ఆయన మరణం అకారణం కాదు

బి. నర్సన్
నిజమే… అలిశెట్టి ప్రభాకర్
39 ఏళ్లు బతకడానికే ఈ భూమ్మీదికచ్చాడు
మిట్ట మధ్యాహ్నపు వయసు నాటికే
ఆరోగ్యం చెదిరింది
ఆస్తి కరిగింది
కలం మాత్రం నిప్పులు చెరిగింది
మతం పులి, దాని ఆకలి
తీర్చాల్సివచ్చినప్పుడల్లా నువ్వో నేనో ఖతం అన్నొడు
పాలేర్లు ఉరిమిచూస్తే
దొర బతుకంతా పల్లెర్లే అన్నోడు
తను వెళ్లిపోకపోయినా
ఇన్ని మాటలు పడ్డ లోకం బతకనిచ్చెదా
ఇల్లు వాకిలి, ఆలుబిడ్డల్ని
మందూ మాకును
కవిత్వం పారవశ్యంలో
కసపిసా తొక్కేసినోడు
పచ్చి కుండలా పగిలిపొయాడు
*
‘కుట్టిన యెర్రతేలు మంటలాంటిది ఆకలి
కడుపులో పేగుల్ని కడుబాధాకరంగా
దున్నే నాగలి ఆకలి” ఇలా
సైనైడ్ రుచి చూసినవాడికి బతికే చాన్సేది
అక్షరం ఆచరణ ఒక్కటైనప్పుడు
లాఠీ రుచి చూడకా తప్పలేదు
మకాం మార్చాడు గాని, బెదిరి
మనసు మార్చుకోలేదు
పత్రికా పారితోషికంతో పూట గడవకున్నా
కలర్ సినిమా గ్లామర్ నా కాలిధూళితో సరి
అన్నోడికి కాలఙానం తెలుస్తుందా
పుట్టిన గడ్డనుంచి ఇక్కడికి రావడమే పొరపాటైందని
సాలెగూడులో విలవిలా తన్నుకున్నవాడు
తనువు చాలించక తప్పదు కదా
ఒయాసిస్సునిచ్చి ఎడారిలా మారిన జీవితం
దీన్ని విషాదమందామా.. విముక్తి అందామా..
                           (అలిశెట్టి ప్రభాకర్ సమగ్ర కవితా సంపుటి మలి ముద్రణ విడుదలైన సందర్భంగా)
narsan

మీ మాటలు

 1. Surya prakash says:

  Prema, athmabinamu,nikkacchitham,anuvu, anuvu, samajhitham,samanathvam koraku prakuladae veerulaku,adarshamurthi…mana alisetty prabhakar,manalonae,yellapuddu.

  • b. narsan says:

   నిజమే సార్.. మీకు ప్రభాకర్ తో వున్న అనుబంధం తెలుసు. నాలుగు జన్మలకు సరిపడా కవిత్వం రాసి వెళ్ళినవాడు మనలోనె వుంటాడు. థాంక్స్

 2. balasudhakarmouli says:

  దుఃఖం.. కన్నీళ్లు…

  • b. narsan says:

   ఈ రెండు పదాలను ప్రభాకర్ ఉక్రోశంలోకి బదిలీ చేసాడు .మీరూ అదే చేయండి. థాంక్స్.

 3. విలాసాగరం రవీందర్ says:

  39 ఏళ్ల నిప్పు కణం

  • b. narsan says:

   పూవు పరిమళిస్తుంది అన్నట్లు ప్రభాకర్ నిప్పు కణమే. థాంక్స్

 4. buchi g reddy says:

  మ ల్లీ పుట్టాలి —-ఆశతో
  నమ్మకం తో
  ———————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

  • b. narsan says:

   కాలం కోరుకుంటున్నది..కంటుంది కూడా నేనూ ఆశతో ..థాంక్స్….

 5. bhasker koorapati says:

  అలిశెట్టి పై మీ కవిత నాలో అలజడి రేపింది. తనతో గడపటం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. కవిత్వం వినా ఏదీ లేదు. అతని స్టూడియో ఒక కవిత్వం ప్రయోగశాల! అతనొక వర్సటైల్ జీనియస్! రెడ్ సెల్యూట్, comrade అలిశెట్టి!
  నర్సన్ మంచి కవితను పోస్ట్ చేశాను! అభినందనలు…
  భాస్కర్ కూరపాటి.

  • భాస్కర్ గారు..మీరు ప్రభాకర్ కు ఎంతో ఆత్మీయులని తెలుసు..మీ మాటలకు థాంక్స్ ..

 6. B.Narsan says:

  Thanks భాస్కర్ గారూ ..ప్రభాకర్ కు మీరెంతో ఆప్తులని తెలుసు ..మీ అభిప్రాయానికి మరోసారి థాంక్స్ ..

 7. perugu ramakrishna says:

  చాల బాగుంది నర్సిన్..
  మంచి సందర్భం లో మంచిగా రాసారు …

  పెరుగు రామకృష్ణ

  • రామకృష్ణ గారు ..’మంచి’ మాట చెప్పారు…థాంక్స్

 8. rajani patibandla says:

  పచ్చి కుండలా పగిలిపోలేదు ……..పగడాల కొండలా మిగిలిపోయాడు

  • నేను పచ్చికుండ అంటే మీరు పగడాల కొండ అన్నారు. చాల బాగుంది… థాంక్స్ ..

 9. Manohar Rao says:

  prabhakar jeevana drushyalaku addam pattinattu vundi mee kavitha. pata gnyapakalu gurtochhayi

  • థాంక్స్ మనోహర్ గారు..ప్రభాకర్ మీ జ్ఞాపకాల్లో వున్నందుకు మరోసారి…

 10. I S R PRASAD says:

  అలిశెట్టి గార్ని అతి తక్కువ సార్లు కలసినా ఆయనతో గడిపిన మదురక్షనాలు మదిలో చెక్కు చెదరకుండా పదిలంగా ఉన్నాయి…. మీ ద్వార మాళ్ళ వారిని స్మరించుకోవడం ఆనందదాయకం…

  • ప్రసాద్ గారు నిజమే ..ప్రభాకర్ జ్ఞాపకాలు చేక్కుచేరనివే ..ఆయన కవిత్వం మీ స్పందన మిలితమైతేనే కదా అది సాధ్యం..

 11. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  రామకృష్ణ గారూ! అలిశెట్టి ప్రభాకర్ సమగ్ర కవితా సంపుటి విశాలాంధ్రలో దొరుకుతుందా?

  • పిన్నమనేని గారు.. తెలంగాణాలో ఐతే ‘అలిశెట్టి ప్రభాకర్ కవిత ‘ విశాలాంధ్ర , ప్రజాశక్తి ,నవోదయ లో అందుబాటులో వున్నాయి. రామకృష్ణగారి ప్రశ్నకు నేను జవాబిస్తున్న .ఇద్దరికీ కృతజ్ఞతలు.

 12. ఆంధ్ర ప్రదేశ్ కు వారం రోజుల్లో పంపిణి అవుతాయి . కొరియర్ ద్వారా ‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ మరియు ‘అక్షరనక్షత్రమ్మీద..’రెండు పుస్తకాలు రూ.200/-లకు వస్తాయి. ఇందుకు బి.నర్సన్ 9440128169 మీ సేవలో….

 13. గోర్ల says:

  గుండె ద్రవిస్తే జాలు వారిన అక్షరాలివి. కొన్ని ఫంక్తులు చదివే వారిని పట్టుకుని కుదిపేసేలా రాశారు.
  ‘‘మతం పులి, దాని ఆకలి
  తీర్చాల్సివచ్చినప్పుడల్లా నువ్వో నేనో ఖతం అన్నొడు
  పాలేర్లు ఉరిమిచూస్తే
  దొర బతుకంతా పల్లెర్లే అన్నోడు
  తను వెళ్లిపోకపోయినా
  ఇన్ని మాటలు పడ్డ లోకం బతకనిచ్చెదా’’.
  అవును కదా నర్సన్న గారు. పత్రికా రంగంలో అలిశెట్టి కవితా ఫంక్తుల్ని వాడుకున్నంతగా మరెవ్వరీ లేవు. అట్లా ప్రతీ తరానికీ అలిశెట్టి ప్రభాకర్ కవితావసరం పడుతూనే ఉంది. ఆయనపై మంచి కవిత్వం రాశారు.

  • థాంక్స్ ..నా అక్షరాల్లో నేను కనిపించను .అద్దం నేను ..రూపం ప్రభాకర్ ..సారం ఆయన కవిత్వం .

 14. నర్సన్ గారూ..
  అలిసెట్టిని చూసే భాగ్యం నాకు దక్కలేదు. మీ మాటల్లో ఆ భాగ్యాన్ని కాస్త దక్కించారు. థ్యాంక్స్. నాకు అలిసెట్టి అనగానే అతనిలాగే బతికి 40 దాటకముందే బలైపోయిన వాన్ గో గుర్తుకు వస్తాడు.

 15. మోహన్ గారు మీ స్పందనకు థాంక్స్ . ‘రంగులకల ‘ స్క్రిప్ట్ వర్క్ సమయంలో (1982) వాన్ గో గురించి చదివా .కొన్ని రాత్రులు నిద్రకు దూరమైన. 39 ఏళ్ళు బతికినా ప్రభాకర్ తో 20 ఏళ్ళ అనుబంధం నాది. ప్రభాకర్ ను సాగనంపి ఈ తెల్ల బట్టలేసుకొని బతుకుతున్నందుకు ఎప్పుడూ సిగ్గుతో కుమిలిపోతుంటాను . ఇలా రాస్తూవుండడం నాకో సాంత్వన .

 16. Aranya Krishna says:

  ప్రభాకర్ కవితా సంకలనం మాలి సంపుటి వచ్చిందని తెలియచఎసినందుకు ధన్యవాదాలు.

  • థాంక్స్ అరణ్య కృష్ణ గారు ..తెలుగు కవిత్వంలో మలి సంపుటి అంటే a great response కిందే లెక్క .కవితాభిమానులకు credit దక్కుతుంది .

 17. azharuddin says:

  Potti kavitwaniki,
  Mee aksharalae,
  Maku,Nadipinchae pada mudralu
  Regards: Dr Azharuddin mohd
  9347927660

 18. చాలా బాగుంది నర్సన్ గారు, అలిసెట్టి ప్రభాకర్ ఎప్పటికి అతని కవితలతో మనలోనే ఉంటాడు.

మీ మాటలు

*