ప్రేమ మటుకే…

 

ఆకెళ్ళ రవి ప్రకాష్

నేను నిరాశగా
ఆనందం నించీ బహిష్క్రుతుణ్ణయి వున్నపుడు
ఎల్లపుడూ
ప్రేమ మటుకే
తనదారుల్ని తెరిచింది.
అందుకే నేననుకుంటాను
ప్రేమ మటుకే బ్రతికించగలదని.

బిడియాలని
సంకోచాలని విడిచి
ప్రేమలోకి ఎగరడానికి
ధైర్యం చేయగలిగితే
మనమంటే ఏమిటొ
వెలుగంటే ఏమిటొ
ప్రేమ మటుకే తేటతెల్లం చేస్తుంది

నిజానికి ప్రేమించడం అంటే
మన చుట్టూ మనం నిర్మించుకున్న
కారాగారాల గోడల్ని కూల్చడమే!

akella

మీ మాటలు

  1. బలే ఉంది.. పెద్దమాటలు లేకుండా… ప్రేమ లాగే…

  2. narayana sharma says:

    నాకర్థమైనంతవరకు రవిప్రకాశ్ గారి కవితలు మనుషుల్ని మనుషులు ప్రేమించుకోడానికి మధ్యగోడల్ని కూల్చడానికే ప్రయత్నిస్తాయి..మొహంజోదారో నుండి ప్రేమ ప్రతిపాదనదాకా ఆయన కవిత్వం నన్ను చాలా సార్లు చదివించింది.

  3. రెడ్డి రామకృష్ణ says:

    మీ కవిత బావుంది సార్. మనం మనగోడలు కూల్చుకు వస్తాం.మనవి మట్టిగోడలు.అవతలవాడివి బంగారపు గోడలు.వాడు మాత్రం బయటకు రావడం లేదే .ఎలామరి !? కారాగారాల గోడలు కూడా రెండురకాలుగదా!.నిర్మించుకున్నవి.నిర్మించబడ్డవి.

  4. rajani patibandla says:

    బావుంది …..ప్రేమ పేరుతొ కట్టిన గోడల్ని కూల్చడం కూడా ….

Leave a Reply to రెడ్డి రామకృష్ణ Cancel reply

*