పద పదవే పావురమా!

మమత వేగుంట 

 

సప్తస్వరాల్లో –

అటు స రి గ లోతుల్లో, ఇటు ప ద ని శిఖరాల్లో- మధ్యన – మ!

ఈ స్వరం  బరువూ, గంభీరమూ కూడా – హృదయాన్ని యిట్టే పట్టేస్తుంది.

 

నేలని ముద్దాడినట్టుండే ముత్యాల ముగ్గులు చూడు.

చుట్టూ వున్న భూమికి అదొక అందమైన కేంద్రమే కదా!

అలాగే, “మ” స్వరం కూడా మధురమైన నాదానికి భూమిక.

 

అది  పావురం పలికే పాట! నింగికి ఎగిరే సన్నాహంలో వున్న పావురం.  

మిల మిల మెరిసే విశాలమైన దాని రెక్కలు చూడు.

ఆ మెరుపు రెక్కల అందం మాల్కోస్ రాగ సౌందర్యానికే చిక్కుతుంది.

 

“మ” వాది స్వరమైన పురాగానమే మాల్కోస్!

సంగీత క్షేత్రం  నట్ట నడుమ “మధ్యమం”లో పండగే మాల్కోస్!

 

జీవితంలోని చాలా భాగం ఆ మధ్యమ క్షేత్రంలోనే నడుస్తుంది – ఎక్కువగా విలంబిత లయలో, మంద్ర సప్తకమై!

ఆ మధ్యే క్షేత్రాన్ని వోపికగా శోధించినప్పుడు,

ఆసాంతం ప్రయాణించినప్పుడే విహాయస విహారం!

 

ఈ లోపు మధ్యమ సంగీత నాదంలో తేలిపో!

 

Mamata 1

మీ మాటలు

  1. ఇంత అందమైన మాటలు చదివాక మరోసారి ఆరోహణ అవరోహణ పాడుకొని కాసేపు ‘ ma’ దగ్గర ఆగి తనివితీరా ఆస్వాదించాం .. Enjoyed a lot in revision with మాల్కోస్ రాగ !! Tqqq

    • Happy to know.. Rekha garu. This is for you:
      “Music was my refuge. I could crawl into the space between the notes and curl my back to loneliness.”
      ― Maya Angelou

మీ మాటలు

*