మమత వేగుంట
పొడుగాటి నీడలు చీకట్లోకి కరిగిపోయాయి.
గాఢమవుతున్న ఆకాశంలో దిగంతానికి ఒక చట్రం గీస్తున్నాయి సాయంత్రపు రేఖలు.
దీపాలు ముట్టించే వేళ
వేసవి పాట కోసం కోకిలకి దాహం- నాలాగే.
ప.
ఆ కోకిల పిలుపు
సప్తస్వరాల్లో అయిదో పలుకు.
స్థిరమైన ప్రకృతి దృశ్యం లాగానే ఎంతో నిబ్బరం ఆ స్వరంలో-
వేసవిలోని గాంభీర్యం ఆ పలుకులో.
దీపాలు వెలిగించే దీప రాగం – దీపకం- “ప” ఆ రాగానికి వాది స్వరం.
ఆ దీప గీతికని పాడే కోకిల గొంతు విను
నట్టింట్లోనూ గుండె లోతుల్లోనూ జీవించే దీపాన్ని చూడు.
ఎదురుచూస్తున్న కలల పాట పాడే కోకిలని విను
అది జీవితాన్ని వెలిగించే కల.
గీత(తా)ల కోయిల రాతలై వెలిగింది .
గీత,గీతం – రెండు నచ్చినందుకు – సంతోషం :)
కవిత చాలా బావుంది. దీప గీతికను పాడే కోకిల గొంతు నిజంగానే వినిపించింది.
Happy you heard the music! Thank you!
పెయింటింగ్ చూస్తుంటే ఆ నీలిమ లోకి మాయం అవ్వాలనిపిస్తుంది కానీ కవిత దీప గీతం వినేందుకు ఆగిపోమ్మంటుంది
Nice thought, Rajani Patibandla!
“ఎదురుచూస్తున్న కలల పాట పాడే కోకిలని విను” .. పెయింటింగ్ లోని ఆ చిటారు కొమ్మన కోకిల, అంత నీలాకాశం.. ఈ వాక్యాలు జీవితాన్ని వెలిగించే కలవైపు తీసుకెళ్తున్నాయి మమత గారు !!
మమత గారూ! ” నట్టింట్లోనూ గుండె లోతుల్లో నూ , జీవించే దీపాన్ని చూడు” … ఎంత బావుందో కవిత ! అభినందనలు !
దీపాలు ముట్టించే వేళ వేసవి పాటకోసం కోకిలకి దాహం – నాలాగే సూర్యుడు తన కిరణాల పగ్గాల తో ఆశ్వ్గఘోష గుండె సోదని తాకింది .చాల బావుంది