నీలో రాలే చంద్ర కాంతలు ….

మమత వేగుంట

 

వెన్నెలతో వెలిగిపోతోంది చీకటి ఆకాశం!

నక్షత్రాల మెత్తని కాంతిలో తడుస్తోంది.

 

చంద్రకాంతలన్నీ ఒక గాలి తరగలాగా నేలవైపు తరలివస్తున్నట్టే వుంది.

నేల దేహంలోకీ, నీలోకీ తీయతీయని పరిమళం ప్రవహిస్తోంది.

ఈ నడుమ మధ్యలో ఎక్కడో ఒక మేషం గొంతు విప్పుతోంది.

అదే కదా, గాంధారం! సప్తస్వరాల్లో మూడో స్వరం.

 

రాగ బిహాగ్ కి “గ” వాది స్వరం. బిహాగ్ శృంగార రస ఉత్సవం.

రాత్రి రెండో ఝాములో రాగాల పండగ.

ఒక అనిర్వచనీయమైన మాధుర్య ఆకర్షణ ఏదో ఈ రాగంలో వుంది,

అది పట్టుకోవాలని ఈ చిత్రంలో నా వెతుకులాట.

 

చంద్రకాంత పందిరి కింద నెమ్మదిగా నిద్రలోకి జారుకునే వేళ

సుదూరం నించి నీ వైపే వస్తున్న ప్రేమ గీతాన్ని విను! విను!

 

Mamata 1

మీ మాటలు

  1. N Venugopal says:

    మునివేలి చివర తంత్రి
    గళంలోంచి గాంధారం
    కుంచె కొసన హరివిల్లు
    మమత నిండిన వెన్నెల

  2. పెయింటింగ్ లో అందమంతా కవిత్వంగా కురిసింది

  3. ‘ చంద్రకాంతలన్నీ ఒక గాలి తరగలాగా నేలవైపు తరలివస్తున్నట్టే వుంది ….. ‘ పెయింటింగ్ కీ బిహాగ్ రాగపరిమళ ప్రవాహానికీ వంతెన వేసే వాక్యాలు , అద్భుతం మమతగారూ !!

  4. Thank you Venu, Bhavani and Rekha.. Glad you heard the music !
    Mamata

  5. N.RAJANI says:

    మమతా చాలా చాలా బాగుంది.

  6. Indira Babbellapati says:

    Moonlight and stars…?

  7. పెయింటింగ్ , కవిత్వం రెండూ అద్భుతంగా ఉన్నాయి మమత గారూ.

  8. narayana sharma says:

    సంజీవ దేవ్ రచనల్ని చదువుతున్నప్పుడు చాలావరకు కవిత్వం ,చిత్రకళ,సంగీతం ఈ మూడీటిని సమన్వయపరుస్తూ అనేకవిషయాలు చర్చించడం కనిపిస్తుంది.ఒక దృశ్యాన్ని వినడం ,చూడడం చిత్రించడం మూడూ ఈ కవితలో కనిపిస్తున్నాయి.

    వచనంలో”మేషం”అనే పదం ఆధునికవచనాన్నిoచి కవితను కొంత డిస్టర్బ్ చేస్తుందనిపించింది..

    “రాగ బిహాగ్ కి “గ” వాది స్వరం. బిహాగ్ శృంగార రస ఉత్సవం”

    ఈ వాక్యంలోని రాగం”బేహాగ్”అని తెలుసు..ఇలా వాడుకలో ఉందేమో..సందేహమే..నాకు తెలిసి గాంధారప్రధానం “గ”అనే స్వరాన్ని గూర్చిన ప్రస్తావన కూడా అదేబలపరుస్తుంది.నిడివిలో చిన్నగా ఉన్న చాలావిషయాలను,కొత్తతరహా నిర్మాణాన్ని పదిలంగా ఈ కవిత్వమందించింది..చాలాబాగుంది మమత గారూ..

  9. Narayana Sharma గారు.. సంజీవ దేవ్ గారి రచనలతో పోలిక… ఎంత సంతోషం!
    N.Rajani, Prasuna గారు.. thank you!
    Indirakka …?

Leave a Reply to Indira Babbellapati Cancel reply

*