వినిపిస్తోందా ఆ సూర్యుడి శ్వాస…అశ్వ ఘోష!

 

మమత వేగుంట 

 

దూరాన్నుంచి

గుర్రం అడుగుల  చప్పుడు విను,

గాఢమయ్యే లయలో

కొట్టుకునే నాడితో-

 

అదిగో చూడు

కాలు దూసే ఆశ్వ సోయగం   

ఆ  శక్తీ

ఆ తీవ్రతా.

suswaram

 

 

 

 

 

వింటూ వుండు

భైరవ రాగంలో పల్లవించే సౌందర్యం

ఎగసి పడే అశ్వ ఘోషలో 

వాది స్వర నాదం – ద!

ఆ నాదంలో  ఆ స్వరంలో

సూర్యకాంతిని తాకి చూడు.

నేలంతా  అల్లుకున్న వెల్తురు చూడు.

గుర్రం అడుగుల కింద మెరిసే శక్తినీ చూడు.

 

ఇక అప్పుడు కదా,

తపన జ్వాలగా ఎగసి పడుతుందీ!

*

Mamata 1

 

మీ మాటలు

  1. rajani patibandla says:

    జ్వాల తాకింది ….చిత్రం లో నుంచి వేడిగా …. కవిత లో నుంచి చల్లగా …

  2. ” సూర్యుడి శ్వాస…అశ్వ ఘోష ” ఆలోచన మొత్తాన్ని ఒక్క బాణం తో చేదించినట్టు ఈ మాట , సూర్యుడి రంగుల్లోంచి ఒక అర్ధాన్ని మోసుకొచ్చిన చిత్రం !! TQQ

మీ మాటలు

*