తెగిన గాలిపటాలు   

                                                                              

profile photo

                                                                       

అబ్బా! ఆఫీస్ అవర్స్ కాకపోయినా, ఈ ట్రాఫిక్ ఇంతుంది. ఈ లెక్కన ఎప్పుడు చేరతానో, ఏమో! రెండు గంటలైనా పడుతుందంటాడీ మేరూ కాబ్ డ్రైవర్.
‘అయినా ఈ టీనాకి అద్దెకి తీసుకొని ఉండడానికి ఊరు శివార్ల ఉన్న ఛత్తర్‌పురే దొరికిందా!’-చిరాకు పడ్డాను.

రాత్రి పది గంటలకి ఫోన్ చేసి చెప్పింది- ‘ఇవాళ్ళ తన పుట్టినరోజని.’ దార్లో ఫాబ్ ఇండియాలో ఆగి తనకో కుర్తా కొని దాన్ని గిఫ్ట్ రాప్ చేయించడానికి మరి కొంతసేపు పట్టింది.

నా కోసం మిగతా అందరూ మధ్యాహ్నం భోజనాలకి వెయిట్ చేసి, తిట్టుకుంటూ ఉండి ఉంటారిప్పటికే.
ఎలా ఉన్నారో అందరూ! టీనా అయితే ఎనిమిది నెలల కిందట ఇంటికి వచ్చింది. పూజాని-వాళ్ళమ్మగారు పోయినప్పుడు, నాలుగేళ్ళ కిందటేమో ఆఖరిసారి కలుసుకున్నది. ఆనానీ, పోదార్‌నీ అయితే- నేను ఉద్యోగం వదిలేసేక మళ్ళీ చూడనేలేదు.

ఎప్పటి స్నేహాలు! ఎన్ని జీవితాలు- ఎలాంటి మలుపులు తిరిగేయో!

***

వీళ్ళందరిలో టీనాయే ఆశ్చర్యం నాకెప్పుడూ. జీవితంలో తనంతట తానే సృష్టించుకున్న ఒడుదొడుకులు ఏ సినిమా కథకీ తీసిపోవు.  కానీ తనలో బాధా, కోపం, ఈర్ష్యా, ఆవేశం- వీటి వేటినీ ఇప్పటివరకూ చూడలేదు నేను. ఏ సందర్భంలోనూ కళ్ళనీళ్ళు పెట్టుకున్న గుర్తు కూడా లేదు. ఆ మనస్తత్వం ఇప్పటికీ నాకర్థం కాదు.

మొదటిసారి తన్ని చూసినది నేను కంచన్‌జంగా బిల్డింగ్లో పని చేస్తుండగా. కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఉద్యోగం వచ్చి చేరింది.

అప్పటికే టీనాకి ఒక పెళ్ళి అవడమూ, విడాకులూ కూడా అయేయి. కూతురైన మేఘనాకి ఆరేళ్ళు దాటి ఉండి ఉంటాయి. అప్పుడు టీనా ఎంత నాజూకుగా ఉండేదో! ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత మృదువైన కష్మీరీ తెలుపు. సన్నగా ఉండి, పొడుగాటి జుట్టుతో ఈర్ష్య కలిగించేటంత అందంగా ఉండేది.

చేరిన రెండేళ్ళకే ఖాన్‌తో తిరగడం మొదలుపెట్టింది. ఖాన్- పిఆర్ డిపార్టుమెంట్లో మానేజర్. పెళ్ళాం పోయిందనీ, భార్య మరణానికి అతనే కారణమనీ కూడా చెప్పుకునేవాళ్ళు. పట్టుమని ఒక నెల తిరగలేదు. టీనా ఖాన్‌ని పెళ్ళి చేసుకుందని తెలిసింది. ఆఫీస్లో అందరికీ మిఠాయి పంచింది కానీ నాలాగే ఎవరికీ సంతోషం కలగలేదన్నట్టే గుర్తు.

ఆ పెళ్ళీ తాన్యా పుట్టిన తరువాత, ‘తలాక్. తలాక్, తలాక్” అవడానికి రెండేళ్ళు కూడా పట్టలేదు. అతనితో కలిపి ఉన్నంతకాలమూ, ఆఫీసుకి వచ్చిన చాలాసార్లు- ముందు రాత్రి జరిగిన సంఘటనలకి గుర్తుగా తన చెంపలు కమిలి ఉండటం, చేతుల మీద రక్కులూ కనిపిస్తూనే ఉండేవి. ‘గతం గతహ్’ అనుకొమ్మని పెద్దలు చెప్పిన మాటని తు : చ తప్పకుండా, ఎంతో సులభంగా పాటించే అద్భుతమైన అలవాటు టీనాకి. అందుకే రెండు పెళ్ళిళ్ళూ, రెండు లివ్- ఇన్- రిలేషన్‌షిప్ల తరువాత కూడా ఎటువంటి విషాదాన్నీ తన చెంత చేరనీయలేదు.

***

బోయ్ బోయ్ మంటూ డ్రైవర్ ఒకటే హార్న్ మోగిస్తుంటే ఈ లోకంలో పడి చుట్టూ చూసేను. వసంత్‌కుంజ్ దాటినట్టున్నాం.”పదిహేను నిముషాలే మేడం. ఆడ్రెస్ చెప్పండి”-‘నేవిగేషన్’ ఆన్ చేస్తూ అడిగేడు డ్రైవర్. వాట్స్‌అప్లో టీనా పంపించిన చిరునామా చూసి చెప్పేనతనితో.

“ఉన్నావా, ఊడేవా, ఎక్కడి వరకూ చేరేవు?”- ప్రశ్నలు కురిపిస్తూ ఫోన్లు రావడం ప్రారంభించేయి.

మొత్తం మీద, ట్రాఫిక్ దాటుకుంటూ ఆ ఛత్తర్‌పురేదో చేరేను. కారు కూడా కష్టంమీద దూరగలిసేటంత ఇరుకు సందులు. ఇంటి నంబర్లు చూసుకుంటూ ఎలాగో చేర్చేడు డ్రైవర్ మహానుభావుడు. రెండో అంతస్థు. రీటా, పూజా, ఆనా, పోదార్ తప్ప ఇంకెవరూ కనపడలేదు. కొంచం అభిమానంగా, కొంచం ఫార్మల్గా ఒకళ్ళనొకళ్ళమి దగ్గిరకి తీసుకున్నాం.

చుట్టూ చూస్తే, పెచ్చులూడుతున్న గోడలూ, వాటికి పట్టిన బూజూ-మొదట నా కంటబడినవి. ఎదురుగా ఉన్న బుద్ధుడి ప్రేయర్ వీల్ మీదా, కొవ్వొత్తుల మీదా దుమ్ము దట్టంగా పేరుకుని ఉంది. లివింగ్ రూమ్ కిటికీకి తగిలించిన కర్టెన్లు చూస్తే, అవి ముందింకెక్కడో వేళ్ళాడి ఉండేవన్న చిహ్నంగా- కర్టెన్ల పొడుగూ, వెడల్పూ- రెండూ తక్కువయేయి. వాటి సందుల్లోనుండి బాల్కనీలో ఉన్న ఎండ లోపలికొస్తోంది. ఒక బెడ్రూమ్ తెరిచి ఉంది. దానికి వేళ్ళాడదీసిన కర్టెన్లు- మధ్య బ్రాకెట్లనుంచి జారి, కొంతమేర లూసుగా బయటకి వచ్చేయి. ఆ పక్కనున్న గది తలుపు మూసి ఉంది.

ఎయిర్ కండిషనర్ చప్పుడు చేస్తూ బలహీనంగా నడుస్తోంది. ఇంతెండల్లో- కనీసం పనంటూ చేస్తోంది, నయం.

Kadha-Saranga-2-300x268

లివింగ్ రూమ్లోనే ఒక మూల వంటింటి కోసం అని కేటాయించిన ఏడడుగుల చదరంలో, స్టవ్ మీద మూత కూడా పెట్టని అల్యూమినిమ్ గిన్నెలో చల్లారిన అన్నం, ఆ పక్కన పెట్టిన చిన్న టేబిల్ మీద గాజు గిన్నెల్లో పెట్టిన వండిన పదార్ధాలేవోనూ కనిపిస్తున్నాయి. ఆ పక్కన ఒక మూల ప్లాస్టిక్ ప్లేట్లూ, కప్పులూ, స్టీల్ స్పూన్లూ.

“ఒక్క నిముషం. వాష్రూమ్ ఉపయోగించుకోవచ్చా?”- అడిగితే తెరిచి ఉన్న గదివైపు చూపించింది టీనా. గదిలోకి అడుగుపెడితే ఇవతల ఉన్న తలుపు కూడా మూసుకోకుండా, బాత్రూమ్ లో ఒక ప్లాస్టిక్ స్టూల్ మీద కూర్చుని సిగరెట్ పీలుస్తోంది తాన్యా.

వెనక్కి తిరుగుతుంటే “మీరు రండి ఆంటీ, నేను బయటకి వచ్చేస్తున్నాను” తాపీగా ఏష్ ట్రేలో సిగరెట్టు బట్ నొక్కి, బయటకి వచ్చింది. ఆ గదికి ఒక కిటికీ అంటూ లేదు. సింగిల్ బెడ్ మీద పరిచిన దుప్పటి వెలిసి, పాతబడి, అస్తవ్యస్తంగా ముడతలు పడి ఉంది.

రెండు నిముషాల తరువాత బయటకి తిరిగి వచ్చి పడ్డాను.

ఇరుగ్గా ఉన్న లివింగ్ రూమ్లో, కిటికీ ముందున్న కుర్చీలో చిరునవ్వు చిందిస్తూ కూర్చుని ఉంది ఆనా. గలగలమని మాటలాడటం తన స్వభావానికి విరుద్ధం అని నాకెరుకే. భర్తా తనూ ఎన్నో ఏళ్ళగా, ఒకే ఇంట్లో –వేరే వేరే అంతస్థుల్లో, అపరిచితుల్లా ఉండటం నాకు తెలుసు. లేటుగా పుట్టిన పిల్లల చదువులింకా పూర్తవలేదు. రిటైర్ అయిన తరువాత చేతికి వచ్చిన డబ్బంతా ఏదో స్కాంలో పోగొట్టుకుంది. పూజాతో పాటు థియేటర్లకీ వాటికీ తిరుగుతూ ఉంటుంది!

నాపక్కన కూర్చుని పూరిగా చల్లపడని బీర్ కాన్లని ఖాళీ చేస్తున్న పోదార్ ని ఇంకో కుర్చీలోకి వెళ్ళమని పూజా నా పక్కన కూర్చుంది. రెండేళ్ళు లీవ్ ఆన్ విథౌట్ పే తీసుకుని, తరువాత వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుంది. ఏదో ఆన్ లైన్ సైటు అమ్మకాల్లో- మిగతావాళ్ళతో కలిపి చేరింది.
“అదేమిటి, ఎక్సెర్‌సైజూ, నడకా ఏమీ లేవా? ఇలా లావయేవు?”- ఎంత స్నేహితురాలైనా ఈ మధ్య మాటలు తగ్గిపోవడంతో సంకోచిస్తూనే అడిగేను.

“నీకు తెలియదా?”
ఎప్పుడు ఫోన్ చేసినా “ఇప్పుడు ఖాళీగా లేను. రేపు నేనే నీకు ఫోన్ చేస్తాను” అని చెప్పేదే తప్ప తనంతట తాను ఫోన్ చేసిన పాపాన్న పోతే కదా! ఏమిటి తెలిసేది!

“ఎయిర్‌పోర్టంతటా తెలుసు. నేను సెలవులో ఉన్న రెండేళ్ళూ రోజుకొక వోడ్కా బాటిల్ ఖాళీ చేసేదాన్ని. మరి సన్నబడాలంటే, అదంత సులభమా!”- తెల్లబోయి తన మొహం చూసేను.

డబ్బుకి లోటు లేదు. వాళ్ళమ్మమ్మ గ్రీన్ పార్కులో ఉన్న పెద్ద బంగ్లాని తన పేరనే రాసి పోయింది. కింద ఉన్న  తండ్రికీ, పై అంతస్థులో ఉండే పూజాకీ ఇరవై ఏళ్ళగా మాటల్లేవు-పనివాళ్ళ ద్వారా తప్ప. తనకన్నా తొమ్మిదేళ్ళు చిన్నవాడైన తమ్ముడు పెళ్ళి చేసుకుని న్యూయోర్క్‌లో స్థిరపడ్డాడు.

ఎప్పుడో, ఎవరితోనో ప్రేమలో పడి వైరాగ్యం పెంచుకుని పెళ్ళి చేసుకోలేదు. తన కుక్కలూ, ఆ పెద్ద ఇల్లే తన ప్రపంచం. వయస్సు పెరుగుతున్నకొద్దీ ఒంటరితనం వల్ల, అభత్రతాభావం పెరిగిపోతోందని చాలా ముందే తెలుసు. కానీ అది మరీ ఇలా దారి తీస్తుందని ఊహించలేదు.

“అలా తాగితే మరి నీ కుక్కలనీ, ఇంటినీ ఎవరు చూస్తున్నారు? అసలు నీకెవరు కొని పెడుతున్నారు? ఇప్పడూనా?”

“మాల్స్‌లో కొనడానికి అడ్డేముందీ? నేనే వెళ్ళి కొనుక్కునేదాన్ని. రాత్రిళ్ళు కదా తాగేది! ‘కుక్కలు’ అనకు. అవి నా పిల్లలని తెలుసు నీకు. వాటికి తిండి పెట్టిన తరువాతే తాగేదాన్ని. ఇప్పుడు హార్డ్ డ్రింక్స్ మానేసేనులే. ఇవిగో చూడు, నేనూ, ఆనా తాగిన బ్రీజర్లు”-సాక్ష్యంగా చూపించింది ఒక కుర్చీ కిందున్న రెండు ఖాళీ సీసాలని.

తిరిగి నాకు ఎప్పుడూ ఫోన్ చేయకపోడానికీ, మిగతా స్నేహితులతో లంచో, డిన్నరో ప్లాన్ చేసుకున్న ప్రతీసారీ తను మాత్రం రాకపోవడానికీ కారణం ఇదా!

వంటరితనం అంటే ఏమిటో, దాని ప్రభావం ఎలా ఉంటుందో- అర్థం అయి, భయం కూడా వేసింది.

kites-2

అటు చూస్తే తన పుట్టినరోజు జరుపుకుంటున్న టీనా ఎనిమిది నెల్ల కిందట నేను చూసిన కన్నా మరి రెండితంతలు ఊరిపోయి ఉంది. వేసుకున్న జైపూరీ పొడుగు స్కర్ట్‌ని తోసుకుంటూ, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చి ఉంది. పాదాలూ, చేతులూ ఉబ్బి ఉన్నాయి. ట్రిపిల్ చిన్ స్పష్టంగా కనిపిస్తోంది. మోచేతి పైభాగపు కండరాలు వేళ్ళాడుతున్నాయి. సగానికి పైగా నెరిసిన పొట్టి జుత్తు. చేతులకి బిగ్ బజార్లో కొనుకున్నానని చెప్పిన అర డజను రోల్డ్ గోల్డ్  గాజులు, మెడలో రెండు గొలుసులూ, పది వేళ్ళకీ అయిదు బిగుతు ఉంగరాలూ.
“పోయి, ముందు భోజనం తెచ్చుకొండి మీరిద్దరూ”- తాన్యా కూతుళ్ళిద్దరితో చెప్తోంది.

“అరవింద్ ఎక్కడ? ఇక్కడ ఉండటం లేదా?”- నిర్మొహమాటంగానే అడిగేను. అరవింద్ కిందటి ఏడేళ్ళగా తనతో సహజీవనం చేస్తున్న 64 ఏళ్ళ లాయరు. ఒకే ఇంట్లో కలిసి అద్దెకి ఉండేవారు.

“తను ముందుండే ఇంట్లోనే పక్క బ్లాకులో ఉంటున్నాడు. ఆ బిల్డింగ్లో స్వైన్ ఫ్లూ వల్ల ఇద్దరు పోయేరు. ఈ చిన్నపిల్లల వల్ల భయం. నేనే అప్పుడప్పుడూ అక్కడికెళ్ళి పలకరించి వస్తాను.”- తాన్యా పిల్లలిద్దరి వైపూ చూపిస్తూ చెప్పింది.

“ఏమిటి భోపాల్లో ఉద్యోగం మానేసేవట!”- తాన్యా వైపు ప్రశ్నార్థకంగా చూసేను.

“తను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటుందిలే” – కళ్ళు ఆర్పి నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న టీనా చేస్తున్న సైగలు అర్థం కాలేదు.

అది గమనించగానే తాన్యా  తారాజువ్వలా- అందరమూ ఉన్నామని కూడా చూసుకోకుండా తల్లి మీదకి లేచింది. ఇబ్బందిగా అనిపించి మాట మార్చేను.

ఇంతలో టీనా చెల్లెలు నీరా వచ్చింది. ‘హమ్మయ్యా  ఇంకా నేనే అందరికన్నా లేటేమో’ అనుకున్నాను. చేతిలో కార్ కీసూ, ఎంబ్రోయిడరీ చేసిన ఒక ఎథ్నిక్ పౌచూ పట్టుకుని, ఖాకీ పాంట్సూ, తెల్లటి స్లీవ్ లెస్ లినిన్ చొక్కా వేసుకుంది. మెడవరకూ ఉన్న జుత్తు సగానికి పైగానే నెరిసినా చాలా హుందాగా కనిపిస్తోంది. చేతికి పెట్టుకున్న వాచ్ తప్ప నగలూ, అలంకారాలూ ఏమీ లేవు. మొహంలో వింతైన ఆకర్షణ. అక్కకీ తనకీ ముఖ పోలికలు బాగానే ఉన్నాయి. తీసుకున్న నిర్ణయాల వల్లా, ఎంచుకున్న పార్ట్‌నర్ల వల్లా, జీవితంలో ధక్కా ముక్కీలు తిన్న టీనా మొహంలో- ముందుండే లాలిత్యం, సౌకుమార్యం ఎప్పుడు మాయం అయేయో అని నేను గమనించలేదన్న సంగతిని నీరా మొహంలో ఉన్న స్థిమితం, స్థిరత్వం జ్ఞాపకానికి తెచ్చేయి.
అనూ భోజనం మొదలుపెట్టింది. మనం కూడా ప్లేట్ తెచ్చుకుందామా?”- నీరా మాటలకి తలాడించి, నేనూ లేచేను.

“రొట్టెల్లేవా?”- నీరా అక్కని అడుగుతోంది.

“తాన్యా మీట్, కూరా చేసింది. నేను రాజమా, అన్నం వండేనంతే”- తనే అతిథిలా, టీనా మాత్రం కూర్చున్న చోటునుంచి లేవకుండానే సమాధానం ఇచ్చింది.

పోదార్ వెచ్చబడిన బీర్ తాగుతూ, పది నిముషాలకోసారి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్టు తాగి వస్తున్నాడు.

“నాకు ఆకలేస్తోంది. ఆపింక”–టీనా మందలిస్తోంది.

“ఇదిగో ఈ కాన్ పూర్తవనీ. అయినా నిన్నేమైనా ఆపేనా? నువ్వు పెట్టుకు తిను”- నిర్లక్ష్యంగా జవాబిచ్చేడు.

భోజనాలయేయి. హృదయం ఆకారంలో ఉండి, కరగడానికి సిద్ధంగా ఉన్న ఒక అతి చిన్న చాక్లెట్ కేకుని కట్ చేసింది టీనా. డ్యూటిఫుల్గా చప్పట్లు కొట్టి, తన్ని విష్ చేసి, తనకోసం తెచ్చినవేవో ఇచ్చేం మేము నలుగురు ఆడవాళ్ళం.

“ఇంక నేనూ, ఆనా వెళ్తాం. అసలే నాకు వంట్లో బాగాలేదు. డ్రైవ్ చేయడానికి ఎక్కువ ఓపిక కూడా లేదు. ట్రాఫిక్ ఎక్కువవుతుంది.”- పూజా తన బాగ్ తీసుకుని లేచింది ఆనాతో పాటు. తను కూడా వెళ్తానన్నట్టు నీరా కూడా లేచి నిలుచుంది.

వీళ్ళయితే అందరూ సౌత్ ఢిల్లీలో ఉండేవాళ్ళే. నేనే ఎక్కువ దూరం వెళ్ళాల్సినదాన్ని. ఆఫీసునుండి త్వరగా బయలుదేరి నన్ను పిక్ అప్ చేసుకోమని అర్జున్‌కి ఎలాగో చెప్పేను. ఇంకొంచంసేపు కూర్చోవడం తప్ప గత్యంతరం లేదు .

***

వాళ్ళు వెళ్ళేరో లేదో, పోదార్ టీనా పక్కనే తన్ని ఆనుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. తను ఎదురుగా ఉన్న బల్ల మీద కాళ్ళు చాపి పెట్టింది. “ఎంత లావయేవో చూడు”- తన ఆంకిల్ని వేలుతో పొడుస్తూ అంటున్న పోదార్ని రీటా వారించకపోవడం ఆశ్చర్యం కలిగించలేదు. ఆపి ఉంటే విస్మయపడి ఉండేదాన్నేమో!

“అరవింద్ రాలేదెందుకని అడిగేవు కదూ? ‘పోదార్ ఉన్నాడు కదా! మళ్ళీ నేనెందుకు!’ అన్నాడు.” టీనా హాస్యంగా చెప్పింది.

ఆ హాస్యంలో సత్యం పాలు తక్కువేమీ కాదని అర్థం అవుతూనే ఉంది.

నిస్శబ్దంగా కూర్చుని ఎదురుగా మ్యూట్లో పెట్టి ఉన్న టివి వైపు చూస్తున్నాను.

పోదార్ నావైపు తిరిగి “సాయంత్రం కూడా కొంతమందిని పిలిచేం. నువ్వుంటావు కదా”- అడిగేడు. బహువచనం!!!

“వీలవదు. అర్జున్ వస్తాడు ఒక గంటలో. నేను వెళ్ళాలి. “- నా గొంతులో అలక్ష్యం నాకే తెలుస్తోంది.
ఇంకో రెండు సిగరెట్లు కాల్చేడు.

ముళ్ళమీద కూర్చున్నట్టనిపించడం ప్రారంభం అయింది.

“రాత్రికి రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చి, భోజనం పాక్ చేయించుకుని తిరిగి వస్తాను. మళ్ళీ నువ్వు వంటలంటూ పెట్టుకోకు.”- టీనాతో చెప్తూ, పోదార్ కారు తాళాలు తీసుకుని లేచి బయటకి నడిచేడు.

చాలా సేపటినుండీ శ్వాస బిగబట్టుకుని ఉన్నానన్న సంగతి గాఢంగా ఊపిరి పీల్చుకున్నప్పుడు కానీ గుర్తుకి రాలేదు.

టీనా కళ్ళు నిద్ర భారంతో మూసుకుంటున్నాయి.

“పడుక్కో కొంతసేపు. మళ్ళీ రాత్రి కూడా మెలకువగా ఉండాలిగా!” నేను అనడమే ఆలశ్యం- సోఫా కమ్ బెడ్ బయటకి లాగి, దానిమీద వాలింది.
వెనక బెడ్రూంలోకి చూస్తే తాన్యా గాఢనిద్రలో ఉంది- చిన్నదాన్ని పక్కలో వేసుకుని.
అర్జున్ రావడానికి అరగంటైనా పడుతుంది. పోనీ ఏదైనా పుస్తకమైనా తిరగవేద్దామంటే, వాటి జాడే లేదెక్కడా.

kites-2

“ఆంటీ- ‘గ్లోబ్, గ్లోబ్’ ఆట ఆడదామా?- అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా అడిగింది పెద్ద మనవరాలు సెఫాలీ నా పక్కన కూర్చుంటూ.
“ఎలా ఆడాలో చెప్పు. ఆడుకుందాం.”- చిన్నపిల్లని నిరాశపరచదలచుకోలేదు.

ఇద్దరం దేశాల పేర్లూ, ఊళ్ళ పేర్లూ చెప్పుకుంటూ ఆడుతున్నాం.

“ఎక్కడీ టీనా ఇల్లు? ఇదే బ్లాకులో తిరుగుతున్నాను పది నిముషాలనుంచీ”-“ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అర్జున్ ఫోన్.

“నేను కిందకొచ్చి నిలబడతాను.”- సమాధానం చెప్పి నిద్రపోతున్న టీనా వైపు చూసేను. కొద్దిగా నోరు తెరిచి, సాఫ్ట్ గా గుర్రు పెడుతోంది. “సెఫాలీ, ఇంక నేను వెళ్తున్నానమ్మా. అమ్మమ్మ లేస్తే చెప్పు, నేను వెళ్ళేనని.”- బాగ్ తీసుకుని కిందకి దిగేనో లేదో- అర్జున్ కారు సందు చివర్న లోపలకి వస్తూ కనపడింది.

***

దార్లో “ఏమిటి పుట్టినరోజు విశేషాలు?”- అడిగిన అర్జున్‌తో క్లుప్తంగా చెప్పేను. “పోన్లెద్దూ, ఎవరి జీవితాలు వాళ్ళవి. తమకి ఇష్టం వచ్చినట్టు గడుపుకుంటారు. నీకెందుకు?  ఎవరినయినా తీర్పు తీర్చడానికి నువ్వెవరివి? వెళ్ళేవు, నీ స్నేహితులని కలుసుకున్నావు, వచ్చేవు. కొన్ని అనుభవాలు మనకి పాఠంగా నిలవాలి తప్పితే మనలని బాధ పెట్టకూడదు. ఇంకేదైనా మాట్లాడు.”- మాట మళ్ళించేడు.

భోజనం చేసిన తరువాత “చూసేవా వ్యవహారం?”-పూజా ఫోన్.  కోపమో, బాధో- మరింకేదో భావం.

“అర్థం కాలేదు. దేని గురించి?”

“టీనా పోదార్- వాళ్ళ నాటకాలూ. చూడలేదా? అసలే లోకంలో ఉన్నావు?”

“ఏదో అనుమానం వేసింది కానీ అసలెందుకివన్నీ తనకీ వయస్సులో? తన మానాన తన పనేదో చేసుకోవచ్చుగా!”- అయోమయంగా అడిగేను.

“అయ్యో తల్లీ! సర్వైవల్. ఈ ఏమ్వే ప్రోడక్ట్స్ అమ్మకాలతోనే తన అవసరాలన్నీ తీరుతున్నాయంటావా? పోదార్‌కి గ్రేటర్ కైలాష్‌లో తండ్రి వదిలి వెళ్ళిన మూడిళ్ళున్నాయిగా! అద్దెలు బాగానే వస్తాయి. టీనా ఖర్చులన్నీ తనే భరిస్తున్నాడు.

నువ్వంటే లేటుగా వచ్చేవు! మేము వెళ్ళినప్పటికి టీనా ఇంట్లోనే లేదు. తాన్యా వంట చేస్తోంది. లివింగ్ రూమ్లో బట్టలూ, చెత్తా చెదారం కుప్పలుకుప్పలుగా పడి ఉండాలి. నేనూ ఆనా కలిపి వాటిని టీనా గదిలో పడేసి, తలుపు మూసేసి ఇంటిని కొంచం శుభ్రం చేసేం. తెలుసా నీకు- టీనా తన పని మనిషినీ, వంటామెనీ కూడా మానిపించేసింది. తాన్యా చేతే ఇంటి పనులన్నీ చేయిస్తోంది.” ఈ సారి మాత్రం తన కంఠంలో ధ్వనిస్తున్న ఆక్రోశం అర్థం అయింది. నిట్టూర్చి ఫోన్ పెట్టేసేను.

“నువ్వు చాలా మంచివాడివి అర్జున్! “-టీవీ చూస్తున్న అర్జున్ పక్కనే కూర్చున్నాను. అర్థం చేసుకున్నట్టు చెయ్యి తట్టేడు.

ఎన్నిసార్లు పోట్లాడేను! తడి తువ్వాళ్ళు మంచం మీదే పడేస్తాడనీ, టీ తాగి కప్ అక్కడే వదిలేస్తాడనీ – ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి!

రేపట్నుంచీ మళ్ళీ అలాగే సాధిస్తాననీ తెలుసు. ఈ గిల్ట్ ఎన్నాళ్ళూ ఉండదనీ తెలుసు. కానీ ఈ సామాన్యమైన గిల్లికజ్జాల జీవితం చాలదూ సంతోషంగా బతకడానికి!

*

 

 

 

మీ మాటలు

  1. Vanaja Tatineni says:

    స్వేచ్చకి విపరీతమైన స్వేచ్చకి ఉన్న తేడా ఏమిటో తెలుసుకుంటే తెగిన గాలిపటాలు ఉండవు . కథ బావుంది కృష్ణవేణి గారు. అభినందనలు . మీరు తెలుగు వాతావరణంలో కథని వ్రాస్తే ఇంకా బావుండేది . ఆ పేర్లు అవీ కథని అర్ధం చేసుకోవడానికి ఇబ్బంది కల్గించాయి . ఎవరికీ ఎవరు ఏమవుతారో … మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సి వచ్చింది .

    • Krishna Veni Chari says:

      కథ బాగుందన్నందుకు” బోల్డు థేంక్స్ వనజగారూ. :)
      ఇకపోతే “తెలుగు వాతావరణంలో కథని” రాయడానికి ఆ వాతావరణంలో ఒక్క రోజూ గడపలేదు. ఊహించుకుని రాయాలంటే ప్రస్తుతానికి అంత సులభం కాదు నాకు. :(

    • mimicrysrinivos says:

      కథ చాలా బాగుంది. చాలామంది తమ జీవితంలో ఎదురైన సంఘటనలకు కృంగి పోయి ఆత్మహత్య చేసుకోవడమో లేక ఎదుటి వారిమీద తప్పంతా నెట్టేసి తాము బాధ్యులం కాదని తప్పించుకొంటారు. వివాహం ఒక పవిత్రమైన క్రతువో తంతో కాకపోవచ్చు. కానీ పిల్లలున్న వాళ్లు విడిపోకుండానే వుండాలి. విడిపోయినా ఇంకొకరితో కొత్త జీవితం మొదలు పెట్టడం వల్ల పిల్లల్లో ఆత్మన్యూనతా భావం గానీ స్త్రీ పురుష సంబంధాల పట్ల ఏహ్య భావం గానీ కలుగవచ్చు. కొత్త జీవిత భాగస్వామి ని సొంత తండ్రి/ తల్లిగా అంగీకరించకపోవచ్చు. లేదా కొత్త వ్యక్తులు పిల్లలను సొంతం చేసుకోలేక పోవచ్చు. ఎన్నో మానసిక సంఘర్షణలకు మూలకారణం శృంగార సంబంధాలే! ఈ కథలో టీనా తన స్వయంకృతాపరాధం వల్లనో, ఎదుటివాళ్ల దాష్టీకం వల్లనో ఒకరి తరువాత మరొకరితో సంబంధాలు పెట్టుకోవడం, మోసపోవడం జరుగుతున్నాయి. పోద్దార్ కేవలం ఆమె వల్ల లభించే ఉచిత శృంగారానికి దాసుడై డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. ఆమెని ఎప్పుడు ముట్టుకుందామా ఎప్పుడు అనుభవిద్దామా అనే చూస్తున్నాడు. పిల్లలు కూడా ఇవన్నీ చూసి మొత్తం వ్యవస్థమీదనే నమ్మకం పోగొట్టుకుంటారు. ఆమె లక్ష్యం ఎక్కువమందితో సంబంధాలు నెరపడమే అయితే చెప్పేదేమీ లేదు. ముందు తనకాళ్ల మీద తను నిలబడాలి. ఎవ్వరితో సంబంధం లేకుండా తన జీవితం తను కొనసాగించాలి. మగవాడెప్పుడూ అవకాశం వస్తే ఆడదాన్ని ఎలా వశపర్చుకుందామనే ఆలోచిస్తాడు.

      • Krishna Veni Chari says:

        మిమిక్రీశ్రీనివోస్ గారూ
        “కథ చాలా బాగుంది.”-కతజ్ఞతలు.
        మీ విశదమైన కామెంటు మీరు కథని అర్థం చేసుకున్న విధానాన్ని తెలియపరుస్తోంది. మీ పరిశీలనా, మీ విశ్లేషణా కూడా నాకు చాలా సంతోషం కలిగించాయి. థేంక్యూ.

    • mimicrysrinivos says:

      మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న మావో సిద్ధాంతం తప్పేమో అనిపించింది ఈ కథ చదివాక. దేని గురించీ పట్టించుకోక పోవడం, జీవితం ఎలా తీసుకు వెళ్తే అలా వెళ్ళడం, జరిగే వాటి గురించి, జరుగుతున్న వాటి గురించి బాధ పడక పోవడం టీనా లక్షణం అని అర్థం అవుతూనే వుంది. కాక పోతే మగవాడు మాత్రం ఆడదాని వల్ల దొరికే సుఖం కోసం తాపత్రయ పడతాడు. స్వేచ్చ మంచిదే గానీ మానవ సంబంధాలన్నిటినీ ప్రశ్నించెంత తీవ్రం గా వుండడం ఆలోచించతగిందే. పిల్లల భవిష్యత్తు కోసమైనా కొన్ని స్వీయ నియంత్రణలు పాటించాల్సి వుంటుంది. పిల్లల్ని కనడం ఎంత ముఖ్యమో వాళ్ళ భవిష్యత్తు అందంగా తీర్చి దిద్దవలసిన బాధ్యతా కూడా తల్లిదండ్రులపై, ముఖ్యంగా ఒంటరి తల్లి / తండ్రి పై వుంటుంది. కథకు తగిన మంచి శీర్షిక పెట్టారు. నిజంగా వాళ్ళందరి జీవితాలు తెగిన గాలిపటాలే.

      • Krishna Veni Chari says:

        మిమిక్రీశ్రీనివోస్ గారూ,
        Thanks a great deal for your second comment and the praise too. Your comments show that you seem to know human psychology pretty well.

    • మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న సిద్ధాంతం తప్పేమో అనిపిస్తోంది టీనా వ్యక్తిత్వాన్ని చూసాక. ఎలా జరిగితే అలా వుండడం, ఏది ఎదురైతే దాన్ని అంగీకరించడం, సమాజం గురించి, సో కాల్డ్ విలువల గురించి పట్టించుకోకపోవడం మంచి లక్షణమే గాని పిల్లలు పుట్టాక వారి మానసిక స్థితిగతులను కూడా పట్టించుకోవాలి. ఇంకా మనం కుటుంబ వ్యవస్థ అనే చట్రం లోనే వున్నాం. స్త్రీ వివాహ వ్యవస్థ కోసం పురుషున్ని అంగీకరిస్తుంది, పురుషుడు స్త్రీ వల్ల లభించే సుఖం కోసం వివాహాన్ని అంగీకరిస్తాడు అన్న చలం మాటలు కూడా అబద్ధమని టీనా జీవితం చెబుతోంది. మీ కథనం, శైలి బావున్నాయి. మన చుట్టూ ఉన్న సమాజం లోంచే ఎన్నో కథా వస్తువులు దొరుకుతాయి అనడానికి తెగిన గాలిపటాలు చక్కటి ఉదాహరణ. అభినందనలు.- మిమిక్రీ శ్రీనివాస్.

  2. ఈ కాలంలో స్వేచ్చకు నిర్వచనం ఇదేనేమో !

    • Krishna Veni Chari says:

      పి జయప్రకాశ రాజుగారూ,
      థేంక్యూ.
      స్వేచ్ఛో, లేకపొతే కొన్ని జీవితాలు అలాగే గడుస్తాయో మరి.

  3. Wilson Sudhakar Thullimalli says:

    కాలంతో పాటే మనుషులునూ. నగరాలలో వుండే స్త్రీ పురుషులు జంటలు ఇదివరకులా ఇష్టం లేకున్నా పడివుండడం లేదు. మనుషులు లావు సన్నము అని కాకుండా ఆనందంగా వున్నారా లేదాని మాత్రమే చూడాలి. ‘లివ్ ఇన్’ సంబంధాలు ఇంతకూ ముందు వున్నాయి. వాటిని ‘అక్రమ సంబంధాలు’ అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళం. అంతే తేడా. కథ వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. బాగా చేయి తిరిగింది కృష్ణ వేణి గారికి. కంగ్రాట్స్.

    • Krishna Veni Chari says:

      విల్సన్ సుధాకర్ తుల్లిమల్లగారూ,
      “‘లివ్ ఇన్’ సంబంధాలు ఇంతకూ ముందు వున్నాయి. వాటిని ‘అక్రమ సంబంధాలు’ అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళం. అంతే తేడా.”- పూర్తిగా నిజం
      బోల్డూ థేంక్స్ మీ కామెంటుకి.

    • డిల్లి మధ్యతరగతి ప్రజల పై టైంస్ ఆఫ్ ఇండియా, హిందుస్తాన్ టైంస్ పేపర్ల ప్రభావం చాలా ఉంట్టుంది. అక్రమ సంబంధాలకు, లివ్ ఇన్ రిలేషన్ అనే పేరు పెట్టి ,ఇంగ్లిష్ ప్రింట్ మీడీయా మోడరన్ ఉమెన్ ని చాలా బోల్డ్ గా ప్రొజెక్ట్ చేస్తుంది. అక్రమ సంబంధం అర్థం వచ్చే విధంగా ఉండే పాతపదం వాడితే అది పురుషాధిక్యతను సూచిస్తుంది. అందువలన మధ్యతరగతికి మోడరనిటిని పేపర్ లో ప్రొజెక్ట్ చేసే ఇంగ్లిష్ మీడీయా వారు లివ్ ఇన్ రిలేషన్ షిప్ అని గొప్పగా రాస్తూంటారు. పేరులో ఏముంది అని, మీరిలా తేలికగా తేల్చేస్తే ఎలా? :)

      • Krishna Veni Chari says:

        >డిల్లి మధ్యతరగతి ప్రజల పై టైంస్ ఆఫ్ ఇండియా, హిందుస్తాన్ టైంస్ పేపర్ల ప్రభావం చాలా ఉంట్టుంది.<
        బహుసా ఆ విధమయిన మధ్య తరగతిని గమనించే ఆ పేపర్లు "లివ్ ఇన్ రిలేషన్" గురించి రాస్తేయనుకుంటాను మరి శ్రీరామ్‍ గారూ!!!
        ""పేరులో ఏముంది అని, మీరిలా తేలికగా తేల్చేస్తే ఎలా?""
        అర్థం కాలేదండీ. నేనెలా దేన్నీ తేల్చేసేను???
        " పేరులో ఏముంది?" అని నేను అనలేదే!!!
        థేంక్యూ-చదివి కామెంట్‍ పెట్టినందుకు. :)

  4. Sailaja Chandu says:

    కృష్ణ వేణి గారూ, అభినందనలు. చాలా బాగుంది. ఎన్నో సార్లు కథలు చదవడం మొదలెట్టి, మధ్యలో వాక్యాలు స్కిప్ చేస్తూ పోతాను. అలాగ కాకుండా మీరు మొత్తం చదివించారు.
    ఒక్క చోట ఎక్కడో టీనా బదులు రీటా అని ఉంది. మీ observation చాలా గొప్పది. అదే మిమ్మల్ని ఇంకా కథలు వ్రాయిస్తుంది.

    • Krishna Veni Chari says:

      శైలజా చందుగారూ,
      “అలాగ కాకుండా మీరు మొత్తం చదివించారు.””-థేంక్యూ, థేంక్యూ. :)
      “టీనా బదులు రీటా”- సరిగ్గా ప్రూఫ్‍ రీడ్‍ చేయలేదనుకుంటాను.

  5. మంచి కధ ఆద్యంతం ఏక బిగిన చదివించింది . మా వీధిలో ఇలాంటి తెగిన గాలి పటాల జీవన శైలిని గమనిస్తూ ఉంటా . నిట్టూర్చి ఊరుకుంటా .

    • Krishna Veni Chari says:

      >మంచి కధ ఆద్యంతం ఏక బిగిన చదివించింది మా వీధిలో< అవునా? చాలామంది ఈ కథని అన్వయించుకోలేరేమో అనుకున్నాను. థేంక్యూ ఎగైన్‍

  6. Illu neat ga unchukoka podam oka rakamaina manasika rogam kadaa??

  7. ఇంటి ని అక్కడి వాతావరణాన్ని బాగా వర్ణించారు

    • Krishna Veni Chari says:

      నీలిమగారూ, మీ రెండు కామెంట్లకీ ఇక్కడే సమాధానం ఇస్తున్నాను. ఇల్లు నీటుగా పెట్టుకోకపోవడానికి మానసిక రోగమే అయి ఉండాలని లేదనుకుంటాను. పట్టించుకోకపోవడం, బద్ధకం కూడా అవవచ్చేమో. అంత తెలియదు.
      “బాగా వర్ణించేను” అన్నందుకు కృతజ్ఞతలు.

    • Krishna Veni Chari says:

      థేంక్యూ నీలిమగారూ. బహుశా అది కథకి అన్వయిస్తుందేమోనని చేసిన ప్రయోగం అంతే.

  8. సాయి పద్మ says:

    వొక వాతావరణం లో ఉన్న వాళ్లకి వేరే వాతావరణం తెలీదు. మాకు తెలీని కొత్త వాతావరణాన్ని పరిచయం చేసారు. భలే కధ. నగర వాతావరణం లో , వొంటరి తనం బోలుతనం .. చాలా బాగా చెప్పేరు.. కృష్ణ గారూ .. మీలో మంచి కధకురాలు ఉంది .. చాలా చోట్ల వ్యంగ్యం భలే మెరిసింది.

    • Krishna Veni Chari says:

      సాయి పద్మా,
      “మాకు తెలీని కొత్త వాతావరణాన్ని పరిచయం చేసారు.”-నిజంగానేనా?
      అంత మెప్పుకీ నేను చెప్పగలిసేదల్లా “ బోల్డు ధన్యవాదాలు” అని మాత్రమే.

  9. బాగుంది

  10. కృష్ణవేణిగారూ, కథ చాలా బావుంది. అసలెక్కడా ఆపకుండా చదివాను… పైకి ఎంత నవ్వుతూ ఉన్నా లోపలెక్కడో అంతర్లీనంగా టీనా లాంటి వాళ్ళు అభద్రతాభావంతో బాధపడుతుంటారు. ఆ బాధ శారీరకంగా కనిపిస్తుంది. ఇంటి వాతావరణంలోనూ కనిపిస్తుంది. పిల్లల పెంపకం మీదా పడుతుంది. లివ్ ఇన్ సంబంధాలు మంచివా కాదా అనే విషయం ప్రక్కన పెడితే ఈ కథలో టీనా అలాంటి సంబంధంలో కూడా లేదు. ఆమె ఒకేసారి ఇద్దరితో సంబంధాలు పెట్టుకున్న స్త్రీ. కాబట్టి ఆమె జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్న అభాగ్యురాలు. నిన్న నిడదవోలు మాలతి అక్క తన టైమ్ లైన్ లో (రాసిన పోస్ట్) – “దుర్మార్గం, దౌర్జన్యం, హింస, అందహీనం – కట్టెదుట కనిపిస్తున్నది కనిపించినట్టు కాక, ఆ వెనక తాను దర్శించగల మరొక కొత్తకోణం, మార్గదర్శకం కాగల మరొక కోణం ఎత్తి చూపడానికి ప్రయత్నించాలి ఈనాటి రచయిత” అన్నారు. మీరు ఈ కథ ద్వారా దాన్ని సాధించారు. మంచి రచయిత అయ్యారు. ఆలోచింపచేసే కథ. అభినందనలు. ఇకపోతే మీరు ఏమీ అనుకోరని కొన్ని సూచనలు – 1. కథని ఎడిటింగ్ చేసుకోవాలి తప్పులు లేకుండా 2. కథని చెప్తున్నది ఆడవాళ్ళా, మగవాళ్ళా అనేది ముందుగానే మొదటి పేరా లేదా రెండో పేరాలోనే తెలియచేయాలి 3. పేర్లు తెలుగు వాతావరణానికి దగ్గరగా ఉన్నట్లయితే బావుండేది. (టీనా, ఆనా, తాన్యా, నీరా – అన్నీ ఒకేలా లేవూ!!?) మరోసారి అభినందనలు, చప్పట్లు – మీ రాధ

  11. Krishna Veni Chari says:

    రాధగారూ,
    > మీరు ఈ కథ ద్వారా దాన్ని సాధించారు< బోల్డు థేంక్స్.
    మీ సూచనలన్నీ పనికొచ్చేవే. ఎందుకేమీ అనుకుంటాను? ఇలా చెప్తే ఇంప్రూవ్ చేసుకోగలను కదా! పేర్ల” గురించైతే- కథ అచ్చయేక, అవి ఒకేలా ఉన్నాయని నాకూ అనిపించింది. అదేకాక ఒక చోట రీటా అని రాసి మళ్ళీ ఇంకో చోట టీనా అని కూడా రాసేను. శైలజగారు చెప్తే తప్ప నేనసలు చూసుకోను కూడా లేదు.
    మీరు చాలా వివరంగా చెప్పేరు. దానిక్కూడా మళ్ళీ థేంక్యూ.
    నిడదవోలు మాలతి గారి లిస్ట్లో నేను లేను. అందుకే ఆమె రాసినదేదో చూడలేదు మరి.

  12. Ramakrishna Pukkalla says:

    కథకు “తెగిన గాలి పటాలు” పేరు చక్కగా కుదిరింది. సమాజంలో టీనా లాంటి మహిళలు ఇంచుమించుగా అన్ని తరగతులలో తారసపడుతుంటారు. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన వాళ్ళలో కొందరు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వరు. మిన్ను విరిగి మీద పడినా చలించరు. ముగింపు బాగుంది. కాకుంటే మీ శైలీలో కొంత స్పష్టత కరువైంది. చిన్న చిన్న తప్పుల్ని సవరించుకుంటే చదవడానికి ఇంపుగా వుంటుంది ఆద్యంతం. అభినందనలు కృష్ణ వేణి చారి గారు. మీ నుండి మరిన్నీ మంచి రచనలు కోరుకుంటున్నాను.

    • Krishna Veni Chari says:

      రామక్రిష్ణ పుక్కళ్ళగారూ,
      ఓపికగా చదివి కామెంట్ పెట్టినందుకు థేంక్యూ.
      “”శైలీలో కొంత స్పష్టత కరువైంది. చిన్న చిన్న తప్పుల్ని సవరించుకుంటే చదవడానికి ఇంపుగా వుంటుంది ఆద్యంతం.””
      ఈసారి కనుక ఏదైనా రాస్తే, మీ సూచనలని తప్పక జ్ఞాపకం పెట్టుకుంటాను. థేంక్స్ ఎగైన్

  13. కృష్ణ వేణి చారి గారు…. మీకు చక్కని కధన శైలి ఉంది..అంటే విషయాన్ని చక్కగా చదివించగలిగే శైలి ఉంది..కధ కి పేరు బాగా యాప్ట్ అయింది…కానీ రాధ గారు అన్నట్లు ఎడిటింగ్ చేయాల్సి ఉంది…పూర్తిగా అని పడవలసిన చోట పూరిగా అని పడింది…రీటా పేరు కూడా…ఇంకొక జాగ్రత్త…ఏంటంటే తీసుకోవలసినది.పాత్రల..పరిచయాలు గందరగోళం గా ఉండకూడదు..ఇంకొంచెం స్పష్టత ఉండవలసి ఉంది…పేర్లు గురించే కాక…అసలు వారు టీనా పిల్లలా…….అని కూడా ముందు కన్ఫ్యూజ్ అయాను..పూజా..ఆనా ని….పోదార్ ని…తరువాత చదివే కొద్ది కానీ పూజ..ఆనా ఫ్రండ్స్ అనీ…..తాన్యా పెళ్లి చేసుకుని ఇద్దరుపిల్లలని కనేంత పెద్దదయిందనీ…పోదార్…మళ్లీ టీనా తో వ్యవహారం నడుపుతున్నారు అనీ …అర్ధమవలేదు..చివర ముగింపు..వారితో పోల్చుకుని నేనెంత బెటరో అని నిట్యూర్పుతో ముగిసింది…కధ మొత్తం..టీనా..వ్యవహారం…పూజా..ఆనా ల గాలిపటం లాటి జీవితాల వర్ణన తోనే సరిపోయింది…ఇంటి వర్ణన….చక్కగా కుదిరి అస్తవ్యస్తంగా ఉన్న వారి జీవితాలను ప్రతిబింబించింది…అది చదువుతుంటేనే…ఇంటిపై..ఒంటిపై జీవితం పై వారి నిర్లక్ష్యమో..బధ్ధకమో స్పష్టంగా తెలుస్తుంది…చదువరులకూ…టీనా గురించి కాన్సంట్రేషన్ పెడితే కధకి ఇంకొంచెం న్యాయం చేకూరేదేమో…పూజాని..ఆనాని కూడా తీసుకునేప్పటికి కొంచెం మెస్సీ గా ఉందేమో అనిపించింది…కధ ముగింపుకి కూడా…ఇంకొంచెం మెరుపులద్దాలి…రెండు వాక్యాలతో కాక…తన జీవితం…ఎన్నిరెట్లు బెటర్ గా ఉందో..గాలిపటాలతో పోల్చుకుంటే…అనేది…ఇంకొంచం ఫర్మ్ గా…చక్కటి ప్రయత్నం..నో డౌట్..కొత్తగా ట్రై చేశారు..కంగ్రాట్స్…ఇవన్నీ మీ మెరుగులకు సూచనల గానే తీసుకోగలరని భావిస్తూ.ప్రేమతో ..మీ సరళ …

    • Krishna Veni Chari says:

      సరళ కొడాలిగారూ,
      ఇంత వివరమయిన వ్యాఖ్యకి బోల్డు ధన్యవాదాలు.
      ముందంటూ ఏదైనా రాస్తే కనుక మీ సూచలన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటాను. థేంక్యూ వెరీ మచ్

  14. S. Narayanaswamy says:

    Good points: Excellent narration and ability to paint vivid pictures of the scenes and people. If done in theater or film, it would be called Mise en scène! Well done.
    Things to take care of – too many names and details crammed into a short story.
    Keep writing

    • Krishna Veni Chari says:

      Thank you very much Narayana Swamigaaru ,for reading and commenting too.
      Yes. I will take care of these things next time around if anyone is willing to publish what I write

  15. Dattamala says:

    టీనా ఎవరో తెలియక పోయిన తన జీవితంలోని చీకటి కోణాలు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.
    మీ రచన చాల బాగుంది.

  16. Krishna Veni Chari says:

    దత్తమాలగారూ
    “టీనా ఎవరో తెలియక పోయిన”- నాకూ ఏ ప్రత్యేకమయిన టీనా తెలియదు. చుట్టుపక్కల మనుష్యల జీవితాలని గమనిస్తూ ఉన్నప్పుడు రూపు సంతరించుకున్న ఒక పాత్రంతే.
    “మీ రచన చాల బాగుంది”- బోల్డు థేంక్స్

  17. Jayashree Naidu says:

    అస్తవ్యస్తంగా వున్న గదిలాంటి జీవితాల్ని ఒక విహంగ వీక్షణంగా చూపించారు… ముగింపు ముచ్చటగా వుంది.
    *** రేపట్నుంచీ మళ్ళీ అలాగే సాధిస్తాననీ తెలుసు. ఈ గిల్ట్ ఎన్నాళ్ళూ ఉండదనీ తెలుసు. కానీ ఈ సామాన్యమైన గిల్లికజ్జాల జీవితం చాలదూ సంతోషంగా బతకడానికి!****
    మామూలు భార్యా భర్తల సంభాషణతో ముగింపునివ్వడం మీ మాస్టర్ స్ట్రోక్ అనుకోవచ్చు. నైస్ స్టోరీ… వేణి గారు!

  18. Krishna Veni Chari says:

    జయశ్రీ నాయుడుగారూ,
    బోల్డు థేంక్యూలు. “మాస్టర్ స్ట్రోక్” లాంటివి నా మట్టి బుర్రకి తట్టవు. కానీ మీ ఇంటర్‌ప్రెటేషన్ మట్టుకు చాలా నచ్చింది. థేంక్స్ ఎగైన్.

  19. నీహారిక says:

    తెలుగు రాదంటూనే రచయిత్రి అయిపోతున్నారు కదా ? లోపాలేవిటో చెప్పేసారు కాబట్టి మళ్ళీ చెప్పడం లేదు గానీ ప్రచురణకు ముందు ఎవరితోనైనా ప్రూఫ్ రీడింగ్ చేయించుకుంటే తప్పులు రావనుకుంటా ! ఎప్పటిలాగే కధనం బాగుంది.

    “కటీ పతంగ్” లకు “రాజేష్ ఖన్నా”లు దొరకరంటారా ?

    • krishna Veni Chari says:

      > తెలుగు రాదంటూనే రచయిత్రి అయిపోతున్నారు కదా ?<“ ఏదో నాలుగు కాలమ్స్, రెండు కథలూ రాసినంత మాత్రాన్న “ రచయిత్రిని” ఎలా అవగలను నీహారికగారూ? మీకూ తెలుసు గతంలో నాకొచ్చిన తెలుగెంతో.
      “ఎవరితోనైనా ప్రూఫ్ రీడింగ్ చేయించుకుంటే తప్పులు రావనుకుంటా”-అది అసలు నా పనే కదా! కాకపోతే ఆ పని సరిగ్గా చేయలేదంతే. :(
      “ఎప్పటిలాగే కధనం బాగుంది.”-థేంక్యూ, థేంక్యూ.-“బోల్డు” అని కూడా ఆడ్ చేసుకోండి.

  20. కథ కొత్తగా బాగుందండి కృష్ణవేణి గారు.

  21. Krishna Veni Chari says:

    మాలగారూ,
    మొదటిగా- చదివి కామెంట్‍ పేట్టినందుకు బోల్డు కృతజ్ఞతలు.
    “కథ కొత్తగా”- మనం రాసే కథలు మనకి తెలిసినవారి జీవితాల్లో నుంచే పుట్టుకు వస్తాయి కదండీ.
    కాకపొతే ఇది “కథ” కాబట్టి కొంత ఫిక్షనూ కొంత యదార్థమూ కూడా ఉందంతే. థేంక్యూ.

  22. ఆర్.దమయంతి. says:

    కొన్ని చిన్న గీతల్ను, వంకరపోయిన బ్రతుకుల్నూ దగ్గర్నించీ చూడటం వల్ల,
    మన లై ఫ్ క్లారిటీ ఎంత స్థాయిలో వుందన్న సంగతి ఇట్టే అర్ధమై పోతుంది. అద్దం పట్టినట్టు. ఆ తేడా కొట్టొస్తో కానొస్తుంది.
    ఎన్ని ధవళ పట్టు వస్త్రాలో.. దుమ్ముకొట్టుకుపోయి, బూజు గదుల్లో పీలికలై వేలాడుతుంటాయో..
    చూసినప్పుదల్లా తెలీని ఒక వైరాగ్యం నన్నూ చుట్టుకుంటుంది. ఆ కాసేపు, మనసు మనసులో వుండదు. మూడ్ మారిపోతుంది.
    ఇలాటి వారి జీవన చరమాంకం ఎలా, ఏమిటన్నది – ఎప్పటికీ పెద్ద ప్రశ్నే.
    చాలా బాగారాసారు కధని కృష్ణవేణి గారు! మీ కథ ఎంత స్వచ్చం గా వుందంటే – సత్యమంత సత్యం గా అని చెప్పక తప్పదు.
    మీకు నా హృదయపూర్వక అభినందనలు.

    • Krishna Veni Chari says:

      దమయంతిగారూ,
      “ఇలాటి వారి జీవన చరమాంకం ఎలా, ఏమిటన్నది – ఎప్పటికీ పెద్ద ప్రశ్నే.- నిజమే.
      చాలా చాలా థేంక్స్ –మీకు నచ్చినందుకు.

  23. Venkata S Addanki says:

    తమకి తాము జీవితాన్ని అశ్రద్ధ చేసుకుంతే ఆ జీవితాలూ తెగిన గాలిపటాలే చాలా బాగా వివరించారండి , కొత్తరకాల జీవన శైలులు . మీ కధలలో , వ్యాసాలలో ఈ కొత్తకోణాలు అక్కట్టుకోవడమే కాదు, ఆలోచింపజేస్తాయి అభినందనలు.

    • Krishna Veni Chari says:

      వెంకట్ ఎస్ అద్దంకిగారూ,
      మీ పొగడ్తకి బోల్డు థేంక్స్

  24. క్రిష్ణవేణి గారు, మీరి కథలో డిల్లి వాతావరణాన్ని చక్కగా ప్రతిభింబించారు. డిల్లి మధ్యతరగతి ప్రజలు చాలా అగ్రెసివ్ గా ఉంటారు. కఠినత్వం, వ్యక్తివాదం, కుటుంబ బందాలను, అనుబంధాలను సైతం ఏమాత్రం లెక్క చేయకపోవటం,డబ్బుకు, సక్సెస్ ఎనలేని ప్రాముఖ్యత నివ్వటం డిల్లి లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా మెట్రో సిటిలలో ఈ గుణాలను అంతగా చూడలేదు.

    ఒక అనుభవం రాస్తున్నాను. మా ఎదురింటాయనకు(77 సంవత్సరాలు ), తెల్లవారు ఝామున 3 గంటలకు హార్ట్ అటాక్ వస్తే, కారులో తీసుకొని వెళ్ళి, మంచి కార్పోరేట్ ఆసుపత్రిలో డబ్బులు కట్టి చేర్పించాను.
    పక్క వీధిలోనే ఉన్న కూతురికి పోన్ చేసి తండ్రి పరిస్థితి చెపితే ఏ మాత్రం భావోద్వేగం లేదు. అలాగా
    అనింది అంతే. ఆసుపత్రికి వస్తాను అని కూడా అనలేదు. ఆయనను చూడటానికి తీరికగా పక్కరోజు వచ్చింది. మిగతా పిల్లలు ఎవ్వరు చూడటనికి రాలేదు. ఆయనకు భార్య లేదు. నేను ఆ రోజు శెలవు పెట్టి ఆసుపత్రిలో ఉండిపోయాను.మానవ సంబంధాలు అంత దిగజారిన స్థితిలో చూసినపుడు షాకింగ్ గా ఉంట్టుంది. కొన్నేళ్ళ తరువాత ఆయన చనిపోతే, కోటి రుపాయలపై విలువగల ఇంటిని, బతికి ఉన్నపుడు తండ్రికి ఒక్కరోజు నయాపైసా సహాయంచేయని కుతురే తీసుకొంది.

  25. Krishna Veni Chari says:

    శ్రీరామ్ గారూ,
    “క్రిష్ణవేణి గారు, మీరి కథలో డిల్లి వాతావరణాన్ని చక్కగా ప్రతిభింబించారు. డిల్లి మధ్యతరగతి ప్రజలు చాలా అగ్రెసివ్ గా ఉంటారు. కఠినత్వం, వ్యక్తివాదం, కుటుంబ బందాలను, అనుబంధాలను సైతం ఏమాత్రం లెక్క చేయకపోవటం,డబ్బుకు, సక్సెస్ ఎనలేని ప్రాముఖ్యత నివ్వటం డిల్లి లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. “”
    ఇక్కడ కూడా మామూలుగా కాపురాలు చేసుకుంటూ, పొద్దున్నే లేచి వంటలు వండుకుని, పిల్లలని స్కూలుకి పంపించి- పనులకి వెళ్ళి, మామూలు జీవితాలు గడిపే ఆడవాళ్ళు తొంబై శాతం పైనే. కాకపోతే వాళ్ళ గురించి రాస్తే రాస్తే కనుక ఎవరు చదువుతారు?
    ఇకపోతే మీరు చెప్పిన మీ “ఎదురింటాయన అనుభవం అన్నది ఢిల్లీలోనే కాదు- ఏ రాష్త్రానికయినా, ఏ పల్లెటూళ్ళకయినా అన్వయిస్తుందనుకుంటాను.
    దానికీ, లివింగ్ -ఇన్ సంబంధాలకీ ముడిపెట్టలేమేమో!!!
    మీరాయన్ని హాస్పిటల్లో చేర్చి దగ్గిరుండి చూసుకోవడం చాలా అభినందనీయకరం.
    థేంక్యూ- మీరు కథని అర్థం చేసుకుని రెండో కామెంట్ పెట్టినందుకు.

    • లివ్ ఇన్ రిలేషన్ కి పైన రాసిన దానికి సంభంధంలేదు. ఢిల్లి లో మానవసంభందాలు (ముఖ్యంగా మధ్యతరగతి) చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పటానికి పై అనుభవం రాశాను.
      ఇటు వంటి కథలు ఇతర ప్రాంతాలలో ఉండవచ్చు. కాని ఢిల్లి మధ్యతరగతి ప్రజల జీవనశైలే వేరు.

  26. Krishna Veni Chari says:

    శ్రీరామ్‍ గారూ,
    థేంక్యూ.

  27. కిరణ్ కుమార్ కే says:

    >> మీరు తెలుగు వాతావరణంలో కథని వ్రాస్తే ఇంకా బావుండేది . ఆ పేర్లు అవీ కథని అర్ధం చేసుకోవడానికి ఇబ్బంది కల్గించాయి . ఎవరికీ ఎవరు ఏమవుతారో … మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సి వచ్చింది .

    నాకు అలాగే అనిపించిందండి. అలవాటు ఉన్న పేర్లు ఉంటే కథ చదువుతూ కారెక్టర్ లను గుర్తు పెట్టుకోవటం కొంత సులభం అవుతుంది.

    కథ చక్కగా రాసారు. ఎన్నో కోణాలను చక్కగా చూపించారు. అభినందనలు.

    “కొన్ని అనుభవాలు మనకి పాఠంగా నిలవాలి తప్పితే మనలని బాధ పెట్టకూడదు.”
    బాగా నచ్చిన వాక్యం :)

    • Krishna Veni Chari says:

      కిరణ్‍ కుమార్‍ కె గారూ,
      ” అలవాటు ఉన్న పేర్లు ఉంటే కథ చదువుతూ కారెక్టర్ లను గుర్తు పెట్టుకోవటం కొంత సులభం అవుతుంది.”- పూర్తిగా ఒప్పుకుంటున్నానీ మాటతో.
      మీ పొగడ్త బోల్డు సంతోషం కలిగించింది.
      థేంక్యూ.

  28. Aranya Krishna says:

    ఈ మధ్య కాలంలో నేను చదివినంత వరకు వచ్చిన వైవిధ్యమైన కధల్లో ఇదొకటి. ఢిల్లీ వంటి మెట్రో నగరంలో చోటు చేసుకున్న ఒక స్త్రీ అగమ్య జీవన కధ. ఈ కధకి నాయకి అయిన టీనా వంటి జీవితాల్ని ఉద్దేశించి రచయిత్రి “తెగిన గాలిపటాలు” అన్నారు. తెగిన గాలిపటాలు గాలివాటుగా కొట్టుకుపోతుంటాయి. సమాజం నిర్దేశించిన దాంపత్య జీవన విధానానికి కట్టుబడలేక బేషరతు స్త్రీ -పురుష సంబంధాలు (లివ్ ఇన్ రిలేషన్)ను ఆశ్రయించిన వారి జీవనరీతులెలా పరిణమిస్తున్నాయో తెలిపే కధ ఇది. ఒక్క కధలోనే వ్యవస్థ తాలూకు మంచి చెడుల్ని చూపటం, చర్చించటం చాలా కష్టం. ఈ కధకి ఆ పరిమితులు సహజంగానే వున్నాయి. సమాజం ఆమోదించిన లేదా ఏర్పరిచిన వివాహవ్యవస్థ యొక్క మంచి చెడుల్ని ఈ కధ చర్చించి, లివ్ ఇన్ రిలేషన్ సంబంధాన్ని దానితో పోల్చి ఒకటి మంచి లేదా మరొకటి చెడు అని చెప్పకపోయినప్పటికీ లివ్ ఇన్ రిలేషన్ చుట్టూ ఆవరించిన మానవసంబంధాలలో వున్న బాధ్యతారాహిత్యం, అన్ టైడీ వాతావరణం, నిర్లక్ష్య ధోరణులు, పెడదారులు వంటి అంశాల్ని ఎంతో బలంగా మనసుకి హత్తుకునే విధంగా రాసారు రచయిత్రి. ఆమె పరిశీలనా శక్తిని అభినందించాల్సిందే. అయితే కధ మొత్తం ఉత్కంఠగా చదివిన నాకు కొన్ని మౌలికమైన సందేహాలు వచ్చాయి. అసలు లివ్ ఇన్ రిలేషన్ అనే అవగాహన ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నలు అనివార్యం. ఎక్కడ్నుండి వచ్చిందనే దానికి వెంటనే సమాధానం వచ్చేస్తుంది “ఇదో పాశ్చాత్య పెడ ధోరణి” అని. ప్రతి పాశ్చాత్య జీవన ధోరణి మన జీవితంలోకి రాలేదే! మీ దేవుళ్ళు, ఆచారాలు, సంప్రదాయాలు బలంగానే పాటిస్తున్నారు కదా. అయినా ఎన్నో వేల సంవత్సరాల భారతీయ వైవాహిక వ్యవస్థకి ఇప్పుడే ఎందుకు బెదిరింపులు ఎదురౌతున్నాయి? స్త్రీలు చదువుకుంటున్నారు. ఆత్మగౌరవ ఆధారిత స్వతంత్ర జీవన కాంక్షని బలంగా వ్యక్తీకరిస్తున్నారు. మన వైవాహిక వ్యవస్థ ఈ కాంక్షని ఎంతవరకు గౌరవిస్తున్నది? జిల్లాని పరిపాలించే ఐఏఎస్ మహిళాధికారి కూడా తన శతమానాలు పరిఢవిల్లాలని వ్రతాలు చేసుకోవాల్సిందేగా. అంటే ఆమె ఉనికి భర్త ఆధారితమేగా. మామూలు స్త్రీలు ఎంత హింస, కట్టడిని అనుభవిస్తున్నారు? బాగా చదువుకున్న అమ్మాయిలు తమ అమ్మల్ని, పిన్నుల్ని, అత్తల్ని చూసి తాము కూడా ఈ రొంపిలోకి చిక్కుకోకూడదని అనుకుంటే అది వారి తప్పా? ఎంతమాత్రమూ ప్రజాస్వామిక విలువలు లేని వ్యవస్థని తోసిరాజనాల్సిన పరిస్తితులు లేవా నిజంగా? ఇది నిజంగా బాగు చేసుకోదగ్గ, బాగు చేసుకోగలిగిన వ్యవస్థేనా అసలు? అయితే ప్రత్యామ్నాయంగా వచ్చిన లివ్ ఇన్ రిలేషన్లో కూడా పురుషుడే స్త్రీని శారీరికంగా, మానసికంగా ఇంకా బాగా దోచుకోగలడని, మరింత బేఫికర్ గా మనగలడని మన వివాహ వ్యవస్థలోని అసంబద్ధ్తను, హింసను, అప్రజాస్వామికతనూ ఈసడించే పురోగామిశక్తులు కూడా భావిస్తున్నారు. ఆస్ట్రేలియా వంటి పాశ్చాత్య సమాజాల్లో లివ్ ఇన్ రిలేషన్ కి చట్టబద్ధత కూడా వుందని విన్నాను. అయితే మళ్ళీ మన వ్యవస్థ దగ్గరకొస్తే అది వైవాహిక సంబంధమైనా లేదా లివ్ ఇన్ రిలేషన్ అయినా స్త్రీ తన మనసు, శరీరం మీద మరొకరి ఆజమాయిషీని, యాజమాన్యాన్ని ధిక్కరించి, తాను పూర్తిగా తన స్వాధీనంలో వున్నాననే ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని అట్టి సంబంధంలోకి ప్రవేశించే ముందుగానే ప్రకటించగలగాలి. ఎంత స్థైర్యంగా ప్రకటించగలగాలి అంటే ఆమెని ఎవరూ ఏమీ చేయలేమన్నంతగా నమ్మకం కలిగేలా ప్రకటించాలి. తన ఆర్ధిక వ్యవహారలు, లైంగికేచ్చ, పిల్లల్ని కనటం వంటి విషయాల్లో తనదే నిర్ణయం అని తాను బలంగా నమ్మగలగాలి ముందు. అంతటి చైతన్యం తెచ్చుకోవాలి. లేకుంటే లివిన్ రిలేషన్ కూడా వివాహ సంబంధం స్థానంలో ఎడమ చెయ్యి తీసి పుర్ర చెయ్యి పెట్టినట్లే వుంటుంది. లివ్ ఇన్ రిలేషన్ కి చట్టబద్ధత కల్పించాలి (ఏదో గృహ హింసా చట్టం పరిధిలోకి తెచ్చామనటం చాలదు). స్త్రీలు కూడా తమ ప్రేమ, మోహం, భావోద్వేగం వంటివన్నీ తమ మనశ్శరీరాలు, ఆత్మ గౌరవాన్ని మించినవేమీ కాదని అర్ధం చేసుకోవాలి. తన సహచరుడి కెరీర్, హాండ్సమ్నెస్ పట్ల క్రేజీగా వుండటం కాకుండా అతని ప్రవర్తనా సంస్కృతి ఎటువంటిదో గమనించాలి. సామాజికంగా ఉన్నత స్థానాలు ఉన్నత భావాలకు హామీ పడవనే ఎరుకతో ఉండాలి. ప్రవర్తనాపరమైన కంపాటిబిలిటీ లేకుండా ఏ సంబంధమూ నిలబడదు. స్త్రీ పురుష సంబంధాల్లో ఆరోగ్యకరమైన, దైహికంగా శాస్త్రీయమైన, ప్రజాస్వామికమైన అవగాహన పెరగాలి. అప్పుడు లివ్ ఇన్ రిలేషన్ సంబంధాలు తెగిన గాలిపటాల్లా కొట్టుకుపోవు. మరో విషయం ఏమిటంటే లివిన్ రిలేషన్ని అక్రమ సంబంధాలతో పోల్చి రెండు ఒకటేనని కొంతమంది నైతిక, రుజు వర్తన, పవిత్రతా ప్రియులు తేల్చి పడేస్తున్నారు. అక్రమ సంబంధాలు కేవలం వివాహేతరమైనవి. అంటే వివాహవ్యవస్థని వ్యతిరేకిస్తూ ప్రత్యామ్నాయంగా వచ్చినవి కావు. దాంపత్య సంబంధాల్లోని అసంతృప్తితో మరో సంబంధం పెట్టుకోవటం “అక్రమ సంబంధం” కిందకి వస్తుంది. నిజానికి ఇది తాము పవిత్రులమనుకునే వారు ఇతరుల మీద ఇచ్చే నైతిక తీర్పు (మోరల్ జడ్జ్ మెంట్). స్త్రీ పురుషుల మధ్య అంతరాలకు సంబంధించిన అవగాహనల్లో వ్యవస్థీకృత మార్పు లేనంతవరకు ఏ రకమైన సంబంధమైనా ఘోరంగా వుంటుంది. లివ్ ఇన్ రిలేషన్ తెగిన గాలిపటమైతే సాంప్రదాయిక వైవాహిక దాంపత్య సంబంధం అసలు ఎగరేయని గాలిపటం. అయితే ఇది రచయిత్రి అవగాహన మీద విసురు కాదని మనవి చేస్తున్నాను. లివిన్ రిలేషన్ సంబంధాలన్నీ తెగిన గాలిపటాలనేది ఆమె ఒక్కరి అభిప్రాయం కాదు కదా. ఆమె ఈ కధాంశం ఎన్నుకోవటంలోనే సాహసం వుంది. కధలోని పాత్రల మానసిక భౌతిక వాతావరణాన్ని ఎంతో నిశితంగా ప్రొజెక్ట్ చేసారు. ఒక మంచి కధాంశాన్ని ఎంతో ప్రభావవంతంగా, మనసుకి హత్తుకునేట్లు చెప్పిన కృష్ణవేణికి నా అభినందనలు, ధన్యవాదాలు కూడా. అయితే పాత్రల మధ్య సంబంధ బాంధవ్యాలు వెంటనే అర్ధం కావు. అయినా పర్లేదు, కధనవేగం మనల్ని చివరివరకూ మన కళ్ళను పరిగెత్తిస్తుంది. ఈ కధ నేపధ్యంలో ఒక మంచి చర్చ జరగాలని కోరుకుంటున్నాను.

  29. Krishna Veni Chari says:

    అరణ్య క్రిష్ణగారూ,
    మొట్టమొదటిగా- మీ విశదమైన కామెంట్ మీరు కథని ఎంత శ్రద్ధగా చదివేరో తెలియజేస్తోంది. థేంక్యూ. ఇకపోతే””లివ్ ఇన్ రిలేషన్ కి చట్టబద్ధత కల్పించాలి”” అన్న మీ వాక్యం గురించి- ఒకే చూరుకింద నివశించే లివ్ ఇన్ రిలేషన్షిప్లలో ఉన్న జంటలని చట్టబద్ధంగా వివాహం అయినవారిగానే పరిగణించాలని ఈ సంవత్సరమే ఏప్రిల్ నెలలో సుప్రీమ్ కోర్టు తీర్పిచ్చింది.
    ఈ సంబంధంలో ఉన్న స్త్రీకి భార్యకున్న హక్కులన్నీ ఉండాలని 2010 లోనే తీర్మానించింది.
    థేంక్స్ ఎగైన్.

  30. AMBALLA JANARDHAN says:

    సారంగలో కొత్త కథలు మాత్రమే పోస్ట్ చేయాలా ?
    తమ కథా సంపుటిలో ప్రచురించబడి, ఇతర పత్రికల్లోగానీ, అంతర్జాల బ్లాగ్ లలో గానీ ప్రచురించ బడని కథలు పంపవచ్చా?

    • వనజ తాతినేని says:

      అంబల్ల జనార్ధన్ గారు ఇంతకూ ముందెప్పుడూ ప్రచురింపబడని , ఇతర మాధ్యమాల కి పంపబడని , సొంత బ్లాగులలో ప్రచురింప బడని కథలని మాత్రమే సారంగ కి పంపవలెను .

  31. Krishna Veni Chari says:

    అంబళ్ళ జనార్ధన్‍ గారూ,
    నాకే బ్లోగు కానీ కథాసంపుటి కానీ ఏదీ లేదు. కాబట్టి నాకంతగా తెలియదు.
    మీ ప్రశ్నకి సారంగ టీమ్‍ మాత్రమే సమాధానం చెప్పగలదనుకుంటాను.

  32. Krishna Veni Chari says:

    వనజ తాతినేని గారూ,
    థేంక్యూ.
    నాకే బ్లాగూ లేదు కాబట్టి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయేను.
    ఇంటి పేర్లు తెలియక నేను ” అంబళ్ళ” గారూ అనీ రాసేను. సరిదిద్దినందుకు కూడా థేంక్స్‍.

  33. కథ కథపరంగా బాగుంది కృష్ణవేణి గారు. టీనా అభద్రతా భావం ఇప్పటి తరానికి సరిపోయేట్టుగా ఉంది. స్వేఛ్చ అంతే ఇదా అనేట్టుగా ఉంది. ఇక పేర్లు కథ నడిపించిన తీరు పాఠకుండిని కొంచం తికమక పెట్టే రీతిలో ఉంది. అదేదో హింది డబ్బింగ్ సినిమా చూస్తున్నమా అనిపించింది. ఇదొక్కటి కొంచం మార్చుకుంటే మీఎరు తెలుగులో మహరాణే ఇక.

  34. Krishna Veni Chari says:

    > హింది డబ్బింగ్ సినిమా చూస్తున్నమా<
    అది మీ తప్పు కాదు. నేను పెరిగిన వాతావరణం మరి అలాంటిదే. అది మట్టుకే నాకు తెలిసినది. ఆంధ్రదేశం నేపధ్యంలో రాయలేను.
    “తెలుగులో మహరాణే”-అదెలాగో అవలేను-ఎన్ని జన్మలెత్తినా.
    థేంక్యూ

  35. క్రష్ణవేణీ !
    మీ కథ ‘తెగిన గాలిపటాలు ‘ ఇప్పుడే చదివాను . అందరి అభిప్రాయాలు కూడా .
    నాకూ మొదట్లో తాన్యా ,పూజా ..ఇద్దరు కూతుళ్ళ మధ్య సంబంధాలు ఏమిటో పూర్తిగా అర్దం అవలేదు .. ఐతే కథ చదువుతున్న కొద్దీ , అర్ధం అయింది ..సంభాషణ ల తో కథను నడిపి పాత్రలని పరిచయం చేసే పద్ధతిలో ఇదే కొంచం తికమక ,మనకి కథ తెలుసు కాబట్టి , అట్టే వివరణ ఎందుకు ? అనిపిస్తుంది .
    ఆమె జీవన విధానం అలా ఎందుకు అయింది ? అది ఆమె లో లోపమా ? పెరిగిన వాతావరణమా ? ఏమో కానీ కొందరు అలా తెగిన గాలి పటాల్లాగా గాలివాటం గా తేలిపోవడం అనే మార్గమే తమ జీవన విధానం అని నిర్ణయించుకుంటారు ..చూసారా ! ఆమె తన ఇల్లు అస్తవ్యస్తం గా ఉంచుకోడానికి కూడా ఆమే కారణం అయింది ..ఒక మగవాడి పాత్ర ఇంటి అతిథిగా మాత్రమేనా ? జీవన శైలి లో ఆస్తవ్యస్తం వల్లనే ఇల్లు అలా ఉండక పోవచ్చు .సంసారాలు చేసుకునే కొంత మంది ఇళ్ళు కూడా ఇలాగే నిర్లక్స్యంగా , ఎక్కడ వస్తువులు అక్కడ ఉండక , అంతా పూర్తి అనార్కీ గా ఉన్న ఇల్లూ , సంసారాలూ కూడా చూసాను నేను ..
    (అరణ్య కృష్ణ గారి వాదన తో నేనూ ఏకీభవిస్తాను .. మంచి ఏదైనా ఉంటే మన భారతీయ వ్యవస్థ కీ ,చెడు ఏది ఉన్నా అది స్త్రీల భుజాల మీద పడేసే అన్యాయం నాకైతే ఒళ్ళు మండిస్తుంది ).
    మీ కథ లో ఒక రకమైన సౌందర్యం ఉంది ..మొత్తానికి ..రాస్తూ ఉండండి ..
    వసంత లక్ష్మి ( లక్ష్మీ వసంత )

    • Krishna Veni Chari says:

      లక్ష్మీ వసంతగారూ,
      “ఇద్దరు కూతుళ్ళ మధ్య సంబంధాలు ఏమిటో పూర్తిగా అర్దం అవలేదు”- మీరూ, మరికొంతమంది స్నేహితులూ అర్థం చేసుకోలేకపోవడానికి కారణం నేను రాసిన పద్ధతి స్పష్టంగా లేకపోవడమే అనుకుంటాను. ఇది అచ్చయిన నా రెండో కథ మాత్రమే. ఇంకా చాలా నేర్చుకోవాలి.
      “జీవన శైలి లో ఆస్తవ్యస్తం వల్లనే ఇల్లు అలా ఉండక పోవచ్చు:-నిజమే.
      “మీ కథ లో ఒక రకమైన సౌందర్యం ఉంది”- ఈ మాటకి మాత్రం చాలా కృతజ్ఞతలు- మరది ఏ “సౌందర్యమో” నాకర్థం అవనప్పటికీ కూడా.

  36. Venkat Suresh says:

    కథ… కొత్తగా… బాగుంది.

    • Krishna Veni Chari says:

      వెంకట్‍ సురేశ్‍ గారూ,
      “కొత్తగా”- ఇలాంటి జీవితాలెన్నో! కాకపోతే కొంచం సునిశితంగా గమనిస్తేనే.
      థేంక్యూ.

  37. Sunitha Ramesh says:

    బాగుందండి. ఈ మద్య రెండు మూడు సినిమాలు ఈ ఇతివృత్తాన్నే ఎంచుకోన్నాయి. పైన ఎవరో చెప్పినట్లు, ఎక్కువ పాత్రల వల్ల మొదట్లో కొద్దిగా తికమక అనిపించింది. కొద్దిగా శ్రద్దగా చదివితే ఆ confusion లేదు.

    • Krishna Veni Chari says:

      సునీత రమేశ్‍ గారూ,
      “మొదట్లో కొద్దిగా తికమక అనిపించింది”-హహహ, ఈ కథ చదివిన అందరినీ అయోమయానికి గురి చేసినట్టున్నాను.
      “ఈ మద్య రెండు మూడు సినిమాలు ఈ ఇతివృత్తాన్నే ఎంచుకోన్నాయి.”-తెలుగు సినిమాలా?
      “బాగుందండి.”-చాలా కృతజ్ఞతలు.

      .

  38. SRINIVAS SATHIRAJU says:

    “నువ్వు చాలా మంచివాడివి అర్జున్! “-టీవీ చూస్తున్న అర్జున్ పక్కనే కూర్చున్నాను. అర్థం చేసుకున్నట్టు చెయ్యి తట్టేడు.

    ఎన్నిసార్లు పోట్లాడేను! తడి తువ్వాళ్ళు మంచం మీదే పడేస్తాడనీ, టీ తాగి కప్ అక్కడే వదిలేస్తాడనీ – ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి!

    రేపట్నుంచీ మళ్ళీ అలాగే సాధిస్తాననీ తెలుసు. ఈ గిల్ట్ ఎన్నాళ్ళూ ఉండదనీ తెలుసు. కానీ ఈ సామాన్యమైన గిల్లికజ్జాల జీవితం చాలదూ సంతోషంగా బతకడానికి!
    ______________________కృష్ణ వేయని గారికి ముందుగా మీ తెలుగు ఈ నాటి లేలుగు నాడునుంచి వచ్చే వారి కధల కన్నా చాలా బావుందని చెప్పవచ్చును. చదవడానికి చాలా సులభంగానూ శైలి సరళంగానూ ఉంది ఇంకా మిగతా కధ పక్కన పెడితే నేను కధ చెప్తున్న పాత్రతో కలిసాను కదా పరంగా..మా ఆవిడ కూడా ఒక్కో సారి నన్ను అలా మెచ్చుకుంటుంది వాళ్ళ స్నేఅహితులని కలిసి వచ్చినప్పుడల్లా ఇలాంటి కధలు వినిపిస్తుంది. లేదా తన పుట్టిన దేశం ఫిలిప్పీన్స్ వెళ్ళివచ్చినప్పుడుల్లా బాబీ నువ్వెంత మంచి వాడివో అంటుంది నాలుగు రోజుల తరువాత మళ్లీ మొదలు ..సాధించడం కోపం చిరాకు విసుగు అసహనం. నాకెందుకో ఎప్పటికీ అర్ధం కాదు ..ప్రేమించినప్పుడు ఎదుటివారిని వారిలోపాలతో అంగీకరించ లేము ఎందుకు…వారిని తమ అనుగుణంగా మార్చుకోవాలి అని అనుకుంటాము…లేదా తమ కీలుబొమ్మలుగా మార్చుకుందాము అనుకుంటాము. అంతేకాదు పైగా అలా జీవించే వారిని చూసి తెగిన గాలి పాఠాలుగా భావించడం నిజమైన హాస్యాస్పదమైన విషయం కదా…చాలా చక్కగా ఆవిష్కరించారు మనుషుల్లోన్ని తత్వాలు…పైన అందరి కామెంట్లు నిజంగా వారి తెగిన గాలిపటం లాంటి మనసును చూబిస్తున్నాయి …నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎగురుతున్న గాలిపాతాల్లాంటి సగటు మానవుల జీవం రీతి నిజం చెప్పాలంటే గాలి వాటు బ్రతుకులే. సూత్రం నించి (సమాజపు తాలూకు కట్టుబాట్లు) విడిపడి పోయినంత మాత్రాన్న తప్పు లేదు జీవితాన్ని హాయిగా జీవించ గలిగినప్పుడు..ఎవరిని ఎవరూ చూసి జాలి పడక్కర్లేదు చావు బ్రతుకు మధ్యలో ఎన్నుకోవలసిన అవసరం ఏర్పడితే నేను బ్రతుకు వైపే మొగ్గు చూపిస్తా. నా బ్రతుకు ఒకరి దయమీద ఆధారపడనంత వరకు నేను ఎలా జీవించాను అనేది ముఖ్యం కాదు ఒక స్థాయి దాటినా తరువాత.. జీవిత భాగస్వామిని ప్రతీ చిన్న విషయంలో tappupaDutoo..ఒకరితో పోల్చుకుని అప్పుడప్పుడు. హాయిగా ఉన్నాను అనుకునే నా భార్య మీదే నా జాలి తప్ప. మంచి ఆలోచనలను రేకెత్తించి ప్రతీ వారు తమ జీవితంతో ఏదోలా పోల్చి చూసుకునే కధ చక్కగా చెప్ప గలగడం నిజంగా ఒక కళ మీ ప్రయత్నం 100% సఫలీకృతమనే చెప్పచ్చు. ఇంకా రాస్తూ ఉండాలి ఇలా అని మీలాంటి ఒక చక్కని కధకురాలు దొరకడం తెలుగు వారి అదృష్టంగా భావిస్తూ ..ధన్యవాదాలు. మీలాంటి కధకులను ప్రోత్సహించే సారంగ యాజమాన్యం పై మొదటి సారిగా నా దృక్పధాన్ని మార్చుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.

  39. Krishna Veni Chari says:

    శ్రీనివాస్ సత్తిరాజుగారూ,
    సులభంగానూ శైలి సరళంగానూ————-నాకొచ్చిన రాత తెలుగు సరళమైనది మాత్రమేనండీ.
    నా బ్రతుకు ఒకరి దయమీద ఆధారపడనంత వరకు నేను ఎలా జీవించాను అనేది ముఖ్యం కాదు ఒక స్థాయి దాటినా తరువాత——ఇది మాత్రం పూర్తిగా నిజం.
    మిగతా మీ పొగడ్తతో కూడిన వాక్యాలనిటికీ, ఎన్నెన్నో కృతజ్ఞతలు.

Leave a Reply to mimicrysrinivos Cancel reply

*