని మీకన్నా స్పష్తంగా అర్ధం కావడమే!

  ఆల్ ది బెస్ట్ ది.వి.ర అభిమానులూ:-)
  P.S:”ఆమె మీద దాడి తీవ్రతే ఆమె వ్రాసినదాంట్లో నిజాలను చెప్తున్నాయి.” – ఇంతకన్నా పరమ చెత్త లాజిక్ ఇంకోటి ఉండదు:-)

 46. వృద్ధుల కల్యాణ రామారావు says:

  హరిబాబు సూరానేని గారు PS క్రింద నా వ్యాఖ్య లోని లాజిక్ గురించి ఉపయోగించిన బాష నాకెంతో ఆనందం కలిగించింది. ముఖ్యంగా సైకాలేజీ పరిజ్ఞానం వారికి ఈ విషయంలో తోడ్పడి ఉండవచ్చు.

 47. వృద్ధుల కల్యాణ రామారావు says:

  రావిశాస్త్రి గారి బంగారి గాడు ‘ తెలకడిగినదానికి అంతరాద్దాంతం ఏటి’ అని అడిగేడు సూర్రావ్వే డ్డు ని. అలాగే నేనూ అడుగుతున్నాను: ” తెలక రాసిందానికి అంత రాద్దాతం ఏటి? “

 48. దెయ్యాలు లాంటి మూఢనమ్మకాలని వ్యాప్తి చేసి జనాన్ని ఆ మత్తులో ముంచితే, ప్రభుత్వం ఇక విరసాన్ని వేధించదు. వర్గ సహకారం చేస్తున్నది విరసమే అని అర్థం కావడం లేదా?

 49. అబ్బ ! ఎంత బాగా విమర్శిస్తున్నారో అందరూ రంగనాయకమ్మగారి గురించి ! బుద్ధికొలత వ్యాసాల్ని విమర్శించడానికి సైన్స్ బాగా తెలియాలి. కామన్ సెన్స్ వుంటే సరిపోదు. రాకెట్లు వొదిలేవాళ్ళు కూడా (దీపావళి రోజున కాదండోయ్!) నమ్ముతుంటే, మనం వాళ్ళకన్నా గొప్పవాళ్ళా ఏమిటి? వాళ్ళకి ఎంత సైన్స్ తెలుసో కదా ? వాళ్ళే బాబాల దగ్గరికీ, స్వాముల దగ్గరికీ వెళుతుంటే మనం ఏపాటి? అసలు న్యూటనూ, ఐన్స్ టీనూ కూడా దేవుళ్ళని నమ్మారని చరిత్ర చెప్పడం లేదూ మరి ? వాళ్ళకి భౌతిక శాస్త్రమూ తెలుసు, దెయ్యాల దేవుళ్ళ శాస్త్రమూ తెలుసు. అందుకని మనం కూడా వాళ్ళ తోక పట్టుకుని వాళ్ళ వెనకే వెళదాం. రంగాజీ గారూ, మనకి క్వాంటమ్ థియరీ, స్ట్రింగ్ థియరీ తెలియవు గనక, మనం ఇక మీదట ఆ గొప్ప మాటల్నీ, రచయితల్నీ…. అబ్బ విసుగొస్తోంది , మన టైం వేస్ట్ అయిపోకుండా ఆ టైం ని వేరే పనుల మీద పెడదాం. విజయ కె, బొబ్బిలి

 50. p.sambasiva rao says:

  విజయ గారు. బాగా చెప్పారు.
  Facebook లో ఉన్నారా?
  నిద్ర నటించే వారిని లేపడం కష్టం అన్నది తెల్సిందే కదా! ఒక రైటర్ ని విమర్శించే ముందు వారి పుస్తకాలు పూర్తిగా , సమగ్రం గా చదవాలి అనే కామన్ సెన్స్ లేని వారూ సైన్సు గూర్చి మాట్లాడే వారే!
  తను ఎప్పుడో వదిలేసిన ఇంటిపేరు మళ్ళీ జోడిస్తూ, ఆవిడని వెటకారంగా సంభోదించే మనుషులకి కనీస సంస్కారం ఉందని భావిస్తూ, మనం జవాబు చెప్తూ ఉండాలా?
  నిజమే! మన టైం వేస్ట్ కాకుండా వేరే పనుల మీద పెడదాం.

 51. సాంబశివరావుగారూ,నేను facebook లో లేను. కానీ “రంగనాయకమ్మ గ్రూప్”-ని చూస్తూవుంటాను, నా కజిన్ ఎకౌంటు-ని ఉపయోగిస్తూ.

 52. P1:వృద్ధుల కల్యాణ రామారావు
  హరిబాబు సూరానేని గారు PS క్రింద నా వ్యాఖ్య లోని లాజిక్ గురించి ఉపయోగించిన బాష నాకెంతో ఆనందం కలిగించింది. ముఖ్యంగా సైకాలేజీ పరిజ్ఞానం వారికి ఈ విషయంలో తోడ్పడి ఉండవచ్చు.

  P2:VIJAYA K
  అబ్బ ! ఎంత బాగా విమర్శిస్తున్నారో అందరూ రంగనాయకమ్మగారి గురించి ! బుద్ధికొలత వ్యాసాల్ని విమర్శించడానికి సైన్స్ బాగా తెలియాలి. కామన్ సెన్స్ వుంటే సరిపోదు.

  P3:P.SAMBASIVA RAO
  తను ఎప్పుడో వదిలేసిన ఇంటిపేరు మళ్ళీ జోడిస్తూ, ఆవిడని వెటకారంగా సంభోదించే మనుషులకి కనీస సంస్కారం ఉందని భావిస్తూ, మనం జవాబు చెప్తూ ఉండాలా?

  SURANENI హరిబాబు
  సారంగ వారికి నా సూటి ప్రశ్న – నా కామెంట్లు కొన్ని ఎన్నిసార్లు పబ్లిష్ చహెసినా కనబడటం లేదు.ప్రత్యేకించి నా పేరుతో వచ్చే కామెంట్లను పబ్లిష్ చెయ్యకుండా ఏమైనా నిర్ణయం తీసుకున్నారా?

  ఎందుకంటే ఇక్కడ కొందరు నన్ను ఉద్దేశించి వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పినా అవి పబ్లిష్ కాలెదు.ముఖ్యంగా వృద్ధుల కళ్యాణ రామారావు గారు న అవాదనలోని ముఖ్యమైన భాగాన్ని చాలా తెలివిగా వొదిలేసి నన్ను ఎక్కిరిస్తున్నారు.దానికి నేను చెప్పీన్ జవాబు పబ్లిష్ కాలేదు,ఎందుకని?

  ఇప్పుడు మరికొందరు ప్రత్యేకంగా నా కామెంటులోని భగాలకి సూటీగా సమాధానం చెప్పలెక వక్రీకరించి కప్పదాటు జవాబులు చెబుతున్నారు.

  ఒకవేళ నాపట్ల అప్రకటిత నిషేధం ఉంటే ఇది క్కూడా పబ్కిష్ కాకపోఅచ్చు,కానీ నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలిగా!

  A1:కళ్యాణ రామారావు గారూ గడ్డివామి నంతా వెతికి సూదిని పట్టుకున్నట్టు భలే పాయింటు పట్టారుగా!ఆడలేని భామిని మద్దెల ఓదన్నట్టు కింద పడ్డా చెయ్యి పైనే ఉందని సరిపెత్టుకోవడానికి మా గొప్ప లాజిక్కు వాడుతున్నారు లెండి. మీరు మార్చిన రూటు వల్ల ఆమె చెప్పిన జవాబుని ఆధ్యాత్మీక్వాదులు చెప్పే సమర్ధనలతో పోల్చిన పాయింటుకి జవాబు చెప్ప్పనక్కరలేదు,పూర్తి మార్క్సిస్టు దృక్పదహం ఉన్న సంస్థ ఏదీ లేదు గనకనే నేను చేరలేదనేదాని గురించిన పాయింటూ గాలి కెగిరిపోయింది – ఇది పరమగొప్ప లాజిక్ కాబోలు!

  A2:అబ్బ!ఎంత బాగా సమర్ధించుకుంటునారో రంగనాయకమ్మ గారిని!బుద్ధికొలత వ్యాసాల గురించి విమర్శించడానికి సైన్సు పరిజ్ఞానం అక్కర్లేదు జస్ట్ కామన్ సెన్సు చాలు – ఓకే!మరి అదే కామన్ సెన్సుతో నేను గానీ మరొకరు గానీ కమ్యునింజం తప్పు అన్నాననుకోండి “ఏం చదివావు కమ్యునికం గురించి – తెలియకుండా మాట్లాడకు” అని గద్దిస్తారు,ఎందుకు?మన దేశంలో అక్కడక్కడా సహస్రాబ్దాలుగా తుప్పు పట్తని ఇనప స్తంభాలు ఉన్నాయి.అవి బహిరంగ ప్రదేశాల్లోనే ఉన్నాయి,ఇన్ని వేల సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు,కానీ శాస్త్రజ్ఞుకు ఆ కామన్ సెన్సుతో సరిపెట్టుకోకుండా వాటిమీద ప్రయోగాలు ఎందుకు చేశారు – అసలు రహస్యం తెలియలేదనుకోండి!

  ఇంత చెత్త లాజిక్కులు మామీద విసురుతూ ఉన్న మాటంటే ఉలుకెక్కూవ్ అనంట్టు ఉడికిపోతున్నారే తప్ప ఒక్కరూ శాస్త్రీయంగా విశ్లేషించి అర్ధవంతమైఅన జవాబు చెప్పలేకపోతున్నారు – కారణం?!

  A3:ఇంటి పేరునే వొదిలేసుకున్న మనిషి అసలు పేరులో ఉన్న విష్ణుదేవుడి భార్య అయిన లక్ష్మీదేవి పర్యాయ పదాల్లో ఒకటైన “రంగ నాయకి” అనే పదాన్ని ఉంచుకోవటం యేంటి?అది మరీ ఘోరం కదా!

  P.S:ఆమె మీద వస్తున్న విమర్శలు నిరాధారం కాదని వారికీ తెలుసు,వాటిని సరైన కోణంలో అర్ధం చేసుకుని గట్టి జవాబుని ఇవ్వలేకపోవడమూ తెలుస్తూనే ఉంది,అసలు ప్ర్శ్నలకి సూటిగా జవాబులు చెప్పలేక కొసరు విషయాల్ని పట్టించుకుని కప్పదాటు జవాబులతో తప్పుకోవడమూఒ తెలుస్తూనే ఉంది – ఇంకా ఎందుకీ బింకం!

 53. Praveen Kumar says:

  తాము దెయ్యాల తత్వశాస్త్రాన్ని ప్రచురించలేదని విరసంవాళ్ళు ఎవరూ అనలేదు, పైగా అది కుటుంబరావు గారి అభిప్రాయం మాత్రమే అని చెప్పి తప్పించుకున్నారు. విప్లవంతో సంబంధం లేని వాటిని ప్రచురించాల్సిన అవసరం విరసానికి ఉందా, లేదా అనేది చెప్పకుండా కేవలం రంగనాయకమ్మని తిడితే ఏమి లాభం?

 54. PRAVEEN KUMAR
  విప్లవంతో సంబంధం లేని వాటిని ప్రచురించాల్సిన అవసరం విరసానికి ఉందా, లేదా అనేది చెప్పకుండా కేవలం రంగనాయకమ్మని తిడితే ఏమి లాభం?

  HARI.S.బాబు
  నేను కొ.కు బుద్ధికొలత వ్యాసాలు చదవలేదు.కాబట్టి వాటిలో ఆయన దెయ్యాల్ని సమర్ధించాడా విజ్ఞాన శాస్త్రంలో ఉన్న కొలతల్ని గురించి తన అభిప్రాయాలు చెప్పాడా అనేది నాకు తెలియదు.కాబ్ట్టి ప్రస్తుతానికి దాని గురించి నేను వాదన పొడిగించ లేను.అంతర్జాలంలో ఎక్కదైనా అవి ఉంటే లింకులు ఇస్తే చదివి అర్ధం చేసుకున్నాకే ఆ విషయం గుఇంచి మాట్లాడగలను.

  విప్లవానికి పెట్టుబడి,అదనపు విలువ,శ్రమ-దోపిడి లాంటివి మాత్రమే చాలు విపవవాదులు వీటితోనే సంబంధం పెట్టుకోవాలి అని ఎవరైనా తీర్మానించి చెప్పారా?నేను చదివిన కొన్ని భాగాల్లో మార్క్సు జీవశాస్త్రం దానిలోని కొన్ని సూత్రాల్న్ కూడా ప్రస్తావించాడు.ప్రొఫెసర్ హాకిన్స్ ఉన్నాడు.ఆయన స్ట్రింగ్ ధియరీని కేవలం పాప్యులారిటీ కోసం ప్రతిపాదించాడని మీరు చెప్పగలరా?

  సైన్సు అంటే ఏమిటి/అది యెట్లా ఉనికిలోకి వస్తున్నది?అది ప్రజల జీవితాలకీ విప్లవానికీ సంబంధం లేనిదా?అందులోనూ సైన్సులో చెప్పబడిన ప్రతి సిద్ధాంతమూ దానంతటదిగా అమాంతం కమ్యునిష్టులు లక్ష్యంగా పెట్టుకున్న వర్గరహితసమాజం కోసం వూడిపడుతుందా?ఇవ్వాళ మన ఇళ్ళలో వెలుగుతున్న ఎలెక్ట్రిక్ బల్బులకి తొలి ఆలోచన కాంతికి అమబంధించిన వైజ్ఞానిక సూత్రాల నుంచి వచ్చాయి,అవునా>ఆ సూత్రాలు తయారు చేస్తున్న తొలిదశలో ఎవరయినా వీతి నుపయోగించి ఎలెక్ట్రిక్ బల్బుల్ని తయారు చేయ్యవచ్చని వూహించి ఆ సూత్రాల్ని కనుక్కున్నారా?వైజ్ఞానిక శాస్తర్ విషయాల్లోని ఏ విషయమూ నిరధకమైనది కాదు – మనకి ఇవ్వాళ అర్ధం కాకుండా ఉన్నదాన్ని అర్ధం చహెసుకోవడానికి మాన్వులు ఏర్పరచుకున అభిప్రాయాలు మాత్రమే!వాటికి కట్టుబడి ప్రకృతి గమనం లేదు,అది ఆయా నియమాల్ని అనుసరించనప్పుడు వాటిని ఎక్సెప్షన్లు అని పక్కకి పెట్టేస్తున్నారే తప్ప ఎక్సెప్షన్లు ఉన్నపటికీ కొన్ని చోట్ల మానవౌడికి ఉపయోగపడుతున్న ఏ ధియరీనీ పూర్తిగా కొట్టెయ్యడం లేదు,అది తెలుసా మీకు?ప్రతి వైజ్ఞానిక సిద్ధాంతానికీ దియరీ,అనాలిసిస్,స్టాటిస్టిక్స్/ఈక్వేషన్స్,ఎక్సెప్షన్స్,అప్లికేషన్ అనేవి ఉంటాయి.మనకి కనబడుతున్నప్రతి దృగ్విషయానికి సంబంధించిన ఏ రకమైన పరిసోధననీ కొత్త రకం విశ్లేషణల్నీ హేత్వాదిని అని చెప్పుకునే వాడు ఎవడూ వ్యతిరేకించకూడదు.హాకిన్స్ చేసింది ఏమిటి?పనీ పాట అలేక గాలి పోగేసి సొల్లు వాగలేదు.సైన్సు యొక్క మొదటి లక్ష్యం కనిపించే విశ్వాన్ని అర్ద్మ చేసుకోవడం.పూర్తిగా అర్ధం అయిన దాని గురించి ఎవరూ గందరగోళంలో పదనక్కర లేదు.కానీ అర్దం కానిది ఏదైన ఔంటే ఎవరయినా సరే ఈ విధంగా దీన్ని అర్ధం చేసుకోవచ్చు అనే విశ్లేషనని ప్రతిపాదించవచ్చు.ఆ ప్రతిపాదనల్ని మిగతా వాళ్ళు కూడా చర్చించి అవి శాస్త్రీయంగానె ఉన్నాయి అని ఒప్పుకుంటేనే ఆ సిద్ధాంతం తర్వాతి దశలోకి ప్రవేశిస్తుంది.తర్వాతి అద్సలో దాన్ని ఆధారం చేసుకుని పనిముట్లు తయారు చేసుకోవడమా జీవన విధానంలో ఆచరించి ప్రయోజనం పొందడమా అనే ఉపయోగించుకోవడం అనే దశ వస్తుంది.హాకిన్స్ చేసింది ఆ ప్రయత్నమే!అతన్ని మోసగాడు అని ఎవరయినా ంటున్నారా?లేదే!మరి కొ.కు అలా అలోచిస్తే తప్పేమిటి?మళ్ళీ చెప్తున్నాను,నాకు తెలియని దాన్ని గురించి నేను వ్యాఖ్యానించను.కొ.కు వ్యాసాల మీద రంగనాయకమ్మ చేసిన విమర్శలో అలాంటి శాస్త్రీయమైన విశ్లేషణ ఉందా?ఉంటే ఆమెని సమర్ధించహ్టానికి నాకు అభ్యంతరం ఈషణ్మాత్రం లేదు – అనగా నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్:-)

  శాస్త్రీయమైన వాదన అంటే సూటిగా అడుగుతున్న దానికి జవాబు చెప్పకుండా కప్పదాటు సమర్ధనలతో తప్పుకోవడం కాదు.కొ.కు వ్యాసాలు విరసం వారు ప్రచురించి ఉన్నారు.వాటిని మీరు చదివారా?ఆయన చెప్పిన దానిని రంగనాయకమ్మ శాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించి విమర్శించారా?ఇంతకీ నా కామెంటులోని అతి ముఖ్యమైన భాగం “పూర్తి కమ్యునిష్టు దృక్పధం ఉన్న సంస్థ ఏదీ లేదు గాబట్టి నేను ఏ సంస్థలోనూ చహెరలేదు” అన్న దాన్ని ఆధ్యాత్మికవాదుల బిష్క్రియాపరత్వపు సమర్ధనతో పోల్చినదానికి ఎవరూ జవాబు చెప్పడం లేదు.

  P.S::పైన ఎవరో “ఒక రైటర్ ని విమర్శించే ముందు వారి పుస్తకాలు పూర్తిగా , సమగ్రం గా చదవాలి అనే కామన్ సెన్స్ లేని వారూ సైన్సు గూర్చి మాట్లాడే వారే!” అని కూడా అనేశారు:-(వారికి నమస్కారం:-)ఎందుకంటే న అజవాబులో దాన్ని అంటూ ప్రస్తావించాను!

  దానికి మళ్ళీ వారేమి జవాబు చెప్తారో మరి?!

 55. Praveen Kumar says:

  సుత్తి ఎందుకు? కుటుంబరావు గారు తాను దెయ్యాలని నమ్ముతున్నాననే చెప్పుకున్నారు. రచయితల వ్యక్తిగత అభిప్రాయాలన్నిటినీ ప్రచురించడానికి విరసం ఒక కమర్షియల్ న్యూస్ పేపర్ కాదు. తమ మీద ప్రభుత్వం కేసులు పెట్టకూడదని విరసం విప్లవం అనే objectiveకి దూరంగా పోయి విప్లవంతో ఏమాత్రం సంబంధం లేని దెయ్యాల శాస్త్రాన్ని ప్రచురించే స్థాయికి దిగింది.

  • బాబు ప్రవీణ్, విరసం వాళ్లు ప్రచూరించింది కొ.కు.సమగ్ర సాహిత్యం లో భాగం గా. అందులో దెయ్యాల గురించి ఉంటే తప్పేమి లేదు. ఒకరచయిత రాసినవి ఒకే చోట ఉంటే కొనుకొనే పాఠకులకు సౌలభ్యంగా ఉంట్టుంది. నేను కమ్యునిస్ట్ అభిమానిని కాదు గదా! వాళ్ళు అలా ప్రచూరించటం లో తప్పేమి లేదు . సమగ్ర సాహిత్యం అనిపేరు పెట్టి సెలెక్టివ్ గా ప్రచూరించటం సరికాదు.

   ఈ మద్య నవోదయ పబ్లిషర్స్ రా.వి.శాస్త్రి పుస్తకాలు ప్రచూరించింది. మొత్తం సేట్ కొన్నాను. అలాగే కారా మాష్టారు, పతాంజలి సమగ్ర సాహిత్యం,చలం గీతాంజలి మొదలైన పుస్తకాలు కనిపించినవి కనిపించినట్లు కొనుకున్నాను. ఈ రచయితల పుస్తకాలు ఎప్పుడు చదవలేదు. తీరిక ఉన్నపుడు చదువుకొంటాను. సమగ్ర సాహిత్యం వలన ఒక్కొక్క పుస్తకం కొనుకొనే పనే ఉండదు.

   • Praveen Kumar says:

    శ్రీశ్రీ గారు వ్రాసిన మహాప్రస్థానాన్ని కమ్యూనిస్త్ పార్తీ కార్యకర్తలకి చదివి వినిపించొచ్చు. కానీ తాను వేశ్యల దగ్గరకి వెళ్ళాను అంటూ ఆయన తన ఆత్మకథలో వ్రాసుకున్న చెత్తని కార్యకర్తలకి వినిపించక్కరలేదు. “మనిషి బౌద్ధిక జీవి, మనిషి తాను ఏమి చేస్తున్నాడో తనకి తెలియని స్థితిలో ఉండడు” అనే point of viewలో నేను Ayn Randని సమర్థిస్తాను. అంతమాత్రాన ఆమె కమ్యూనిజంకి వ్యతిరేకంగా వ్రాసినదానికంతా ఒక కమ్యూనిస్త్‌గా నేను publicity ఇవ్వను. నా objective ఏమిటో నాకు తెలుసు కనుక.

    విరసం యొక్క objective రచయితల వ్యక్తిగత అభిప్రాయాలని జనానికి తెలియజెయ్యడం కాదు. ఆ పని వార్తా పత్రికలు చెయ్యగలవు.

 56. PRAVEEN KUMAR
  సుత్తి ఎందుకు?

  HARI.S.బాబు
  మరి నీ సుత్తి ఎందుకు?మాకు సైన్సు తెలియదు,మాకే కాదు ముప్పాళ అరంగనాయకమ్మకి కూడా తెలియదు పొరపాటే అని ఒప్పుకోవటమో లేదా ఆమె కొ.కు వాసాల్ని శాస్త్రీయంగానే విశ్లేషించింది అని రుజువు చేసుకోవటమో తేల్చి చెప్పకుండా నువ్వు పీకుతున్న గోగునారకట్ట యేంటి?

  ఒకాయన చెత్త లాజిక్కు వాడుతూనే ఆ లాజిక్కుని చెత్త అన్నందుకు బోల్డు ఫీలయిపోయాడు!మరొకాయన కొ.కు వ్యాసాల్ని విమర్శించటానికి మురంనాకి కామ్న్ సెన్సు చాలు గానీ మురమ్నాని విమర్శించటానికి నేను మాత్రం ఆమె రచనలన్నీ చదివి రావాలని అంటున్నరు.

  ఇప్పుడు నువ్వు సుత్తీ గిత్తీ అని చెడవాగితే నేను నీ తుక్కు రేగ్గొదతా!

  తిన్నగా జవాబు చెబితే చెప్పు లేదంటే గమ్మున్నుండు – ఖవడ్దార్!

 57. నేను ఈ కొ.కు వ్యాసాలు చదవలేదు కాబట్టి సొంతంగా అయనే ఒప్పుకున్నాడా విరసం కూడా అబ్బెబ్బే నాకు తెలీదు అవి కొ.కు అభిప్రాయాలు మాత్రమే అని నసిగిందా అనే రంధి నాకు అనవసరం.ఈ గొడవ నాకు సంబంధించినది కాదు,అర్ధమయిందా?

  అనెను అడిగినది ఆమె “పూర్తి మార్స్కిష్టు దృక్పధంతో ఉన్న సంస్థ ఏదీ లేదు గాబట్టి నేను ఏ సంస్థలోనూ చహెరలేదు” అని ఆధ్యాత్మీకవాదులు చెప్పే రకం జవాబు చెప్పేసి ఏ విధమయిన క్రియాశీలకమైన ఉద్యమం లోనూ పాల్గొనకుండా కడుపులో చల్ల కదలకుండా ఇంటిపట్టున మఠం వేసుక్కూర్చుని సమసమాజ స్థాపన కోసం ప్రాణాలకి తెగించి అరెస్టులకీ ఎంకౌంటర్లకీ కూదా సిద్ధపడి వరవరరావు లాంటివాళ్ళు తమ వంతు పని తాము చేస్తుంటే ఖాళీగా కూర్చున్న తన కన్నా పని చేసేవాళ్లని విరసం నే మరొక ఉద్యమ సంస్థని పెట్టినందుకు గాను “విప్లవం పరువు పోగొట్టేశారు” అని విమర్శించటం గురించి మాత్రమే!నా గురించి కూడా ఏదీ దాచుకోకుండా స్పష్తంగా చెప్తున్నాను.నేను హిందువుని.హిందువుని అని చెప్పుకోవడం గర్వంగా భావిస్తాను.నాకు మీ విప్లవోద్యమతో ఎలాంటి సంబంధమూ లేదు.ఒక తటస్థుడిగా,మీరు గనక శత్రువుగా భావిస్తే వరిపక్షంలో వాడిగా నేను మీకు స్పష్టం చెయదల్చుకున్నది ఇది:మీ అభిమాన రచయిత్రి ఆశయం విప్లవసాధాన,వరవరరావు ఆశయమూ విప్లవసాధనయే – అవునా కాదా?మరి వైరి అప్క్షాలై తెలిసేటంత గాఠిగా విప్లవ సహచరుణ్ణి పట్టుకుని విప్లవం పరువు తీసేశాడు అంటే ఏమి జరుగుతుంది?మొత్తం విప్లవం పరువే పోతుంది, పోదా? విప్లవం కోసం పని చేసేవాళ్లలోనే ఇన్ని ఎగో ప్రాబ్లెంస్ ఉండి మురమ్నా వాళ్ళనీ వీళ్ళనీ తిడుతుంటే వాళ్ళు తిరిగి ఈవిణ్ణీ తిడుత్తంటే మాలాంటివాళ్ళం సర్దాగా నవ్వుకుంటాం – చక్కిలిగింతలు పెట్టుకోనక్కర్లేకుండానే మీరు మాకు నవ్వు తెప్పిస్తుంటే వద్దు తిట్టుకోవద్దని మీకు హితోక్తులు చెప్పే దురద నాకెందుకు ఉంటుంది! ఇక నుంచీ నేనూ రూటు మారుస్తా లెండి నా పశ్చాత్తాపం ప్రకటిస్తూ:-(ఆవిద ఎవర్ని తిట్టీనా “బాగా అయ్యింది,అంతే కావాలి,ఇంకో రెండు తిట్లు తిడితే బావుణ్ణు” అని ఆనందిస్తా:-)

  పోనీ ఆమే ఆ మాట అనడానికి సుదీర్ఘకాలం విషయ సేకరణ చేసి విరసం ఆవిర్భావం ఆ ఒక్క రోజులో రాత్రికి రాత్రే జరిగిందని నిరూపించగలిగిందా?ఎప్పుడో విశాఖలో విద్యార్ధుల ప్రశ్న గురించీ శ్రీశ్రీ చొరవ తీసుకుని ఆవేశపూరితమైన జవాబు చెప్పడం గురించీ మీ విప్లవ పోరాటాల గురించి ఏనాడూ శ్రద్ధగా చదవని నాకు కూడా తెలుసే!

  పైగా శ్రీ శ్రీ అక్కడ ఇచ్చే ముష్టి డబ్బు కోసం వచ్చాడన్నట్టు అక్షర బద్ధంగారాసినా అది శ్రీశ్రీని వ్యక్తిగతంగా అవమానించడం కాదా?ఇంతకన్నా దగుల్బాజీ సమర్ధన ఇంకొకటి ఉంటుందా?!శ్రీశ్రీ తనకున్నవిద్వత్తుకి కమ్యునిజం వైపుకి ఆకర్షితుడవ్వకుండా కమర్షియల్ సినిమా పాటలు రాస్తూ ఉంతే అతని సంపాదన ఏ స్థాయిలో ఉండి ఉండేదో తెలుసా!అతను దబ్బిచ్చి స్త్రీసుఖాన్ని కొనుక్కోవడమ అనే ఒక్క లక్షణ్ణాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తాను అత్ప్ప విప్లవం అప్ట్ల అతని కున్న నికాయితీని నేను నమ్ముతాను – పొగుడుతాను కూడా! తను మాత్రమే అచ్చా తనకి నచ్చని వాళ్ళంతా లుచ్చా అనౌకునే వాల్ళకి మాత్రమే శ్రీశ్రీకి దబ్బుపిచ్చి అంతగట్టటం సాధ్యం. మీ అభిమాన రచయిత్రిని ఒక్క మాట అంటే సహించలేనప్పుడు ఇతర్ల అప్ట్ల కూడా మీ అభిమాన రచయిత్రీ మీరూ అదే పద్ధతిలో ఉండాలి కదా – అట్లా పరస్పర మర్యాదేఅ మాన్వత్వానికి గీటురాయి.అది ఉందా మీలో?!

  P.SAMBASIVA RAO
  DECEMBER 31, 2015 AT 4:08 AM
  నిజమే! మన టైం వేస్ట్ కాకుండా వేరే పనుల మీద పెడదాం.
  HARI.S.BABU
  నిజమే! నా టైం వేస్ట్ కాకుండా నేనూ వేరే పనుల మీద దృష్టి పెడతా

 58. Praveen Kumar says:

  పాలకవర్గంతో వర్గ సహకారం చేసే విరసంని విమర్శిస్తే విప్లవం పరువు పోతుందా? జోక్ బాగుంది!

 59. దొమ్మీ కేసు .

 60. PRAVEEN కుమార్
  పాలకవర్గంతో వర్గ సహకారం చేసే విరసంని విమర్శిస్తే విప్లవం పరువు పోతుందా? జోక్ బాగుంది!

  HARI..S.బాబు
  ఏమిటో!మళ్ళీ అర్ధం పర్ధం లేకుండా అసందర్భంగా మాట్లాడుతున్నాడు ఈ ప్రవీణ్ మహాశయుడు,ఎవరన్నా కాస్త ఈయనకి అడిగినదానికి తిన్నగా జవాబు చెప్పడం నేర్పండర్రా?!

  అవును,మీకు మరొక ముఖ్యమైఅన్ ప్రశ్న అవెస్తున్నాను చెప్పగలిగితే దీనికి కూడా జవాబు చెప్పగలరేమో చూదండి. ఈ ప్రవీణు మహాశయుడి యొక్క పొంతన లేని అసమన్వయ ప్రస్తావనలని పటించుకుని నా ,అతిని పోఫొట్టుకోలేను కాబట్టి మిగిలిన వాళ్ళలో ఎవరయినా నాయొక్క క్రింది ప్రశ్నకి జవాబు చెబితే సంతోషిస్తాను.ఆ ఒక్కటీ అడగటం తప్ప నేను ఇక్కడ చెయగలిగిందేమీ లేదు. నా ప్రశ్నలకి జవాబుల కోసం ఎదురు చూడటం తప్ప! రూటు మార్చేసి మీలో మీరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ బ్వినోదాన్ని పంచదల్చుకుంటే మాబోటివాళ్ళం చీర్ లీడర్సుగా కూడా పనిచేస్తాం:-)
  ఇంతకీ రామాయణం మహాభారతం కావ్యాలు అని అని లెక్కేసి మురమ్నా విమర్శించిదా లేక రాముణ్ణీ సీతనీ చారిత్రక వ్యక్తుల కింద లెక్కేసి విమర్శించిందా? రామాయణం వాల్మీకి రాసిన కధ అనుకుంటే వాల్మీకి రాసినదే ప్రమాణంకావాలి సహజంగా.వాల్మీకి రాసిన రామాయణం లోని పాత్ర అయిన వాలి మంచివాడా చెడ్డవాడా అనేది వాల్మీకి చెప్పనివాటితో నిర్ణయించటం తెలివైనవాడు ఎవడూ చెయ్యడు వాల్మెకిని వ్యతిరేకించటం కోసమే వ్యతిరేకించాలన్న ఎజెండా ఉన్నవాడు తప్ప! కోటానుకోట్ల మంది ప్రభావితం అయినా సరే కావ్యమర్యాద ప్రకారం పాత్రల తీరుతెన్నుల మీద రచయితదే సర్వాధికారం.ఆయన రాసిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ రచయిత ఇట్లాగే రాముణ్ణి సమర్ధిస్తూ ఎందుకు రాశాడు,మరోట్లా నాకు నచ్చినట్టు వాలిని సమర్ధిస్తూ ఎందుకు రాయలేదు అని అనడం మా అమ్మకి నేను ఇట్లా పొట్టి బుదంకాయలా ఎందుకు పుట్టాను మరోట్లా నాగార్జునలా పొడుగ్గా ఎందుకు పుట్టలేదు అని అడిగినట్టు శుద్ధ వెర్రిబాగుల వాగుడులా ఉంటుంది:-)

  ఒక కవి రాసిన పాత్రలని ఆ కవి రాసిన ప్రణాళికకి విరుద్ధంగా వ్యాఖ్యానించాలనుకోవడం దేన్ని సూచిస్తుంది?వాల్మీకికి రామాయణం రాయడం వెనక ఒక ఎజెండా ఉంది.అది తను ధర్మం అనుకున్నదాన్ని అందరిలో బలంగా ఎక్కించడం!మీ అభిమాన రచయిత్రికి వాల్మీకి ధర్మం అంటున్నది అధర్మంగా కనిపించే ఎజెండా ఉంది.అయితే దైరెక్టుగా వాల్మీకి ధర్మం అంటున్నదాన్ని అధర్మంగా నిరూపించితే ఎవ్వరూ కాదనరు – నాతో సహా!అలా చెయ్యాలంటే రాముడి ఏకపత్నీవ్రతం తప్పు సీత పాతివ్రత్యం తప్పు అని చెప్పి లైంగిక విశృంఖలత్వాన్ని సమర్ధించాలి.ఎందుకంటే రామాయణం లో భరతుడు తనని చూడ్డానికి వచ్చినప్పుడు “తమ్ముడూ బాగున్నావా” అనే మామూలు పలకరింపు స్థానంలో రాజ ధర్మాల గురించి చాంతాడు పొడుగు ఉపన్యాసం చెప్పి ఇవ్వాన్నీ చేస్తున్నావా అని అడిగినట్టు రాసి వాల్మీకి రాజధర్మం గురించి తన అభిప్రాయం చెప్తున్నట్టు.అలాంటి సన్నివేశాలు ఎన్ని ఉన్నప్పటికీ మొత్తం కధలో రాముడు – రావణుడు, సీత – శూర్పణఖ వంటి ప్రధాన పాత్రల మధ్య నడిచిన సన్నివేశాల లోని కధ అంతా స్త్రీ-పురుష సంబంధాల్లో ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం కోసమే కదా!

  రాముడు పాటించిన ఏకపత్నీవ్రతాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి?సీత పాటించిన పాతివ్రత్యాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి? ఆమె కూడా వివాహితయే కదా,ఆమె దాంపత్యజీవితం ఎట్లా గడిపింది? ఒక పురుషుడితో వివాహబంధంలో ఉన్నప్పుడు మరొక పురుషుడి గురించి ఆలోచించకుండా మీ అభిమాన రచయిత్రి కూడా సీతలాగే ప్రవర్తించిందా మరొక విధంగా స్వైరవిహారం చేసిందా!మరి సీత రావణుడి గురించి ఫాంటసీలు వూహించుకుంది,రాముదు శూర్పణఖని చూసి చొల్లు కార్చుకున్నాడు,”ఆహా!సీత కన్నా ముందు తను కనబడితే నేను ఈవిణ్ణే చెసుకున్నేవాణ్ణి” అనుకున్నట్టు రాయడం, పైగా మనసులో అంత వాంచ ఉన్నా అణుచుకుని రాముడు జనం పొగడ్తల కోసం పైకి నటనగా మాత్రమే ఏకపత్నీవ్రతానికి కట్టుబడ్డట్టు రాయడం వెనక ఉన్న ఉద్దేశ్య మేమిటి?ముప్పాళ రంగనాయకమ్మ అను నాకన్నా సీత ఉన్నతంగా ఉండటానికి వీలు లేదు, నాలాగే తను కూడా మొగుడు కాని ఇంకో మగాడి గురించి ఫాంటసీలు వూహించుకునే ఉంటుంది అని చెప్తున్నట్టా!

  తను కూడా దాంపత్యం విషయంలో సాంకేతికంగా సీత మాదిరిగానే ఉంటూ అదే లక్షణాన్ని కధారూపంలో పాత్రగా నిలబడిన సీతని వెక్కిరించటం అంటే తను పాటిస్తున్న దాంపత్యపు లక్షణాన్ని తప్పు అని చెప్తూ తనని తను విమర్శించుకోవటం – తనని తను తిట్టుకునేవాళ్లని ఏమంటారు?ఒక స్త్రీ ఒక పురుషుడు జీవితకాలం కలిసి ఉండే వివాహాన్ని తప్పు అంటున్నప్పుడు ఆమె సాటి స్త్రీలకి బోధిస్తున్నది స్వైరవిహారాన్నే కదా!

  కొందరు రామాయణంలో ఏకపత్నీవ్రతం అనే మాట ఎక్కడా వాదలేదు అని అంటున్నారు కాబట్టి సాంకేతికంగా “ఏకపత్నీవ్రతం”,”పాతివ్రత్యం” అనే మాతల్ని వదిలేసినా సీత రాముడికే అంకితమవడాన్ని విమర్శించిందా? లేదు,అదంతా నటన మాత్రమే,చా టుగా రావణుడి గురించి ఫాంటసీలు అల్లేసుకుంది పొమ్మంటున్నది,అవునా?రాముడు సీతను మాత్రమే ఇష్టపడటాన్ని విమర్శించిందా?లేదు,అబ్బే రాముడు వాల్మీకి చెప్పీంట్టు పవిత్రంగా లేడు శూర్పణఖని చూసి ఐసయిపోయాడు,కాకపోతే జనం తిడ్తారని నటించాడు అంటున్నది. అట్లా వాల్మీకి ఆదర్శవంతులుగా నిలబెట్టిన పాత్రల స్వభావాల్ని పూర్తిగా మార్చిపారేశాక ఇప్పుడు మనకి కాబట్టి అయ్యలారా అమ్మలారా మీరు రాముడిలాగా సెతలాగా ఆ ధర్మాన్ని పాటించకండి అని చెప్తున్నది,అంతేనా? నేను బుద్ధిగా మొగుడితో కాపురం చెస్తూ గడిపిన మీ అభిమాన రచయిత్రిని “స్వైరిణి” అన్నందుకు మీకు ఖోపం వచ్చేసి అదేంటి ఆ పాడు పని ఆవిద చెయ్యలేదుగా అని బోల్డు బాధ పడిపోయి ఆవిడ చెయ్యని పనిని అంటగట్టిన దుర్మార్గం గురించి నన్ను నిలదీస్తున్నారు గాబట్టి మీరు మరి సీతకీ రాముడికీ లేని దుర్గుణాల్ని ఆవిడ ఎందుకు అంటగట్టిందో చెప్పాల్సి ఉంటుంది – చెప్పగలరా?!

  P.S:ఆవిడకి లేని చెడ్డ గుణాన్ని అంటగట్టటం నా కుసంస్కారం అయితే వాల్మీకి సృష్టించిన పాత్రలకి లేని లక్షణాల్ని అంటగట్టటం ఆవిడ కుసంస్కారం కాదా – ఆ పాయింటు బోధపడితే నేను ఆ పని ఎందుకు చేశానో అర్ధం అవుతుంది.నేను చేసింది ఒక మంచి పని కోసం తప్పు చెయ్యటమే అని అర్ధం అయితే కౌరవులు తప్పు చేశారని పాండవులూ తప్పు చేస్తే ఇద్దరూ అధర్మపరులే అవుతారు గదా అనే మీ లాజిక్ ఎందుకు తప్పో కూడా అర్ధం అవుతుంది.
  తను దేన్ని వర్గసహకారం అంటున్నాడో ముందువెనకలు చెప్పకుండా హఠాత్తుగా ప్రస్తావించేసి తప్పుకుంటే నాబోటివాడు వాదించటానికి ఏముంటుంది?అది బహుశా నాకు అనవసరం అన్న కొకు బుద్ధికొలత గురించి కావచ్చు!నేను సూటీగా అడిగిన ప్రశ్నల్ని మరోసారి గుర్తు చేశాను.దానికి జవాబు చెప్పడం లేదేమిటి?దానితో పాటూ ఇప్పుడు అడుగుతున్న కొత్త ప్రశ్నకి కూడా సమాధానం చెప్తే బాగుంటుంది – ప్రయత్నించండి!

  ఇక్కడ నా ప్రశ్నలూ వాదనా పద్ధతీ చూశారుగా!నేను పీకి పాకం పెట్టటానికి తగులుకుంటే మురమ్నా రచనల నన్నిట్నీ మీరు భోరున ఏడ్చే స్థాయిలో ఆ పని చెయ్యగలను – బస్తీమేసవాల్!
  మచ్చ్కి ఒక శాంపుల్,ఈ ప్రవీణ్ మహాసయుడే ఒకసారి రామాయణ మహాభార్తాలు కధలే గదా,వాట్ని మారిస్తే తప్పేంటి అని అడిగాదు పెద్ద పోటుగాడి మల్లే:-)

  “నిజమేనయ్యా!వాల్మీకి రాసిన కధని విమర్శించడానికి ఆ కధని తనిష్తమొచ్చినట్టు వాల్మీకి చెప్పనివాట్ని గూడా చెప్పినట్టు పాత్రల తీరుతెన్నుల్ని మార్చి రాసే స్వేచ్చ మురమ్నాకి ఉన్నట్టే ఆవిడా మీరూ ఆప్యాయంగా చెప్పుకునే జానకి విముక్తి గురించి:ఆ జానకి మా ఇంటికి మూడిళ్ళ కవతలే ఉంటుంది,తనకి కనిపించిన మగాడి కల్లా కన్ను కొట్టే అలవాటు ఉంది,అందుకే అట్లా అత్తగారూ మొగుడూ తిడ్డుతున్నా కొడుతున్నా మారు మాట్లాదకుండా భరిస్తునది అని మార్చి రాస్తే నువ్వు వొప్పుకుంటావా?” అని అడిగితే మళ్ళీ దానిగురించి నోరెత్తడం లేదు.ఒక గంభీరమైన విశ్లేషణ ఏదీ లేకుండా గయ్యాళితనం చూపించి ఎగతాళి చెయ్యడమే మార్క్సిష్టు సాహితీ విమర్శ అని మీరు భావిస్తే అది ఇటువైపునుంచి మేము కూడా చెయ్యగలం – సిద్ధమేనా?!

  మరి మీలో ఎవరు నా ప్రశ్నలకి జవాబు చెప్పగల ధీమంతులు?
  MY QUESTIONS ARE COMPLETED!CAN YOU ANSWER THEM IN A SCIENTIFIC METHOD?

 61. రామాయణభారతాలు కథలే కానీ వాటిని మార్చి వ్రాయమని నేను ఎప్పుడు అన్నాను? రంగనాయకమ్మ గారు మార్చి వ్రాసారని కూడా నేను అనలేదు. కథల్ని మార్చి వ్రాయొచ్చు కానీ చరిత్రని మార్చలేము అని ఎక్కడో వ్రాసాను. రంగనాయకమ్మ గారు తెలుగు బ్లాగులు చదవరు. ఆ విషయం నాకు బి.ఆర్.బాపూజీ గారే చెప్పారు. రంగనాయకమ్మ గారు చెప్పని విషయాలు చెప్పినట్టు ఆవిడ మీద ఎన్ని ఆరోపణలైనా బ్లాగుల్లో చెయ్యొచ్చు. నిత్యం జేబులో మొబైల్ పెట్టుకుని బ్లాగులు చదివే నా మీదే అలాంటి ఆరోపణలు చేస్తే ఏమి లాభం?

 62. P V Vijay Kumar says:

  : ) :) :)…

  రంగనాయక, అభిమాన సంఘానికి నాదో వివరణ కం విన్నపం .

  అరణ్య వాసానికి ఏగిన రాముడిని వెతుక్కుంటూ లక్ష్మణుడు అడవిలోకి వెళ్ళి పట్టేసుకుని ” అన్నయ్యా ! నీవు వెనక్కి వచ్చి రాజ్యమేలుకో బాబూ ” అన్నాట్ట. అప్పుడు శ్రీ రామచంద్రుడు ” సోదరా ! భరతా ! పితృవాక్య పరిపాలనా దక్షుడైన పుతృడిగా, సత్య శీలత కలిగిన వ్యక్తిగా, ఆడిన మాట తప్పని ఓ మనిషిగా, జాతికి నీతికి నేర్పవలసిన బాధ్యత కలిగిన పురాణ పురుషుడిగా, ప్రజల శ్రేయస్సును వాంఛించే ఓ రాజుగా నాన్న గారి మాటను నేను జవదాటలేను తమ్ముడూ…రాజ్యానికి రాను…రాలేను ” అన్నాట్ట . ఆ వాక్ప్రహావానికి శోష వచ్చి పడిపోయిన భరతుడు ” అన్నయ్యా ! నేను రాను అని ఒక్క మాట చెప్తే చాలదా ? ఇంత సుత్తెందుకూ ? ” అన్నాట్ట. ( Courtesy : Nalugusthambhalata Movie and My artist friend Ba ja Ra )

  కాబట్టి, రంగ నాయకమ్మ గురించి ఇంత సుత్తెందుకు గాని – సూటి ప్రశ్నలు కొన్ని వేసుకోండి.

  (1) ఆమె చెప్తుంది మార్క్సిజమేనా ? ( వీలైతే బ్రహ్మచారి గారు రిలీజ్ చేసిన బుక్ చదవండి. త్వరలో నేను రాస్తున్న బుక్కు కూడా చదువుదురు )

  (2) రంగ నాయకమ్మ వ్యవస్థను generalise చేస్తూ నే ఎందుకు మాట్లాడుతుంది ? దళితులు, వేశ్యలు, హిజ్రాల విషయం లో నిర్దుష్టంగా మాట్లాడ్డం attempt చేసాక ఆయా sections వాళ్ళు ఎవరూ దానిని receive చేసుకోలేకపోయారు. మరింకెవరి కోసం రాసినట్టు ?

  (3) రంగ నాయకమ్మ లో ఒక నిజాయితీ ఉంది అని నమ్మే అభిమానులకు ఒక ప్రశ్న – ఆమె నిజాయితీ – రోహిత్ వేముల, ఇప్పట్లో పేట్రేగి పోతున్న హిందూ బ్రాహ్మణ వాదం గురించి ప్రజలకు ఉపయోగకరమైన విశ్లేషణ ఇవ్వడం లో ఎందుకు ఉండడం లేదు ?

  ప్రస్తుతానికి Prolonged సుత్తి లేకుండా సూటిగా ఈ మాత్రం మాట్లాడుకుందాం. ఏం ? ,…..వెయిట్…వెయిట్…..ఆలోచించాల్సింది మీరు…నేను..అంటే వ్యాస కర్త కాదు ….

  విక్టర్

 63. rani siva sankara sarma says:

  రంగనాయకమ్మ రామాయణం భారతాల పారాయణ కాకుండా నేటి హిందుత్వ భారతం, రోహిత్ మరణం, ముస్లిం వ్యతిరేకత వంటి విషయాల గురించి ఇలాంటి ప్రత్యేక సమకాలిక విషయాలని విశ్లేషిస్తూ రాశారా? ఎక్కడ, ఎప్పుడు? విక్టర్ గారి ప్రశ్నకి సమాధానం కావాలి .ఆమెవి కూడా కాలాతీతమైన ఆధ్యాత్మిక ప్రవచనాలేనా?

మీ మాటలు

*