వాటే ఫాల్‌! వాటే పిటీ!

 

రమా సుందరి 

 

ramasundariచలసాని స్మృతిలో వరవరరావుగారు ఒక వ్యాసం రాశారు. అందులో విరసం పుట్టుకను, అందులో చలసాని పాత్రను చర్చించారు. దానిపై రంగనాయకమ్మగారు స్పందించారు. ఆమె అభ్యంతరాలేవో ఆమె చెప్పారు. అవన్నీ రాజకీయ పరమైనవే. అందులో వ్యక్తిగతమైన విమర్శ కించిత్తులేదు. ఆ అభిప్రాయాలతో మనం ఏకీభవిస్తామా, లేదా అనేది వేరే చర్చ. అక్కడక్కడా ఆమె ఉపయోగించిన టోన్‌తో, లాజిక్‌తో ఎవరికైనా ఇబ్బంది ఉండొచ్చును. మన ఇబ్బందులేవైనా సరే, ఆమె కొన్ని రాజకీయ ప్రమాణాలను ముందు పెట్టుకుని ఆ మేరకు విమర్శించారు. ఇట్స్‌ఎ పొలిటికల్‌పీస్‌.

కానీ వసంతగారి కవిత్వంలో ఏమున్నది. అది కవిత్వమా కాదా అనే చర్చను కాసేపు పక్కనబెడదాం. కవిత్వమే అనుకుందాం. ఏమిటీ ఆమె చెప్పదలుచుకున్నది? రంగనాయకమ్మగారి పుస్తకాల పేర్లకు అటూ ఇటూ తోచిన పదాలేవో అల్లి వెటకారాన్ని వెదజల్లడం తప్ప. రంగనాయకమ్మగారి వెటకారం కంటేనా అనబోదురేమో! ఆమెక్కడా అప్పొలిటికల్‌విమర్శ చేయగా నేను చూడలేదు. ఆమె తర్కంతో టోన్‌తో అన్నివేళలా ఏకీభవించకపోవచ్చు కానీ అప్పొలిటికల్‌ అనైతే ఎవరమూ అనలేము కదా!

కానీ ఇందులో ఏమున్నది? ఆ కవిత్వం చదువుతుంటే తెలీకుండానే మెటికలు విరిచిన చప్పుడు వినిపిస్తే అది పాఠకుడి తప్పవుతుందా! శాపనార్థాలు పెట్టే పెద్దమ్మల ధ్వని తప్ప మరో ధ్వని ఉన్నదా! పైగా ఆమె రాసింది గొప్ప కవిత్వమన్నట్టు కొందరు ఎంఎల్‌పార్టీ వారు కూడా దాన్ని సెలబ్రేట్‌చేసుకోవడం? క్యా చల్‌రహా హై భయ్‌..ఇస్‌దేశ్‌మే! శత్రువుకు శత్రువు మిత్రుడన్న అల్పసంతోషత్వం తప్ప మరోటున్నదా ఇందులో! పాతకక్షలు తీర్చుకోవడం లేదా స్కోర్లు సెటిల్‌చేసుకోవడం లాంటిది కాకుండా మరో రకంగా చూడగలమా! మొన్నమొన్నటిదాకా ‘విప్లవశిబిరాన్ని చీల్చడానికి’ పుట్టినటువంటివారై ఉండిన వసంతకన్నబిరాన్‌గారు సడన్‌గా మరింత దగ్గరైపోయి రంగనాయకమ్మగారు ఎలా దూరమైపోయారో అవేం రాజకీయాలో అర్థం కావడం కష్టం.

నిజమే కావచ్చు. రంగనాయకమ్మ గారి వ్యాసాల్లో తడి లేకపోవచ్చును. మానవీయ స్పర్శ తక్కువని పించవచ్చును. సందర్భశుద్ధి ఉండొద్దా అని కూడా కొందరికి అనిపించవచ్చును. ఇలాంటి అభిప్రాయాలు బోలెడుండవచ్చును. కానీ ఆమేం రాసినా కొన్ని ప్రిన్సిపుల్స్‌ఆధారంగా రాసినవి.

ప్రిన్సిపుల్డ్‌పొలిటికల్‌బీయింగ్‌. ఎందరున్నారు మనలో! ఆ మాటకొస్తే ఈ తడి అనేది కూడా అమూర్తమైనది. కన్నబీరన్‌చివరి చూపు కోసం విప్లవాభిమానులు పరిగెత్తుకుంటూ పోతే బూడిద కనిపించింది. ఏం కొంపలు మునిగిపోయాయని ఇంత హడావుడిగా అనిపించింది. వసంతగారి లాజిక్కేదో ఆమెకుంటుంది. అది మనకు తడిలేకపోవడంగా కనిపించొచ్చు. ఆ విషయం మీద ఆర్కే గారు తన ఆవేదన ఏదో రాశారు కూడా! ఇవన్నీ మనం ఎక్కడ నిలబడి ఏ వాంటేజ్‌పాయింట్‌లో చూస్తున్నామనే దాన్ని బట్టి ఉంటుంది. రాజకీయంగా ఏవైనా చర్చించొచ్చు. కానీ వసంత అంత పెద్ద మనిషి ఎవరో చిన్న పిల్లలు చేసినట్టుగా నాలుగు అక్షరాలను రాళ్లుగా మార్చి విసిరితే ఎలా!

ఎవరో ఫేస్‌బుక్‌లో కొన్ని ప్రశ్నలు సంధించి రంగనాయకమ్మగారు చలసాని ఇంట్లో ఉన్నారని ఆమె స్వయంగా రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను చాలా సాయం పొందినట్టు ఆమె రాసిన విషయాల్ని గుర్తుచేశారు. ఇవేమి రాజకీయాలో బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. వాళ్లు సాయం చేసిన విషయాన్ని రంగనాయకమ్మగారు ఇవాళ కూడా ప్రేమగానే గుర్తుచేసుకోవచ్చు. కానీ వ్యక్తిగత స్నేహాలకు ప్రేమలకు రాజకీయఅభిప్రాయాలకు తేడా చూడలేనంత దూరం ప్రయాణించామా మనం! వ్యక్తిగతంగా సాయం చేసిన వారిని రాజకీయంగా విమర్శించకూడదా!

వాటే ఫాల్‌! వాటే పిటీ!

*

మీ మాటలు

  1. మీరిందులో ఉటంకించిన “వరవరరావు గారి వ్యాసం”, “రంగనాయకమ్మ గారి స్పందన”, “వసంత గారి కవిత్వం”, “ఆ విషయం మీద ఆర్కే ఆవేదన” వాటికి లంకెలు ఇస్తే (కొన్నిటికైనా) మాలాటి వారికి బాగుంటుంది కదండి?

    • This was Ranganayakamma gari response to Varavara Rao
      విప్లవం’ పరువు పోగొట్టేశారు!
      ‘విప్లవ రచయితల సంఘం’ దాదాపు 45 ఏళ్ళ కిందట ఎంత అడ్డ దిడ్డంగా ఏర్పడిందో ఆనాడే తెలిసిన వాళ్ళకి తెలుసు. అది ఇంకా తెలియని వాళ్ళకి, ఈనాడైనా వరవరరావు గారి ‘వర్గ పోరాటాల’ వ్యాసం ద్వారా చాలా బాగా తెలుస్తుంది. (వివిధ, ఆగస్టు 3)
      ఏ ఉద్యమ కారులైనా (భక్తి ఉద్యమ కారులైనా) ఒక సంఘం పెట్టాలనుకుంటే, మొదట ఒక కాయితం మీద నాలుగు ముక్కలు రాసుకుంటారు. అది రచయితల సంఘం అయితే, ఆ ప్రణాళిక పేరు గల కాయితాల్ని రచయితలకు పంపుతారు. ఆ కాయితాలు అందుకున్న వాళ్ళు తమ అభిప్రాయాలు తెలియజేస్తారు. తర్వాత, ఒక సమా వేశంలో, ఆ ఆసక్తి గల వాళ్ళందరూ కలిసి, ప్రణాళికలో అవసరమైన మార్పులూ చేర్పులూ చేసి, సంఘం ఏర్పడవలసిన రోజుని నిర్ణయిస్తారు. ప్రెసిడెంటూ, కార్యదర్శీ, ఎవరెవరు వుండాలో అప్పటికే పై పై నిర్ణయాలు జరగవచ్చు. సంఘం ప్రారంభమయ్యే సమావేశంలో మెజారిటీ సభ్యుల ద్వారా ఆ నిర్ణయాలు స్పష్టంగా జరుగుతాయి. ఇక అప్పటి నించీ సంఘం, తన కార్యక్రమాలు మొదలు పెడుతుంది. ఇది, సరికొత్తగా నేర్చుకోవలిసిన విషయం కాదు.

      కానీ, విప్లవ రచయితల సంఘం, ఎలాంటి కుట్రలతో, ఎలాంటి అబద్దాలతో, ఎంత నిజాయితీ హీనంగా, ఎంత విప్లవ వ్యతిరేకంగా ఏర్పడిందో, ఆ పాత చరిత్రని ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవచ్చు. కానీ, వరవరరావు గారు, ఆ నిజాయితీ రాహిత్యాన్నంతా గొప్ప సాహస కార్యంగా, దాన్ని ‘సాహిత్యంలో వర్గ పోరాటం’గా చిత్రించారు!

      ‘అరసం’ (అభ్యుదయ రచయితల సంఘం) అప్పటికి ఏ నాటి నించో వుంది. అందులో విప్లవం లేదనీ, తాము ‘విప్లవం’ పేరుతో కొత్త సంఘం పెట్టేస్తే, ఆ పేరుతోనే అది విప్లవం అవుతుందనీ, భావించిన వారు, పెట్టేశారండీ గొప్ప సంఘం! కానీ, ఏ విధంగా?
      అప్పటికే వున్న అరసం, ప్రభుత్వ సహకారం తోటీ, సినిమా వారి సహకారం తోటీ (అరసం, పెట్టుబడిదార్ల బాంచన్‌ అయిందనుకోండీ! పోనీ, దాని చైతన్యం దానిది!) ఒక సమావేశం జరపాలనుకుని మద్రాసు నించి శ్రీశ్రీ కవిని ఖర్చులు పెట్టి తెప్పించారు. ఆయన రాగానే (1970, జూలై 3న) అరసంలో శ్రీశ్రీ కవి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం కూడా జరిగింది. ఆ తర్వాత, ప్రభుత్వం వారు ఇవ్వనున్న 2 వేల రూప్యముల బహుమతిని అందుకోవడానికి శ్రీశ్రీ కవి సిద్ధంగానే వున్నారు! శ్రీశ్రీకి షష్టిపూర్తి జరిగింది కాబట్టి, అది ఆయన ప్రత్యేక గొప్పతనం లాగ, ఇంకో సంఘం వారు ఆ కవిని సన్మానించడానికి పిలిచారు. ఈ విప్లవ కారులందరికీ, షష్టి పూర్తులూ, సన్మానాలూ అన్నీ, విప్లవాలే! శ్రీశ్రీ కవి, ఆరుద్ర కవితో కలిసి, అరసం వారి కారులో ఆ సన్మానానికి వెళ్ళి ఆయన అది పొందాడు. (అక్కడేమైనా బహుమతి దొరికిందో లేదో, ‘వర్గ పోరాటాల’ వ్యాసంలో సమాచారం లేదు.)

      సన్మానం పొంది, శ్రీశ్రీ కవి బైటికి వచ్చి అరసం కారు ఎక్కగానే, అక్కడ గొప్ప విప్లవం జరిగింది! చలసాని ప్రసాద్‌ నాయకత్వంలో సాహసికులైన విప్లవ కారులు కొందరు చేసిన విప్లవం అది.

      ఆ విప్లవకారులు అరసం వారితో, ‘‘శ్రీశ్రీని కాస్సేపు మాకు ఇవ్వండి. మా ముచ్చట తీర్చుకుని మీకు మళ్ళీ ఇచ్చేస్తాం’’ అని చెప్పి, ఆ కవిని ఆ రివిజనిస్టు కారు దించి, ఈ విప్లవ కారు ఎక్కించి, తమకు కావలసిన విప్లవ హోటల్‌కి తీసుకుపోయారు. అక్కడికి చేరాక, కుట్ర అంతా తెలిసిన శ్రీశ్రీ కవి, మండి పడలేదు! ‘‘ఛీ ఛీ! ఇదేం పని?’’ అనలేదు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. శ్రీశ్రీ కవి పెద్ద విప్లవ కారుడై పోవడం మాత్రం జరిగి పోయింది. ఆ అర్ధరాత్రి ఏర్పడిన ‘‘విప్లవ రచయితల సంఘా’’నికి అధ్యక్షుడై పోయి, ఆ వీరుడు అరసాన్ని దుయ్యబట్టేశాడు. ‘‘ఛీ ఛీ! అరసం విప్లవం లేకుండా దిగజారి పోయింది. నేను విప్లవకారుణ్ణి! దాని మొహం చూస్తానా? ప్రభుత్వం శ్రీకాకుళం ఉద్యమాన్ని రక్తపు టేరుల్లో ముంచింది. ఆ దుష్ట ప్రభుత్వం ఇచ్చే బోడి 2 వేల రూకలు తీసుకుంటానా? ఛీ, ఛా! నేను విప్లవ కారుణ్ణి!’’ అంటూ గంట కిందటి దాకా అరసంలో కూర్చున్నప్పుడు లేని విప్లవాన్నంతా ఇక్కడ ప్రదర్శించాడు. అసలు, ఆ పెద్ద మనిషి తన వూరు నించి వచ్చిందే అరసం డబ్బుతో! అరసం మీటింగు కోసం! అక్కడ అధ్యక్ష తనం కూడా ధరించడం జరిగింది. ఇక, 2 వేల రూకలు జేబులో వేసుకోవడమే మిగిలి వుంది. అక్కడ అంత జరిగాక ఇక్కడ ఏం జరిగిందో మరి! కధల్లో ఏదో మంత్రం పని చేసినట్టే, ఆ కవి, చప్పున విప్లవ కారుడై పోయాడు! విప్లవ కారులవడం ఎంత తేలిక!

      ఒక వేళ, ఆ నాడు శ్రీశ్రీ కవి అరసం కోసం వాళ్ళ వూరు నించి వచ్చి వుండకపోతే, ఆ రాత్రి విప్లవ సంఘం పుట్టేది కాదు గదా? ఆ కవి ఎప్పుడు దొరుకుతాడా అని వీళ్ళు ఎదురు చూస్తూ వుండేవారే కదా? శ్రీశ్రీని ముందు పెట్టి, రచయితల్ని సమీకరించాలని చలసాని ఆలోచించే వారట! ఒక సంఘానికి సభ్యుల్ని సమీకరించాలంటే, దాని ‘ప్రణాళిక’ ద్వారా ఆ పని జరగాలా, లేకపోతే ఒక రచయితనో, ఒక సినిమా హీరోనో చూపిస్తూ ఆ పని చెయ్యాలా?

      చలసాని ప్రసాద్‌ గారి సాహసాన్నీ, శ్రీశ్రీ కవి గారి విప్లవాన్నీ, వివరించే మరో సంఘటన: ఒకప్పుడు స్టాలిన్‌ వ్యక్తి పూజ మీద కృశ్చెవ్‌ విమర్శలు వుండేవి. ‘కృశ్చెవ్‌ విమర్శలు తప్పు’ అనే మాట శ్రీశ్రీ కవితో పలికించాలని ప్రసాద్‌ ప్రయత్నం! శ్రీశ్రీ కవి పలికితే చాలు, తప్పు ఒప్పయి పోతుంది! ఈయన సాహసించి, ఆయన్ని అడిగారు. శ్రీశ్రీ కవి, ‘‘వ్యక్తి పూజని వొద్దనవచ్చు గానీ, వీర పూజనెలా వొద్దంటాడు కృశ్చెవ్‌?’’ అని పలకగానే ఆ పూజ, ‘వీర పూజ’గా మారిపోయింది! సరే, దాన్ని ‘వీర పూజే’ అందాం. అక్కడ స్టాలిన్‌ ఒక్కడేనా వీరుడు? రెండో వీరుడె వడూ లేడా? శ్రామిక వర్గానికే వీరపూజ అనుకుంటే, పూజలో స్టాలిన్‌ విగ్రహాలు మాత్రమే ఎందుకు వున్నాయి? ఒక కవి పలికితే, ‘పూజ’ అనే మాటకి విలువ వొచ్చేస్తుందా?

      ఒక నాడు అరసాన్ని ‘‘ఛీ, ఛా’’ అన్న ఈ విప్లవ కారులు, ఈ నాడు అరసం సభలకు కూడా వెళ్ళి వస్తున్నారు!
      విప్లవ రచయితల సంఘం పుటక, అబద్దాలతో, కుట్రలతో, క్షణానికో మాట తప్పే దాట వేతల కవితో జరిగిందన్న మాట!
      అసలు, విప్లవ రచయితల సంఘం ద్వారా ఒక విప్లవ ద్రోహం, అన్నిటి కన్నా ఘనమైన ద్రోహం ఒకటి, ఏనాడో జరిగింది.
      విప్లవ రచయితల సంఘం ఏనాడో (2002లో) ప్రచురించిన ‘‘కొడవటిగంటి కుటుంబరావు తాత్విక వ్యాసాలు’’ పుస్తకంలో, పినాక పాణి అనే ఒక విప్లవ కవి రాసిన వ్యాసం వుంది. అందులో, ‘‘మార్క్సు ప్రతిపాదించిన అదనపు విలువ కూడా ‘హైపోతిసిస్‌ కింద నేను పరిగణిస్తాను’ (పేజీ 239) అన్న మాటల్ని ఆ నాటి నించి ఈ నాటికీ ప్రచారంలో వుంచారు. మార్క్సు అదనపు విలువ సిద్ధాంతం, ఒక ప్రతిపాదనే, ఒక ఊహే – అని ఈ విప్లవ సంఘం చెపుతోంది! ఈ విప్లవ సంఘం మార్క్సిజానికి చేసిన ద్రోహం కన్నా, శ్రామిక వర్గానికి చేసిన ద్రోహం కన్నా, ఇంకా పెద్ద ద్రోహం ఇంకే విప్లవాని కన్నా చెయ్యగలదా? ‘అదనపు విలువ’ని కేవలం ప్రతిపాదనగా ఎంచే సంఘం, విప్లవ సంఘం అవగలదా?
      రంగనాయకమ్మ

    • The following was Vasantha Kannabhiran’s spiteful response to the previous article.
      చీకటిని ఒంటినిండా కప్పుకుని
      ‘కూలిన గోడల’ మధ్య
      ‘రచయిత్రి’
      అదే ఇప్పటి ‘స్వీట్‌హోం’
      కీర్తి శిఖరాలు
      ‘పేకమేడల్లా’ కుప్పకూలాయి
      ఎండి మోడైన ‘విషవృక్షం’
      వెలవెలబోతూ-
      గొడ్డలిగా మారిన కలంతో
      మార్క్సిజాన్ని ‘బలిపీఠం’గా మార్చి కూర్చుంది
      ఒక సాధ్వీమణిలా
      ఆమె నరుకుతూ నాశనం చెయ్యాలనుకుంటుంది
      ప్రతి స్వేచ్ఛను, ప్రతి హక్కును
      ప్రతి కొత్త ఆలోచననూ
      ప్రతి చారిత్రక సందర్భాన్నీ!
      ఆమె కలం కత్తి కాదు
      తన సంప్రదాయ పరత్వాన్ని సవాలు చేసే
      ప్రతి భావననూ తెగనరక జూసే గండ్రగొడ్డలి.
      చాలా ఉదారంగా నీరుపోసి పెంచిన
      ‘విషవృక్షం’ నుంచి రాలిన విషంతో
      ఆమె అవగాహన-
      ఒంటరిగా, విషాదంగా, విషంగా ఆమె!
      ఎంతగానో మారిన ప్రపంచాన్ని
      చూసేందుకు కష్టపడుతుంది.
      ఆలోచనకూ అస్తమయానికీ మధ్య
      నిరాధారంగా వేలాడుతుంది
      విమర్శనా ఓటమికొక సంకేతం
      సదా కాలుష్య భయ సందేహం
      ఒకప్పటి తెలివిని పైత్యరసం తినేయగా
      భావజాల అపవిత్రతా భయంతో
      మడిగట్టుకు మూలనచేరి
      అది కాస్తా కుళ్ళిపోయింది.
      తన గత రచనలు అదనపు విలువని
      ప్రసాదించలేక ఒట్టిపోయాయి
      మార్క్సుని ‘పెట్టుబడి’గా మార్చి
      పుక్కిటబట్టి ఎక్కడంటే అక్కడ ఉముస్తూ
      తన అదనపు విలువ పెంచుకుంటూ-
      శ్రీశ్రీ ప్రసాదాలను
      అపహసించే సాహసానికి
      పూనుకుంటూ…
      ‘బుద్ధుడూ అంబేద్కరూ ఎవరూ లేరు’
      మిగిలిపోయింది
      ‘అంధకారంలో రచయిత్రి’.
      వసంత కన్నబిరాన్‌

  2. బ్రెయిన్ డెడ్ says:

    హమ్మయ్య ఆ కవిత చదివాక ఒక్కరెవరన్న ధైర్యం చేసి ఇలా రాస్తారా లేదా అని వెయిటింగ్ థాంక్స్ జీ

  3. ఈ వ్యాసంలో నాకు నచ్చిన వాక్యాలు, పూర్తిగా ఏకీభవించే అంశాలు ఇవి
    1. ఆమెక్కడా అప్పొలిటికల్‌విమర్శ చేయగా నేను చూడలేదు. ఆమె తర్కంతో టోన్‌తో అన్నివేళలా ఏకీభవించకపోవచ్చు
    2…… ఎవరో చిన్న పిల్లలు చేసినట్టుగా నాలుగు అక్షరాలను రాళ్లుగా మార్చి విసిరితే ఎలా!

    మంచి వ్యాసం. ఆ కవిత చదవగానే ఇదేంటి ఇంత పేరున్న, పెద్దలు – ఏదో బ్లాగుల్లో దొంగపేర్లతో తిట్లదండకం చదివినట్లు అలా రాసారేమిటా అనుకొన్నాను. నా అభిప్రాయం సరైనదే అనిపిస్తుంది.

  4. Sai Padma says:

    కవిత డౌన్లోడ్ చేసి పెట్టుకొని, ఎందుకు ఇంత తిడుతూ రాసేరు అని తల బద్దలు కొట్టుకుంటున్నా..
    థాంక్స్.. స్కోర్స్ సెటిల్ లాంటి కవిత అది ..అని అర్ధం చేయించినందుకు
    మంచి వ్యాసం .. వొకప్పుడు పంపు దగ్గర కొట్టుకొనే ఆడవాళ్ళు నయం .. ఇలాంటి చీప్నేస్స్ కంటే

  5. క్యా చల్ రహాహై భాయ్..ఇస్ దేశ్ మే !
    వాటే ఫాల్ ! వాటే పిటీ !!
    ————————————–

    వసంత కన్నబిరాన్ గారు వ్రాసినట్లుగా [ ఇది ఆమె వ్రాసి వుండరని కొందరి అభిప్రాయం !] ప్రచురితమైన కవిత చదివిన తర్వాత ఈ తిట్ల దండకానికి సరైన సమాధానం ఎవరైనా వ్రాస్తే బాగుండుననుకుంటున్న సమయంలో రమాసుందరి గారి వ్యాసం వచ్చింది.

    రంగనాయకమ్మ గారు లేవనెత్తిన అంశాలకు సమాధానం దొరకక ఇలాంటి తిట్టు కవిత వ్రాసినట్లు భావించాలి. రంగనాయకమ్మ గారు ఏ విషయంలోనైనా రాజకీయపరంగానే విమర్శ చేశారు గాని వ్యక్తిగత దూషణకు దిగినట్లు ఎక్కడా చూడలేదు.

    కొడవటిగంటి , శ్రీశ్రీ , బాలగోపాల్ గార్లను ఆమె ఎందుకు విమర్శించారో ఆమె వ్రాసినవి చదివితే తెలుస్తుంది. అందులో ఖండిచదగినవి వుంటే ఖండన వ్రాయాలి. అంతేగాని వారిని విమర్శించడమే తప్పంటే ఎలా !

  6. కల్లూరి భాస్కరం says:

    ప్రస్తుత సందర్భంలో రంగనాయకమ్మగారి విమర్శ, దానిపై కొందరి ప్రతివిమర్శల జోలికి వెళ్లకుండా వేరే కోణం నుంచి మాట్లాడాలనిపించింది.
    1. రంగనాయకమ్మగారు అప్పుడప్పుడే పఠనాసక్తిని పెంచుకుంటున్న ఒక వర్గాన్ని ఆకట్టుకున్న ఒకప్పటి నవలా రచయిత్రులలో జీవించి ఉన్నవారిలో సీనియర్ మోస్ట్ అనచ్చు. ఆవిధంగా ఆమెకు, ఇప్పటి తరానికీ మధ్య అప్రకటితమైన ఒక గౌరవనీయమైన దూరం ఉంటుంది. ఆమెపై స్పందించేటప్పుడు ఆ దూరాన్ని పాటించాలనుకుంటాను. ఆమె అభిప్రాయాలను, విమర్శ ధోరణులను పక్కన పెడితే అలాంటి ఒక స్టాల్వర్ట్ మనమధ్య ఇంకా ఉన్నారన్న వాస్తవానికి ఇవ్వవలసిన విలువ ఇవ్వాల్సిందే ననుకుంటాను.
    2. అనేక పరిమితుల మధ్య రంగనాయకమ్మగారిని విశ్వనాథ సత్యనారాయణగారితో పోల్చాలని నాకు అనిపిస్తోంది. ఇద్దరికీ ఉన్న ఒక పోలిక ఏమిటంటే, నిశ్చితమైన భావజాలం ఉండడం. ఆ భావజాలం ఇతరులకు స్పష్టంగా తెలిసేలా ఉండడం. విశ్వనాథ భావజాలంతో తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా ఆయనను పెద్దగా సీరియెస్ గా తీసుకోకుండా కొంత గౌరవనీయమైన దూరం పాటించేవారని నేను అనుకుంటాను. “సీరియెస్ గా తీసుకోకుండా” అనడంలో ఉద్దేశం ఆయన సీరియెస్ గా తీసుకోదగిన పండితుడు, రచయిత కాదని కాదు. పూర్తిగా తెలిసిన భావజాలం కలిగిన వ్యక్తి కావడం, వివిధ కారణాలవల్ల స్టాల్వర్ట్ కావడం వల్ల కొంత దూరం పాటించేవారు. రంగనాయకమ్మగారికీ ఇదే వర్తిస్తుందనుకుంటాను. ఆమె విమర్శలపై ఇప్పటి వాళ్ళు ఎవరైనా సీరియెస్ గా స్పందించడం చూస్తే నాకు వింతగా అనిపిస్తుంది.
    3. విశ్వనాథలానే రంగనాయకమ్మగారు కూడా తన సమకాలికులతో ఎవరితోనూ పోల్చలేని వ్యక్తి. ఒకప్పటి మధ్యతరగతికి చెందిన కాల్పనిక నవలా రచయిత్రి నుంచి మార్క్సిజాన్ని ఉన్నదున్నట్టు నమ్మే ఒక విమర్శకురాలిగా ఆమె ఎదగడంలో ఒక గొప్ప గుణాత్మక పరివర్తన కనిపిస్తుంది. ఇలాంటిది మరే తెలుగు రచయిత్రిలోనూ మనకు కనిపించదు. విమర్శకురాలిగా కూడా ఆమెది ఒంటరి పంథా. అయినా ఈ వయసులో కూడా ఎత్తిన కలం దించకుండా ఆమె రాస్తూనే ఉండడం ఒక్కటి చాలు ఆమె పట్ల మనం అడ్మిరేషన్ చూపడానికి. అలాగని ఆమె విమర్శాధోరణి నిరాక్షేపనీయమని నేను అనడంలేదు. అంతిమంగా నా ఉద్దేశం ఏమిటంటే ఆమె పరిమితులను, లోపాలను, దోహదాలను సాహిత్యచరిత్రలో భాగం చేసి, ఒక సీనియర్ మోస్ట్ రచయిత్రిగా వ్యక్తిగత స్థాయిలో భిన్నంగా చూడాలని మాత్రమే.

  7. వసంత కన్నబిరాన్ గారికి రంగనాయకమ్మ గారిపై వున్న వ్యతిరేకత ఇప్పటిది కాదనుకుంటాను.

    2001 లొ ఓల్గా , వసంత కన్నబిరాన్ , కల్పన కన్నబిరాన్ గార్ల సంపాదకత్వంలో వచ్చిన ` మహిళావరణం ‘ పుస్తకంలో గత శతాబ్దకాలంలో అన్ని రంగాలలో తమదంటూ ఒక ముద్ర వేసిన 118 మంది స్త్రీమూర్తులను పరిచయం చేశారు. అప్పుడే పేరు , ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న కోనేరు హంపి , కరణం మల్లీశ్వరి గార్ల ను కూడా పరిచయం చేశారు గాని , రంగనాయకమ్మ గారిని గురించి వ్రాయడానికి వారికి మనసొప్పలేదనుకుంటా !

    బహుశా వారికి రంగనాయకమ్మ గారి ద్వారా సమాజానికి ఏ విధమైన మేలు కలగదనుకున్నారేమో!!

  8. వ్యక్తిగత నిందలను మాటలుగా పేర్చి అసహనంతోనో, ఆక్రోశంతోనో రాసిన ‘కవిత’ను ఈసడించుకోకపోగా.. దాన్ని శక్తిమంతమైనదిగా అభివర్ణిస్తూ మెచ్చుకునే ధోరణి ఘోరం.

    ఇలాంటి సందర్భంలో వచ్చిన మీ రచన సమయోచితంగా.. ఎంతో బాగుంది. దూషణల కవయిత్రినీ, ఆమె సమర్థకులనూ చూసి కలతపడిన చాలామంది మనోభావాలను మీ రచనలో చక్కగా ప్రతిఫలించారు.

  9. Lalita kumari says:

    చాల బాగా చెప్పారు . మా మనసులోని భావాలకు సరైన అక్షర రూపం ఇచ్చారు . వేణుగోపాల్ గారి మీద జాలి పడాలి . కొంతమంది తమ తప్పులు తెలుసుకోవాలని గాని లేదా దారి మార్చుకోవాలని గాని అనుకోరు . ఎప్పటికి కూపస్థ మండుకాలే . మారరు.మీకు ధన్యవాదాలు

  10. Thirupalu says:

    భావ జాలా సాన్నిహిత్యం , లేక భావ జాల వ్యతిరేకత అన్న విభజన లేకుండా అందరు ఆమె పై వేస్తున్న రాళ్లు వ్యక్తీ గత మైన వే నని అని పిస్తున్నది- ఆమె పై వచ్చిన విమర్శలు చదివితే.

  11. బాగా చెప్పారు రమా సుందరి గారూ..
    తను నమ్మిన విలువలపై రాజీ పడని రంగనాయకమ్మ సంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్పే సత్తా, వివేకం లేని రాతలివన్నీ. చాలసానిని, శ్రీ శ్రీ ని రంగనాయకమ్మకు ఎక్కడా వ్యక్తిగతంగా విమర్శించలేదు. వ్యక్తిపూజను, కపటాన్ని మాత్రమే విమర్శించారు. అది ఘాటుగా, చాదస్తంగా ఉండొచ్చు. శ్రీ శ్రీ, కొకు, గద్దర్ తతిమ్మా వాళ్ళ కృషిని గౌరవిస్తూనే, వారి తప్పటడుగులనూ విమర్శించాలి. ఇప్పుడు విరసం కంటే విప్లవాత్మకమైన సంస్థ నాటి పరిస్తితిలో పుడితే ఎట్లా అర్థం చేసుకోవాలి. వసంత కన్నబీర
    న్ను పొగుడుతున్న వాళ్ళు చెప్పాలి.

  12. 20 సంవత్సరాలై తెలుగుదేశానికి దూరం గా ఉన్నా, progressive writings కీ, ఆలోచనలకీ సమీపం లో ఉంటున్నాను, సాహిత్యం తోనే తప్ప సాహితీపరుల జీవిత వైరుధ్యాలతో అంతగా పరిచయం లేదు, దృక్పధాలతోనే తప్ప, ఎవరెవరు ఏ camp కి చెందినవారో అవగాహన లేదు – అదే యీ నాలుగు మాటలు చెప్పేందుకు, నాకున్నదనుకుంటున్న విశిష్ట అర్హత.

    అభ్యుదయవాదులంతా అస్మదీయులూ, నిరోధకులంతా తస్మదీయులూ…నా లెక్క సుస్పష్టం, ఇంకా ఎటూ నిర్ణయిన్చుకోని మేధస్సులన్నీ… మనం బీజాలు నాట వలసిన సుక్షేత్రాలు అని నా ఊహ! దీనికి బలాన్నిచ్చే సాహిత్యకారులనీ, కళాకారులనీ, అర్దికవేత్తలనీచూసి… “ఓహో! మా సైన్యం!” అని ఒకటికి పదిసార్లు లెక్క పెట్టుకుని సంబరపడడం నా నిత్యకృత్యం.

    ఆదివాసీల resistance movements ని చూసి అరుంధతి రాయ్ గర్వం గా చెప్తూ … the poorest of poor stopped the most powerful corporates in their tracks… అని వారి పక్షాన్న నిలుచుంది, ఆమె అస్మదీయురాలు. ఇది చాలా స్పష్టంగా నా లెక్కకు అందుతోంది, హిందూ fundamentalists, corporate giants, media… వీరందరూ కత్తులూ, కటార్లూ నూరుతూ వారి భావజాలాలను most imaginative, innovative techniques వాడి ప్రజల బుర్రల్లోకి వదులుతున్నారు. మన పక్షాన ఇతోధికం గా సహకరించే మేధో శక్తి కలిగిన వారందరూ (మహా అయితే 1% ఉంటుందేమో వారి సంఖ్య). ఒక్కటై totalitarianism పై కదా పోరాడ వలసింది!?!

    అత్యంత శక్తివంతమైన ఇంటర్నెట్ మాధ్యమం లో నాకు కనిపిస్తున్నధోరణులను అర్ధం చేసుకునే ప్రయత్నం…

    ఒక గొప్ప ఉద్యమకారుడూ, సాహితీపోషకుడూ, సహృదయుడు అయిన వ్యక్తి కీర్తిశేషులైన సందర్భాన, మరొక ఉద్యమ నాయకుడు తన జ్ఞాపకాలను పంచుకున్నారు, దాని విషయంలో, ఒక అసమాన ప్రతిభావంతురాలైన రచయిత్రి వారి కార్యకలాపాలను విమర్శించారు. వీరెవరూ మనకు తస్మదీయులు కారు. కానీ ఇది యీ మోతాదు లో లేనట్టు గా ఉంది.

    మహాకవి, యుగకర్త అని ఆరాధించే కవిని, “క్షణానికో మాటతప్పే దాటవేతల కవి” అని ఒకరు, ఆ “అహంకార అజ్ఞాన కుతర్క ప్రదర్శన” విమర్శే కాదని మరొకరూ, “ఒంటరిగా, విషాదం గా విషం తో ఆమె” … marxism ఊస్తూ ఉంటుందని దూషణ కవిత్వం ఝళిపిస్తూ మరొక లభ్ద ప్రతిష్టురాలూ … “సాహితీ నిరంకుశాన్ని ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైందని” నడుంకట్టిన వారి వారి అభిమానులూ, అనుయాయులూ … ఇలా … “శత్రువు శత్రువు మిత్రులయ్యారా” అని ఒకరూ, “settling a personal score” అని ఇంకొకరూ, ఒకప్పుడు “తాట తీసి వదిలిపెట్టారు” కనక దీనిని గా ప్రతీకారం గా చూసేది మరొకరు.

    వీరందరూ విప్లవ కాంక్షులే … అభ్యుదయ వాదులే… కానీ బాణాల గురి శత్రువు కేసి ఉందా లేక తమ సహచరుల కేసి ఉందా ? నాకు స్పష్టం గా కనిపించడం లేదు.

    ఇలా అంటున్న ప్రతివారి మాటకీ, సరైన కారణం ఉండే ఉంటుంది, ఆ చరిత్ర అప్రస్తుతం. అంటున్న ప్రతీ వారూ “ఇది ప్రజాశ్రేయస్సు కోరి మాట్లాడుతున్నామా లేక మన దళాలనే చీల్చు కుంటున్నామా” అనే విమర్శ చేసుకుని తీరాలి. అసలే శత్రు ధాటికి కొనఊపిరి తో ఉన్న విప్లవ భావాలని మళ్ళీ ప్రజల మానసాల్లో జీవించేలా చెయ్యాలంటే మాత్రం- ఈ విషవాయువుల్లో అది సాధ్యం కాదు.

    • వాసుదేవ్ says:

      “అభ్యుదయవాదులంతా అస్మదీయులూ, నిరోధకులంతా తస్మదీయులూ…నా లెక్క సుస్పష్టం, ఇంకా ఎటూ నిర్ణయిన్చుకోని మేధస్సులన్నీ…” దేవుడి గురించి వాదన జరిగినప్పుడల్లా మనకి మనమే ఏగ్నోస్టిక్ లనుకుట్లేగా భావించినట్లుగానే ఉందీ మీ ఈ ధోరణి. ఇదే సమంజసమనీ అనిపించిందీ కూడా..కుడోస్ జీ

      • ఏకీభవిస్తున్నారని అర్ధం ఔతోంది, కానీ agnostics తో పోలిక అంతగా అర్ధం కాలేదు, interesting గా ఉంది…వివరించరా please వాసుదేవ్ గారూ..

  13. 20 సంవత్సరాలై తెలుగుదేశానికి దూరం గా ఉన్నా, progressive writings కీ, ఆలోచనలకీ సమీపం లో ఉంటున్నాను, సాహిత్యం తోనే తప్ప సాహితీపరుల జీవిత వైరుధ్యాలతో అంతగా పరిచయం లేదు, దృక్పధాలతోనే తప్ప, ఎవరెవరు ఏ camp కి చెందినవారో అవగాహన లేదు – అదే యీ నాలుగు మాటలు చెప్పేందుకు, నాకున్నదనుకుంటున్న విశిష్ట అర్హత.

    అభ్యుదయవాదులంతా అస్మదీయులూ, నిరోధకులంతా తస్మదీయులూ…నా లెక్క సుస్పష్టం, ఇంకా ఎటూ నిర్ణయిన్చుకోనివారందరి మేధస్సులన్నీ… మనం బీజాలు నాట వలసిన సుక్షేత్రాలు అని నా ఊహ! దీనికి బలాన్నిచ్చే సాహిత్యకారులనీ, కళాకారులనీ, అర్దికవేత్తలనీచూసి… “ఓహో! మా సైన్యం!” అని ఒకటికి పదిసార్లు లెక్క పెట్టుకుని సంబరపడడం నా నిత్యకృత్యం.

    ఆదివాసీల resistance movements ని చూసి అరుంధతి రాయ్ గర్వం గా చెప్తూ … the poorest of poor stopped the most powerful corporates in their tracks… అని వారి పక్షాన్న నిలుచుంది, ఆమె అస్మదీయురాలు. ఇది చాలా స్పష్టంగా నా లెక్కకు అందుతోంది, హిందూ fundamentalists, corporate giants, media… వీరందరూ కత్తులూ, కటార్లూ నూరుతూ వారి భావజాలాలను most imaginative, innovative techniques వాడి ప్రజల బుర్రల్లోకి వదులుతున్నారు. మన పక్షాన ఇతోధికం గా సహకరించే మేధో శక్తి కలిగిన వారందరూ (మహా అయితే 1% ఉంటుందేమో వారి సంఖ్య). ఒక్కటై totalitarianism పై కదా పోరాడ వలసింది!?!

    “రాగద్వేషాలు మన తెలుగువారికి అలవాటే -పట్టించుకోవద్దని” హితోభిలాషులు చెప్పినా- లక్ష్యసాధన లో అందరం భాగస్వాములమే అని – అత్యంత శక్తివంతమైన ఇంటర్నెట్ మాధ్యమం లో నాకు కనిపిస్తున్నధోరణులను అర్ధం చేసుకునే ప్రయత్నం చేసాను.

    ఒక గొప్ప ఉద్యమకారుడూ, సాహితీపోషకుడూ, సహృదయుడు అయిన వ్యక్తి కీర్తిశేషులైన సందర్భాన, మరొక ఉద్యమ నాయకుడు తన జ్ఞాపకాలను పంచుకున్నారు, దాని విషయంలో, ఒక అసమాన ప్రతిభావంతురాలైన రచయిత్రి వారి కార్యకలాపాలను విమర్శించారు. వీరెవరూ మనకు తస్మదీయులు కారు. కానీ ఇది యీ మోతాదు లో లేనట్టు గా ఉంది.

    మహాకవి, యుగకర్త అని ఆరాధించే కవిని, “క్షణానికో మాటతప్పే దాటవేతల కవి” అని ఒకరు, ఆ “అహంకార అజ్ఞాన కుతర్క ప్రదర్శన” విమర్శే కాదని మరొకరూ, “ఒంటరిగా , విషాదం గా విషం తో ఆమె” … marxism ఊస్తూ ఉంటుందని దూషణ కవిత్వం ఝళిపిస్తూ మరొక లభ్ద ప్రతిష్టురాలూ … “సాహితీ నిరంకుశాన్ని ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైందని “నడుంకట్టిన వారి వారి అభిమానులూ, అనుయాయులూ … ఇలా … “శత్రువు శత్రువు మిత్రులయ్యారా” అని ఒకరూ, “settling a personal score” అని ఇంకొకరూ, ఒకప్పుడు “తాట తీసి వదిలిపెట్టారు” కనక దీనిని గా ప్రతీకారం గా చూసేది మరొకరు.

    వీరందరూ విప్లవ కాంక్షులే … అభ్యుదయ వాదులే… కానీ బాణాల గురి శత్రువు కేసి ఉందా లేక తమ సహచరుల కేసి ఉందా ? నాకు స్పష్టం గా కనిపించడం లేదు.

    ఇలా అంటున్న ప్రతివారి మాటకీ, సరైన కారణం ఉండే ఉంటుంది, ఆ చరిత్ర అప్రస్తుతం. అంటున్న ప్రతీ వారూ “ఇది ప్రజాశ్రేయస్సు కోరి మాట్లాడుతున్నామా లేక మన దళాలనే చీల్చు కుంటున్నామా” అనే విమర్శ చేసుకుని తీరాలి. అసలే శత్రు ధాటికి కొనఊపిరి తో ఉన్న విప్లవ భావాలని మళ్ళీ ప్రజల మానసాల్లో జీవించేలా చెయ్యాలంటే మాత్రం- ఈ విషవాయువుల్లో అది సాధ్యం కాదు.

    • కళ్యాణి గారు మీ మాట చాలా ఉపసమనంగ ఉంది. సమయాసమయలను గుర్తించక తమ మేధో తనాన్ని చూపించుకునే ఈ తర్క వాదులు నిజానికి కుర్చీలకు పరిమితమైనవారు. వీళ్ళు నా దృష్టిలో intellectual coverts. ప్రజలను అయోమయంలో పడేసే వారు. వీరివలన ఒనగూరె లాభం కంటే కీడే ఎక్కువ. ఎవరి ప్రతిష్టలకు వారు పోవడం వారి వారి మేదావితనాన్ని చూపుకోవదమె తప్ప నిజంగా ఆచరణలో ఉన్నవారికి వెన్నుదన్నుగా నిలిచే వాళ్ళు కాదు. నాకు మీ కామేన్తులోని ఆర్ద్రత ఆవేదన నచ్చింది. ధన్యవాదాలు.

  14. AMARENDRA DASARI says:

    వెల్ said రామా సుందరి గారూ..కంగ్రాట్స్ అండ్ థాంక్స్..

  15. SrInivas Vuruputuri says:

    చాలా మంచి వ్యాసం. సమయానికి రాసారు.

    విమర్శకి అనుకూలమైన వాహిక వ్యాసం, కవిత్వం కాదు. వసంత గారి “వివాదకవిత”లో thinly veiled తిట్లు ఉన్నాయి కాని కవిత్వం లేదు. రంగనాయకమ్మగారి ప్రశ్నలకు జవాబూ లేదు. “ముహ్ తోడ్ జవాబ్” అన్నారెవరో… గాయపడుతున్నదెవరో గమనించలేకపోవటం ఎంత విషాదం!

  16. alluri gouri lakshmi says:

    congratulations రమా !

  17. P V Vijay Kumar says:

    రమా సుందరి గారు, I appreciate the spirit of the article. Time has come to cut down unbridled atorcious arguments of Ranganayakamma. I believe this article would only pampers her more. వి ర సం కు , వీ ఎచ్ పీ కీ తేడా లేనట్టు మాట్లాడ్డమే ఒక కుట్ర.

    • Aranya Krishna says:

      వెల్ సెడ్ విజయకుమార్ గారూ! “వి ర సం కు , వీ ఎచ్ పీ కీ తేడా లేనట్టు మాట్లాడ్డమే ఒక కుట్ర.” మీ వ్యాఖ్యని నేనూ ప్రస్తావించాను.

  18. వీర బొబ్బిలి says:

    కమ్యూనిస్టులం అనుకున్నవాళ్ళు,మార్క్సిజాన్ని అభిమానించేవాళ్ళ ఆలోచనా విధానం ఎలావుండాలో చెప్పారు.అభినందనలు.

  19. ప్రసాదమూర్తి says:

    దేనికైనా సమయం..సందర్భం..సంయమనం అనేవి వుంటాయి. ఎప్పుడు ఏ సందర్భానికి ఎలా స్పందిస్తున్నామని చెక్ చేసుకోలేకపోతే ఇదిగో ఇలా బోనెక్కాల్సి వస్తుంది. నమ్మిన సిద్ధాంతాల కోసమే జీవితమంతా నడిచిన వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన సహచరులు తప్పనిసరిగా స్మరించుకుంటారు. వారి పోరాట ప్రస్థానంలో సైధ్దాంతికమైన పొరపాట్లు..చారిత్రకమైన తప్పిదాలు జరిగివుండొచ్చు. వాటిని ఎత్తి చూపాల్సిందే కాని సమయం ఇది కాదని నేను అనుకుంటున్నాను. అందునా వారు పెట్టిన విప్లవ సంఘం ఆవిర్భావంలో జరిగిన అవకతవకలు..లోటుపాట్లు సాకుగా చూపి మొత్తం ఆ సంఘమే ద్రోహపూరితమైందని బూతులు కంటె ఎక్కవగా బాధించే పదాలతో ఎద్దేవా చేయడం సంయమనం కోల్పోవడానికి పరాకాష్టగా వుంది. అయ్యో ఒక్కోసారి అంత పెద్దావిడ కూడా ఎందుకిలా కంగారుపడతారు అని బాధకలిగింది.అంతమాత్రాన ఆమె మీద వున్నఅభిమానం కించిత్తు కూడా తగ్గలేదు.అంతలోనే అటువైపుగా బండరాళ్లు ఆమె మీద పడ్డాయి. అక్కడ మరింత సంయమనం కోల్పోయిన చవకబారుతనం కనపడింది. నువ్వు నావైపు వేలెత్తి చూపావ్. నేను మొత్తం నీ వేళ్ళనే నరికేస్తా అని బెదిరించినట్టుగా వుంది. ఇద్దరు సంసారులు లాభాషలో తిట్టుకుంటే ప్రపంచం ఎలా తట్టుకోవాలి? కల్యాణిగారన్నట్టు అస్మదీయులలో ఎందుకింత అసహనం? అర్థం కాదు. కొట్టుకోవడంలో హుందాతనం కనపర్చలేమా? అసలు కొట్టుకోవడానికే తెగించిన తర్వాత ఇక వావి వరసలతో పనేముందని అంటే ఆ బరితెగింపును పట్టించుకోకుండా వుంటేనే మంచిది. ఎంతో కష్టపడి శిఖరాలను అధిరోహించిన వారు అంత ఎత్తుకి వెళ్ళి అక్కడ అమ్మలక్కల్లా కొ్ట్లాడుకోవడం ఖండించాల్సిందే. ఇప్పటికైనా యుద్ధం గౌరవప్రదంగా మొదలుపెట్టి..గౌరవప్రదంగా కొనసాగించి..గౌరవప్రదంగా ముగిస్తే ఇరుపక్షాలకు చెందిన ఒకే అభిమాన కూటమి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. జవాబులు చెప్పాల్సిన అవసరం వున్నప్పుడు చెప్పి తీరాలి. తప్పులు జరిగితే ఒప్పుకోవడంలో తప్పేం లేదు. రమాసుందరి గారూ మంచి మాటలు చప్పారు.

    • “ఇరుపక్షాలకు చెందిన ఒకే అభిమాన కూటమి”… … ..చర్చిస్తున్న మనం అందరం ఎవరమో సరిగ్గా చెప్పారు ప్రసాదమూర్తి గారూ!

      … … ….ఈ విషయం ఎవరికీ పట్టడం లేదో, లేక మనం వారికి పట్టేలా చెప్పలేకపోతున్నమో…

  20. Aranya Krishna says:

    ఆంధ్రజ్యోతిలో రంగనాయకమ్మ గారి వ్యాసం అసహ్యకరమైన స్థాయిలో వుంది. చలసాని ప్రసాద్ గార్ని స్మరించుకుంటూ విరసం ఆవిర్భావ సందర్భంలో హడావిడిగా శ్రీశ్రీని స్వంతం చేసుకునే తాపత్రయాన్ని ఎటువంటి దాపరికం లేకుండా వివరించిన వరవరరావు గారి వ్యాసాన్ని ఆమె రంధ్రాన్వేషణే చేసారు. వేరే వ్యాసంలో ఒక మితృడన్నట్లు ఆమె విరసానికి వి హెచ్ పి కి తేడా చూడలేదు. విరసం మీద ద్వేషం తప్పితే మీకు ఇందులో ఎంత రాజకీయం కనబడింది రమా సుందరి గారు? అసలు ఎందుకంత ద్వేషం? బహుశ శ్రీశ్రీని మేము తీసుకెళ్తామని అరసం వారికి వరవర రావు, చలసాని గార్లు దరఖాస్తు పెట్టుకోవాలేమో! వారి అనుమతి తీసుకొని చేయాలి కదా! ప్రతిదీ పద్ధతిగా, పెద్దమనుషుల్లా, నిర్వచించబడిన నిజాయితీ నిర్వచనాలకు అనుగుణంగా నడుచుకోవాలేమో! ఆమెకి “లార్జర్ ఇంటరెస్ట్స్” అన్న విషయం పట్టదు. రంగనాయకమ్మ స్థాయి వ్యక్తి ఎటో ఒక వైపు వుండి తీరాలి. విరసం బైటనుండైనా ఏదో ఒక మేరకు విరసానికి సహకరిస్తే రాజ్యం ఆమెని క్షమించదు. “నేను విరసంలో భాగం కాదు” అని చెప్పుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. అందుకే ఈ రంధ్రన్వేషణ, బురదజల్లుడు. ప్రజా పోరాటాల్లో పాల్గొనకపోవటానికి ఆమె చెప్పే కారణంలో మీకు రాజకీయాలు ఎప్పుడైనా కనబడ్డాయా? మీ ప్రగతి శీల మహిళా సంఘానికి చాలా కాలం క్రితం ఆవిడిచ్చిన ఒక ఇంటర్వ్యూ లో “మీరెందుకు ఏ సంఘాల్లో చేరరు?” అన్న ప్రశ్నకు ఆమె సమాధానంగా “అసలు మార్క్సిస్టు దృక్పధంతో సంఘాలంటూ వుంటే కదా చేరటానికి” అని చెప్పటం నాకింకా జ్ఞాపకం వుంది. అంటే మీరందరూ ఎటువంటి దోషాల్లేని, నికార్సైన సంఘాలు ఏర్పాటు చేస్తే ఆమె సభ్యత్వం తీసుకొని పావనం చేస్తారా? సంఘాల ఏర్పాటులో, వుద్యమ నిర్మాణంలో లోటుపాట్లుండవా? ఈమె ధోరణి చూస్తే ఎద్దుపుండు కాకికి రుచి అన్నట్లు వుంటుంది. ఆమె గోళ్ళకి మట్టి అంటకూడదు. మళ్ళీ ఎవరూ ప్రశ్నించకూడదు. ఒక భయంకరమైన అవకాశవాదిని మీరెలా సమర్ధిస్తున్నారో నాకర్ధం కావటం లేదు. “సెట్ట్లింగ్ ద స్కోర్స్” మీకు రంగనాయకమ్మ వైపు నుండి కనిపించ లేదా? ఆవిడ వ్యక్తిగత దాడి చేయరా? మీరు మర్చేపోయారో లేక మీకు తెలియదో కానీ ఒక చాలా కాలం క్రితం మరో రచయిత్రి, రచయతల వ్యక్తిగత వ్యవహారంలో తలదూర్చి ఎంతో కంపు చేసారు. పుస్తకాల మీద పుస్తకాలు వేసారు. మీరు తెలిసో తెలియకో రంగనాయకమ్మని చాలా గ్లోరిఫై చేసారు. ఆవిడకన్న్ని ప్రిన్సిపుల్స్ ఏమీ లేవు. తన ఆచరణారాహిత్యాన్ని దాచుకోటానికే ఇలా సంఘాల మీద దాడి చేస్తారు. వసంత కన్నబిరాన్ రాసిన కవిత్వంలో వ్యంగ్యం మాత్రమే వుంది. ఆ వ్యంగ్యంలో లోతు లేదు. కానీ శాపనార్ధాలు కూడా లేవు. మరి మీకు మెటికలు ఎలా వినిపించాయో! ఆమె రెగ్యులర్ గా రాసే కవి కాదుగా. అన్ని మెలుకువలు పాటించి వుండకపోయుండొచ్చు. జాగ్రత్తలు తీసుకొని వుండకపోవచ్చు. టివిల్లో రియాల్టీ షో జడ్జీలా వ్యవహిరించే పెద్దమ్మని వదిలేసి చేతకాని కవిత్వం రాసిన చిన్నమ్మని పట్టుకుంటే ఎలా? తన మరణవార్త ప్రపంచానికి తెలిసే లోగా తన కాయం ఖననం అయిపోవాలని కన్నబిరాన్ కోరిక. మీరా విషయం ఎత్తటమే విడ్డూరం. క్యా చల్‌రహా హై భయ్‌..ఇస్‌దేశ్‌మే!

    • వీరబొబ్బిలి says:

      ARANYA KRISHNA గారూ,సెబాసండి మా బాగ సెప్పేరండి.మీరు మంచి జోకులేస్తారండి.నవ్వలేక సత్తన్నానండీ బాబు…

      “విరసం బైటనుండైనా ఏదో ఒక మేరకు విరసానికి సహకరిస్తే రాజ్యం ఆమెని క్షమించదు.“నేను విరసంలో భాగం కాదు” అని చెప్పుకోవాల్సిన అగత్యం ఏర్పడింది”. అనిమీరన్నారు గదండి.నాకు నవ్వాగలేదండి.అవునండి,అంచేత యిలాగా రాసేస్తాదండీ..నిజమండి.పెబుత్వం వారి అరెస్టులకి,జైల్లకి బయ్యం పడే ఆవిడ విరసాన్ని యిమర్శిత్తాదండి.విరసాన్నియిమర్శించే బదులు యిప్లవాన్ని యిమర్శిస్తే బాగున్నండి.పెబుత్వం వారూ పిలిసి పీటేసి ,సన్మానాలో బిరుదులో యిద్దురండి .కానీ ఆవిడకా గ్యానం నేదండి.
      విరసమంటే పెబుత్వానికి శానా బయమండి.అందుకే విరసం రచయితలందర్నీ జైల్లో పెట్తేస్తాదండి.యిప్పటికీ ఓయాభై మంది జైల్లోనే వుండి వుంతారుకదండీ( ఓ సారీ..అంతమంది విరసంలోనే లేరంతారా-పాపము సెమించుగాక) అసలు ఈవిడకు జైలంతే బయమెందుకోనండి.ఆ విషయంలో వరవరరావుగారు గొప్పేనండి,కోర్టు బెయిలిచ్చినా రద్దుచేసుకొని మరీ జైలుకెల్లారు గదండి.

      మడిసన్నతరువాత ఆపాటి లౌక్యముండాలండి.అలానేప్పోతే ‘మడిసికి గొడ్డుకి తేడాఏటుంటాదం’డి.ఆసంగతి వేణుగోపాల్ గారికి తెలుసండి.ఏకకాలంలో శతృవుతోనూ మితృడితోనూ కరస్పర్శ చేయగలరండి.ఈవిడకా లౌక్యం లేదు సరికదా ఉన్నోలని విమర్శించేస్తాదండి.(ఈ పేపరోలొకటండి.ఆవిడరాసినచెత్తంతా ఏసేస్తారండీ బాబు.)
      ఈవిడికి భగమంతుడు ఆగ్యానమివ్వలేదండి,ఈవిడ భగమంతున్ని కూడా నమ్మదటండీ,అటుభగమంతున్నీ నమ్మక ,ఇటు విరసాన్ని నమ్మకపోతే ఆవిడతోటెలాగండి.కష్టమేనండి.అందుకేనండి ఆవిడ ‘విరసానికి వి హెచ్ పి కి తేడా చూడలేదు.’ అంటారండి.ఆపాటిమాట అనొచ్చండి.
      సివరగా ఓమాటండి.
      మనబోటివాళ్ళం ఉహూ..ఉహూ..ఎన్నిమంత్రాలేసినా ఆవిడ తగ్గదండి.
      ఆవిడరాసినరాతలన్నీ తప్పులతడకలనీ,అబద్దాల్నీ రుజువు పరిస్తే ఆవిడ నోరూ మూయింపించ వొచ్చటండి.( మావూరి సిద్దాంతి చెప్పేదండి)కాబట్టి బాబ్బాబు ఆపని సేయిద్దురూ….

      • Aranya Krishna says:

        అయ్ బాబోయ్! మీరు ఈరబొబ్బిలి కాదండి బాబూ, ఈరాబిమాని! అవునండి ఆమె అ సంస్థలోనూ ఎందుకు చేరరండి? అందరు మీరన్నంత దుర్మార్గులున్నన్దుకేనా? మరయితే ఆమే ఎదో ఒక విప్లవ సంస్థని స్థాపించి ప్రభుత్వాల్ని సవాల్ చేయలేకపోయారా? విరసం గురించి, ఎం.ఎల్.పార్టీల గురించి తిడుతూ కూడా విప్లవం గురించి మాట్లాడటం ఒక్క మీ నాయకమ్మ గారికి మాత్రమే తెలిసిన విద్యండి. ఇంతకీ ఈ చర్చ ఆవిడ నోరు మూయించటానికనుకుంటున్నారా? అది ఎవరి వల్లా కాదు. భారతదేశం లో ఎప్పటికనా గంగానదిని శుభ్రం చేయగలరేమో కానీ రంగనాయకమ్మ గారి గళాన్ని ఎవరూ బాగుచేయలేరండి. ఈ చర్చ అంటా మనలాంటి వాళ్ళ కోసమేనండి. మీ వూరి సిద్ధాంతిని ఏ చెట్టు కిందనైనా బజ్జోమనండి.

  21. Mangu Siva Ram Prasad says:

    చలసాని ప్రసాద్ గారు మార్క్సిస్ట్ అయినా పురాణేతిహాసాలు, సంప్రదాయ సాహిత్యం పట్ల గౌరవ భావం కలవారు. అలనాటి విశాఖవాసులు సంప్రదాయవాది, కవిగారుగా ప్రసిద్ధి గాంచిన మారేపల్లి రామచంద్ర శాస్త్రిగారి జీవిత చరిత్ర, ‘కవిగారి మనుగడ’ పుస్తకాన్ని వెలువరించడంలో ఆయన చేసిన సహాయం, అందించిన ప్రోత్సాహం నాకు మరుపురానివి. విశాఖపట్నంలో ఆయన అన్ని సాహిత్య సభలలోనూ పాల్గొనేవారు. ఎటువంటి వితండ వాదం చేసేవారు కాదు. ఆయన ఇల్లు ఒక పుస్తక భాండాగారము. ఇటీవల రంగనాయకమ్మ గారి భారతము పుస్తకం జుగుప్సాకరమైన, అవగాహన రాహిత్యమైన రాతలతో ప్రజల మనోభావాలను కించ పరిచే విధంగా మార్క్సిస్ట్ దృక్పథంతో వెలుబడినప్పుడు పురాణాలను కెలకవద్దని రంగనాయకమ్మ గారికి ఒక సాహిత్య సమావేశంలో సున్నితంగా సూచించినట్లు ఒక సన్నిహిత సాహితీ మిత్రులు చెప్పారు. అపరిపక్వ జ్ఞానంతో (విత్ హాఫ్ బేక్డ్ నాలెడ్జ్) పురాణాల జోలికి వెళ్ళడం క్షమించరాని నేరం. శ్రామిక కర్షక మార్క్సిస్ట్ గతి తార్కిక భౌతికవాద దృక్పపథంతో (The principle of dialectical materialism) రామాయణ, భారతం వంటి పురాణ గ్రంథాలను రంగనాయకమ్మగారు మార్క్సిస్ట్ సులోచనాలతో పరిశీలించడం మోకాలికి బోడిగుండుతో ముడిపెట్టడం వంటిది. .మార్సిస్ట్ సాహిత్య విమర్శ ఒక రాజకీయ ఛాందసవాదం. ఆ శంఖంలో పోస్తేగాని తీర్థం కాదనుకుంటే ఎలా.? కురాన్, బైబిల్ వంటి ఇతర మతస్థుల పవిత్ర గ్రంథాలను విమర్శించ గలిగే ధైర్య సాహసాలు రంగనాయకమ్మ వంటి మార్క్సిస్ట్ విమర్శ కులపెద్దలకు ఉన్నవా అనేది శేష ప్రశ్న.
    —మంగు శివ రామ ప్రసాద్, విశాఖపట్నం.

    • Thirupalu says:

      చలసాని ప్రసాద్ గారిని పొగిడారు గనుక మీరు మార్క్సిస్ట్ అభి మాని అయినట్లా ?
      / కురాన్, బైబిల్ వంటి ఇతర మతస్థుల పవిత్ర గ్రంథాలను విమర్శించ గలిగే ధైర్య సాహసాలు రంగనాయకమ్మ వంటి మార్క్సిస్ట్ విమర్శ కులపెద్దలకు ఉన్నవా అనేది శేష ప్రశ్న./
      ఈ మాట హిందుత్వ వాదులు అంటారేమో గాని, మార్క్సిస్ట్ అభి మానులు అనరు అనుకుంటా?

    • వీరబొబ్బిలి says:

      శివరాంప్రసాదుగారూ మొహమాటాలూ సర్దుకు పోవడాలు చలసానిగారికి వుండొచ్చు,మరొకరికి వుండొచ్చు.లేదూ విరసానికి వుండొచ్చండి,కానీ విప్లవానికి అలాటివేటివుండవండి.అదే వొచ్చినచిక్కండి.ఏటిసెస్తామండి..మరీ అంత విప్లవం పనికిరాదంటే ఆ రంగనాయకమ్మ వినదండి..ఆవిడఖర్మ..మనమేమి సెయ్యగలం చెప్పండి..

    • వాసుదేవ్ says:

      “కురాన్, బైబిల్ వంటి ఇతర మతస్థుల పవిత్ర గ్రంథాలను విమర్శించ గలిగే ధైర్య సాహసాలు రంగనాయకమ్మ వంటి మార్క్సిస్ట్ విమర్శ కులపెద్దలకు ఉన్నవా అనేది శేష ప్రశ్న.” ఇదొక్కటె, దీనికి సమాధానంగా ఇక్కడ ఆమెకి సపోర్ట్ గా రాస్తున్న వారెవరైనా చెప్పగలిగితే ఇక ఈ చర్చ ముగుసినట్లే..కానీ దీనికి నాయకమ్మగారే కాదుకదా ఆమెని మోస్తున్న వారెవ్వరూ కూడా నోరు మెదపరు. ఎందుకంటే దానికి వారి దగ్గర జవాబు లేదు కాబట్టి

      • Thirupalu says:

        ప్రతి దానికి ‘ చరిత్ర నిర్ణయిస్తుంద’ ని చెప్పే మార్క్సిష్టులు రంగ నాయకమ్మ విమర్శ పై మండి పడటం దేనికో అర్ధం కావడం లేదు. ఈ రోజు రంగ నాయకమ్మ గారి విమర్శ లేక పోతే రేపు చరిత్ర మరిచి పోతుందా? మరిచి పోతే రంగ నాయకమ్మ గారు ఎత్తి చూపటం సరి కాదేమో. మరిచి పోక పోతే రంగ నాయకమ్మ గారి ది తప్పేలా అవుతుంది?
        /ఇక్కడ ఆమెకి సపోర్ట్ గా రాస్తున్న వారెవరైనా చెప్పగలిగితే ఇక ఈ చర్చ ముగుసినట్లే..కానీ దీనికి నాయకమ్మగారే కాదుకదా ఆమెని మోస్తున్న వారెవ్వరూ కూడా నోరు మెదపరు. ఎందుకంటే దానికి వారి దగ్గర జవాబు లేదు కాబట్టి/
        మార్క్సిష్టులు ప్రకారమే నిన్నటి సంస్కృతిని, నేటి సంస్కృతిని కెలకకుండ రేపటి సంస్కృతి ఏర్పడదు. ఈ దేశ సంస్కృతి కి ఆధార లైన పురాణాలను విమర్సించ కుండా నూతన సంస్కృతి ఎలా ఏర్పడుతుందో మీరు చెపితే బాగుంటుంది.

  22. Potu Rangarao says:

    రమక్క….సూటిగా,చక్కగా రాసారు.రంగనాయకమ్మ గారి విమర్శలో వ్యంగ్యం కొంత ఎక్కువ.లౌక్యం,ఎత్తుగడలు వుండవు.సూటి,పోటి మాటలు badinchavachu . కాని ఆమెగారి విమర్శలో గతితర్కం వుంది.కాని వసంత గారి కవిత్వం వ్యక్తిగత గుడ్డి vimarsa laga వుందనిపించింది.వీటన్నికంటే Venugopal గారు అతి సంతోషం తో దానిని ఓన్ అప్ చేసుకోవటం manchi ga అనిపించలేదు.తాత్విక చిన్తననుంచి bayataku వెళ్లి చూడలేము కదా.అస్తిత్వ కోణం లోనే చూస్తున్నారు. ఓకే..మంచి,బాలన్స్ write అప్ కి థాంక్స్…….

  23. రంగనాయకమ్మ అడ్డ దిడ్డంగా, విచక్షణ లేకుండా తిట్టేది; సారీ అపొలిటికల్ గా విమర్శించటం అనాలి గాబోలు ….ఎవరిని??

    శ్రీ శ్రీ ని. కొడవటిగంటి ని. చలసాని ని. బాలగోపాల్ ని. వరవర రావు ని…..సగటు మనిషి కోసం/అట్టడుగు వర్గాల వారి కోసం , వాళ్ళ మంచి కోసం, వాళ్ళ వికాసం కోసం కలలుగని అవిరామం గా పనిచేసిన వాళ్ళని . లోకం లో విమర్శించడానికి ఇంకేమీ చెడు లేనట్లు ఎంతో ఒకింత మంచి చేయడానికి పాటుపడుతున్న వాళ్ళ వెనకనే ఎందుకు పడుతున్నట్లు??

    తనకన్నా పెద్ద మార్క్సిస్ట్లు ఎవ్వరూ లేరని, తనకన్నా గొప్ప సాహితీవేత్తలేవరూ లేరని ప్రూవ్ చెయ్యడానికా?? రంగనాయకమ్మ విచక్షణా రాహిత్యం ఎపోలిటికాల్ పీసెస్ గాను, ఆ ధోరణిని విమర్శించే వాళ్ళని పొలిటికల్ గాను అర్ధం చేసుకునే భజన పరులు రంగనాయకమ్మకి మంచి చేస్తున్నారా ???

  24. “శ్రీ శ్రీ ని. కొడవటిగంటి ని. చలసాని ని. బాలగోపాల్ ని. వరవర రావు ని…సగటు మనిషి కోసం/అట్టడుగు వర్గాల వారి కోసం , వాళ్ళ మంచి కోసం, వాళ్ళ వికాసం కోసం కలలుగని అవిరామం గా పనిచేసిన వాళ్ళని…” మీ మాట తప్పకుండా ఒప్పుకుంటాను సత్యం గారు… మరి ఆ లిస్టు లో రంగనాయకమ్మగారు లేరా? ఉన్నారు …కనకే వారిని కూడా అలా తీసిపరేయ్యకూడదని మనవారందరికీ…అంటే మంచిని కోరుకునేవారందరికీ విజ్ఞప్తి…

    • వీరబొబ్బిలి says:

      కల్యాణి గారూ మీరన్నట్టు “అట్టడుగు వర్గాల వారి కోసం, వాళ్ళ మంచి కోసం, వాళ్ళ వికాసం కోసం కలలుగని అవిరామం గా పనిచేసిన వాళ్ళని…” ఎవరో ఏదో అన్న వాళ్ల కీర్తికిగానీ, వాళ్ల గుర్తింపుకిగానీ వచ్చిన యిబ్బందేమి ఉండదండి ఆమాటకొస్తే ప్రతివ్యక్తిలోనూ ఏదోమేరకు లోటుపాట్లనేవి ఉంటానే వుంటాయి..కాకపోతే లోటుపాట్లనేవి వుంటే అవి ఎప్పుడో ఒకప్పుడు ఏవరో ఒకరు బయటికి అనేస్తునే వుంటారండి.అంతమాత్రాన భయపడల్సిందేమీ లేదనేది నాభిప్రాయమండి..వీరాభిమానులు మాత్రమే బ్రహ్మాండం బద్దలైపోతోందన్నంత హాడావుడి చేస్తారు.

      • వీరబొబ్బిలి గారూ, ఆమెకు ఏదో అగౌరవం జరుగుతోందని నా concern కాదండీ, ఎవరినైనా తీసిపడేసామంటే…వారు చెప్పిన మంచిని గ్రహించకుండా పోతామని నా concern… అందుకే నా అభిప్రాయం నలుగురి తో పంచుకుంటున్నాను…

    • Aranya Krishna says:

      కళ్యాణి గారూ! శ్రీ శ్రీ,. కొడవటిగంటి. చలసాని. బాలగోపాల్. వరవర రావు లాంటి వారు ఏం చేసారో చెప్పటానికి చాలా వుంది. కొన్ని వైరుధ్యాలున్న వ్యక్తిత్వం అయినప్పటికీ శ్రీశ్రీ అం.ప్ర.పౌరహక్కుల సంఘానికి, విరసానికి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన సంఘం అధ్యక్షుడిగా అనేక సభల్లో ప్రసంగించిన వాడు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరపున కొన్ని వందల సభల్లో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నవాడు. చలసాని, బాలగోపాల్, వరవర రావు లాంటి వారి సంగతి చెప్పే పనిలేదు. వీళ్ళెవ్వరూ పడక్కుర్చీ మేధావులు కారు. ఏ పనీ చేయనివాళ్ళు ఏ తప్పు చేయరు కళ్యాణి గారు. రంగనాయకమ్మ గారి కార్యాచరణ ఏమిటో మీరు చెప్పగలరా? ఆమె ఏ సంస్థలో సభ్యురాలో చెప్పగలరా? ఆమె పనిచేసేవాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఆమె రాజ్యహింసని ఎంత ఎదుర్కొన్నారో చెప్పగలరా? అయినా విరసం లాంటి సంస్థల్ని టార్గెట్ చేసే రంగనాయకమ్మ లాంటి వారు రాజ్యానికి స్నేహితులు కాక శతృవులెలా అవుతారు?

  25. Delhi Subrahmanyam says:

    అరణ్య క్రిష్ణగారికీ, మంగు శివ రామ్ ప్రసాద్ , సత్యం గాలకు ప్రత్యేక అభినందనలు. కృష్ణ గారూ, మీ ఇంటి పేరుని వాడుకుంటూ చెప్తున్నందుకు మన్నించాలి. ఎంత శాస్త్రపూర్వాకంగా , సహేతుకంగా చెప్పినా వినడం ఇష్టం లేని వారిముందు ఇదంతా అరణ్య ఘోషే. ఒక పక్క రంగనాయకమ్మ గారు అల రాయకూడదని చెపుతూనే, వసంత గారు మరీ అంత వ్యంగ్యం గా రాయడం క్షమించరాని నేరం అంటున్నారు. ఈ ద్వంద నీతి మనం చాల తరచు గా మన తెలుగు వామపక్ష సాహిత్య కారులు గా చెప్పుకునే వారిలో చూస్తాం. ఎప్పుడయినా ఒక సాహితీ సదస్సులో మనం ఒక రచయితని ఏదయినా ఒక చోట అద్యక్షత వహించమని పిలుస్తే ” అలాంటి మిత వాది సాహిత్య కారుడిని ఈ అభ్యుదయ సదస్సుకి ఎలా పిలిచారండీ అని ప్రశ్నించిన వారే, అలాంటి ఇంకో అభ్యుదయ సదస్సు పెడితే వాళ్ళు మిత వాది గా ముద్ర వేసిన ఆ రచయితనే ప్రత్యేకం గా ఆహ్వానిస్తారు. ఇలాంటి ద్వంద నీతి, అవకాసా వాదం మిన్ను గా ఉన్న తెలుగు సాహిత్య కారుల మధ్య ఇది చాలా మామూలయిన విషయం.

    ఇదే విషయం మిద నేను ఒక రచయిత్రి తో మాట్లాడితే ఆవిడిలా అన్నారు: విరసం ఆవిర్భావం గురించి ఆమె మాటలు నాకూ నచ్చలేదు., ఆమె కూడా గట్టిగా ఆధారాలు లేకుండా మాట్లాడరు; అవును. ఆవిడ చెప్పినట్లు ముందే సభ్యులకు చెప్పి… ఇవన్నీ ఆచరణలో ఎప్పుడూ జరగవు,ఆమెకు ప్రాక్టికల్ అప్రోచ్ ఉండదు..అలా అన్న ఆవిడే, తర్వాత ఇంకోలా అన్నారు.

    మళ్ళీ ఇంకోసారి అరణ్య క్రిష్ణగారికీ, మంగు శివ రామ్ ప్రసాద్ , సత్యం గార్లకు హార్దిక అభినందనలతో.

  26. hariprasad.g says:

    1.పెట్టుబడిదారితనం 2.ఆస్తికత్వం.3.మతం 4.కులం. ఈ నాలుగు ఇష్టం లేనివారికి రంగనాయకమ్మగారి రచనలు సహజంగానే నచ్చుతాయి.పై నాలుగు ఇష్టపడేవారికి రంగనాయకమ్మగారి రచనలు ఇష్టం కావు.ఆమెని ద్వేషిస్తారు కూడా.పై నాలుగింటిలో కొందరు కొన్ని ఇష్టపడతారు,కొన్ని ఇష్టపడరు,వారికి కొన్ని రచనలు నచ్చుతాయి,కొన్ని నచ్చవు.
    రచనల పైనే అభ్యంతరాలు తెలిపితే భావుంటుంది. ఆమె సిద్ధాంతం ప్రకారం ఆమె ఉంటుంది. అలా ఉండడమే సమంజసం. సహాయం చేసినవారు, చనిపోయినవారు చేసిన తప్పుని ( సిద్ధాంతపరంగా) తప్పు ఆననడం మంచిదే. తప్పు ఒప్పు కాదు సిద్ధాంతపరంగా ఎప్పటికీ.అంతమాత్రానా వారు చేసిన మేలు మరిచినట్టు కాదు. ఎవ్వరూ చేసినా తప్పుని తప్పే అనాలి.మేలుచేసినవారు తప్పు చేసినప్పుడు తప్పు ఆనకపోవడం తప్పే.అలా అన్నప్పుడే సిద్ధాంతాన్ని సరిగా నేర్చుకోగలం.

  27. Delhi Subrahmanyam says:

    రంగనాయకమ్మ గారు తన వ్యాసం లో ఇలా అన్నారు. “శ్రీశ్రీని ముందు పెట్టి, రచయితల్ని సమీకరించాలని చలసాని ఆలోచించే వారట! ఒక సంఘానికి సభ్యుల్ని సమీకరించాలంటే, దాని ‘ప్రణాళిక’ ద్వారా ఆ పని జరగాలా, లేకపోతే ఒక రచయితనో, ఒక సినిమా హీరోనో చూపిస్తూ ఆ పని చెయ్యాలా?” ఈ మాట – చలసాని ఆలోచించే వారట – ని ఇంకో సరి చూడండి ‘వారట’ అనే మాట ఆధారం లేని మాట స్వంత ఊహ. దీనికి ఆధారం లేదు. అలాగే . “ఒక రచయితనో, ఒక సినిమా హీరోనో చూపిస్తూ ఆ పని చెయ్యాలా?”. ఎంత అన్యాయమయిన హేళన అది. విరసం స్థాపించా బడ్డాక అందులో ముఖ్యమయిన రచయతలను -చేర, గద్దర్, వివి, నాకు ఢిల్లీ లో బాగా తెలిసిన సురా (సి.వి.సుబ్బారావు)- ఇలా ఎంతో మందిని ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు నిర్భంధం లో ఉంచింది. వీరందరూ రంగనాయకమ్మ గారు చెప్పినట్టు ఒక సినిమా హీరోనో చూసి విప్లవ సాహిత్యం లోకి రాలేదు. విరసం పుట్టాక ముందే, సృజన అనే సాహిత్య పత్రిక ఉండేది, అలాగే, చేర దిగంబర కవుల్లోంచి వచ్చేరు. ఇంకా తిరుగుబడి రచయతలున్నారు. వీలన్దరినీ ఒక ఆశయం కలిపింది. దానికి శ్రీ శ్రీ గారు ఒక కేంద్ర బిందువు మాత్రమే.

    రంగనాయకమ్మ గారు ఎక్కువుగా మధ్యతరగతి స్త్రీలనూ, వారి ఇబ్బందులనూ, వారికీ కావలసిన స్వేచ్చ గురించీ రాసారు. కొంత అత్తతడుగు వారి మీద రాసున్దచ్చు. అంత మాత్రాన ఆవిడకి, కోకు ను , బాలగోపాల్ ను, రావి శాస్త్రి గారిని, కాళీపట్నం రామారావు గార్ని (ఆయన యజ్గ్నం కదా మిద పెద్ద విమర్శా రాసారు) చలసాని ని సందర్భ రహితం గా విమర్శించే అధికారం వచ్చేస్తుందా. ఇది చాల వింతయిన వాదన.

    .

  28. రంగనాయకమ్మ గారు ఎం చేసారు అన్న ప్రస్నకి నేను జవాబు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉంటుందండి… పోనిలెండి మీరు అనుకునట్టే ఆవిడి వాళ్ళ ఎం ఉపయోగం జరగలేదు అని అనుకుందాం, ఆవిడ మనం పోరాడవల్సిన ప్రగతి నిరోధక వ్యక్తీ మాత్రం కాదు కదా… ఆవిడా చెప్పే వాటిల్లో ఎవైన మంచివి ఉంటె గ్రహిద్దాం.

  29. Delhi Subrahmanyam says:

    “శ్రీ శ్రీ,. కొడవటిగంటి. చలసాని. బాలగోపాల్. వరవర రావు లాంటి వారు ఏం చేసారో చెప్పటానికి చాలా వుంది. కొన్ని వైరుధ్యాలున్న వ్యక్తిత్వం అయినప్పటికీ శ్రీశ్రీ అం.ప్ర.పౌరహక్కుల సంఘానికి, విరసానికి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన సంఘం అధ్యక్షుడిగా అనేక సభల్లో ప్రసంగించిన వాడు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరపున కొన్ని వందల సభల్లో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నవాడు. చలసాని, బాలగోపాల్, వరవర రావు లాంటి వారి సంగతి చెప్పే పనిలేదు. వీళ్ళెవ్వరూ పడక్కుర్చీ మేధావులు కారు. ఏ పనీ చేయనివాళ్ళు ఏ తప్పు చేయరు . రంగనాయకమ్మ గారి కార్యాచరణ ఏమిటోఎవరయినా చెప్పగలరా? ఆమె ఏ సంస్థలో సభ్యురాలో చెప్పగలరా? ఆమె పనిచేసేవాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఆమె రాజ్యహింసని ఎంత ఎదుర్కొన్నారో చెప్పగలరా? అయినా విరసం లాంటి సంస్థల్ని టార్గెట్ చేసే రంగనాయకమ్మ లాంటి వారు రాజ్యానికి స్నేహితులు కాక శతృవులెలా అవుతారు” ఓరోరి కృసన బాబు వెంత గొప్పగా సేప్పీసినావ్ బావ్. వందుకో నా జోహార్.

  30. * వల్ల ఏమీ ఉపకారం జరగలేదు అని అనుకుందాం…

  31. Delhi Subrahmanyam says:

    ఇక్కడ ప్రశ్న అట్టడుగు వారికి ఎంత గొప్ప పని చేసిందని కాదు, ఒక వేల అలా చేసున్న మాత్రాన, పజల ఉద్యమాల తో కలిసి పనిచేసిన బాలగోపాల్ , వరవర రావు , చలసాని, శ్రీశ్రీ , లాంటి వారిని హేళన చేసే అధికారం ఆవిదకుండా?. అసలయిన ప్రశ్న అదీ. ఆ ప్రశ్నకి జవాబు ఇప్పటి దాక ఆవిడని సమర్ధిస్తున్న వల్లివ్వలేదు. ఒకవేళ మరీ కష్టంగా ఒప్పెసుకునా, ఆవిడలా అన్నంత మాత్రాన, ఈ వసంతంమెందుకు ఆవిడ మిద అలా రాసేయిడం. మా గొప్ప న్యాయమండి.

  32. Delhi Subrahmanyam says:

    (తెలుగు టైపింగ్ లో తప్పులున్నాయి నా యిందాకటి జవాబు లో – అందుకని మళ్ళీ పోస్ట్ చేస్తునాను)

    ఇక్కడ ప్రశ్న అట్టడుగు వారికి రంగనాయకమ్మ గారు ఎంత గొప్ప పని చేసిందని కాదు, ఒక వేల అలా చేసున్న మాత్రాన ప్ జల ఉద్యమాల తో కలిసి పనిచేసిన బాలగోపాల్ , వరవర రావు , చలసాని, శ్రీశ్రీ , లాంటి వారిని హేళన చేసే అధికారం ఆవిదకుందా?. అసలయిన ప్రశ్న అదీ. ఆ ప్రశ్నకి జవాబు ఇప్పటి దాక ఆవిడని సమర్ధిస్తున్నవాళ్లివ్వలేదు. ఒకవేళ మరీ కష్టంగా ఒప్పెసుకున్నా , ఆవిడలా అన్నంత మాత్రాన, ఈ వసంతం గరేందుకు ఆవిడ మిద అలా రాసేయిడం. మా గొప్ప న్యాయమండి.

  33. Delhi Subrahmanyam says:

    (తెలుగు టైపింగ్ లో తప్పులున్నాయి నా యిందాకటి జవాబు లో – అందుకని మళ్ళీ పోస్ట్ చేస్తునాను)
    ఇక్కడ ప్రశ్న అట్టడుగు వారికి రంగనాయకమ్మ గారు ఎంత గొప్ప పని చేసిందని కాదు, ఒక వేళ అలా చేసున్న మాత్రాన ప్రజా ఉద్యమాల తో కలిసి పనిచేసిన బాలగోపాల్ , వరవర రావు , చలసాని, శ్రీశ్రీ , లాంటి వారిని హేళన చేసే అధికారం ఆవిడకుందా?. అసలయిన ప్రశ్న అదీ. ఆ ప్రశ్నకి జవాబు ఇప్పటి దాక ఆవిడని సమర్ధిస్తున్నవాళ్లివ్వలేదు. ఒకవేళ మరీ కష్టంగా ఒప్పెసుకున్నా , ఆవిడలా అన్నంత మాత్రాన, ఈ వసంతంగారేందుకు ఆవిడ మిద అలా రాసేయిడం. ఇదేమి న్యాయమండి బాబూ ?.

  34. Aranya Krishna says:

    కళ్యాణి గారూ! రంగనాయకమ్మని మార్క్సిస్టు సంస్థలు దూరం చేసుకున్నాయా లేక రంగనాయకమ్మ గారే మార్క్సిస్టు సంస్థలు దూరం చేసుకున్నాయా అనేది ఆమె కార్యాచరణకు సంబంధించిన ఒక మౌలిక ప్రశ్న. ఒక వ్యక్తీ మార్క్సిస్టు అనటానికి అతని ఆచరణే గీటురాయి. మార్క్సిజం అనేది అమూర్తమ్ కాదు. ఏదో ఒక మేరకు ఆ ఆశయం దిశగా పనిచేయాల్సిన్దే. స్త్రీలు, కార్మికులు, విద్యార్ధి, రచయతల సంఘాల్లో ఏదో ఒక దానితో పనిచేయొచ్చు. రంగనాయకమ్మ గారు చాలా కాన్షస్ గా అవాయిడ్ చేసారు వీటన్నింటినీ. రంగనాయకమ్మ స్థాయి గొప్ప రచయిత్రిని వదులుకునే సాహసం ఏ సంఘము చేయదు. కానీ ఈ సంఘాల్లో పనిచేయటం చాలా ఇబ్బంది తో కూడుకున్నది. ఈ సంఘాల్లో పనిచేసే వాళ్ళని కొంతమందిని రాజ్యం చంపేసింది. చాలామందిని రకరకాలుగా హింస పెట్టింది. బాలగోపాల్, వరవర రావు, చలసాని ప్రసాద్ … వీళ్ళందరూ వ్యక్తిగతంగా హింసని ఎదుర్కున్నవాళ్ళే. మీరెన్నిసార్లు రంగనాయకమ్మగారు ఈ హింసని ప్రత్యక్షంగా ఖండించటమ్ కానీ, వీరికి బాసటగా నిలవటం కానీ చూసారా? ఈ సంస్థల్లో తప్పుల్ని టీవీ రియాల్టీ షోల్లో జడ్జీల్లాగా వెటకారంగా తీర్పులివ్వటమ్ తప్ప రాజ్యాహింసని ఖండించటమ్ చూసారా? అందరు త్యాగాలు చేయాల్సిన పనిలేదు. కానీ అంట దారుణంగా, అసహ్యంగా కారెక్టర్ అసాసినేశన్ కి పూనుకోవాలా?

  35. మీరనేదానిలో నిజానిజాలను గ్రహించాలన్నా,అభిప్రాయం ఏర్పరచుకోవాలన్నా… … నేను ఏదో ఒకమేరకు ఈ ఉద్యమాల్లో involve అయిఉండాలి కానీ నాకు వ్యక్తులు రాసే విషయాలతోనూ, వారు సరఫరా చేసే భావజాలాల తోనే తప్ప- వారి వ్యక్తిగత నిర్ణయాలతోనూ, వారి జీవితాలతోనూ పరిచయం లేదు.

    మీ పాయింట్ అర్ధం చేసుకున్నాను అరణ్య కృష్ణ గారూ, కానీ ఆమె విమర్శలను నిరాకరించడానికీ, ఆమెకు దురుద్దేశం ఆపాదించి- ఆమె చెప్పే విషయాలలో నిజానిజాలు గ్రహించలేకపోవడానికీ – చాలా భేదం ఉంది, మనది ముందడుగా, వెనకడుగా – అదే నిర్ణయిస్తుంది..
    ” ఏ పనీ చేయనివాళ్ళు ఏ తప్పు చేయరు” , నిజమే మీరనేది, మరి పని చేసి నప్పుడు తప్పులు కూడా జరుగుతాయి కదా…రంగనాయకమ్మ గారు కాకపోతే మరొకరు… ఏదో ఒక విమర్శ చెయ్యకుండా ఉండరు, ఆ తప్పులు ఎలా దిద్దుకుంటాం అనేది- ఆ విమర్శను ఎలా తీసుకుంటాం అనే దానిమీద ఆధార పడిఉంటుంది.

    • Aranya Krishna says:

      మీ పరిమితులు మీరు నిజాయితీగా మొదట్లోనే చెప్పారు కళ్యాణి గారు! ఆచరణల్లోని లోటుపాట్లని ఒక స్నేహపూర్వకమైన విమర్శ ద్వారా కాకుండా ప్రతిది ద్రోహంగా, ఘోరంగా రంగనాయకమ్మ చిత్రించటమ్ వల్లే ప్రతిసారి రచ్చ అవుతుంది. ఇది మొదటిసారీ కాదు, బహుశ చివరిదీ కాబోదు. మొన్నటి వ్యాసంలోనే ఒక విప్లవ ద్రోహ సంస్థగా ఆమె విరసాన్ని చిత్రిస్తూ వున్నారు. దాన్ని విమర్శ అందామా? అందులో వాస్తవాలు, అవాస్తవాల ప్రమేయం ఏముంది? దాన్ని ఒప్పుకోవటం లేదా తిరస్కరించటమ్ అంటూ ఏముంది?

  36. అప్పుడే విరసం పెట్టిన పధ్ధతి ఆమెకు నచ్చలేదు, ఇప్పుడు కూడా దానిని సాహసోపేత కృత్యం లా చిత్రీకరించడం- ఆమెకు మరింత తప్పు గా తోస్తోంది- ఇదీ నేను అందులో గ్రహించినది. కానీ ఆ విషయం మీద చర్చ జరగకుండా- ఆమె హేళన మీదనే మనందరి దృష్టి ప్రసరించిందంటే… ఆమె రచన గురి తప్పిందనే అర్ధం.
    మీరన్నట్టు ప్రజాద్రోహుల్లా వారిమీద ఆగ్రహించడం నేను అస్సలు అంగీకరించలేని విషయం, గట్టిగా 1%కూడా లేని వాళ్ళం…మార్క్సిస్ట్ భావాలను నమ్మిన వాళ్ళం… ఇందులో ఒకరు మరొకరిని శత్రువుల్లా చూడడం- I dont think we can afford it …
    వసంత్ గారి కవిత నుండి ఏమి గ్రహించాలో మీరే చెప్పండి…

  37. Aranya Krishna says:

    ఆమె కవిత నాకసలు నచ్చలేదండి. విమర్శకి, ప్రతివిమర్శకి కవిత్వం సరైన సాధన కాదు. ఆవిడ (వసంత గారు) ఒక వ్యాసం రాసి వుండొచ్చు. అప్పుడింత రచ్చ జరక్కుండా విరసానికి సానుభూతి దక్కేది. కవిత్వంలోని ఆవిడ వ్యంగ్యం కూడా లోతుగా లేదు. చైల్డిశ్ గా వుంది. విరసం ఆవిడ కవిత్వాన్ని ఓనప్ (పరోక్షంగా అయినా) చేసుకోవటం సరికాదు. ఇంతమట్టుకు విరసం వారు కూడా రంగనాయకమ్మ గారికి ఎందుకు కాంక్రీట్ గా సమాధానం ఇవ్వలేదో అర్ధం కావటం లేదు. కానీ, రంగనాయకమ్మ గారి అఫెన్సీవ్ ఆర్టికల్ ముందు నాకిది సెకండరీగానే అనిపించింది.

  38. ఈ నిజాయితీనే నేను ఆశించి చర్చ లో దిగాను, most fulfilling interchange of opinions -thank you

    • Aranya Krishna says:

      ధన్యవాదాలు కళ్యాణి గారూ! ఉపయోగకరమైన చర్చ జరిపారు. నాకు ఇదే పేరుతొ ఎఫ్.బి. అకౌంట్ వుంది. మీరు దయచఎసి యాడ్ చేసుకోగలరు.

  39. BUCHIREDDY GANGULA says:

    కట్టే — కొట్టే — తెచ్చే — ర మా సుందరి గారు చక్కగా రాశారు — SALUTES…..
    *********************************************************************************
    బుచ్చి రెడ్డి గంగుల

  40. Delhi Subrahmanyam says:

    అరణ్య కృష్ణ గారూ మీ అనన్య ఓపికకి నా హార్దిక అభినందనలు. అరుధంతీ రాయ్ గారు రాసిన చత్తిస్ గర్హ్ విప్లవ ఉద్యమం లో దానికి మద్దతు గానూ సాహిత్య పరం గాను, ఆచరణ పద్ధతి లోనూ మద్దతిచ్చిన వారందరూ కూడా విరసం సభ్యులే. ఈ ఉద్యమాన్ని అతివాద దుందుడుకు ఉద్యమంగా తీసిపారేసి , ఆ ఉద్యమాన్ని ఎన్నో రకాలుగా విమర్శించిన చాల మంది సాహిత్య కారులు, పోరు ప్రజస్వామికంగానే జరగాలన్న వామపక్ష మిత్రులే ఎక్కువ ఉన్నారు. వీరెవరో కూడా ఇప్పటి దాక ఇప్పటి ప్రపంచీకరణం లో భాగం గ పెట్టుబడి దారులకు వంగి వంగి దండాలు పెడుతున్న దుర్మార్గపు రాజికీయలకు ఒక క్రమ భద్దమయిన ఉద్యమాన్ని లేవతీయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని బ్యాండ్ నిర్వహించిన వామ పక్షాలు, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకం గా పోరాటాలేవీ చ్ర్సినట్టు లేదు. అట్టడుగు వారి కోసం పోరాడినట్టు చెప్పా బడుతున్న (ఎప్పుడూ-ఎక్కడా?) రంగనాయకమ్మ గారు, హిజ్రాల మిద తన రచనా చాతుర్యామంతా వారి ని కించ పరిచేలా రాసారు, వీక్షణం లో. అలాగే ఒక వ్యభిచారి నలిని అన్నవిడ రాసిన ఆత్మకథ మీద ఆవిడా అలాగే స్పందించారు. నేను ఒక HIVSURVEYలో పాల్గొన్నప్పుడు వారెంత దీనావస్థ లో ఉంటారూప్రత్యక్షం గా చూసాను. ఎందుకు కృష్ణ గారూ ఈ ఆవేదన. ఒగ్గెయి బావ్

  41. Aranya Krishna says:

    సుబ్రహ్మణ్యం గారూ! మీరు చాలా విలువైన విషయాలు చెప్పారు. నాకు ఇదే పేరుతొ ఎఫ్.బి. అకౌంట్ వుంది. మీరు దయచఎసి యాడ్ చేసుకోగలరు.

  42. బ్రెయిన్ డెడ్ says:

    వ్యక్తులు ఏదో ఒక సంఘంలో చేరి లేదా సంఘం పెట్టి రోడ్ నడిమధ్య నిలబడి మేమున్నామో అని గొంతుచించుకొని అరిస్తేనే ఒక మనిషి సంఘానికి ఏదో సేవ చేసినట్టు అనుకుంటే చీకటి రుముల్లో కూర్చోని కథలు కవిత్వాలు రాసుకొనే మొత్తం ఒక జాతి అంతా ఉరేసుకోవాలి . అందునా తాగితేగాని అక్షరం అర్ధంకాని కవులు మరీనూ . లోల్ . బూతు అని చలాన్ని ఇళ్ళలోకి రానివ్వని కుటుంబాలలో కూడా ఇంకో తరానికి మార్క్స్ తెలిసాడు , మేళ్ళ మేళ్ళు పక్కనపెట్టి ఫీమేళ్ళ మేళ్ళ గురించీ ఆడవారు అలోచించొచ్చు అని చెప్పిన ఆ తరం రచయితల్లో రంగనాయకమ్మ గారిని కాకుండా ఇంకోర్ని చూపండి అప్పుదు మనం కొత్తగా సంఘము దాని సంస్కరణ దాన్ని వ్యతిరేఖించే విద్రోహము గురించి మాట్లాడుకోవచ్చు .

    • Aranya Krishna says:

      వాటే పిటి బ్రెయిన్ డెడ్ గారూ! మీకసలు విప్లవ భావసారూప్యత కలవారందరూ సంఘాలు పెట్టడం మీదే అభ్యంతరముంటే ఏం చేయగలం? నిజమైన విప్లవ సంస్కృతి రాత్రికి రాత్రే ఏర్పడాలని, అందునుండి అప్పటికప్పుడే సుశిక్షుతులైన విప్లవ సాంస్కృతిక సైనికులు ఆవిర్భవించి మరుసటి రోజు పొద్దున్నే సంఘాలు పెట్టాలని, అప్పుడు రంగనాయకమ్మ గారు (ఇంకా మీలాంటి వారు కూడానేమో) మా సంఘంలో చేరండని మీకు సమర్పించిన దరఖాస్తుని పరిశీలించి, సంతృప్తి చెందగా మీరు సభ్యత్వాలు తీసుకుంటారేమో! “బూతు అని చలాన్ని ఇళ్ళలోకి రానివ్వని కుటుంబాలలో కూడా ఇంకో తరానికి మార్క్స్ తెలిసాడు ,” నిజమే అలా ఎవాల్వ్ అవుతున్న సొసైటీలో అందరమూ భాగస్వాములమే కదా! రంగనాయకమ్మ గారు గొప్ప రచయత్రి కాబట్టే ఈ చర్చంతా కదా. రచయిత్రిగా ఆమె గొప్పదనాన్ని కాదనటానికి ఏమున్నది? “సంఘం పెట్టి రోడ్ నడిమధ్య నిలబడి మేమున్నామో అని గొంతుచించుకొని అరిస్తేనే…” అంటూన్న మీ మైండ్ సెట్ బాగుపడాలని కోరుకుంటున్నాను. గెట్ వెల్ సూన్!

  43. బ్రెయిన్ డెడ్ says:

    కాండోలేన్స్ ఫ్లవర్స్ టు యూ సర్ , యే సంఘంలో పని చేసి సంఘాన్ని యెలా ఉద్దరించారో చెప్పమని అడిగింది మీరు నేను కాదు అరణ్య కృష్ణ గారు . ఒక మనిషి సంఘానికి సంఘాలు పెట్టి సేవ చేస్తేనే దాన్ని గుర్తిస్తాము అన్న వాదన నాది కాదు కదా సుమీ .

    • Aranya Krishna says:

      థాంక్స్ ఫర్ యువర్ ఫ్లవర్స్ బ్రెయిన్ డెడ్ గారు! విప్లవాత్మక భావాలు రాత్రికి రాత్రే విప్లవకారులని తయారు చేయవు. విప్లవ సంఘాలు ఏర్పడినంత తేలికగా విప్లవకారులు ఉద్భవించరు. ఏ సమాజానికి వ్యతిరేకంగా పోరాడుతామో ఆ లక్షణాలు హఠత్తుగా వ్యక్తుల్లో అన్తరించిపోతాయా? అలా జరిగితే ప్రతి ఒక్కరు ఒక చోట కూర్చొని సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది. విప్లవం, విప్లవకారులు ఎవాల్వ్ అవ్వాల్సిందే. అటువంటప్పుడు వ్యక్తుల దోషాల్ని చూపించి సంస్థలకు దూరంగా జరగటం ఎస్కేపిజమే. చేయలేకపోతే కనీసం సానుభూతన్నా చూపించాలి. అంతే కానీ ఏదో వర్గశతృ సంస్థని చూసినట్లు ఎందుకంత ద్వేషం? మీరు రంగనాయకమ్మ గారి గొప్పదనం గురించి చెప్పారు. సందేహం లేదు. ఆమె ఒక లెజెండ్. ఆమె ఒక గొప్ప రచయిత్రి కాబట్టే ఇంత కన్సర్న్ ఈ విషయంతో. ఆమె ఒక స్త్రీ కాబట్టే ఇంత రగడ అని మీరంటే అది మీ విజ్ఞతకి సంబంధించిన విషయం. .

  44. P V Vijay Kumar says:

    అరణ్య క్రిష్ణ గారు ! ఈ మె లెజెండా ? ఆర్ యూ సీరియస్ ?

    20 ఏళ్ళు నిండ కున్నా ప్రాణాలు లెక్క పెట్టని వినోద్ లెజెండ్. అంత స్థాయితో కంపేర్ చేయలేకపోతే విప్లవ మార్గం లో తప్పో ఒప్పో తెలీకుండా బయటకొచ్చి ఆయన కోసమో ప్రజల కోసమో Dalit perspective ను advocate చేసిన శివ సాగర్ లెజెండ్ అనండి. ఇంకా అర్థముంది .

    ఈ మె లెజెండ్ ఏమిటి ?

    మార్క్సు బుక్కులన్నీ ముందేసుకుని కూర్చుని తీరిగ్గా నోట్స్ రాసుకుని, మళ్ళీ ఎరేజర్ తో తుడిచేసి, మళ్ళీ పెన్సిల్ తో మార్కు చేసుకుని, మళ్ళి ఎరేజర్ తో రుద్దేసి ( ఈ డీటైలింగ్ నాది కాదు. ఆమెదే. తత్వ శాస్త్రం అనే బుక్కులోది ) విక్రం సిరీస్ గైడ్ లా అన్ని బుక్కుల్లోని మార్క్సిజం ను కలిపి అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ కట్ పేస్ట్ చేసి వ్రాయడం లెజెండా ?

    రామాయణ విషవృక్షం మంచి సెటైర్. అంత వరకే. అందులో ఈ మె చెప్పిన లెజండరీ మార్క్సిజం ఏముందో ఒక్క ముక్క చెప్పండి .

    ‘ కేపిటల్ ‘ బుక్కు తెలుగులో తర్జుమా అని చెప్పింది. అది her understanding of capital / marxism అంతే కాని అదే మార్క్సు బుక్కు అనుకుంటే ఎలా ? అసలు ఆ పుస్తకం లో మార్క్స్ చెప్పిన ‘ అదనపు విలువ ‘ ఒక అంకెల లెక్కల సోదిలా మాత్రమే వ్రాయడం లెజండరీ నా ? Marxism కు basis అయిన dialectical materialism గురించి కనీసం ఆమె స్టైల్ లో అర్థం చేయించే నోట్స్ ఏది ?

    కమ్యూనిజం వస్తే – ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దాని ప్రింటింగ్ వ్యవహారాలు చూడ్డానికి ఈమెను నియమించాల్సిందే తప్ప అంతకు మించి ప్రజలకు ఉపయోగ కరమైనది ఏమీ లేదు ఈమె దగ్గర . అంతకు తప్ప పనికి రాని ఈమె టేలెంట్ లో ‘ లెజెండ్ ‘ కనిపించిందా ?

    • ఈ వ్యాఖ్య చెయ్యటానికి ఒక స్థాయి ఉండాలి విజయ్ కుమార్ గారు
      నా ద్ఱుష్టిలో ఇక్కడ స్థాయి అంటే
      అ. ఆమె రచనలను/వ్యాసాలతో కలిపి అన్నింటినీ అక్షరం పొల్లుపోకుండా కనీసం ఒక సారి చదివిన అనుభవం
      ఆ. అంతే రాశి/వాసిలో రచనలు సాగించిన అనుభవమ్
      లేనంత మాత్రాన ఆమెను విమర్శించకూడదా అంటే నా వద్ద సమాధానం లేదు. సాహిత్య విమర్శలో అది కనీస మర్యాద అని నా వ్యక్తిగత అభిప్రాయం

      అది మీకున్నదా లేదా అనేది మీ విజ్ఞతకే …..

      • P V Vijay Kumar says:

        సర్, మీ కంక్లూజన్ బాలేదు అండి….:)
        నేను ఆమె బుక్స్ చదవకుండా కామెంట్ చేయడం అనేది swift conclusion
        అది లేకుండానే – నా ఆర్టికల్ లో ఆమె పుస్తకాల గురించి ప్రస్తావన రాదు.
        నేను కూడా ఆమె భక్తులకు విన్న వించేదేంటంటే (ఇదో జనరల్ స్టేట్ మెంట్ ) – ఆమె చెప్పింది మార్క్సిజం కాదు. మార్క్సిజం గురించ్ మార్క్స్ రాసిన పుస్తకాలు చదవండి. గతి తార్కిక భౌతిక వాదం , ‘ అదనపు విలువ ‘ సిద్ధాంతం కంటే మిన్న అయినది. ఈమె ‘ అదనపు విలువ ‘ దగ్గర అంకెలు వేసుకుని గైడ్లు తయారు చేస్తుంది తప్ప , సరి అయిన మార్క్సిజం కాదు.

        thanq

      • its ok sir

      • Aranya Krishna says:

        సర్, ఆమెని సమర్ధించే వారందరూ కూడా ఒక్క పొల్లు కూడా పోకుండా ఆమెని చదవాలనే షరతు ఉందా లేదా? సమర్ధించటానికైతే ఏమి చదవ్వాల్సిన పని లేదంటారా? మీ గీటురాయి ఆమె విమర్శకులకేనా లేక ప్రశమ్సకులకు కూడా వర్తిస్తుందా?

    • its ok sir

  45. Delhi Subrahmanyam says:

    .అరణ్య కృష్ణ గారూ మీరు సూచించినట్టుగా నేను మిమ్మల్ని నా ఎఫ్‌బి స్నేహితుడు గా ఇప్పుడే పంపుతాను. ఇక్ లెజెండ్ విషయానికి వస్తే, నేను విజకుమార్ గారితో చాలావరకు యెకీభవిస్తాను. మనకి మార్క్సిస్ట్ ముసుగు లో రంగనాయకమ్మ గారు స్వంత డబ్బా మొహమాటం లేకుండా కొట్టుకుంటారు.. ఈ మార్క్సిస్ట్ ముసుగులోకి రానప్పుడు ఆవిడ చాలా మంచి రచనలు, ముఖ్యంగా ఈ మధ్యతరగతి పితృరాజ్య వ్యవస్థలో లో స్త్రీల ఇబ్బందుల గురించి , చాలా చేశారు. ఆ తర్వాత తాను మిగతా వాళ్ళ కంటే గొప్ప ప్రజల సాహిత్య కారినని చెప్పుకునే తపనలో, ప్రజల పక్షాన నిలిచి వారి కోసం రాస్తూ, సంస్థాపరం (విరసం) గానూ విడిగానూ కూడా రాసిన రచయితలను, విజయకుమార్ గారు చెప్పినట్టు పెన్సిల్, రబ్బర్ దగ్గరపెట్టుకొని విమర్సాత్మకంగా రాశారు. అందులో కొంతమందిని – రావి శాస్త్రి- గారిని వారి వ్యక్తిగత జీవితం లోకి వెళ్ళి విమర్శించారు. అందుకే నేను అరణ్య కృష్ణ గారికి చెప్పినట్టు , వెందుకు బాబులూ వీ సెర్చ. .ఒగ్గెదాం.

  46. రంగనాయకమ్మ లెజెండ్ కాకపోతే కాకపోయార్లెండి. ఆమెకు ఈ తరహా కీర్తి వచ్చేసిందని/ వచ్చేస్తోందని ఎవరూ కంగారుపడి.. బాధపడి, ఆవేశపడిపోనక్కర్లేదు. ఎందుకంటే – అలాంటి కిరీటాలనూ, భుజకీర్తులనూ ఆమె ఏమాత్రం ఖాతరు చేయరు.

    ఆమె సాహిత్యాన్ని చదివిన ఎవరికైనా ఇది బాగానే తెలుస్తుంది.

    విమర్శను ప్రతివిమర్శతో ఎదుర్కోవాలి. దానికి అడ్డదారుల్లేవు. రంగనాయకమ్మ తన విమర్శలో లేవనెత్తిన పాయింట్లకు సమాధానం ఎవరైనా చెప్పారా? ‘‘అదనపు విలువ’ని కేవలం ప్రతిపాదనగా ఎంచే సంఘం, విప్లవ సంఘం అవగలదా?’’ అన్న రంగనాయకమ్మ ప్రశ్నకు జవాబు ఏదీ?

    ఆమె రచనలను తక్కువ చేసి మాట్లాడినంతమాత్రాన వాటి విలువా, పాఠకులపై వాటి ప్రభావమూ తగ్గిపోతుందా? తెలుగునాట మార్క్సిజం సిద్ధాంతాన్ని సరళంగా వివరించటంలో ఆమె చేసిన కృషి చరిత్ర. అది తిట్ల దండకాలకో, విద్వేషపు రాతలకో చెరిగిపోయేది కాదు!

    • మంజరి లక్ష్మి says:

      బాగా చెప్పారు వేణు గారు “అసలు వరవర రావుగారు తన వ్యాసానికి పెట్టుకున్న టైటిలే ‘(సాహిత్యంలో)వర్గ పోరాటం’. అది చూసి ఆమె దానికి వ్యతిరేక పదం(అది కొంత హాస్యం, వ్యగ్యం కలిపినదిగానే నేను అనుకుంటున్నాను) విప్లవ ద్రోహం అని రాశారు. మరి వర్గ పోరాటం చేసే వాళ్ళు శ్రమ దోపిడీ సిద్ధాంతం నిజమని భావించాలా అది ఊహనుకోవాలా! శ్రమ దోపిడీ సిద్ధాంతమే నిజం కానప్పుడు వర్గ పోరాటం అనేదే చెయ్యాల్సిన అవసరం లేదు కదా. అందుకే ఆమె కొంచెం వ్యంగ్యం హాస్యం కలిపి అట్లా అన్నారు. అట్లాగే శ్రీ శ్రీ విషయంలో చలసాని ప్రసాద్ చేసింది వర్గ పోరాటం అవుతుందా! వాళ్ళు చేసిందే గొప్ప వర్గ పోరాటం అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటుంటేనే కదా `విప్లవం పరువు పోగేట్టేశారు’ అని ఆమె అలా రాయవలసి వచ్చింది. వాళ్ళు చేసిన దానికి అంతంత గొప్ప పదాలు వాడుకోవటం వాళ్ళకు తప్పనిపించటం లేదు. అది ఎత్తి చూపిస్తే తప్పైపోయింది.

    • ఇక్కడ విరసం నాయకుల్ని పొగుడుతున్నవాళ్ళందరూ రంగనాయకమ్మ గారి మీద ద్వేషంతో ఆ పని చేస్తున్నట్టు ఉంది. చలసాని గారి ఇల్లు మా పక్క వీధిలోనే. ఆయన ఉండినది HB కోలనీలో అయితే నేను ఉండేది నక్కవానిపాలెం, సీతమ్మధారలో. ఆయన చనిపోయినప్పుడు నేను చూడడానికి వెళ్ళలేదు. ఆయన రచనలు నేను చదవలేదు కనుక ఆయనపై నాకు ఏ అభిప్రాయమూ లేదు. రంగనాయకమ్మ గారి రచనలు నేను చదివాను కనుక విరసాన్ని ఆవిడ విమర్శించడానికి కారణాలు ఏమిటో నాకు తెలుసు. సూఫీ ఫకీరుని కమ్యూనిస్త్‌లతో పోల్చి మార్క్సిజంని సూఫీ మతం స్థాయికి దిగజార్చడానికి ప్రయత్నించిన వరవరరావు గారిపై ఆవిడ చేసిన విమర్శలు కూడా చదివాను. రంగనాయకమ్మ గారు అందరినీ గుడ్డిగా విమర్శిస్తారనే ఆరోపణని నేను నమ్మకపోవడానికి కారణం ఇదే. తప్పు చేసినవాళ్ళు తాము అలా చెయ్యలేదు అని చెప్పుకున్నా వాళ్ళ మాటలని పరిశీలించొచ్చు. కానీ అది కూడా లేకుండా వాళ్ళు రంగనాయకమ్మ గారి మీద దాడి చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

  47. ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే సంస్థలో సభ్యతం కలిగి ఉండకూడదని వాళ్ళు ఉద్యోగంలో చేరేటప్పుడే వాళ్ళకి చెపుతారు. గద్దర్, వరవరరావు, కళ్యాణరావులు ప్రభుత్వ ఉద్యోగులు. గద్దర్ అదేదో విప్లవ సాంస్కృతిక సంస్థలో పని చేసాడు కానీ అతన్ని ఉద్యోగం నుంచి పీకకుండా ప్రభుత్వమే అతనికి గన్‌మేన్ భద్రత కల్పించిందంటే అతనితో పాలకవర్గానికి ఏమాత్రం వైరుధ్యం లేదని అర్థమైపోతుంది. విరసం నాయకులు కూడా ఇంతే. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ పిల్లలు IT ఉద్యోగులు. సామ్రాజ్యవాదం లేకపోతే సామ్రాజ్యవాద దేశాల నుంచి మమ IT కంపెనీలకి projects రావు కనుక విరసం నాయకుల పిల్లలు మార్క్సిజం వైపు ముఖం తిప్పడానికే ఇష్టపడరు. వాళ్ళు ఇంకా ముసుగులు వేసుకుని విప్లవకారులమని ఎలా చెప్పుకుంటారు?

  48. ‘స్మైల్’ గారి ‘ఖాళీ సీసాల’ ప్రాసంగికత ఇప్పుడర్ధమయ్యింది నాకు.

  49. ఈ నా కవితను పత్రికకు పంపాను. వారు ప్రచురించటానికి ఆలస్యం అవుతుందేమోనని ఇలా ఇక్కడ రాయడమవుతున్నది.

    వసంత రోదన

    ఒంటినిండా వైషమ్యపు తెర,
    కంటినిండా కుటిలత్వపు పొర.
    సత్యం మాట్లాడే కలం
    గండ్రగొడ్డలిగా భ్రమ

    ‘మార్క్సిజం’ మాటున రంగుల ఊసరవెల్లులు
    ‘కన్నబిరాన్’ తోకలు వదలని ఫెమినిజాలు
    ‘హేతుత్వమంటూనే దయ్యపు సిద్ధాంత అయోమయాలు
    విప్లవమంటూనే అయోమయాలని మోసే సంఘాలు

    చెప్పేదీ, చేసేదీ వేరువేరై
    ఆలోచనకూ, ఆచరణకూ ఆమడదూరమై
    వేసే అడుగులెన్నో తప్పుటడుగులైనప్పుడు —
    ‘‘ఎంతగానో మారిన ప్రపంచాన్ని’’
    ‘ఇదేమి తీరని’ ప్రశ్నిస్తే —
    ఒంటికీ, మనసుకూ — కారం, కారం.

    సమస్యల పరిష్కారానికి,
    బుద్ధుడూ, అంబేడ్కరూ చాలరు;
    మార్క్స్ కావాలనడం —
    ఆమె శాస్త్రీయ ఆలోచనకూ,
    సద్విమర్శనా పటిమకూ సంకేతం.

    కూలినగోడలు, పేకమేడలు,
    బలిపీఠం, అంధకారంలో —
    మన సమస్యలు, సమాజ కాలుష్యాలు.
    విషవృక్షం, ఇదండీ భారతం —

    మన పుక్కిటి పురాణాల వర్గస్వభావాలు.
    జానకి విముక్తి, స్వీట్ హోం—
    స్త్రీ, పురుషుల విముక్తి మార్గం.
    పెట్టుబడి పరిచయం, పిల్లలకోసం ఆర్థికశాస్త్రం —
    మా పల్లెల పిల్లలకూ సునాయాస శాస్త్రం.

    ప్రతి నవల, ప్రతి కథ,
    ప్రతి వ్యాసం, ప్రతి వ్యధ—
    వాస్తవాల ఆధారం.
    మంచి ఆలోచనలూ, సమగ్ర పరిష్కారాలూ —
    కొత్త వెలుగులూ, సరికొత్త బాటలూ.

    అదనపు విలువలు అందుకోని
    ఆచరణాత్మక పుస్తక ‘విలువలు’.
    చెప్పేది చేయడం,
    చేసిందే చెప్పడం.
    నువ్వేమిటో, నేనేమిటో,
    చారిత్రక సందర్భాల పెడదారుల మర్మమేమిటో—
    శషబిషలసలే లేకుండా,
    సూటిగా, స్పష్టంగా, తేటతెల్లంగా…..
    సరికొత్త వెలుగుల కాంతులలో ‘రచయిత్రి’.

    కుళ్ళిన ఆలోచనల సమాహారం —
    ఒట్టిపోయిన ‘వసంతగానం’.

    —ఉజ్వల
    18.08.2015

    • చాలా స్పష్టం గా, అందంగా చెప్పారు… ఉజ్వల గారు… మీ కవిత ఫేస్బుక్ లో రంగనాయకమ్మ గ్రూప్ లో పోస్ట్ చేసాను…మీకేదైనా అభ్యంతరం ఉంటె చెప్పండి…డిలీట్ చేస్తాను…

  50. అదనపు విలువ సిద్ధాంతం ఊహే అయితే పెట్టుబడిదారుడి సంపాదన అంతా అతని కష్టార్జితం అనేది నిజం అవుతుంది. విరసం నాయకులు పనిచేసేదే పెట్టుబడిదారులకి ధైర్యం ఇవ్వడానికేమో!

  51. ఇంట్లో కూర్చుని పోసుకోలు క‌బుర్లు చెప్పుకుంటూ పోతే.. కొన్ని రోజుల‌కు కొట్లాట‌లే ఐతాయి.. అందుకే మ‌ధ్యాహ్నాలు పోసుకోలు క‌బుర్లు చెప్పుకునే అమ్మ‌ల‌క్క‌లు కొన్నాళ్ల‌కు బ‌ద్ద శ‌త్రువులైతారు.. ఇదంతా ఇక్క‌డ కూర్చుని పెద్ద పెద్ద మాట‌లు చెప్పుకుంటున్న పెద్ద‌మ‌నుషుల‌కు తెలియంది కాదు.. ఇంత‌కీ చెప్పొచ్చేదేమంటే.. మ‌నం ఈ గొడ‌వ మొద‌లు పెట్టాక‌.. దేశంలో చాలా జ‌రిగి పోయిన‌యి.. దేశం గొడ‌వ మ‌న‌కెందుకండీ.. పోనీ మ‌నూర్ల గూడ చానా అన్యాయం జ‌రిగింది.. అది మ‌న‌కెందుకండీ.. మ‌న‌కు కావాల్సింది.. రంగ‌నాయ‌క‌మ్మ గొప్ప‌నా.. విర‌సం గొప్ప‌నా.. లేక పోతే.. వ‌సంత క‌న్నాబిర‌న్ గొప్ప‌నా.. అనేది ముందు తేలాలి.. అంతే.. త‌ర్వాత మిగ‌తా విష‌యాలు మాట్లాడుకుందాం.. చీ…. బ‌తుకు.. మ‌నం మ‌నం ఒక‌ళ్ల మీద ఒక‌ళ్లు జ‌ల్లుకున్న బుర‌ద చాలు.. ఊరు వాడా గ‌బ్బుగొడుతోంది..

  52. విరసంవాళ్ళు చేసే వర్గ సహకారాన్ని చూసి పాలకవర్గంవాళ్ళు మార్క్సిజమ్‌ని అంగీకరించడం జరగదు కనుక విరసం లేకపోతే మార్క్సిజమ్‌కి వచ్చే నష్టమేమీ లేదు.

  53. haribabu suraneni says:

    మహాకవి, యుగకర్త అని ఆరాధించే కవిని, “క్షణానికో మాటతప్పే దాటవేతల కవి” అని ఒకరు – అంటే అది వ్యక్తిగత విమర్శ కాదు కాబోలు!

    ఆవిద విసుర్లకి విరసం ఆవిర్భావం కోసం యెవరెవరు యెలా కృషి చేశారో వివరంగా జవాబు చెప్పారు,అది ఇక్కదెవరొ చదివినట్టు లేదు,యెందుకని?శ్రీశ్రీ తను అక్కడికి ప్రైజ్ మనీని వ్యతిరేకించడానికే వస్తున్నానని రాసిన ఉత్తరం కూడా సాక్ష్యం చూపించారు,మరి అలాంటప్పుడు శ్రీ శ్రీ ఆ దబ్బు తీసుకోవడానికే అక్కడికి వచ్చినట్టు అపాదించటం ఒక వ్యక్తిలో లేని నీచత్వాన్ని అంతగట్టడం కాదా,అది దిగజారుడు కాదా?విరసం యేర్పాటుని ప్రోత్సహిస్తూ తమ రచనలు పంపటానికి సంసిధ్ధతని వ్యక్తం చెయ్యటం,దాని ఆవిర్భావం కోసం పాటుపడటం అంతా రహస్యంగా ఒక్కరోజులో జరిగిన వ్యవహారం కాదే మరి?

    అయినా దాన్ని కుట్ర అన్నప్పుడు యెవరు ఉక్రోషం బయట పడిందో యెవరు సైధ్ధాంతికతని వొదిలేసి పులుముడు విమర్స చేస్తున్నారో కూడా తెలుస్తున్నా ఇంకా దొంగ నాటకాల సమర్ధనలు చేస్తున్నారు,

    ,అభ్యుదయ రచయితల సంగం విప్లవ రచయితల సంఘం యేర్పాటుని వ్యతిరేకించి కుట్ర అనటంలో అభ్యుదయం యేముంది అక్కసు తప్ప?!యెవరిది ఉట్ర?యెవరిది వ్యక్తిగత ద్వేషం?

    మరొకరి సాహిత్యానికి పేరడీగా “ఇలాగే జరిగింది?!నాకు తెలుసు,నేను చూశాను” అని కధలు చెప్పినప్పుడు మురిసి ముక్కలైన వారు నీవు నేర్పిన విద్యయే నీరజాక్షీ అంటూ తమ అభిమాన రచయిత్రి పట్ల యెదిరిపక్షం వారు చేస్తే నైతికత చాటున వగపోతలు యెందుకో?

    మీకో రూలూ మాకో రూలా?

  54. Delhi Subrahmanyam says:

    హరిబాబు సురనేని గారూ, మీరు రాసింది చదువుతుంటే మన పథ సామెత ఒకటి గుర్తుకొచ్చింది. “చెవిటివాడు ముందు శెంకం ఊదినట్టు” రంగానయకంమంత గొప్ప రచయిత్రిని మీరూ, నేనూ , మిగతా మిత్రులు విమర్సిస్తున్నామని బాధపడిపోయే వారెవరూ కూడా, మనం చెప్పే చారిత్రాత్మక విషయాలను కావాలనే గుర్తించటం లేదు.

  55. హరిబాబు సూరానేని says:

    “రామాయణ మహాభారతాలు కేవలం కధలని నీకూ తెలిసినప్పుడు వాటిని రంగనాయకమ్మ మార్చి రాస్తే నువ్వెందుకు ఆవేశపడుతున్నావు?” అని విషవృక్షంలో అలా వాల్మీకి రామాయ్ణానికి పారడీ రాసి వెక్కిరించడం తప్పు అన్నప్పుడు నాకు ఒక మురంనా వీరాభిమాని నాకు ప్రశ్న వేశాడు!

    సరేనయ్యా,నేను కూడా జానకి విముక్తి కధలో జానకి గురించి “ఆ జానకి వాళ్ళు మా ఇంటికి మూడిళ్ళ అకవతల ఉంటారు,ఆ అమ్మాయికి కనిపించిన మగాడి కల్లా కన్ను కొట్టే అలవాటుంది,అందుకే మొగుడూ అత్తా అలా తిడుతున్నా కొడుతున్నా కిక్కురుమనకుండా నోరు మూసుకుని భరిస్తుంది” అని ఇంకో వెర్షను రాస్తాను,నీకు ఓకేనా అని అడిగితే మళ్ళీ జవాబు లేదు,యెందుకు?

    అలా రాస్తే యెలా ఉంటుందో ఆవిడ విషవ్ర్క్షంలో చెసీన్ పని కూడా అలానే రాసింది,అవునా కాదా?

    అదీ రంగనాయకమ్మ గాది వాదనల స్థాయి.ఇన్నాళ్ళూ యెవరూ జవాబు చెప్పక పేట్రేగిపోతున్నారు,కవుంటర్లు టాపు లేపుతుంటే ఇప్పుడు ఇతర్లు చేసేది వ్యక్తిగత దాడిలా కనిపిస్తున్నది,అంతేనా వీరభక్తులూ?!

  56. B. Rama Naidu says:

    రమా సుందరి గారు చెప్పిన విజ్ఞత పాటించి వ్యక్తిగత రాగద్వేషాలు లేకుండా వి.వి గారి మరియు రంగనాయకమ్మ గారి వ్యాసాల మీద అందరికి ఉపయోగపడే వ్యాసం రాయండి. కనీసం వి.వి గారి లేదా విరసం వారి సమాధానం లేదా చరిత్ర తెలిసిన వారు రాసే వరకు ఆగకుండా ఇలా మాట్లాడుకోవడం పద్ధతి కాదు. ఒక విషయం మీద మనకు అవగాహన లేకుండా మాట్లాడకూడదు అన్న స్పృహ ఉంటె బహుశా ఈ ‘డౌన్ ఫాల్’ ఉండేది కాదు.

    • ఎంత స్పష్టంగా చెప్పారు రామానాయుడు గారు… ఇప్పుడే రాజేంద్రబాబు గారి వ్యాసం చదివాను “ఇది కుట్రంటారా …” అనీ …ఎన్నో కొత్త సంగతులు తెలిసాయి…అలాగే హెచ్చార్కె గారి ఆలోచనలనూ పంచుకున్నాం “ఇదేం ఆనందం…” అంటూ …
      అలాటివి రాసినా, చదివినా ఫలితం గానీ – తిట్లూ, శాపనాకారాలు రాసుకోవాలంటే ఇంటర్నెట్ దాకా రావడమెందుకు అనిపించింది…

  57. Thirupalu says:

    సాహిత్య కారులను ఇంత దీన స్తితి కి దిగ జార్చి మాట్లాడం తగదు. మన విమర్శకులు విమర్సలంటే తిట్లని ఏ స్తాయికైనా మాట్లాడ వచ్చని నిందలు వేసు కోవడం ఎంత మాత్రం సభబుకాదు. విమర్శను విమర్శగా తీసుకోలేని వారు, వ్యక్తీ గతం అనుకుండే వారు నాదృష్టిలో మెచ్చురిటి లేని వారిగానే పరిగణించాలి. ముఖ్యంగా సాయిత్యం చదువుకున్న వారు. మంచి రచయితలూ , దేశ ప్రజల బాగుకోరి తమ పరిదిలో రచనలు చేసే వారంతా గొప్ప వారే! కాక పోతే వారి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. ఉండాలి కుడా! రెండు శిభిరాలుగా విడి పోయి రెచ్చి పోవడం ఏమి బాగులేదు. ఈ గొడవలు నా చిన్నప్పటి నుండి చ్చుస్తున్నాను. ఆంధ్ర జ్యోతి అనే ఒక పత్రిక పెట్టుకొని నువ్వెంత అంటే నువ్వెంత అని ఆరుద్ర గారు , శ్రీ శ్రీ గారు సిగ పట్లు పట్టు కోవడం చదివాము. అదొక సందడి. ఈ సందడి బాగుంది గాని, ఇక్కడ ఎవరు మాట్లాడాలో వారు మాటాడ కుండా ‘ రంగా నాయకమ్మకు ఏమీ తెలియదు అని ఒకరంటే తెలియంది రంగా నాయకమ్మ కు కాదు. విరసానికే ఇంకొకరు.చివరకు ఏమి తేలినట్లు? అంటే విప్లవ రచనల పేరుతో చేస్తున్నది వట్టి కీర్తి కండూ తికే నన్న మాట. ఈ కీర్తి కమ్డూతి అసెంబ్లీ లో కుర్చీలు విసురుకొనే స్థాయికి పోతే మరి వారికి మీకు ఉన్న విత్యాసం ఏమిటో ? విప్లవ రాజ కీయాలు భూర్జువ రాజకీయలకు భిన్నమైనవి కాదన్న మాట! అలాటపుడు ప్రత్యామ్నాయ రాజ కీయాలని పేరెందుకు? అమ్దరూ తానులో ముక్కలేన్నన్న మాట! ఇక్కడ నాకొక విషయం అర్ధ మైనది. ఏమిటంటే సమాజం మారాలి అనడం కంటే , ఆ మార్పు తమ వల్లే వచ్చిందన్న పేరు నిలవాలి. అంతేనా? హెచ్చార్కె గారు మాత్ర ఒక విషయం చెప్పారు. ‘ వీర పూజ దోషం ఉద్య మాలో ఉన్నద’ నీ దాన్ని గుణంగా ప్రవర్తింప చేయదలచారా? అంటూ ప్రశ్నించారు.

  58. హరిబాబు సూరానేని says:

    ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆగస్టు 24,2015 తేదీన అర్విణి రాజేంద్రబాబు గారు “ఇది కుట్రంటారా రంగనాయకమ్మ గారూ…?” అని జవాబు చెప్పారు.దాని ప్రకారం చూస్తే విశాఖ కుర్రాళ్ళు “రచయిత లారా మీరెటువైపు” అని అడిగిన సంచలనాత్మకమైన ప్రశ్నకి తర్వాత ఆరునెలలు చాలామంది ప్రతిస్పందించాకనే విరసం పుట్టిందని వ్యక్తుల పేర్లని కూడా చెప్పి సాక్ష్యం చూపించారు.మరి ఆ సంగహటనలు రంగనాయకమ్మకి తెలియకుండా జరిగినాయనుకొవాలా?ఇంకా వరవర రావు వ్యాసములోనూ రంగనాయకమ్మ వెక్కిరింత వ్యాసములోనూ ధ్వనిస్తున్నది అరసం శ్రీశ్రీని విరసం సభకి వెళ్ళనివ్వకుండా ఆపాలని ప్రయత్నిస్తున్న హడావిడి లేదూ!

    ఆరు నెలల పాటు రచయితలు స్పందించి ఒక విప్లవ రచయితల సంఘం స్థాపించటం విప్లవం పరువు పోగొట్టటమా? రాజ్యహింసకి వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్న వీవీ పరువు తియ్యటం వల్ల విప్లవం పరువుగా ఉంటుందా!

    రాజేంద్రకుమార్ గారి వ్యాసంలోని కొంత భాగం యధాతధంగా “విప్లవ రచయితల సంఘం ఆవశ్యకతను కొడవటిగంటి కుటుంబరావు,జ్వాలాముఖి ప్రతిపాదిస్తే చలసాని ప్రసాద్ హోంవర్క్,గ్రౌండ్ వర్క్ చేశాడు.ఒక కల్లోల దశాబ్దంలో ధ్వనించిన వసంత మేఘ గర్జనకు ప్రతిస్పందనగా,శ్రీకాకుళం పోరాట స్పూర్తితో జరిగిన విరసం ఆవిర్భావం కుట్రలతో అబద్దాలతో జరిగిందని రంగనాయకమ్మ వక్కాణించడం చరిత్రను వక్రీకరించడమే అవుతుంది. విరసం సభ్యునిగా అరెస్టయి,కోర్టు భవనంలో బోనులో నిలబడి చెరబండరాజు తన చేతులను కట్టివేసి ఉన్న సంకెళ్లను ఒకదానికొకటి తాకిస్తూ ‘ఇది కుట్రంటారా న్యాయ్మోర్తులుంగారూ!ఇది కుట్రంటారా? అని ప్రశ్నించినట్టుగా ఈనాడు రంగనాయకమ్మను ప్రశ్నించాల్సి రావటం నిజంగా దురదృశ్టకరమ్ .'” – దీన్ని బట్టి ఏమి తెలుస్తుంది?

    విప్లవం పరువు పోగొట్టింది వరవర రావా ముప్పాళ రంగనాయకమ్మా?ఆవిడ విమర్శ లోని సైద్దాన్తికత పాళ్ళు ఎంత అని చెప్పడానికి నేను జానకి విముక్తి గురించి టచ్ చేస్తూ ఉదహరించిన భాగం చాలునా?ఇంకా పూర్తీ స్థాయి ఉదాహరణ చెప్తే కానీ అర్ధం కాదా?

    ఎన్నాళ్ళు గయ్యాఌతనాన్ని సైద్ధాంతిక విమర్శ అని డప్పు కొట్టుకుంటారు?శ్రీశ్రీయే డబ్బు కోసం అంగలార్చాల్సి వస్తే కేవలం ఆ కవితాసక్తినే అమ్ముకుంటే కోట్లకి పదగలెత్తగలిగేవాడు!తన జీవితకాలంలో ఏనాడు విప్లవ వ్యతిరేకిగా నిలబడ్డాడో రంగనాయకమ్మ సాక్ష్యాలు చూపించగలదా?వీరపూజని వ్యతిరేకిస్తున్నామంటూ రంగానాయకంమకి మీరు చేస్తున్నదేమిటి?

    నేను మీకు విప్లవ వ్యతిరేకిగానే కనబడ వచ్చు,కానీ మీ పక్షంలో జరుగుతున్నది నాకెలా కనిపిస్తున్నదో చెప్తున్నాననే అనుకోండి – కానీ కొంతకాలం క్రితం కారా మాస్టారికి శిష్యులు సన్మానం చేసి పూలకిరీటమ్ పెడితే ఒక బ్లాగరు పోస్టు మొత్తం అది ఫ్యూడలు సంప్రదాయ మతపిచ్చి లెక్కన విషం కక్కి ఆఖర్న శుభాకాంక్షలు అని ముగించాడు.ఒకాయన ఆ ఒక్క మాట తప్ప మిగతాది యెం బాగులేదని కామేన్తినా నాకు మాత్రం అది కూడా వెటకారమే అనిపించింది,ఎందుకంటె ముంబాయి హోటల్లో ఇరుక్కున్న వాళ్ళలో ఒకాయన ప్రొఫెసర్ అని తెలిసి ఆ హోటల్ని పేల్చెయ్యడానికి వచ్చిన వాళ్ళే ఆయన్ని గౌరవంగా చూసారు.తల్లినీ తండ్రినీ గురువునీ గౌరవించహ్తమ్ కూడా కమ్యునిష్టు సిద్ధాంతం ప్రకారం మతతత్వమేనా?

    మరి కమ్యుఇన్శ్టులకి ఆపాటి సంస్కారం కోడా అక్కర్లేకుండా నోటికి యేది తోస్తే అది మాట్లాడటమే సైధ్ధాన్తిఅకత అనుకోవాలా?ఇటు వైపు బాబాలనీ మానవాతీతులు అనుకంటే విమర్శిస్తూ రంగనాయకమ్మని దోషాల కతీతం చేస్తారెన్దుకు?మీలోకి మీరు చూసుకోండి!మాకు లోకువ కాకండి?!

  59. హరిబాబు సూరానేని says:

    @PRAVEEN కుమార్
    విరసంవాళ్ళు చేసే వర్గ సహకారాన్ని చూసి పాలకవర్గంవాళ్ళు మార్క్సిజమ్‌ని అంగీకరించడం జరగదు కనుక విరసం లేకపోతే మార్క్సిజమ్‌కి వచ్చే నష్టమేమీ లేదు.

    హ్హ హ్హ హ్హ!!

    చెరబండరాజు కూడా విపవద్రోహియేనా నీ దృష్టిలో?వరవర రావు కూడా బూర్జువాయేనా నీ తార్కికత ప్రకారం?కేవలం రంగనాయకమ్మా మరియూ ఆవిడ పాదరేణువులూ,వీరభక్తులూ మాత్రమే నికార్సైన కమ్యునిష్టులా?ఓ ఇసుకలో తలదూర్చిన ఉష్ట్రపక్షీ విషవ్ర్క్సమ వల్ల హిందూధర్మము యొక్క వెంత్రుక కూడా కదల్లేదు గదా మరి రంగనాయకమ్మ వల్ల జరిగిన మేలు యేమిటోయ్?

    • దేవుణ్ణే నమ్మని నేను మనిషిని దేవునిగా భావిస్తానా? వ్యక్తి పూజ చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. తాము ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, తమ పిల్లల్ని IT ఉద్యోగాలు (సామ్రాజ్యవాదుల కొరకు out sourcing)కి పంపుతూ, జనానికి మాత్రం విప్లవం కబుర్లు చెప్పే రాజకీయ వ్యభిచారుల అభిమానులకి మాత్రం ఆ అవసరం ఉంటుంది.

  60. Delhi Subrahmanyam says:

    ధన్యులు హరిబాబు సూరపనేని గారూ. రాజేంద్రబాబు గారూ, అంతకు ముందు నేను కూడా ఇక్కడా ఫేస్బుక్ లో కూడా ఇదే విషయాన్ని రెండు మూడు సార్లు చెప్పాను. విరసం ఆవిర్భణ కు నాంది ఫిబ్రవరి 2 1970 నా విశాఖలో జరిగిన శ్రీ శ్రీ సష్టిపూర్తి సభలో విశాఖ విద్యార్ధుల కరపత్రం “రచయితలారా మీరేటువైపు” తో మొదలయింది. ఆ తర్వాత, అప్పటి దిగంబర కవులు కూడా విధార్ధుల కరపత్రానికి స్పందింస్తూ విరసం యేర్పాటు వైపు మొగ్గు చూపారు. అలాగా మొదలయింది, విరసం యేర్పాటు . ఇది జూలై 1970 కి పూర్తయింది. రంగనాయకమ్మ గారు చెప్పే కుట్ర 1970 ఫెబ్రవరి 2 .న జరిగింది. అప్పుడు అక్కడున్న రచయతలందరూ ఈ కుట్రలో భాగమే.

    ఇంకో ముఖ్య విషయానికి,ఇక్కడా, మొన్న హెచ్‌ఆర్‌కే‌హెచ్‌ఆర్‌కే ఆంధ్రజ్యోతి వ్యాసం లోనూ జవాబు లేనిదేమిటంటే. రంగనాయకమ్మ గారు యెన్ని ప్రజా సమస్యలలో ప్రత్యక్షం గా పాల్గొన్నారని. నన్నూ, ఇంకో ఇద్దరినీ తన వ్యాసం లో ప్రసక్తి తీసుకు వచ్చిన హెచ్‌ఆర్‌కే‌హెచ్‌ఆర్‌కే గారు, మిత్రులు అరణ్య కృష్ణ గారు ప్రస్తావించిన ఈ సమస్య మీద అసలు స్పందించలేదు. అరుంధతీ రాయ్ ప్రసక్తి కూడా వచ్చిందిక్కడ. ఆవిడ ఇంట్లో కూర్చొని దండకరణ్య పోరాటం గురించి రాయలేదు. అక్కడకు వెళ్ళి వాళ్ళతో 3 వారాలు గడిపి రాశారు.

    అరణ్యకృష్ణ గారు కూడా ఇలాగే, బాలగోపాల్, వరవర రావు,. చలసాని ప్రసాద్ తదితరులు ప్రజలతో మమైకమయి పనిచేశారు అని చెప్పారు.. నేను ఆ పేర్లకు మిత్రుడు సి.వి.సుబ్బారావు పేరు కూడా కలిపాను.

  61. prasad bolimeru says:

    చలసాని ప్రసాద్ చనిపోయారు. ఆయనతో కలిసి , ప్రజలకోసం ,ప్రజలతరపున , రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన వరవరరావు కొన్ని సంఘటనల్ని గుర్తుచేసుకొన్నారు. గుర్తుచేసుకోవడంలో సిద్దాంత చర్చ చేయలేదు. అప్పుడు అ అవకాశం గాని అవసరం గాని లేదు.
    రంగనాయకమ్మ ఏమి ఆశించి (విప్లవం పరువు పోగొట్టేసారు) ఉద్రెకపడ్డారో ఆమె మాత్రమే చెప్పగలరు, చెప్పాలి. ఆమె స్పందన ఓ “కచ్చిబోతుతనం” లా , కుతర్కంలా నాలాటి వారికి అనిపిస్తోంది . వసంతకన్నబిరన్ సైతం ఉడుకుబోతుతనాన్ని బయటపెట్టారు. ఇంతమందికి “పనిపెట్టారు” .
    రచయిత్రిగా , ఆలొచనాపరురాలిగ రంగనాయకమ్మ భాగాన్ని సాంస్కృతికరంగంలో ఎవరూ తక్కువ చేయలేరు.
    ఆలోచనలు ఆచరణకు కాకుండా అంతవరకే మిగిలిపోతే ,సమాజానికి , ప్రజలకి ఒరిగేదేమిటి? పడక్కుర్చి భావాలవల్ల రాజ్యానికి నష్టమేమిలేదు, ఉండదు. జరుగుతున్నఅన్యాయం, దోపిడిపట్ల ప్రజలవైపు నిలబడి ,ప్రజలకు ధైర్యాన్నిచ్చి వాళ్లతోకలిసి నోరిప్పని భజన బృందాల వాళ్ళవల్ల లాభం ఎవరికి?
    విరసం పుట్టుక , నిర్మాణం ఒక అనివార్యమైన చారిత్రక “కుట్ర” . రాజ్యానికి , దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజలపక్షం నిలవాలన్న బాధ్యతను గుర్తించినవారు కలిసిచేసిన బహిరంగ “కుట్ర”.
    అంతకు ముందున్న గందరగోళాన్ని సరిచేసి ప్రజాపోరాటాల వెలుగులో ప్రజల సాంస్కృతిక ఆయుధంగా రూపొందింది విరసం. ప్రజల ఆలోచనల్లో, ఆచరణలో భాగమైంది. ఆ తరువాత విస్తరించిన , విస్తరిస్తోన్న అనేక అస్తిత్వ పోరాటాలకు విరసం పాదు చేసింది, నిరుపోసింది. “భావాలు వికసించి , విస్తరించి , భౌతిక శక్తిగా మారి సమాజాన్ని మార్చుకొంటాయి.” విరసం చేసింది , చేస్తున్నది ఇదే! ఈ”కుట్రే”
    కళాకారులూ, మేధావులు ఎవరి వైపు , ఎవరితో మాట్లాడుతున్నారు ? పీడితుల వైపా ? పాలకుల వైపా ?
    ఈ లెక్కలు తేల్చుకోవడానికే “కుట్రలు” జరుగుతాయి.. జరగాలి. లోపాలంటారా? తప్పవు. ఆచరణలో దిద్దుకొలేనంతటివి కావు. దిద్దుకోకపోతే జ్ఞాపకంగా మరుగునపడిపోతారు
    శ్రీశ్రీ నుంచి వేణు దాక — వీరి నిబద్ధతను .. భాగస్వామ్యాన్ని , శత్రువైఖరితో చూసే వాళ్ళను ఎవరి పక్షం అనుకోవాలి? విరసం తన సభ్యులని మందలించుకొంటుంది — సవరించుకొంటుంది. సమిక్షించుకొంటుంది. ముందుకే నడిపిస్తుంది
    ప్రత్యక్షం గానో , పరోక్షం గానో రాజ్యహింసకు , దోపిడీకి సహకరించేందుకు–మార్పునుకోరుకోనేవాళ్ళను గందరగోళ పరిచేందుకు పనికొస్తుంది ఈ “విప్లవం పరువు పోగొట్టేశారు” కుతర్కం.
    =========================================
    “మనిషిని మనిషి ఎందుకు ద్వేషిస్తాడు ? తనకేమి కావాలో తెలియనప్పుడు ప్రతిదాన్ని ద్వేషిస్తాడు. తనకేం కావాలో తెలిస్తే దాన్ని ప్రేమించి పొందేదానికి ప్రయత్నిస్తాడు.” — బుచ్చిబాబు
    ========================================

    • Delhi Subrahmanyam says:

      ప్రసాద్ బోలిమేరు గారూ, జరుగుతున్న చర్చకు అద్భుతమయిన స్పందన తెలిపారు. మీరుచేప్పినట్టు ఈ కుట్ర కొనసాగుతూనే ఉంటుంది.

  62. మీరు సమీక్షించిన విధానం చాలా బాగుంది ప్రసాద్ గారూ, “శ్రీశ్రీ నుంచి వేణు దాక — వీరి నిబద్ధతను .. భాగస్వామ్యాన్ని” గుర్తు చేస్తూ రంగనాయకమ్మగారి contributions ని కూడా మీరు మరిచిపోలేదు! ఇప్పుడు విరసం ‘ఆ రెండు దశాబ్డాలు’ ఎంత ప్రభావవంతం గా పనిచేసిందో- అదే స్థాయిలోనో, వీలయితే అంతకన్నా ఎక్కువ స్థాయి లోనో పనిచేయాలంటే ఏమి ఆత్మవిమర్షలు చేసుకోవాలో – దానికై RN గారి విమర్శలను స్వీకరిస్తే మంచిది. ఆమె “కచ్చిబోతు తనం ప్రదర్శించార”ని ఎవరెవరికి అనిపించినా వారంతా అది వెల్లడించాల్సిందే… అది ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు, కానీ ఆమె వాదం లో ఏపాటి నిజం ఉందొ కనీసం చర్చించాల్సిన అవసరం ఉందికదా… ఆమె పట్ల వీరందరూ చూపుతున్న ఈ “శత్రు వైఖరి” ఎవరికీ లాభిస్తుంది?

  63. Delhi Subrahmanyam says:

    రంగనాయకమ్మ ఏమి ఆశించి (విప్లవం పరువు పోగొట్టేసారు) ఉద్రెకపడ్డారో ఆమె మాత్రమే చెప్పగలరు, చెప్పాలి. ఆమె స్పందన ఓ “కచ్చిబోతుతనం” లా , కుతర్కంలా నాలాటి వారికి అనిపిస్తోంది అన్న మీ వ్యాఖ్య బావుంది ప్రసాద్ బోలిమేరు గారూ. అలగే మీరు వసంత కన్నాభిరాన్ మిద చేసిన వ్యాఖ్య కూడా కొంతవరకూ సరిగ్గానే ఉంది.

    మీరన్నుట్లుగా రచయిత్రిగా , ఆలొచనాపరురాలిగ రంగనాయకమ్మ భాగాన్ని సాంస్కృతికరంగంలో ఎవరూ తక్కువ చేయలేరు. అయితే మళ్ళీ మీర్న్నట్లుగానే “ఆలోచనలు ఆచరణకు కాకుండా అంతవరకే మిగిలిపోతే ,సమాజానికి , ప్రజలకి ఒరిగేదేమిటి? పడక్కుర్చి భావాలవల్ల రాజ్యానికి నష్టమేమిలేదు, ఉండదు. జరుగుతున్నఅన్యాయం, దోపిడిపట్ల ప్రజలవైపు నిలబడి ,ప్రజలకు ధైర్యాన్నిచ్చి వాళ్లతోకలిసి నోరిప్పని భజన బృందాల వాళ్ళవల్ల లాభం ఎవరికి?”

    అందుకే విరసం , విరసం భావాలతో సహానుభూతి ఉండేవారందరూ , 1970 లో మొదలయినప్పటినుంచి ఇప్పటిదాకా కొనసాగిస్తూనే ఉన్నారు , ఉంటారు.

  64. Delhi Subrahmanyam says:

    రంగనాయకమ్మ ఏమి ఆశించి (విప్లవం పరువు పోగొట్టేసారు) ఉద్రెకపడ్డారో ఆమె మాత్రమే చెప్పగలరు, చెప్పాలి. ఆమె స్పందన ఓ “కచ్చిబోతుతనం” లా , కుతర్కంలా నాలాటి వారికి అనిపిస్తోంది అన్న మీ వ్యాఖ్య బావుంది ప్రసాద్ బోలిమేరు గారూ. అలగే మీరు వసంత కన్నాభిరాన్ మిద చేసిన వ్యాఖ్య కూడా కొంతవరకూ సరిగ్గానే ఉంది.

    మీరన్నుట్లుగా రచయిత్రిగా , ఆలొచనాపరురాలిగ రంగనాయకమ్మ భాగాన్ని సాంస్కృతికరంగంలో ఎవరూ తక్కువ చేయలేరు. అయితే మళ్ళీ మీర్న్నట్లుగానే “ఆలోచనలు ఆచరణకు కాకుండా అంతవరకే మిగిలిపోతే ,సమాజానికి , ప్రజలకి ఒరిగేదేమిటి? పడక్కుర్చి భావాలవల్ల రాజ్యానికి నష్టమేమిలేదు, ఉండదు. జరుగుతున్నఅన్యాయం, దోపిడిపట్ల ప్రజలవైపు నిలబడి ,ప్రజలకు ధైర్యాన్నిచ్చి వాళ్లతోకలిసి నోరిప్పని భజన బృందాల వాళ్ళవల్ల లాభం ఎవరికి?”

    అందుకే విరసం , విరసం భావాలతో సహానుభూతి ఉండేవారందరూ , 1970 లో విరసం మొదలయినప్పటినుంచి ఇప్పటిదాకా ఆ కుట్ర కొనసాగిస్తూనే ఉన్నారు , ఉంటారు.

  65. Delhi Subrahmanyam says:

    ఇంకో మాట అందులో ఆవిడ రాసిన దాని లో విమర్శా లేదు పోనీ సరి హేసుకుందుకు. కేవలం కచ్చిబోతుతనం తనం మతమే కనిపిస్తుంది. శ్రీ శ్రీ ని ఎలా దొంగతనం గ తేసుకేల్లరానో. మొన్న facebook లో స్పందిస్తూ, చలసాని ప్రసాద్ గారితో సన్నిహితం గా ఉండే ప్రఖ్యాత రచయిత్రి మల్లీశ్వరి గారు ఇలా అన్నారు ” నాలుగేళ్ల కిందట చలసాని, కృష్ణాబాయి ఇద్దరినీ కలిపి వీడియో ఇంటర్ వ్యూ తీసుకున్నా. అదిపుడు చూస్తే ఈ మాట మరీ మరీ ఆకర్షించింది – ఆ రోజు(1970 జూలై 4) శ్రీశ్రీ లేకపోయినా విరసం ఏర్పడి ఉండేది. ఆ తర్వాత శ్రీశ్రీ చేరి ఉండేవాడు .” – చలసాని ప్రసాద్.:

  66. prasad bolimeru says:

    కల్యాణి గారు, —చరిత్రను వొదిలి , సందర్భంనుండి విడదీసి కొన్నిసంఘటనల్ని ప్రస్తావించి “విప్లవం పరువు పొగొట్టేశారు ” అని రంగనాయకమ్మ ఆరోపిస్తే — దాన్ని విమర్శగా నేను అంగీకరించలెను . అంగికరించేవాళ్ళు చెప్పాలి అది ఏ విధమైన విమర్శ అని. పోనీ ప్రజాక్షేత్రంలో విరసం ఆచరణ పై ఆమె అభ్యంతరాలను సూచనలను వెల్లడిస్తే ఆత్మవిమర్శ కు అవకాశముంటుంది. “విప్లవం పరువు పొగొట్టేశారు ” లో ఏ నిజాల చర్చ జరగాలి ?
    కావాలనిచేసే వక్రీకరణలకు సమాధానం ఏముంటుంది? చరిత్రలో ప్రజల్ని ప్రభావితం చేసిన ఉద్యమాల స్వభావాన్ని , రూపాల్ని నేటితరానికి అందిస్తే రంగనాయకమ్మ కు రుణపడిఉంటామ్ . ఈ “శత్రు వైఖరి” — ఆమె మిత్రులు ఆమె ద్వారానే , కాకుంటే ఎవరూ చెరపలేని చరిత్రని శోధించి నిజాలు తెలుసుకొనేందుకు లాభిస్తుంది.

    • Delhi Subrahmanyam says:

      అయ్యా ప్రసాద్ బోలిమేరు గారూ, ఇదే విషయాని ఇన్ని రోజులుగా, అరణ్య కృష్ణ, విజయకుమార్ , జవహర్, ఆంధ్రజ్యోతి ద్వార రాజేంద్ర బాబు గారూ, కొంతవరకూ నెన్నో, 17 ఆగస్ట్ న , వసంతా కన్నాభిరాన్ గేయం వొచ్చినప్పటినుంచీ, మొదలయిన చర్చలో భాగం గా చెప్పుతూనే ఉన్నాము. ప్రజల పోరాటం లో భాగమయిన బాలగోపాల్ , వేణు ఇంకా ఎంతో మందిని మార్క్స్ ముసుగులో ఈవిడ విమర్శిస్తూనే ఉన్నారు.మీరు చెప్పినట్టు ” విరసం ఆచరణ పై ఆమె అభ్యంతరాలను సూచనలను వెల్లడిస్తే ఆత్మవిమర్శ కు అవకాశముంటుంది” అదేమీ లేదు. ఆవిడ అడగని ప్రశ్నల కి ఎందుకు జవాబివ్వటం లేదని మాత్రం ఆవిడ అభిమానులు అడుగుతూనే ఉన్న
      మిత్రుడు పి.అర్.జె.పంతులు (ప్రఖ్యాత రంగస్థల నటుడు) చెప్పినట్టు ” ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకుందాం . మాస్టారి యజ్ఞం మీద విచక్షణా రహితంగా (ఈ రంగనాయకమ్మ గరే) దాడి చేసినప్పుడు గురువుగారు రావిశాస్త్రి గారు “పట్టించు కోకండి . వదిలేయండి “అనడం మాస్టారు ఆ ఆజ్ఞను సిరసావహించడం గుర్తుకి వస్తోంది . వదిలేయండీ . పంతులు గారీ మంచి మాట కూడా అన్నారు ” నేనుఅందరి కన్నా ఎత్తులో ఉండాలంటే ఏమిటి సాధనం ?రెండు మార్గాలున్నాయి .ఒకటీ కష్టపడి శిఖరాన్ని అధిరోహించడం . లేదా ఎదుటి వారిని గోతుల్లోకి తోసేయ్యడమో .”

      అయ్యా అదండీ సంగతి.

  67. RN లేవనెత్తిన topics లో నాకు relavent అనిపించినది …వ్యక్తిపూజ/వీరపూజ -సామ్యవాదానికి చుక్కెదురని నా నమ్మకం…ఆ మాట విశ్వనాథ సత్యన్నారాయణ గారు రాస్తే నేను అర్ధం చేసుకోగలను, వారి భావాలు వారి రచనల్లో సుస్పష్టమే గనుక, అయన సోషలిస్ట్ కవి అని నేను అనుకోను గనుక! శ్రీశ్రీ గారు అన్నారని చదివితే, ఆ విషయం లో అయన పొరపాటు గా అన్నారనే అనుకుంటాను…అంత మాత్రాన “దాట వెతల కవి” అని అనుకోను- అక్కడ RN comment తో నేను విభేదిస్తున్నాను…
    అయినా చర్చ జరగాలని ఎందుకు ఆశిస్తున్నాను అంటే- శ్రీశ్రీ -రైతాంగ పోరాటాన్ని సమర్ధించకుండా అడ్డుపడాలని అరసం ప్రయత్నించిందని వివి రాసారు కదా- ఆ శ్రీశ్రీ ని ఇటు తీసుకొచ్చిన ఘనత చలసాని వారిదనన్నట్టు గా కూడా వివి రాసారని నాకు అనిపించింది , రాజేంద్ర బాబు గారి వ్యాసం లో కుడా విరసం peak period ప్రసక్తి వచ్చింది… వీటన్నిటి నేపధ్యం లో నాలాటి layperson ఒక సందేహం వ్యక్తపరచవచ్చు ననుకుంటా…మరి ఈ దశకం లో శ్రీశ్రీ లాటి మహాకవి లేక పొతే విరసం దేనిని కేంద్రం గా తీసుకుని పనిచెయ్యాలి?

    • Delhi Subrahmanyam says:

      విరసం శ్రీ శ్రీ ని కేంద్రం గ తీసుకొన్ ఎప్పుడూ పనిచేటలేదు. అసలు శ్రీ శ్రీ గారి శాస్తి పూర్తి లో విశాఖ విద్యార్ధుల కరపత్రం లో “రచయతలార మీరెటు వైపు” – ఒక వైపు అప్పుడు శ్రీకాకుళం లో జరుగుతున్న ప్రజల ఉద్యమం లోంచి వచ్చిన సాహిత్యం – సుబ్బారావు పాణిగ్రాహి గారి “ఎరుపంటే భయం భయం కొందరికి” వంగపండు గారి పాటలు, భూషణం గారి కొండ గాలి లాంటి సాహిత్యం – రెండో వైపు, పరజల పోరాటానికి దూరం గా ఉన్న సాహిత్యం. అంటే మొదలు శ్రీకాకుళం ఉద్యమతో మొదలయింది.” ద్రౌపది అగ్నిలోంచి పుట్టుకు వచ్చిందని వ్యాసులవారు అన్నారు .అది నిజమో కాదో కానీ విప్లవ రచయతల సంఘం (విరసం) శ్రీకాకుళ పోరాట అగ్ని జ్వాలలోంచే పూత్తుకు రావడం నేను కళ్ళార చూసాను” అని శ్రీ శ్రీ గారే స్వయం గ లిఖితిపూర్వాకం గా అన్నారు. ఆ ఉద్యమం తర్వాత తెలంగాణా జిల్లాలకి పాకి , చెరబండరాజు గారు :కొండలు పగలేసినం లాంటి పాటలుం గద్దర్ గారి రాగాల్ జండా లాంటి న్రిత్య నాటకం ఇంకెన్నో కవితలూ, కే.వి.ఆర్, వరవర రావు, శివసాగర్ , కే.శివారెడ్డి, వేణూ, బాలగోపాల్, సి.వి.సుబ్బారావు లాంటి ఎంతో మంది, రచయతలతో నడిచింది నడుస్తూనే ఉంది. విరసనికేప్పుడూ ఒక వ్యక్తి ఎప్పుడూ కేంద్రం కాదు. బహుశా ఈ చర్చలో పాల్గొంటున్న చాలామంది రంగనాయకమ్మ అభిమానులకు , 1975 లో శ్రీ శ్రీ గారు అప్పటి ఎమర్జెన్సీ ని పొగుడుతూ ఒక కవిత రాసినందుకు విరసం ఏకగ్రీవం గ వారిని విరసం బహిష్కరించింది. ఆ రెండు సంవత్సరాలు విరసం లోని సభ్యులందరూ కారాగారం లో ఉన్నారు (ప్రఖ్యాత మార్క్సిస్ట్ రచయిత్రి గారిని రాజ్యం తన శత్రువుగా భావించ లేదు కాబట్టి ఆవిడని మాత్రం కారాగారం లో పెట్టలేదు) . మిత్రుడు సి.వి.సుబ్బా రావు 1976 లో అనుకుంటాను తన M .A పరీక్షని విశాఖ లోని కారాగారం లోంచి రాసారు. తర్వాత 1977 లో ఎమర్జెన్సీ ఎత్తివేసి విరసం సభ్యులని విడుదల చేసాక వారు విజయవాడ లో సర్వసభ్య సమావేశం జరుపుకున్నప్పుడు, శ్రీ శ్రీ గారు బహిరంగ క్షమార్పణ పత్రం రాసి తనని మళ్ళీ విరసం లో చేర్చుకొమ్మని అభ్యర్దన చీసి ఆ విషయం మిద జరిగిన రెండు గంటల చర్చ సమయంలోను బయట గుమ్మం దగ్గర కూర్చొని వెయిట్ చేసారు. అందుచేత విరసం ఎప్పుడూ శ్రీశ్రీ ని కేంద్రం చేసుకొని పని చేయలేదు. ఉద్యమాన్ని కేంద్రం చేసుకొని పని చేసింది.

      • vidyasagar says:

        vangapandu songs and Bhushanam writings came after the suppression of srikakaulam movement.it is interesting to note taht Bhooshanam wrote many essays and stories and songs during the movement but those were not related to taht movement. he restricted himself to write predominantly on teacher’s problems.

      • Delhi Subrahmanyam says:

        మీరు చెప్పినది సరి అయిన దే విద్యాసాగర్ గారూ. . కానీ ఈ సాహిత్యం శ్రీకాకుళం ప్రేరేపణతో వచ్చినదే అని అలా అన్నాను. ఇంకా చాల మంది రాచ్యతలున్నారు, అట్టాడ అప్పల నాయుడు లాంటి వారు.

  68. హరిబాబు సూరానేని says:

    కళ్యాణి గారూ,
    యెక్కడ జరగలేదు వీరపూజ!రష్యాలో మసోలియం లెనిన్ ఒక్కడికే యెందుకు కట్టారు?అందరికన్నా అతడు మరింత గొప్పవాడు అని కదా!చైనాలో మావో ఫొటోలు మాత్రమే కనబడుతున్నాయేమిటి – లాంగుమార్చిలో పాల్గొన్నవారిలో మిగులినవారు తాజమహలు నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల పాటి చెయ్యలేదా?ఆస్తికులు దేవుడి విగ్రహం ముందు చేతులు జోడించి నమస్కరించటం హేతువిరుధ్ధమయితే మీరు యెర్రజండా ముందు నిలబడి పిడికిళ్ళు బిగించి వందనం చెయ్యడం హేతువిరుధ్ధం కాదా?మీ తప్పులు తెలుసుకోకుండా వూరికే విరగబడకండి,మీ కాళ్లకింద భూమి మీకు తెలియకుండానే కదిలిపోయి అందాక దక్కిన అధికార పీఠం కూడా జారిపోతుంది.చరిత్ర యెవడికీ వలపక్షం చూపించదు – బహుపరాక్!

  69. చాలా సరైన ఉదాహరణలు అందించారు హరిబాబు గారు…
    సరిగ్గా అవే పనులు తప్పని RN రచనలద్వారా నేను నేర్చుకున్నాను…thank యు…ఆ చైనా, రష్యా లో జరిగినవి, హెతువిరుద్ధమైనవి అనీ,ఇక్కడ పునరావృతం కాకూడదనే RN ఇంతలా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు…

    • Delhi Subrahmanyam says:

      ఆ వ్యక్తి పూజ లేదు కాబట్టే శ్రీ శ్రీ తప్పుచేసారనిపించినప్పుడు వారిని విరసం బహిష్కరించింది. హరిబాబు గారూ మీరు రాసిన ఉదాహరణ పాపం అర్ధం కాలేదు లెండి. లెనిన్, మావో ఎప్పటికీ అక్కడ ప్రజలకి నాయకులూ గానే ఉంటారు ఎందుకంటె , ప్రజల ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా ఊహించి నడిపించింది వీరే కాబట్టి. మావో తర్వాత వచ్చిన నాయకులూ ఆయన సాంస్కృతిక విప్లవాన్ని విమర్శించి కొత్త పంధాలో పోయిన తర్వాత కూడా అయన ఫోటోలను తొలగించలేదు. అలగే లెనిన్ భావాలను విమర్శిస్తూ అయన రాజకీయ సూక్తులు మారి చివరకు అప్పటి USSR ను చీల్చినా అందులో ముఖ్య భాగమయిన రష్యా నాయకుడు లెనిన్ ని ఇప్పటికీ ఆ గవురవం ఇస్తున్నారు. విరసం కుట్ర లోని చారిత్రాత్మక నిజాలు తెలుసుకుందుకు ప్రయత్నం చేయకుండా ఉన్నట్టే, ఇక్కడ చరిత్ర లోని విషయాలు తెలుసుకోం మేం. కాదనడానికి మీరెవరు హరిబాబు గారూ!!

  70. హరిబాబు సూరానేని says:

    kalyaaNi

    మరి ఇప్పుడు రంగనాయకమ్మ విరసం పుట్టుక కుట్ర అనటం అబధ్ధమని తెలుస్తున్నా న్యాయమైన విమర్శల్ని కూడా ఆమె మీద కచ్చిబోతుతనం అనటం వీరపూజ కాదా?

    శ్రీశ్రీ “దాటవేతల కవి” యెలా అయ్యాడో చెప్పాలి,లేదా క్షమాపణ చెప్పాలి.తను నోటికొచ్చిందల్లా అనేటప్పుడు ఇది యెవరికి మేలు చేస్తుంది అని ఆలోచించదు గానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ కొందరు ఆమె మీద కచ్చిబోతుతనం చూపించటం యెవరికి మేలు చేస్తుంది అని అమాయకంగా అడుగుతున్నారు,దాని సంగతేంటి?

    జరిగినది ఒకటైతే మరో రకంగా జరిగిందని పులుముడు చరిత్రలు చెప్పడం కూడా మీ దృష్తిలో సైధ్ధాంతిక విమర్శయేనా?

    ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొంటున్న వరవరరావు విప్లవం పరువు పోగొట్టాడా?యే ప్రజా ఉద్యమలోనూ ప్రత్యక్షంగా పాలుపంచుకోకుండా అలా పనిచేసెవాళ్ల పరువు తియ్యటం మీ దృష్టిలో హెచ్చరించి మేల్కొలిపి సుప్రభాతాలు పాదటమా?వరవరరావుకి రంగనాయకమ్మ నుంచి నువ్వు విప్లవం పరువు పోగొదుతున్నావనే రకం హెచ్చరికలు అవసరమా?

    ఈవిద హెచ్చరికల పేరుతో ఇతర్లని విప్లవం పరువు తీశారంటూ తనే విప్లవం పరువు తీస్తున్నదని మీకు తెలియడం లేదా?

    నాయకుడు లేని విప్లవం ఫ్రెంచి విప్లవంలా అరాచకతకి దారితీస్తుంది!వాళ్లకుండే ప్రత్యేకతకి ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వటం వీరపూజ కాదు,ప్రాక్తికాలితీ ప్రకారం నాయకుది అవస్రం విప్లవానికి ఉంటుంది,ఉండాలి!

  71. Delhi Subrahmanyam says:

    అయ్యా హరిబాబు, ఇదంతా చెవిటి వాడి ముందు శంఖం లాంటిదే. ఒక హేతు బద్ధమయిన విమర్శ లేకుండా కేవలం వ్యఖిగత అహంభావం తో (తన కున్న ఆత్మ న్యూనత భావం నుంచి వచ్చిన) ప్రకటనలు చేయడమూ అవి తప్పంటే అర్ధం లేని విమర్సలూ. ఎందుకు హరిబాబు గారు ఈ వృధా ప్రయాస.

  72. హరిబాబు సూరానేని says:

    అయ్యా సుబ్రమణ్యం గారూ,
    మీరు చెప్పిన విసేషాల్ని బట్టి మీరు ఆయా ఉద్యమాల్లో వ్యక్తిగతంగా ఇన్వాలవ్ అయి పనిచేశారని తెలుస్తున్నది,అభినందనలు.పైన చెప్పారే శిఖరం మీద ఉందటానికి రెండు మార్గాలు అని,అది చాలా మంచి భావం.అయితే వ్యక్తులుగా వారు తమ గురించి ఇతర్లు కామెంట్లు చేస్తే తమ వ్యక్తిగత మానావమానాల కోసం పోరాటం చెయ్యడం గురించి ఇబ్బందిపడి అలా అని ఉండవచ్చు.

    కానీ మిగిలిన వారు అలా తగ్గి ఉందాల్సింది కాదు,మొక్కగా అలా వదిలెయ్యబట్తే ఆ విషవృక్షం కొమ్మల్నీ రెమ్మల్ని పెంచుకుని ఇవ్వాళ కార్యక్షేత్రంలో కదను తొక్కుతూ కదిలే వరరవరావు లాంటి వాళ్ళని హేళన చేసేటంతగా బలం పెంచుకుంది!

    నాకు హిందూధర్మాం అంటే అభిమానం,కానీ అందులో ఉన్న ప్రతిదాన్నీ నేను సమర్ధించను.ఆ ఆ కాస్తకే మురంనా అభిమానులకి నేను విప్లవద్రోహిగా మతచాందసవాదిగా కనబడవచ్చును,కానీ నేను మిమ్మల్నే సూటిగా అడుగుతున్నాను – యెందుకు ఒక ప్రజాస్వామ్యబధ్ధంగా పోరాడే పార్టీలలో సంస్థలలో ఇలాంటివాళ్లని సహిస్తున్నారు?

    చానక్యుడు ఒక మాట చెప్పాడు యుధ్ధానికి సంబంధించి!యుధ్ధం మొదలు పెట్టినప్పటి నుంచి గెలుపు కోసం చేసే ప్రయత్నాల్లో శత్రువు కన్నా మందు తతస్థుల్ని గెలవమన్నాడు!ఇవ్వాళ శత్రువుగా ఉన్నవాణ్ణి రేపటికి తటస్థుడిగా మార్చుకో,ఇవ్వాళ తటస్థుడిగా ఉన్నవాన్ణి రేపటికి స్నేహితుడిగా మార్చుకో,ఇవ్వాళ స్నేహితుడిగా ఉన్నవాణ్ణి రేపటికి సహయోధుడిగా మార్చుకో!వర్గపోరాటానికి కూడా అదే స్ట్రాటజీని వర్తింపజెయ్యాలనే చైతన్యం మీకుంటే మీరు మొదత విప్లవసంఘాల్లో విప్లవపార్టీల్లో యేరిపారెయ్యాల్సింది ఇలాంటి కలుపుమొక్కల్నే!

    తటస్థుల్ని గెలవాలంటే గుడ్ విల్, వీళ్ళు మంచివాళ్ళు అనే ఇంప్రెషన్ యెదిరిపక్షంలో ఉన్నవాళ్లకి కూడా కలిగించగలిగిన శ్రీశ్రీ,వరవరరావు.చెరబందరాజు,మీలాంటి వాళ్ళ వల్ల జరుగుతుందే తప్ప మురమ్ణా వల్ల యెట్టి పరిస్థితిలోనూఒ మీకు గానీ విప్లవానికి గానేఎ యెలాంటి మంచీ జరగదు!
    <a hrశ్రీశ్రీ వల్ల కమ్యునిజం అనే ఆదర్శం పట్లా ఆకర్షితులైనవాళ్లలో చాలామంది మురంనా వల్ల వికర్షితులయ్యారు – ఆరకంగా మురంనా వల్ల పార్టీకి మంచి కన్నా చెడే యెక్కువ జరిగింది!

    శ్రీశ్రీ వల్ల కమ్యునిజం అనే ఆదర్శం పట్లా ఆకర్షితులైనవాళ్లలో చాలామంది మురంనా వల్ల వికర్షితులయ్యారు – ఆరకంగా మురంనా వల్ల పార్టీకి మంచి కన్నా చెడే యెక్కువ జరిగింది!

    • delhi subrahmanyam says:

      అయ్యా సూరపనేని హరిబాబు గారూ, మీ అభిమానానికి ధన్యుడిని. నేను పుట్టి పెరిగిన విశాఖపట్నం లో గత 46 ఏళ్ళగా డిల్లి లోనూ, పక్కన ఉన్న Gurgaom లొను ఉంటున్నాను. మా మేనమా గారయిన కిర్తిసేషులు ఆకెళ్ళ కృష్ణమూర్తి గారు ఒక కార్మిక సంఘ నాయకుడు మాత్రమే కాక ఒక మార్క్సిస్ట్ రచయిత. ఆయన హోవార్డ్ ఫాస్ట్ స్పార్టకస్ నోవాలని తెలుగు లోకి అనువదించారు. వారూ ప్రముఖ రచయిత రావి శాస్త్రి గారూ ఆప్తమిత్రులు. అల చిన్నప్పటినుంచే (నేను 1945 లొ పుట్టాను, సుమారు 1956 నుంచి రావి శాస్త్రి గారు మా ఇంటికి వచ్చే వారు. ఆ రకంగా నామీద వారి ఆలోచనా సరళి ఉన్నది. విరసం తో నా పరిచయం నేను ఇదివరకు ప్రస్తావించిన మిత్రుడు+బంధువూ అయిన సి.వి.సుబ్బారావు గారు డిల్లి ఉద్యోగ్యరీత్య వచ్చినప్పుడు కలిసి తిరగడమూ చర్చలో పాల్గొనడంతో మొదలయింది. 1980 లలో ఇక్కడున్న జె.యెన్,యు లొ చదవడానికొచ్చిన శ్రీ అశోక్ టంకశాల గారితోనూ (అప్పుడు మా సోదరుడు రవికాంత్, పాత్రికేయుడు కూడా అక్కడే చదివేవాడు) వారు మొదలు పెట్టిన “ప్రగతి సాహితి” బృందం తో ఆప్త స్నేహం యేర్పడడము కూడా నా ఆలోచనా విధానికి సహాయ పడింది. నాకు నాటకరంగామంటే ఇష్టం. నాటకాలకు సాహిత్యం తో అవినాభావ సంభంధం ఉంది కాబట్టి సాహిత్య అభిమానిని కూడా. 1960 70 ల మధ్య వచ్చిన సాహిత్యం లొ రంగనాయకమ్మ గారి రచనలంటే అభిమానాముండేది. (నా ఆలోచన పద్ధతి వల్ల), ఆవిడ రచనలమీద నాకు జానకి విముక్తి వరకూ అభిమానాముండేది. 1960 లొ శాస్త్రి గారి ఆరు సారకథలు చదివిన తర్వాత మనుష్యులను అర్ధం చేసుకోవాలనే తపన పెరిగింది.

      1979 లొ శ్రీ శ్రి గారిని అనుకోని రీతిలో కలుసుకోవడం జరిగింది. వారినప్పుడు ఇక్కడున్న కర్ణాటక సంఘం సంమనిన్చిందని తెలిసి (అప్పుడు నేను డిల్లి లొ ఉన్న తెలుగు నాటక సంస్థ దక్షిణ భారత నటీ నట సమాఖ్య కార్య దర్శి గా ఉన్నాను. అప్పుడు వారున్న విశ్రామ స్థలానికి వెళ్లి (ఆ రోజు ఆదివారం) “అయ్యా నాపేరు దేవరకొండ సుబ్రహ్మణ్యం, నాది విశాఖ ఇక్కడ నేను పలానా సంస్థకి కార్యదర్శిని అని చెపుతుంటే వారు వెంటనే ” ఈ వెధవ వూళ్ళో ఇవ్వాళా మందు దొరకదు ట కదా అని (వెంటనే రంగనాయకమ్మ గారి అభిమానులు అదే కదా మా ఆర్ యెన్ చెపుతుంది.అంటారు.కాస్త ఓపిక పట్టండి అంతా చదివాక మీకే తెలుస్తుంది – మీకు ఓపిక తక్కువని ఇప్పటికే నిర్ధారన అయిన సరే) వెంటనే నేను సార్ నాతో మా ఇంటికి రండి నేను ఏర్పాటు చేస్తాను అనగానే ఆయన లేచి ప్యాంటు వేసుకొని నా స్కూటర్ దాహ్గ్గరకు బయలు దేరారు. దారిలో ఆయనతో “నా దగ్గర రమ్ము కొంచెం ఉంది అంటే ” ఆయన కవి హ్రిదయం చూడండి. (ఇండియన్ రంమయిననేమి బ్రిటిష్ రమ్మమయిననెమి రమ్ము రమ్మే కదా – ఇక్కడ రమ్ము అంటే రండని ఆహ్వానం . ఇంటి కేళ్లాకా దగిరలోనే ఉన్న సి,వి ను పిలవడమూ వారు కూడా కలవడమూ రాత్రంతా వారి కవిత ల గురించీ మాట్లాడడమూ వారు ఆశువుగా తన కవితలను చదవడమూ, నాడు భగత్సింగు నేడు నక్సలైటు అన్న వారి కవిత చదవడమూ . ఆ రోజే వారు చనిపోతే వారి దేహాన్ని విశాఖలోని కింగు జర్గ్ర్ హాస్పిటల్ కు ఇవ్వాలన్న కోరిక వేల్లబుచ్చడమూ ఆ రాత్రే జరిగాయి.

      1983 లొ డిల్లి లొ మిత్రుడు సి.వి.సుబ్బారావు సభ్యుడయిన పౌరహక్కుల సంఘం యు.డి.అర్.లొ చేరిన తర్వాత రాజ్యం అట్టడునగున్న ప్రజల హక్కులను రాజ్యం ఎలా తినేస్తుందో అనే సంగతులు ఆ ఆ ప్రజలతో మాట్లాడినప్పుడు అర్ధమయ్యేది.1983 లొ డిల్లి లొ మొదటి అఖిల భారత విప్లవ సంస్కృతి కార్య క్రమం జరిపినప్పుడు నా కిష్టమయిన రెండు భాగాలను సమన్వ్య కర్త మిత్రుడూ అయిన అశోక్ టంకశాల గారు అప్పగించారు. ఒకటి నాకు ఇష్టమయిన రంగస్థల నిర్వహణ రెండోది నాకు చాల ఇస్తామయిన వంట నిర్వహణ.

      విరసం సభ్యుల తోనూ, ఇతర రాష్ట్ర విప్లవ సంస్కృతిక సభ్యులతో 3 రోజులు గడపడమూ, జననాట్య మండలి ప్రముఖులయిన వంగ పండు, గద్దర్ల కార్యక్రమాలను డిల్లి లొ పలు చోట్ల ఏర్పాటు చేయడం, ముఖ్యం గా దేశం లొ నాటక శిక్షణలో ప్రముఖ మయిన నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా వారి ఆవరణ లొ జరపడమూ జరిగింది. అప్పుడే వారు చెరబండరాజు గారి “కొండలు పగలేసినం” పాటకు చేర కూతురు న్రిత్య రూపం లొ ప్రదర్శించడం , నేనెప్పటికీ మరవలేని జ్జ్ఞాపకం. అలగే వాళ్ళందరూ

      1983 లొ నేను శాస్త్రి గారి ఆరు సారా కధలను మిత్రులు అత్తిలి కృష్ణ రావు గారు సారంశం పేరుతో నాటకీకరణ చేస్తే ప్రగతి సాహితి మిత్రుల తో డిల్లి లొ 4 చోట్ల ప్రదర్సనలివ్వడంమూ, తర్వాత విజయవాడ లొ జరిగిన విరసం సభల్లో ప్తదర్సించడం జరిగింది,

      అయ్యా అదీ విరసం సభ్యులతో నా పరిచయం

      నేను రంగనాయకమ్మ గారిలాగా కరడు కట్టిన మార్క్సిస్టును కాను మిత్రుల సహకారం తో వారి ప్రోద్భలం తో ప్రజల మధ్య తిరుగుతూ వారి ని అర్ధం చేసుకునే సాటి మానవాభిమనిని.

      నా గురించి నేనెప్పుడూ చెప్పుకోవాలనుకోలేదు . కానీ మీరు బలవంతం చేసారు. మిగతా విషయాలు ఇక్క ద కాదు. నా వివరాలు: పేరు: డిల్లి (డ్రామా) సుబ్రహ్మణ్యం (మిత్రులు సుబ్బు అంటారు) నా మొబైల్: : +918800968130 నా ఈమెయిలు ఇడి: సుబ్బు60@జిమెయిల్ .కాం

      • N Venugopal says:

        సుబ్రహ్మణ్యం గారూ, చాల చాల బాగుంది. 1982 జూన్ లోనో జూలై లోనో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో ఎంట్రెన్స్ రాయడానికి వచ్చి, అది రాయకపోయినా, సుబ్బారావు రూంలో వారం ఉండి మీలాంటి వారెందరినో పరిచయం చేసుకున్నప్పటి నుంచి — అంటే నలబైల్లో ఉన్నప్పుడు మీలో ఉరకలెత్తుతున్న ఉత్సాహాన్ని చూసినప్పటి నుంచి — ఈ ముప్పై అయిదేళ్లలో మీలో ఆ ఉత్సాహం తగ్గకపోగా పెరుగుతుండడాన్ని, డెబ్బైలలో కూడ ఇరవైలలో లాగ ఆ కారు నడపడమేమిటి, ఇతరుల వ్యవహార సరళి మీద ఆ ఉద్రేకపడడమేమిటి, ఏ రచన మీదనో, అభిప్రాయం మీదనో ఆ నిలువెల్లా కదిలిపోయి స్పందించడమేమిటి…. మీరు ఎప్పడూ ఒక అద్భుతం. ఇది చదివాక మళ్లీ మళ్లీ అడగాలనిపిస్తోంది. మీ విశాఖ బాల్యం దగ్గర ప్రారంభించి ఆకెళ్ల కృష్ణమూర్తి గారు, రావిశాస్త్రి గారు, సుబ్బారావు ల జ్ఞాపకాలతో సహా మీరు మీ ఆత్మకథ, కనీసం మెమోయిర్స్ అర్జెంటు గా రాయాలి….

  73. హరిబాబు సూరానేని says:

    విప్లవాబిమానులందరికీ హరిబాబు చేస్తున్న ఆఖరి సూచన!
    సుబ్రమణ్యం గారు తమ కార్యకలాపాల గురించి చెప్పినందుకు ధాంక్స్.మంచిపన్లు చేస్తే కాదనే ధైర్యం యెవరికీ ఉందదు.కానీ ఒక్కో సినిమా పాటకీ అపట్లోనే 5000 ఇచ్చేవాళ్లని విన్నాను.మామూలుగా అందరికీ ఇవ్వకపోయినా శ్రీశ్రీ పాట ఒకటి మా సినిమాలో ఉండాలి అనుకుని పిలిస్తే యెక్కువగానే ఇచ్చి ఉంటారు అదా!ఆ డబ్బుతో పోలిస్తే అక్కడ సన్మానంలో ఇచ్చే దబ్బు యేపాటి?డబ్బు పిచ్చి యేమాత్రం లేని వ్యక్తికి ఆ దబ్బు కోసమే అంగలార్చినట్టు దురుద్దేశాలు ఆపాదించటం నాకే కష్టంగా అనిపిస్తున్నది,మరి మురంనాకి గానీ ఆమె వీరభక్తులకి గానీ యెందుకు అనిపించలేదో?
    అతను విప్లవద్రోహి అయితే అలా వెక్కిరించినా భేషుగ్గా ఉందేది.కానీ కాదే!తను తన రచనల్లో యే ఆశయాల్ని చెప్తుందో ఆ ఆశయాలకి కట్టుబడి ఉన్న మరో వ్యక్తిని అలా తూలనాడినా కూడా క్షమాపణ అడిగే దిక్కు లేదు,ఇదేనా వర్గరహితసమాజం కోసం పనిచేసేవాళ్ళ పోరాట తత్వం!
    కొందరిక్కడ వసంత గారి కవితని ఓవర్ అంటున్నారు.”రెండు మహానగరాలు” నవలలోనూ “మాభూమి” సినిమాలోనూ “ఓల్గా సే గంగా”లో నక్సల్బరీ ఉద్యమం పుట్టుకని వివరించే కధలోనూ ఒకే సన్నివేశం రిపీఎతయింది – ఆడదాని చనుబాలని పిండి తాగటం!దాని అర్ధం యేమిటి?దోపిడీ యెంత తీవ్రంగా ఉంటే తిరుగుబాటు అంత తీవ్రంగా ఉంటుందనే కదా!గడీల్లో దాక్కున్న దొరల్ని వెతికి చంపినవాళ్లని తప్పు పట్ట్టగలమా?వసంత గారు చేసిందీ అదే,కాదా?మురమ్నా చేసింది ఓవర్ కాబట్టి దానికి వసంత గారి ప్రతిస్పందన కూడా ఓవర్ అయింది,అయి తీరాలి,వసంత గారు చేసింది నూటికి నూరు పాళ్ళు కరెక్టే!
    విప్లవరచయిత్రి ముసుగులో సాటి విప్లవకారుల్ని వెక్కిరించతం యెవరికి మేలు చెయ్యడానికి?విరసం శ్రీశ్రీని క్షమించలేదు అని మీరు సాక్ష్యం చూపించారు!మరి మురమ్ణాని యెందుకు వదలాలి?”విప్లవం పరువు తీశారు” అనే రచనలో ఒక్కటి కూడా సిధ్ధానతపరమైన సీరియస్ అంశం లేదు,పూర్తిగా చవకబారు కచ్చిబోతుతనమే!దానికి పరిహారం జరిగితేనే విప్లవం పరువు నిలబడుతుంది,శుభం!

    నాకు చరిత్ర అంటే ఇష్టం,అది అమెరికా చరిత్ర అయినా,భారతదేశపు చరిత్ర అయినా,గట్టిగా మాట్లాడితే మన దేశాన్ని పీడించిన ఇంగ్లీషు వాళ్ళ చరిత్ర అయినా సరే – చరిత్ర రచనలో అబధ్ధాలు ఉందకూడదు.విరసం చరిత్రకి మురంనా పులమదల్చుకున్నది కూడా అబధ్ధాలనే,ఇంతకన్నా నేను చెప్పకూడదు మీ ఇష్టం!

    మురంనా అభిమానులు మీకు కచ్చిబోతుతనం అంతగట్టగానే RN అనే మహావ్యక్తిని విమర్సిస్తే ప్రమాదం అని వారు హెచ్చరించగానే మీరు చల్లబడితే రేపటికి “మా RN పాయింటే కరెక్టు,”అందుకే ఆమెని యేమీ చెయ్యలేకపోయారు” అని చెప్పుకునే మురంనా అభిమానుల మాటే నిలబడుతుంది చరిత్రగా!

  74. D JAVAHAR LAL says:

    సాహిత్య వార పత్రిక ‘సారంగ ‘ లో 19.08.2015 న వాటే ఫాల్! వాటే ఫిటీ ! అంటూ రమా సుందరి గారు, వసంత గారి కవిత్వం (17.08.2015) గురించి , ” ఎవరో ” ( ఆ ఎవరో పేరు జవహర్ లాల్ దేవభక్తిని: పాపం అవిడకు వ్యాసం రాసే సమయానికి గుర్తుండక పోవచ్చు ), ఫేస్ బుక్లో సంధించిన ప్రశ్నల గురించి సమాదానం కాని సమాదానం ఇచ్చి దానికి గొప్ప హెడ్డింగ్ పెట్టారు ‘ వాటే ఫాల్! వాటే ఫిటీ !’ అంటూ ……

    1)ముందు వసంత గారి గీతం గురించి చూద్దాం …

    వసంత గారేదో రంగనా యకమ్మ (ఆర్ ఎన్ ) గారి పుస్తకాల పేర్లను అటు ఇటు చేసి వెటకారం అల్లడం తప్ప వేరే యేమి కనపడ లేదంటూ తేల్చారు రమా సుందరి గారు. ఆర్,ఎన్. పుస్తకాల పేర్లతోనే ఆర్.ఎన్. స్వభావాన్ని , పేజీలకు పేజీలు రాయనవసరం లేకుండా, ఏ మాత్రం ఆర్,ఎన్. గారిని ఫాలో అవుతూ వస్తున్న వారికి స్పష్టంగా అర్ధమవుతుంది.

    ఆర్.ఎన్. నిజంగానే తన చుట్టూ తను గిరి గీసుకొని , తాను నమ్మిన సిద్ధాంతానికి తనదే సరైన భాష్యం అంటూ , మార్క్స్ తరువాత మార్క్స్ నని భావిస్తూ కూలిన గోడల మధ్య బయటి ప్రపంచపు మార్పులు చేర్పులు అర్ధం చేసుకో కుండా అంధకారం లో రచయిత్రిగా మిగిలి పోతున్నారు ఆర్.ఎన్.

    వసంత గారి గేయం లో వున్న ” చాల ఉదారంగా నీరుపోసి పెంచిన ‘ విష వృక్షం ‘ నుంచి రాలిన విషంతో ” అన్న వాక్యంలో చాలా చరిత్ర ఇమిడి వుంది. అదేమిటో రమా సుందరి గారూ ‘ఎవరో ‘ సంధించిన ప్రశ్నలలొ సమాధానం దొరుకుతొంది.

    మరో చోట వసంత గారు ” మార్క్స్ ని పెట్టుబడిగా మార్చి పుక్కిటబట్టి ఎక్కడంతే అక్కడ వుముస్తూ ” . ” వుముస్తూ ” అంటూ వసంత గారు అంధకారం లో వున్న రచయిత్రి మానసిక స్థితి ఏ స్థాయి లో వుందో తెలియచేశారు.

    చివరగా వసంత గారు సమాధానాన్ని కవిత రూపంలో చెప్పారు గానీ సూటిగా ఆర్.ఎన్. లాగా, వసంత గారు కూడా లాగి లాగి సమాధానం చెప్పలి గానీ అని అభిప్రయా పడే వళ్లకు ఒకటే సమాధానం. వసంత గారిది ‘ ధర్మాగ్రహం .’ ఎంతో కాలం గా , ఓపికతో నిరీక్షిస్తూ ఒక వ్యక్తిలో మార్పు వస్తుందనుకొని, ఇకరాదు అనితెలిసిన తర్వాత వచ్చేది ‘ ధర్మాగ్రహాన్ని మించిన ఆగ్రహం వస్తుంది. వసంత గారు ప్రదర్సించింది ‘ ధర్మాగ్రహం ‘ మాత్రమే.

    2) ఇక ‘ఎవరో ‘ సందిందించిన కొన్ని ప్రశ్నలు గురించి వ్రాస్తూ రమా సుందరి గారు ” ఇవేమి రాజకీయాలో బుర్రలు బద్దలుకొట్టుకున్నా అర్ధం కాదు. వాళ్లు సాయం చేసిన విషయాన్ని రంగంగనాయకమ్మ గారు ఇవాళ కూడా ప్రేమగానే గుర్తు చేసు కోవచ్చు. కానీ వ్యక్తిగత స్నేహాలకు ప్రేమలకు రాజకీయ అభిప్రాయాలకు తేడా చూడలే నంత దూరం ప్రయానిచామా మనం ! వ్యక్తిగతంగా సాయం చేసిన వారిని రాజకీయంగా విమర్శించ కూడదా!”

    ఇందులో రాజకీయం యేమి చూసారో. నేను (ఎవరో) వ్రాసిన దాంట్లో రాజకీయం లేదు, అందుకనే బుర్రలు బద్దలు కొట్టుకున్నా లేని రాజకేయం అర్ధం కాదు.
    మీరన్నట్టు రంగంగనాయకమ్మ గారు ఇవాళ కూడా ప్రేమగానే గుర్తు చేసు కోవచ్చు .

    అంతెందుకు ఆవిడే యెంత చక్కగా ఈ మధ్య వచ్చిన పుస్తకం లో ” మొక్కనుంచీ మోడుదాకా, చీమ నుంచి మనిషిదాకా, అన్ని అందరూ , ప్రకృతి సూత్రాలకు బద్ధులే. వెళ్లిపోయిన ఆప్తుల్ని, ఇంకా వున్న మనం తలచుకుంటాం. రేపువెళ్లిపొయిన మనల్ని, ఇంకా వున్న మన ఆప్తులు తలచుకుంటారు.”

    కానీ దానికిలేని తొందర, వరవర రావు గారు రాసిన దాంట్లో తప్పులు వెదకటానికి సమయయం దొరికింది. రమా సుందరి గాంటారు ” కానీ వ్యక్తిగత స్నేహాలకు ప్రేమలకు రాజకీయ అభిప్రాయాలకు తేడా చూడలే నంత దూరం ప్రయాణిచామా మనం” అబ్బే లేదండి ” మనిషికి వుండాల్సిన మనిషితనం మర్చిపోయేంత దూరం ప్రయాణించాము.

    ” వ్యక్తిగతంగా సాయం చేసిన వారిని రాజకీయంగా విమర్శించ కూడదా” ఎందుకు కూడదు , అందుకే వసంత గారన్నది ” మార్క్స్ ని పెట్టుబడిగా మార్చి పుక్కిటబట్టి ఎక్కడంతే అక్కడ వుముస్తూ. ”

    మరి నేను (ఎవరో) వెలిబుచ్చిన సందేహాలను వదిలేశారెందుకని. అవి సమాధానర్హమైనవి కావా? లేక “ఎవరో” దారే పోయే దానయ్య కు మీ బోటి మేథావులు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నారా?

    ‘ వాటే ఫాల్! వాటే ఫిటీ !” మీరు పెట్టిన టైటిల్ బాగుంది . కానీ అది ఎవరికి వర్తిస్తుందా అని ………….

    నిజంగానే రంగనాయకమ్మ గారు ” వాటే ఫాల్! వాటే ఫిటీ !”

  75. సూరానేని హరిబాబు says:

    జవహర్ గారూ,యెంత పిచ్చివాళ్ళు మీరు!మురంనా మరియూ మురంనా అభిమానులూ ఇతర్లని విమ్ర్శించడమఎ తప్ప తమ మీద వచ్చే విమర్శలకి జవాబులు చెప్పారు.అసలు ఆ ఉద్దేసమే ఉదదు వారికి,ఒక సంచలనాత్మకమైన వ్యాసమొఎ ప్రసంగమొఎ కాహేసి జనాన్ని చికాకు పెట్టటం,ఇతర్లు ఇబ్బంది పడుతుంటే తమ వ్యూహాత్మకమైన ఎత్తుగడ పనిచేసిందని విప్లవాభినందనలు చేసుకుంటూ పరవసిన్చాదమే తప్ప చిల్లరమల్లర వ్యక్తుల ప్రశ్నలకి జవాబులు చెప్తూ తమ ఆనందానుభావానికి భంగం కలిగించుకోరు.

    వారు వైదిక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు!కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలతోనే తలపడతారు,మీ ప్రశ్నలకి వారినుంచి జవాబు లు రావు!

  76. సూరానేని హరిబాబు says:

    21-09-2015 ఆంధ్రజ్యొతిలో విరసం వారి వివరణ చూడండి!“విప్లవం పరువు పోగెట్టేశారు” అంటూ రంగనాయకమ్మ రాసిన వ్యాసంలో పినాకపాణి రాసిన “మార్క్సు ప్రతిపాదించిన అదనపు విలువని కూడా హైపోతిసిస్ కింద పరిగణిస్తాను” అన్న వ్యాఖ్యని ఉటంకించారు.ఈ వ్యాఖ్య చేసిన పినాకపాణి కొద్దికాలం విరసంలో ఉండి తర్వాత ఆ భావజాలానికి దూరమైన వ్యక్తి.చలసాని ముందుమాటల్లో చర్చ కోసం దీనిని వేస్తున్నామని స్పష్టంగా చెప్పారు.విరసం సభ్యుడు కాని వ్యక్తి అభిప్రాయాన్ని పట్టుకొని విరసం అభిప్రాయంగా మాట్లాడటంలో ఔచిత్యమేమిటో రంగనాయకమ్మ విజ్ఞతకే వదలివేస్తున్నాం.

    అంత నిర్దిష్తంగా ఆ వ్యాఖ్యని కొట్టుకొచ్చిన మురమ్నాకి చలసాని విజ్ఞప్తి మాతర్మ్ కనపదలేదు.తొందర,తొందర,అంతా తొందర,కొంచెం అర్ధం కకపోతే చాలు విమర్శించిపారెయ్యాల్సినసె!ముందూ వెనకా అమనకెందుకు – ఈ విరసం వ్యాసాల్ని అంత్ జాగ్రత్త్తగా యెవడు చదువుతాడులే అన్న అజాగ్రత్త.పోన్లే ఇప్పటికి ఖమాపణా పాడూ లాంటివి చెప్పకుండా తేలుకుట్టినదొంగల్లా వూర్కోవడమే ఉత్తమ!అబధ్ధాలు చెప్పినందుకు క్షమాపన కోసం గట్టిగా మురమ్నాని నిలదీస్తే పాపం విప్లవం పరువు పోతుంది కదా!

    అంతేనా మురమ్నా అభిమానులూ?

  77. D JAVAHAR LAL says:

    రంగనాయకమ్మ గారూ మీకిది తగునా? —“మనిషితనం” మరిచారు.

    1)25.07.2015న చలసాని ప్రసాద్ గారు చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని వరవర రావు గారు 03.08.2015న ఆంధ్రజ్యోతి లో , చలసాని గారితో తనకున్న పరిచయం, సాన్నిహిత్యం, “విరసం” ఏర్పాటులో చలసాని గారి పాత్ర మొదలయిన విషయాలు ” సాహిత్యం లో వర్గ పోరాట సందర్భాలు ” అనే వ్యాసం ద్వారా తెలియచేశారు.

    2)అందుకు ప్రతిగా రంగనాయకమ్మ గారు అదే ఆంధ్రజ్యోతి లో 10.08.2015న ” ‘విప్లవం’ పరువు పోగెట్టేశారు” అనే వ్యాసం ద్వారా పలు ప్రశ్నలు సంధించి తర్క విద్యలో తనను మించినవారు లేరని నిరూపించుకున్నారు.

    ఈ క్రమంలో ఒక సాదారణ వ్యక్తిగా నా ప్రతిస్పందనను తెలిచేయాలనుకుంటున్నాను:

    3) ఒక వ్యక్తి చనిపోయినపుడు , ఆ వ్యక్తికి సంబంధించి పరిచయమున్న వ్యక్తులు వారి పరిధిమేరకు వార్తా పత్రికలలో గానీ, టి.వి కార్యక్రమంలో గానీ , ఒక సభ రూపంలో గానీ , చివరకు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కలయక రూపంలో గానీ, చనిపోయిన వ్యక్తికి సంబందించి విషయాలను తెలియచేయడం / మాట్లాడకోవటం జరుగుతుంటుంది. ఆ క్రమం లోనే చలసాని చనిపోయినపుడు, ఆయా వ్యక్తులు వారికి అందుబాటులో వున్న మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేశారు.

    4) అలాగే వరవర రావు గారు తన వ్యాసం ద్వారా ఆంధ్రజ్యోతి లో తెలియజేశారు. అందుకురంగనాయకమ్మ గారు ప్రతిస్పందించి సంధించిన ప్రశ్నలకు సమాధానలు ఇవ్వడానికి ముందు కొంత చలసాని, రంగనాయకమ్మ గార్ల పరిచయం గురించి తెలుసుకోవాలి. అదికూడా ఆవిడ వ్రాసిన పుస్తకాల నుంచే తెలుసుకుందాం. రంగనాయకమ్మ గారి వ్యక్తిగత కారణాలవలన ఆవిడ విశాఖపట్నం లో వుండవలసి రావడం, కొన్ని కార్యక్రమాలను చక్కబెట్టుకోవల్సి వచ్చిన సందర్భంలో భద్రం (రంగనాయకమ్మ గారి పాఠకుడు) గారి బంధువుల ఇంటిలో వుండటం, వారి లాయరు గారి దగ్గరకు వెళుతూ రావిశాస్త్రి గారి ఆఫీసు వెళ్లదం, ఆయన ఆమె గురించి చలసానిప్రసాద్గారికి చెప్పటం జరిగాయి. ఆవిధంగా చలసాని, కృష్ణభాయి గారి కుటుంబాలతో పరిచయం కలిగింది. ఆసందర్భంలో వారిద్దరూ ” శాస్త్రి గారు మీ విషయం చెప్పారు. మీరు కోర్టు పనిమేద వచ్చారని చెప్పారు. అవసరమైతే కొన్నాళ్లు మా ఇంట్లో వుండండి ” అన్నారు.

    5)”కృష్ణభాయి గారింట్లో నేను దాదాపు 9 నెలలు వున్నాను. ఆకాలంలో నాఖర్చు కోసం వారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేక పోయాను”.

    6)”ఆ ఇంట్లో కృష్ణభాయి గారు, వేణుగోపాల రావు గారు భార్యా భర్తలు. వాళ్లపిల్లలు నళినీ, పద్మినీ. ఆఇంట్లోనే వున్న విజయా, చలసాని ప్రసాస్ లు భార్యభర్తలు. వాళ్లపిల్లలు నవతా, మమతా.”

    7)” ఆమనుషులెవరూ నాకు బంధువులు కారు, స్నేహితులు కారు, పాఠకులుకారు. అయినా, ఆ ఇల్లు నాకు రక్షణ నిలయం అయింది. ఆశ్రమం అయింది. కోర్టుపనుల కోసమే అక్కడ వుండవలసి వచ్చింది. ఆ కోర్టుపనులన్నీ చూసింది ప్రసాద్ గారే”

    8)”కృష్ణభాయి గారి ఇల్లూ, ఆఇంట్లో మనుషులు, నా జీవితంలో ఒకభాగం.చాల అకస్మాత్తుగా , అప్రయత్నంగా ప్రారంభమయిన భాగం అది.”

    9)”వేణుకన్నా ప్రసాద్ చాలా మెత్తని మనిషి.కోపం రాదు. ప్రసాద్ ఇంటికి రావదం, నాకూ,సుబ్బారావుకు బాగా నచ్చేది.ప్రసాద్ మెత్తనితనం, మెతకతనం కూడా అయిపోతూ వుంటుంది. సింద్ధాంత విషయాల్లో కోడా మెతకతనమే.అది అపుడు నాకుతెలేదు. ఆయన నాకు చేసిన సహాలు ఇన్నీ అన్నీ కావు.”

    10)”నాకు ఇప్పుడు ప్రసాద్ గారి మేద రాజకీయంగా చాలా విమర్శలు వుంటాయి గానీ, ఆయన చేసిన ఏ సహాయాన్ని ఎన్నడూ మరిచిపోలేదు.మరిచిపోను.”

    11) పైన చెప్పిన వన్నీ ఎందుకు తిరిగి రాయవలసి వచ్చిందంటే , రంగనాయకమ్మ గారికి చలసాని, కృష్ణాభాయి గార్లతో వున్న సంభందం ఎలాంటిదో తెలియ చేయడానికి.

    12)నన్ను ఆదుకొన్నవారిని నేను మరిచిపోను:-
    ” మొక్కనుంచీ మోడుదాకా, చీమ నుంచి మనిషిదాకా, అన్ని అందరూ , ప్రకృతి సూత్రాలకు బద్ధులే. వెళ్లిపోయిన ఆప్తుల్ని, ఇంకా వున్న మనం తలచుకుంటాం. రేపువెళ్లిపొయిన మనల్ని, ఇంకా వున్న మన ఆప్తులు తలచుకుంటారు.”

    13)ఎంత చక్కని మాటలు. అంతనుంచిఅభిప్రాయాలు వారి మీద కలిగివున్న రంగనాయకమ్మ గారు, విమర్శకు ఇచ్చినంత ప్రాముఖ్యత , పరిచయానికి, చేసిన సహాయానికి, ఆవిడే పైన చెప్పినవిధంగా –వెళ్లిపోయిన ఆప్తుల్ని వున్నవారు తలచుకొవడం రంగనాయకమ్మ గారు చేయలెక పోయారు. అదలా వుంచితే…….

    14)చనిపోయిన వ్యక్తి గత సృతులనుంచి వచ్చే హృదయస్పందనలతో వచే కన్నీటి చెమ్మ తడియారకముందే , ఆవిడ తన తర్క విద్యా కౌశలం చూపించుకొవడం రంగనాయకమ్మ గారికే చెల్లింది.లేక , ఎలాగు వారికి తెలియచెయాల్సిన కృతఙ్ఞతలు , తన పుస్తకాలలో తెలియజేశాను, ఇంకా వారి గురించి పేపరు, కలంలో సిరా వినియోగించడం ఎందుకనుకొన్నారేమొ.

    15)నిజంగా రంగనాయకమ్మ గారు వ్రాసిన వ్యాసం ఒకనాడు ఆమెకు ఎంతో ఆత్మీడయిన వ్యక్తిని తన తర్కబద్ధమైన కౌశలంతో సమయం గాని సమయంలో అపహాస్యం చేయాలని చూసినట్లు కనపడుతుంది.

    16)చనిపోయిన వ్యక్తిని గురించి, మరొక వ్యక్తి వ్రాసిన వ్యాసలో తప్పులు వెతకడంలో వారం రోజుల వ్యవధి కూడా లెకుండా కృషిచేసిన రంగనాయకమ్మ గారు, ఆ వ్యక్తికి సంబంధించిన ఙ్ఞాపకాలను నలుగురుతో పంచుకోవలనిపించలేదా? లేక మొదట చేసిన సహాయం కంటే మించిన ద్రోహం ఏమయినా చలసాని గారు చేసినందువల్ల తలవదలచుకోలెదా?

    17)సరే ఇవన్నీ పక్కన వుంచి ఆవిడ సంధించిన ప్రశ్నలకు సమాదానాలు వెదుకుదాం. వారు సంధించిన మేధొపరమయిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే నా లాంటి సామాన్యులకు కొంచం సమయం ఎక్కువే పడుతుంది. ఈ లోపు రంగనాయకమ్మ గారు కొన్ని అనుమానాలు నివృత్తి చేయగలరనుకుంటున్నాను.

    18) రంగనాయకమ్మగారికి మార్కిజిం మీద, విప్లవం మీద ఎక్కువ అవగాహన , కమిట్మెంటు వున్నవారుగా, వారికి వారుగా భావించుకుంటూ, ప్రకటించుకుంటారు.మరి అలాంటి రంగనాయకమ్మ గారు……

    a)పక్క వ్యాపార సంస్కృతిలో భాగమైన పత్రికల ద్వారా ఆవిడ భావాలను / అభిప్రాయాలను ఎలా తెలియచేస్తున్నారు?
    b)పక్క వ్యాపార సంస్కృతిలో భాగమైన పుస్తకాల షాపుల ద్వారా ఆమె రచించిన పుస్తకాలను ఎలా అమ్మకాలకు పెడుతున్నారు?
    c)పక్క వ్యాపార సంస్కృతిలో భాగమైన టి వి కార్యక్రమంలో , ఈ మధ్య వారి ఇంటివద్దనుంచే “ఇదండీ మహాభారతం” అనే పుస్తకం మేద వ్యాఖ్యానం ఎలా చేసారు? టి వి విలేఖరి ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పారు?
    d) రంగనాయకమ్మ గారి అభిప్రాయాలు, నమ్మకాలు చాలా ఖచ్చితమైనవయితే , ఆవిడరాసిన రచనలలో తరువాత కాలంలో కొన్నిటిని తొలగించడం, కొన్నిటిని చేర్చడం , పాత వివరణలను మార్పు చేయడం ఎందుకు జరుగుతుంది?

    19)ఈ అనుమానాలను నివృత్తి చేయగలిగితే వాటిలో నుంచి 10.08.2015న అంధ్రజ్యోతిలో ఆవిడ సందించిన ప్రశ్నలకు సమాదానాలు సునాయాసంగా దొరుకుతాయి.

    20)జీవితంలో ఆవిడనమ్మే , ఆమె సొంతమైన, స్వచ్చమైన “విప్లవం” వచ్చినా అందులొ ఆత్మీయస్పర్శలేక పోతె అది మనజాలదు. అదిపుస్తకాలకు, చర్చోపచర్చలకు పయోగపడుతుంది.
    21)రంగనాయకమ్మ గారు, “విప్లవం” పరువు పోయిందో లేదో తెలియదు గానీ, 10.08.2015న ఆంధ్రజ్యోతి లొ మీరు రాసిన వ్యాసం ద్వారా మనిషికి వుండాల్సిన “మనిషి తనం” పోగెట్టేసారు.

    22)”నన్ను ఆదుకున్న వారిని నేను మరిచిపోను” అనే మాటల్ని పుస్తకాలలోని కాగితాలకే పరిమితం చేశారు. రంగనాయకమ్మ గారు యేదయినా మీకే చెల్లింది. జీవితమంటే 2+2=4 అన్నంత పూర్తి తర్క మైతే, జీవితంలో సాహిత్యానికి చోటే లేదు. మీరు అత్యంత ఇష్టంగా అభిమానించిన “చలం” రచనల అవసరం కూడా వుండదు.

    23) 2+2=4 నిజమే కానీ, ఆ 4 ని అనెక రకాలుగా పొందవచ్చు. 1+1+1+1=4; 1+1+2=4; 1+3=4; 2+2=4; 1+1+3-1=4; చూసార ఇలా ఇన్నోరకాలుగా 4 వస్తుంది. జీవితాన్ని అర్ధం చేసుకోవదం లో కూడా అనేక పార్శాలు వుంటాయి.

    24)జీవితానికి తర్కం అవసరమే గానే తర్కమే జేవితం కాకూడదు. ఒక అమెరికన్ రచయత తర్కం ఎల చెప్పాడొ , దాని పర్యవసానం యెలా వుంటుందొ “కాదంబరి” నవలలో మొదటి పేరాగా కోట్ చేసారు రావూరి భరద్వాజ గారు.

    25)”మనం కార్యకారణ సంబంధాలంటూ అలసిపోయే దాకా వాదిస్తు వుంటాం. ప్రతిదానికీ ఎక్కడో అక్కడ ఓ కారణం వుంటుందని, ముందుగా ఓ నమ్మికను ఏర్పాటు చేసుకొని, ఆ నమ్మకాన్ని నిజం చేయడం కోసం, నానాగొడవలు పడడంలోనే, ఆధునిక జీవితం తాలుకు చిక్కులన్నీ వున్నాయని హెన్రీమూర్ అంటారు. కావదానికి అతనూ హేతూవాదే. కానీ ఆ హేతువుకు హేతువేమిటని అన్వేషించడంతో అంతా అయొమయంగా గజిబిజిగా తయారయిందంటారు మూర్. హేతువాదం ప్రక్కకు తప్పుకుని , కర్మ సిద్ధంతానికి తావిచ్చే సందర్భం కూడా ఇదేనని మూర్ అంటారు.” ——రావూరి భరద్వాజ

    26) ఈ విషయంలో చివరకు రంగనాయకమ్మ గారు , రావిశస్త్రి గారి విషయం లో ఎలా రెగ్రెట్స్ ఫీల్ అయ్యారో , భవష్యత్తులో అలా విచారించవలసి వస్తుంది. (పు : మానవసమాజం ; 78 వ వరస సంఖ్య . “గోరంత మాట సాయం కొండంత మేలు చేస్తుంది” )

    27)నా ప్రతిస్పందనను రెండు భాగాలుగా చూద్దాం. ఒకటి ఇది తగిన సందర్భం అవునా కాదా అన్నది. రెండు ఆవిడ ప్రశ్నలకు సమాధానం.

    28) ఒక వ్యక్తి చనిపోయిన సందర్భం కూడా విమర్శకు అడ్డుకాదు అనుకుంటే నా దగ్గర సమాధానం లేదు .ఎందుకంటే వారికి విమర్శే జీవితం. ఆవిమర్శ ఎలాంటిది అంటే రాత్రిపూటే ఎందుకు నిద్రించాలీ , పగలు పడుకుని రాత్రిపనులెందుకు చేసుకోకూడదు అన్న వాదం లాంటిది.

    29)ఇక ఆవిడ పశ్నలకు సమాధానం చెప్పాలి. నేను పైన వెలిబుచ్చిన అనుమానాలకు ఏమయితే సమాధానాలు వస్తాయో , వీటికి అవే వర్తిస్తాయి.

    30)ఒక సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి గానీ , సమూహం గానీ తమ భావాలు వెలిబుచ్చాలంటే , తాము నమ్మిన సిద్ధాంత పరమైన సమాజం అప్పటికపుడు ఏర్పడదు కాబట్టి , తాము ఇస్టపడని సమాజంలో వున్న సాధనాల ద్వారా ఆ భావాలను ప్రచారం లోకి తీసుకొస్తారు. ఆవిధంగానే , రంగనాయకమ్మ గారు కూడా తమ భావాలను కానీ, పుస్తకాలను కానీ ప్రస్తుత సమాజంలోకి పంపుతున్నారు. అలాగే మార్పులు, చేర్పులు కూడా , ఇంతకుముందు వున్న అనుభవం కన్నా మరింత వున్నతమైన, ఆచరణాత్మక మైన అలోచనలు కలిగి మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఈ విధంగానే రంగనాయకమ్మ గారిని అర్ధం చేసుకుంటాను.ఏవయితే నేను వెలిబుచ్చిన అనుమానాలకి సంబంధించి అర్ధం చేసుకునే అవగాహన నాకుంది.

    31)అలాగే చలసాని గారు గానీ మరొకరు గానీ, ఆ రోజుల్లో వున్న పరిస్తితులని బట్టీ శ్రీ శ్రీ “మహాప్రస్థానం” ,ఇతర రచనల ప్రభావం ఇతర కవులమీద , సమాజం మీద ఎక్కువ వుండటం చేత శ్రీ శ్రీ ని భాగం చేయాలనుకుని , ఆవిధంగా ఒకసంఘం ఏర్పడి దానిద్వారా వాళ్లునమ్మిన భావాలను సమాజం లోకి తేసుకుని వెళ్ళాలనే ప్రయత్నం చేసినట్లుగా అర్ధం చేసుకోవాలి.వ్యక్తి పూజ కాదు వీర పూజ అన్నదాన్ని కూడా అలాగే అర్ధం చేసుకోవాలి. పిణాక పాణి గారు చెప్పిన మాటలపై తరువాత తెలియచేస్తాను .

    32)కాదూ నేను వెలిబుచ్చిన అనుమానాలకు సంబందించి నేను వెలిబుచ్చిన అవగాహనను ఒప్పుకుంటాం కానీ, ‘విరసం” ఏర్పడటం లో నా అవగాయన తప్పు అనుకుంటే చివరకు నేను అభిప్రాయపడేది ఏమిటంటే….. ఇద్దరిది తప్పే. ఎందుకంటే ‘గమ్యం’ ఎంత గొప్పదయినా దాన్ని చేరె “మార్గం” కూడా అంతే గొప్పగా వుండాలి. ఆ అవకాశం అన్ని సందర్భాలలో కుదరదు కాబట్టే , రంగనాయకమ్మ గారు అలా…. “విరసం” వాళ్లు ఇలా మార్గాలు ఎన్నుకున్నారు.

    33) I have taken points 4 to 9 from her books titled: Maanava Samaajam; Teegalaagaaru Donkantaa kadilidi and Aatma Kadhaamsaala Uttaraalu.

  78. సూరానేని హరిబబు says:

    Science also has religious spirit, When you go on searching for a reason,some where you may find your reason fails and settles into belief!Religion also has scientific spirit, When you go on trying to believe,some where you may find your belief ask question and seeks for reason?

  79. Praveen Kumar says:

    విరసం ఏ రకంగా విప్లవ సంస్థ అవుతుంది? ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే సంస్థలో సభ్యత్వం కలిగి ఉండకూడదని వాళ్ళు ఉద్యోగంలో చేరేటప్పుడే చెపుతారు. అయినా వరవరరావు గారు ప్రభుత్వ ఉద్యోగం చేసి పెన్షన్ కూడా తీసుకుని హాయిగా బతుకుతున్నారు. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకి జీతం చాలా ఎక్కువ. జనం తమ పిల్లలని ఇంగ్లిష్ మాధ్య స్కూల్‌లకి పంపించేది ప్రభుత్వ ఉద్యోగం కోసమే. తమ పిల్లలకి ఇంగ్లిష్ మాధ్యమం మాంపించి ఏ సంస్కృతమో, హిందీయో నేర్పించే ధైర్యం ఏ మధ్యతరగతి తల్లితండ్రులకీ ఉండదు. మనం దేశంలో నలభై కోట్లకి పైగా జనం మాట్లాడే హిందీని కాదని మూడు లక్షల మంది Anglo-Indians మాత్రమే మాట్లాడే ఇంగ్లిష్ భాషపై మోహం పెంచుకున్నది ప్రభుత్వ ఉద్యోగాల కోసమే. ప్రభుత్వ ఉద్యోగాలు మనకి అంత మేడిపండు లాంటివి. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చేది జనం నుంచి వసూలు చేసిన పన్నులతో. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పెరిగితే జనం మీద పన్నులు పెరుగుతాయి. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వ ఉద్యోగులు మాటిమాటికీ వేతన సవరణ కోరుతారు. ఆ రకం ఉద్యోగాలు చేస్తూ, ప్రభుత్వం చేస్తున్న దోపిడీలో భాగం పంచుకుంటూ, మరో పక్క ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన మావోవాదులకి వీళ్ళు మద్దతు ఇస్తున్నారంటే మనం ఎలా నమ్మాలి? వీళ్ళు జనానికి మార్క్సిజం గురించి తెలియకుండా చెయ్యడానికే మార్క్సిజంతో ఏమాత్రం సంబంధం లేని దెయ్యాల తత్వశాస్త్రాన్ని తవ్వి తీసారు తప్ప అదేదో పొరపాటున జరిగినది కాదు.

  80. chandolu chandrasekhar says:

    ప్రవీణ్ గారు మీకు పూర్తి గా ప్రజా సంస్తల గురించి అవగావన లేందనే స్పష్టం .విరసం ప్రజా సంఘం అవి తాత్విక భావజాలం కలిగి వుంటై .సుప్రీం కోర్ట్ , కూడా ఉద్యోగులు రాజకీయ అభిప్రాయం గలిగి వుండటం తప్పుకాదు అని చెప్పాయి .అనేక పోరాటాల ద్వారా రాజ్యాంగములో హాక్కు ల పరిధి లో విరసం పనిచేస్తుంది . నిజమే ప్రజల సొమ్ము ద్వారా బ్రతికిన మనం ప్రభుత్వ దమన కాండలో భాగం కాకుండా ప్రజల వైపు నిలబడటం ధర్మం . వవరరావు చేసింది ,అదే ముపై ఏళ్ళక్రితం ఆంధ్ర జ్యోతి వీక్లీ ఎడిటర్ , పురాణం సుబ్రహ్మణ్యం ఉండేవాడు . పురాణం సీతా పేరుతొ రచనలు చేసేవాడు , ఆతను రంగ నాయకమ్మ లాగ వాలుకుర్చి రచనలు చేసేవాడు మనం ప్రజా ఉద్యమాలతో మమేక కాలేక పోఇన .విరసం లాంటి సంస్తకి సంఘీభావం తెలపండి

  81. Praveen Kumar says:

    “జానకి విముక్తి” సీరియల్ పత్రికలో వస్తున్నప్పుడు ఆ సీరియల్‌ని మధ్యలో నిలిపివేసినది పురాణం సుబ్రహ్మణ్యం గారే. ఆయన కేవలం ఒక సంపాదకుడు. ఆయన పత్రిక యజమానులు ఏమి చెపితే అది చేస్తాడు. దానికి ఎవరు ఏమి చెయ్యగలరు?

    నేను చేసేది వ్యవసాయం. ప్రభుత్వ ఉద్యోగితో పోలిస్తే నేను సంపాదించేది తక్కువే కానీ కూలీలతో పోలిస్తే నేను సంపాదించేది చాలా ఎక్కువ. మా ప్రాంతంలో కూలీ ధర కేవలం 50 రూపాయలు. నా దగ్గర rice transplanter (ఉడుపుల యంత్రం), harvester (కోత యంత్రం) లాంటివి లేవు కాబట్టి నేను కూలీల చేత శ్రమ చెయ్యించి బతుకుతున్నాను. ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందితే సొంత ఆస్తిని రద్దు చెయ్యడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగి పని చేసేదే సొంత ఆస్తిని పరిరక్షించే పాలకవర్గం దగ్గర జీతం తీసుకుంటూ. ప్రభుత్వ ఉద్యోగికి విప్లవంపై ఎంత మేరకు ఆకర్షణ ఉంటుంది?

  82. chandolu chandrasekhar says:

    ప్రవీణ్ గారు పురాణం . జానకి విముక్తి నవల మద్య లో ఆపిన విషయం కాదు ఇక్కడ. పురాణం కుడా విరసం మిద వెకిలి రాతలు రాసేవాడు . విరసం త్యాగాల చరిత్ర చేర నుండి వి ,వి దాక తెలుగు సాహిత్యానికి చేసిన సేవ .మానవ సమాజం పరిణామ క్రమం లో మట్టి మనుషులు మమల్ని మేధావులు గా తయారు చేసేయని ,ఈ మట్టి మాకు పట్టెడన్నం పెట్టి పాలుతాపింది .దాని ఋణం తీర్చు కోవటం కొరకు విరసం చేసే త్యాగం శ్లాఘనీయం. రైతుగా మీరు ఆలోచన చేయండి దాని చరిత్ర త్యాగ మాయం కాదా ! దాని పాదధూళి తాకే అర్హత రంగనాయకమ్మ గారికి ఉందా ?

    • Praveen Kumar says:

      ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ విప్లవం కబుర్లు చెప్పే విరసాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. నేను ఉద్యోగం దొరక్క, మా చిన్నాన్న మీద కోర్ట్‌లో కేస్ వేసి, మా తాతగారి భూమి మూడెకరాలు గెలిచి, వ్యవసాయంలో స్థిరపడ్డాను కానీ నేను కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండే వీధిలో పెరిగినవాణ్ణే. సోషలిస్త్ విప్లవం అనేది ఆస్తి ఉన్నవానికీ, లేనివానికీ మధ్య ఉన్న వైరుధ్యం వల్ల వస్తుంది కానీ ఉద్దేశ్యపూర్వకంగా తమ యజమానికి లొంగి ఉండేవాళ్ళ వల్ల కాదు. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏమాత్రం ఆస్తులు సంపాదించకుండా, తమ పిల్లల్ని ఖరీదైన స్కూల్‌లలో చదివించడానికే జీతం డబ్బులు ఖర్చు పెడుతూ, చదువునే పెట్టుబడిగా పెట్టి, దానితో తమ పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగాలకే పంపించాలనుకునే బాపతు. ఇలా బతికేవాళ్ళు దేశంలో విప్లవం ఎలా తెస్తారు?

  83. @ప్రవీణ్
    నేను ఉద్యోగం దొరక్క, మా చిన్నాన్న మీద కోర్ట్‌లో కేస్ వేసి, మా తాతగారి భూమి మూడెకరాలు గెలిచి, వ్యవసాయంలో స్థిరపడ్డాను
    @హరిబాబు
    నీకు భూమిని దఖలు పర్చందీ ఇదే ప్రభుత్వ యంత్రాంగం కదా!దానిమీద ఆధారపడిన నువ్వు వరవరరావుని ఎందుకు తప్పు పడుతున్నావు?

  84. @ప్రవీణ్
    మా ప్రాంతంలో కూలీ ధర కేవలం 50 రూపాయలు. నా దగ్గర rice transplanter (ఉడుపుల యంత్రం), harvester (కోత యంత్రం) లాంటివి లేవు కాబట్టి నేను కూలీల చేత శ్రమ చెయ్యించి బతుకుతున్నాను. ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందితే సొంత ఆస్తిని రద్దు చెయ్యడానికి నాకేమీ అభ్యంతరం లేదు.
    @హరిబాబు
    వరవర రావూ వర రావూ నువ్వు ప్రభుత్వోద్యోగం ఎందుకు చహెస్తున్నావూ అంటే అతను ఊడా లాంటి సమర్ధనే చెప్పుకోవచ్చు కదా:-)అతని స్మర్ధన తప్పయితే నీ సమర్ధన కూడా తప్పవ్వాలి కదా:-(
    మీ ఇద్దరి సమర్ద్నలూ ఒక్కలాగే ఉండాలని రూలేమయినా ఉందా?నీ సమర్ధన నీకుంటే అతని సమర్ధన అతని కుంటుంది!నువ్వు నీకిచ్చుకున్న సమర్ధన మాత్రమే న్యాయమనీ,వి.వి ఇచ్చుకునన్ సమర్ధన మాత్రం తప్పనీ నువ్వు అనగలవా -బస్తీ మే సవాల్?!

    • Praveen Kumar says:

      వరవరరావుకీ, నాకూ పోలిక ఏమిటి? నేను ధాన్యం పండించినా, ఆముదం పండించినా, కొనేవాళ్ళు అది తమకి అవసరం అయితేనే కొంటారు. వ్యవసాయదారుడు గానీ పారిశ్రామికవేత్త గానీ తమ ఉత్పత్తులని కొనమని జనాన్ని బలవంతం చెయ్యలేరు. నేను ఎంత మంది చేత శ్రమ చెయ్యించి బతికినా సరే అది అలాగే జరుగుతుంది. కానీ రాజ్యం మాత్రం పన్నులు కట్టమని జనాన్ని బలవంతం చెయ్యగలదు. పోలీసులు మామూళ్ళు వసూళ్ళు చేస్తున్నా, న్యాయమూర్తులు లంచాలు తీసుకుంటున్నా, సొంత ఆస్తికి రక్షణ ఎంత కరువైనా సరే, పన్నులు కట్టకుండా తప్పించుకోవడం ఎవడితరం అవుతుంది? రాజ్యం అంత బలమైనది. సమాజం మొత్తాన్నీ దోచుకునే రాజ్యం కింద గుమాస్తాగిరీ చేసేవానికి, ఓ పది మంది కూలీల చేత శ్రమ చెయ్యిస్తూ బతికే ఓ సొంత ఆస్తిదారునితో పోలికా?

  85. @ప్రవీణ్
    ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందితే
    @హరిబాబు
    ఎవరీ ఉత్పత్తి శక్తులు?వాళ్ళు ఎక్కడున్నారు?వ్యవసాయదారుడిగా నువ్వు వాళ్ళలో ఒకడివి కావా!పదెకరాల రైతు ఆదాయం పెరిగితే యాభై ఎకరాల రైతు అవడం ద్వారా ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందుతూనే ఉన్నారుగా!ఎంతవరకు అభివృద్ధి చెందితే స్వంత అస్తి వదులుకునే స్వభావం మనిషికి వస్తుంది?వర్గరహితసమాజం అనే కాన్సెప్టు శాస్త్రీయమైనదేనా?

    • Praveen Kumar says:

      మానవ స్వభావం సమాజానికి అతీతంగా ఉంటుందా? నాకు power tiller అద్దెకి ఇచ్చినవాడు కూడా దాన్ని సొంతంగా నడపకుండా driver చేత నడిపిస్తూ దుక్కి చెయ్యించాడు. ఇతరుల శ్రమ మీద బతికేవాళ్ళు ఎంత మంది ఉన్నారో నాకు తెలియదా?

  86. Mr.Praveen,
    ఇక్కడ నిన్ను నువ్వు సమర్ధించుకోవడానికి చెప్పిన వాటినే వరవరరావు ప్రభుత్వోద్యోగం చెయ్యడానికీ సుబ్బరంగా వాడుకోవచ్చు,ముందు నువ్వు నీ అభిప్రాయాలలో ఉన్న గందరగోళాన్ని పోగొట్టుకుంటే బాగుంటుంది.
    ఇక్కద నిన్ను నువ్వు సమర్ధించుకోవడానికి చెప్పుకుంటున్న అన్ని కారణాలూ వరవరరావు ప్రభుత్వోద్యోగం చెయ్యడానికి కూడా సమర్ధనలుగా పనికివస్తాయి కాబట్టి నువ్వు ఇంకా వెర్రివాడివి కాకుండా ఉండాలంతే మౌనంగా ఉండిపోవడం బెస్త్:-)

    • Praveen Kumar says:

      ఒక పౌరునికి శతృవులు ఉంటే పాలకవర్గం అతనికి తుపాకీ లైసెన్స్ ఇస్తుంది కానీ గన్‌మేన్ సౌకర్యం ఇవ్వదు. పాలకవర్గంలోని సభ్యులకి మాత్రమే గన్‌మేన్ సౌకర్యం ఇస్తారు. గద్దర్‌కి తుపాకీ లైసెన్స్ కాకుండా గన్‌మేన్ సౌకర్యం ఇచ్చారంటే దాని అర్థం ఈ మేధావులతో పాలకవర్గానికి ఎలాంటి వైరుధ్యం లేదనే కదా! గద్దర్ ఒకప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్‌లో సభ్యుడు. అతన్ని పార్టీ నుంచి బహిష్కరించారు కానీ తరువాత తిరిగి చేర్చుకున్నారు. ఆ తరువాత అతనే పీపుల్స్ వార్ గ్రూప్‌ని వదిలేసి ఏదో సాంస్కృతిక సంస్థ పెట్టుకున్నాడు. పాలకవర్గాన్ని ఏమాత్రం భయపెట్టలేని మేధావి గద్దర్ అయితేనేమి, వరవరరావు అయితేనేమి?

  87. వైజ్ఞానిక శాస్త్రంలో ”పరమసత్యం”గాని ”చరమ సత్యం”గానీ లేనే లేదు. కుటుంబరావుగారి జిజ్ఞాసకు ప్రాతిపదిక ఇదే. ఇందుకు కొందరు శాస్త్రవేత్తల వ్యక్తిగత అనుభవాలూ, కొందరు రచయితల సూత్రీకరణలూ ఆయన ఆలోచనలపై చాలా ప్రభావం చూపాయి. మరీ ముఖ్యంగా సర్‌ ఆలీవర్‌ లాడ్జ్‌ అనే పదార్ధ భౌతిక శాస్త్రజ్ఞుని అనుభవాలు కొ.కు ఆలోచనలను కవ్వంతో చిలినట్టు చిలికాయి. జీవిమంతా వైజ్ఞానిక పరిశోధనలకే వెచ్చించిన సర్‌ ఆలివర్‌ లాడ్జ్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో తన కుమారుడు రేమాండ్స్‌ను కోల్పోయాడు.. మరణించిన వారితో సంభాషించగల ‘మీడియం’తో ‘సిట్టింగు’ ఏర్పాటు చేశాడు. తన కుమారునికీ, తనకూ మాత్రమే తెలిసిన విషయాలు ‘మీడియం’ద్వారా వినడం అలివర్‌ లాడ్జ్‌కి చాలా విస్మయం కలిగించింది. ఆయన జీవితంలో చాలా ‘షాక్‌’ ఇచ్చిన సంఘటన ఏమంటే ఒక మీడియం ద్వారా తన కుమారుడి ‘ఆత్మ’తో సంభాషిస్తున్న ఆలివర్‌ లాడ్జ్‌కి సౌత్‌ లాంకాషైర్‌ రెజిమెంట్‌ గ్రూప్‌ ఫోటో గురించి తెలిసింది. ఆ ఫోటో కావాలంటే పంపిస్తానని చెవ్స్‌ అనే ఒకావిడ ఆలివర్‌కి కబురు పెట్టింది. ఈ లోగా ఆలివర్‌ డిసెంబర్‌ 3, 1915న లియోనార్డ్‌ అనే మీడియంద్వారా రేమాండ్స్‌తో సంభాషిస్తూ ఫలానా రెజిమెంట్‌తో ఫోటో దిగావా అని అడిగాడు. ఆ ఫోటోలో తాను కింద కూర్చున్న సంగతి, ప్రక్కనున్న ఆఫీసర్‌ తన భుజం మీద చెయ్యి వేసిన సంగతి రేమాండ్స్‌ వివరించాడు. ఇది జరిగిన నాలుగు రోజులకు చెవ్స్‌ నుంచి వచ్చిన ఫోటోలో అంతా రేమాండ్స్‌ వివరించినట్టే ఉంది!
    అప్పట్నించి ”మరణానంతర జీవితం” పై సర్‌ ఆలివర్‌కు గట్టి నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత అనేక ప్రయోగాలు నిర్వహించి, శాస్త్రజ్ఞుడైన తనకు ”కొత్త నమ్మకాలు” కలిగించిన తన కుమారుని పేర ”రేమాండ్‌, ఆర్‌ లైఫ్‌ అండ్‌ డెత్‌” అనే పుస్తకాన్ని 1916లో రాశారు. ఆ తర్వాత ”రేమాండ్‌ రివైజ్డ్‌” అని 1922లో మరో గ్రంధం ప్రచురించారు. మరి ఆరేళ్ళకు ”వై ఐ బిలీవ్‌ ఇన్‌ పర్సనల్‌ ఇమ్మోర్టాలిటీ” అనే గ్రంధాన్ని ప్రచురించారు. అంతకు ముందంతా ”మ్యాన్‌ అండ్‌ ది యూనివర్స్‌” (1908), ”సర్వైవల్‌ ఆఫ్‌ మ్యాన్‌ (1909), ”రీజన్‌ అండ్‌ బిలీఫ్‌్‌” (1910), ”లైఫ్‌ అండ్‌ మ్యాటర్‌”(1912) వంటి వైజ్ఞానిక గ్రంధాలు రాసిన సైంటిస్ట్‌ సర్‌ ఆలివర్‌ లాడ్జ్‌ తర్వాత ”మరణానంతర జీవితం”గురించీ ”అసాధారణ అనుభవాల” గురించీ పరిశోధనలు చేయడం ఆ రోజుల్లోనే తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. ఈ పరిశోధనలను కూడా సైన్స్‌గానే ఆమోదించాలని ఆలివర్‌ లాడ్జ్‌ ప్రతిపాదించారు.
    ఆలివర్‌ లాడ్జ్‌ పరిశోధనలతో పాటు గణిత శాస్త్రజ్ఞుడూ, సైన్స్‌ ఫిక్షన్‌ రచయితా అయిన ఎడ్విరన్‌ ఆచాట్‌ రాసిన ”ప్లాట్‌లాండ్‌” కూడా కొ.కును ప్రభావితం చేసింది. స్పేస్‌ అనేదే లేని ఒక విచిత్ర ప్రపంచంలో ”స్థలం”, ”కాలం”అనే ప్రాధమిక కొలతలకు అర్ధం లేకపోవడం ఈ ”ప్లాట్‌లాండ్‌”లోని విశేషం. కిందటి శతాబ్దం తొలి రోజులలో వెలువడిన ఈ నవల ఐజాక్‌ అసిమావ్‌తో సహా పెక్కు మంది సౖౖెన్స్‌ ఫిక్షన్‌ రచయితలను, శాస్త్రతజ్ఞులను ప్రభావితం చేసింది. కొ.కు. కూడా ఆ ప్రభావంలో స్థల, కాలాలకు తోడు ”బుద్ధి”ని ఒక కొలతగా ప్రతిపాదించారు.
    http://www.bhumika.org/archives/1036

  88. chandolu chandrasekhar says:

    హరి గారు మీరన్నట్టు కొ.కు గారి జిజ్గాస కారణం .ఆయన చందమామ లో కుడా పని చేసారు అదికూడా వీళ్ళదృష్టిలో తప్పేమో ! మార్క్స్ అన్నట్టు మనిషి ప్రాచీన కధ లలో తన బాల్యాన్ని వెతుకు తాడు అని చెప్పాడు .అందుకే మనకు ఇప్పుడుకూడా చందమామ కధలు ఆహ్లాదాని ఇస్తాయి .

  89. Praveen Kumar says:

    దెయ్యాల శాస్త్రం స్థాయికి దిగిన తరువాత ఇక విరసాన్ని మూసుకుని ఇంటిలో తినితొంగోవడం మంచిదేమో! మనిషికి ప్రాణం కంటే ఏదీ గొప్పది కాదు. ఆ లెక్కన విరసంవాళ్ళూ, విరసం సభ్యులు కాని గద్దర్ లాంటివాళ్ళూ చేస్తున్న వర్గ సహకారాన్ని నేను అర్థం చేసుకోగలను. పాలకవర్గం వీళ్ళని ప్రాణాలతో వదిలివెయ్యడమే వీళ్ళకి ముఖ్యం. మనిషి ప్రాథమికంగా స్వార్థ జీవే కదా. రణరంగంలోకి దిగిన తరువాత వెనుకడుగు వెయ్యకుండా ముందుకి పోవడమే ఉత్తమమని నేను నమ్ముతాను. లెనిన్ కూడా ప్రాణ భయంతో వెనుకడుగు వేసి ఉంటే 1917 విప్లవం వచ్చేదే కాదు.

  90. @ప్రవీణ్
    లెనిన్ కూడా ప్రాణ భయంతో వెనుకడుగు వేసి ఉంటే 1917 విప్లవం వచ్చేదే కాదు.
    @హరిబాబు
    ఈ ఒక్క ముక్కా చాలు నీకు విప్లవసాహిత్యం మీద ఎంత పట్టు ఉందో,నీ మార్క్సిస్టు వైజ్ఞానిక శాస్త్రీయత ఎంతో తెలుసుకోవటానికి.నేను హిందువుని అని చెప్పుకునే నాలాంటివాడికి ఉన్న పరిజ్ఞానం కూడా నీకు నీ సిద్ధాంతం మీద లేదు – వాటె జోక్!

    • Praveen Kumar says:

      శ్రీకాకుళం జిల్లాలో చౌదరి తేజేశ్వరరావు అనే విప్లవకారుడు ఉండేవాడు. అతను లొంగిపోలేదు కానీ అరెస్త్ అయిన తరువాత విప్లవకారులని తిట్టి పాలకవర్గం నుంచి క్షమాభిక్ష పొందాడు. లెనిన్ విప్లవం వచ్చిన తరువాత కూడా పౌరయుద్ధంలో విప్లవ వ్యతిరేక తిరుగుబాటుదార్లని సమర్థవంతంగా అణచివేసాడు. విప్లవం రాకముందే పాలకవర్గానికి లొంగిపోయే గద్దర్, వరవరరావులతో పోలిస్తే లెనిన్ ఎక్కడ?

    • Praveen Kumar says:

      నేను అక్తోబర్ విప్లవం గురించే వ్రాసాను కానీ అంతకు ముందు ఫిబ్రవరీ విప్లవం పేరుతో వచ్చిన సంస్కరణవాద ప్రభుత్వం గురించి కాదు. ఆ పాయింత్‌ని పట్టుకుని నాకు చరిత్ర తెలియదనుకోకు.

  91. నీకు చరిత్ర తెలియదని నేనెట్లా నుకుంటాను:-)నీకు అన్నీ తెలుసు,కాకపోతే తెలియకూడనివే ఎక్కువగా తెలుసు:-(
    నువ్వ్వు నీకు చెప్పుకున్న సమర్ధనల సంగతి చూసుకో,వరవరరావుకీ నీకూ అవి ఒక్కలాగే ఎట్లా అపలై అవుతాయో చూసుకో.
    ఒక దేశానికి ఉందే ఏకైక అస్తిత్వం ఆ దేశపు కరెన్సీ! మగధ,కోసల,అంగ,వంగ మొదలైన మహాజనపదాల కాలం నుంచీ ఇప్పటి కాలం వరకూ ఒక భౌగోళీక్ సరిహాద్దును నిర్ణయించి దేశం అని పిలిచే ప్రతి భూభాగానికీ కామన్ ఎంటిటీ – కరెన్సీయే – అవునా కాదా?ఈ కరెన్సీని ఆ దేశపు ప్రభుత్వం నియంత్రిస్తుంది.మన దేశంలో రిజర్వ్ బ్యాంక్,మరొక అదెశంలో మరొక సంస్థ దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం డబ్బుని లెక్కగడుతుంది,అంటే రిజర్వ్ బ్యాంకుకు లెక్కతేలినది ఆ దెశపు ఉమ్మడి సంపద.నువ్వ్వు మీ తాతగారి ఆస్తిని దఖలు పర్చుకోవటానికి లాయరు ఫీజులు చెల్లించడానికి నీ దగ్గిరకి ఆ డబ్బు ఎక్కణించి వచ్చింది?మీ అమ్మగారు ఇచ్చారా,లేక మరొకరు నీ చేతికి ఇచ్చారా అనేది ముఖ్యం కాదు,అది ఈ దేశపు తెల్లధనం నుంచే కదా వస్తున్నది!నువ్వు వ్యవసాయం చేస్తే కూలీల్లతో పని చేయించుకుంటే నీ చేతి నుంచి వాళ్ళ చేతుల్లోకి మారేది ఈ ఉమ్మడి సంపద లోని భాగమే కదా.ప్రస్తుతం నీ అధీనంలో ఉంది,అంతే!నువ్వు తెలివిగా వ్యవసాయం చేసి తెలివిగా పంటని మార్కెట్ దగ్గిర ఎక్కువ లాభానికి అమ్మితే నీకు వచ్చే లాభం కూడా తెల్లడబ్బే,నీ మూలంగా కొంత దేశపు ఉమ్మడి సంపద పెరిగితే పెరగవచ్చు.కానీ ఈ దేశపు ఉమ్మడి సంపద నుంచే కదా నువ్వు తీస్కునేది.నువ్వు ఉత్పత్తి శక్యులు అభివృధ్ద్గి చెంది పై స్థాయిలో ప్రభుత్వంలో సొంత ఆస్తి రద్దు చేసే వరకు నువ్వు సొంత ఆస్తిని రద్దు చేసుకోనని ఈ దేశపు తెల్లధనంలో నీ కష్టానికి తగిన ఫలితం తీసుకుంటున్నట్టే వరవరరావు కూడా ఇదే తెల్లదబ్బు నుంచి కొంత సొంతానికి తీసుకుంటున్నాడు, అది ప్రభుత్వోద్యోగమైతే ఏమిటి,ప్రయివేటు ఉద్యోగమైతే ఏమిటి?నువ్వు చెస్తున్నదే వరవరరావు కూడా చేస్తున్నాడు.కాకపోతే రభుత్వొద్యోగంలో ఉండతం ద్వారా ప్రజలకి ఉపయోగపడే అవకాశం ఎక్కువ నీకన్నా!దానినతను ఉపయోగించుకుని ప్రభుత్వ చట్టాలలో న్యాయమైన వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ అన్యాయమైన వాటిని ఇంప్లిమెంట్ కానివ్వకుండా ప్రజల మీద దోపిడీ జరగకుండా తన రేంజిలో తను విప్లవాత్మకంగా బతికితే తప్పేమిటి?

    ఒకటి మాత్రం నిజం,ఇప్పుడు వరరరావు అట్లా ప్రభుత్వంలో చేరి మంచిపనులు చెయ్యటం ద్వారా ఈ ప్రభుత్వానికి మంచిపేరు తెస్తున్నాడు.కానీ కమ్యూనిష్టు పార్టీల లక్ష్యం ఈ ప్రభుత్వం మంచిది కాదని నిరూపించి దీన్ని కూలగొడితే తప్ప కమ్యూనిష్టు సిద్ధాంతం సక్సెస్ కాదని. అంతవరకూ మాత్రమే చూస్తే వరవరరావు నిజంగా విప్లవాన్ని ఆలశ్యం చేస్తున్నాడు గాబట్టి విప్లవద్రోహియే! కానీ తమ్ముడూ!రేపు నువ్వు తెచ్చే విప్లవం కోసం ఇవ్వాళ చెయ్యగలిగిన కొంచెం మంచి పని కూడా చెయ్యవద్దని నీ ఉద్దేశమా? వర్గరహితసమాజం వచ్చేవరకు ఎవణ్ణీ ఉద్ధరించకూదదు అనటం నిజంగా పైశాచికత్వమే!?ముప్పాళ రంగనాయకమ్మా ఆవిడ అభిమానిగా నువ్వూ మాత్రమే అట్లా సాటి విపలవకారుల్ని “మీరివ్వాళ మంచిపనులు చెయ్యకండి,వర్గరహితసమాజం వచ్చేవరకు ఎంతమంది చచ్చినా సరే పట్టించుకోవద్దు – అంతా శాస్త్రీయంగా మార్క్సుగారు చెప్పీన ప్రకారం రోబోల మాదిరి నడుచుకోవాల్సిందే తప్ప ఇప్పుడు మంచిపలులు చేసి విప్లవాన్ని డిలే చెయ్యొద్దు.అర్జెంటుగా విప్లవం రావాలంటే ప్రభుత్వపరంగా గానీ ప్రైవేటుగా గానీ బాధలు పడుతున్వాళ్ళకి పూనుకుని సహాయం చెయ్యకుండా చక్కహా మురమ్నా మాదిరి కమ్యూనిజాన్ని ఒప్పుకోలేదు గాబట్టి మీరిట్లా కష్టాలు పడుతున్నారు అని చెప్పి వూరుకోవాలి!ఏదో ఒకటి చేద్దాం అని హడావిడి పడిపోయి విరసం లాంటి సమ్షల్ని స్థాపించితే అది విప్లవం పరువు తీసెయ్యడం అవుతుంది” అనగలరు,గ్రేట్!

    మీరిట్లాగే ఒకళ్లనొకల్ళూ విపల్వద్రోహులని పడదిట్టుకుంటుంటే నాలాంటివాళ్ళం వినోదిస్తాం. నువ్వు వరవరరావుని తిట్టు,వరవరవ్రావు నిన్ను తిదతాడు,మీ ఇద్దరూ కలిసి హరగోపాల్ అనే మరొక దేవయ్యని తిట్టండి.మాలాంటివాళ్ళకి కాలక్షేపమే కాలక్షేపం. నీ ఇష్టం వరవరరావుని నీ శక్తి కొద్దీ కుమ్మెయ్!వన్సుమోర్లు చెప్పమన్నా చెబుతాను.
    P.S: తమ్ముడూ,లెనిన్ నీకు లాగా మురమ్నాకి లాగా ఖాళీగా కూచుని సాటి విపలవకారుల్ని తప్పులు పడుతూ కూర్చోలేదు.విప్లవానికి పనికొచ్చేది ఏదయినా చెయ్యమన్నాడు.చేసి చూపించాడు.కోడి సజ్జలు తిని సజ్జలు పెడుతుందన్నట్టు పుస్తకాల్ని అక్షరాలుగానూ,వాక్యాలు గానూ,పేరాగ్రాపులు గానూ,పేజీలు గానూ చదివే నీలాంటి వాళ్లకి అందులో ఉండే సారం అర్ధం చేసుకోవడం అసంభవం.మురమ్నా అభిమానిగా పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు కక్కటంలో నువ్వు జాతి కోడివి బాస్!

    • Praveen Kumar says:

      నేనేమీ కష్టపడడం లేదు. నేను కనీసం power tiller driving కూడా చెయ్యలేదు. దాన్ని వేరేవాని చేత drive చెయ్యించి దుక్కి చేసాను. దోపిడీ వ్యవస్థ ఉనికిలో ఉన్నంత వరకు దోపిడీ చట్టాల ప్రకారం వచ్చిన హక్కుల్ని ఎవడూ వదులుకోడు. ప్రభుత్వ ఉద్యోగం విషయానికి వస్తే, బతకడానికి అదొక్కటే మార్గం కాదు కానీ మన దేశంలో ప్రభుత్వం కావాలని పరిశ్రమలని ప్రోత్సహించకుండా జనాన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడమని రెచ్చగొడుతోంది. రాయగడ జిల్లా పితామహల్ అనే గ్రామం దగ్గర ఒరిస్సా ప్రభుత్వం ఒక పారిశ్రామికవాడ పెట్టించింది. అక్కడ భూములు తీసుకున్నవాళ్ళలో చాలా మంది పరిశ్రమలు పెట్టలేదు. పితామహల్ రాయగడ పట్టణానికి 5 కిమి దూరమే కావడం వల్ల ఆ భూములు తీసుకున్నవాళ్ళు వాటిని real estateకి అమ్ముకోవాలనుకుంటున్నారు. రాయగడ పట్టణంలో ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లు ఉన్నాయి. ఆ జిల్లాలోని పల్లెటూర్లలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ రాయగడ పట్టణంలోనే ఇళ్ళు అద్దెకి తీసుకుని తమ పిల్లల్ని ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లలో చదివిస్తారు. అందుకే రాయగడ పట్టణం దగ్గర real estate భూమి ధర ఎకరానికి కోటి రూపాయలు. పితామహల్ దగ్గర కొంత మంది పరిశ్రమలు పెట్టారు. అవి పాత యంత్రాలు కొనుగోలు చేసి పెట్టినవి. ఆ యంత్రాలు పాడై ఆ పరిశ్రమలు రెండుమూడునెలలకే మూతపడినాయి. మన దేశంలో పరిశ్రమలని నమ్ముకుంటే ఏమీ రాదు కానీ ప్రభుత్వ ఉద్యోగాన్ని నమ్ముకుంటే మాత్రం డబ్బు బాగా వస్తుంది. అలా వచ్చిన డబ్బు కూడా పిల్లల్ని ఖరీదైన ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లలో చదివించడానికి ఖర్చైపోతుంది. విప్లవకారులమని చెప్పుకుంటున్నవాళ్ళు కూడా ఇదే సంస్కృతిలో బతికితే విప్లవం సంగతి నువ్వు నమ్మే దేవుడు ఎరుగు కానీ కనీసం సంస్కరణ కూడా రాదు.

  92. chandolu chandrasekhar says:

    ప్రవీణ్ గారు , కొంచెం మేన్షివికులు,బొల్షివిక్కుల్ గురించి కూడా చెపితే నేర్చు కుంటాం . 1905 లెనిన్ తన పంధామార్చుకొని 1917 లో విజయవంతం కావటానికి , కారణమేమిటి . తేజే శ్వరాధములే కాదు తెలంగాణ పోరాటం లో పాల్గొన్న ప్రసాద్ బాబాల వెంట తిరిగాడు ,లెనిన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు . వరవరరావు ఆ భావజాల ప్రభావం తో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పనిచేసే కవి,రచయిత,సాంస్కృతిక యోధుడు .ఆతడు ఈవాళ ఉండొచ్చు , పోవచ్చు , ఉన్నంత వరకు వి .వి నే .పో యిన తరువాత తెజేస్వర్ అధముడే . 21 రోజుల వరకు కోడిగుడ్డు , 20 రోజుల వరకు లోపల అనేక మార్పు లు జరిగిన , పిల్ల బయటకు వచ్చిన తరువాత కోడిపిల్ల అంటాం.three magic weapon గురించి తెలుసుకోండి , పాపం వి. వి.ని . రెచ్చ గొట్టి ఆయన అసలు ఏమి చేస్తున్నాడో తెలుసుకోవాలని దుగ్ద .

Leave a Reply to బ్రెయిన్ డెడ్ Cancel reply

*