ప్రాణవాయువు ఊదే పేజీలు..

ఎన్నో మాటలానంతరం పరుచుకునే నిశ్శబ్దం.. ఎంతో పని ఒత్తిడి తర్వాత తొంగిచూసే ఖాళీతనం.. కదిలిపోతున్న మేఘాలతో పాటు మనమూ కదిలిపోయే ప్రయాణాలు.. నిద్ర రానప్పుడూ.. అసలు నిద్రే వద్దనుకున్నప్పుడూ..

అలవాటుగా, ఆత్మీయంగా కౌగిలించుకునే మిత్రుడు పుస్తకం!!

పొగమంచు ఉదయాలపై పరుచుకునే ఉదయకాంతిలా నులివెచ్చగా పొదవుకుంటాయి అక్షరాలు.
అశాంతితో ఉగ్గపట్టి, కొనఊపిరితో బ్రతికే ఘడియల్లోకి సవ్వడి లేకుండా  ప్రాణవాయువు ఊదే పేజీలు..

ఏ తలుపులూ మూయకుండానే మనలో మనం నిమగ్నమయ్యీ, ఒక సీతాకోకచిలుకై, రెప్పలు పడని తీరాలు చేరి, జీవన మృత్యు రహస్యాలకి అతీతంగా మనల్ని మనం బ్రతికించుకునే అవకాశఒ ఇచ్చే పుస్తకానికి కృతజ్ఞత కంటే ఇంకేమీ చెప్పలేని నిస్సహాయతతో….

 

ఒకే ఒక్క శబ్దంనేస్తం

ఏ స్నేహితుల సాయమూ లేకుండానే
వెళ్ళబుచ్చేశాను రోజంతా..
కాస్తంత నాకు నేనే అపరిచితుడనై,
ఇంకాస్త ఒంటరిగానూ, దిగులుగానూ
సముద్ర తీరాన రోజుని ముగించేసి
ఇంటికి తిరిగొచ్చాను
మళ్ళీ అవే నిశ్శబ్దపు, నిర్మానుష్యపు రహదారులన్నీ దాటుకుంటూ!
తలుపులు తెరిచానో లేదో
బల్ల మీద వదిలి వెళ్ళిన పుస్తకం
మంద్రంగా రెపరెపలాడుతూ అడిగింది కదా,

‘ఆలశ్యమయినట్లుంది నేస్తం!’


మూలం:

Be-yaaro-madadgaar hi kaata tha saara din..
kuchh khud se ajnabi sa,
tanha, udaas saa..
saahil pe din bujhaa ke main, laut aaya phir wahin,
sunsaan si sadak ke khaali makaan mein!

Darwaaza kholte hi, mej pe rakhi kitaab ne,
halke se phadphada ke keha,
‘Der kar di dost!’

————–

మీ మాటలు

  1. Bhavani says:

    అవును , నిస్వార్థతతో మనల్ని తనలోకి లాక్కుని , తనని మనలో నింపగలిగే గొప్ప నేస్తం పుస్తకం . అర్థవంతమైన చిత్ర రూపాన ఒదిగిన అనువాదం , అసలు కవిత ఆత్మని దర్శింపజేసింది . ధన్యవాదాలు

  2. నిషిగంధ says:

    ధన్యవాదాలు, భవానీ గారు. మీరు చెప్పినట్లు సత్యగారి చిత్రాలు కవిత ఆత్మని ఆవిష్కరిస్తున్నాయి!

    • satya sufi. says:

      ధన్యవాదాలు భవాని గారు & నిషి గారు.. మీ వల్లే నాకీ భాగ్యం దక్కింది… నా అంతరాత్మని కూడా చూడగలుగుతున్నాను… ఇంత గొప్ప అవకాశమిచ్చిన అఫ్సర్ గారికి వందనాలు…

  3. కదిలిపోయే మేఘాలతోపాటూ కదిలి పోయి ఆలస్యంగా వచ్చాను నిషీ :( , ఎంత అందమైన చిన్న పదాలు పెద్ద భావాలను మోస్తున్నాయో ఇక్కడ !! Beautiful & సత్య గారి చిత్రం – అచ్చం చిన్నప్పటి పలకమీది బలపం గీతల్లాగా ఎంతో దగ్గరగా వుంది , TQQ

  4. Mythili Abbaraju says:

    చాలా…అంటే ..చాలా బావుందండీ.

  5. నిషిగంధ says:

    Thanks so much, Rekha and Mythili gaaru.

Leave a Reply to satya sufi. Cancel reply

*