పిల్లలు నేర్పించే ఫిలాసఫీ…

 

 

పిల్లలు.. మెరిసే ముఖాల పిల్లలు.. మట్టి నవ్వుల పిల్లలు.. అడుగుగులతో ఏ ప్రదేశాన్నైనా ఉద్యానవనంగా మార్చే పిల్లలు! వాళ్ళ ఆటల్నీ, చేష్టల్నీ ముద్దుగా మురిపెంగా చూస్తామే కానీ వాటిల్లో దాగి ఉండే జీవిత సారాంశాన్ని గుల్జార్ దర్శించినట్టు బహుతక్కువమంది చేయగలరు!

పిల్లల చర్యల్లో జీవితానికి సంబంధించిన రూపకాలూ, తాత్వికతా అనేక రూపాల్లో తారసపడతాయి!

చాన్నాళ్ళ క్రితం చదివిన ఒక తెలుగు కధలో ఒక పిల్లవాడు పటంలో ఉన్న దేవుడి చేతిలోని తామర పూవు చూసి, ‘తన దగ్గర ఉంది కదా చాలనుకుని వర్షాలు కురిపించడం లేదనీ, అందువల్లే చెరువులో నీళ్ళు ఇంకిపోయి, అందులోని తామరపూవులన్నీ ఎండిపోయాయనీ’ అనుకుంటాడు.. ఆయన చేతిలోని పూవుని లాగేసుకుంటే అయినా వర్షాలు కురిపిస్తాడేమో అని, పీట వేసుకుని మరీ ఆ పటాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తాడు!

చదవడానికి అతి మామూలుగా అనిపించే ఈ కవితలూ, కధల్లో లోతైన తాత్వికత నిండి ఉంటుంది. చదవడం అయిపోగానే వాటిలోని భావాలు మనసుని దిగులుతో నింపివేస్తాయి. గంభీరతతో ఆలోచింపజేస్తాయి!

gulzar

 

ఇంధనం

చిన్నప్పుడు అమ్మ పిడకలు చేస్తుండేది
మేమేమో వాటి మీద ముఖాలు గీస్తుండేవాళ్ళం
కళ్ళు వేసి, చెవులు తగిలించి
ముక్కు అలంకరించి
తలపాగా అతను, టోపీ వాడు
నా పిడక
నీ పిడక
మాలో మాకు తెలిసిన పేర్లన్నీ పెట్టుకుని
పిడకలు అతికించేవాళ్ళం.

కిలకిలా నవ్వుకుంటూ రోజూ సూర్యుడు పొద్దున్నే వచ్చి
ఆ ఆవు పిడకల మీద ఆడుకునేవాడు.
రాత్రుళ్లలో పెరటిలో పొయ్యి వెలిగించినప్పుడు
మేమందరం చుట్టూ చేరేవాళ్ళం
ఎవరి పిడక మంటల్లోకి చేరుతుందని చూసుకుంటూ
అది పండితుడు
ఒకటి మున్నా
ఇంకోటి దశరధ్

చాన్నాళ్ళ తర్వాత నేను
స్మశానంలో కూర్చుని ఆలోచిస్తున్నా
ఇవాళ్టి రాత్రి ఆ రగులుతున్న మంటల్లోకి
మరొక స్నేహితుడి పిడక చేరింది!

satya1

మూలం:

Chote the, maa uple thapa karti thi
hum uplon par shaklein goontha karte they
aankha lagakar – kaan banakar
naak sajakar
pagdi wala, topi wala
mera upla-
tera upla-
apne-apne jane pehchane naamo se
uple thapa karte they

hunsta-khelta suraj roz savere aakar
gobar ke upalon pe khela karta karta tha
raat ko aangan mein jab chulha jalta tha
hum sare chulha ghe ke baithey rehte
kisi upale ki baari aayi
kiska upla raakh hua
wo pandit tha-
ek munna tha-
ek dashrath tha-

barson baad- main
shamshan mein baitha soch raha hun
aaj ki raat is waqt ke jalte chulhe mein
ik dost ka upla aur gaya!

—————————–

Painting: Satya Sufi

మీ మాటలు

  1. Dr.R.SumanLata says:

    గుల్జార్ గొప్పదనం అదే !ఆయన రాసే ప్రతీ మాటలో , తీసే ప్రతీ ఫ్రేం లో స్పష్టంగా మనం ఒక కవిత్వాన్ని ఆస్వాదిస్తాము. నిషిగంధ గారు అనువాదం కూడా చక్కగా చేసేరు . అనుభూతిని మరోసారి కలగజేసి నందుకు ధన్యవాదాలు . డా.ఆర్.సుమన్ లత ..

    \

  2. వెంకట్ కొండపల్లి says:

    సరళమైన భాషలో, సరదాగా చక్కగా వివరిస్తూ, ఆలోచించే విదంగా ముగింపులతొ ఎంత అద్భుతంగా వ్రాసారు ! రచయిత కు అనువాదకులకు అభినందనలు.

  3. ఎప్పటిలానే మూడు నక్షత్రాలతో మెరిసే ఆకాశంలా ఉంది

  4. నిషిగంధ says:

    డా. సుమన్‌లత గారు, వెంకట్ గారు, భవానీ గారు.. మీ ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

    సత్య గారు, ప్రతీసారీ ‘ఈ కవిత కి అసలు చిత్రరూపం ఎలా తేగలరో!?’ అనుకుంటూ, ఆలోచిస్తూ ఉంటుండగానే మీరు మీ చేతి మాయాజాలంతో చకితుల్ని చేశేస్తున్నారు!!

  5. విలాసాగరం రవీందర్ says:

    అనువాదం చక్కగా ఉంది… నిశగంధి గారు

Leave a Reply to విలాసాగరం రవీందర్ Cancel reply

*