సప్త స్వరాల చివరి మజిలీ- ని!

 

 

మమత వేగుంట

 

సప్తస్వరాల శిఖర బిందువు- నిషాదం!

స్వరం సరిహద్దులకి చివరి పరీక్ష- ని.

నీ వ్యక్తీకరణ పరిధుల తుదీ మొదలూ  తేల్చుకునే సమయంలో వినాలి- ని.

 

తెగని సంఘర్షణ తరవాతే గెలుపు

కాన్వాస్ చీకట్లోంచి మెరుస్తుంది కళాఖండం

ఆ ఉత్సాహపు ఉరకల్లో మేధో విజయంలో వినాలి- ని.

 

ఏనుగు ఘీంకారంలోంచి కదిలాయి నిషాద స్వరమూలాలు.

ఆ ఘీంకారం నిన్నూ నన్నూ ఆదిమ యుగాల్లోకీ తీసుకెళ్తుంది

ఈ క్షణంలోకీ ఇక్కడికీ మేల్కొల్పుతుంది.

సాధ్యమయ్యే కలలోకి మెలకువ- ని

ఒక అద్భుతంలోకి విజయ సోపానం- ని

సాధ్య స్వప్న కళకి చేరువగా విను- ని!

Mamata 1

మీ మాటలు

  1. kandukuri ramesh babu says:

    ని?

    మమత గారు.
    వాట్ ఏ లవ్లీ వర్క్.

    ఉన్నత మైన కళకు బాష అక్కర్లేదు అన్నారు ఒక మిత్రుడు మొన్న.
    అలా అన్నట్టే, ఈ సారి మీ సుస్వరం చూస్తే టెక్స్ట్ చదవకుండా ఉన్దిపోవాలనిపించింది.
    ఎంత ఎత్తుకు తీసుకెళ్ళారు!
    ఆ ఘీంకారం కూడా సుస్వరం అని అర్థమయింది.
    థాంక్స్ చెప్పడం వేస్ట్.
    ఐనా, ఒక మాట.
    అసలు మీరు ఆ మాత్రం కూడా చెప్పడం ఎందుక -ని?
    అంత బ్రివిటి ఎలా సాధించారు?

    నైస్ వర్క్స్ ప్లీజ్.
    సెలవు, మరో ప్రయత్నం వరకు.

    • Mamata Vegunta says:

      రమేష్ గారు, A picture speaks a thousand words అన్నారు కదా, అందుకే బొమ్మ వేసినప్పుడు మాటలు సెలవు తీసుకుంటాయి.. thank you for your response ! మమత

  2. ” ఆ ఘీంకారం నిన్నూ నన్నూ ఆదిమ యుగాల్లోకీ తీసుకెళ్తుంది… ఈ క్షణంలోకీ ఇక్కడికీ మేల్కొల్పుతుంది.” అద్భుతం మమత గారూ !

    • రమేష్ గారు.. A picture is worth a thousand words అన్నారు కదా, బొమ్మ వేసినప్పుడు మాటలు సెలవు తీసుకుంటాయి.. :) thank you for your response..

మీ మాటలు

*