కోకిల పాడే దీపం పాట!

మమత వేగుంట 

 

పొడుగాటి నీడలు చీకట్లోకి కరిగిపోయాయి.

గాఢమవుతున్న ఆకాశంలో దిగంతానికి ఒక చట్రం గీస్తున్నాయి సాయంత్రపు రేఖలు.

దీపాలు ముట్టించే వేళ

వేసవి పాట కోసం కోకిలకి దాహం- నాలాగే.

ప.

ఆ కోకిల పిలుపు

సప్తస్వరాల్లో అయిదో పలుకు.

suswaram

స్థిరమైన ప్రకృతి దృశ్యం లాగానే ఎంతో నిబ్బరం ఆ స్వరంలో-

వేసవిలోని గాంభీర్యం ఆ పలుకులో.

దీపాలు వెలిగించే దీప రాగం – దీపకం- “ప” ఆ రాగానికి వాది స్వరం.

ఆ దీప గీతికని పాడే కోకిల గొంతు విను

నట్టింట్లోనూ గుండె లోతుల్లోనూ జీవించే  దీపాన్ని చూడు.

ఎదురుచూస్తున్న కలల పాట పాడే కోకిలని విను

అది జీవితాన్ని వెలిగించే కల.  

Mamata 1

మీ మాటలు

 1. గీత(తా)ల కోయిల రాతలై వెలిగింది .

  • గీత,గీతం – రెండు నచ్చినందుకు – సంతోషం :)

 2. ప్రసాదమూర్తి says:

  కవిత చాలా బావుంది. దీప గీతికను పాడే కోకిల గొంతు నిజంగానే వినిపించింది.

 3. rajani patibandla says:

  పెయింటింగ్ చూస్తుంటే ఆ నీలిమ లోకి మాయం అవ్వాలనిపిస్తుంది కానీ కవిత దీప గీతం వినేందుకు ఆగిపోమ్మంటుంది

 4. “ఎదురుచూస్తున్న కలల పాట పాడే కోకిలని విను” .. పెయింటింగ్ లోని ఆ చిటారు కొమ్మన కోకిల, అంత నీలాకాశం.. ఈ వాక్యాలు జీవితాన్ని వెలిగించే కలవైపు తీసుకెళ్తున్నాయి మమత గారు !!

 5. Dr. Vani Devulapally says:

  మమత గారూ! ” నట్టింట్లోనూ గుండె లోతుల్లో నూ , జీవించే దీపాన్ని చూడు” … ఎంత బావుందో కవిత ! అభినందనలు !

 6. chandolu chandra sekhar says:

  దీపాలు ముట్టించే వేళ వేసవి పాటకోసం కోకిలకి దాహం – నాలాగే సూర్యుడు తన కిరణాల పగ్గాల తో ఆశ్వ్గఘోష గుండె సోదని తాకింది .చాల బావుంది

మీ మాటలు

*