కలాం వెనక వున్నది మనువాదమే!

 

పి. విక్టర్ విజయ్ కుమార్

హద్దులు దాటుతున్న కామెంట్ లను చూసి ” ఈ కామెంట్ లను moderate చేయమంటారా ? ” అంటూ తమ నైతిక బాధ్యతను నిర్వర్తించే క్రమం లో నన్ను సంప్రదించారు సారంగ టీం. అబ్బుర పడ్డా ఎడిటర్ కు ఉండాల్సిన sincerity చూసి. వ్యాస కర్తగా చెప్పా ” కలాం వెనకేసుకొస్తున్న మనువాద భావ జాలం నమ్ముకున్న వారి ప్రవర్తన ప్రతి ఒక్కరికీ తెలియాలి . మీరు అనుమతిస్తే అన్ని కామెంట్స్ ను కలుపుతూ ఒక ఫైనల్ నోట్ సబ్ మిట్ చేసుకుంటా అని. అనుమతించిన సారంగకు ధన్య వాదాలు .

” కలాం నిజాయితీ గా ఎదిగిన ప్రొఫెషనల్ కు తార్కాణంగా , మధ్య తరగతి ప్రజల కలల ఆదర్శంగా నిలిచాడు. ” లాంటి ఉపోద్ఘాతం తో తో మొదలు పెట్టి ” ఒక ‘ కెరీరిస్ట్ లిబరల్ ‘ ను ‘ ప్రజల మనిషి ‘ అనడం మాత్రం హత్యా పాతకం !! ” తో ముగిసిన వ్యాసమిది. ఒకరు ముందూ వెనకా చూడకుండా ” రబ్బిష్ ” అన్నారు, ఇంకొంచెం ముందుకెళ్ళి ” పిచ్చ నా ____ ” అన్నారు ( ఫిల్ ద బ్లాంక్స్ అని రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకపోయింది…ప్చ్ ! ), మరొకరు వ్యాస కర్తను ” చెప్పుచ్చుకు కొట్టాలి ” అన్నారు, ఎవరో ” ఫూల్” అన్నారు, ఇంకొకరు ఉద్వేగం ఆపుకోలేక “ఆకుకు ____ తెలియని వ్యాసమిది ” ( ఫిల్ ద బ్లాంక్స్ రిక్వెస్ట్ చేయడానికి అది నాకొక్కడికే సంబంధించింది కాదు. మొత్తం స్త్రీ సమాజానికి సంబంధించింది) అని దుర్గా మాతగా కొలిచే ఆడ వాళ్ళను అలవోకగా వాడుకుంటూ అటాక్ చేయడానికి వెనుకాడ లేదు.

అసలు మనువాద ఆలోచన విధానం అన్నది ఈ దేశాన్ని సగం తినేసింది. వ్యతిరేక దృక్పథాన్ని సహించలేని ఓర్వలేని తనం ఆ మనువాదం నర నరాన ఉంది. దళితుల నాలుకలను తెగ కోసిన ” దుర్మార్గమైన అసహనం ” కలిగిన నీతి అది. అదే నీతి దేశం లో మత విద్వేషాలకు ఆజ్యం పోస్తుంది. అదే కుటిల నీతి – మీరు మొత్తం చరిత్ర చదవండి….ప్రెసిడెంట్ స్థానానికి నారాయణన్ కల్పించిన విలువ, ఇక ఏ ఒక్కరన్నా కల్పించి ఉండి ఉంటే చెప్పండి. దేశ అత్యున్నత స్థానం లో దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కు తలూపే ప్రెసిడెంట్ లు తప్ప ఎవరూ కనిపించరు. దళితుడైన నారాయణన్ ప్రెసిడెంట్ కావడానికి కారణం బీసీ, దళిత కులాలను రెప్రెజెంట్ చేసే పార్టీలే . 1997 లో అతను ప్రెసిడెంట్ అవ్వడం కాంగ్రెస్ నిర్ణయం కాదు. అది వెనుకబడిన కులాలు, ద్రవిడ పార్టీలు ఎంచుకున్న వ్యక్తి నారాయణన్. అతను తీసుకున్న తిరస్కార నిర్ణయాలు కాంగ్రెస్ కు , బీ జే పీ పార్టీలకు కొరుకుడు పడ లేదు. మొదటి టర్మ్ లో నిజానికి పర్ఫార్మెన్స్ చూపినా , సెకండ్ టర్మ్ కు కాంగ్రెస్ , బీ జే పీ మద్దతుతో పైకొచ్చిన కలాం అవసరం లేకపోయింది.

ఇది నారాయణన్ ను ” గ్లోరిఫై ” చేయడం కాదు. నారాయణన్ పక్కా కాంగ్రెస్ పార్టీ వెనుదన్నుగా ఉంచుకుని పైకి వచ్చాడు. నిజానికి నాకూ గ్రీవెన్స్ ఉంది – ఒక పేద దళిత కుటుంబం నుండి వచ్చి, క్రియా శీలంగా, తనకున్న పరిమితుల్లో , తనకున్న రాజకీయ చాక చక్యం తో , తనకున్న స్థాయిలో ఈ దేశం లో అణగారిన దళితులకు తగినంత కృషి చేయలేదే అని.

ఐతే ఈ వ్యాసం మొత్తం అడిగిన ప్రశ్న ఒకటే – నిజాయితీగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి – మీరు ఏ గొప్ప కలాం లో చూసారో ఆ గొప్ప నారాయణన్ లో ఎందుకు కనిపించలేదు ? ఒళ్ళు తెలీకుండ మీదకెత్తుకునే తిరిగే కలాం లో ఉన్నదేంటి ? నారాయణన్ లో లేని దేంటి ? కలాం చేసిన తప్పుల్లో అర్థం చేసుకునేదేంటి ? నారాయణన్ తప్పుల్లో అర్థం కానిదేంటి ?….కలాం కు ఇచ్చిన స్థానం నారాయణన్ కు ఎందుకు కల్పించలేకపోయింది ?

Systemic bias అర్థం చేసుకోవాలంటే మనువాద ఆలోచనలు ముందుకు తోస్తాయి. ఇంత మీడియా ( అప్పట్లో వేదాలు ) తెగ నోరేసుకు తిరిగితే – ఇన్నాళ్ళు మాకున్న నమ్మకం బూటకమైతే – మేమెలా తట్టుకో గలం అనే ఒక భావన. అలాగే క్వశ్చన్ చేయడాన్ని మనువాద ఆలోచన అక్కడే ఆపేస్తుంది. తిరుగు బాటుకు తగిన గుణ పాఠమెంటో చెప్పాలనే ఉవ్విళ్ళూరుతుంది. ముఖ్యంగా హైందవ నాగుపామును తలకెత్తుకున్నాక – కరిపించుకోవాల్సిందే తప్ప విసిరి కొట్ట రాదు. ఇదీ మనువాద ఆలోచన !

” ఏ వ్యక్తినైనా మహానుభావుడిగా వర్ణించే మన దేశ ప్రజల సంస్కృతిలో మనువాదం బలపడిపోయింది. మన ప్రమాణాలు అతి తక్కువ స్థాయికి దిగ జారి కేవలం – నిజాయితీగా ఇబ్బంది కలగ కుండా తమ విధిని నిర్వర్తించడం కూడా ఒక మానవాతీత గుణం అయిపోయింది ” అని ఈ వ్యాసం చెప్పడం గమనించి ఉంటే కృతజ్ఞతలు.

అంబేద్కర్ మూడు సార్లు ఎలక్షన్ లలో పోటి చేసి డిపాజిట్ కూడా లేకుండా ఓడించబడ్డాడు. కోల్పోని ధైర్యం తో అంబేద్కర్ స్వాంతంత్ర్య సమరం peak లో ఉండగా – గాంధీ ని దుమ్మెత్తి పోసాడు. ( నిజానికి గాంధీ [ ఇమేజ్ ను బహిర్గతం చేసి ] నోట్లో దుమ్ము కొట్టాడు అంటే నిజమేమో ?! ) . అంబేద్కర్ ” నేను హిందువుల తోటలో పాము లాంటి వాడిని ” అని చేసిన తిరస్కార గర్జన ఇప్పటికీ చల్లార లేదు.

గాంధీ విమర్శకు అతీతుడా ? కలాం విమర్శకు అందని దేవుడా ?

మీరు ఆరిందం చౌదరి రాసిన పుస్తకాలు చదివారా ? కలలు అమ్మడం ఒక గొప్ప మార్కెటింగ్ కళ. అందునా అభివృద్ధి కరువైన మన దేశం లో అది మరీ సులభం. ఆరిందం చౌదరి పుస్తకాలు మిమ్మల్ని కలాం పుస్తకాలకు ధీటుగా ఇన్స్పైర్ చేయకుంటే చెప్పండి. Ayn Rynd వ్రాసిన ” సీక్రెట్ ” పుస్తకం చదవండి – మీలో ఉరికే పాజిటివ్ ఎనర్జీ మీరే చూసుకోండి . ఆరిందం చౌదరి స్కాం లో అరెస్ట్ అయ్యాడు. Ayn Rynd కోట్లకు పడగలెత్తింది – కేవలం కలలను అమ్మడం తోటే. నిమ్న దేశాల్లో, నిమ్న మనసులకు Emotional hype ఇవ్వడం గొప్పగా చిత్రీకరించడం మను వాదానికే చెల్లింది.

కలాం పబ్లిక్ లైఫ్ – మధ్య తరగతి మనిషి కెరీర్ కోరికలకు ప్రతిబింబంగా , వివాదాలకు అతీతంగా ఇమిడి పోయే అందమైన జీవితాన్ని ఎన్నుకోడానికి మార్గ దర్శంగా నిల్చాడు కాని , తన సైన్స్ తో మానవత్వం కలిపి ప్రాక్టికల్ గా ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. మీ దగ్గర ఏవన్నా గట్టి సాక్ష్యాలు ఉంటే తీసుకు రండి. తెలుసుకోవడానికి అభ్యంతరం ఇసుమంత కూడా లేదు. We are inspired by Kalam’s life అంటే అది వ్యక్తి గత అభిప్రాయం And you need a model man to build a career to emulate, which is completely understandable. దానితో పేచీ లేదు. ” ప్రజల మనిషి / పీపుల్స్ ప్రెసిడెంట్ ” అంటేనే చిక్కు !! ఇక్కడ – ఒక Individual interest కలిగిన అభిప్రాయాన్ని , అందునా ఒక మంచి ‘ స్వంత జీవితం ‘ గడపాలనే ఒక closed view ను Public opinion for public good లా చూపడం తో ఈ వ్యాసం ఖచ్చితంగా విబెధిస్తుంది.

‘ అచ్చే దిన్ ‘ పేరుతో మభ్య పెట్టి , 60 సంవత్సరాలలో చేయనిది 5 సంవత్సరాలలో చేస్తానని మానవాతీతమైన ప్రమాణాలు చేసి, నల్ల ధనం వెనక్కు తెస్తాననే అత్యాశ కలిగించి – కనీ వినీ ఎరుగని రీతిలో అధికార దాహం లో కులం, మతం ను వెనకేసుకుని సిం హాసనం ఏలుతున్న మోదీ దీర్ఘ కాలము నిలవడు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలు కూడా అంతే. ఆ రోజు – ఇంత మహనీయుడు కలాం పాత్ర మరి ఏంటి ఈ పాపం లో అంటే – గుండెలు తడుముకోవాల్సిందే.

దయ చేసి వ్యవస్థతో మమేకమైన ఒక వ్యక్తిని అంచనా వేయడానికి mid way లేదు గమనించండి.

కలాం కొటేషన్స్ మత్తెక్కిస్తాయి. అది విషయం కాదిక్కడ. బాబా ల ముందు సాగిల పడ్డం యే విజ్ఞానానికి ప్రతీక ? యే సెక్యులరిజానికి ప్రతీక ? కలాం కు కావాల్సింది పొగడ్త కాదు. నిజానికి బోలెడంత సానుభూతి !! తన కుటుంబం నమ్మని మత గ్రంథాలను చదివాడు, తన సైన్స్ నమ్మని స్వాములకు దండం పెట్టాడు, ఊచకోత జరుగుతున్నా ఒక పక్క నారాయణన్ ” ఈ అల్లర్లకు అక్కడి అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఉంది ” అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంటే తన కళ్ళకు, తనలో మానవత్వానికి గంతలు కట్టేసుకున్నాడు . ఇదంతా తాను ఈ దేశం నమ్ముకున మను వాద వ్యవస్థ లో మనడానికి పడ్డ కష్టాలు. ఒక మైనారిటీ వ్యక్తి ఈ దేశం లో ముందుకెళ్ళాలంటే – ఎన్నొ పరీక్షలకు గురి అవ్వాలి. తన ఆత్మ గౌరవాన్ని పణం పెట్టి తన ఇమేజ్ ను పదే పదే చెక్ చేసుకోవాలి – అని కలాం తన జీవన విధానం లో చెప్పకనే చెప్పాడు. ఆయన ( నేను నమ్మని ) ఆత్మ , పనికి రాని పొగడ్తల కోసం కంటే సానుభూతి కోసం చూస్తుందని నా నమ్మకం !!

P S : సారంగ లో యాక్టివ్ గా ఉండే ఎంతో మంది మార్క్సిస్టులకు ఒక విఙప్తి ! మనమింకా అద్భుతమైన ఆదర్శ సమాజం ఏర్పరుచుకోలేదు. నారాయణన్ ఈ బూర్జువా వ్యవస్థ accommodate చేసిన దళిత వ్యక్తి. ఆయనకున్న పరిమితులు ఆయనుకున్నాయి. సమస్య అది కాదిక్కడ. వ్యవస్థీకృతమైన మనువాదాన్ని వ్యతిరేకించాలంటే – నారాయణన్ ను సపోర్ట్ చేయ డానికి వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు.

గాంధీ ” sentiment ‘ అయితే అంబేద్కర్ ” Counter sentiment ” అవుతాడు. కలాం ” sentiment ‘ అయితే నారాయణన్ ” Counter sentiment అవుతాడు.

మన దేశం లో ఉన్నది ప్రధానంగా మనువాద బ్రాహ్మణీయ అగ్ర కుల సమాజం. కాబట్టి ” కలాం ఇమేజ్ ” కేవలం మత ఛాందస వాద సమస్యే కాదు. This is an issue of systemic bias this state is practicing
Dont hesitate to support Narayanan, if you truly believe , you have to fight out the menace of majority fundamentalism in this country and I am sure this casteist society will have one ” Counter sentiment “, it tries to hide, unless you really search for.
*

మీ మాటలు

 1. సుజన says:

  ఈ దేశంలో మనువాదం, దానికి వ్యతిరేకవాదం ఇప్పుడే పుట్టలేదు. అవి చాలా కాలంగా ఉన్నాయి. ఆ తేడాను చూపించినందుకు విజయకుమార్ గారిని తిట్టిపోయక్కర్లేదు. భిన్న అభిప్రాయంగానే తీసుకోవాలి. చేతనైతే సంస్కారవంతంగానే జవాబు చెప్పాలి. రెండు వాదాల మధ్య డైలాగ్, అవగాహన ఎప్పటికైనా ఒక అవసరం. లేకపోతే ఈ దేశం ఎప్పటికీ ముందుకెళ్ళదు. నోరు మూయడం సమాధానం కాదు. బ్రాహ్మణిజం అంటే ఓ కులం వాళ్ళు ఎక్కడ దుమ్మెత్తిపోస్తారో అని మనువాదం మాట రచయిత వాడినట్టుంది. రెండూ ఒకటే. బ్రాహ్మణిజం అనే మాటను కులానికి ఆపాదించుకుని దాడి చేసేవాళ్ళు వాస్తవానికి సంతోషించాలి. ఎందుకంటే ఈ దేశం ఇప్పటికీ మనువాదం పాము పడగ కిందే ఉంది. మనువాదానికి హారతి పట్టేవాళ్ళే అధికారంలో ఉన్నారు. ఉంటారు. విజయకుమార్ గారు కూడా ఒక వాస్తవం గమనించాలి. ఈ మనువాదం పాముకు కుంభాలకొద్దీ పాలు తాపిస్తున్నది బ్రాహ్మణేతర కులాల వాళ్ళే. యాంటీ బ్రాహ్మిన్ ఉద్యమంతో పైకొచ్చిన కులాలవాళ్లు మనువాదానికి తొత్తులుగా మారిపోతున్నారు కనుకే మనువాదం మనుగడ సాగిస్తోంది. గోదావరీ పుష్కరాలనే బ్రాహ్మినికల్ అజెండాను నెత్తిన పెట్టుకుని దాన్నో ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడమే చూడండి. ఈ మనువాదం వేయి తలల పాము. కుల మతాల చీలికలు తెచ్చే ఈ విషనాగే కుల మతాలను ఎందుకు తీసుకొస్తారని అడుగుతుంది. ఎప్పటికప్పుడు రంగులు మార్చడమే దాని విజయానికి కారణం. దాని అసలు రంగు మాత్రం ఎప్పైటికీ మారదు. సొంత అవసరాల కోసం మనువాదానికి తొత్తులుగా మారే బ్రాహ్మణేతర కులాలవాళ్లు ఇంకెన్ని సంవత్సరాలు శుష్క పోరాటాలు చేస్తారు? విజయకుమార్ గారు ఇది కూడా ఆలోచించాలి.

 2. B. Narsn says:

  ఘర్షణ ఉండల్సిందే. ఇదో అద్భుత సందర్భం . మనువాద అద్దాన్ని బద్దలు కొట్టేద్దాం .మీకండగా కొట్లాదిగా సిద్ధం . ఆగే బడో హమ్ ఆప్కే సాత్ హై. ‘విజయీ ‘ భవ

  • p v vijay kumar says:

   :) :)

   the tears of blood shed by dalit and other poor classes wiuld teach a lesson to manuvada ideology in coming days.

 3. ప్లీజ్ స్టాప్ దిస్ టైప్ అఫ్ నాన్సెన్స్. కుల మతాల ప్రస్తావన రావద్దంటారు… అందులో మళ్లీ అగ్రకులాలు, హిందూ మతం అంటూ అడిపోసులుంటారు..ఇదేనా సేక్యులరిసం అంటే…ఒక హిందూ మీ పైన ఇటువంటి కామెంట్స్ చేస్తే ఏమంటారు..???? మను వాదం గురించి రచయితకు ఎంత తెలుసు…???
  ఇది అంత ఒక ప్లాన్ ప్రకారం హిందూ మతాన్ని, ధర్మాన్ని దెబ్బ తియడానికే జరుగుతుంది… ఈ చర్యల వాళ్ళ రచయిత ఎంత మొత్తం వెనకేసుకుంటున్నాడు??? ఎక్కడినుంచి వస్తుంది?????

 4. Raghava says:

  Dear Victor,
  1) K.R Narayan was correct to condemn 2002 Gujarat riots. Any one in right mind would condemn those barbaric acts. He joined Congress party in 1984 and anti-Sikh riots happened in 1984. Then Why exactly this great humanitarian was silent about that? Does he agree that they were done by congress men only ? I never saw him at least taking the case for rehabilitation of victims when he was president ( or writing letters to government)let alone punishing perpetuators .
  Do you have evidence to prove the contrary? So he is secularly inactive when congress is power. We have seen enough of this part time humanitarians and secularists.
  2) Kalam was famous because peoples saw that he was selfless, visionary and hardworking. He never used any of the privileges of his post. He never let anyone from his family stay more in the rashtrapathi bhavan and even paid for their expenses when they did stay. He is unmarried and even after leaving presidency He worked with many universities for inspiring youth of this country. That’s he has this following across the country. Who stopped Narayan from doing the same? His speeches were never inspiring. He might be very knowledgeable but he just not a good orator like kalam.
  3) There was never speech of Kalam without saying that Poverty and corruption are main enemies of this country. If anybody would have invited him for speaking at Dalit conference, I am sure he would have agreed.
  4) His spirituality is his private matter. No doubt he was picked because he was close Hindu spirituality. Why are you making it a crime? In America, Every politician wears his Christianity on sleeve and no has issue with that. Cameroon said that UK is Christian country and Angela asked Germans for returning to Christian values.
  Why is it a crime in India?
  5) You said that asking for Common Civil Code shows Kalam political immaturity.
  To me this shows your moral bankruptcy. So Civil code which allows men to marry four women is okay for you? Which no other modern society agrees. Girl Child getting only half of what son can inherit from family’s assets is okay for you?. I am okay with even having separate civil codes but these laws should go. In your blind hatred for Hinduism you are losing your common sense.
  6) Kalam agreed for President Rule in Bihar. We all know how bad Bihar was during Lalu’s Jungle raj. He might have taken time but decision was okay.
  7) I never saw any efforts from Mr. Narayan for empowering, helping or educating any section of the society . Did he even do that for Dalits or even his own Paravan community? I am very happy even he does good work for his poor fellow community members.If you have any reference, Please let us know.
  8) You mentioned that Mr Arindum Choudary is even better than Kalam. This shows you immaturity and blind hatred nothing else. Mr Arindum is good author but proven fraud. If I give a speech about hard work, Most of the students may appreciate. If I back it with my experience, They may get inspired. However after giving speech, If they find me indulging in any fraudulent activities that essence of speech is gone. Kalam Sir didn’t just preach that work hard and dream, He did it all his life. He never mentioned how humble or simple he is. His lifestyle and his choices conveyed that message. His gentleness and caring nature gave us those numerous anecdotes which give us positive impression of that great personality. He could have taken rest after his tenure. All this efforts for talking and inspiring youth weren’t needed at all. He did it out of his passion. I don’t believe he was interested in money or power.
  9) I never saw any message or article from you about helping Dalits for career advancement. How we can have more Dalits into IT or other fields or how we can help or guide Dalits students for going abroad. How we can have more Dalits in Start-ups or entrepreneurship. All I see is criticizing Upper castes , Propagating beef and Dalit rock. You have right to do all the above but don’t you think for every two conferences on such things you can have one for how to help Dalits progress.

  • wilson Sudhakar Thullimalli says:

   అదేంటో రాఘవగారు, నాకూ విజయకుమార్ గారికి హిందూ నామ ధేయాలున్నా కావాలని క్రైస్తవ నామధేయాలతో పిలుస్తున్నారు. సామాన్యంగా పేరు చివరి పేరుతోనే పిలుస్తారు. ఇది రాఘవగారికి తెలియదా! దీని భావమేమి రాజ్యంగా నిర్మాతా!

   • P V Vijay Kumar says:

    మా అమ్మ, పేద కుటుంబం నుండి రావడం వల్ల, చిన్నప్పుడు బ్రిటిష్ దొరలు పెట్టిన హాస్టల్ లో పెరిగింది. అక్కడ విక్టర్ దొర పేరు నాకు తగిలించింది. పెట్టినప్పుడు అదేదో స్టైల్ గా కూడా ఉంటుందనుకునింది. ఆ పేరు పెట్టినప్పటి నుండి మా నాన్న గొణుగుడే ….:) … ఇక్కడా ఒకే ” కుత కుత “….

 5. మనువాదులూ, మూర్ఖిస్టులూ ఇద్దరూ ఒకే తానులోని ముక్కలు.

 6. nagaraju says:

  హెచ్చార్కె ఈ సందర్భంలో అన్నట్టుగా వివేకానందుని గురించిన చర్చ కూడా జరిగితే మంచిది.

  కలాం బహుశా తనను తాను రెండవ వివేకానందునిలా భావించి ఉండవచ్చు. ( ఈ వైపు నుండీ మీడియా ప్రచారం జరిగుంటే మరింత చచ్చుండేవాళ్ళం) వివేకానందునిలాగానే ఈయనా యువతను ఉద్దేశించే తరుచూ మాటాడాడు.

  వివేకానందుడు మనుషుల గురించీ, వారిలోని శక్తి గురించీ, సంకల్ప బలం గురించీ మాటాడుతాడు. కానీ ఆయన ఉద్దేశించిన మనుషులు, నిజమైన మనుషులు కాదు.
  వాళ్ళకు కులమూ. వర్గమూ ఉండవు.

  సంస్కృతి గురించీ, చరిత్ర గురించీ మాటాడుతాడు. కానీ అందులో ప్రజల సంస్కృతీ, చరిత్రా ఉండవు. ఆయన ఎదిగివొచ్చిన కాలం- యూరప్ యాంత్రిక ఆధునికతకు వ్యతిరేకంగా ప్రాచ్య దేశాల నిగూఢ తాత్వికతకు మార్కెట్ డిమాండ్ పెరుగుతున్న కాలం. అసలు, చరిత్ర, సంస్కృతి, జాతీయత గురించి సంఘ్ పరివార్ ఈ రోజు మాటాడుతున్న అనేక విషయాలకు వివేకానందుడు ఒక ముఖ్య వనరుగా ఉంటూ వచ్చాడని చాలా మంది విమర్శకులు చెబుతున్నారు.

  వివేకానందుడు కూడా కలాం లాగే వ్యక్తిగత ఆస్తి లేకుండా బతికిన వ్యక్తి, సన్యాసి. ఎవరు ఎలా ఎదుగుతూ వచ్చారన్నది కాకుండా – ఎవరికి భావజాల పరంగా ఉపయోగపడుతున్నారన్నది అసలైన విషయం.

  కలాం రాతలు, జీవితాచరణ కూడా వివేకానందునిలాగే ఒక మిధ్యా సమాజాన్ని ఉద్దేశిస్తాయి. ఆకలి గురించి, అవినీతి గురించి ఆయన మాటాడినా అది సమాజ అంతరాల మూలాల గురించి కాదు. సామ్రాజ్యవాద పాత్ర గురించి కాదు.

  నిరంతరమూ శత్రువు బూచిని చూపించనిదే సంఘ్ పరివార్ కానీ, అమెరికా సామ్రాజ్యవాదం కానీ మనుగడలో ఉండలేవు. సందర్భవశాత్తూ తనతో కలిసివస్తున్న కలాంను మిలిటరియిజానికీ , ఒద్దికైన ముస్లీంకు సంకేత్మాత్మకంగా సంఘ్ పరివార్ చూయించదలుచుకుంది. అవకాశవాద అవినీతి రాజకీయాలవల్ల ఈ ప్రచారానికి విమర్శే లేకుండాపోయింది. గుజరాత్లో మారణహోమం చేసిన మోడీని, అభివృద్ధిదాయకుడిగా చూపెట్టిన మీడీయా కలాంలో యువతకు దార్శనికుడిని చూపెడుతోంది. ఇదంతా భావజాల మాయ.

  • p v vijay kumr says:

   I am truly glad abt this particular comment. In fact, I hav strted studying Vivekananda as Kalam too marketed dreams like him mainly to middle class. Nagaraju garu, u hav good value addition to this article and thank u for the same. Pls connect to me on my mail

 7. మనువనేవాడిని వ్యతిరేకించడానికి హేతువుగా చూపుతున్న -అసహనం, అనీజీ- వంటి లక్షణాలు పెద్దగొంతుతో మనువాదాన్ని వ్యతిరేకించే వ్యక్తుల రచనల్లో ఎక్కువగా కనిపించడం డ్రమటిక్ ఐరనీ…. విక్టర్ గారు క్షమించాలిగానీ కలాంపై మీరు రాసిన రెండు వ్యాసాలలోనూ మనువాద లక్షణాలు ఇంగువ వాసనకంటే ఘాటుగా ముక్కుపుటాలను అదరగొట్టేస్తున్నాయి. అత్యున్నత వ్యక్తిత్వం కలిగిన నారాయణన్ను ఓన్ చేసుకోవడం, మరో శిఖరం లాంటి వ్యక్తిని ఆయనతో పోల్చడం మనువాద తెంపరితనమే అవుతుంది. పైగా, ఆవుకథ మాదిరి ప్రతిసారీ మోదీ ప్రస్తావన… ఆపైన ఆయన పడిపోతాడంటూ శాపనార్థాలూ. ఇవేనండీ….. సరిగ్గా ఇవే- మనువాద లక్షణాలు. వేటినైతే వేలెత్తి చూపుతున్నారో వాటినే పుణికిపుచ్చుకోవడం మీ వ్యాసాల్లోని వైచిత్రి.

 8. Victor garu,

  రాఘవ గారి కామెంట్ చాల బాలన్సుడ్ గానే ఉంది. దానికి ఎందుకు సమాధానం ఇవ్వలేదు? మనువాదం ప్రశ్నించడాన్ని సహించదు అన్నారు. మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకి సమాధానం సూటిగా చెప్పకుండా మీరెందుకు తప్పించుకుంటున్నారు?

  uniform civil కోడ్ ప్రసక్తి మీరే తెచ్చారు. దాన్ని ప్రశ్నిస్తే చర్చ పక్క దోవ పట్టిశ్తున్నరన్నారు. this is not the way to conduct a discussion. If you still stand by that statement, you should explain why you believe so and participate in the discussion. If you made a mistake, you can accept it is a mistake and retract that statement. This is the way to build trust and respect in a discussion.

  • సుజన says:

   యూనిఫాం సివిల్ కోడ్, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య బీజేపీ మేనిఫెస్టోలో ఎప్పటినుంచో ఉన్నవేగా? ఇప్పుడు లోక్ సభలో 382 మంది సభ్యులున్నా ఎందుకు వాటిని అమలు చేయడం లేదు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూనిఫాం సివిల్ కోడ్ ను తెస్తామన్నవారు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? జమ్ము-కాశ్మీర్ లో బిజెపి ఇప్పుడు అధికారపక్షం కదా! అయినా ఎందుకీ మౌనం అంటే ఏకాభిప్రాయం లేదు కనుక. యూనిఫాం సివిల్ కోడ్ ను సొంత అజెండా చేసుకున్న బీజేపీయే ఏకాభిప్రాయం కావాలంటుండగా, ఇతరులు మాత్రం కచ్చితంగా దానిని తీసుకురావాలని చెప్పాలా?
   ఏకాభిప్రాయం లేకుండా యూనిఫాం సివిల్ కోడ్ వద్దనే వాళ్ళను దేశద్రోహులుగా చిత్రించేవాళ్ళకు ఓ ప్రశ్న. యూనిఫాం సివిల్ కోడ్ లానే స్కూళ్ళలో యూనిఫాం సిలబస్ ను ప్రవేశపెట్టాలంటే మీరేమంటారు?

   • Sujana garu,

    Reread what I said above and try to stay on topic. This is not a discussion about BJP, their agenda, why uniform civil code is still not a reality. Also, no one tried to paint anyone as a “desadrohi”. Certainly not me. None of those are in my comment.

    All I said was the author himself brought up Dr. Kalam and his stance on uniform cicil code, and when questioned on that, he wouldn’t answer. He evaded answering by saying the topic is being diverted deliberately. I am just reminding him above that no one is diverting the discussion. He is the one who brought it into discussion.

   • wilson Sudhakar Thullimalli says:

    బాగా చెప్పారు సుజన గారు. వందనాలు

 9. Another thing. Comparing Arindam Chowdhary(a scam artist) to Dr. Kalam???? This is insane.

  Everything Dr. Kalam preached is practiced by him. His entire life is an example of the values he stood for. He is not a career politician like Narayanan who opened his mouth when it suits his party interests.

  • సుజన says:

   సుజాత గారు, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తనే తెచ్చి, దానిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగానే ఈ వ్యాసరచయిత అది వేరే విషయమని తప్పుకున్నారని మీరు ఆయన్ను తప్పుపడుతున్నారు. బాగానే ఉంది. కానీ రాఘవగారు వెల్లడించిన ‘బాలన్సుడు’ అభిప్రాయం(అందులో యూనిఫాం సివిల్ కోడ్ కూడా ఉంది)పై మీరు సమాధానం ఎందుకు చెప్పలేదని రచయితను ప్రశ్నిస్తూ మీరే చర్చను పొడిగించారు.. కనుక టాపిక్ కు కట్టుబడండని ఇంకొకళ్ళకు .చెప్పలేరు. యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడేటప్పుడు బిజెపిని మీరు తేవద్దనడం కూడా విచిత్రంగా ఉంది. గాంధీ హత్య గురించి మాట్లాడేటప్పుడు గాడ్సే పేరు ఎత్తద్దు అన్నట్టు ఉంది ఇది. పూర్తి మెజారిటీ ఉన్నా తన అజెండాపై బిజెపి ఎందుకు నోరు ఎత్తడం లేదో మీరు చెప్పాలి. యూని ఫామ్ సిలబస్ పై నేను అడిగిన ప్రశ్నకు కూడా.

 10. Mallikarjuna Rao says:

  Vijayakumar gari opinion చదివాను
  Science nu samanyuniki upayoginchaledani annaru kalam gari గురుంచి
  Vaariki handicapped variki missile technology lo vade material DRDA develop chesimdi upayogimchi tayaruchesina callipers gurimchi teleeda

 11. subhadra says:

  సీక్రెట్ పుస్తకం రాసినది అయాన్ రాండ్ కాదు. రోండా బైర్న్.. గమనించగలరు

 12. Srutha keerthi says:

  Secret book was written by Rhonda byrne not by ‘Ayn rand ‘ .

 13. P V Vijay Kumar says:

  సుభద్ర అండ్ శృత కీర్తి గారు, సిన్సియర్ అపాలజీస్. Dint notice the mistake till you point out. I Am truly very glad about this. I request the editor of Saaranag to plase take cognisance and correct the typo. Thanks again.

 14. Sudarshan says:

  We may voice out analytical views, but we should not be tempted by fallacies – either brahminical or dalit related. We should also try to overcome such things. Harping on the divisions will still create further breaches. Intellectuals should open their eyes and contribute for the development of society. We can criticise people if they are narrowminded, biased and selfish. Leaving all selfish people who have been exploiting our nation and its resources,and the issues that should be addressed to create awareness among the uneducated, let’s not waste time on issues that are of no value. We cannot change the DNA but we should at the same time not widen the existing breaches. Let’s do something good for the society without any favouritism or bias. Kalam hasnot done any harm to society. He did what he had believed in and his life was not at all harmful. He inspired thousands of students which is not done by the so called intellectual – writers. Let’s think a while before attempting great articles of research on people who have not done any harm to society.

 15. rani siva sankara sarma says:

  కలాం కేరీరిస్టు తప్ప మరేమీ కాదు. ఆయన గురించి ఇంత చర్చ కూడా అనవసరం. ఆయనకీ ప్రత్యేక సిద్ధాంతం ఏదీ లేదు కనుక నారాయణన్ కి ప్రత్యర్థి కూడా కాలేడు. కానీ గాంధి హిందూ కమ్యునలిజానికి ప్రత్యర్థి . ముస్లింలకి అనుకూలంగా ఉన్నాడనే ఆయన్ని హిందూ బ్రాహ్మడు చంపేసాడు .ఇప్పటికి హిందువాదులు గాడ్సే పేరు వెలుగు లోకి తెస్తూనె ఉంటారు.గాడ్సేనే హీరో అంటారు.అందువల్ల గాంధి kalamulani ఒకే గాటన కట్టడం హిందూ క్రిస్టియన్ కుట్ర .

 16. wilson Sudhakar Thullimalli says:

  నిజానికి కలాం ను గాంధీతో పొల్చాలిసిందే. దొందు దొందే. మనువాదానికి ఇద్దరూ తప్పెటలూ తాళాలు మోగించారు. జాతీయోద్యమంలో మతపర పదజాలాన్నే, భావజాలాన్నీ ప్రవేశ పెట్టినవాడు జిన్నాకాడు, గాంధీనే. లౌకికవాదానికి దూరం అవడంలో ఒకరికొకరు పోటీ పడ్డారు. అవసరమైనప్పుడు నోరు తెరవని ఈ మానవాతీత వ్యక్తిత్వాలని మంట పెట్టాలి. హిందూ పతాకాల మొత్తం జాతిని ఏకం చెయ్యాలని చూస్తున్న పార్టీకి ఈ జుట్టుపోలిగాడు వంత పాడాడు. అంబేడ్కరిజం చదివిన వారెవరూ నారాయణన్ లా గొంతేత్తకుండా వుండరు.
  మనం ఇక్కడ చంకలు గుద్దుకోడమే గానీ ప్రపంచం కలాం ను ఒప్పుకోలేదు. ఒక న్యూక్లియర్ శాస్త్రవేత్త దేశానికి అధ్యక్షుడా అని జపాన్ పెదవి విరిచింది. ఇలా ఎన్నో ఉదాహరణలు.
  అయినా బలహీనపడిన లౌకికవాదం హిందుత్వను అడ్డులోలేదు. అందాకా కలామే ఆముదం చెట్టు.

  • SrInivas Vuruputuri says:

   “జుట్టుపోలిగాడు”?

   Sudhakar gaaru, this is atrocious. I wish you didn’t say that.

   • రమణ says:

    కలాంను జుట్టుపోలిగాడు అనడం తప్పే. అలాగే ఈ వ్యాసరచయితను దొంగ నా-అంటూ బూతులు తిట్టడం అంతకంటే నీచం, ఆ బూతుల ముందు జుట్టుపోలిగాడు అనే మాట అంత atrocious కాదు. కానీ హిందూ సంస్కృతి సంస్కార వాదులెవరూ బూతులు రాయడం తప్పు అనలేదు. సారంగలో ఇలాంటివాటికి తావు ఇవ్వద్దని కోరలేదు. ఇదే మనువాదం అంటే. ఇందులో గొప్పవాళ్ళకు ఒక నీతి, మామూలు వాళ్ళకు ఒక నీతి..అగ్రవర్ణాలు-అస్పృశ్యులు, మర్యాదస్తులు-అలగాజనం- ఇదే మనువాదసారం.

   • Wilson Sudhakar Thullimalli says:

    ‘జుట్టుపోలిగాడు’ అన్నది మనువాదులగురించే నండీ. ఆ మాట అక్కడ పడడం వల్ల వేరే అర్ధం వస్తోంది. అనేక సందర్భాలలో ఆ పదాన్ని మేము వాడుతున్నాము.

   • SrInivas Vuruputuri says:

    రమణ గారికి

    ఆ బూతు తిట్లు చాలా నీచమైనవన్న విషయంలో సందేహం లేదు. అలాంటి భాష వాడే వారి మీద నాకెలాంటి సానుభూతీ లేదు. ఐతే సుధాకర్ గారి నుంచి నేను ఎక్స్^పెక్ట్ చేయని మాట కనుక atrocious అనాల్సి వచ్చింది. సరే, ఆయనే జవాబిచ్చారు కనుక ఇక చర్చ అనవసరమేమో

    శ్రీనివాస్

  • కలాము ను ప్రపంచం ఒప్పుకోకపోతే ఎమి? జపాను బోటి దేశం ఇండియాకు నీతులు చెప్పేది ఎమిటి? అదొక పెద్ద దేశం అయినట్లు , దాని నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్ ను సీరియస్ గా తీసుకోవటం. కామేడి గా ఉంది.

   జుట్టుపోలిగాడు అని కలముగారిని అనటం అభ్యంతరకరం. మీ అసహనానికి అర్థమే లేదు. కలాం గారు రాజకీయ నాయకుడు గాదు . ఆయన ఏ సిద్దాంతము భుజాన వేసుకొని జీవితకాలము కొమ్ము కాయలేదు. రంగుటద్దలూ వేసుకొన్ తీవ్రంగ విమర్సిస్తే నవ్వులపాలవట్టం మించి మీకు లాభించేది ఎమి ఉండదు.

   • రమణ says:

    .//జపాను బోటి దేశం ఇండియాకు నీతులు చెప్పేది ఎమిటి? అదొక పెద్ద దేశం అయినట్లు// దేశాల మధ్య, కులాల మధ్య, మనుషుల మధ్య ఇలా చిన్న-పెద్ద తేడా తీసుకురావడం, చిన్నవి చెప్పుకింద తేలులా ఉండకపోతే తొక్కేయడం- ఇదే మనువాదం.

   • జపాన్ చిన్న దేశం, మనది పెద్ద దేశం కనుక చిన్న దేశాన్ని లెక్క చేయకపోవటం మనువాదుల లక్షణం. ఇలా మీకర్థమైందన్న మాట.చైన తో దాని గొడవల సంగతేమిటి? గోచిగుడ్డంత దేశం, సామ్రాజ్య విస్తరణ కంక్షతో ప్రపంచ యుద్దం లో పాల్గొనలేదా? దానికేమంటారు?

    ముసలోళ్ళ సంఖ్య పెరిగి యువత సంఖ్య చాలా తక్కువగా ఉన దేశం, అయినా ఇతరదేశాల నుంచి ప్రజలను ఆహ్వానించకుండ, ప్రతి పని చేయటానికి రోబోలను తయారు చేసుకొంట్టున్నరు. అందుకు ఒక కారణం వారిది చాలా ప్రత్యేకమైన జాతి అని , విభిన్నమైన వారమని గట్టిగా నమ్మటం. అదొక భవిషత్ లేని దేశం దాని అభిప్రాయం పట్టింటింటించుకోవటం. హవ్వ!

    కొన్నేళ్లుపోతే, డిస్కవరి చానల్ లో ఒకప్పు డు జపాన్ అనే ఒక దేశముండేది , వారు ఇండియాలో పార్సిలు లాగా మాయమై పోతున్నారు అనే ప్రోగ్రాం వచ్చినా వస్తుంది. 120కోట్ల ఇండియాలో పార్శికుల సంఖ్య 75000 మాత్రమే.

  • “ఒక న్యూక్లియర్ శాస్త్రవేత్త దేశానికి అధ్యక్షుడా అని జపాన్ పెదవి విరిచింది. ”

   I am going to call your bluff. Do you have any proof of this assertion? Did they do this in any official capacity? Who within the Japanese Government made this comment? Knowing how Japanese are careful with letting their feelings known publicly, this is hard to believe. Please give references to this statement.

   • Wilson Sudhakar Thullimalli says:

    సుజాతగారు,
    2001-04 వరకు నేను Japan లోని టోక్యోలో నివశించాను.అందుచేత 2002లో కలాంగారు ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పుడు ప్రజల అభిప్రాయాలను అక్కడి మీడియాలో, దినపత్రికలలో చదివాను. ప్రజలు ఇంకా తాము ఎదుర్కున్న అణుబాంబ్ సంఘటనను మర్చిపోలేదు. ఆ కారణం వల్లనే ఇరాను ను వారి ద్వేషిస్తారు. Hiroshima, Nagasaki కుడా వెళ్ళాను. అక్కడి ప్రజల మనోభావాలను స్వయంగా విన్నాను. నమ్మండి. నమ్మకపోండి. అది మీ ఇష్టం.

 17. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  ఈ వ్యాసం చదివాక నాకొక్క విషయం బాగా అర్ధమయ్యింది. ఈ దేశంలో ప్రజలు రెండుగా చీలిపోయి ఉన్నారు. కొందరు సామాన్యులు, మరి కొందరు మేధావులు. మేధావులు సామాన్యులలో కలవడానికి గాని వారి ఆలోచనలను, అభిప్రాయాలను గౌరవించడానికి ఇష్టపడరు. అలా చేస్తే గుంపులో కలిసిపోయినట్టు భావిస్తారు. అందరికీ నచ్చింది ఖచ్చితంగా వీళ్ళు వ్యతిరేకిస్తారు. వీళ్ళ మౌలికత భారతదేశంలో కాక మరో దేశంలో పుట్టుకొచ్చిన భావజాలం మీద ఆధారపడి ఉంటుంది. నిష్కారణంగా బస్సులో పెట్రోల్ పోసి అందులోని ప్రజలను తగలబెట్టిన వాళ్ళను క్షమించగలిగే ఔదార్యంలో ఉంటుంది.

 18. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  ఈ వ్యాసం చదివాక నాకొక్క విషయం బాగా అర్ధమయ్యింది. ఈ దేశంలో ప్రజలు రెండుగా చీలిపోయి ఉన్నారు. కొందరు సామాన్యులు, మరి కొందరు మేధావులు. మేధావులు సామాన్యులలో కలవడానికి గాని వారి ఆలోచనలను, అభిప్రాయాలను గౌరవించడానికి ఇష్టపడరు. అలా చేస్తే గుంపులో కలిసిపోయినట్టు భావిస్తారు. అందరికీ నచ్చింది ఖచ్చితంగా వీళ్ళు వ్యతిరేకిస్తారు. వీళ్ళ మౌలికత భారతదేశంలో కాక మరో దేశంలో పుట్టుకొచ్చిన భావజాలం మీద ఆధారపడి ఉంటుంది. నిష్కారణంగా బస్సులో పెట్రోల్ పోసి అందులోని ప్రజలను తగలబెట్టిన వాళ్ళను క్షమించగలిగే ఔదార్యంలో ఉంటుంది. చనిపోయిన మనిషి అంత్యక్రియలు పూర్తయ్యేదాకా కూడా విమర్శలను నిగ్రహించలేని అసహనంలో ఉంటుంది.

  • Wilson Sudhakar Thullimalli says:

   ఏం సార్! అంత్యక్రియలు కాగానే విమర్శించవచ్చా? ఇద్దరు దేశ ప్రధానులను చంపినవాళ్ళపై ఔదార్యమ్ ప్రదర్శించవచ్చా! బస్సుపై పెట్రోల్ పోసి తగలబెట్టిన వాళ్లను నేనూ సమర్దించను.అందరికీ నచ్చింది వ్యతిరేకించడం అనికాదు. అందరికీ నచ్చింది అని మీరు ఏక పక్షంగా వకాల్తా పుచ్చుకోడం బాగుందా!

 19. rani siva sankara sarma says:

  లౌకిక వాదం అనే పదం దానికదే గొప్ప సమాధానం కాదు .గాలిబ్ మతపర పద జాలాన్ని ఉపయోగించాడు .అంతమాత్రన్న ఆయన్ని తిరస్కరించాలా ? సోషలిజం అనే పదాన్ని వాడుకున్నంతమాత్రాన్న హిట్లర్ ని తలకేత్తుకొంటారా ?సంస్కృతికి హిందువాదులే తిరుగు లేని ప్రతినిధులా ?ప్రజాస్వామ్యం సైన్సు సమానత్వం లాంటిపదాలని ఉపయోగించు కొంటు క్రిస్టియన్ దేశాలు సామ్రాజ్యవాదాన్ని విస్తరిస్తున్నాయి. మన హిందువాదులు ఆక్రిస్టియాన్ సామ్రాజ్య వాదుల సామంత రాజులు .ఆధునిక హిందూ మతం ప్రచ్చన్న క్రైస్తవం .

 20. wilson Sudhakar Thullimalli says:

  నారాయణ్ ప్రసంగం స్ఫూర్తివంతం కాదన్నది ఈయనొక్కరే. అయినా బాగా మాట్లాడేవాళ్ళకాలంలోనే వేలకొద్దీ నరహత్యలు జరిగాయి. హిట్లర్ కూడా శాఖాహారే. నారాయణ్ ఆరోగ్యం అంతంత మాత్రమే. వెంఠనే ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది. దేశానికి కావలసింది వక్తలు కాదు. దౌత్యం తెలిసినవారు. అది నారాయణ్ దగ్గర చాలా వుంది.

  ఇహపోతే ఆధ్యాత్మికత.. పొద్దున్నే లేచి సంస్కౄతి, సంప్రదాయం అన్నవాళ్ళు ఇప్పుడు మాత్రం అమెరికా,కామరూన్, బ్రిటన్ల ఉదాహరణలు కావాలి కాబోలు.ఎంత హిపోక్రసీ..

  ఒకే తీరైన సాధారణ పౌర నియమావళిని.. దీన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కలాం ఇందుకు ఒప్పుకోడం ద్వారా మైనారిటీల మనో భావాలకు గండి కొట్టారు.పేరుకు సెక్యులర్ ఇండియా అంటారుగానీ మతపరమైన రంగు ఇప్పటికే పులిమేసుకుంది.

  • Raghava says:

   Dear Wilson,

   నారాయణ్ ప్రసంగం స్ఫూర్తివంతం కాదన్నది ఈయనొక్కరే.
   1) I haven’t found any speeches of Mr Narayan. If you have any links to his speeches, Please share them. We can learn from his experiences At least I never heard any one about his speeches and this include my friends from kerala as well. Why don’t you share that speeches and let us know his life ?
   Again in this era of free information flow, Nobody can stop you from uploading & spreading information. If it has any merits, People will appreciate it .

   అయినా బాగా మాట్లాడేవాళ్ళకాలంలోనే వేలకొద్దీ నరహత్యలు జరిగాయి.
   1) Everybody condemns Gujarat’s riots. If you say that Kalam didn’t anything , The same applies to K R Narayan. He could have resigned in protest and spent his energy for the victims. Imagine how much that would captured the world’s attention let alone India’s. People would have written double eulogies and muslims would have named their kids after him. I would have loved to see him work with activists like Teesta.

   హిట్లర్ కూడా శాఖాహారే
   2) Kalam became vegetarian due to financial reasons. He never bragged it as an achievement.
   If people like it , What is your issue ?. I see people want their right to eat beef at public places but mock others who follow vegetarian diet.

   . నారాయణ్ ఆరోగ్యం అంతంత మాత్రమే. వెంఠనే ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది.

   3) Definitely agree that he might his own health problems owing to the age. Kalam worked till his last breath doing what he does best. Never the less I don’t think we should compare two individuals who are different. That comparison is not fair and I won’t want to do it. Did Narayan ever work during his prime years for development of Dalits ( or at least his parvan community) ? Or for that matter on any cause ? On contrary I have seen interviews of his family members asking that why should they work betterment of Dalits. Just now We saw news that Pratibha Patil is demanding both petrol & cars for her requirements.

   దేశానికి కావలసింది వక్తలు కాదు. దౌత్యం తెలిసినవారు. అది నారాయణ్ దగ్గర చాలా వుంది.
   4) We need diplomats more than inspirational speakers. Kalam isn’t a professional motivational speaker who charge lakhs per hour. He gave all his prime years to this country as top most scientists including Satish Dhawan, Vikram Sarabhai. He didn’t famiy life or social life or anything else. I would say that what country needs in any field. Do we more diplomats or scientists ? I would go for scientists. Narayan had great knowledge from his work experience but that is limited to him.
   There are no writings or letters or columns. Again if you have please share them.

   ఇహపోతే ఆధ్యాత్మికత.. పొద్దున్నే లేచి సంస్కౄతి, సంప్రదాయం అన్నవాళ్ళు ఇప్పుడు మాత్రం అమెరికా,కామరూన్, బ్రిటన్ల ఉదాహరణలు కావాలి కాబోలు.ఎంత హిపోక్రసీ..

   1) Okay. You don’t want to compared to UK or USA. Shall we start comparing ourselves with our neighbours then.
   a) Sri lanka’s treatment of Tamils or Muslims
   b) Pakistan & Bangladesh’s treatment of Hindus
   c) Bhutan’s treatment of nepalis
   d) Thailand’s and Myanmar’s treat of muslims and Rohingyas
   e) China’s treatment of Uighurs
   How are disadvantaged people treated there? Is that what you want.
   The bar is really low, Isn’t it. There is no real equal society in the world my friend. At Least there no society where you can insult majority religion and call it secularism
   ఒకే తీరైన సాధారణ పౌర నియమావళిని.. దీన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కలాం ఇందుకు ఒప్పుకోడం ద్వారా మైనారిటీల మనో భావాలకు గండి కొట్టారు.పేరుకు సెక్యులర్ ఇండియా అంటారుగానీ మతపరమైన రంగు ఇప్పటికే పులిమేసుకుంది.
   5)One of India’s greatest ironies is minority politics because they are some have most detrimental to minorities themselves. Everyone agrees that Muslims suffer from poverty and backwardness. Should they more children or less if they intend this cycle of poverty. Answer is clear . How ever if you even talk about this, You are labeled fascist, neo nazy and what not. No body can even dare to any campaign on this issue. Nobody raises on issues on Sikh civil code , Why?. No civilized country allows separate civil codes ( If you don’t count islamic countries & singapore) Same with polygamy . Why should we allow it. We want civil rights Minorities rights as all other developed countries but not polygamy laws. Okay please keep separate codes but at least take this sections. Some one saying that we need to discuss this with Muslims. Let us discuss with them for sure. There are no women at all in AIMPLB body. If all of them say no any changes , Should we follow it. Did we take consent of upper castes for providing the reservations or SC/ST atrocity acts. They would have opposed them . We did implement them because they were needed at that time not by consensus.

   Finally My advice to the writer
   1) The fight for Dalit empowerment is long journey and it can’t happen overnight
   2) You can’t abuse whole hinduism and their practices and then expect help from them
   3) You mayn’t like it but hindus are majority of this society and hold power & wealth
   4) Please build the case for Dalit Icons but it can’t be on a mockery of another person
   5) People would have respected Mr.Naryan, If you wrote a piece about his greatness .
   This essay leaves bad taste in mouth for all from now on the moment we hear Mr. Narayan
   Instead of elevating Narayan to new highs, You have reduced him to leader from your community only.
   6) US didn’t want any publicity for Che Guevara but they couldn’t stop it. No capitalist wanted Syriza government in greece but they won. You can win over others by valid reason and mutual respect. Your insult of the religion doesn’t make the past atrocities go away but it paves way for new misunderstandings.
   7) People are ready to listen to you if you want to say how Dalits are fighting discrimination even today. That will make them empathize with next dalit they see and work with . If you indulge in hindu bashing and irrational criticism of people like Kalam, That would too reflect on Dait they see next door.
   Do you want this to happen.
   8) If you believe that Narayan is not getting due, Please share his work and interviews with his family members and his anecdotes. No body can stop you from doing that. I am not a muslim and so are millions of people who like kalam. That doesn’t stop me from admiring him for his good qualities. The same applies for Narayan . We dont have any bias or hatred towards Dalit leaders or icons. But by holding people ransom to respect a person just because he is from your community, You are not only him and your community but the path through which you reached here.

   • Raghava says:

    But by holding people ransom to respect a person just because he is from your community, You are not only insulting him and your community but the path through which you reached here

   • Thirupalu says:

    కలాం కానీ, నారాయణన్ కానీ మరెవరైనా కాని తమ ఆశ్రయం లేకుండా ఎదగ నిఅయని మను వాద ఆశ్రీత సమాజం ఇది. వాళ్లు ఈ స్తాయికి ఎదిగారంటే ప్రపంచ దేశాలకు తాము గొప్ప తనాన్ని చాటు కొనే రాజకీయ ఎత్తుగడ కారణం తప్ప ఈ దేశ సంపన్న వర్గాల, లేక పలక వర్గాల లిభరల్ మనస్తత్వం కాదు. నారాయణన్ గారు కాని, కలం గారు కాని ఈ రాజకీయ కుట్రకు పాత్రదారులే. వాళ్ళని పొగడాల్సిమ్ది గాని తెగడాల్సిమ్ది గాని ఏమీ అవసరం లేదు.

 21. “జుట్టుపోలిగాడు ”

  ఈమధ్య అంతర్జాలంలో దేశంలో పేరుగాంచిన వారిని వ్యక్తిగత దూషణ చేయడం సాధారణమైపోయింది. అంబేద్కర్ , గాంధీ మొదలయిన వారి గురించి చాలా నీచమైన భాషలో వ్రాయడం చూస్తున్నాము. వారు నిర్వహించిన పాత్ర పట్ల అభ్యంతరాలుంటే విమర్శించవచ్చు, లేదా చర్చకు పెట్టవచ్చు. కాని వ్యక్తిగత దూషణ సరికాదని నా అభిప్రాయం. ఈ సందర్భంగా విజయకుమార్ గారిని అభినందిచాలి. కలాం గారిలో వారికి నచ్చని అంశాలను మాత్రమే చర్చకు పెట్టారు. వ్యక్తిగత దూషణ చేయలేదు. అఫ్సర్ గారు సారంగలో ఇలాటి వాటికి తావీయరాదని కోరుకుంటున్నాను.

 22. రమణ says:

  2) You can’t abuse whole hinduism and their practices and then expect help from them
  3) You mayn’t like it but hindus are majority of this society and hold power & వెల్త్
  ‘బ్యాలెన్సుడు’గా, ‘లాజికల్’ గా ఉన్నట్టు కనిపిస్తూనే చివరికి హిందూ మైండ్ సెట్ ను బయటపెట్టేశారు.హిందూయిజాన్ని, హిందువుల ఆచారాల్ని విమర్శించకుండా (దళితులు హిందువులు కారని ఒప్పుకున్నట్టేనా?) ఉంటేనే మేము మీకు సాయం చేస్తాం(ఈ దేశం, ఈ దేశ సంపద తమ ఒక్కళ్ళ ఆస్తే అయినట్టు).హిందువులే ఇక్కడ మెజారిటీ, డబ్బు, అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఖబడ్దార్ అని ఈయన చెబుతున్నారు. మెజారిటీవాదాన్ని ఇంత పచ్చిగా బయటపెట్టుకున్నాక ఇక ప్రజాస్వామిక చర్చకు అవకాశమెక్కడ? మనువాదం, అక్షరక్షరంలో మనువాదం.

  • 2) You can’t abuse whole hinduism and their practices and then expect help from them
   3) You mayn’t like it but hindus are majority of this society and hold power & వెల్త్
   ‘బ్యాలెన్సుడు’గా, ‘లాజికల్’ గా ఉన్నట్టు కనిపిస్తూనే చివరికి హిందూ మైండ్ సెట్ ను బయటపెట్టేశారు.
   హిందూయిజాన్ని, హిందువుల ఆచారాల్ని విమర్శించకుండా (దళితులు హిందువులు కారని ఒప్పుకున్నట్టేనా?) ఉంటేనే మేము మీకు సాయం చేస్తాం(ఈ దేశం, ఈ దేశ సంపద తమ ఒక్కళ్ళ ఆస్తే అయినట్టు).
   a) If Dalits are in hinduism, Why should they criticize hinduism and it’s rituals.
   Again asking for equal treatment and end of discrimination isn’t criticizing religion.
   In my village, Dalits were not allowed in temple till three years ago . They fought for it and got it.
   That was done through negotiations and fighting for their rights. I stand by what I have said.
   You can criticize a religion and expect their help.You can always point out the differences or the negatives in religion and that is never criticism.
   హిందువులే ఇక్కడ మెజారిటీ, డబ్బు, అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఖబడ్దార్ అని ఈయన చెబుతున్నారు. మెజారిటీవాదాన్ని ఇంత పచ్చిగా బయటపెట్టుకున్నాక ఇక ప్రజాస్వామిక చర్చకు అవకాశమెక్కడ? మనువాదం, అక్షరక్షరంలో మనువాదం.
   2) My dear friend, That is pragmatism and nothing else. It’s not a threat and that is the realty. Why should Dalit movements be on collision path to majority hindus ? What are we achieving by that ? Would that make your case better or worse. You may want the society to be exactly equal in distribution of wealth. It is no where near that. You can hope that one day we be there but till that time be practical. Empty rhetoric won’t help dalits. Nelson Mandela said the same thing when south africa was liberated. I not saying for you to stop fighting but I have issues with the way of fighting. Why can’t we take the help of majority and move forward. If you want to bring the youth ( not just the dalit youth) to this realization that dalits need more empathy and compassion and You need to stop demonizing hinduism. How you can liberate & empower dalits when you are alienating most of the country’s population ( a population which can and will help you if you play your cards right) .Now a days due to militant movements which are based on hindu bashing, People are ready to believe that muslims need help rather dalits.
   Is this what you want ? Majority population not at all sympathetic to dalit cause ? Then please proceed. Start with me.

   Finally consider this, America has many great leaders and Abraham Lincoln and George Washington are two of them.

   1) George Washington is one the founding fathers of USA . He was a slave owner and did nothing about abolishment. I never saw any black organization criticize about that let alone on independence day. They accepted him as he is.
   2) Lincoln fought for abolishing but didn’t do much for equal treatment of african americans. How ever they respect him for what did before criticizing him for what didn’t.

   • Sahhithi says:

    / If Dalits are in hinduism, Why should they criticize hinduism and it’s rituals./
    దళితులకు హిందు యిజం వ్యతిరేకం కాబాట్టే ఇతర మతాలకు, లేదా మతం లేకుమ్డానో బ్రతుకడమో చేస్తున్నారు.

    In my village, Dalits were not allowed in temple till three years ago . They fought for it and got it.
    ఫైట్ అనే మాటే మనుషుల మధ్య చిచ్చు పెట్టేది. అది చేస్తూ దేవాలయ ప్రవేశానికి అర్రులు చాచాలా ? అందుకే అభేత్కర్ బుద్దిజాన్ని ఎన్ను కున్నాడు. ఈ దేశం లో దేవుడి కూడా మీ వాడే మేము ఏ దేవుడికి మొరపెట్టుకోము? అని ఒక దళిత కవి ఆవేశంగా అన్నడు. రాఘవ గారు మను వాడని నిజమైన ప్రతి నిది మీరు.

   • Your theory of pragmatism and majoritarianism goes against the spirit of your very legends, my dear friend. If your argument stands right, then Rama might have compromised with ‘mighty and wealthy’ Ravana, avoiding enormous destruction in both sides. Detto Pandavas…They would have made peace with Kauravas who surpass them in number and in wealth. You forget your very ‘Hindu’ ethos which says, “Where Dharma prevails there only the Victory”. Or else, are you dreaming to rewrite Ramayana and Mahabharata? Your vision, like any oppressor’s vision in the world history, is blurred with one sided ‘reality’ that is of muzzle and money. Oppressed too have their own set of realities. They demand their rightful share not compassionate alms. They fight to the end to settle the score.

 23. wilson Sudhakar Thullimalli says:

  ‘ జుట్టుపోలిగాడు’ అన్నది మనువాదుల గురించి. కలాం సాబ్ ను ఉద్దేశించి అన్నది కాదు. మిత్రులు గమనించాలి.

 24. wilson Sudhakar Thullimalli says:

  ‘ జుట్టుపోలిగాడు’ అన్నది మనువాదుల గురించి. అది మనువాదులకు ముద్దుపేరు. కలాం సాబ్ ను ఉద్దేశించి అన్నది కాదు. మిత్రులు గమనించాలి.

  • “హిందూ పతాకాల మొత్తం జాతిని ఏకం చెయ్యాలని చూస్తున్న పార్టీకి ఈ జుట్టుపోలిగాడు వంత పాడాడు. ”

   “‘ జుట్టుపోలిగాడు’ అన్నది మనువాదుల గురించి. అది మనువాదులకు ముద్దుపేరు. కలాం సాబ్ ను ఉద్దేశించి అన్నది కాదు. ”

   అయ్యా సుధాకర్ గారూ,

   Nice try. Trying to cover up your comment. We all know (including you) that it was Dr. Kalam you called “జుట్టుపోలిగాడు”.

   I am glad Mr.Victor Vijay Kumar can now see for himself how a self proclaimed progressive pro dalit person such as Mr. Sudhakar can be as nasty as a Hindu fundamentalist in shooting his mouth off. At their core, they are not different. This is indeed a good social experiment. We have seen people shedding their veil of decency and show their true colors on both sides of the argument.

   • Wilson Sudhakar Thullimalli says:

    సుజాతగారు,
    కొందరు ఉదారవాదులుగా మితవాదులుగా కనబడతారు. కానీ తమకు అనుకూలంగా
    లేని వాదనలను చేస్తున్నవారిని ఫండమెంటలిస్ట్ ల జాబితాలో చేరుస్తారు. అవసరమైతే హిందూ ఫండమెంటలిస్ట్ ల తో సరిసమానంగా పోల్చుతారు. సమస్య ఏమిటంటే మెజారిటీ ప్రజల అభిప్రాయాలను అందరి అభిప్రాయాలు అని పొరబడడం కావచ్చు. అది మీతప్పు కాదులెండి.

 25. BTW, has anyone invoked Hitler and/or Nazis yet in this discussion? :)

  As Godwin’s law states, “As an online discussion grows longer, the probability of a comparison involving Nazis or Hitler approaches 1 “

 26. rani siva sankara sarma says:

  శాంతి సహనాలని పెంపొందిచడం కోసం గాంధీ ప్రాణాన్ని పణం గా పెట్టాడు . నారాయణన్ కీర్తి ప్రతిస్టలనె పణంగా పెట్టాడు . చిలకలూరి పేట దహనం కేసులో క్షమా భిక్ష పెట్టాడు. దీన్ని మనం సులభంగా విమర్శించవచ్చు . కారణం నేరాన్ని మరణదండన ద్వారా సులభంగా తత్కాల్ లో పరిష్కరించేయ్యవచ్చు అనే మధ్యతరగతి మూఢ నమ్మకం.దీనిలో సామాజిక మానసిక విశ్లేషణలు శూన్యం. అధికారం కోసం గుజరాత్ ముస్లింలని డిల్లి సిక్కులని ఊచకొత కోశారు .ఇటువంటి సందర్భాల్లో ఎవరికీ ఉరిఎందుకు పడలేదని మనం అడగం .తల్లి గర్భాన్ని చీల్చి సిసువుని చంపినా మనకి అది ఉగ్రవాదం గా కనపడదు . నైపాల్ అన్నట్లు అది కూడా హిష్టరీని బ్యాలన్స్ చేయడం గా కనబడుతుంది, మహా ఐతే కలాం లా అదొక విషాదం అని పెదవి విరుస్తాం. మన దేశభక్తిభావమ్ మరీ గాయపడదు.

 27. నీహారిక says:

  కలాం కన్నా నారాయణన్ గొప్పవారని ఒప్పుకుంటాను.అంబేద్కర్,నారాయణన్ లు సాధించలేనిది 120 కోట్లమందిలో ఒక్కరు కూడా సాధించడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు ?

  మనువాదం వదిలి దళితవాదం పట్టుకోవాలంటే మనువాదంలో లోపాలను ఎండగట్టాలి.మనువాదులకు ఎదురీది పోరాడే శక్తి మీలో ఎందరికుంది? కీ బోర్డు ఉంది కదా అని వ్రాసేయడం కాకుండా మనువాదులను ఎలా మోసం చేస్తున్నారో సాక్ష్యాలతో వివరించే ధైర్యం మీలో ఉందా ? దళితుడని రాజయ్య ని ఉపముఖ్యమంత్రిని చేస్తే తప్పు చేసి తలదించుకున్నారు.

  గతం గతః ! ఒక మనిషిని కీర్తించడంతోనే మనపని అయిపోయిందని భావించకండి.ప్రస్థుతం బ్రతికి ఉన్న దళితుల్లో,మనువాదుల్లో స్పూర్తినిచ్చే(గొప్ప గొప్ప నీతివాక్యాలు వ్రాయడం కాకుండా) వాళ్ళనొక్కరిని చూపించండి చాలు !

  • wilson Sudhakar Thullimalli says:

   నిజమే నీహారికగారు. మనువాదం వదిలి దళితవాదం పట్టుకోవాలంటే మనువాదంలో లోపాలను ఎండగట్టాలి. అన్ని విధాలుగా వెనుకబడ్డాముగనకే మనువాదులకు ఎదురీది పోరాడే శక్తి తగ్గింది.పైగా మనువాదులు అనుకోకుండా అధికారంలోకి వచ్చారాయే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాలలోను. బడుగు బలహీన వర్గాలు వీటికి ఎదిరించి ఏమి పోరాడతాయి. మరో అంబేద్కర్ కావాలేమో. రాజయ్య ఒక రాజకీయ బ్రోకర్. ఆ మాటకొస్తే ఇప్పుడు అధికారంలో వున్నా చాలామంది దళిత నాయకులు అగ్రకుల నాయకులలానే రాజకీయ బ్రోకర్లు. వాళ్ళు దళితులకు ప్రతినిధులు ఎలా అవుతారు? లేనిపోని పోలికలు, సారూప్యాలు మీరు చెప్పడం తప్పితే? మీరు చూపించండి స్ఫూర్తి నిచ్చే మనువాద నాయకులను..మేము మాలో మేము సైద్ధాంతికంగా పోరాడాలి. కులతత్వం మీద పోరాడాలి. మతం మీద పోరాడాలి. ముక్కలైన సమాజంతో పోరాడాలి. మాకు చాలా పోరాట పటిమ కావాలి కదండీ..

 28. నా దేశం అకారణ ద్వేష భావాల నుండి బయట పడు గాక. దళిత, బ్రామ్హన పదములు సైతం నశించి పోవును గాక. వీరిరువురూ ఒకరికొకరు మానవులుగా గుర్తిన్చుకున్డురు గాక. ద్వేషాన్ని వ్యాప్తి చేయడం మంచి సంగతి కాదు-రెండు వైపుల నుండి. చనిపోయిన వారి గురించి రాజకీయం చేయడం మంచి సంగతి కాదు. దీనివల్ల సమయం వృధా. ఇంతకన్నా రాబోయే రోజులకి సంబందించిన ప్రణాలికలు తయారు చేసుకోవడం ఉపయోగం అని నా అభిప్రాయం. ఈ చర్చ వలన ఆవేశాలు పెరుగుతాయిగాని ఎవరికీ ప్రయోజనం లేదని నాకు తోస్తున్నది. భారతీయులు ఇప్పటికి విభాజితులుగానే వుండటం కొందరికి అవసరంగా ఉండి వారు ఇటువంటి చర్చలను, భేదాలను నిరంతరం నడిపిస్తూ రాజకీయంగా తమ పబ్బం గడుపుకుంటూ ప్రజలకు మధ్య అగాధాలను పెంచుతున్నారు. మను స్మ్రితి ఒక చరిత్ర. అది నేటి రాజ్యాంగం కాదు. ఇప్పటి రాజ్జ్యంగా పరమయిన విషయాల గురించి చట్టాల గురించి వాటిని ఇంకా ఏమైనా అభివ్రిది చేయగలమా ఆలోచిస్తే మంచిది. మనం ఇలా వర్గ భేదాలను పెంచితే పక్క దేశాలకు మంచిది. ఒకరికి ఎక్కువ పేరు వచ్చింది, ఒకరికి తక్కువ వచ్చింది, మమ్మల్ని సరిగా పట్టించుకోలేదు, మమ్మల్ని అభివ్రిది చెందనివ్వడం లేదు, ఇవ్వన్ని తమ స్థాయిని తామే తగ్గించుకోవడం. మనమంతా సహనంతో, ధైర్యంతో, సంయమనంతో పని చేస్తూ పొతే క్రమంగా మంచి ఫలితాలు వస్తాయి.

 29. P V Vijay Kumar says:

  :) :) :) :) …..
  మళ్ళో సారి…..ఈ సెకండ్ పార్ట్ చూస్తే –

  //ఇది నారాయణన్ ను ” గ్లోరిఫై ” చేయడం కాదు. నారాయణన్ పక్కా కాంగ్రెస్ పార్టీ వెనుదన్నుగా ఉంచుకుని పైకి వచ్చాడు.//

  // We are inspired by Kalam’s life అంటే అది వ్యక్తి గత అభిప్రాయం And you need a model man to build a career to emulate, which is completely understandable. దానితో పేచీ లేదు. ” ప్రజల మనిషి / పీపుల్స్ ప్రెసిడెంట్ ” అంటేనే చిక్కు !! ఇక్కడ – ఒక Individual interest కలిగిన అభిప్రాయాన్ని , అందునా ఒక మంచి ‘ స్వంత జీవితం ‘ గడపాలనే ఒక closed view ను Public opinion for public good లా చూపడం తో ఈ వ్యాసం ఖచ్చితంగా విబెధిస్తుంది.//

  // నిజాయితీగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి – మీరు ఏ గొప్ప కలాం లో చూసారో ఆ గొప్ప నారాయణన్ లో ఎందుకు కనిపించలేదు ? ఒళ్ళు తెలీకుండ మీదకెత్తుకునే తిరిగే కలాం లో ఉన్నదేంటి ? నారాయణన్ లో లేని దేంటి ? కలాం చేసిన తప్పుల్లో అర్థం చేసుకునేదేంటి ? నారాయణన్ తప్పుల్లో అర్థం కానిదేంటి ?….కలాం కు ఇచ్చిన స్థానం నారాయణన్ కు ఎందుకు కల్పించలేకపోయింది ?//

  ఇవి మీ కళ్ళకు కనిపించడం లేదా ? కళ్ళు మూసుకుని చదుతున్నారా ?

  ఏంటి …ఈ ” కుత కుత “…..” కుత కుత “…..” కుత కుత ” ఏంటి ? The discussion is really going somewhere – ఒకరొచ్చి యూనిఫాం సివిల్ కోడ్ గురించి చెప్పు అంటారు, కలాం స్పీచ్ అద్భుతం అంటాడు ఒకరు, Author is not working for Dalits ….ఏవన్నా అర్థం పర్థం ఉందా ?

  ఏవీ చాత కానప్పుడూ nit picking చేయాలనే …ఆ ఆత్రం…ఆ హైపర్….. Sectarian insularity తప్ప ఏమీ కాదు.

  Riddles of Hinduism by Ambedkar చదివితే ఇక మనువాదులు మొహం ఎక్కడ పెట్టుకుంతారు ? – ఎలుక కలుగునెతుక్కున్నట్టు – ఉరుకుతారేమో ? Unfortunately – you have no single human philosophy which can come to your rescue and in the anxiety to protect yourself, you will end up in exposing yourself more. If you really want తో glorify your brahminical upper casteist manuvadi culture – please present logic with attitude, please demonstrate how humane you are, please present yourself concerned for the oppressed…..

  Again – this article cannot be written without accusing brahiminism …this article finds no other way digressing from hindu fundamentalism to bring out the point of ” Systemic bias ”

  Thank you

 30. buchireddy gangula says:

  నేను విజయ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు సర్

  యిక Wilson సుధాకర్ గారి అబిప్రాయాల తో ఎకిబవిస్తాను —

  అంతా raajakiyam—కలాం గారి గురించి అంతగా చెప్పుకోవలిసింది అంటూ ఏముందని — ప్రెసిడెంట్
  గా చేసిందంటూ ఏమి లే దు — Narayana గారితో కలాం గారిని పోల్చడం శుద్ధ దండుగ
  దొంగ బాబా తో — పితాదిపతి తో కలాం గారు ???
  we. are.inspired. by.kalams. life…—big.joke. ????
  ——————————————————————————————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

  • wilson Sudhakar Thullimalli says:

   వందనాలు బుచ్చిరెడ్డి గారు. మీరు కోరుకున్న తెలంగాణ వచ్చినదిగా. మనం మళ్ళీ స్నేహితులం అవుదాం. ఇవాళే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాను.

 31. rani siva sankara sarma says:

  అంబేద్కర్ పైన కూడా మూఢ భక్తీ అనవసరం. దేశ విభజన గ్రంధం లో ముస్లిం ఐడెంటిటీ ని కించపరుస్తూ రాసాడు అంబేద్కర్. ఆవ్యాఖ్యానాలు హిందూ వాదులకి పనికి వస్తున్నాయి. క్రిస్టియన్ వలస విద్యా విధానమే ముస్లిం వ్యతిరేకతకి కారణం . అంబేద్కర్ కూడా దానినుంచి వచ్చినవాడే.

 32. ఈ చర్చ అంతా చూస్తుంటే ప్రధానామ్సమైన మనువాదం గురించి కాని లౌకికవాదమ్ గురించి కాని సమగ్రమగా జరుగుట లేదని ఇది వ్యక్తిగత ఎమోషన్స్ కు ముడిపెట్టి జరుగుతున్నట్టుగానే అనిపిస్తోంది.ప్రధానంగా ఈ దేశం వ్యక్తీ ఆరాధన చుట్టూ తిరుగుతుంది. దీనిని ఆసరాగా తీసుకొని మీడియాను వాడుకొని తమ తమ భావజాల వ్యాప్తికోసం తమ వర్గ ప్రయోజనాలకోసం వాడుకున్తున్నది రాజ్యం. ఈ చర్చలో పాల్గొన్న వారు ఈ వ్యవస్థను సమర్ధించే వారే కాని దీనిని మార్పు కోరేవారు కాదు. ఉన్నది ఉన్నట్టు కోరుకునే వారు ఎంత గీసులాడుకున్న ఈ తగవు తీరదు. తమ తమ వాదాలను సమర్ధించుకోవడం తప్ప.

  వ్యవస్థలో భాగస్వామిగా ఉంటూ దానితో కలగలిసిపోయే వాళ్ళు కలాంలా వ్యవస్థ భుజాలపై మోస్తుంది.

  అదే ఈ వ్యవస్థను మార్చాలని దీని అసలు రంగును చూపె వాళ్ళను కిషంజీల వృద్ధాప్యంలో కూడా పట్టుకొని తన కసిదీరా చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీస్తుంది.

  అదీ తేడా. సామ్రాజ్యవాద బంటులైన ఈ దేశ బానిస పాలక వర్గాలు తమ వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మేధావులుగా వున్న వారిని తమ సాలెగుటిలోనికి రప్పించుకొని వారిని తమ భావజాల ప్రచార సాధనాల ద్వారా విపరీత ప్రచారం చేస్తు మోస్తుంది.

  కలాం ఒక శాస్త్రవేత్తగా ఈ దేశానికి చేసిన సేవ కొనియాడ తగింది.ఆయన కనమన్న కలలు యువతను కెరీరిజం వైపు మల్లించినవే.
  వ్యవస్థలోని లోపాలను గురించి మాటాడకుమ్డా ఇలా ఎన్ని చెప్పినా పాలక వర్గానికి ముప్పు లేనంతవరకు వారిని ఆరాధిస్తుంది. ఆరాధిమ్పచేస్తుంది.

 33. GUDIPATINARASIMHA RAO says:

  యువర్ కామెంట్ చాల బాగుంది. ఏ మాటల వెనుక ఏ వర్గ ప్రయోజనం ఉందొ చూడాలన్న మాట. ఎవరిని ఎందుకు పెట్టుబడి దార్లు వారి రాజ్యం పోగుడుతుందో చూడమనడం కనువిప్పు కలిగించే గొప్ప అంశం. నమస్తే మంచి మాటలు చెప్పారు.

 34. buchireddy gangula says:

  Wilson.sudhakar.గారు

  you..are.always. my. mentor.. ఫ్రెండ్
  ********************************************************
  బుచ్చి రెడ్డి గంగుల

 35. c.v.suresh says:

  “సార౦గ” ఒక అద్భుత‌ వేదిక. భావప్రకటన స్వేచ్ఛ right of expression కు ఈ పత్రిక‌ ఒక మ౦చి పరికరమై౦ది. చాలా స౦తోష౦. మనిషిలోని అ౦త: బహి: ద్వారాలను తెరిచే ఒక విస్తృత చర్చ/అభిప్రాయాలకు ఈ పత్రిక ఆదిమూల‌మై౦ది. విభిన్న ఇజాలనూ, .. ఆలోచనలనూ… భిన్న స్వరాలనూ వినిపి౦చే౦దుకే “సార౦గ” ధ్యేయమని మరోపర్యాయ౦ రుజువై౦ది. పత్రిక ఎప్పటికప్పుడు వాటిని పాఠకులకు అ౦దజేయడ౦లో కృతకృత్యమై౦ది.
  ఆరోగ్యకరమైన చర్చలు కూడా కొన్ని పర్యాయాలు ( మనకు తెలీయకు౦డానే) భేషిజలకు దారి తీయొచ్చు. ముఖ్య౦గా గమని౦చాల్సిన అ౦శమేమ౦టే… చర్చి౦చడ౦ వేరు. తమ అభిప్రాయాలను చెప్పడ౦ వేరు. ఆ రె౦డి౦టి మధ్య ఉన్న ఆ పలచటిపొర ను ఎప్పటికీ అలాగే ఉ౦చాలి. ఆ స్పష్టమైన‌ తేడాను ఎప్పటికప్పుడు మన౦ పరిగణలోకి తీసుకొ౦టూనే ఉ౦డాలన్నది నా అభిప్రాయ౦. చాలా స‍౦దర్భాలల్లో రైట్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్… తన legal sanctity అధీకృత౦గా నిరూపి౦చుకొ౦ది. జర్నలిస్ట్ గా న్యాయవాదిగా చాలా స౦దర్భాలల్లో ఆ పలచటి తేడా యొక్క ఆవశ్యకత ను న్యాయపర౦గా అనేక కేసుల్లో విన్నాను.. ప్రాక్టికల్ గా చూశాను. భిన్నస్వరాలను వినిపి౦చే వేదిక అయిన సార౦గలో ఆరోగ్యకరమైన (వ్యక్తిగత భేషిజాలకు తావివ్వని) అభిప్రాయ వ్యక్తీకరణ చూడట౦ ముదావహ౦!

  ఇలా౦టి ప్రశా౦త‌ వాతావరణాన్ని సార౦గ అ౦తర్జాల పత్రిక ఎప్పటికప్పుడు, పూర్తి ఎడిటోరియల్ హక్కులతో పరిరక్షి‍౦చుకొ౦టూ, ము౦దుకు వెళ్ళడ౦ స౦తోష‍౦. సాహితిప్రప౦చ౦లో ఉరకలు వేస్తూ… క్రొత్త తరపు కవులకు ఒక అద్భుత గైడెన్స్ అ౦దిస్తూ వస్తున్న సార౦గ ఎడిటోరియల్ బోర్డ్ కు నిజ౦గా ధన్యవాదాలు..!

  భిన్న అభిప్రాయాలకూ…..విభిన్న స్వరాలకూ వేదిక ” సార౦గ” !!!

  • Dr.C.Rajendra Prasad` says:

   ఇన్ని విభిన్న, వ్యతిరేక భావజాలాలకు వేదికగా నిలిచిన సారంగ కు అభినందనలు. అంతర్జాలం ద్వారా భావవిప్లవం రాగలదనే నమ్మకం కలుగుతోంది

 36. రవికుమార్ బడుగు says:

  నీహారిక గారూ.. రాజయ్య తప్పుచేసి తలదించుకున్నారన్నారు. తప్పుచేసిన, చేస్తున్న దొరలంతా దర్జాగానే తిరుగుతున్నారు. రాజయ్య మాత్రమే తలదించుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది.

  • ఒక వ్యక్తీ జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించలేడు. రాజకీయం మాట పక్కన పెడితె ఆయన మా యివతరానికి రోల్ మోడల్గా నిలిచినా విజేత…అందరికి నచడం కుదరదు. బాబాలు స్వామిజిలు జ్ఞానులు . వాళ్ళ సన్నిధిలో శాంతి , సమాధానం దొరుకుతుంది… మీకు దొరక్కపోవాచు .. ఆయనికి దొరికింది,.. ఆయన ఇష్టం.. ఆయన జీవితం,,, ఆయనకు నచ్చినట్టు ఉంటాడు.. మికి నచ్చేటట్టు ఎందుకు బతుకుతాడు???

 37. Dr.C.Rajendra Prasad` says:

  Some body quoted from Einstein.Einstein also said ,” It was a lie what you read about my religious convictions,a lie which is being systematically repeated.I do not believe in a personal God and I have never denied this but have expressed it clearly.” ” I am deeply religious nonbeliever”

 38. sangishetty srinivas says:

  భారతదేశం మొత్తంగా మనువాదం, దేశంలోని కొన్ని పాకెట్లలో మార్క్సిజం రెండూ సమాజానికి ఏండ్ల సంది తీరని నష్టం చేస్తూనే ఉన్నాయి. ఇద్దరూ హింసను మాత్రమే నమ్ముకున్నరు. ఒకరు కులమూ, మతమూ కలగలిపి వాటిని తాము అధికారములోకి రావడానికి, స్థిరికరించుకోవడానికి వాడుకున్నరు. ఇంకొకరు అదే కుల వ్యవస్థని నిలబెట్టి తమ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నరు. మనువాదమనేది ఇవ్వాళ బ్రాహ్మణ, బ్రాహ్మనేతర కులాల్లో ఇంకి పోయింది. పార్లమెంటరీ వ్యవస్థను నమ్ముకున్న అన్ని పార్టీలూ ఈ మనువాదులకు తాబేదార్లుగా తయారయ్యిండ్రు. ఇందులో ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి మినాహాయింపు లేదు. ఈ పార్లమెంటరి వ్యవస్థను నమ్మని మార్క్సిస్టులు కుల సమస్య కేవలం ‘ఉపరితల’ మైనదిగా భావించారు తప్ప అది ‘పునాది’ అని గుర్తించలేదు. బ్రాహ్మణాధిపత్యమ్ లోని మార్క్సిస్టులు కుల సమస్యను ignore చేయడానికి ‘Marxism ‘ వర్గ దృక్పథాన్ని ఎంచుకున్నరు. ప్రజల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతుల్లో మెరుగైన మార్పులు రాకుండా అడ్డుకోవడానికే మనువాదం పనిచేస్తోంది. విషాదం ఏంటంటే ‘ నూతన ప్రజాస్వామిక విప్లవం’ కోసం పోరాడుతున్నామన్న ‘Marxism ‘ అదే పనిచేస్తోంది.
  కుల వివక్షను ప్రశ్నించినా? మాతాదిపత్యాన్ని నిరసించినా? కారంచేడు, చుండూరు,ఖైర్లాంజి, కాన్దామాల్, గోద్రా, ముజఫ్ఫర్ నగర్ లూ అనాది నుండి చోటు చేసుకుంటున్నాయి. కారంచేడు సంఘటన తర్వాత దగ్గుబాటి చెంచు రామయ్య కతమయ్యి వుండొచ్చు. కానీ అప్పటి వరకూ అలాంటి భూస్వాముల దగ్గరనే ఈ పోరాటకారులు ఆశ్రయం పొందిండ్రు. ఈ భూస్వాముల దౌర్జన్యం పెరిగి, ప్రజలు భరించలేని సత్తికి చేరుకున్నప్పుడు ఆయన్ని ‘ప్రజా కంటకుడు’ అని ముద్ర వేసి కతం జేసిండ్రు. (ఇవి నా మాటలు కావు బాలగోపాల్ వి) భారత దేశములో ఉన్న కుల అసమానతలను ‘Marxism ‘ నిజాయితిగా గుర్తించి ఉంటే ఫూలే ని, అంబేద్కర్ లని గౌరవనీయమైన స్థానంలో నిలబెట్టి ఉండేది. కాని 1990లకు ముందు ఫూలే, అంబేద్కర్ లను ఉచ్చరించని వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరు మీద మల్లి జనం లోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నరు. 90లకు ముందు గ్రామాలకు తరలండి, బూర్జువా విద్యను వదిలేయండి అని చెప్పిన ‘Marxism ‘ ఇవ్వాళ చాల తెలివిగా ఆవిశయాన్నే మాట్లాడ్డం లేదు. వీళ్ళ మాటలు, పాటలు విని చదువుకు దూరమై హింస, ఆయుధాన్ని నమ్ముకోవడం ద్వారా త్యాగాల పేరిట తరాలకు తరాలు అటు కళింగాంధ్ర నుంచి ఇటు తెలంగాణ వరకు నష్ట పోయారు. అదే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి వచ్చిన ‘Marxist ‘ మేధావులు ఎన్నడూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎప్పుడూ నష్ట పోలేదు. నష్ట పోయినా అది దళిత, బహుజన, మైనారిటిల తో పోలిస్తే ఒక్క శాతం కూడా ఉండదు.
  విక్టర్ గారు ” సారంగ లో యాక్టివ్గా ఉండే ఎంతోమంది మార్క్సిస్టులకు ఒక విజ్ఞప్తి! మనమింకా అద్భుతమైన ఆదర్శ సమాజం ఏర్పరచుకోలేదు.” అని రాసిండ్రు. అంటే ఆదర్శ సమాజం చంపుడు పందాలతోటి రాదనే విషయాన్ని విక్టర్ గారు గుర్తించినట్లు లేదు. అంబేద్కర్ చెప్పినట్టు ‘ప్రతి మనిషికి ఒకే విలువ’ ఇవ్వాల్టి భారత సమాజములో రాదు. స్వేచ్చ, సమానత్వం, సౌబ్రాత్రుత్వం ఉండే ‘ఇండియా’ కోసం ఫూలే, అంబేద్కర్ ఆలోచనా స్ఫూర్తితో కృషి చెయ్యాల్సిందే.. దానికి షార్ట్ కట్ లు లేవు.

  • P V Vijay Kumar says:

   ఐ అగ్రీ విత్ మోస్ట్ అఫ్ ది కంటెంట్ అఫ్ యువర్ కామెంట్ అండి

 39. dattatreyulu.h says:

  ఈ రోజు సాక్షి దిన పత్రికలో ఎ.బి.కె.రాసినవ్యాసం చాల వాస్తవంగా వుంది,దయ చేసి అందరు చదవండి.

 40. dattatreyulu.h says:

  ఈ రోజు సాక్షి దిన పత్రికలో ఎ.బి.కె.రెండో మాట లో రాసిన వ్యాసం బాగుంది.అందరు చదవండి

 41. అబ్దుల్ కలామ్ – దళిత, మైనార్టీ, సెక్యులర్ వాదుల డొల్లతనం!
  ముందుమాట:

  మనం తరచూ వింటున్న, చదువుతున్న, చర్చిస్తున్న దళితవాదం, మైనార్టీవాదం, సెక్యులర్ భావాలు పుటం పట్టిన మేలిమి బంగారు కడ్డీలేమీ కావని ఇతర వాదాలకు ఉన్నట్టుగానే వీటికీ కాస్తంత డొల్లతనం ఉందని చదువరుల దృష్టికి తీసుకురావడం మాత్రమే ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం.

  వీటితో బాటు [QUOTE]“I’ve two very simple and direct questions: why such intolerance?when do we learn to respect difference, either view point or color? I would prefer this debate towards that big question of intolerance and hate politics”[/UNQUOTE] అన్న అఫ్సర్ గారి కామెంట్ (posted in Hanumantha Reddy Kodidela’s FB timeline on 03/08/2015) అనుసరించి, ఒక విషయాన్ని ఊది ఊది ఉప్పెనలా మారుస్తున్న తరుణంలో కొన్ని మౌలిక ప్రశ్నల్ని లేవనెత్తి జరుగుతున్న చర్చను మళ్ళీ గాడిలోకి పెట్టే దిశగా మాత్రమే ఈ వ్యాసం ఉద్దేశించబడింది.

  గమనిక:

  ఉదహరించక తప్పని సందర్భాలలో మాత్రమే కొందరు వ్యక్తుల పేర్లను, కొన్ని జాల పత్రకల పేర్లను పేర్కొనడం జరిగింది. ఇలా పేర్కొనడంలో ఎలాంటి దురుద్దేశమూ లేదు. ఇది ఆయా వ్యక్తులు, పత్రికలపై బురద జల్లే ప్రయత్నమూ కాదు.

  చర్చా విషయం:

  అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక ’సారంగ’ లో ఒక రచయిత “కలాం – హారతిలో ధూపం ఎక్కువ” అన్న ప్రధాన శీర్షికతో “కలాం ప్రజల మనిషి కాదు” అన్న URL శీర్షికతో ఓ వ్యాసం వ్రాయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన, జరుగుతున్న సంఘటనల పరంపరలను చూసి, వ్రాస్తున్న స్పందన ఈ వ్యాసం.

  కలాం గారు మరణించిన మరుసటి రోజునే (28/07/2015) “కలాం ప్రజల మనిషి కాదు” అన్న పేరుతో వచ్చిన ఆ వ్యాసంపై వందల సంఖ్యలో వ్యాఖ్యలు వచ్చి అందులో అనుకూలవాదులు, ప్రతికూలవాదులు, తటస్థవాదులన్న మూడు వర్గాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మొదటగా వచ్చిన అభ్యంతరం ఏమిటంటే – ఓ వ్యక్తి చనిపోయిన రోజున, ఆ వ్యక్తిని తిడుతూ వ్రాయడం పద్ధతి కాదు!” అని. అయితే ఏ వ్యక్తినైనా, వారు చనిపోయిన రోజు కూడా నిరభ్యంతరంగా విమర్శించవచ్చునని రచయిత అభిప్రాయం వెలిబుచ్చడం జరిగింది. మరి ఈ లెక్కన దళితుల ఆరాధ్యమూర్తి అయిన అంబేద్కర్ గారిని వారి సంస్మరణ దినం నాడు ఎవరైనా విమర్శిస్తే వారు మౌనం వహిస్తారా లేక ఖండిస్తారా?

  కలామ్ గారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు వ్రాసిన వారిలో ఒక వ్యాఖ్యాత అభిప్రాయం మేరకు కలాం గారు పాలు పంచుకున్న క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలు దండగమారి పనులు. ఆ క్షిపణుల్ని తయారుచేయడానికి ఖర్చు చేసిన డబ్బులతో ఏవేవో అద్భుతాలు చేయవచ్చునని ఆ వ్యాఖ్యలో సారాంశం. ఈ వాదనలో అనేక ఇబ్బందులున్నాయి.

  దేశ రక్షణ, దేశ ఆర్థిక వ్యవస్థ – ఈ రెండూ వేరు వేరుగాను, కలిసికట్టుగానూ ఉంటాయి. ఆర్థికంను వెన్నెముక అని భావిస్తే, రక్షణ శ్వాసక్రియ అని భావిస్తే విషయం కాస్త బోధపడతుంది. ఆవిధంగా క్షిపణులు తదితర ఆయుధాలు లేక పోతే సైన్యం ఉండదు. సైన్యం లేకపోతే దేశ భద్రత ప్రమాదంలో పడుతుంది. పోనీ ఆయుధాలు లేని సైన్యాన్ని ఏర్పాటు చేద్దామా అంటే అది కుదరని పని. కనుక ఒక దేశం, అందునా భారతదేశం వంటి పెద్దది, బ్రతికి బట్టకట్టాలంటే సైన్యం ఉండాలి, ఆ సైన్యం చేతిలో ఆయుధాలు ఉండాలి.

  ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన క్రీస్తు అనుయాయుల ఆధ్యాత్మిక రాజధాని అయిన వాటికన్ సిటీ కూడా తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. స్వంత సైన్యం లేని చిన్న చిన్న దేశాలు తమ పక్కనే ఉన్న పెద్ద దేశాలతోనో లేక ఒకప్పుడు తమను పాలించిన దేశాలతోనో సైనిక ఒప్పందాలు చేసుకొన్నాయి. కానీ ఆ వ్యాఖ్యాత అభిప్రాయం ప్రకారం భారతదేశానికి కావల్సింది ఆర్థిక పురోగతి మాత్రమే. అంటే, దేశం ఆర్థికంగా బాగా పురోగమించిన తర్వాత [సైన్యం లేని కారణంగా] ఏదో ఒక పరాయి దేశపు చేతుల్లో పడి బానిసగా బ్రతకాల్సి వచ్చినా సరే సైన్యమూ ఉండకూడదు, క్షిపణులూ ఉండకూడదని ఆ వ్యాఖ్యాత గారి అనుకోలు. అంటే, కర్మగాలి ఇస్లామిక్ స్టేట్ వారు సైన్యం లేని మనదేశానికి వచ్చి, తుపాకీని గురిపెట్టి ఏది చెబితే అది చేయడానికి సదరు వ్యాఖ్యాత సిద్ధమే. తమ జీతం, ఆర్థిక వనరులు ఉంటే చాలునన్న మాట!

  ఈ హాస్యోక్తులు, ఛలోక్తులు ఎలా ఉన్నా గమనించాల్సిన అసలు విషయం ఒకటుంది. అదేమిటంటే – “వ్యాసాల్ని ప్రచురించే ముందు ఎడిటర్స్ ఏం చేయాలి?”

  ఈ విషయానికి సంబంధించి రెండేళ్ళ క్రితం వాకిలి.కామ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వ్యక్తుల వివరాల కంటే విషయం ప్రధానమైనది కనుక ఆ విషయ ప్రస్తావనను సంక్షిప్తంగా చేస్తాను.

  అది నిర్భయ ఉదంతం జరిగిన తొలినాళ్ళు. ఆ ఉదంతం పై ఎందరో కవిత్వాలు, వ్యాసాలు వ్రాస్తున్న కాలం. ఒక కవి “వీర్య రక్తమాంసాలు”, “శిశ్నాన్ని చేత బట్టుకుని”, “అనియంత్రిత స్ఖలనం” వంటి పదాలతో బాటు “పురుష సూక్తం వర్ధిల్లిన/ (శాంతి) కాముక అర్బనిండియా” అన్న వాక్యాన్ని వ్రాయడం జరిగింది.

  ఆ కవితపై స్పందిస్తూ అఫ్సర్ గారు – “[…]ఈ కవితని అచ్చేసే అవకాశం వాకిలికి ఇచ్చినందుకు షుక్రియా. మీధైర్య/ఆత్మగౌరవ సాహంకార కవిత ఈ కాలానికి చాలా అవసరం. మీరు తక్కువగా రాయడం సామాజిక సాహిత్య నేరం! ఇక మీ ఇష్టం!” అని వ్రాయడం జరిగింది.

  “మీధైర్య/ఆత్మగౌరవ సాహంకార కవిత”అన్న అఫ్సర్ గారి మాటలను చదివి “ఇదేమిటిది? ఈ దేశం ’కాముక’ అర్బన్ ఇండియాగా మారడానికి పురుష సూక్తం ఎలా కారణమయింది? పురుష సూక్తం చదివే, వినే మగాళ్ళందరూ ’మృగాళ్ళే’నా? ఆ సూక్తాన్ని చదివి/విన్న మగాళ్ళు మానభంగాలు చేసిన దాఖలాలు ఉన్నాయా?” వంటి ప్రశ్నలు పుట్టి నేను రంగంలోకి దిగాను.

  “పురుష సూక్తం వల్లనే భారతీయ సమాజం ముక్కలు చెక్కలైపోయిందని” ఆ కవి ప్రస్తావించడంతో అసలు చర్చ మొదలయింది. తమ ప్రస్తావనను ’నిరూపించ’మని నేను కవిని అడగడం, అందుకు ఆ కవి మనుస్మృతి, వాజసనేయ స్మృతి వంటి వాటి తెలుగు అనువాదాల్ని ఎక్కడినుండో తీసుకువచ్చి ఇవ్వడం జరిగింది. కవి పేర్కొన్న శ్లోకాల సంఖ్యలకు, నా దగ్గరున్న ఆ పుస్తకాల్లోని శ్లోకాల సంఖ్యలకు పొంతన లేకపోవడంతో ఆ కవిని మళ్ళీ ప్రశ్నించడం జరిగింది.

  ఇలా సాగిన చర్చలో చివరకు పురుష సూక్తం వల్ల మానభంగాలు జరుగుతాయన్న దారుణాన్ని గానీ, సమాజం భ్రష్టు పట్టిపోయిందన్న విషయాన్ని గానీ ఆ కవి నిరూపించలేక పోవడం జరిగింది. అప్పుడు వారు అఫ్సర్ గారిని ప్రస్తావిస్తూ “[…]మీరు [అనగా ఈ వ్యాసకర్త]….అనవసరంగా కవిని ఆడిపోసుకున్నందుకు మీతో [అనగా ఈ వ్యాసకర్తతో]క్షమాపణలు చెప్పించమని అఫ్సర్గారిని కోరుతున్నాను[…].” అని డిమాండ్ చేయడం జరిగింది.

  ఇందుకుసమాధానంగా నేను “[…]మీరు నాకు క్షమాపణలు చెప్పమని నేను ఎక్కడా డిమాండ్ చెయ్యలేదు. అభ్యంతరకరమైన మాటల్నితొలగించాలని మాత్రమే కోరాను. మీరు చెయ్యకపోతే విచక్షణాధికారాల్నివాడండని వాకిలి సంపాదక వర్గాన్ని కోరాను.ఇప్పుడు మీరు నాచేత క్షమాపణల్నిచెప్పించడానికి అఫ్సర్ వెనుక దాక్కుంటున్నారు. వారినీ రమ్మనండి. ఇవే ప్రశ్నలు వారికీ వేస్తాను.అందరూ కలిసి శాంతియుతంగా,సామరస్యంగా చర్చిద్దాం. అసలు విషయం తెలుసుకుందాం. అఫ్సర్ గారు – వేదిక మీదకు మీకు స్వాగతం. చర్చ మీతో మరింత రంగు సంతరించుకుంటుంది.” అని అన్నాను.

  అఫ్సర్ గారు ఏవో కొన్ని కారణాంతరాల వల్ల ఆనాడు ఆ చర్చలో పాల్గొనలేదు. వ్యక్తిగతంగా నాకో ఈమైల్ పంపారు. అఫ్సర్ గారి అనుపస్థితి, దీర్ఘ మౌనం నేపథ్యంలోను, కామెంట్లను నిలిపివేస్తున్నట్టుగా సంపాదకులు ప్రకటించడం వల్లా ఆ చర్చ అసంపూర్ణంగానే ఆగిపోయింది.

  ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయమేమిటంటే – రచయిత తనదైన ఆవేశంలో కొన్ని ప్రకటనల్ని చేసివుండవచ్చు. కానీ ఆ ప్రకటనలు సున్నితమైన విషయాలకు సంబంధించి చేసివుంటే అటువంటి వాటిని నిశితంగా పరీక్షించాల్సిన బాధ్యత సంపాదక బృందానిదే. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదని నా విశ్వాసం.

  పై ఉదహరించిన కవితలో పురుష సూక్త ప్రస్తావన వచ్చింది గనుక ఆ సూక్తానికి, దాన్ని కవి అనుసంధానిస్తున్న విషయానికి గల స్థూల, సూక్ష్మ సంబంధాలను సంపాదకులు గుర్తించివుంటే బావుండేది. కానీ అది జరగలేదు.

  పురుష సూక్తానికి లేని మకిలిని అంటగట్టడం ఆ కవికి ఉన్న జన్మసిద్ధ హక్కుగా సంపాదకులు భావించారనడంలో సందేహం లేదు. ఈ హక్కుల గురించి తీర్మానించమని అఫ్సర్ గారిని పిలిస్తే వారు మౌనం వహించడం జరిగింది. మరి పురుష సూక్తాన్ని సమర్థించడం ద్వారా రఘోత్తమ రావుకు హక్కు ఉండకూడదని కవి వాదించడం, అలా వాదించినందుకు క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేయడం, ఆ కవికి కితాబునిచ్చి ప్రోత్సహించిన వారు వత్తాసు పలకడమో లేక మౌనం వహించడమో ఎంతవరకు అభినందనీయం?

  ఇంతకూ ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పడం వెనుక కారణం ఒకటి ఉంది. ఆనాడు ఏవో కారణాల వల్ల ఆ నిర్భయ కవి పురుష సూక్తంపై వేసిన అకారణ నింద పై పెదవి విప్పని అఫ్సర్ గారు ఈనాడు కలామ్ గారిపై వచ్చిన వ్యాసాన్ని సమర్థించడానికై సమయాన్ని వెచ్చిస్తూ, ఆ వ్యాస రచయితను వెనకేసుకు వస్తున్నారు. ఎందుకు?

  @@@@@

  రెండు ఘటనలు – పోలికలు:

  పైన పేర్కొన్న రెండు ఘటనలకు ఈ క్రింది పోలికలున్నాయి:

  ఆ ఇద్దరు రచయితలు దళితవాద కవులు, మేధావులవడం.
  వారిద్దరూ పై ఉదహరించిన తమ తమ రచనల్లో సనాతన ధర్మాన్ని, పద్ధతుల్ని, ఆచారాల్ని, గురువుల్నీ విమర్శ పేరుతో హేళన చేయడం.
  సహేతుకమైన, ఆధారసహితమైన చర్చకు సిద్ధపడిన వారిపై ఏవేవో ముద్రలు వేయడం, సాంఘిక నేరస్తులుగా పరిగణించడం.
  అఫ్సర్ గారు మౌనంతోనో, మాటలతోనో, ప్రచురణతోనో ఆ మేధావుల్ని సమర్థించడం.

  ఈ నాలుగు అంశాలు, వాటి మధ్యవున్న సారూప్యత నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అందువల్ల “why such intolerance? when do we learn to respect difference, either view point or color?” అన్న అఫ్సర్ గారి ప్రశ్నల్ని ఈ సందర్భంగా వారికే వేస్తున్నాను.

  @@@@@

  సారంగ ప్రచురించిన “కలాం ప్రజల మనిషి కాదు”పై వచ్చిన ప్రతిస్పందనల గురించి ఫేస్‍బుక్ లో ఒక మిత్రుడికి జవాబునిస్తూ అఫ్సర్ గారు ఇలా అన్నారు – “[…]పరమతసహనం అనే భావన అప్పుడెప్పుడో విన్నాం, ఇప్పుడు కనీసం సహనం కూడా మిగలడంలేదు![….]”

  కానీ పై రెండు సందర్భాలలోనూ పరమత దూషణను చేసింది ఎవరన్నది అఫ్సర్ గారికి తెలియదా?

  పురుష సూక్తం పై, మాజీ రాష్ట్రపతి పై వచ్చిన రచనల్ని సహేతుకంగా ప్రశ్నించిన వారు పరమతద్వేషులుగాను, అకారణంగా, ఆధారరహితంగా సనాతన ధర్మాన్ని ఆడిపోసి, అవహేళన చేసినవారు పరమతసహిష్ణులుగా అఫ్సర్ గారు ఏ ఆధారాలతో వర్గీకరించారు? ఈ వర్గీకరణ స్వవచోఘాతం కాదా? ఇలాంటి భావాలను అఫ్సర్ గారు, వారి అభిమానులు బహిరంగంగా చూపడం వెనుక గల ఆంతర్యం ఏమిటి?

  వీటికి సమాధానాలను నేను చెప్పలేను. చెప్పగలిగిన వారే చెప్పాలి లేదా ఈ వ్యాసం చదువుతున్న పాఠకులు తమకు తామే వెదుక్కోవాలి.

  ఈ వైరుధ్యాలతో బాటు మేధావులైన కొద్దిమంది ద్వంద్వప్రవృత్తుల్ని పాఠకుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది:

  అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత పదవి వరకూ ఎదిగిన డా. కలామ్ గారిలో సారంగ రచయిత తప్పులు పట్టడమే గాక “కలాం – ప్రజల మనిషి కాదు” అని కూడా ఏకపక్ష తీర్మానం చేయడం జరిగింది. అలా ఏకపక్షంగా తీర్మానించడం వారి జన్మసిద్ధ హక్కు అన్న ధోరణిలో సమర్థించే వారున్నారు. అదే జన్మసిద్ధ ప్రశ్నాధికారంను వాడి “ఇది సరైన వ్యాసం కాదు” అని ప్రశ్నించిన వాళ్ళను ఛాందసులు, సంఘ వ్యతిరేకులు అన్న ముద్రల్ను ఈ మేధావులే వేస్తున్నారు. ఇటువంటి పక్షపాతయుక్తమైన భావనలు, దుష్ప్రచారాలు ప్రజాస్వామికమైనవేనా?

  “కొన్ని వందల గండ్రగొడ్డళ్ళు దూసుకువస్తూనే ఉన్నా”యని అఫ్సర్ గారు తల్లడిల్లిపోయారు. అదేవిధంగా “ఇలాంటి పక్షపాతపు వ్రాతల్ని ఓ నిజజీవిత లక్ష్య సాధకుడిపై అతను చనిపోయిన రోజునే వ్రాసి ప్రచురించకండి” అని మాలాంటి వారు తల్లడిల్లకూడదని హెచ్చరిస్తున్నారు కొందరు మేధావులు. ఇదేనా సమన్యాయం, సామ్యవాదం?

  యాకూబ్ మెమెన్ లాంటి ఉగ్రవాదికి బహిరంగ మద్దతను ప్రకటిస్తూ వేలాది ముస్లింలు, వామపక్షీయులు, స్వచ్ఛంద కార్యకర్తలు ఊరేగింపుగా వెళ్ళిన ఈ స్వేచ్ఛా భారతంలో ఇస్లామ్ పవిత్ర గ్రంథాలతో బాటు భగవద్గీతను కూడా చదివే ఓ ముస్లింపై అనవసరమైన రాజకీయ అక్కసును వెళ్ళగక్కకండి అని అభ్యంతరం చెబితే అది మతఛాందసమా? ఇదేనా లౌకికవాదానికి ఈ మేధావులు ఇస్తున్న కొత్త నిర్వచనం?

  ఓ ’మైనార్టీ క్రిస్టియన్’ మేధావి, ఓ ’మైనార్టీ ముస్లిమ్’ మేధావిని విమర్శ పేరుతో తిడితే, ఆ తిట్టును మహాద్భుత విమర్శగా ఓ ’మైనార్టీ ముస్లిమ్’ సాహిత్యకారుడు సమర్థిస్తున్నారన్నది సూర్యబింబమంత స్పష్టంగా కనబడుతోంది. అయితే, ప్రతి విషయాన్నీ కుల, మత కళ్ళద్దాలలోనుండి మాత్రమే చూసే మేధావులకు ఇప్పుడు, ఇక్కడ ’మైనార్టీ’ వాదం గానీ, మైనార్టీల ఆత్మగౌరవం గానీ గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యం! ఇదే వ్యాసాన్ని రఘోత్తమరావు వ్రాసివుంటే ఇప్పటికి సవాలక్ష ’గండ్రగొడ్డళ్ళ’తో బాటు కోర్ట్ కేస్‍లు కూడా కసిదీరా కౌగిలించుకునేవేమో! ఇదేనా సర్వధర్మసౌభ్రాతృత్వం?

  “పరమత సహనం” గురించి ఎల్లప్పుడూ చాటిచెప్పే మేధావులకు కలామ్ గారు ఆచరణలో చూపింది అటువంటి సహనమేనన్న విషయం ఎందుకు స్ఫురించడంలేదు? ఈ విస్మరణ, విస్మృతి ఉద్దేశపూర్వకం కావా?

  భగవద్గీతను చదువుతూ, హిందూ గురువులకు నమస్కరించడమే కలామ్ చేసిన ద్రోహంగా ఈ మేధావులు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వీరు చెప్పే సెక్యులర్ నీతుల్నే ఆచరణలో పెట్టి చూపించిన వారిని విమర్శ పేరుతో అడుగడుగునా అవమానించడం ఏ రకపు ఆలోచనా విధానం? ఇదేనా విమర్శలకు వీరు ఏర్పరిచిన అత్యున్నత ప్రమాణాలు?

  బి.జె.పి. పార్టీ ఎంపిక చేసిన తోలుబొమ్మగా కలామ్ గారిని చిత్రీకరిస్తున్న మేధావులకు ఆ బిజేపి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకుంటేనే ఏర్పడిందన్న విషయం తెలియదా? రాష్ట్రపతి పదవి నుండి తొలగిన మరుక్షణమే కలామ్ గారిని ప్రజలు మర్చిపోతారని జర్నలిస్ట్ వీర్ సాంఘ్వి చేసిన ఊహ ఏ కారణం వల్ల నిజం కాలేదో ఈ మేధావులకు తెలియదా? ప్రజా నాడిని పసిగట్టలేని వారు మేధావులెలా అవుతారు?

  పై చెప్పిన వీర్ సాంఘ్వి ఆర్టికల్ శైలిలోనే సారంగ రచయిత ఆ వ్యాసాన్ని వ్రాయడం జరిగిందని నేను భావిస్తున్నాను. మరి ఆ రచయిత కలామ్ గారిపై ఓ ముస్లిమ్ జర్నలిస్ట్ వ్రాసిన ఈ ఆర్టికల్‍ను ఎందుకు చదవలేదు? అంటే “యది అనుకూలం సుఖం, యది ప్రతికూలం దుఃఖం” అన్న స్వార్థమా?

  ఇద్దరు మాజీ రాష్ట్రపతులకు పని కల్పించుకుని మరీ కుల, మత ప్రాతిపదికన పోలికలు పుట్టించిన వ్యాసంలో ఆ ఇద్దరిలో ఒకరిని పెద్దగీతగా చూపించడానికి మరొకరిని కించపరచడం జరిగింది. దీని కంటే ఆ మొదటివారు చేసిన గొప్ప కార్యాలను, సాధించిన విజయాలను, సమాజంలో తీసుకువచ్చిన మార్పులను, చెప్పిన మంచి మాటలను వివరంగా వ్రాసివుంటే రచయిత ఉద్దేశం నేరవేరేది కాదా? కేవలం తిట్లతోను, హేళనతోను, చవకబారు తర్కంతోను మాత్రమే వ్యాసాలు వ్రాయాలా? ఇదేనా రచయితలు చూపవలసిన ప్రజ్ఞ?

  ఈ రెండు ఘటనల అనుభవం ద్వారా నేను తెలుసుకొన్నదేమిటంటే – ఈ మేధావులు కోరే ప్రజాస్వామ్యపు రూపరేఖలు స్వపక్ష సహనం, పరపక్ష నిందనతో కూడినవి. ఇటువంటి ఏకపక్షీయ నిరంకుశ భావి భారతదేశాన్నా ఈ మేధావులు సాధింపజూస్తున్నారు. ఇది ప్రజాహితమో కాదో విజ్ఞులైన పాఠకులే నిర్ణయించుకోగలరు.

  –స్వస్తి–

 42. సెక్యులర్ మేధావులు – భాషా అనర్థాలు, అపార్థాలు
  పైన వ్రాసిన “అబ్దుల్ కలాం – దళిత, మైనార్టీ, సెక్యులర్ వాదుల డొల్లతనం” వ్యాసంలో కొందరు మేధావుోని వైరుధ్యాలను, ద్వంద్వప్రవృత్తులను వివరిస్తూ, కొన్ని మౌలికమైన ప్రశ్నలను వారికి వేయడం జరిగింది. ఈ వ్యాసంలో ఆ మేధావుల ’భాషా డొల్లతనా’న్ని ప్రశ్నించడం జరిగింది.

  ఇంతకంటే ఉపోద్ఘాతం అవసరం లేదు గనుక ఇక వ్యాసంలోకి….

  భాష గురించి కొన్ని విషయాలు:

  వెండీ డానిగర్ అనే పాశ్చాత్య రచయిత్రి వ్రాసిన “ది హిందూస్ : ఆల్టర్నేటివ్ హిస్టరి” అన్న పుస్తకంపై గత సంవత్సరపు ఆరంభంలో చర్చ జరిగింది. సురేశ్ కొలిచాల గారు వెండీ డానిగర్‍ను సమర్థిస్తూ ఈమాట.కామ్ లో ఓ వ్యాసం వ్రాసారు. ఈ వ్యాసంపై జరిగిన చర్చలో నేను పాల్గొన్నాను. ఆపై మాలిక.కామ్ లో “ఉదారవాదం Vs. తత్వవాదం” అన్న శీర్షిక క్రింద సురేశ్ కొలిచాల గారి వ్యాసాన్ని విమర్శించడం జరిగింది. అందులో భాష గురించి వ్రాసిన మాటలను ఇక్కడ ఉటంకిస్తున్నాను.

  “భాషా వ్యక్తార్థ వాచా” –మానవుల పరస్పర వ్యవహారాల్లో ఉపయోగపడే సాధనం భాష. అంతేగాదు, ఒక వ్యక్తి లక్షణాల్ని, స్వరూపాన్నీ కూడా భాష తెలియజేస్తుంది. ’మాట’గా మారి ఇతరులకు చేరుతుంది గనుక ఆ భాషలో మన లక్షణం, స్వరూపం వికృతాలు కాకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసమే తెలుగు వారు కూడా “మాట ఘనం మానిక పిచ్చ” అన్న సామెతను పుట్టించారు. కన్నడిగులు సైతం ’మాతే ముత్తు – మాతే మృత్యు’ (మాటే ముత్యం – మాటే మృత్యువు) అని చెప్పుకొచ్చారు. కారకమైనా, మారకమైనా మాట మీదే ఆధారపడివుంటుంది గనుక మాటను పలకాలన్నా, వ్రాయాలన్నా జాగ్రత్తగా ఉండక తప్పదు.”

  ఆవిధంగా ’భాష’ను సరిగ్గా అర్థం చేసుకున్న పిదప దానిని ఉపయోగించడం ఉత్తమం. లేనిపక్షంలో ఆ ప్రయోగం అనేక అపార్థాలకు, అనర్థాలకు దారితీస్తుంది. ఈ అపార్థాల అనర్థానికి తాజా ఉదాహరణ అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక ’సారంగ’లో ప్రచురితమయిన “కలాం – హారతిలో ధూపం ఎక్కువ” అనే శీర్షిక.

  హారతి ధూపం – సెక్యులర్ మేధావుల పాపం:

  కలాం గారిని ’హారతి’లోని ’ధూపం’గా పోలుస్తూ హేళన చేయడానికి సారంగ వ్యాస రచయిత శీర్షికలోనే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే నిజానికి వారు కలాం గారిని కాక అటు సంస్కృత, తెలుగు భాషలను ఇటు ప్రసిద్ధ సాహితీవేత్త, విశ్వవిద్యాలయ స్థాయి అధ్యాపకులూ అయిన సారంగ నిర్వాహకుణ్ణీ హేళనకు గురి చేసారు. ఇది ఎలా జరిగిందో చూద్దాం!

  ఒక వ్యాఖ్యాత వ్రాసిన వ్యాఖ్యకు బదులిస్తూ రచయిత ఇలా అనడం జరిగింది – “మీరు టైటిల్ అబ్సర్వ్ చేసినట్టు లేరు. ” హారతిలో ధూపం ఎక్కువ ” హారతి పట్టడాన్ని విమర్శించడం లేదు. అందులో ధూపం ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది .”

  ఏమిటీ వివరణ? హారతిలో ధూపమా! వివరంగా చూద్దాం.

  శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి, పుస్తక రచయిత అయిన కలాం గారిని అనేక రకాలుగా విశ్లేషించి, వారిలోని లోపాలను ’హారతి’ పట్టి చూపించిన రచయితకు ’ఆ(హా)రతి’ వేరు, ’ధూపం’ వేరు అని తెలియకపోవడం విషాదకరం. ఈ శీర్షికను నిర్ధారించే ముందు ఒక్కసారైనా ఓ గుడికి వెళ్ళి అక్కడ పూజ జరుగుతున్నప్పుడు ’ఆరతి’ అంటే ఏమిటి ’ధూపం’ అంటే ఏమిటి అని చూసి తెలుసుకునే ప్రయత్నం చేసివుంటే బావుండేది. లేదా ఓ పూజారిని అడిగినా బావుండేది. సెక్స్ వర్కర్ల జీవితాలను అధ్యయనం చేయడానికై ఆ ప్రాంతాలను సందర్శించడం ఎలానో అలానే పై రెండు పనులలో ఒకదాన్నైనా సారంగ రచయిత చేసివుంటే పత్రికను అవహేళనకు బలికానివ్వకుండా కాపాడడం జరిగేది. కానీ రచయిత తన స్వబుద్ధిని నమ్ముకుని, ఆ రెండు పదాలకు ఉన్న సిసలు అర్థాలు తనకే తెలుసుననుకొని పొరబడ్డారు. ఈ పొరబాటు ఏమిటో వివరిస్తాను.

  సనాతన పూజా పద్ధతిలో భాగంగా షోడశ ఉపచారాలను (16 సేవలు) నిర్వహించడం పద్ధతిగా వస్తోంది. ఇందులో అభిషేకం, అలంకారం వంటి ఉపచారాలతో బాటు ’ధూపం,’ ’దీపం’, ఆపై ’ఆరతి’ని సమర్పించడం జరుగుతుంది. కనుక అమలులో ఉన్న ఆచారం ప్రకారం చూస్తే ’ధూపం’ వేరు, ’ఆరతి’ వేరు అన్న విషయం స్పష్టమవుతోంది. పూజాక్రమంలో ఈ రెండింటికి వేరు వేరు మంత్రాలు ఉన్నాయి గనుక ఇవి వేరు వేరు సేవలుగానే తెలియాలి. ఒకవేళ సారంగ రచయిత భావించినట్టుగా ’హారతిలో ధూపం’ ఉండవచ్చు గదా అని ఆశంకిస్తే అప్పుడు 16 సేవలకు బదులు 15 సేవలు మాత్రమే వచ్చి “షోడశ” అన్న లెక్క తప్పుతుంది. ఈవిధంగా కూడా ’ఆరతి’ వేరని, ’ధూపం’ వేరని చెప్పక తప్పదు.

  రచయితలు అప్పుడప్పుడూ చేసే ఇటువంటి ’సాంకేతిక’ తప్పిదాలను సరి చేయవలసిన సంపాదకులు కూడా ఆ తప్పును యథాతథంగా ఆమోదించి, ప్రచురించడం ద్వారా అక్కడి సెక్యులర్ మేధావుల ’అవగాహనా డొల్లదనం’ అనే ప్రహసనం ఆవిధంగా పూర్తయింది. (కానీ ఈ వ్యాసం ఇంకావుంది)

  వ్యంగ్యం వల్ల సిద్ధాంత స్థాపన జరగదు గనుక గంభీర విమర్శన తరువాత నాకు అర్థమయింది ఏమిటంటే ఆ సారంగ రచయిత చెప్పదల్చుకున్న విషయం – “[కర్పూర] ఆరతిలో ధూమం ఎక్కువ” అని.

  సంస్కృతంతో పరిచయం లేని జిజ్ఞాసువులకు ’ధూపం’, ’ధూమం’ పర్యాయ పదాలనే భావన కలిగి నేనేదో రంధ్రాన్వేషణ చేస్తున్నట్టుగా అనిపించవచ్చు. కానీ నేను రంధ్రాన్వేషణ చేయడం లేదని నిరూపిస్తాను.

  సంస్కృత పదాల అసలు అర్థం తెలుసుకోవాలంటే ఆ పదాల మూలాలైన ధాతువుల్ని తెలుసుకోవాలి. అలా ధాతువుల ఆధారంగా ’ధూప’ పదాన్ని, ’ధూమ’ పదాన్ని అధ్యయనం చేస్తే ఇవి రెండూ పరస్పర సంబంధం లేనివని అంటే పర్యాయ పదాలు కానివని స్పష్టమవుతోంది. జిజ్ఞాసువులైన పాఠకులకై ఈ రెండు పదాల ధాతుపాఠాలను క్రింద ఇస్తున్నాను:

  ధూప = ధూపయతి రోగాన్ ఇతి ధూప (ధూప సంతాపే)

  ధూమ = ధూంగ్ కంపనే

  పై ధాతువుల వల్ల ’ధూప’ మనేది రోగాలకు సంతాపాన్ని కలిగించేది అనగా రోగాలను పోగొట్టేదని, ధూమమంటే కంపింప జేసేదని తెలుస్తోంది.

  సనాతన ధర్మంలోనే గాక ఇస్లాం మతీయులైన ఫకీర్లు కూడా వాడే సాంబ్రాణి లేక గుగ్గిలంను ధూపానికి ఉదాహరణగా చెప్పవచ్చు. సాంబ్రాణి ధూపం పొగలా కనబడినా అది ’కంపన’ను పుట్టించదు. పైగా ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. దీని విరుద్ధంగా పచ్చికట్టెలను మండించినపుడు లేచే ఘాటైన పొగను ’ధూమా’నికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ పొగను పీల్చినవారు దగ్గుతో ’కంపించ’డం సహజమే. కనుక అందరికీ అనుభవపూర్వకమైన ఈ రెండు ప్రత్యక్ష ప్రమాణాల ఆధారంగా ఎటువంటి విభేదాలకు తావులేకుండా ’ధూపం’ వేరని ’ధూమం’ వేరని స్థిరపరచవచ్చు.

  ఇవేవీ అధ్యయనం చేయని సారంగ రచయిత ’హారతిలో ధూపం’ అంటూ సనాతన పూజా విధనాన్ని కించపరచబోయి స్వయం ’కించిత్’ అయ్యారని చెప్పక తప్పదు.

  “ధూపం వేరు, ధూమం వేరయితే “[కర్పూర] హారతిలో ధూమం” అన్న నీ ఊహ ఎలా కుదురుతుంది?” అని జిజ్ఞాసువులు నన్ను ప్రశ్నించవచ్చు. దానికీ వివరణ ఉంది.

  నెయ్యిలో తడిపిన వత్తుల కంటే రసాయన పదార్థమైన కర్పూరంతో ఇచ్చే ఆరతికి ధూమం (పొగ) ఎక్కువ. కర్పూరం కంటే నెయ్యి వత్తులు ఆరతికి శ్రేష్ఠం. కానీ వాటిని తయారుచేయడానికి సమయం వెచ్చించాలి గనుక కర్పూర వాడకం ఎక్కువయింది. అలా పొగలు (ధూమం) చిమ్ముతూ కంటబడిన కర్పూర ఆరతిని ఎక్కడో, ఎప్పుడో చూసిన సారంగ రచయిత తాను విమర్శించబోతున్న వ్యక్తిని (కలాం గారిని) ఎద్దేవా చేయడానికి అదే సరైన ప్రతీకగా భావించివుండాలి. కానీ ఏ కారణం చేతనో శీర్షికను వ్రాస్తున్న వేళ ధూమం స్థానంలో ధూపం వచ్చి కూర్చుంది. (బహుశా చట్టంలానే ధర్మం కూడా తన పని తాను చేసుకుపోతుందేమో!)

  అలా ఆ రచయితకు గుడికి వెళ్ళి చూడ్డమో, పూజారిని వాకబు చేయడమో నచ్చదు గనుక స్వబుద్ధికి తోచిన విధంగా శీర్షికను తయారు చేసివుండాలి. సకల దుర్మార్గ భూయిష్టమని వారు భావించే సనాతన ధర్మాన్ని ఎండగట్టడమనే బాధ్యతను నిర్వహిస్తూ తమ శీర్షికకు పదభ్రష్టతను అంటగట్టారు. ఈ కారణాల మూలంగా ’అయ్యవారి బొమ్మను చేయబోతే కోతి అయిం’దన్న చందాన విశిష్ట శీర్షికగా వెలుగొందాల్సింది కాస్త దుష్టార్థ సంక్లిష్టయై, భావ లోపభూయిష్టమై, నష్టార్థయుక్తమై అలరారింది. ఇందువల్ల “” హారతిలో ధూపం ఎక్కువ ” హారతి పట్టడాన్ని విమర్శించడం లేదు. అందులో ధూపం ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది .” అన్న సారంగ రచయిత ధూప వివరణ కడుంగడు హాస్యాస్పదం, అవైజ్ఞానికం.

  కానీ, దీని కంటే వింత గొలిపే విషయం మరొకటుంది!

  విశ్వవిద్యాలయ స్థాయి అధ్యాపకులు పెద్దదిక్కుగా ఉన్న సారంగ సంపాదక బృందానికి రచయిత చెప్పదల్చుకున్నది ’ధూపం’ కాదు ’ధూమం’ అని స్ఫురించకపోవడమే ఆ వింత! ఇది బహుశా పని ఒత్తిడి వల్ల కావొచ్చు లేక ఆ క్షణంలో సరైన పదం బుద్ధికి తట్టకపోవడమూ కావొచ్చు లేదా ఆ శీర్షిక వల్ల సంభవించనున్న సనాతన ధర్మ హేళనను తలుకుచుకుని ఒడలు పులరిస్తూ ఉండడమూ కావొచ్చు. ఏది ఏమైనా బయటి వ్యక్తిగా నేను ఊహల్ని మాత్రమే చేయగలను. లోగుట్టు ’సారంగ సారథు’లకే ఎరుక!

  ఇటువంటి అనర్థదాయకమైన భాషా ప్రమాదాలను నివారించాలంటే రచయితలు, సంపాదకులు భాష పట్ల జాగురూకులై ఉండాలి. తెలియని పద్ధతులకు సంబంధించిన పదాలను వాడబోయే ముందు వాటి మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో కులానికి గానీ, మతానికి గానీ స్థానమే లేదు. ఎందుకంటే ప్రపంచంలోని ఏ భాష అయినా మానవుల పరస్పర భావ వినిమయానికి మాత్రమే పుట్టికొచ్చింది. కానీ ఆ సారంగ రచయితకు, సారంగ సారథులకు భాషకు కూడా కుల మతాల రంగుల్ని అద్ది చూపాలన్న తాపత్రయం ఎక్కువగా ఉన్నట్టు అక్కడ జరిగిన భాషా ప్రమాదం వల్ల స్పష్టమవుతోంది.

  @@@@@

  ఈ నేపధ్యంలో నాలో ఈ క్రింది ప్రశ్నలు ఉద్భవించాయి:

  తాము వాడుతున్న పదాలకు అర్థం తెలియని వారిని మేధావులని పరిగణించవచ్చునా?
  అటువంటి వారు వ్రాసినదంతా అక్షరసత్యాలని ప్రజలు నమ్మాలా?
  విమర్శించదల్చుకున్న విషయాలలోని ప్రక్రియల పట్ల కనీస అవగాహన లేని ఈ మేధావులు ’విమర్శ’ పేరుతో చేస్తున్న ప్రచారాన్ని విషప్రచారమని అనకూడదా?
  ఒక విమర్శను చేయాలంటే మొదట ఆ విషయం పట్ల సరైన పరిశోధన చేయాలని ఈ మేధావులకు తెలియదా?
  అలా పరిశోధన చేయాలంటే విమర్శించ దల్చుకున్న విషయం పై అక్కసుతో గాక నిర్మత్సరతతో విషయ సేకరణ చేయాలన్నది వీరికి తెలియదా?
  ఇవేవీ తెలియకుండా/తెలుసుకోకుండా వ్యాసాలు ఎందుకు వ్రాస్తున్నారు?
  ఇటువంటి అసత్య/అర్ధసత్య ప్రతిపాదకులు ఎన్ని రాతలు వ్రాసినా ’కిమ్ ప్రయోజనమ్?’

  ఇప్పుడు నేను అడుగుతున్నాను గనుక నన్ను మతఛాందసుడని, మనువాదియని, అభ్యుదయ విరోధియని ఇంకా వారి పడికట్టు పదాలన్నింటితోనూ నిందించవచ్చు గాక! ఆ నిందలన్నీ వారు చేసిన భాషా ద్రోహం ముందు బలాదూరనే భావిస్తాను.

  క్రితం వ్యాసంలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు వచ్చినా రాకున్నా ఈ వ్యాసంలో లేవనెత్తిన సమస్య కులమూ కాదు, మతమూ కాదు భాషది. కనుక నేను ఎత్తి చూపిన వారి భాషా లోపాలకు, అవగాహనా లేమికి సూటిగా, డొంకతిరుగుడు లేని సమాధానాలను ఆశిస్తున్నాను. లేకుంటే విజ్ఞులైన పాఠకులు ఈ మేధావుల్ని నిర్గంధ ’ధూప’కేతువులు గా భావించే అవకాశం ఉంది!

  @@@@@

  • /ఈ వ్యాసంలో లేవనెత్తిన సమస్య కులమూ కాదు, మతమూ కాదు భాషది. కనుక నేను ఎత్తి చూపిన వారి భాషా లోపాలకు, అవగాహనా లేమికి సూటిగా, డొంకతిరుగుడు లేని సమాధానాలను ఆశిస్తున్నాను./
   ఒక సా ధారణా పాటకుడికి ఒచిన సందేహం.
   మీ భాషాభి మానానికి, ఆవ గాహణకు జోహార్లు, ఒక భాష తనకు తానే ఒక భాష అవుతుందా ,ఒక సంస్కృతీ ,ఆచారాలు, అలవాట్ల భావ జాల వ్యక్తీకరణే భాష అవుతుంది అని అనుకుంటున్నాను. ఏ రంగు రుచి వాసన లేకుండా చెప్పినది భాష ఎలా అవుతుంది? మీరు భాష అంటున్నది ఒక సంస్కృతీకి, ఆచారాలకు సంభందిమ్సినది. వేరు వేరు సంస్కృతులకు చెందిన వారు ఇతరుల ఆచార వ్యవహారాలను వ్యక్తీక రిమ్సు టపుడు కొన్ని తప్పులు దొర్లవచ్చు. ఈ సాంకేతికమైన తప్పులు వ్యాస లక్ష్యాన్ని, భావాన్ని ఏ మాత్రం హరించ లేదు కదా?

 43. ముందుగా మేధావులు అని బిరుదు ఇవ్వవలసినది వారిని పరిశీలించిన జనం. కానీ తమకు తామే మేధావులమని చెప్పుకునే స్వయమ్ప్రకటిత మేధావులు ఎక్కువయ్యారు సమాజంలో. స్వయం ప్రకటితంగా నైనా ఏదో ఒక దిక్కుమాలిన గుర్తింపు లేకపోతే తమ కపట కుట్రలను అమలుచేసే అవకాశం ఉండదు వారికి. ఇక దీనివెనుక ఉన్న శక్తుల అండ కూడా అదనం వీరికి. వీళ్ల దృష్టి మొత్తం సనాతన ధర్మం పైన దానిని అనుసరించి జీవనయానం చేసేవారిపైన తమ అక్కసు వెళ్లగక్కటం పైనే ఉంటుంది. అదేమో చివరకు ఆకాశంపై ఉమ్మినట్లు వీళ్ల ముఖాలపైనే పడుతూ ఉంటుంది .
  వాళ్ల లక్ష్యం వేరుగనుక తాము చేసేపని సవ్యమైనది కాదని తెలిసినా ఏమాత్రం సిగ్గుపడటం గానీ సరిదిద్దుకోవటం కానీ చేయరు.

  వారిమాటలు చర్చలకోసం కాదు. ఆరోపణలతో మాత్రమే తమనుకూదా మేధావులుగా గుర్తించాలనే వెర్రి వ్యామోహం.

  నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరించే సాహితీ మేధావుల ముసుగులు –

 44. rani siva sankara sarma says:

  సనాతన ధర్మంలో రచనలని నిషేధించాలనే ఆలోచనే లేదు. వలస క్రైస్తవులు, వారిని అనుకరించిన హిందువులు భావాల్ని పుస్త కాలని నిషేధించడాన్ని మొదలు పెట్టారు. ఉదాహరణకు రాధికా సాం త్వనంపై నిషేధం. శంకరాచార్యులని మధ్వాచార్యులు రాక్షసుడని నిందిచాడు.అంత మాత్రాన మధ్వ సిద్ధాంతాన్ని నిషేధించాలా? వేమన పద్యాలని కుడా అప్సర్ గారు ఎడిట్ చేయాలా చంద్రగారు? ఆయోగి పుంగవుడిని కుడా అవమానించి పాపం మూట కట్టుకొమంటారా సుఫీఇజంపై గ్రంధం రాసిన పుణ్యాత్ముణ్ణి ? పిండములను చేసి పితరుల తలపోసి , కాకులకు పెట్టు గాడిద లార, పెంట తినేది కాకి పితరుడెట్లాయరా , విశ్వదాభిరామ వినుర వేమా అన్నాడు వేమన . ఇలాంటి భావాలనే రామాయణమ్ లో రాముడు వ్యతిరేకించాడు . ఇలా పూర్తీ విరుద్ధమైన భావాలు ప్రజాస్వామికంగా వ్యక్తం అయ్యే అవకాశం , విశాల దృక్పధం వర్ధిల్లడమె సనాతనం .ఎడిట్ చెయ్యాలనడం నిషేధించమనడం వలస పాశ్చాత్య దృక్ పధం రామచంద్రుడి అభి ప్రాయాలని నిషేధించాలా. వేమన అభిప్రాయాలని ఎడిట్ చేయాలా ? తప్పులుంటే వివరించండి చర్చించండి నిషేదిన్చమనకండి సనాతనం వర్ధిల్లాలి హిందూ పాశ్చాత్య నియంతృత్వం నశించాలి

 45. Wilson Sudhakar Thullimalli says:

  ” సర్వధర్మసౌభ్రాతృత్వం ” ఇదేమి భాషరా దేవుడా ! వీరి తెలివి మండ! మమ్మల్ని విమర్శించే సాహసం కూడానా!

 46. rani siva sankara sarma says:

  గుడి పట్ల పూర్తీ వ్యతిరేకత గల విజయ కుమార్ కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా అధిక్షేపంగా హారతిలో ధూపమ్ అనే విచిత్ర ప్రయోగం చేసి ఉండచ్చు . రాయికి విగ్రహానికి ఆయన దృష్టిలో తేడా లేదు. అప్పుడు ధూమ సామాన్యానికి ధూపానికి తేడా ఉండే అవకాశమ్ లేదు . ఆయన ఏకకాలంలో హారతి ని ధూపాన్ని రెండు రకాల విగ్రహారాధనని వ్యతిరేకించడం కోసమ్ షాకింగ్ గా ఈపేరు పెట్టి ఉండవచ్చు . కలాం ని విగ్రహంగా మార్చి నిర్హేతుక విగ్రహారాధన పెంచ వద్దు అని రచయిత హృదయం. ధూప దుమాలని కలిపేయడం విరుద్దాంసాలని కలిపి వేసే అజ్ఞానంగా భావించక్కరలేదు. పదాలని పూర్తి విరుద్ధార్థంలో కవులు పండితులు కూడా ఉపయోగిస్తారు . ఉదాహరణకి దేవానాం ప్రియ; అనే పదాన్ని బౌద్ధులు దేవతలకి ఇస్టమైనవాడు అనే అర్థంలో వాడేవారు . అది అశోక చక్రవర్తి బిరుదు కుడా. దీన్ని బ్రాహ్మణులు మూర్ఖుడు అనే అర్థంలో ప్రయోగించారు. ఛాందసుడు అంటే వేద జ్ఞాని . ఇప్పుడు నిమ్దార్థకమ్ లో వాడుతున్నారు. దైవం కి వికృతి దెయ్యం. ప్రకృతి వికృతులు పరస్పర విరుద్ధార్థాలని సంతరించుకోవడం ఇక్కడ జరిగిన వింత . ప్రబంధాల్లో కంపు అనే పదానికి వాసన అని మాత్రమె అర్థం. ఇప్పుడు దుర్గంధం అర్థం లో పూర్తీ వ్యతిరేకార్థంలో వాడుతున్నాం . శ్రీశ్రీ ఆల్కహాలికులు అనే వింత ప్రయోగం చేసాడు . వాల్మీకి మొట్టమొదటి సారిగా ఆశువుగా చెప్పిన మా నిషాద శ్లోకం రెండు విరుద్ధార్థాలని కలిగి ఉంది . ఒకటి కిరాతక నింద ; రెండు రామావతార స్తుతి . అందు వల్ల వైరుధ్యాల వెనుక దాగిన కవి హృదయాన్ని అర్థం చేసుకోగలవాడే సహృదయ విమర్శకుడు.

 47. అడవి విశ్వేశ్వర ప్రసాద్ says:

  ఒకే ఒక్క సందేహం…….అసలు ఈ article ఆయన పోయిన తరవాత ఎందుకు వ్రాయటం?

  ఇదేదో ఆయన బతికిఉన్నాపుడే వ్రాసి ఉంటే ఆయన సమాధానం ఇచ్చుకునే అవకాశం ఉండేది కదా…

  • Chandrika says:

   కలామ్ గారికి ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? 84 ఏళ్ల వయసు లో తన మనసు కి నచ్చిన పని చేస్తూ శరీరం విడిచి పెట్టారు. 5 ఏళ్ల పిల్లల దగ్గర్నించి 90 ఏళ్ల ముసలి వాళ్ళ దాక నివాళులు అర్పించారు అయనకి. ఇలాంటి వ్యాసాలు చదవటం, కామెంటడం మన తప్పు!!

   • P V Vijay Kumar says:

    I am sorry andi. you r totally reading an irrelevant article of not your taste. It might hurt you unless you have a leaning to chnage your point of view

   • అడవి విశ్వేశ్వర ప్రసాద్ says:

    PVVK :

    ఒక పెద్ద MNC, కలాం గారు ఇచ్చిన స్పూర్తి తో, ఆయన ఇచ్చిన directions తో దేశం లోని మారు మూల గ్రామాలలో కూడా స్కానింగ్, ECG (హ్యాండ్ క్యారీ ఇన్స్ట్రుమెంట్స్) ప్రవేశపెట్టారు .ఆ విధంగా గ్రామాలలోని వారి ఆరోగ్యం గురించి ఆలోచించి …వారి స్తితి గతులను మార్చిన దార్శినికుడు …మహానుభావుడు. ఇందులో ఈ MNC ఏమైనా చారిటి చేసిందా అంటే లేదు…..అది తన బిజినెస్ మోడల్ ని మార్చుకుంది….లాభాలు గడించింది….. కాని ఈ సమయంలో ఒక సామాన్య మనిషికి కావాల్సింది ఏమిటి…అని ఆలోచించిన ఒక “అనన్య” మైన వ్యక్తిత్వం ఉన్న మనిషి కలాం గారు. నా చుట్టూ పక్కల ఉన్న చాలా మంది ఇంజనీర్స్ ఆయన ఇచ్చిన స్పూర్తి తో ఎన్నో useful innovations చేసి patents ఫైల్ చేసారు.
    ఈ పేటెంట్స్ వల్ల ఏమి లాభం అనిమాత్రం అడగకండి….

    అసలు “మనువాదం” అంటే ఎంత మందికి అర్ధం అవుతుంది ఈ రోజుల్లో చెప్పండి. తుప్పు పట్టిన ఆలోచనలు కాకపొతే?

    అసలు ఒకరిని glorify చెయ్యటానికి ఇంకొకరిని తిట్టిపోయ్యటం లేదా ఏవో ఫొటోస్ పెట్టి …ఆ వాదం …ఈ వాదం అంటూ ప్రచారం చెయ్యటం “Character Assassination” కిందకి వస్తుంది.

    ఒక మాట చెప్పండి…ఒక వేళ కలాం గారు తన మతాన్ని అనుసరించి, ముస్లిం మత గురువులు, వారి దర్గాలు, మస్జిద్ లు మాత్రమే తిరిగి ఉంటే….అది మీకు కరెక్ట్ గా అని పించేదా? He was above all of our thinking and religion….he was a true human being…so don’t be blind and append some “ism” to that great soul.

    Did anyone stop Shri. Narayanan garu to go beyond what Shri. Kalaam garu did or do something splendid in some other direction?

    If you have caliber, knowledge, passion ….then go ahead and publish what Shri Narayanan garu did great to this country…everybody would appreciate.

    You have posted an article in public domain and how can you claim it is not relevant to everyone? You should have added a disclaimer/alert/applicability at the beginning of the article describing the mindset (kind of leaning that you mentioned below) is required to read and absorb……

    Afsar garu, please filter out these kind of “Unhealthy” contents including the comments (mine too)

Leave a Reply to p v vijay kumar Cancel reply

*