వివాద కవిత మీద వివాదం

ఎన్. వేణుగోపాల్ 

 

venuఅంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వం అన్నప్పుడు వివాదం కాని కవిత్వం ఉంటుందా అనుమానమే. నిజానికి కవిత్వమంతా యథాస్థితితో పేచీయే. ఒక అనుభూతిని, ఘటనను, పరిణామాన్ని, దృశ్యాన్ని మరొకరు చూసిన పద్ధతికి భిన్నంగా చూడడమే అనే అర్థం లోనూ కవిత్వమంతా వివాదమే అని చెప్పుకోవచ్చు. కాని కవిత్వంలో భాగమైన ఒక ప్రత్యేక ప్రక్రియగా కూడ వివాద కవిత (పాలిమికల్ పొయెమ్) ఉంది. ఒక కవితనో, రచననో చదివి, దాన్ని ఖండిస్తూ, భిన్న దృక్పథాన్ని ప్రకటిస్తూ కవిత్వం రాయడం వివాద కవిత. ‘వివాద కవిత అంటే ఒక నైతిక లేదా రాజకీయ సమస్య పట్ల ఏ నిర్దిష్ట వైఖరి తీసుకోవాలనే దిశగా పాఠకులను కదిలించే సాహిత్య పాఠపు ప్రక్రియ’ అని ఆఫ్రికన్ కవిత్వంలో వివాద కవిత్వం గురించి రాస్తూ హ్యూ వెబ్ అనే సాహిత్య విమర్శకుడు అన్నాడు.

పార్లమెంటరీ రాజకీయాలను తిరస్కరిస్తూ, సాయుధ పోరాట రాజకీయాలతో ప్రయాణం ప్రారంభించిన సత్యనారాయణ సింగ్ అనే నాయకుడు ఏప్రిల్ 1977లో ఎన్నికలలో పాల్గొనవచ్చుననే సిద్ధాంతాన్ని ప్రకటించినప్పుడు పంజాబీ కవి అమర్ జిత్ చందన్ ‘ఏప్రిల్ థీసిస్’ అని ఒక కవిత రాశాడు. బోల్షివిక్ విప్లవానికి దారి తీసిన లెనిన్ చరిత్రాత్మక ఏప్రిల్ థీసిస్ ను ప్రస్తావిస్తూ, సత్య నారాయణ సింగ్ ఏప్రిల్ ప్రకటనను వ్యంగ్యంగా ఎత్తిపొడిచిన కవిత అది. దాన్ని ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువదించడంతో వివాద కవిత్వంతో నా పరిచయం మొదలైంది. అంతకుముందే శ్రీశ్రీ – దాశరథి మధ్య సాగిన వివాద కవిత్వం పరిచయం ఉంది గాని ఆ వివాదం కొంత అనవసరమైన సంచలనాత్మకతకు, దూషణకు, నిందలకు కూడ జారిపోయిందనే అభిప్రాయం ఉన్నందువల్ల అమర్ జిత్ చందన్ కవిత మరింత నచ్చింది. ఆ తర్వాత నా ఓల్డ్ పిజి హాస్టల్ సహవాసి, అప్పటి మంచి కవి లక్నారెడ్డి రాసిన కవితకు ఆ కవితలోని పదబంధాలనే వాడుకుంటూ నేనూ ఒక వివాద కవిత రాశాను. అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీవాద, మైనారిటీ వాద, ప్రాంతీయవాద కవిత్వంలో ఎన్నో వివాద కవితలున్నాయి.

kannabiran1

స్త్రీవాద సిద్ధాంతకర్త, కార్యకర్త, రచయిత వసంత కన్నబిరాన్ ఈ వారం “ఆంధ్రజ్యోతి వివిధ”లో రాసిన కొత్త వివాద కవిత ప్రస్తుతం కొంత దుమారాన్ని రేపే అవకాశం ఉందని అనిపిస్తున్నది. ఆ కవిత వెలువడి ఇంకా పన్నెండు గంటలు నిండకుండానే అనుకూలంగానూ ప్రతికూలంగానూ ఎన్నో అభిప్రాయాలకు దారితీసింది. వసంత కన్నబిరాన్ గతంలో పెద్దగా కవిత్వం రాసినవారు కాదు. ఎప్పుడో వరవరరావు జైలులో ఉన్నప్పుడు ఆయన సహచరి హేమలత తో మాట్లాడి రాసిన నిరీక్షణ అనే కవితలో కూడ వివాద కవిత ఛాయలున్నాయి.

ప్రస్తుత కవిత వివాద కవిత అవునా, అసలు కవిత అవునా, బిలో ది బెల్ట్ (అన్యాయమైన) ప్రతిస్పందనా, తిట్లా అని చర్చ జరుగుతున్నది. ఒక పరిణామం మీద ఒక రచన వెలువడినప్పుడు ఆ రచనను, రచయితను, సందర్భాన్ని భిన్నమైన కోణంలో చూపించడమే వివాద కవిత లక్షణం అనుకుంటే ఇది కచ్చితంగా వివాద కవితే. పదప్రయోగాలు విమర్శకు లక్ష్యంగా ఉన్న కవిత/రచన నుంచి, రచయిత నుంచి ఉండడం, లేదా ఆ రచనను, రచయితను స్ఫురించేలా ఉండడం వంటి వివాద కవిత్వ ముఖ్య లక్షణాలు ఉన్నందువల్ల కూడ అది వివాద కవితే.

*

మీ మాటలు

  1. maadam mee kavitha aame srustinchina andhakaramlo kottukuntunna vaariki velugula vasantham.kaseem

  2. Bhasker koorapati says:

    మేడం,
    మీ కవిత బిలో బెల్ట్ దేబ్బెం కాదు.
    అది పక్కా ముహ్ తోడ్ జవాబ్ మాత్రమే..!
    ఎంతైనా రంగనాయకమ్మ గారిలాంటి ప్రముఖ రచయిత్రి అలా రాయడం సబబనిపించదు.
    మీ కవిత వంద శాతం సబబే..!
    –ఉక్కుగోళ్ళ రచన.

  3. Delhi Subrahmanyam says:

    నిన్న రాత్రి వసంత గారి కవిత – బిలో ది బెల్ట్ (అన్యాయమైన) ప్రతిస్పందనా, తిట్లా – లో పాల్గొన్నప్పుడు వేణు రాసిన ఈ విశ్లేషణ ఉంటే చాలా ఉపోయోగకరం గా ఉండేది. నిన్న వసంత గారిని విమర్శించిన ఆ విజ్జ్ఞులందరూ ఒక అర్ధాంలేని వ్యాఖ్య చేశారు. ర్ంగనాయకమ్మ గారు అలా రాశి ఉండకూడదు అది తప్పే కానీ వసంత గారు నోరుమూసుకుని ఉండకుండా ఇలా రాయడం మాత్రం చాలా అన్యాయం అని వాపోయారు పాపం. వేణు లాగే నిన్న, Narayanaswamy వెంకతయోగి గారు చాలా ఓపిగ్గానూ, నేనోకింత సహనం తోనూ వారి దాడిని తట్టుకొనే ప్రయత్నం చేశాము. ఇప్పుడు వేణు గారి ఈ విశ్లేషణ ఇంకా బాగా వసంత గారి వివాద కవిత గురించి చెపుతుంది. వసంత గారి కవితలో వ్యంగ్యం ఉంది కానీ తిట్టు లేదు.

  4. Rajaram t says:

    వసంత కన్నాభిరాన్ గారి కవిత నూటికి నూరు శాతం వివాద కవితే.రంగనాయకమ్మ గారు రాసిన వ్యాసం ఈ కవిత రాయడానికి కారణం.నిజానికీ వరవర రావు గారు రాసిన వ్యాసం దృష్టిలో వుంచుకొని రంగనాయకమ్మ గారు దురుసుగా రాశారు.ముదిమితో మతి తప్పుతుందంటారు.ఆ విషయాన్ని ఆవిడ గారు నిరూపించప్రయత్నించారేమో?

  5. m.viswanaadhareddi says:

    ప్రస్తుత కవిత వివాద కవిత అవునా, అసలు కవిత అవునా, బిలో ది బెల్ట్ (అన్యాయమైన) ప్రతిస్పందనా, తిట్లా అని చర్చ . చర్చ కూడా కాదు సార్ . అది తిట్టే . కవిత్వం కాదు జరిగిన చరిత్ర ను ఒక జ్ఞాపకంగా ఒకరు వివరిస్తే ఇంకొకరు విమర్శించారు ఇలా నా విప్లవ సంఘం ఏర్పడింది . అలానా చెప్పుకునేది . మనమే కుట్రలతో నిర్మాణం చేస్తే … మనమేమి డెమాక్రెటిక్ గా ఉండగలం మనం ఇంకొంచెం మెరుగ్గా వుంటే బాగుంటుంది కదా అని రంగనాయకమ్మ అభిప్రాయమని అనుకోవచ్చుకడా దాని తిట్టు కవిత్వం రాసేస్తే ఎలా ?

  6. వీరబొబ్బిలి says:

    ఓయ్ గోపాత్రుడూ!అతివుత్సాహం కూడదోయ్,
    ఎందంట ఎవురు ఏది రాసినా ఏది సెప్పినా అందంట వారి యొక్క గ్యానం నీటిలో నీడనాగ అవుపడిపోతాదోయ్, సూసి ఆనందించవోయ్…
    తిట్లన్ని గుదిగుచ్చి యిది కపిత్వమే అంటే అవుగాక,దానికి వివాద కవితని ముద్దుపేరేటోయ్..
    పుల్లక్క పేరక్క కవుర్లు (తిట్లు) బుజానమోసే నీయొక్క కార్యశూన్యత చూస్తే జాలేస్తోందోయ్..

    -వీరబొబ్బిలి

  7. కల్లూరి భాస్కరం says:

    వేణుగోపాల్ గారూ…ఈ కవితలో ప్రధానంగా ఆక్షేపణ మాత్రమే ఉంది. దాంతోపాటు విమర్శ ఉందనుకున్నా ఆక్షేపణ దాన్ని కప్పేసింది. కనుక దీనిని వివాద కవిత అనడం కన్నా అధిక్షేపణ కవిత అనో, ఒక మేరకు తిట్టు కవిత అనో అనచ్చేమో. తిట్టుకవిత్వం ప్రాచీన కవుల్లో ప్రసిద్ధమే. ఇందులో వసంత కన్నబీరన్ గారు రంగనాయకమ్మగారి నవలల్ని శ్లేషయుక్తంగా ప్రస్తావించి ఆక్షేపించడం మాత్రం ఉత్తమ అభిరుచిని వెల్లడించడంలేదు. నేటి అవగాహన రీత్యా రంగనాయకమ్మగారు ఒకప్పటి తన నవలల్ని గొప్ప రచనలుగా భావించరని మనకు తెలుసు. ఆమె వాటిని పునర్విమర్శించుకుంటూ ఆత్మవిమర్శ చేసుకున్నారు కూడా. అలాంటప్పుడు ఆమె నవలలపేర్లను ఆమెపై విమర్శకు వాడుకోవడం వసంత గారి స్థాయికి తగదనిపించింది. కవిత్వమనే ఒక గంభీరమైన, సున్నితమైన ప్రక్రియను వ్యక్తిగత నిందకు వాడుకోవడం కూడా ఉత్తమ అభిరుచిని సూచించదని నేను వ్యక్తిగతంగా భావిస్తాను.

  8. వేణుగోపాల్ గారు కవిత్వంలో ‘వివాద’ కవితా ప్రక్రియను ఈ వ్యాసం ద్వారా అందించినందుకు ధన్యవాదాలు. వివాద కవిత్వం ఇదివరలో శ్రీ.శ్రీ , దాశరధి లు మద్య నడిచిందని కాని అది అంత సక్రమ మార్గంలో జరగలేదని తెలిపారు. వివాద కవిత్వంలో విమర్శ వస్తుగతమై (రచయత రాసిన విషయంపై )ఉండాలా లేక వ్యక్తిగతమై (రచయతపై)వుండాల అన్నది నాకున్న సందేహం? రంగనాయకమ్మ గారు తన వ్యాసంలో విరసం ఏర్పాటుకు ముందు జరిగిన విషయాలను అంత బలంగా చెబుతుంటే ఆనాడు జరిగిన ఆ విషయాలు నిజమో కాదో ఈ కవిత ద్వారా ఖండించి వుంటే బావుండేదేమో అన్నది నా అభిప్రాయం (ఈ కవిత రంగనాయకమ్మ గారి వ్యాసానికి బదులు అయివుంటే). దానికి బదులుగా ఆమె రచనలు విలువను కోల్పోయాయి అందుకే అదనపు విలువకై ఆమె మార్క్స్ రచనలను వాడుకుంటుంది, తన వాదనను వ్యతిరేకించినవారిని దుడ్డు కర్రతో బాదుతుంది అంటూ వ్యక్తిగత విమర్శనా కత్తితో కన్నబిరాన్ గారు దిగడం ఎంతవరకు సమంజసం తెలుపగలరు? దుడ్డుకర్రకు దుడ్డుకర్ర సమాదానమంటారా? లేక దుడ్డుకర్రకు సమాదానంగా కత్తే కరెక్ట్ అంటారా!

  9. రంగనాయకమ్మ గారు ఇతర్లను విమర్శించడానికి వాడే భాషతో పోలిస్తే వసంత గారి కవిత ఓ అతి సున్నితమైన మందలింపు మాత్రమే. తెలుగు వారందరికీ ఆరాధ్యులు సాహితీ దిగ్గజాలు కొడవటి గురించి కానీండి, శ్రీ శ్రీ గురించి కానీండి, లక్షలమంది కోసం విరామమేరుగకుండా పనిచేసిన బాలగోపాల్ గారి గురించి కానీండి రంగనాయకమ్మ ఎంత భాద్యతా రాహిత్యంగా రాసిందో గుర్తు చేసుకుంటే వసంత గారి కవిత అతి సున్నితమైన మందలింపు మాత్రమే.తనెంత హార్ష్ గా, ఇర్రేషనల్ గా,బాధ్యతా రాహిత్యం గా రాస్తుందో ఒక్కసారి తనకి గుర్తుచెయ్యడం మాత్రమే.

    తనని గురించిన ఎంత చిన్న విమర్సకైనా సీరియల్ గా, సీరియస్ గా వీలైనంత పరుషంగా రెస్పాండ్ అయ్యే రంగనాయకమ్మ గారంటే సగం భయంతో, సగం చీదరతో మౌనంగా ఊరుకున్దిపోయే నాలాటి వాళ్ళకు వసంత గారి కవిత ఓ కమ్మని కంఫర్ట్.
    ,

  10. హమ్మయ్య, వసంత గారి కవిత్వం ఇక్కడ చదివాను. వెనక్కి ప్రయాణం. ఇప్పుడు రాంగనాయకమ్మ గారి వ్యాసం పట్టుకోవాలి.

  11. రెడ్డి రామకృష్ణ says:

    సత్యం గారు రంగనాయకమ్మగారు అందర్నీ రాళ్లతో కొడితే వసంతగారు రంగనాయకమ్మని పూలతో కొట్టారంటారా ! .బాగుందండి. మీరన్నట్టు ‘రంగనాయకమ్మ ఎంత భాద్యతా రాహిత్యంగా రాసిందో ‘ అనే అనుకుందాం.ఆబాధ్యతారహిత్యాన్ని ఆమె రాసిన అసత్యాలని (ఒకవేళ వుంటే)ఖండించి నిజాల్ని నిగ్గుతేల్చాలిగదా!,అపుడు ఆమె తప్పుడురాతలు రాసినందుకు బాధపడి వుండెవారుకాదా!.ఈరకమైన దాడికి పాల్గొనటం మాత్రం ఆరోగ్యకరమైనది కాదని అనుకుంటున్నాను.అందునా వసంత గారిలాంటి వారు.
    ఎంతటి ఆరాధనీయులైనా తప్పుచేసివుంటె ఖండించటమ్ తప్పుకాదుగదా!.ఎత్తి చూపినంతమాత్రాన ఆయా ఆరాధ్యులకీర్తికి భంగముకాదు.నిజంగా ఆరాధనీయమైన వారైతే. వారి పట్ల అలారాసుంటే.
    అసలు ఆరాధన అనే పదమే సరైనదికాదు.మార్క్సిస్టులు వాడతగినదికాదు అని నా అభిప్రాయం.

  12. నీహారిక says:

    రాజ్యాన్నో, రాజకీయనాయకులనో తిట్టిన వారున్నారు కానీ ప్రజల్లో చైతన్యాన్ని తేవాలని ప్రయత్నించేవారు కొందరే ఉన్నారు. రంగనాయకమ్మ గారు ఒక్కరే అది సాధించకపోవచ్చు కానీ ఆమె సంధించిన ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పలేని వారు ఎన్ని (వివాద)కవితలు వ్రాసినా అవి ఆమెకు దక్కిన గౌరవాలే కానీ దీవెనలు కాగలవా ?

  13. వసంత గారు రాసింది కవిత్వమే కాదు, దానికి ఒక పేరు పెట్టడం అనవసరం .సందర్భం లేని ఉక్రోషం .రామా సుందరి గారి స్పందన సంయమనంతో ఉంది.

  14. వసంత గారు రాసింది కవిత్వమే కాదన్న రవిబాబు గారికి కవిత్వమంటే ఏంటో, కవిత్వం కాని దేంటో తెలిసే ఉంటదని నా గట్టి నమ్మకం. వారి ‘ప్రజా సాహితి’ చూస్తే తెలుగు కవిత్వానికి పట్టిన దుర్దశ గమనిస్తాం. ఏళ్ల తరబడి నినాదప్రాయ అకవిత్వం వేస్తున్న సామర్ధ్యం చేతనే వారు వసంత గారిది కవిత్వమే కాదని చులాగ్గా చెప్పగలిగారు. ధన్యవాద్. అయితే వసంత గారి ఉక్రోషానికి సందర్భం లేదని ఎట్లా చెప్పగలిగారబ్బా?

మీ మాటలు

*