మనసు ఊసులన్నీ మనసు భాషలోనే…

 

మనిషి ఎంత కష్టపడి ఉంటాడో కదా…

తన ఉచ్ఛారణకి అక్షరాలు చిత్రీకరించి.. పదాలు సృష్టించీ… వాక్యాలు నిర్మించీ.. ఒక భాషగా మలచడానికి!

ఏం లాభం! నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పడానికి అది ఏమాత్రం సహకరించడంలేదు.

అంత కష్టమూ శుద్ధ వృధా కదూ!?

‘అయినా మాట్లాడిన ప్రతిసారీ నా ఇష్టాన్ని నీకు ఇలా మాటల్లో చెప్పాలా.. నీకు మాత్రం తెలీదూ?’ అని ఊరుకుందామనిపిస్తుందా.

ఉహూ.. ఎంత ఆపుకుంటే అంత గాఢంగా, మధురంగా చెప్పాలనిపిస్తుంది.

చాలాసార్లు ఎంతో మురిపెంగా నీకు వినిపించే ఆ రెండు మూడు పదాలు కూడా అలాంటప్పుడు నిస్సారంగా, ఒక తప్పని మొనాటనీలా అనిపించేసి చాలా చిరాకుతెప్పించేస్తాయి.

అసలు ఈ గుండె భాషని ఇలా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేకుండా ఉన్నదున్నట్టుగా.. మొత్తంగా నీ గుండెకి చేరేసే ఉపాయమేమీ లేదంటావా!?
ఆ ఆపిల్ వాడు, ఐప్యాడ్లూ, ఐపాడ్లూ మీద కాన్సంట్రేషన్ తగ్గించి ‘ఐఫీల్యూ’ మీద కొంచెం దృష్టి పెట్టొచ్చు కదా!?

gulzar

కవిత

కవిత ఒకటి మనసునే పట్టుకు వేళ్ళాడుతోంది,

ఆ వాక్యాలన్నీ పెదవుల్నే అంటిపెట్టుకున్నాయి,

ఎగురుతున్నాయి అటూ ఇటూ సీతాకోకచిలుకల్లా

పదాలు కాగితం పైన మాత్రం కుదురుకోకుండా!

ఎప్పట్నించీ కూర్చున్నానో, బంగారం

తెల్ల కాగితం మీద నీ పేరు రాసుకుని..

ఒక్క నీ పేరు మాత్రం పూర్తయింది..

అవునూ, ఇంతకన్నా మంచి కవిత్వం ఏముంటుందేమిటీ!?

*****

ఒక పురాతన ఋతువేదో తిరిగొచ్చింది
తోడుగా జ్ఞాపకాల తూరుపునీ తెచ్చుకుంది.
ఇలా అరుదుగా జరుగుతుంది,
తన సమక్షంలోనే విరహమూ వేధిస్తుంటుంది!!

*****

నా నిశ్శబ్దం నడిచేది
నీ సుదీర్ఘ మౌనంగుండానే!
అదేమంటుందో వింటాను….
నా గురించేవో కూడా చెప్పుకుంటూ!!

మూలం:
Nazm uljhi hui hai seene mein
misare atke hue hain hothon par
udate phirte hain titaliyon ki tarah
lafz kaagaz pe baithate hi nahin
kab se baithaa hun main jaanam
saade kaagaz pe likh ke naam tera

bas tera naam hi mukammal hai
is se behtar bhi nazm kyaa hogi

*****

Ek Puraana Mausam Lauta, Yaad Bhari Purvayi Bhi
Aisa To Kam Hi Hotha Hai, Wo Bhi Ho Tanhaayee Bhi

*****

Khamoshi Ka Haasil Bhi Ik Lambi Si Kamoshi Hai
Unki Baath Suni Bhi Humne, Apni Baat Sunayi Bhi.

మీ మాటలు

 1. ” ఎప్పట్నించీ కూర్చున్నానో, బంగారం! తెల్ల కాగితం మీద నీ పేరు రాసుకుని..ఒక్క నీ పేరు మాత్రం పూర్తయింది..అవునూ, ఇంతకన్నా … మంచి కవిత్వం ఏముంటుందేమిటీ!? ” ఈ మాటలతో మనసు నిండిపోయింది, మొహం మీదికి అమాంతం వచ్చిపడ్డ గులాబి రంగు నవ్వూ అలానే నిలిచిపోయింది నిషీ !! సత్య గారూ ఒక చిన్న మాజిక్ ఇవాల్టి మీ ఆర్ట్ లో .. !! TQQ both & and waiting for the next Poem :)

 2. rajani patibandla says:

  ఆ పురాతన రుతువేదో ….తొంగి చూసి అంతలోనే మాయమయ్ పోయి నట్లుంది …..

 3. Vijayagopalk says:

  మీకు అసలు కవిత సరిగా అర్థం కానట్టుంది. పుర్వాయి అనటే తూరుపు గాలి. తూరుపు కాదు. త్న్హాయి అంటే ఒంటరితనం. విరహం కానే కాదు. కవితనంగ్ అనువాదం చేయడం అంటే మాటలు కాదు. తప్పుగా భావిన్కాకండి. ఉర్దూ తో మరింత పరిచయం పెంచుకోండి.

 4. Vijayagopalk says:

  నాకు ఈ టైపింగ్ అలవాటు లేదు. తప్పులు క్షమించండి.

 5. నిషిగంధ says:

  రేఖా, నీ పేరు చూడగానే ఒక రకమైన ఉత్సాహం ఎప్పుడూ! Thanks for the constant feedback.

  రజని గారు, హృదయపూర్వక ధన్యవాదాలు.

  విజయగోపాల్ గారు, మీ సూచనలకి ఎనలేని కృతజ్ఞతలు. మీరన్నది అక్షరాలా నిజం.. భావాన్నీ, భాషనీ యధాతధంగా అందించిగలగడం.. అనువదించగలగడం అంటే మాటలు కాదు! మీ సలహాలు తప్పక పాటించడానికి ప్రయత్నిస్తాను.

 6. నిషిగంధ says:

  సత్య గారూ, మీ చిత్రాల్లో మాత్రం వారం వారానికీ మంత్రజాలం పెరిగిపోతోందండీ! AMAZING అని అంటే చాలా చిన్న పదమైపోతుంది!

  • Satya Sufi says:

   అంతా… మీ.. కవితల మహిమే… నాదేమి లేదు….నిషి గారు :))

 7. Krishna Prasadrao says:

  మనసు ఊసులు మీకే తెలుసు.

మీ మాటలు

*