పెద్దకోతుల ధర్మం

సత్యమూర్తి

‘‘ఇది ఒక నిండు ప్రాణంతో ముడిపడిన సమస్య నాయనా! నిదానంగా ఆలోచించు. ఆప్తులను పోగొట్టుకున్న మనకు ప్రాణం విలువేంటో బాగా తెలుసు. అందుకే తొందరపడొద్దని అంటున్నాను. నామటుకు నాకు ఆ చిన్నకోతిని చంపేయకుండా.. జీవితాంతం అలా చెట్టుకు కట్టేస్తేనే మేలనిపిస్తోంది. మన వానరజాతి ధర్మగ్రంథాలు, శిక్షాస్మృతులు అలానే చెబుతున్నాయి. ఆ కోతిని మనం పట్టుకోలేదు. పశ్చాత్తాపంతో అదే లొంగిపోయింది. నేరం ఒప్పుకుంది. చెరలోనే ముసలిదైపోయింది. ఆ జీవచ్ఛవాన్ని అలా వదిలెయ్. అయినా అది మహా బతికితే రెండు, మూడేళ్లకంటే ఎక్కవ బతకదు. అంతేకదా.. ఆ మాత్రం దానికి ధర్మభ్రష్టులం కావడమెందుకు?’’

తెల్లగడ్డమున్న ముసలి కోతి పున్నమి చంద్రున్ని చూస్తూ అంది. అడవి వెన్నెల్లో తమకంతో స్నానమాడుతోంది. ముసలి కోతి కూర్చున్న రావిచెట్టు చిటారుకొమ్మ ఆ వెన్నెల్లో జాబిల్లిని ముద్దాడుతున్న నెమలీకలా ఉంది. ఆ కోతి తలపైనున్న పూలకిరీటం నుంచి పరిమళాలు బలహీనంగా వస్తున్నాయి.

‘‘మీరన్నది నిజమే కావచ్చు. కానీ, ఆనాడు చిన్నకోతులు చేసిన దారుణాన్ని తల్చుకుంటుంటే రక్తం మరిగిపోతోంది. అవి చంపేసిన పెద్దకోతుల పెళ్లాం పిల్లలు ధర్మగంటను వాయించని రోజంటూ లేకుండా పోతోంది. కంటికి కన్ను, పంటికి పన్ను పీకాల్సిందేనంటున్నాయి అవి. ఇప్పుడీ చిన్నకోతిని వదిలేస్తే.. మిగతా చిన్నకోతులన్నీ రెచ్చిపోతాయి. మన పెద్దకోతులకు రక్షణ ఉండదు.. అరాచకం రేగుతుంది.. ’’

నడీడు బవిరిగడ్డం కోతి ఆవేశంగా చెప్పుకుపోతోంది. దాని కోరలు విషపు పుట్టగొడుగుల్లా తెల్లగా మెరుస్తున్నాయి. అది తల విసురుగా అటూ ఇటూ ఊపుతోంది. తలపై ఉన్న వట్టివాసనవేళ్ల కిరీటం ఆ వెన్నెల్లో తాచుపాము చుట్ట కదులుతున్నట్లు కదులుతోంది. దాని తోక రోమాంచితమైంది.

ముసలి కోతి చిన్నగా నవ్వింది. ఓ ఆకును నోట్లో పెట్టుకుని మునిపంట కొరికింది.

‘‘నాయనా, ఈ రాజ్య లాంఛన పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నీ ఇష్టం! కానీ ఒకటి మాత్రం గుర్తించుకో.. అంతరాత్మకు మించిన ధర్మశాస్త్రం లేదు…!’’

‘అంటే, మేం చేస్తున్నది అధర్మం అంటారా? తలపండిన న్యాయకోతులు ఇచ్చిన తీర్పు తప్పంటారా? నన్ను ఎంతో అభిమానంతో, నమ్మకంతో ధర్మసంస్థాపనార్థం రాజ్యనిర్వాహక కోతిగా ఎన్నుకున్న ఈ అశేష వానరజాతి అభీష్టాన్ని నెరవేర్చడం ధర్మవిరుద్ధం అంటారా?’’

‘‘హ్హు.. అశేష వానరజాతి అభీష్టం! అంటే ఏమిటి నాయనా? మన పెద్దకోతులు కోరుకునేదేనా? చిన్నకోతులకు అభీష్టాలుండవా? ధర్మగంట వాయించడానికి కాదు, అసలు దాని ఛాయలకు రావాలంటేనే వణికిపోతున్న వేలాది చిన్నకోతులకు కోరికలేమీ లేవా? అసలు ఈ గొడవంతా ఎందుకొచ్చిందో నీకు మాత్రం తెలియదా?’’

బవిరిగడ్డం కోతి విసుగ్గా ముఖం పెట్టింది. ముసలి ఘటం ఇక చరిత్ర మొదలుపెడుతుంది కాబోల్రా బాబూ అంటూ బుర్ర గోక్కోబోయింది. కానీ అది తన అంతస్తుకు భంగమనుకుని ఆ చీకట్లో గంభీరంగా ముఖం పెట్టుకుంది. అంతే గంభీర గొంతుకతో..

‘‘మీతో చరిత్ర చెప్పించుకోవాల్సిన సమయం కాదిది. ఆ చిన్నకోతిని మూడో ఝాము మొదలవగానే ఉరితీయాలని న్యాయకోతులు తీర్పిచ్చాయి. ఆ శుభఘడియ కోసం రాజ్యమంతా ఎదురుచూస్తోంది. ఆ దెయ్యపు కోతి చివరిసారిగా మీకు మొరపెట్టుకుంది కనుక లాంఛనప్రాయమైన మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఇక ఒక ఝాము మాత్రమే గడువుంది. మీరు దాని మొరను తిరగ్గొట్టి, ఉరితీతకు ఒప్పుకుని తీరాలి..‘’

‘‘ఒప్పుకోకపోతే..?’’

‘‘మీ స్థానంలో మా మాట వినే ఆ జులపాల కోతి వస్తుంది..’’

ముసలి కోతి నిట్టూర్చుంది. దానికి మనసంతా కెలికినట్లు అయింది. ఉన్నపాటున మల్లెపూల కిరీటాన్ని తీసి కిందికి విసిరికొడదామనిపించింది. కానీ భయమేసింది. కొమ్మ నుంచి కొమ్మకు ఎగరలేని ముసలితనం గుర్తుకొచ్చింది. రాజ్యపెద్దగా చిటారుకొమ్మన గంధపు పుల్లలపై కూర్చుని అనుభవిస్తున్న లాంఛనాలు, గౌరవాలు, విలాసాలు, జుర్రుకుని, కొరుక్కుని తింటున్న తియ్యతియ్యని పళ్లు, ఒళ్లుపడుతున్న పరువాల ఆడకోతులు గుర్తుకొచ్చాయి. కానీ దాని అంతరాత్మ మాత్రం ఎందుకో ఎదురు తిరుగుతోంది. మళ్లీ అంతలోనే జావగారి పోతోంది..

‘‘నాయనా, నువ్వు రాజ్యనిర్వాహక కోతివి. అధికారమంతా నీదే. కాదనే శక్తి నాకు లేదు. కానీ నా అంతరాత్మ మాత్రం ఆ చిన్నకోతిని వదిలేయాలనే ఘోషిస్తోంది. నీకు విసుగ్గా ఉన్నా వినక తప్పదు. చేసిన పాపం చెబితే పోతుందంటారు.. చిన్నకోతులకు మనం అన్యాయం చేయబట్టే కదా, అవి ఆనాడు ఆ దారుణానికి ఒడిగట్టింది! ఆ ఘోరానికి ముందు.. వారం రోజులపాటు మన అల్లరి పెద్దకోతులు ఏం చేశాయో నీకూ తెలుసు కదా. ఆ చిన్నకోతుల చెట్లపైకి వెళ్లి, వాటిని పీక పిసికి చంపాయి. గోళ్లతో, నోళ్లతో రక్కి చంపాయి. వాటి పళ్లను, కాయలను దోచుకున్నాయి. వాటి ఆడకోతులను చెరిచాయి. వాటి పిల్లలను చితగ్గొట్టి చంపేశాయి. ఇంకా.. నోటితో చెప్పరాని పాడుపనులన్నీ చేశాయి. ఎందుకు చేశాయి? అవి చిన్నకోతులని, తిరగబడే శక్తి లేదని. వాటి వల్ల రాజ్యంలో చెట్లకు, పళ్లకు కొరతవచ్చిందని పెద్దకోతులను రెచ్చగొట్టి, వాటి అభిమానం సంపాయించి గద్దెనెక్కాలని. చిన్నకోతుల్లో అల్లరివి లేవని చెప్పను. కొన్ని ఉన్నాయి. కానీ వాటిని సాకుగా చూపి మొత్తం అవన్నీ చెడ్డవని తీర్పివ్వకూడదు నాయనా. బలహీనులను కాపాడాలని మన ధర్మం ఘోషిస్తోంది. మన పెద్ద కోతుల అకృత్యాలకు ప్రతీకారంగా ఆ చిన్నకోతి కుటుంబం సర్వనాశనమైంది. అలాంటి మరికొన్ని చిన్నకోతులు కలసి ఎక్కడో పాము విషం సంపాయించి, దాన్ని మన చెట్లపైని పళ్లకు పూశాయి. అవి తిని మన పెద్దకోతులే కాక, కొన్ని చిన్నకోతులు కూడా చచ్చాయి. ఉరికంబమెక్కబోతున్న ఈ కోతి కంటే ఘోర నేరాలు చేసిన చిన్నకోతులు పక్కరాజ్యంలో దాక్కున్నాయి. వాటిని తీసుకురావడం మన అరివీరశూర భయంకర పెద్దకోతులకు చాతకాలేదు. ఆ కోతులకంటే పెద్ద ఘోరాలు చేసిన పెద్దకోతులతో సాక్షాత్తు నువ్వే అంటకాగుతున్నావు. నీ అనుంగులూ అంటకాగుతున్నాయి. పట్టుకొచ్చి ఉరితీయాల్సిన మరెన్నో కోతులు మతపీఠాలపై, రాజ్యపీఠాలపై బోరవిడుచుకుని కూచుని నీతిన్యాయాలను శోష వచ్చి పడిపోయేలా వల్లిస్తున్నాయి.

నాయనా, మనం.. అంటే నువ్వనుకుంటున్నట్లు పెద్ద కోతులం మాత్రమే కాదు, చిన్నకోతులం కూడా.. ఆనాడు తెల్ల చింపాంజీల నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకోవడానికి చేతులు కలిపి తిరగబడ్డాం. చింపాంజీల దాడిలో చచ్చిన కోతుల్లో వేలాది చిన్నకోతులు కూడా ఉన్న విషయాన్ని మరవొద్దు. స్వాతంత్ర్యం వచ్చాక లెక్కలేనన్ని ధర్మపన్నాలతో పెద్ద ధర్మగ్రంథం  రాసుకున్నాం. రాజ్యంలోని కోతులన్నింటికి చిన్నకోతి, పెద్దకోతి అనే తేడాల్లేకుండా అన్ని హక్కులూ ఉంటాయని హామీ ఇచ్చాం. కానీ, ఆ హామీలు మనం కొరికి పారేసే నేతిబీరకాయలైపోయాయి, మేడిపళ్లయిపోయాయి, గుడ్డిగవ్వలైపోయాయి, గురివిందగింజలైపోయాయి. అన్నిచోట్లా పెద్దకోతులు చెబుతోందే వేదమైపోతోంది. వాటి రెట్టమతమే రాజ్యమతమైపోతోంది. అవి చేసేది పుణ్యమూ, చిన్నకోతులది పాపమూ ఐపోతోంది. వాటి పిల్లలు దేశభక్తులూ, వీటి పిల్లలు దేశద్రోహులూ అయిపోతున్నాయి. చివరకు ఆ చిన్నకోతులకు రెండు పిల్లలను కనే స్వేచ్ఛకూడా లేకపోతోంది. పక్కరాజ్యానికి పోవాలని బెదిరింపులూ.. ఆ చిన్నకోతులు అక్కసుతో తిరగబడితే అరాచకకోతులని ముద్రవేసి చెట్లకు కట్టేస్తున్నాం, పీక పిసికి చంపేస్తున్నాం…’’

ముసలి కోతి ఆయాసంతో రొప్పుతోంది.

బవిరి కోతి ముఖం క్రోధంతో ఆ వెన్నెల్లో నిద్రలేని పులికన్నులా ఎర్రబారి తళుక్కుమంది.

‘‘చాలుచాలు. ఇక ఆపండి. మీకు ముసలితనంలో మతి చెడింది. దేశద్రోహికంటే ఘోరంగా మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోండి. అసలు ఉరి తీయాల్సింది ఆ చిన్నకోతిని కాదు, మిమ్మల్ని. మీ ధర్మపన్నాలకు కాలం చెల్లింది. మీ కాలం వేరు, మా కాలం వేరు. దండం దశగుణం భవేత్ అన్నారు. హక్కులు, గిక్కులు అంటూ కూర్చుంటే రాజ్యం అల్లకల్లోలమవుతుంది. మన కర్మభూమి విశ్వప్రేమిగా, శాంతిదూతగా ఎదగదు. శాంతికి, ప్రేమకు, కరుణకు మారుపేరైన పెద్దకోతులకు, వాటి ధర్మానికి ఉనికే లేకుండా పోతుంది. మీ పనికిమాలిన మాటలతో అప్పుడే అరఝాము గడిచిపోయింది. అక్కడ ఉరికి అంతా సిద్ధమైంది. తలారికోతి తాడు లాగడమే మిగిలింది. ఈ భువికి వన్నెతెస్తున్న మన మహోన్నత పరమపావన స్వర్గతుల్య పూజనీయ శాంతికాముక కర్మరాజ్యంలోని కోతులన్నీ ఆ మరణదండన శుభముహూర్తం కోసం వేచిచూస్తున్నాయి. ఈ తాటాకుపై సంతకం పెట్టి, ఆ తెగపండిన రేగుపళ్లను కొరుక్కు తినండి..’’

బవిరి కోతి కోపం, వెటకారం కలగలిపి తిట్టింది. ముసలి కోతి స్థాణువైపోయింది. బవిరి కోతి ఇచ్చిన తాటాకుపై కలలో మాదిరిగా సంతకం చేసింది. బవిరి కోతి ‘‘శభాష్’’ అంటూ ఓ రేగుపండును రాజ్యపెద్ద నోట్లో ముద్దుగా కుక్కి, తాటాకును నోట్లో కరచిపట్టుకుని ఆ చీకట్లో ఎంతో లాఘవంగా చెంగుచెంగుమంటూ చిన్నకోతిని ఉరితీస్తున్న చెట్టుమీదికి దెయ్యపు పిల్లిలాగా దూసుకుపోయింది.

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. Narayana Swamy says:

  చాలా బాగుంది కథా కథనమూ – సమకాలీన సంఘటనను అలిగారికల్ గా చెప్పడం చక్కగా అమరింది

 2. venugopala naidu k says:

  ఆద్భుత రచన, న్యాయకోవిదులు ఆలోచించాలి.

 3. N Venugopal says:

  చాల చాల బాగుంది…

 4. ఈ రచయిత కి చిన్న కోతుల మీద అంత మమకారం ఉంటే చక్కగా వాటి రాజ్యానికి వెళ్ళిపోయి అక్కడే ఇంతకన్నా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవించొచ్చు కదా. ఇక్కడ ఏడుపెందుకు?

  • దేశం పెద్దకోతులదే కాదు, చిన్నకోతులదికూడా. అసలిది ప్రతికోతినీ గౌరవిస్తుందని గొప్పలుపోతామఏ, దాన్ని ఆచరణలో చూపిస్తామా అన్నది ఈ వ్యాసం సంధించిన ప్రశ్న. మీరు ఈ కధలోని ప్రశ్ననే మళ్ళీ సంధించారు. welcome to dumbocracy.

   • దేశం చిన్నకోతులదే కాదు, పెద్దకోతులదికూడా. అసలిది ప్రతికోతినీ గౌరవిస్తుందని గొప్పలుపోతామఏ, దాన్ని ఆచరణలో చూపిస్తామా అన్నది అసలైన ప్రశ్న. మీకు ఈ ప్రశ్న అర్థం కాదు లేండి. ఎంజాయ్ యువర్ dumbocracy.

  • సత్యమూర్తి says:

   ఈ రచయిత పలాయనవాది కాదు. చలిచీమలన్నీ కలిస్తే ఎంతపెద్ద పామైనా చస్తుంది. చిన్నచితకా కోతులన్నీ కలిస్తే హంతకమారి పెద్దకోతులను, కొండముచ్చుల్ని తేలిగ్గా నాశనం చేసిపారేయొచ్చు. అందుకే ఈ ఏడుపు.

 5. P.Jayaprakasa Raju. says:

  ముసలి కోతి పిల్లలెవరైనా చిన్నకోతి చేతిలో చనిపోయివుంటే ఏమని వుండేదో !

  • సత్యమూర్తి says:

   కథలో ఏమన్నదో అలాగే అని ఉండేది. మీరు ముసలి కోతి మాటలను కాకుండా మనసును అర్థం చేసుకోండి

 6. Aranya Krishna says:

  అలిగారికల్ కధనం బాగుంది. ఐ రాజ్యమనే కాదు మూడో ప్రపంచపు చెట్లమీది ఏ రాజ్యంలో అయినా బవిరి కోతుల సమూహమే కనపడుతుంది.

 7. నీహారిక says:

  బవిరి గడ్డపు కోతి పనిపడితే మిగతా కోతులన్నీ బుద్ధిగా ఉంటాయి.మర్కట న్యాయం అదే చెపుతోంది,మర్కట నీతిగ్రంధంలో అదే వ్రాసుంది !శత మర్కటం పితలాటకం !

  చీమలన్నీ ఒకే లైనులో నడవకుండా తలోదిక్కుకీ నడుస్తున్నాయి.చీమలనన్నిటినీ కలిపి నడిపించే ఐడియా ఇవ్వండి !

 8. Perfectly useless article

  చిన్నకోతులకు అభీష్టాలుండవా? ధర్మగంట వాయించడానికి కాదు, అసలు దాని ఛాయలకు రావాలంటేనే వణికిపోతున్న వేలాది చిన్నకోతులకు కోరికలేమీ లేవా?
  1) People in this country still have faith on Judiciary system. Offenders were Godhra riots were punished by the same judiciary system. To say that Muslims don’t have access to this is nothing but false.

  2)ఆ ఘోరానికి ముందు.. వారం రోజులపాటు మన అల్లరి పెద్దకోతులు ఏం చేశాయో నీకూ తెలుసు కదా. ఆ చిన్నకోతుల చెట్లపైకి వెళ్లి, వాటిని పీక పిసికి చంపాయి. గోళ్లతో, నోళ్లతో రక్కి చంపాయి. వాటి పళ్లను, కాయలను దోచుకున్నాయి. వాటి ఆడకోతులను చెరిచాయి. వాటి పిల్లలను చితగ్గొట్టి చంపేశాయి. ఇంకా.. నోటితో చెప్పరాని పాడుపనులన్నీ చేశాయి. ఎందుకు చేశాయి? అవి చిన్నకోతులని, తిరగబడే శక్తి లేదని. వాటి వల్ల రాజ్యంలో చెట్లకు, పళ్లకు కొరతవచ్చిందని పెద్దకోతులను రెచ్చగొట్టి, వాటి అభిమానం సంపాయించి గద్దెనెక్కాలని

  Everyone should condemn the Mumbai Riots . We should support the fight by civil society for bringing the culprits to the book. There are no if’s and but’s on this.

  3)ఉరికంబమెక్కబోతున్న ఈ కోతి కంటే ఘోర నేరాలు చేసిన చిన్నకోతులు పక్కరాజ్యంలో దాక్కున్నాయి. వాటిని తీసుకురావడం మన అరివీరశూర భయంకర పెద్దకోతులకు చాతకాలేదు. ఆ కోతులకంటే పెద్ద ఘోరాలు చేసిన పెద్దకోతులతో సాక్షాత్తు నువ్వే అంటకాగుతున్నావు. నీ అనుంగులూ అంటకాగుతున్నాయి. పట్టుకొచ్చి ఉరితీయాల్సిన మరెన్నో కోతులు మతపీఠాలపై, రాజ్యపీఠాలపై బోరవిడుచుకుని కూచుని నీతిన్యాయాలను శోష వచ్చి పడిపోయేలా వల్లిస్తున్నాయి.
  This is the most useless point in this whole article. Just bcoz others are Pakistan that doesn’t mean, We should spare this monster.If you have proofs on any of the current politicians, You can fight like Gujarat Victims to bring them to books. Just saying that many others escaped the punishment and that’s why we should spare memon is illogical argument at best

  4) రాజ్యంలోని కోతులన్నింటికి చిన్నకోతి, పెద్దకోతి అనే తేడాల్లేకుండా అన్ని హక్కులూ ఉంటాయని హామీ ఇచ్చాం. కానీ, ఆ హామీలు మనం కొరికి పారేసే నేతిబీరకాయలైపోయాయి, మేడిపళ్లయిపోయాయి, గుడ్డిగవ్వలైపోయాయి, గురివిందగింజలైపోయాయి. అన్నిచోట్లా పెద్దకోతులు చెబుతోందే వేదమైపోతోంది. వాటి రెట్టమతమే రాజ్యమతమైపోతోంది. అవి చేసేది పుణ్యమూ, చిన్నకోతులది పాపమూ ఐపోతోంది.
  Did we change constitution to degrade them to second class citizens. BTW Both Pakistan & bangladesh have changed themselves to Islamic countries. In India, Muslims have right to start their own institutes and control on their own religious entities which is not given to hindus. Who got the bad deal ?? Muslim were even given reservations based on religion and let us not talk about Haj subsidies

  5)వాటి పిల్లలు దేశభక్తులూ, వీటి పిల్లలు దేశద్రోహులూ అయిపోతున్నాయి. చివరకు ఆ చిన్నకోతులకు రెండు పిల్లలను కనే స్వేచ్ఛకూడా లేకపోతోంది. పక్కరాజ్యానికి పోవాలని బెదిరింపులూ.. ఆ చిన్నకోతులు అక్కసుతో తిరగబడితే అరాచకకోతులని ముద్రవేసి చెట్లకు కట్టేస్తున్నాం, పీక పిసికి చంపేస్తున్నాం…’’

  Are you Serious ? They don’t have the freedom to have as many children as they want ? Is that why they are 138 Million now from 34 million in 1947. In the blind pursuit to be called So called leftist , rights activist or what ever, You didn’t even think about the above stat before writing. BTW Hindu population in Islamic countries shrinked by great margin. In Pakistan they are 1% and live like slaves . Bangladesh is little better but don’t worry it is getting there.
  The population & illiteracy are main reasons for backwardness of Muslims. It looks like you want them to be in poverty forever. Good going.

  6) ఆ కోతిని మనం పట్టుకోలేదు. పశ్చాత్తాపంతో అదే లొంగిపోయింది. నేరం ఒప్పుకుంది. చెరలోనే ముసలిదైపోయింది. ఆ జీవచ్ఛవాన్ని అలా వదిలెయ్.
  This is another utter bulllshit propagated by so called right activists. They were caught in Nepal and they didn’t surrender.

  a) Mumbai Riots offenders need to pursued & punished. That responsibility lies on civil society in tandem with victims. Both Congress & BJP evaded it for the past 20 years which shameless on their part.
  b) You can be a right activists who can oppose death penalty & any form of violence. People will respect you when you stick to it irrespective of offender. If tomorrow court order to execute Swami Aseemananda, I would support it with same force. His religion doesn’t matter to me: his Crime does.
  You can’t pick & choose the cases of human rights. Staying silent when Maoist strike police & civilians but shouting on top your voice only when maoists die will make you look like hypocrite not rights activist.
  c) Indian constitution & civil Society are not perfect far from it . You can fight for betterment every second but it shouldn’t start with painting Hindus in negative light. We give more protections & rights to minorities than any other country in the neighbourhood. We can always improve it but the moment you start saying that they don’t rights & treated like secondary citizens , the comparisons with neighbouring countries is bound to come.
  d) This is a globalized world and people are aware of information & exposure like never before.
  We can see & know how our country is vis-a-vis other countries. As a Hindu, I feel proud at the way our society allows minorites to live & prosper ( again we can always immprove) when I see & hear about other countries.
  Malaysia which has only 60% muslims is Islamic country. It treats hindus like secondary citizens. It’s Bhoomiputra policies are as good as racist. Hindus are fighting for basic rights. I never saw any protests ( let alone violent ones like Azad Maidan riots) for them in India.
  China treats it’s Uygurs very badly with respect to their religious rights. They are not allowed to keep beards while working government and students & workers are not allowed six times namaz during ramadan. Let us not talk about Tibetans struggle for we all know how they don’t have any hope left.
  Myanmar is not even recognizing the rohingyas as citizens and they are one of the worst persecuted communities in the world. BTW they aren’t allowed to have two kids as you have informed.Sometimes they are harassed by not being allowed intrastate travel.

  I am not saying all the above to emulate them or even allow them in any form india. Not even for second I want such things in this country. How ever in such neighbourhood, When you say that we are worst in protecting minority rights, We wonder where to begin or thinking if you even read news.

మీ మాటలు

*