ఘర్ వాపసీ

కొండేపూడి నిర్మల

 

ఇంతకీ నా పౌరసత్వం దేశంలో వుందా ? మతంలో వుందా?

నేనిప్పుడు దిగజారిన మానవ విలువల్ని గురించి బెంగెట్టుకోవాలా

బండరాయికి పొర్లు దండాలు పెట్టాలా

ప్రప౦చ నాగరిక దేశాల సాక్షిగా మన రాజ్యాధినేత ఘర్ వాపసీ అని గర్జించినప్పుడు-

అలా వాపసు వచ్చిన వాళ్ళకే రేషను కార్డులు అని ప్రకటీంచినప్పుడు

లెక్క ప్రకారం మనమంతా ఏ ఆఫ్రికా చీకటి అడవుల్లోకో  వలస పోవాలి కదా

భూమి కంటే ముందు  హిందూత్వ పుట్టినట్టు ఈ ప్రగల్భాలేమిటి ?

 

ఇంతకు మించిన కొమ్ములూ కోరలూ వున్న ఎన్ని మతాలు, ఎందరు దేవుళ్ళు కాలగర్భంలో కలిసిపోలేదు|

చరిత్ర అంతా రాజులు చెక్కిన రాళ్ళ ముచ్చటే అని తెలుసు కాని

తాను చెక్కిన రాయితోనే సర్వజనులూ తల బాదుకోవాలని చెప్పిన రారాజు ఇతడేనేమో

మాట వినని వాళ్ళకి మరణ దండన అనే  మాట ఒక్కటీ అనలేదు తప్ప

అంతకంటే ఎక్కువే చెయ్యగలడని మనకి తెలుసు , గుజరాత్ కి తెలుసు

రాయిని పగలదీయడమే తెలిసిన  చెమట సూర్యుడికి

ఇప్పుడు రాజు  బుర్రలో ఏ రాయి వుంటే  దానికి  మొక్కాల్సిన పని పడింది.

 

రాజ్యాంగం రాసుకున్న ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా

దేవుడనే వాడొక్కడే అని , అన్ని మతాల సారాంశమూ మానవత్వమేనని

ప్రాధమిక అవహాగాహన అయినా పె౦చని ప్రజాస్వామిక దేశంలో

ఆర్టికల్ 25  ఒక నోరు లేని గులకరాయి

మానవ హక్కులు గాలికి ఎగిరిపోయే చిత్తు కాయితాలు

మనిషిని బతకించడానికయితే   నాలుగైదు రక్త నమూనాలు సరిపోతాయి.

చంపడానికి ,చావడానికే కదా చచ్చినన్ని మత అంధ రాజ్యాలు

భక్తుల మీదనో, వారి గూళ్లలో కొలువున్న రాళ్లమీదనో , వారు సమర్పించే చీనీ చక్కెర ప్రసాదాలమీదనో

వ్యతిరేక౦తో నేనీ మాట చెప్పడంలేదు.

 

అసలు ఈ నమ్మకాలతో, అపనమ్మకాలతో ప్రమేయం లేకుండా బతకుతున్న

కోట్లాడి కష్టజీవుల చిరునామా ఏమిటని  అడగదల్చుకున్నాను.

మత౦ మరక లేకుండా  మనకొక  ముఖం వుండచ్చా  లేదా తెలుసుకోవాలనుకు౦టున్నాను

 

ఎన్ని అవమానాలు, ఎన్ని అసంబద్దతలు, ఇంకెన్ని పరాధీనతలు

మన నిత్యజీవితంలో భాగమై పోయాయో  ఎప్పుడయినా ఆలోచీంచారా?

కన్నవాళ్ళు కూడా బిడ్డల్ని  మత చిహ్నాలుగా  పెంచి పోషించారు తప్ప

మనిషిగా ఎప్పుడయినా చూశారా ?

ఇష్టమో కాదో తెలుసుకోకుండా పుట్టీన పదోరోజున నాకొక దేవుడి పేరు తగిలించడమేమిటి?

 

పసిదనపు  నుదిటి మీద  మత సంకేతాన్ని తిలకంగా  దిద్దడమేమిటి?

పంట కాలవలాంటి  బాల్యానందాల పలక మీద ఆ ఆల కంటే ముందు

అడ్డదిడ్డంగా శ్రీకారాలు చుట్టడమేమిటి

వద్దని గింజుకుటున్నకొద్దీ    తలనీలాల్ని

ఒక దేవుడి ముందు తరిగి  పరాభవింఢమేమిటి?  .

అమ్మ కడుపున పుట్టడం ఒక్కటే నాకు  తెలిసిన వాస్తవమైతే

కులాల వారీగా మనుషుల౦తా దేవుడి తొడల్లో౦చీ, భుజాల్లోంచి , పాదాల్లోంచీ పుడతారనే

అశాస్త్రీయ, అశ్లీలపు కధలు చెవులు మూసుకునేదాకా వినిపించడమేమిటి?

 

సూర్య నమస్కారాల ప్రచారం కోసం యోగాసనాల్ని  మార్కెట్ చేయడమేమిటి?

భిన్న మత సంస్కృతులున్న  దేశానికి భవద్గీతను ప్రామాణిక  చేయడమేమిటి?

ఏమిటిదంతా?

పరిపాలన ఆ౦టే ప్రజలకు శిరో ముండన చేయడమేనా ?

రాజులు రద్దయినా రాతలు మారతాయని నమ్మకం లేదు కదా

రేపు ఇంకోక రాజు  ఇంకొన్ని  కుట్రలతో  తన కుల మతాన్ని  మన నెత్తిమీద గుమ్మరించడని చెప్పలేం

ఇంత జరిగాక  మనకిప్పుడు  freedom of religion వద్దే వద్దు

Freedom from religion కావాలి

రహదారిని ఆక్రమిస్తున్న ఈ దేవుళ్ళ నుంచి, దెయ్యాలనుంచీ

తాయెత్తుల నుంచీ , విబూది నుంచీ , శని యంత్రాలనుంచీ, శవ పూజలనుంచీ

నడవటానికి ఒక దారి వేసుకోవాలి.

nirmala*

 

 

మీ మాటలు

 1. b. narsan says:

  నిర్మలగారు..it’s challenging poem. మత మౌడ్యాన్ని శాసనబద్దం చేసినా, దిక్కరించే స్వరాలముందు తోక ముడువక తప్పదు.అధికార గొంతు నాల్రోజుల ముచ్చటే. దుకాణం తెరిసిన వాళ్ళే తాళం కప్పతో సిద్దమౌతున్నారు. ఒక దారి తప్పక పడుతుంది.

 2. Thirupalu says:

  మతం మరక లేకుండా మనకొక మొకం ఉండొచ్చ ? చాలా మంచి ప్రశ్న . రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాపసు తీసుకొవతమె! చాలా మంచి కవిత . చాలా బాగుంది .

 3. buchireddy gangula says:

  ఎవరు రాయగలరు యిలా — నా అభిమాన రచయిత్రి నిర్మల గారు తప్ప ??

  excellent.. poem.. madam..
  —————————————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 4. కన్నెగంటి అనసూయ says:

  ” మానవ హక్కులు గాలికెగిరి పోయే చిత్తుకాగితాలే ” పచ్చి నిజం నిర్మల గారు. నిజాన్ని నిగ్గదీసి అడిగారు. బాగా వ్రాసారు నిర్మల గారు..

 5. P V Vijay Kumar says:

  ‘ ఘర్ వాప్సీ ‘ లో ఘర్ ఏది ? ఎక్కడికి వాపస్ రావాలి ?
  ఈ మెజారిటీ మత వాదుల తిక్క ఎలా ఉందంటే – దళితులకు రిజర్వేషన్ లు వస్తాయని ఎర చూపుతున్నారు. How stupid ?

 6. N Venugopal says:

  బావుంది నిర్మల గారూ…

 7. Nisheedhi says:

  One of the best poem written on this subject . simply loved every word of it . kudos

 8. rajaram.t says:

  కొండేపూడి నిర్మల గారు చాల రోజుల తరువాత మీ నుంచి వచ్చిన చాల గొప్ప కవితల్లో ఇదొక ఒక మంచి కవిత . రాజ్యం మతాన్ని లౌకిక రాజ్యాంగ రక్షణ వున్న దేశంలో దేనికోసం ఇట్లా చేస్తుందో మీరు చెప్పడమే కాదు మత స్వేచ్ఛ కాదు మతం నుండి స్వేచ్ఛ కావాలని చెప్పడం నచ్చింది.
  రాజారామ్ అనంతపురం

 9. Rajendra Prasad. Y says:

  చాలా బావుంది ….కనీసం కొందరి పైన ప్రభావం చూపినా మీ ఆసలు నెరవేరినట్లే >>>>

 10. skybaaba says:

  గ్రేట్ పోయెమ్ నిర్మలా జీ !
  చాన్నాళ్ళకు నేటి దుష్ట స్థితి మీద అవసరమైన పోయెమ్..
  ఎందుకో చాలా మంది ‘కవులు’ కలాలు మూసుకున్నారు..
  ఇంకా ఏమేం జరగాలని చోద్యం చూస్తున్నారో..!
  కవి అనే వాడికి నిద్రెలా పడుతుందో..!
  ఏ నొప్పీ లేని.. ఎవరినీ నొప్పించని
  కవిత్వం కాని కవిత్వం రాసుకుంటున్నారు..
  అలాంటి వారిని మీ పోయెమ్ తో ఈడ్చి కొట్టారు నిర్మలా జీ..!

 11. saakya maharaj says:

  చాల చక్కటి వ్యాసం.

 12. shantiprabodha says:

  కవిత చాలా బాగుంది నిర్మల గారు. ప్రస్తుత సమయంలో వాస్తవిక దృష్టితో ఆలోచింప చేసే ఇలాంటి రచనలు చాలా అవసరం. నడవటానికి ఒక దారి వేసుకోవాలి. ఆ దారి మరెన్నోపిల్ల బాటలను కలుపుకుంటూ సాగిపోవాలి

 13. shanti prabodha says:

  చాలా బాగుంది కొండేపూడి నిర్మల గారు. ప్రస్తుత పరిస్తితుల్లో అవసరమైన రచన ఇది. భవిష్యత్ దారుల పట్ల ఆందోళన పడటం కాదు ఆలోచనతో దారులేసుకుంటూ, వేసుకున్న దారుల్ని కాపాడుకుంటూ ముందుకు సాగే స్పూర్తిని నింపే కవిత కొందరినైనా కదిలిస్తుంది

 14. mahamood says:

  నా గొంన్తులోంచి పెలాల్సిన ఒక విశ్పోతనం మీ గొంతు నుంచి పేల్చినందుకు థాంక్స్.
  మహమూద్

 15. narendra kumar says:

  చాలా బాగుంది

 16. దేవరకొండ says:

  వాక్యాల్ని ఒక దాని కింద ఒకటి రాసారు కనుక దీన్ని కవితగా చాలా మంది భావించారు…. క్షమించాలి. నాకు ఇందులో కవిత్వం పెద్దగా కనిపించలేదు. “దేవుడనే వాడొక్కడే అని , అన్ని మతాల సారాంశమూ మానవత్వమేనని” అంటున్నారు అంటే దేవుడినీ మతాన్నీ అంగీకరిస్తున్నట్లేనా? ఎటొచ్చీ మతమౌడ్డ్యం వద్దు అంటున్నారు. భగవద్ గీత ఒకడు ప్రామాణికం చేస్తే అయిపోయి, చేయకపోతే పనికిరాకుండా పోయే మార్కెటింగ్ అవసరమయ్యే పుస్తకం కాదని నా అభిప్రాయం. నిరంకుశత్వాన్ని, ఆ ధోరణులను తప్పక వ్యతిరేకించాలి. ఏది మంచిదో ఏది కాదో నిర్ణయించుకునే విజ్ఞత ప్రజలకు అన్ని కాలాల్లోనూ వున్నది. ఎవరు చెప్పేది వారికి శ్రేయస్సో ఎవరు చెప్పేది అలా కాదో కూడా వారు నిర్ణయించుకోగలరని మనం నమ్మవలసి వుంటుంది. ప్రతికూలతలను సరిదిద్దుకునే అంతర్గత శక్తి ప్రకృతి కి సహజంగా వున్నది. అందులో భాగమైన మానవులకూ వుంటుంది. సకల చరాచర ప్రకృతిలో దైవాన్ని చూడలేని వాణ్ణి, వాడి చేష్టలనూ చూసి విజ్ఞులు ఆవేశ పడరు.

  • SrInivas Vuruputuri says:

   నాకూ అలాగే అనిపించింది. కవిత్వాంశ తక్కువై పొలిటికల్ కంటెంట్ ఎక్కువైనట్లున్నది.

   ఇంకోమాట:

   “కులాల వారీగా మనుషుల౦తా దేవుడి తొడల్లో౦చీ, భుజాల్లోంచి , పాదాల్లోంచీ పుడతారనే అశాస్త్రీయ, అశ్లీలపు కధలు చెవులు మూసుకునేదాకా వినిపించడమేమిటి?”

   నిజానికి పురుష సూక్తంలోని ఆ వర్ణన కేవలం ప్రతీక కాదా? అందులో సైన్సు ఉన్నదన్న వాదన నేను ఇప్పటి దాకా వినలేదు. అశ్లీలత ప్రసక్తి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. బహుశా, నేను ఐ కవితను మరీ లిటరల్^గా అర్థం చేసుకుంటున్నందువల్ల కాబోలు.

 17. శ్రీనివాస్ గారు, దేవరకొండ గారు,

  మీరు అంతగా ఆలోచిస్తే ఎలా ?
  మోడీ ని, హిందుత్వ ని (ఆ ముసుగులో హిందూ మతాన్ని) విమర్శించిన వాళ్ళు మహా మేధావులు అని ఆటోమేటిక్ వోప్పుకోవాలి అంతే. ఈ Psuedo సేసులరిస్త్స్ కి నిద్ర పట్టదు మోడీ ఉన్నత వరకు. పాపం వాళ్ళ బాధ మనం అర్థం చేసుకోవాలి. NGO బిజినెస్ కష్ట్టం అవుతోంది. Conversions సేల్స్ టార్గెట్ అంతే. ఈ సో కాల్డ్ Leftists లు మన దేశానికి పట్టిన దరిద్రం.

  R

  • సుజన says:

   దేశానికి రైటిస్టులు పట్టిస్తున్న దరిద్రం మీకు కనిపించడం లేదా? మోడి సోకాల్డ్ ‘అచ్చేదిన్’ పాలనలో లలిత్ మోడితో సుష్మాస్వరాజ్, వసుంధరరాజే చెట్టాపట్టాలు, వ్యాపమ్ కుంభకోణం చావులు దేశానికి పట్టిన దరిద్రాలు కావా? ఏడాదిలోనే ఇంత దరిద్రాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు మిగతా నాలుగేళ్లలో ఇంకెంత చుట్టబెడతారో. ఢిల్లీ వోటర్లు మోడీ పాలన బండారాన్ని బయటపెట్టిన తర్వాత కూడా ఆయన్ను నెత్తిన పెట్టుకుని ఇంకా మోస్తున్నవాళ్ళే అసలు దరిద్రం.

   • అమ్మ సుజన గారు,

    ఆ ఇటాలియన్ పాలన కన్నా, ఈ Rightist పాలన 100 రెట్లు బెటర్.
    2 జి,Coal గేటు మర్చిపోయ్యరా అప్పుడే. ఈ scam లను నేను సపోర్ట్ చెయ్యను.
    Avvi నిజంగా చెడ్డ విషయాలే . దేశ సంసృతి లో ని యోగ ప్రమోట్ చేస్తే వీళ్ళకు ఎందుకు అంత కడుపు మంట.
    నచ్చపోతే దూరంగా ఉండొచ్చు. కాని ఈ CPM సీతారాం ఎంత కుసంస్కారం తో మాట్లాడారో చూసాం .
    నిజంగా ఈ లెఫ్టిస్ట్ లు దేశానికి పట్టిన దరిద్రం.

 18. g.venkatakrishna says:

  ప్రతికూలతలను సరిదిద్దుకునే అంతర్గత శక్తి ప్రకృతికి సగాజంగా ఉండడమే , ఈ కవితగా రూపుదిద్దుకోవదమని ఎందుకు అనుకోకూదదు .ఏది ఒక అంతర్గత విమర్శ లేకుండా ఉండదా ,ఎవరికీ శ్రేయస్సు .మీరు చెప్పే శ్రేయస్సు అణగారిన వర్గాలకు ,ప్రవచించే మోదిత్వం ఇస్తుందా.సకల చరాచర జగతి సకల క్రియలూ దేవుడు చీసినవీనా .అట్లా అను కోంటూ వేల ఏళ్ళు గడిపారు ఈ దేశం లో దళితులూ .నిజానికి ఈ దేశ మూల వాసులు ….అట్లా భరించక తప్పదంటారా .ఇక కవిత్వం లో రసాత్మకత లేదని బాదనా .వాక్యం కింద వాక్యం చమత్కారంగా పలకాల కదూ ..పురుష సూక్థమ్ తల ఒకరికి ,భుజాలు పొట్టా మరొకరికీ ,ఇస్తే పాదాల తో తన్నించు కున్నవాడు ఏమన కూదదూ …..ఏమన్నా అంటే సుడో సేక్యులర్లు ,లెఫ్ట్ దరిద్రమా మీకూ …ఎవరూ దరిద్రాన్ని పుట్టించ కుండా ,లెఫ్ట్ పుట్టదే .ఈ దేశం లో దరిద్రానికి అనాదిగా వచ్చిన అణిచివేత కారణం కాదంటారా .అణిచివేతకు పుట్టిల్లు హిన్దూ మతం కాదంటారా …..దాని మెడ మిద కత్తి పెట్టక పోతే కవి ఎట్లా అవుతాడు …కవయిత్రి యెట్లా అవుతుంది ….. .. .

 19. దేవరకొండ says:

  ప్రతికూలతలను సరిదిద్దుకునే అంతర్గత శక్తి మానవులకు సహజంగా వుండడం అంటే అలా మోడిలా గద్దె నెక్కలేనివాళ్ళు, ఇటు ఇలాంటి ‘కవిత’ లను రాయలెనివాళ్ళు. వ్యక్తులు. కుటుంబాలు. చిన్న చిన్న సమూహాలు. ఒక వేళ (హిందూ?) మతం వాళ్లకు అన్యాయం చేసింది అని వాళ్ళు అనుకున్నప్పుడు దాన్ని వదలి మరో మతాన్ని చేరడమో, ఏ మతమూ లేని వాళ్ళుగా వుండి పోవడమో చేయ గలిగే స్వేచ్చ వారికి వుండడం. లేదా ఆ మతంలోనే వుండి దాన్ని సంస్కరించ దల్చుకుంటే దానికి ఇలాంటి రచనలు సరైన మార్గం కాదని నా అభిప్రాయం. మతం ఏదైనా కులం ఏదైనా అన్ని జీవులలోను పరమాత్మ నే చూడడం దైవత్వానికి సమీపంగా వున్నవారి లక్షణం. హిందూ మతం మెడపై కత్తి పెట్టని వాళ్ళు కవులు, కవయిత్రులు కాదని సిద్దాన్తీకరించారు. ఒడ్లు తిని, బ్రెడ్లు తిని, గుడ్లు తిని, గొడ్లు తిని ఎలా పెంచినా ఈ దేహాలు వందేళ్ళు మించి మన్నవు. కాని, ఈ దేహాలు చేసిన రచనలు, సృష్టించిన సంపద, కళలు కల కాలం వుంటాయి అని ఆశించడంలో తప్పు లేదు. కాలానికి ఎదురీది ఏది నిలుస్తుందో ఎవరు నిలుస్తారో నిర్ణయించడానికి మనం ఎవరం? సర్వేజనాః సుఖినో భవంతు!

 20. దేవరకొండ says:

  మరో మాట. ఒక మతం (మెడ) పై కత్తి పెట్టడానికి ఒకరిని ప్రోత్సహిస్తున్నామంటే మరో మతం (మెడో మరోటో) పై మరో ఆయుధాన్ని ప్రయోగించడానికి మరొకరికి స్వేచ్చ నివ్వడ మేనని గ్రహించడం విజ్ఞత.

  • Thirupalu says:

   కయ్యానకి కాలు దువ్వె వాల్లే విజ్ఞు లైతే మీరన్న మాట కాదనలేము. విజ్ఞతకి సందర్భాన్ని బట్టి వ్యక్తుల్ని బట్టి అర్ధాలు మారితుంటాయి. ఏది విజ్ఞతో మతాని రాజకీయమ్ పులిమితే దాని అర్ధం అది ఇస్తుంది. మానవ సహజ ధర్మం అని ఒకటి ఉంది. దాన్ని అనుసరిమ్చటమే విజ్ఞతకు పరా కాస్ట!

 21. g.venkatakrishna says:

  కాలానికి ఎలా ఎదురిదాలో , కాల కాలానికి ఏది నిలిస్తే సర్వ జనులు సుఖిస్తారో , నిర్దేశించే జ్ఞానం ,మన జీవన విధానం అనుకునే మతం లో అయితే లేదు . తన అనుయాయులను మెట్ల మెట్ల గా చేసి ఆధిపత్యం చేస్తోంది . దాన్నే కవయిత్రి నిరసించింది . మతం , దాన్ని అనుసరించే సమూహాన్ని ఎదగానిచ్చే స్థాయి వరకే దాని మనుగడ , గిడస బారి ఒక చట్రంగా మారితే , కత్తి ,కలము పట్టే వాళ్ళు , ప్రతీకగా దాన్ని చీల్చె వాళ్ళు చరిత్రలో చాలా సార్లు ప్రయత్నాలు , కనీసమ్ నిరసనగా నైనా చేసారు . అదే ఈ కవయిత్రి ప్రయత్నం ,చదివే వాళ్ళ కు సహృదయత ఆశించడం అందుకే .

 22. సుజన says:

  అయ్యా శివ గారూ, లెఫ్టిస్టులు దేశానికి పట్టిన దరిద్రం అంటూ యూపీఏ దరిద్రం గురించి మాట్లాడుతున్నారు. 2జీ, కోల్ గేట్ కు కారణం లెఫ్టిస్టులా? లెఫ్టిస్టులు వాటిని సపోర్ట్ చేశారా? ఈ స్కాములను వాళ్ళే కాదు ఎవరూ సపోర్ట్ చేయలేదు. సోకాల్డ్ ‘ఇటాలియన్ పాలన’ 100 రెట్లు బెటరని ఎవరూ అనలేదు. కానీ మీరు మాత్రం లలిత్ గేట్, వ్యాపమ్ కుంభకోణాలను సమర్ధించను అంటూనే రైటిస్టు పాలన 100 రెట్లు బెటరని సర్టిఫికేట్ ఇస్తున్నారు. స్కాములను సృష్టిస్తున్న పాలన 100 రెట్లు ఎలా బెటరో, మీ రీజనింగ్ ఏమిటో చెప్పగలరా? ‘ఇటాలియన్’ అవినీతి కంపు, హిందూ అవినీతి ఇంపు అని ఉద్దేశంలా తెలిసిపోతూనే ఉంది. యోగా ప్రమోట్ చేయడానికి యోగా గురువులు చాలామంది ఉన్నారు. మోడీ ప్రభుత్వంతోనే యోగా పుట్టలేదు. మోడీని ఎన్నుకున్నది యోగాను ప్రమోట్ చేయడానికి కాదు. అవినీతి లేని స్వచ్చమైన పాలన అందిస్తారని.

  • కాంగెస్, కమ్యునిస్ట్ లు పైకి కొట్టుకొంట్టు లోపల మిత్రత్వాన్ని కొనసాగిస్తూంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం లో కొన్ని ఉన్నత స్థానాలను లెఫ్తిస్త్ మేధావులతో భర్తి చేసి(వారిని తృప్తి పరచి), మళ్ళి ఎన్నికలు వచ్చేంత వరకు, కాంగ్రెస్ వారు పాలనలో (స్కాములను చేసే పని లో ) నిమగ్నమై పోతారు. లెఫ్త్ మేధావులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పదవులతో పొంగిపోయి, ఆ పార్టి చేసే అవినితిని పెద్దగా పట్టించుకోరు.
   ఈ అవకాశం వారికి బిజెపి గవర్నమెంట్ లో లేదు కనుక బిజెపి పాలన ను భూతద్దం వేసి చూస్తు, గోరంతలు కొండంతలు చేసి గోల చేస్తారు. అమర్త్య సేన్ గారు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టి అవినితిని నిలదీసినట్లు చూశారా? మోడి పై మాత్రం ప్రతి ఆరు నెలలకు విరుచుకుపడుతూంటాడు.
   మీరేమి మోది ప్రభుత్వ పాలన పై ఆందోళన చెందక్కరలేదు. వచ్చే ఎన్నికలలో ప్రజలకు నచ్చితే ఓట్లు వేసి గెలిపిస్తారు లేకపొతే ఇంటికిపోతాడు. ఒకవేళ వందల,వేల,లక్షల కోట్ల స్కాములు జరిగాయని భావిస్తే సుబ్రమణ్య స్వామి, ప్రశాంత్ భూషణ్ వంటి వారు కోర్ట్ లో కేసులు వేయటానికి ఎలాగు ఉంటారు. అప్పుడు వాస్తవాలు 2జి స్కాములో వలే వాటంత అవే బయటకు వస్తాయి. అంతేగాని ఇంగ్లిష్ మీడీయాలో ప్రచారం చేసే అసత్యాలను ప్రజలు నమ్మె రోజులు ఎప్పుడో పోయాయి.
   ————————————————
   మోడీని ఎన్నుకున్నది యోగాను ప్రమోట్ చేయడానికి కాదు.

   మీరన్నది నిజమే కావచ్చు! భారత ప్రజలు కోరకపోయినా, ఎదీ చేస్తే దేశ ప్రజలకు మంచిదో, వారికి ఉపయోగపడుతుందో తెలిసిన మోడి, యోగాని ప్రమోట్ చేసి దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచాడు. భారత సాఫ్ట్ పవర్ ను ప్రపంచానికి తెలియ చెప్పాడు కదా!

  • Dear Sanjana,

   1) Congress it self is Left of the center party. Left parties were part and parcel of UPA 1.
   2) Nobody blamed Manmohan singh for Irrigation scams in AP & Maharashtra. Same applies to Modi when it comes to Vyapam & Vasundhara. BJP party needs to blame.
   3) Regarding Sushma, It is more of error in judgement and conflict of interest rather than any scam.
   Those people who blame Sushma that her husband is Lalit’s lawyer conveniently forget that Kapil sibal represents Subratho Roy. Even Kasab had a lawyer and every criminal is entitled to one.
   4) Apart from Sushma incident, The corruption at National level has come down
   5) June 21 was decalred as Yoga day by UN.Yoga being orginated from USA, We are correct in promoting it in a big way. I don’t see anything wrong with that. Clean rule and Yoga are not mutually exclusive and it is foolish to think they are. Why should we be ashamed for celebrating our own traditions. The Left how ever wants india to celebrate Slumdog millionaire. They live to make sure that India is to be known for Slums and poverty.

   Why I hate Left

   1) Left’s policies are the very reason why right is on the raise not just in India but across the globe.
   2) In it’s blind opposition to US and Capitalism, Left has betrayed the very principle it stands for.
   3) In India, Left parties have denounced their principles of Secularism and following a mix of hindu bashing and minority politics

   Examples of the Left Policies
   1) When there was attack on a Couple for Public Display of Affection in Kerala. Left and Left associated student organizations came up with Kiss of Love protests. They were direction less and self defeating. When a professor’s hand is chopped by a Muslim organization in Kerala for some question paper , They are dead silent. There was no national campaign. I support their right for Kiss of love protest but not their silence on hand chopping. Again barely a week of Kiss of love, AMU vice chancellor banned girls from using library blaming them as a distraction. Common sense would suggest that This should have protested against strongly but No. As it is a AMU , Left resorts to Minority appeasing politics.
   2) Left is against BJP that they practice religious politics. Then how is Left part of UPA which has MIM and Muslim League are members. If BJP is religious, What are MIM & Muslim League. If minorities have their own party, Left is okay but Hindu parties are untouchable.
   3) To quote UDHAV NAIG ” liberal-Left’s denunciation of terror attacks inspired by radical Islam has been mostly ambiguous, raising doubts over its commitment to the values that it claims to defend.”

   • 5) Left ruled West Bengal for almost four decades . The result is the state has Debt of $30 Billion and state’s GDP is $110 Billion. Maharashtra which has $220 billion as GDP has $48 Billion. Karnataka which has $100 Billion GDP has around $20 billion loans. Kolkata has an average 50 days of bandhs a year. Ask any bengali, They would tell you that you have get out of Kolkata for career.
    6) Kerala which was ruled by Left had militant trade unions and result is Kerala has only kids and retires ( you can ask any keralite about this). Varghese Kurien who created AMUL is keralite and he admits that he can never do that in Kerala. I know of a CEO of French multinational company ( they have indian revenues of $1 billion) who is from kerala admitted in a meeting that this two states are untouchable. Kerala had very good social indicators and good health & education facilities. There are some good initiatives like Kudumbasree for helping the poor farmers but large scale employment is still a dream bcoz of Trade unions
    8) Have you heard of Nookkuli ( Wage for watching) . Try googling about that or ask a keralite.

 23. దేవరకొండ says:

  కయ్యానికి కాలు దువ్వే వాళ్ళు ముమ్మాటికీ విజ్ఞులు కారు. అభద్రత, అజ్ఞానం, అహంకారం–ఈ మూడూ విడి విడిగా గాని, కలిసి గాని ఎవరినైనా ఆవహిస్తే అలా కాలు దువ్వే అవకాశం వుంటుంది కాబట్టి అది ఇక్కడ వర్తించదు కాబట్టి…. మౌనమే వెలుగు!

మీ మాటలు

*