కె. శివారెడ్డి @ 72

అరణ్యకృష్ణ
మట్టి మీద
మట్టి నుండి లేచిన చెట్టు మీద
చెట్టు మీదెక్కిన పిట్ట మీద
 
సముద్రం మీద
సముద్రం ఒడ్డున ఇసుక తిన్నెల మీద
ఇసుక తిన్నెల మీది పాదముద్రల మీద
 
ఆకాశం మీద
ఆకాశం పైని చీకట్ల మీద
చీకట్లు విసిరే కాంతిపుంజాల మీద
 
అడవుల మీద
అడవులు పెంచిన ఆకుపచ్చని ఆశల మీద
ఆకుపచ్చని ఆశలతో సాయుధమైన కలల మీద
 
పల్లె మీద
పల్లె ఒంటి గాయాల మీద
గాయాలు మిగిల్చిన కసి మీద
 
మనిషి మీద
మనిషంతటి ప్రేమ మీద
ప్రేమతో పరితపిస్తూ హత్తుకునే హృదయం మీద
 
గుండె మీద
గుండె లోతుల్లోని స్నేహం మీద
స్నేహం కురిపించే అత్తరు జల్లుల మీద
 
కళ్ళ మీద
కంటి కొసల నీటి మీద
కన్నీళ్ళు నింపుకున్న కలాల మీద
 
కవిత్వం జెండా ఎగరేసిన వాడు!
*
aranya

మీ మాటలు

 1. చాలా బాగా రాశారు అరణ్య క్రష్ణ గారు

 2. Narayanaswamy says:

  చాలా బాగుంది అరణ్యా ! ఈ శైలిని దాదాపు నీ స్వంతం చేసుకున్నావు !

 3. Delhi Subrahmanyam says:

  చాల బాగా రాసారు అరణ్య కృష్ణ గారూ అభినందనలు.

 4. Gopal rao appannagari says:

  సరైన నిర్వచనం, చాల బాగుంది.

 5. విజయనగరం లో సోంపేట మహారాజు ధర్మాన ప్రసాద రావు గారు శాలువా కప్పి సన్మానం చేసిన – వారూ వీరూ ఒకరేనా? వేరు వేరు గా ఉన్నారా? – అరణ్య కృష్ణ గారూ కొంచెం తెలుసుకుని చెప్పరూ?

మీ మాటలు

*