నల్ల దివిటీ 

 తిలక్ బొమ్మరాజు

 

 వొక యేకాంతం పాయలు పాయలుగా చీలి
కొంత అన్వేషణ మొదలు పెడుతుంది
కొన్ని మౌనాలు మాటలుగానూయింకొన్ని మాటలు సంభాషణలుగానూ రూపాంతరం చెందుతాయి

 

నువ్వో నేనో వో ప్రచ్చన్న దిగ్భందంలోనే వుండిపోయినప్పుడు

యిక స్వప్నాలెలా దొర్లుతాయి

కాస్త వర్షమూ మనలో కురవాలి

మరికొంత చినుకుల చప్పుడూ మనమవ్వాలి

 

మన ఆత్మలు దేహపు వంతెనల కింద కొన్నాళ్ళు మగ్గాక యెక్కడ స్థిరపడగలవు

మళ్ళా నీలోనో నాలోనోనేగా వుండిపోవాలి

 

విశ్వరూపానికి ప్రతీకల్లా యెన్నాళ్లు నిలబడి వుండగలం

యిప్పుడో ఆ పిదపో వొకళ్ళలో మరొకళ్ళం యింకిపోవాల్సిందేగా

అస్తిత్వాలు వొక్కటిగా కాస్త మానవత్వాన్నీ తోడుకుంటాంగా

వదిలి వెళ్ళకుండా

 

పయనాలు నీళ్ళలోని ప్రతిబింబాలే మనకెప్పుడూ

వొకరి ముఖంలో యింకొకరం వెన్నెల చిహ్నాల్లా వెలుగుతుంటాం

వెళదాం యిక మరో ప్రాకారంలోకి-

15-tilak

మీ మాటలు

  1. Dr. Vijaya Babu, Koganti says:

    “కాస్త వర్షమూ మనలో కురవాలి

    మరికొంత చినుకుల చప్పుడూ మనమవ్వాలి”
    బాగుంది తిలక్ గారు.

  2. బాగుంది

  3. vijay kumar says:

    Well crafted one tilak…

  4. నిశీధి says:

    అస్తిత్వాలు వొక్కటిగా కాస్త మానవత్వాన్నీ తోడుకుంటాంగా

    వదిలి వెళ్ళకుండా << కదా , ప్రతిసారి కొత్తదనమే మీ పదాల్లో

  5. balasudhakarmouli says:

    పోయెం నచ్చింది. థాంక్యూ.. !

  6. ప్రారంభం నుండి చివరిదాకా బిగి సడలకుండా నడిపారు కవితను. అభివ్యక్తి బాగుంది. అభినందనలు.

  7. Simply splendid !!

  8. Mythili Abbaraju says:

    ప్రచ్చన్న దిగ్భందం..well coined andee

  9. prasadamurty says:

    కవిత బావుంది తిలక్ గారు

Leave a Reply to Mythili Abbaraju Cancel reply

*